బేబీ బంప్‌తోనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న టాప్‌ హీరోయిన్‌ | Bollywood Actress Deepika Padukone Starts Shooting With Baby Bump In Police Uniform - Sakshi

బేబీ బంప్‌తోనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న టాప్‌ హీరోయిన్‌

Apr 17 2024 8:30 PM | Updated on Apr 18 2024 9:54 AM

 Top Actress Movie Shooting With Baby Bump - Sakshi

బాలీవుడ్‌లో బెస్ట్‌ కపుల్‌గా పేరున్న దీపికా పదుకొణె- రణ్‌వీర్‌ తమ అభిమానులకు కొద్దిరోజు క్రితమే గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ కూడా ఇచ్చినట్లు దీపిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు.  ఆమె చేతిలో ఇప్పటికే పలు సినిమాలు ఉన్నాయి. నెలలు గడుస్తున్న కొద్ది షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్ల కూడదని దీపికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది.

తాజాగా సోషల్‌ మీడియాలో దీపికా పదుకొణె షూటింగ్‌ స్సాట్‌లో ఉన్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న  'సింగం ఎగైన్' సినిమా సెట్స్‌లో దీపికా కనిపించింది. ఆ ఫోటోలలో  బేబీ బంప్‌తో దీపికా కనిపిస్తుంది. ఈ చిత్రంలో శక్తి శెట్టిగా దీపికా కనిపించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ వంటి స్టార్స్‌ నటిస్తున్నారు.

పోలీస్ యూనిఫాం ధరించి 'కూల్' గ్లాస్‌తో అదిరిపోయే లుక్‌లో దీపికా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో ఆమె గర్భం దాల్చినట్లు ప్రకటించిన తర్వాతా తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. గర్భంతో ఉన్నా కూడా దీపికా షూటింగ్‌లో పాల్గొనడంతో అభిమానులు  ఆశ్చర్యపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఫోటోలో  బేబీ బంప్ పూర్తిగా కనిపించకపోవడం లేదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి   చాలా బిగుతుగా ఉన్న డ్రెస్‌ను ఆమె ధరించడంతో బేబీ బంప్‌ పెద్దగా కనిపించలేదు. సినిమా కోసం దీపికా జాగ్రత్త పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement