
అభయ్, అస్మిత నర్వాల్, గిరిష్మ నేత్రిక హీరోహీరోయిన్లుగా హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్‌పై పాత్ లోథ్ శంకర్ గౌడ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్ సుమధుర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ పాత్ లోథ్ శంకర్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు ఆర్ సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ... యాక్షన్ డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో ఇంతవరకు ఏ చిత్రం రాలేదు. జనవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు.
‘డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను’అని హీరో అభయ్ అన్నారు. ఈ సినిమాలో నేను నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’అని అస్మిత నర్వాల్ అన్నారు. ‘ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’అని హీరోయిన్ గిరిష్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment