సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలే కాదు.. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి. కోడి పందేలతో పాటు సినిమాలు కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పటికే థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా ఇప్పటికే థియేటర్లకు క్యూ కడుతున్నారు.
మరి ఫ్యామిలీతో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు వీక్షించాలనుకునే వారికి ఓటీటీలు రెడీ బోలెడు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు మీకిష్టమైన చిత్రాలు చూసేయొచ్చు. అలాంటి వారికోసమే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీకి వచ్చేసింది తెలుగు సినిమా. అదేంటో మీరు ఓ లుక్కేయండి.
సంక్రాంతి పండుగ రోజున ఓ తెలుగు చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. యంగ్ హీరో తిరువీర్ నటించిన చిత్రం మోక్ష పటం. ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, శాంతి రావ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు కమ్రాన్ సంగీతమందించారు.
A mysterious bag changes Gayatri's life forever. Will it bring fortune or trouble?
Watch #Mokshapatam now!▶️https://t.co/xnqpEPAm3H#MokshapatamOnAha #Trailer #Comedy #Crime @iamThiruveeR @ShantiRaoDqd @pooja_kiran @JeniferEmmanu11 @hithisistarun @ursguruofficial @syedkamran… pic.twitter.com/LBiE7fjgqx— ahavideoin (@ahavideoIN) January 14, 2025
Comments
Please login to add a commentAdd a comment