merge
-
కొత్త స్కామ్.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ!
సైబర్ మోసాలు (Cyber Scam) రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకూ చేతికి చిక్కిన ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని అప్రమత్తంగా ఉండకపోతే మన వంతు వచ్చినప్పుడు మోసపోయి బాధపడక తప్పదు.కాల్ మెర్జింగ్ స్కామ్ (Call Merging Scam) అనేది ఇప్పుడు ఒక కొత్త రకమైన సైబర్ మోసం. దీనిలో స్కామర్లు కాల్స్‌ను మెర్జ్ చేసి బాధితులు ఓటీపీలు (OTP) చెప్పకపోయినా వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టి వారి ఖాతాలు ఖాళీలు చేస్తున్నారు. మోసగాళ్ళు బ్యాంక్ ప్రతినిధులు లేదా స్నేహితులు వంటి విశ్వసనీయ వ్యక్తులుగా నటిస్తూ బాధితులను మూడవ కాల్‌ను మెర్జ్ చేయమని అభ్యర్థిస్తారు. ఈ కాల్ సాధారణంగా ఆటోమేటెడ్ ఓటీపీ సర్వీస్. స్కామర్లు దీనిని బాధితుడి బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ (UPI) వాలెట్‌కు అనధికార యాక్సెస్ పొందడానికి ఉపయోగిస్తారు.ఇలా స్కామ్ చేస్తున్నారు.. » స్కామర్ బాధితుడికి ఫోన్ చేసి స్నేహితుడు, కంపెనీ లేదా బ్యాంకు ప్రతినిధినని నమ్మిస్తారు.» వెంటనే మరొక కాల్లో (కాల్ మెర్జ్) చేరమని బాధితులను అడుగుతారు.» రెండవ కాల్ ఆటోమేటెడ్. ఇది లావాదేవీకి ఓటీపీని అందిస్తుంది.» స్కామర్ ఓటీపీ విని బాధితుడి ఖాతాలోకి ప్రవేశిస్తాడు. » బాధితుడు అప్రమత్తం అయ్యేలోపే ఖాతా ఖాళీ అవుతుంది.వాస్తవ సంఘనలుఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెరుగుతున్న కాల్ మెర్జింగ్ స్కామ్‌ల గురించి సోషల్ మీడియాలో హెచ్చరించింది. మెర్జ్ కాల్స్ ద్వారా తమకు తెలియకుండానే ఓటీపీలు వెల్లడి కావడం వల్ల చాలా మంది బాధితులు వేలాది రూపాయలు కోల్పోతున్నారని పేర్కొంది.ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తకు బ్యాంకు మోసాలను గుర్తించే బృందం నుంచి అంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి బాధితుడిని మాటల్లో పెట్టి ఓటీపీని వెల్లడించే మరో కాల్కి మెర్జ్ చేయించాడు. నిమిషాల్లోనే అతని ఖాతా ఖాళీ అయింది.స్కామ్‌లకు గురికాకుండా చేయవలసినవి» కాల్‌ను మెర్జ్ చేయమని అడుగుతున్న వ్యక్తి ఐడెంటిటీని పరిశీలించండి.» ఎవరైనా ఊహించని విధంగా కాల్‌ను మెర్జ్ చేయమని అడిగితే, వెంటనే తిరస్కరించండి.» మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలో ట్రాన్సాక్షన్ అలర్ట్స్‌ను యాక్టివేట్ చేయండి.» స్కామ్ కాల్ అని అనుమానం వస్తే 1930 ( సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ) కు కాల్ చేయండి లేదా మీ బ్యాంకుకు తెలియ జేయండి.చేయకూడనివి» తెలియని నంబర్లతో కాల్స్‌ను ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు. ఈ స్కామ్‌లో ఉపయోగించే ప్రాథమిక ట్రిక్ ఇది.» ఓటీపీలను షేర్ చేయవద్దు. ఏ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ కాల్ ద్వారా ఓటీపీని అడగదు.» తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఫిషింగ్ లింక్‌లను మోసగాళ్ళు పంపవచ్చు. ఇది భద్రతను మరింత దెబ్బతీస్తుంది.» కాలర్ ఐడీలను గుడ్డిగా నమ్మవద్దు. స్కామర్లు చట్టబద్ధంగా కనిపించే స్పూఫ్డ్ నంబర్లను ఉపయోగించవచ్చు. -
షటర్‌స్టాక్, గెట్టీ ఇమేజెస్ విలీనం
న్యూయార్క్: విజువల్ కంటెంట్ కంపెనీలైన షటర్‌స్టాక్, గెట్టీ ఇమేజెస్ విలీనం కానున్నాయి. దీంతో 3.7 బిలియన్ డాలర్ల భారీ సంస్థ ఆవిర్భవించనుంది. విలీన సంస్థ గెట్టీ ఇమేజెస్ పేరుతో కొనసాగుతుంది, న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో గెట్టీ టికర్‌తో ట్రేడవుతుంది. సంస్థకు గెటీ ఇమేజెస్ సీఈవో క్రెగ్ పీటర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం షటర్‌స్టాక్ షేర్హోల్డర్లకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి.తమ దగ్గరున్న ఒక్కో షేరుకు 28.85 డాలర్ల చొప్పున నగదును తీసుకోవడం లేదా, ప్రతీ షేరుకు 13.67 గెట్టీ ఇమేజెస్ షేర్లను పొందడం వీటిలో ఉన్నాయి. ఈ రెండింటితో పాటు ఒక్కో షేరుకు 9.50 డాలర్ల నగదు, 9.17 షేర్లను కూడా తీసుకోవచ్చు. ఇమేజ్‌లు, వీడియోలు, మ్యూజిక్ మొదలైన కంటెంట్‌ను ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. ఇరు సంస్థల విలీనానికి ఇదే మంచి తరుణమని పీటర్స్ తెలిపారు. -
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
ఆర్ఆర్బీల విలీనం షురూ.. తగ్గనున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, వ్యయాలను క్రమబద్దీకరించడంలో భాగంగా నాలుగో దశ విలీన ప్రక్రియను కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. నిర్దిష్ట మార్గదర్శ ప్రణాళిక ప్రకారం వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్ఆర్బీలను విలీనం చేయనున్నారు. దీనితో ఆర్ఆర్బీల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది.ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 4 బ్యాంకులను కన్సాలిడేట్ చేయనుండగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (చెరి మూడు) బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాలు (తలో 2) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కి సంబంధించిన అసెట్స్, లయబిలిటీలను విడదీయటంపై ఆర్ఆర్బీల విలీనం ఆధారపడి ఉంటుంది.’ఒక రాష్ట్రం - ఒక ఆర్ఆర్బీ’ లక్ష్యం సాధన దిశగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు స్పాన్సర్ బ్యాంకులకు పంపిన లేఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివరించారు. దీనిపై స్పాన్సర్ బ్యాంకులు నవంబర్ 20లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది.గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులవారికి రుణాలు, ఇతరత్రా ఆర్థిక సేవలను అందించేందుకు ఆర్ఆర్బీ యాక్ట్–1976 ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మూడు విడతల్లో విలీనంతో 2020–21 నాటికి వీటి సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ప్రస్తుతం ఆర్ఆర్బీల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటాలు ఉంటాయి. -
ఆర్ఐఎల్ – డిస్నీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మీడియా విభాగం, వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశీయంగా రూ.70,000 కోట్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఆరు నెలల క్రితమే ప్రకటించిన డీల్‌ను గుత్తాధిపత్య విధానాలను అడ్డుకునే సీసీఐ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలుత కుదుర్చుకున్న డీల్ నిర్మాణంలో 2 సంస్థలు కొన్ని సవరణలూ ప్రతిపాదించాయి. తాజా డీల్‌కు సీసీఐ అనుమతి మంజూరు చేసింది. స్వచ్ఛంద సవరణలు: ఆర్ఐఎల్, వయాకామ్18 మీడియా ప్రైవేట్, డిజిటల్18 మీడియా, స్టార్ ఇండియా ప్రైవేట్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో స్వచ్ఛంద సవరణల తదుపరి డీల్‌కు ఆమోదముద్ర వేసినట్లు ‘ఎక్స్’ ద్వారా సీసీఐ వివరించింది. అయితే రెండు పారీ్టల ప్రతిపాదిత సవరణలను వెల్లడించలేదు. తాజా డీల్ ప్రకారం ఆర్ఐఎల్, అనుబంధ సంస్థలు విలీన కంపెనీలో 63.16% వాటాను పొందనున్నాయి. మిగిలిన 36.84% వాటా వాల్డ్ డిస్నీకి దక్కనుంది. విలీన సంస్థ రెండు స్ట్రీమింగ్ సరీ్వసులు, 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద మీడియా హౌస్‌గా అవతరించనుంది. విలీన సంస్థ ఇలా.. ఆర్ఐఎల్కు గల మీడియా సంస్థలలో నెట్వర్క్ 18 ప్రధానమైనదికాగా.. 18 వార్తా చానళ్లను కలిగి ఉంది. కలర్స్ బ్రాండ్‌తో ఎంటర్టైన్మెంట్ చానల్‌తోపాటు క్రీడా చానళ్లను నిర్వహిస్తోంది. మనీకంట్రోల్.కామ్, బుక్‌మైషో సైట్లతోపాటు కొన్ని మ్యాగజీన్లను ప్రచురిస్తోంది. మరోవైపు ఆర్ఐఎల్ జియోçస్టూడియోస్సహా కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలు డెన్, హాథవేలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. 21 సెంచురీ ఫాక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఆస్తుల కొనుగోలు ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ దేశీయంగా 2020లో ప్రారంభమైంది. ఇందుకు 71.3 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. తద్వారా స్టార్ ఇండియా, హాట్స్టార్లను సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్ తదితర చానళ్లను కలిగి ఉంది. -
సైన్స్ ఫిక్షన్ తరహాలో ‘MERGE’
రాజు గుడిగుంట్ల నిర్మాణం లో ‘MERGE’ అనే ఓ కొత్త సినిమా ప్రారంభం అయింది. లేడీ లయన్ క్రియేషన్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 03గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు, తదితరులు తారాగణం నటించనున్నారు. నేడు(జులై 10) హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠం లో డాక్టర్ సింధు మాతాజీ గారి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజు గుడిగుంట్ల గారు మీడియా తో మాట్లాడుతూ ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నూతన దర్శకుడు విక్రమ్ ప్రసాద్ ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహా లో రొటీన్ కథకు భిన్నంగా ఉండబోతుంది అని తెలిపారు. -
ఎస్‌అండ్‌టీ మైనింగ్ విలీనం పూర్తి
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా అనుమతుల నేపథ్యంలో ఎస్‌అండ్‌టీ మైనింగ్ విలీనాన్ని పూర్తి చేసినట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజా గా వెల్లడించింది. డిసెంబర్1 నుంచి విలీనం అమలులోకి వచి్చనట్లు తెలియజేసింది. విలీన పథకంలో భాగంగా ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను మూసివేయకుండా కంపెనీలో కలిపేసుకున్న ట్లు వివరించింది. టాటా స్టీల్ ఇటీవల కొంతకాలంగా అనుబంధ సంస్థలను విలీనం చేసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లోఅనుబంధ సంస్థల విలీనం పూర్తికానున్నట్లు ఇంతక్రితం కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
అతిపెద్ద టైగర్ రిజర్వ్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రెండు అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్‌లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేయనున్నట్లు ఒక నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. సాగర్, దామోహ్, నర్సింగ్‌పూర్, రేసిన్ జిల్లాల్లో విస్తరించిన ఈ రెండు అభయారణ్యాలను కలిపేస్తే దేశంలోనే పెద్దదైన 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇది వచ్చే రెండు, మూడు నెలల్లో ఏర్పాటుకానుంది. -
ఎన్నికల స్టంటే అనుకో!: మంత్రి మల్లారెడ్డి టంగ్‌స్లిప్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలి కామెంట్లతో వార్తల్లోకెక్కారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనంటూ వ్యాఖ్యానించారాయన. టీఎస్సార్సీటీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంపై ఉద్యోగుల నుంచి హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం పీర్జాదిగూడ పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా.. TSRTC కార్మికులకు డబుల్కా మీటాలాగా.. ఊహించని విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా?అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సవరించుకుని.. ‘‘ఎన్నికల కోసమే అయినా కార్మికులకు మంచి జరిగింది. ఆర్టీసీ విలీనం చేయాలంటే దమ్ము, ఫండ్స్ ఉండాలి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కార్మికులు సంతోషంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారాయన. ఇదీ చదవండి: మెట్రో విస్తరణ వాళ్ల లబ్ధి కోసమే! -
తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రభుత్వంలో విలీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ సారాంశాన్ని మీడియాకు వివరించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఇక నుంచి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని(సబ్ కమిటీ) ఏర్పాటు చేయనున్నట్లు, త్వరలోనే అసెంబ్లీలో బిల్లు తేనున్నట్లు తెలిపారాయన. ► హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరిస్తాం. రూ. 60వేల కోట్లతో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Lb నగర్ పెద్ద అంబర్ పేట వరకు, ఉప్పల్ నుంచి బీ బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి ECIL దాకామెట్రో నిర్మాణం చేపడుతున్నాం. మూడు-నాలుగేళ్లలో మెట్రో విస్తరణ పూర్తవుతుంది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ORR వరకు, అలాగే.. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో రహదారి.. ఆపైనే మెట్రో నిర్మాణం ఏర్పాటు చేస్తాం. ► పది జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు కేంద్రం ఏనాడూ ఆదుకోలేదు. నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుంటోంది. ► ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థ ఉంది. చట్టపరంగా ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. తిరిగి పంపిన మూడు బిల్లులను అసెంబ్లీలో మరోసారి పాస్ చేస్తం. రెండోసారి పాస్ చేశాక.. గవర్నర్ ఆమోదించాల్సిందే. ► గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను కేబినెట్ ఎంపిక చేసింది. ఎస్టీ కేటగిరి కుర్రా సత్యనారాయణ, బీసీ కేటగిరీలో దాసోజు శ్రవణ్‌ను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తున్నాం. ఎమ్మెల్సీల ఎంపికలో గవర్నర్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాం. ► నిమ్స్‌లో కొత్తగా 2వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం. ► వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాలు కేటాయింపు. ► బీడీ టేకేదార్లకు పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ► తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు ► సౌత్ ఇండియా కాపు సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం. ► అనాథ పిల్లల కోసం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ► హకింపేట్ ఎయిర్‌పోర్ట్‌ను పూణే తరహాలో పౌరవిమానయాన సేవలకు వినియోగించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదన పంపుతున్నాం. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే కేంద్రం లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుంది. -
హౌజింగ్బోర్డును ఎత్తేసిన తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హౌజింగ్ బోర్డును ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. గృహ నిర్మాణ శాఖ ఆస్తులు, పథకాలు, ఉద్యోగులను.. ఆర్ అండ్ బీ శాఖలో విలీనం చేసింది. హౌజింగ్ బోర్డుతో పాటు రాజీవ్ స్వగృహ, దిల్(దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్) సంస్థలకూ ఈ కీలక నిర్ణయం వర్తించనుంది. -
ఈ ఏడాది పీవీఆర్, ఐనాక్స్ విలీనం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం ఈ ఏడాదిలో పూర్తికావచ్చని అజయ్ బిజిలీ తాజాగా అంచనా వేశారు. విలీనం అనంతరం సంయుక్త సంస్థ ఐదేళ్ల కాలంలో 3,000–4,000 తెరలకు చేరనున్నట్లు పీవీఆర్ చైర్మన్ అజయ్ తెలియజేశారు. గత తొమ్మిది నెలల్లో మూవీలకు తరలివచ్చే ప్రేక్షకులు పెరగడం, ఫిల్మ్ పరిశ్రమ నుంచి సినిమాల నిర్మాణం ఊపందుకోవడం వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 27న విలీనానికి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తెరతీశాయి. ఇందుకు వాటాదారులు, రుణదాతలు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. జనవరి 12న సమావేశంకానున్న ఎన్సీఎల్టీసహా నియంత్రణ సంస్థల నుంచి విలీనానికి త్వరలోనే ఆమోదముద్ర లభిస్తుందని అభిప్రాయపడ్డారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
జూమ్‌కార్, ఐఐఏసీ విలీనం
కార్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్‌కార్ తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ అక్విజిషన్ కార్ప్‌తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలీనం అనంతరం జూమ్‌కార్ హోల్డింగ్స్‌గా పేరు మారనుంది. ఈ లావాదేవీ ద్వారా జూమ్‌కార్ హోల్డింగ్స్ విలువ రూ.3,753 కోట్లుగా లెక్కించారు. విలీనం అనంతరం ఏర్పడిన కంపెనీని నాస్డాక్లో లిస్ట్ చేస్తారు. 2013లో ప్రారంభం అయిన జూమ్‌కార్ హోల్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. కార్ షేరింగ్ మార్కెట్‌ప్లేస్‌లో 25,000 కంటే ఎక్కువగా వాహనాలు నమోదయ్యాయి. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా, ఆఫ్రికాలోని దక్షిణ సహారా దేశాల్లో అపార అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు జూమ్‌కార్ కో–ఫౌండర్, సీఈవో గ్రెగ్ మోరన్ తెలిపారు. 2025 నాటికి రూ.7.4 లక్షల కోట్ల మార్కెట్ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
బీఆర్ఎస్లో ఆ పార్టీ విలీనం.. మరో మూడు కూడా లైన్లో!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో తమ పార్టీని విలీనం చేసేందుకు తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ ముందుకు వచ్చింది. బుధవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో విలీన ప్రకటన ఉండనుంది. ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ పార్టీ నుంచి చిదంబరం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మంగళవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరో మూడు లైన్లో..! తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ పార్టీ బీఆర్ఎస్లో విలీనానికి సిద్ధమైంది. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్ఎస్తో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చదవండి: (ప్రత్యామ్నాయ నాయకత్వం కోసమే...) -
ఉక్రెయిన్ యుద్దంలో అనూహ్య పరిణామం
మాస్కో: ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా. ఈ మేరకు గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లోని జార్జియన్ హాల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త సరిహద్దులు రష్యాలోని చేరనున్నాయి అని పుతిన్ వ్యక్తిగత ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ పరిణామంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రసంగం చేస్తారని వెల్లడించారు. దీంతో పుతిన్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి నుంచి మొదలైన ఆక్రమణలో భాగంగా.. క్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా సైన్యం ఇదివరకే ఆక్రమించేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పౌరులు రష్యాలో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ ఆయా ప్రాంతాల్లో క్రెమ్లిన్ నియమించిన రష్యన్ అధికారులు వెల్లడించారు. -
వయాకామ్18 మీడియాలో జియో సినిమా ఓటీటీ విలీనం!
న్యూఢిల్లీ: వయాకామ్18 మీడియాలో జియో సినిమా ఓటీటీ విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ ద్వారా సోమవారం ఈ విషయం వెల్లడించింది. బోధి ట్రీ సిస్టమ్స్ (బీటీఎస్)తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్18 ప్రకటించాయి. దీని ప్రకారం వయాకామ్18లో బీటీఎస్ రూ. 13,500 కోట్లు, రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ రూ. 1,645 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా యి. ఒప్పందంలో భాగంగా జియో సినిమా ఓటీటీ యాప్‌ను వయాకామ్18కి బదలాయించారు. చదవండి: ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు! -
నిజాం నవాబుకు పటేల్ 3 నెలలు గడువు ఎందుకిచ్చారు?.. దీని వెనుక కారణాలేమిటంటే..
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా సమస్యలు ఎన్నో కొనసాగాయి. మిగిలిన సంస్థానాలతో పాటు హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయడం అంత ఈజీ కాదన్న విషయాన్ని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ముందే గుర్తించారు. అందుకే భారత్‌లో విలీనం అయ్యేందుకు.. నిజాం నవాబుకు 3 నెలల సమయం ఇచ్చారు. దీనికి చాలా కారణాలున్నాయి. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ముఖ్యంగా నిజాం సంస్థానం దేశంలోనే అత్యంత పెద్ద రాజ్యం. భారతదేశంలో విలీనానికి ముందు నిజాం రాజ్యం 82 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉంది. అంటే ఇప్పటి బ్రిటన్-స్కాట్లాండ్ దేశాలకన్నా వైశాల్యంలో పెద్దది. ఇక ప్రపంచంలోనే నిజాం అత్యంత ధనికుడు. 1924లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ తన కవర్ పేజీపై ప్రపంచంలోనే అత్యంత ధనికుడంటూ అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఫోటో ప్రచురించింది. ఇక నిజాం రాష్ట్రంపై వెంటనే భారత్ సైనికచర్య చేపట్టకపోవడానికి ముఖ్యకారణం... నిజాం ప్రభువుకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఉన్న మతపరమైన అభిమానం. అందుకే హైదరాబాద్ సంస్థానాన్ని చర్చల ద్వారానే విలీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఏడాది పాటు ప్రయత్నించింది. ఏవిధంగానైనా నిజాం రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలని ప్రధాని నెహ్రూ ముందు హోంమంత్రి పటేల్ ప్రతిపాదన పెట్టారు. భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వాతంత్ర్యంగా ఉండటం దేశభద్రతకు ముప్పు అని పటేల్ భావించారు. అయితే హైదరాబాద్ రాష్ట్రంపై సైనికచర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం తలదూర్చే ప్రమాదం ఉందని నెహ్రూ అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓ వైపు పాకిస్తాన్‌తో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌లో సైనిక చర్యకు దిగడం సరికాదనే నెహ్రూ సూచనకు పటేల్ సరేనన్నారు. దీంతో తాను స్వతంత్ర్యంగా ఉంటానని ప్రకటించిన నిజాంను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావించారు. చివరికి మూడునెలల పాటు యథాతథ స్థితికి నిజాంతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. అయితే మూడునెలల తరువాత నిజాం తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేస్తేనే ఈ ఒడంబడిక చెల్లుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు నాలుగు దఫాల చర్చల తరువాత నిజాం 1947 నవంబర్ 29 ఈ ఒప్పందంపై సంతకం పెట్టాడు. -
పీవీఆర్–ఐనాక్స్ విలీనం వాటిని దెబ్బతీస్తాయ్.. సీసీఐకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చైన్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం పోటీ నిబంధనలను దెబ్బతీస్తాయంటూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) వద్ద ఫిర్యాదు దాఖలైంది. విలీనం కారణంగా సినిమా పంపిణీ పరిశ్రమలో పోటీతత్వానికి తెరపడుతుందంటూ లాభరహిత సంస్థ కన్జూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ(సీయూటీఎస్) ఆరోపించింది. ఈ అంశంపై దర్యాప్తు చేయవలసిందిగా సీసీఐను అభ్యర్థించింది. ఈ ఏడాది మార్చి 27న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీన అంశాన్ని ప్రకటించిన విషయం విదితమే. తద్వారా దేశవ్యాప్తంగా 1,500 తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌కు తెరతీసేందుకు నిర్ణయించాయి. దీంతో చిన్న నగరాలు, పట్టణాలలో మరింత విస్తరించే వీలున్నట్లు తెలియజేశాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించనున్న కంపెనీ భవిష్యత్‌లో కొత్త మల్టీప్లెక్స్‌లను ఇదే బ్రాండుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో వినియోగదారులకు అధిక టికెట్ ధరలు తదితరాల విషయంలో అవకాశాలు తగ్గిపోతాయని సీసీఐకు దాఖలు చేసిన ఫిర్యాదులో సీయూటీఎస్(కట్స్) అభిప్రాయపడింది. కాగా.. జూన్ 21న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి డీల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం! చదవండి: స్టాక్ మార్కెట్: ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే! -
యూటెల్శాట్తో వన్‌వెబ్ విలీనం
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఉపగ్రహాల ఆపరేటర్ యూటెల్‌శాట్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ వన్‌వెబ్ విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ డీల్ పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో ఉండనుంది. ఇరు సంస్థల సంయుక్త ప్రకటన ప్రకారం వన్‌వెబ్ విలువను 3.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 27,000 కోట్లు) లెక్కకట్టారు. ప్రస్తుతం వన్‌వెబ్‌లో కీలక భాగస్వామి అయిన దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ .. డీల్ పూర్తయిన తర్వత యూటెల్‌శాట్‌లో అతి పెద్ద వాటాదారుగా ఉండనుంది. విలీన సంస్థకు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ కో–చైర్మన్‌గాను, ఆయన కుమారుడు శ్రావిన్ భారతి మిట్టల్ .. డైరెక్టరుగా ఉంటారు. యూటెల్‌శాట్ ప్రస్తుత చైర్మన్ డొమినిక్ డి హినిన్ .. విలీన సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం వన్‌వెబ్ షేర్హోల్డర్లకు యూటెల్‌శాట్ కొత్తగా 23 కోట్ల షేర్లను జారీ చేస్తుంది. తద్వారా పెరిగిన షేర్ క్యాపిటల్‌లో ఇరు సంస్థల షేర్‌హోల్డర్ల వాటా చెరి 50 శాతంగా ఉండనుంది. వన్‌వెబ్‌లో 100 శాతం వాటాలు యూటెల్‌శాట్‌కు దఖలుపడతాయి. 2023 ప్రథమార్ధంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. యూటెల్‌శాట్‌కు 36 జియోస్టేషనరీ ఆర్బిట్ (జియో) ఉపగ్రహాలు ఉండగా, వన్‌వెబ్‌కు 648 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. -
ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనం
ముంబై: డిజిటల్ సర్వీసుల్లో భారీ ఆర్డర్ల కోసం పోటీపడే దిశగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్‌ట్రీలను విలీనం చేస్తున్నట్లు ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ వెల్లడించింది. విలీన సంస్థ పేరు ఎల్టీఐమైండ్ట్రీగా ఉంటుందని వివరించింది. 3.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో టెక్ మహీంద్రా తర్వాత రెవెన్యూపరంగా దేశీయంగా ఆరో అతి పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థగా ఎల్టీఐ ఉండనుంది. అవసరమైన అనుమతులన్నీ వచ్చాక వచ్చే పదకొండు నెలల్లో ప్రక్రియ పూర్తి కాగలదని ఎల్అండ్టీ గ్రూప్ పేర్కొంది. విలీన సంస్థకు దేబాశీష్ చటర్జీ సారథ్యం వహిస్తారు. ఎల్టీఐ సీఈవో సంజయ్ జలోనా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. 2 కంపెనీల్లో ఎల్అండ్టీకి మెజారిటీ వాటాలు ఉన్నా యి. పూర్తిగా స్టాక్స్ రూపంలో ఉండే ఈ డీల్ ప్రకా రం మైండ్‌ట్రీ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 100 షేర్ల కు 73 ఎల్టీఐ షేర్లు లభిస్తాయి. ఎల్టీఐమైండ్ట్రీలో ఎల్అండ్టీకి 68.73% వాటాలు ఉంటాయి. టార్గెట్ 10 బిలియన్ డాలర్లు 100 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే భారీ డీల్స్ కోసం పోటీపడేందుకు ఈ విలీనం ఉపయోగపడగలదని నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలకు లభిస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు 25 మిలియన్ డాలర్ల స్థాయిలోనే ఉంటోందని ఆయన చెప్పారు. ఆదాయ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల పెద్ద కాంట్రాక్టులకు బిడ్ చేయడం సాధ్యపడటం లేదని నాయక్ తెలిపారు. వచ్చే అయిదేళ్లలో విలీన సంస్థ ఆదాయాలు 10 బిలియన్ డాలర్లకు చేరుకోగలదన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. 80వేల పైచిలుకు సిబ్బంది విలీన సంస్థలో 80,000 మంది పైగా సిబ్బంది ఉంటారు. విలీనంతో తాము కొత్తగా 15–20% మందిని కొత్తగా రిక్రూట్ చేసుకోవాల్సి రానున్నట్లు నాయక్ తెలిపారు. ఎల్అండ్టీలో ఐటీ విభాగంగా 2000లో ఎల్టీఐ ఏర్పాటైంది. 2019లో మైండ్‌ట్రీలో ఎల్అండ్టీ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. చదవండి: ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..! కాగ్నిజెంట్‌లో భారీగా నియామకాలు! -
సైయంట్ చేతికి సైటెక్
న్యూఢిల్లీ: గ్లోబల్ ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైటెక్‌ను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల హైదరాబాద్ కంపెనీ సైయంట్ తాజాగా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా సుమారు రూ. 800 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా బిజినెస్ ఆఫరింగ్స్‌ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. 1984లో ఏర్పాటైన సైటెక్ అంతర్జాతీయ ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సరీ్వసులను అందిస్తోంది. ఎనర్జీ, మైనింగ్, ప్రాసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, తయారీ రంగాలలో కస్టమర్లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇంజనీరింగ్ సర్వీసులు కంపెనీ చేపట్టిన అతిపెద్ద విదేశీ కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సైయంట్ పేర్కొంది. అంతేకాకుండా సైయంట్ చరిత్రలోనూ ఇది అతిపెద్ద కొనుగోలుగా వెల్లడించింది. ఈ త్రైమాసికంలోనే కొనుగోలు పూర్తికానున్నట్లు తెలియజేసింది. సైటెక్‌కున్న పటిష్ట బ్రాండు విలువ, నిపుణుల శక్తి ప్రధానంగా నార్డిక్ ప్రాంతంలో కంపెనీకి బలాన్ని చేకూర్చగలవని సైయంట్ ఎండీ, సీఈవో బోదనపు కృష్ణ పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో కంపెనీ మరింత విస్తరించగలదని తెలియజేశారు. 2021లో సైటెక్ 8 కోట్ల యూరోల(సుమారు రూ. 660 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించారు. 14,000 మంది నిపుణులతో కార్యకలాపాలు విస్తరించిన సైయంట్.. తమ కస్టమర్లకు కొత్త సర్వీసులను అందించడంతోపాటు, ఉద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పించనున్నట్లు సైటెక్ సీఈవో జొహాన్ వెస్టర్‌మార్క్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (74) తన నేతృత్వంలోని లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ)ను రాష్ట్రీయ జనతాదళ్‌లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు. బీజేపీని దీటుగా ఎదుర్కోగల సత్తా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉందన్నారు. 1997లో దాణా కుంభకోణం బయటపడ్డాక జనతాదళ్‌లో విభేదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీని స్థాపించారు. అప్పట్లో జనతాదళ్‌లో లాలూకు గట్టి పోటీ ఇచ్చే నేతగా శరద్ యాదవ్ ఉండేవారు. 2005లో ఆర్జేడీ పాలనకు చరమగీతం పాడేందుకు శరద్ యాదవ్, నితీశ్‌కుమార్ ఏకమయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ–ఆర్జేడీ అలయెన్స్ ఏర్పాటులో శరద్‌యాదవ్ కీలకంగా వ్యవహరించారు. తర్వాత శరద్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నాక ఎల్జేడీ పెద్దగా ఎదగలేకపోయింది. అనారోగ్యం తదితర కారణాల వల్ల పార్టీ శ్రేణులకు మరో ప్రత్యామ్నాయం చూపేందుకే ఆయన విలీనం వైపు అడుగులు వేసినట్లు భావిస్తున్నారు. -
బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)లో మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను పూర్తిగా వీలినం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలలో వీలిన ప్రక్రియ పూర్తిగా ముగుస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మాట్లాడుతూ...బీబీఎన్ఎల్ వీలిన ప్రక్రియతో బీఎస్ఎన్ఎల్ను ఒక మలుపు తిప్పే అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. బీబీఎన్ఎల్ పూర్తి బాధ్యతలు బీఎస్ఎన్ఎల్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్‌కు ధీటుగా..! ఇప్పటికే పలు దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలు మొబైల్ నెట్‌వర్క్‌తో పాటుగా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. బీబీఎన్ఎల్ వీలిన ప్రక్రియతో బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్లో బీఎస్ఎన్ఎల్కు భారీగా లబ్థి చేకూరే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారత్ నెట్ ప్రాజెక్ట్..! బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చింది. 2021 జూలైలో దేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాలకు ఆప్టిక్ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ అమలు బాధ్యతను పూర్తిగా బీబీఎన్ఎల్ చూసుకునేది. అందుకోసం సుమారు రూ. 24 వేల కోట్లను వెచ్చించారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో 1.71 లక్షల గ్రామ పంచాయతీలను భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద అనుసంధానం చేశారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై కేంద్రం కీలక నిర్ణయం..! వాటి పరిధిలోకి -
Xi Jinping: తైవాన్ విలీనం తప్పనిసరి!
బీజింగ్: తైవాన్ను చైనాతో విలీనం చేసితీరతామని ఆదేశాధ్యక్షుడు జీ జింగ్పింగ్ మరోమారు స్పష్టం చేశారు. తైవాన్ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అవసరం లేదంటూ పరోక్షంగా యూఎస్, జపాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇటీవల కాలంలో తైవాన్ గగనతలంలోకి పలుమార్లు చైనా విమానాల చొరబాట్లు జరిగాయి. ఎప్పుడైనా చైనా తమను బలవంతంగా ఆక్రమిస్తుందని తైవాన్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. మరోవైపు తైవాన్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందుకోసం తైవాన్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. తైవాన్ సార్వభౌమదేశంగా తనను తాను భావిస్తుండగా, చైనా మాత్రం అది తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతంగా భావిస్తోంది. చైనా విముక్తి వార్షికోత్సవాల్లో జింగ్పింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. చైనాతో తైవాన్ విలీనానికి తైవాన్ స్వాతంత్య్ర దళాలే అతిపెద్ద అడ్డంకన్నారు. తమతో కలవడంతో కలిగే ప్రయోజనాలను తైవాన్ భవిష్యత్‌లో గ్రహిస్తుందన్నారు. తైవాన్ విలీనం చైనీయులందరి కోరికగా అభివరి్ణంచారు. చదవండి: చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం వివాదం ఎందుకు? 1911 తిరుగుబాటు అనంతరం చైనా పాలన కిందకు తైవాన్ వచ్చింది. 1949 నుంచి తైవాన్ స్వతంత్య్రం కోసం పోరాడుతోంది. అయితే బలప్రయోగం ద్వారానైనా తైవాన్ను కలుపుకోవాలన్నది చైనా యోచనగా నిపుణులు భావిస్తున్నారు. తైవాన్ అగ్రిమెంట్‌ను చైనా గౌరవిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధిపతి బైడెన్ చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘించే చర్యలుండవని ఆశిస్తున్నామన్నారు. చైనా మాత్రం తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అక్కర్లేదని ఘాటుగా బదులిచి్చంది. ఇది తమ అంతర్గత వ్యవహారమని చెప్పింది. హాంకాంగ్లాగానే వన్ కంట్రీ, టూ సిస్టమ్స్ విధానాన్ని తైవాన్‌తో కుదుర్చుకుంటామని చైనా చెబుతోంది. కానీ హాంకాంగ్ విషయంలో చివరకు చైనా పెత్తనమే అంతిమమైంది. పైగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనే తమ లక్ష్యమని చైనా పేర్కొంటోంది. తైవాన్ అధ్యక్షుడు సైఇంగ్ వెన్ మాత్రం తమకు స్వాతంత్య్రమే అక్కర్లేదన్నారు. జింగ్పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. అయితే సవరణలతో జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయన యత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా -
సొంతింటికొస్తున్న విమానం
ఎయిర్ ఇండియా తిరిగి టాటా చేతికే వచ్చేసింది. స్వాతంత్రానికి పూర్వం ప్రయివేటు రంగంలో మొదలై, తర్వాత ప్రభుత్వ పరమై... భారత దేశ కీర్తి పతాకాన్ని దశాబ్దాల పాటు విశ్వ గగన వీధుల్లో రెపరెపలాడించిన ఓ విమానయాన సంస్థ తిరిగి అదే సంస్థ చేతికి రావడం భావోద్వేగాలు రేపే ఘట్టం! ‘చరిత్ర పునరావృతమౌతుంది’ అని తరచూ వాడే నానుడి ఇక్కడ నిజమైంది. ‘భూమి గుండ్రంగా ఉండును...’ అనేది సాపేక్షంగా రుజువవుతుందన్నట్టు... కొన్ని పరిణామాలు మొదలైన చోటికే మళ్లీ చేరడాన్ని జనం వింతగా చూస్తారు. కొందరు ఆశ్చర్యపోతారు. మరికొందరు లోతైన భావోద్వేగాలకు లోనవుతారు. భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, దేశంలో లైసెన్స్ పొందిన తొలి కమర్షియల్ పైలెట్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జే.ఆర్.డి) టాటా 1932లో స్థాపించిన సంస్థ, 1953లో చట్టం ద్వారా ప్రభుత్వ నిర్వహణలోకి వెళ్లి, 68 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంస్థ చేతుల్లోకి వచ్చింది. ఎయిర్ ఇండియా నూటికి నూరు శాతం కొనుగోలుకై వచ్చిన తాజా బిడ్లలో టాటాయే అర్హమైనట్టు, చివరకు అదే ఎంపికయినట్టు కేంద్రంలోని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం)’ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే శుక్రవారం అధికారికంగా ప్రకటించడంతో దేశమంతా ఓ ఆహ్లాదపు వార్త విన్న అనుభూతి పొందింది. ఎందుకంటే, టాటా గ్రూప్‌కు, దాని యాజమాన్యానికి ఉన్న పేరు అటువంటిది. జాతీయతా భావాలు కలిగిన నిబద్ద కార్పొరేట్ సంస్థగా వారికున్న పేరు దేశంలో మరే సంస్థకూ లేదంటే అతిశయోక్తి కాదు! ‘టాటా గ్రూప్‌కు ఇస్తే మంచిది. ఎయిర్ ఇండియాను స్వీకరించి, సమర్థంగా నిర్వహించడానికి అంతకు మించిన కార్పొరేట్ ఏదీ ఇవాళ దేశంలో లేదు’ అని ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అçహ్లువాలియా రెండు రోజుల కింద చేసిన ట్వీట్ సగటు భారతీయుల భావాల ప్రతీక! చివరకు అదే జరిగింది. ‘...జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే విమానయాన సంస్థను పొంది, నిర్వహించే అవకాశం, గ్రూప్‌కు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తాం. ఓ ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్ది ప్రతి భారతీయుడూ గర్వించేలా చేస్తాం....’ అన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తక్షణ స్పందన గ్రూప్ సంస్థల సంకల్పాన్ని ప్రతిబింబించేదే! ఎయిర్ ఇండియాను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చేసిన తొలి యత్నం కాదిది. 2000– 01లోనే అప్పటి బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం, నిధుల సమీకరణ కోసం ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సన్నద్దమైంది. అప్పుడూ టాటా గ్రూప్‌తో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రయత్నం చేశాయి. కానీ, ఎందుకో వ్యవహారం కుదరలేదు. 2005 తర్వాత ప్రయివేటు రంగం పోటీని, ప్రభుత్వ రంగంలోని అలసత్వాన్ని ఎయిర్ ఇండియా తట్టుకోలేకపోయింది. తీవ్ర నష్టాలు, తీరని రుణభారంతో అల్లాడుతూ వచ్చింది. ముఖ్యంగా, 2007లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వపు యూపీఏ ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ని విలీనం చేసి, యాౖభై వేలకోట్ల రూపాయల రుణం ఇప్పించడం ద్వారా కొత్త విమానాల్ని కొనుగోలు చేయించింది. మెరుగవక పోగా, పరిస్థితి దిగజారింది. ఒక దశలో ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి వచ్చినపుడు, ఈక్విటీ ఫండ్ రూపంలో కేంద్రం ముఫ్ఫై వేల కోట్ల రూపాయలు ఇప్పించినా కోలుకోలేకపోయింది. ఎయిర్ ఇండియా వాటాలు 76 శాతం, ఎయిర్ ఇండియా–సింగపూర్ ఎయిర్పోర్ట్ టర్మినల్ సర్వీసెస్ వాటాలు 50 శాతం విక్రయించాలని 2018లో చేసిన మరో ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక నూరుశాతం విక్రయమే మార్గమని, 2019లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకిలా పరిణమించింది. 63 వేల కోట్ల రూపాయల రుణభారంతో ఉన్న ఎయిర్ ఇండియాను కొనడానికి వచ్చిన బిడ్లలో స్పైస్‌జెట్, టాటా చివరి వరకూ మిగిలి, టాటా సన్స్ అంతిమ విజేత అయింది. టాటాలకు ఇంతటి శక్తి, కీర్తి ఒక రోజులో వచ్చినవి కాదు. నూరేళ్లకు పైబడ్డ సంకల్ప ఫలం. నిబద్ధత, దేశభక్తి, అంకితభావం కలగలిసిన కృషి ఫలితం. చిన్న గుండుసూది తయారీ నుంచి పెద్ద విమానాలు నడుపడం వరకు దేశాభివృద్ధిలో టాటాల భాగస్వామ్యం అగణితమని చెప్పాలి. నడమంత్రపు సిరితో తూగుతున్న నయా కార్పొరేట్లతో పోలిస్తే టాటాలది ఈ దేశపు మట్టితో, గాలితో, పౌరుల బతుకుతో ముడివడ్డ ప్రగతి! 1991 మార్చి 23న, జేఆర్డీ టాటా, బాంబేహౌజ్లోని తన కార్యాలయంలో కూర్చొని ‘నేను రిటైర్ అవాలని, ఆ స్థానంలో నిన్ను ప్రకటించాలని నిర్ణయించాను’ అని వెల్లడించడానికి దశాబ్దం ముందు నుంచే రతన్ టాటా మది నిండా ఆలోచనలున్నాయి. టాటా విస్తరణ బ్లూప్రింట్ అప్పటికే తయారైంది. ఒకవైపు దేశ ఆర్థికస్థితి, మరోవైపు ప్రభుత్వ విధానాల్ని గమనంలోకి తీసుకొని ఆయనీ బ్లూ ప్రింట్ రూపొందించారు. లైసెన్స్రాజ్లో ఎదురైన చేదు అను భవాలు ఆయనకు తెలుసు. టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి సంస్థల్ని అగ్రస్థానంలో నిలప డానికి ఎన్నెన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు! ఉత్పత్తి, ధరలు, విక్రయాలు, మార్కెటింగ్, ఎగుమతి–దిగుమతులు, విదేశీ మారకం.... ఇలా, అప్పట్లో ప్రతిదీ నియంత్రణే! అన్నీ అధిగమించి, దేశ ప్రయోజనాల విషయంలో అణుమాత్రం రాజీపడకుండా సంప్రదాయ–నెమ్మది పంథా నుంచి టాటా గ్రూప్‌ను ప్రపంచ పోటీ తట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. టాటా అంటే, ఇవాళ విశ్వస నీయత కలిగిన బ్రాండ్! దేశ ప్రగతి సౌధంలో ఒక్కో ఇటుకై నిలిచిన పెద్ద గోడ! ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ అనివార్యమైతే... అందుకు టాటాయే యోగ్యం! దేశానికి అదే ప్రయోజనకరం. -
కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేద్దామా? అంటూ ట్విటర్ వేదిక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కంటోన్మెంట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ‘కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలంటూ అక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నట్లు వార్త చూశా.. దీనికి నేను అంగీకరిస్తున్నా, మీరేమంటారు?’ అంటూ నెటిజన్లను ఆయన ప్రశ్నించారు. దీంతో కంటోన్మెంట్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రతినిధులు తమ పోరాటానికి వెయ్యేనుగుల బలం వచ్చిందంటున్నారు. సాక్షాత్తూ మున్సిపల్ శాఖ మంత్రి తమ పోరాటానికి మద్దతు పలకడంతో సగం విజయం సాధించనట్లేనని అభిప్రాయపడుతున్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్‌లు బుధవారం ఎమ్మెల్యే సాయన్నను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేను కోరారు. టీఆర్ఎస్ ఎంపీల ద్వారా పార్లమెంట్ సమావేశాల్లోనే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై చర్చ లేవనెత్తాలని కోరారు. Read a couple is news reports today where citizens overwhelmingly opined that Secunderabad Cantonment Board has to be merged in GHMC I am in agreement too. What do you guys say? — KTR (@KTRTRS) September 22, 2021 మూడేళ్లుగా చర్చ కంటోన్మెంట్ బోర్డుల రద్దు అంశంపై మూడేళ్లుగా వార్తలు వెలువుడుతున్నాయి. తాగా గతేడాది కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్లను సమీప మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లలో విలీనంపై అభిప్రాయం కోరినట్లు కూడా ప్రచారం జరిగింది. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌కు బలం చేకూరింది. కాగా ఈ అంశంపై తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. చదవండి: TS High Court: ఎన్ని ప్రాణాలు పోవాలి? -
కంటోన్మెంట్ విలీన వాదనతో ఏకీభవిస్తున్నాను : కేటీఆర్
-
తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదు: ప్రొ.కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదని ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
అసెంబ్లీలో కాంగ్రెస్ విలీనంపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం కావడం చట్టవిరుద్ధమని, 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లో అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, ఎన్నికల కమిషన్‌తోపాటు ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, కందాల ఉపేందర్‌రెడ్డి, పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, రేగ కాంతారావు, సక్కు, హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, జె.సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్ రెడ్డి తదితరులు ప్రతివాదులుగా ఉన్నారు. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యేలకు నోటీసులు పంపేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి అనుమతించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనం కాకుండా ఆదేశా లివ్వాలంటూ 2019 జూన్‌లో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ దాఖలు చేసిన మరో పిటిషన్లో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టి.సంతోష్‌కుమార్, లలితలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. స్పీకర్‌కు ఆ అధికారం లేదు ‘ఒక పార్టీకి చెందిన శాసనసభాపక్షాన్ని మరో పార్టీలో విలీనం చేసే అధికారం ఎన్నికల సంఘానికే ఉంటుంది. అందుకు విరుద్ధంగా స్పీకర్ వీరిని విలీనం చేస్తూ బులెటిన్ జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల కింద 12మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయాలి’ అని పిటిషన్లో కోరారు. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగం బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదా పథకాన్ని ఆవిష్కరించినట్లు మంగళవారం వెల్లడించింది.ఇందుకు డీబీఐఎల్ 2,500 కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని ముందస్తుగా సమకూరుస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. ఇవి 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్బీఐ తన నోటీసులో తెలిపింది. మరోవైపు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది. ఈ రోజు (నవంబరు, 17వ తేదీన) సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉండనుంది. మారటోరియం సమయంలో విత్‌డ్రా లిమిట్‌ను 25వేలకు కుదించింది. ఈ వెంటనే ఆర్బీఐ విలీన ప్రతిపాదనని ప్రకటించడం గమనార్హం. కాగా ఇటీవల జరిగిన బ్యాంక్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు తీరుపై ఆగ్రహంతో ఉన్న వాటాదారులు (దాదాపు 60 శాతం) భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుతం తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఎన్ సాయిప్రసాద్, గోరింక జగన్మోహన్ రావు, రఘురాజ్ గుజ్జర్, కేఆర్ ప్రదీప్, బీకే మంజునాథ్, వైఎన్ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్ని కూడా భారీ మెజార్టీతో వ్యతిరేకించిన సంగతి విదితమే. -
బీమా సంస్థల విలీనం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. విలీన ప్రక్రియను నిలిపి వేసిన ప్రభుత్వం లాభదాయక వృద్ధి, నిధుల కేటాయింపు ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రణాళికను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయం ప్రకారం మూడు బీమా సంస్థలకోసం 12,450 కోట్ల రూపాయల నిధులను కేటాయించనుంది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెరో 5 వేల కోట్ల రూపాయలను నిధులు కేటాయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. బలహీనమైన ఆర్థిక స్థితికితోడు సంస్థలు వినియోగిస్తున్న వివిధ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు, తదితర కారణాల రీత్యా ప్రస్తుత ప్రరిస్థితుల్లో విలీనం ఒక సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. -
ఔను... ఒక్కటి చేద్దాం: కింగ్
పారిస్: మహిళల, పురుషుల టెన్నిస్ పాలక మండళ్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ ఇటీవల ట్విట్టర్లో రెండు టెన్నిస్ పాలక వర్గాలను విలీనం చేయాలని సూచించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విలీనానికి అతని సమకాలీన దిగ్గజం రాఫెల్ నాదల్ మద్దతు తెలపగా.... ఇప్పుడు ఈ జాబితాలో డబ్ల్యూటీఏ వ్యవస్థాపకులు బిల్లీ జీన్ కింగ్ చేరారు. విలీనానికి ఇదే సరైన సమయమని ఆమె అన్నారు. ఆమె 1973లో డబ్ల్యూటీఏను స్థాపించారు. అప్పట్లోనే తాను రెండు వర్గాలను ఏకం చేయాలని సూచించినా ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడైనా సాకారం కావాలని ట్వీట్ చేశారు. -
హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం
సాక్షి, ముంబై : కోవిడ్ -19 మహమ్మారి విస్తరణతో ప్రపంచ మార్కెట్లలో మొత్తం సినిమా నిర్మాణ రంగం సంక్షోభంలో వుండగా హాలీవుడ్‌కు చెందిన ఎస్టీఎక్స్ ఎంటర్టైన్మెంట్తో విలీనం అవుతున్నట్టు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఈ కంపెనీలో సమాన వాటాను విలీనం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. విలీన వార్తలలో ఇవాళ ఎరోస్ ఇంటర్నేషనల్‌కు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. దీంతో ఈ స్టాక్ ఏప్రిల్ 20 న ఉదయం ట్రేడింగ్ లో 10శాతం అప్పర్ సర్క్యూట్(రూ.16.35) వద్ద ఫ్రీజ్ అయింది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఎస్టిఎక్స్ సంస్థ 'హస్ట్లర్స్', బ్యాడ్మామ్స్ లాంటి 34 సినిమాలను నిర్మించింది. మొత్తం 1.5 బిలియన్ డాలర్లను వసూలు చేసి బ్లాక్ బ్లస్టర్ సినిమాలుగా నిలవడం విశేషం. 11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్ కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్ పేరుతో గ్లోబల్ సంస్థగా అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లాఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్స్ కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు. (భారీగా తగ్గిన బంగారం ధర : ఈ అక్షయ తృతీయకు కొనేదెలా?) కోవిడ్-19 తో సినిమా రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ మహమ్మారితో సినిమా నిర్మాణ రంగం మొత్తం మూతపడింది. ఈ సమయంలో ఒక బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో కొత్త సంస్థను సృష్టిస్తున్నాం. ఏరోస్, ఎస్టీఎక్స్ విలీన సంస్థలో ప్రస్తుత వాటాదారులు 42శాతం వాటాను కలిగివుంటారు. టీపీజీ, హనీ క్యాపిటల్, లిబర్టీ గ్లోబల్‌తో పాటు ఎస్టీఎక్స్కు చెందిన ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి 125 మిలియన్ డాలర్ల తాజా మూలధనాన్ని సేకరిస్తున్నామని ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ద్వివేది వెల్లడించారు. బాలీవుడ్‌కు ఇది చాలా మంచి వ్యాపార వార్త అని, ఈ నిధులను ఫిల్మ్ ప్రొడక్షన్ , డిజిటల్ కంటెంట్ కోసం ఉపయోగిస్తామని తెలిపారు.ఇప్పటికే 75 మిలియన్ డాలర్లకు పైగా అందుకున్నామని, జూన్ చివరి నాటికి ఈ డీల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
ఐదు పంచాయతీలు విలీనం
సాక్షి, విశాఖపట్నం: మూడున్నర దశాబ్దాల కిందట నగర పాలక సంస్థగా ఏర్పడిన విశాఖ తొలి నుంచి రాజకీయపరంగా సంచలనంగానే ఉంటోంది. 1981లో జరిగిన తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 1987లో టీడీపీ, 1995, 2000లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. 2005లో కార్పొరేషన్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మారుస్తూ అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి నగర రూపు రేఖలు మారిపోయాయి. ఆర్థిక రాజధానిగా అభివృద్ధిలో పరుగులు పెట్టింది. అప్పటి వరకూ ఉన్న 50 వార్డులు 72కి చేరాయి. గాజువాక, మధురవాడ, పెందుర్తి ప్రాంతాలు జీవీఎంసీలో చేరాయి. గాజువాకను విలీనం చేసిన తర్వాత 72 వార్డులతో 2007లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రానికి, నగరానికి మహానేత వైఎస్సార్ చేస్తున్న అభివృద్ధికి ఓటేస్తూ నగరవాసులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేసింది. దీంతో.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారి పాలనలోనే గ్రేటర్ విశాఖ కాలం గడపాల్సి వస్తోంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 5 పంచాయతీలు విలీనం చెయ్యండి అటు భీమిలిజోన్కు, ఇటు గ్రేటర్‌కు మధ్యలో ఉన్న ఐదు పంచాయతీలను విలీనం చేయకుండా గతంలో 81 వార్డుల విభజన పూర్తి చేశారు. అయితే.. గ్రేటర్ స్వరూపాన్ని పరిశీలిస్తే.. భీమిలి మున్సిపాలిటీకీ, జీవీఎంసీకి మధ్యలో విలీనం కాని కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, నగరపాలెం,జేవీ అగ్రహారం పంచాయతీలు ఉన్నాయి. దీంతీఓ గ్రేటర్ పరిధిలో ఈ పంచాయతీలో ద్వీపంలా కనిపిస్తాయి. అయితే.. వీటిని కలపాలని ప్రభుత్వ భావించి.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆయా పంచాయితీలన్నీ విలీనానికి అంగీకారం తెలపడంతో దానికి సంబంధించిన నివేదికను కొద్ది నెలల కిందట సీడీఎంఏకి జీవీఎంసీ పంపించింది. తాజాగా వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఐదు పంచాయతీలను కలుపుతూ వార్డు విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు టౌన్‌ప్లానింగ్ సి బ్బంది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23లోగా ప్రక్రియ పూర్తి చేసి సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను తెలుగు, ఇంగ్లిష్ పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురించనుంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 30 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. రెండు వార్డుల సరిహద్దుల్లో మార్పులు? భీమిలి మండలంలోని ఐదు పంచాయతీలు విలీనం కానున్న నేపథ్యంలో ఆ జనాభా 50 వేలు దాటితేనే కొత్త వార్డు జత చెయ్యాలి. కానీ ఐదు పంచాయతీల మొత్తం జనాభా 19,116 మాత్రమే. దీంతో చుట్టు పక్కల వార్డుల్లో విలీనం చెయ్యనున్నారు. ఈ లెక్కన కేవలం రెండు వార్డుల సరిహద్దులు మాత్రమే మారనున్నాయని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఒకటో వార్డుతో పాటు 81 వార్డు సరిహద్దులు మారే అవకాశాలున్నాయని సమాచారం. 2011 జనాభా లెక్కల ప్రకారం... జీవీఎంసీ కమిషనర్ 2016 నవంబర్ 11న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌కు గ్రేటర్ పరిధిలో ప్రస్తుత జనాభా వివరాలు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని పంపించారు. అందులో వివరాల ప్రకారం వార్డుల విభజన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ లెక్క ప్రకారం జీవీఎంసీ అధికారులు వార్డుల స్వరూపాలకు సంబంధించిన మ్యాపులను సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు వార్డుల విభజన, పంచాయతీల విలీన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఎన్ని పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు.. వాటికోసం ఎన్ని ఈవీఎంలు అవసరం, అదనంగా ఎన్ని ఈవీఎంలు సిద్ధం చెయ్యాలి.. మొదలైన వాటన్నింటిపైనా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు చినగదిలిలోని ఈవీఎం గోదాముల్లో ఉన్న ఈవీఎం మెషీన్లని పరిశీలించే ప్రక్రియకు రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నాం. జనవరి 10 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈవీఎం మెషీన్లను సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ జి. సృజన తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చరిత్రాత్మకం
ఆర్టీసీలో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లే. దానిని 60 ఏళ్లకు పెంచాలని చంద్రబాబును వేడుకున్నారు. మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేం కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నాం కదా, మాక్కూడా రిటైర్మెంట్ వయస్సు పెంచండి అని అంటే చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లు అడక్కపోయినా కూడా రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతూ ముందుగానే ఆదేశాలు జారీ చేశాం. ఆ తర్వాతే విలీన ప్రక్రియ మొదలుపెట్టాం. సాక్షి, అమరావతి: జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చారిత్రాత్మకమని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. వీరంతా జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని అన్నారు. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. ఇంకా సీఎం వై.ఎస్. జగన్ ఏమన్నారంటే.. సభలో ఇన్ని మేజర్ బిల్లులపై చర్చ జరుగుతుంటే చంద్రబాబు సభలో కనిపించరు. వాళ్ల ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కాళ్లా, వేళ్లా పడ్డారు. ‘కనికరించండయ్యా.. విలీనం చేయండయ్యా’ అని వేడుకున్నా, ఏమాత్రం కూడా కనికరించకుండా ఈ పెద్ద మనుషులు వాళ్లకు పూర్తిగా అన్యాయం చేశారు. ఈరోజు మైక్ పుచ్చుకుని ఆర్టీసీ కార్మికులే కాదు, ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను కూడా విలీనం చేయండి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. విలువలతో, విశ్వసనీయతతో కూడినదే రాజకీయం అంటారు. కానీ వీళ్ల మాటలు, వీళ్ల చేతలు చూసినప్పుడు రాజకీయాలు ఏ మేరకు దిగజారిపోయాయో అని బాధనిపిస్తోంది. ఇది చరిత్రాత్మకమైన బిల్లు ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తున్నదన్నది అందరూ ప్రశ్నించుకోవాలి. 1997లో చంద్రబాబు ఒక చట్టం చేశారు. దాని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగీ ప్రభుత్వంలో విలీనం కావడానికి వీలు లేదు. అందుకే ఇవాళ విలీనం చేసేందుకు కొత్తగా ఇంకో బిల్లు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఇది ఓ చరిత్రాత్మకమైన బిల్లు. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనం అవుతారు. ఏ రకంగా అయితే ఇరిగేషన్, హోం డిపార్ట్మెంట్ ఉన్నాయో, ఏ రకంగా అయితే సివిల్ సఫ్లైస్, మున్సిపాల్టీ, పంచాయితీ రాజ్, అలా డిఫరెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అదే విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద వీళ్లందరినీ తీసుకుంటాం. