సైన్స్ ఫిక్షన్ తరహాలో ‘MERGE’ | Merge movie shooting starts | Sakshi
Sakshi News home page

సైన్స్ ఫిక్షన్ తరహాలో ‘MERGE’

Jul 10 2024 5:26 PM | Updated on Jul 10 2024 5:39 PM

Merge movie shooting starts

రాజు గుడిగుంట్ల నిర్మాణం లో ‘MERGE’ అనే ఓ కొత్త సినిమా ప్రారంభం అయింది. లేడీ లయన్ క్రియేషన్స్  పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 03గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు, తదితరులు తారాగణం నటించనున్నారు. 

నేడు(జులై 10) హైదరాబాద్ లోని  శ్రీ భద్రకాళి పీఠం లో డాక్టర్‌ సింధు మాతాజీ గారి ఆశీస్సులతో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత  రాజు గుడిగుంట్ల గారు మీడియా తో మాట్లాడుతూ ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నూతన దర్శకుడు విక్రమ్ ప్రసాద్ ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహా లో రొటీన్ కథకు  భిన్నంగా ఉండబోతుంది అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement