కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్‌ | Siddharth 40: Hero Siddharth Next Film To Be Directed By Sir Ganesh | Sakshi
Sakshi News home page

Siddharth 40: కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్‌.. జూన్‌లోనే స్టార్ట్‌ అట!

Published Sun, May 19 2024 9:28 AM | Last Updated on Sun, May 19 2024 11:01 AM

Siddharth 40: Hero Siddharth Next Film To Be Directed By Sir Ganesh

హీరో సిద్ధార్థ్‌ కొత్త కబురు చెపారు. తన కెరీర్‌లోని 40వ సినిమాను ప్రకటించారు. ‘8 తోట్టాకళ్‌’ ఫేమ్‌ శ్రీ గణేశ్‌ దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా (తెలుగు– తమిళం) చిత్రాన్ని ‘మావీరన్‌’ ఫేమ్‌ అరుణ్‌ విశ్వ నిర్మించనున్నారు. శనివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. 

ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ– ‘‘చాలా స్క్రిప్ట్స్‌ విన్న తర్వాత శ్రీగణేశ్‌ చెప్పిన ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెపాను. అరుణ్‌ విశ్వలాంటి మంచి నిర్మాతతో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాను అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు.

 ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌  మొదలుపెట్టినప్పుడు యూత్‌తో పాటు పరిణితి గల నటుడు కావాలనుకున్నాను. అందుకే సిద్ధార్థ్‌ కరెక్ట్‌ అనుకున్నాను. ఆయన కొన్ని సూచనలు పంచుకున్నారు’’ అన్నారు శ్రీ గణేశ్‌. ‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, భాషలకు అతీతంగా ఆకట్టుకునే చిత్రం అవుతుందని నేను బలంగా నమ్మాను. జూన్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు అరుణ్‌ విశ్వ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement