రెండు ప్రపంచాలు  | The concept poster for Thiruveer next is out | Sakshi
Sakshi News home page

రెండు ప్రపంచాలు 

Published Mon, Nov 27 2023 2:46 AM | Last Updated on Mon, Nov 27 2023 2:46 AM

The concept poster for Thiruveer next is out - Sakshi

‘జార్జిరెడ్డి’, ‘పలాస’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్‌ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ద్రిష్టి తల్‌వార్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. డార్క్‌ కామెడీ జానర్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఏ మూన్ షైన్‌ పిక్చర్స్‌పై సాయి మహేష్‌ చందు, సాయి శశాంక్‌ నిర్మించనున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా, యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లియోన్‌ జేమ్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement