Masooda Hero's New Period Drama Officially Launched - Sakshi
Sakshi News home page

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాతో వస్తున్న 'మసూదా' హీరో

Published Tue, Apr 11 2023 8:48 AM | Last Updated on Tue, Apr 11 2023 10:41 AM

Masooda Hero New Period Drama Officially Launched - Sakshi

‘మసూద’ వంటి హిట్‌ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్‌ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రం ద్వారా జీజీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏషియన్‌ ఫిల్మ్స్‌ నారాయణ దాస్‌ నారంగ్‌ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై వ్యాపారవేత్త రవి కుమార్‌ పనస నిర్మిస్తున్నారు.

 ‘‘పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా జానర్‌ చిత్రమిది. గతంలో ఎప్పుడూ చూడని విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. టైటిల్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు రవి కుమార్‌ పనస. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement