![The Girlfriend: Rashmika Mandanna next film goes on floors with auspicious pooja ceremony - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/29/Rasmika%20The%20Girl%20Friend.jpg.webp?itok=0do-wBD5)
రష్మికా మందన్నా ప్రధాన ప్రాత్రలో నటించనున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు.
దర్శక–నిర్మాత సాయి రాజేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్.
Comments
Please login to add a commentAdd a comment