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది సాక్షి, అమరావతి: ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న 51,488 మంది జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో చేర్చుకోవటానికి సంబంధించిన బిల్లును రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. సభలో చర్చ అనంతరం సభ్యుల హర్షధ్వానాల మధ్య బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పీటీడీలో అన్ని విభాగాల్లో మొత్తం 58,953 మంది ఉద్యోగులకు ఆమోదం లభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పీటీడీలో విలీనమైన వెంటనే చెల్లిస్తారు. విలీనం తర్వాత ప్రభుత్వంపై ఏడాదికి సుమారుగా రూ.3,600 కోట్లు (నెలకు రూ.300 కోట్లు) ఆర్ధిక భారం పడుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.3,688 కోట్ల తక్షణ చెల్లింపుల బాకీలు 2019–20, 2020–21 సంవత్సరాల్లో తీరిపోతే, 2021–22 సంవత్సరానికి రూ.687 కోట్లు నికర మిగులు ఉంటుందని మంత్రి పేర్ని నాని అసెంబ్లీకి సమర్పించిన ఆర్ధిక మెమొరాండంలో వివరించారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నభూతో.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ఆమోదించడం నభూతో.. అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రూ. 6934 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఎంతో ధైర్యం, మానవత ఉండాలన్నారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో దాదాపు రూ.3,600 కోట్లు వేతనాల రూపంలో ప్రభుత్వం భారం తీసుకుంది. చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఉద్యోగుల జీవితాల్లో ఈ రోజు వెలుగులు నింపాలి. వారందరికీ పండగ దినం కావాలి’ -
ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పలేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ భవిష్యత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని, సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఆర్టీసీపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ సహా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రతీ అంశంపైనా విపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని, పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే కొందరు అత్యు త్సాహంతో సమ్మెకు దిగారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని బీజేపీ ప్రైవేటు పరం చేయగా.. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ఏకంగా రద్దు చేసిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తలసాని వారికి సవాలు విసిరారు. -
ఆంధ్రాబ్యాంకు విలీనం దుర్మార్గపు ఆలోచన
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రాబ్యాంక్ విలీనానికి వ్యతిరేకంగా ఆంధ్రాబ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్(ఏఐబీఈఏ), బీఈఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 22న సమ్మె చేయనున్నట్లు ఏఐబీఈఏ డిప్యూటీ జోనల్ కార్యదర్శి బి.మోహనరావు తెలిపారు. బ్యాంక్ విలీనానికి వ్యతిరేకంగా ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది జీటీరోడ్‌లోని ఆంధ్రాబ్యాంక్ మెయిన్ బ్రాంచి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను అగౌరవపరచడమేనన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమించి బ్యాంకును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాభాల్లో నడుస్తున్న బ్యాంకును వేరే బ్యాంకులో విలీనం చేయడం దుర్మార్గపు ఆలోచనగా దుయ్యబట్టారు. నిరసన ప్రదర్శనలో ఏఐబీఈఏ మహిళా కార్యదర్శి జి.కరుణ, సహాయ కార్యదర్శి ఎన్.ఎం.కె రాజు, సంతోషి, జయరాం, రెడ్డి, దీపిక, బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం
సాక్షి, అనంతగిరి: జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్ జోన్లోకి మారుస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. జోన్ విలీనంపై వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తనను గెలిపిస్తే చార్మినార్ జోన్లో కలిపి బహుమానంగా ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పి ఇప్పుడు నెరవేర్చారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో ఇక్కడి ఉద్యోగులు, యువకుల, నిరుద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చార్మినార్ జోన్లో కలిపారని వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే చేపట్టి జిల్లా ప్రజలకు సాగునీరు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, నాయకులు సురేశ్, విజయ్‌కుమార్, మంచన్‌పల్లి సురేశ్, కృష్ణయ్య, ముత్తాహార్ షరీఫ్, రమేశ్‌గౌడ్, రాజమల్లయ్య, దత్తు, దీపు, కడియాల వేణు, గోపాల్, అనంత్‌రెడ్డి, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌ను కలిసిన జెడ్పీ వైస్ చైర్మన్ అనంతగిరి: వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలపడంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జి బాలమల్లు, సీనియర్ నాయకులు శుభప్రద్‌పటేల్‌తో కలిసి బుధవారం కేటీఆర్‌ను కలిశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చార్మినార్ జోన్లో కలిపారని, జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. -
ఆంధ్రాబ్యాంక్ మటుమాయం!
ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఉద్యమంలో ఆవిర్భం చిన ఒక ముఖ్య ఘట్టం సహకార ఉద్యమం. 1904లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు మొదటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అమలులోకి వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ సహకార ఉద్యమానికి, వ్యవస్థకి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఒక అంశం ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్‌ని నెలకొల్పడం. బందరులో డాక్టర్ పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు అనేక సంస్థలని, సంస్కరణలను చేపట్టారు. 1915లో పట్టాభి సీతారామయ్య రూ. 50 వేలతో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్‌ను స్థాపించారు. ఆ బ్యాంక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌గా ఎదిగింది. పట్టాభిగారు 1919–1921లో ఆంధ్ర ప్రొవిన్షియల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పొదుపు ఎలా చేయాలో, ప్రజలకు ధనసహాయం ఎలా చేయాలో నేర్పారు. మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు పట్టాభిగారిని ఉద్దేశించి ‘ధనం సద్వినియోగం చేయడంలో, పొదుపు చేయడంలో పట్టాభి ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్త’ అన్నారు. 1923లో పట్టాభిగారు ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపిం చారు. సామాన్య మానవునికి, రైతుకీ, చిన్న వ్యాపారికీ ధనం అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ వ్యవస్థని పెట్టి రెండు సంవత్సరాలలో 12 శాతం డివిడెండ్ ప్రకటించారు. ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించడం కూడా జాతీయ ఉద్యమంలో ఒక భాగం అన్నారు. బ్యాంక్‌ను స్థాపించడానికి లక్ష రూపాయలు సేకరించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సులభం కాలేదు. ఇంపీరియల్ బ్యాంక్ బందరు మేనేజర్ గార్డన్ అడ్డుపెట్టగా, పట్టాభి గారు మద్రాస్ వెళ్లి ప్రాంతీయ మేనేజర్ ల్యాంబ్‌ను కలిసి పోరాటంలో విజయం సాధించారు. ఆంధ్రా బ్యాంక్ స్వాతంత్య్ర ఉద్యమంలో కట్టుబానిసత్వం నుంచి ఆర్థిక స్వాతంత్య్రానికి అద్దంపట్టిందన్నారు. ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఖ్యాతి గడించడం ఒక ముఖ్య విషయం అని ఆయన గర్వపడ్డారు. 1969లో ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసి, అందుకు కారణం పేద రైతుకి, శ్రామికుడికీ, కార్మికుడికీ ధనం అందుబాటులో ఉంచడమే అన్నారు. అప్పటి ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ కె. గోపాల రావు దీటుగా 50 ఏళ్ల క్రితం మా ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ముందుచూపుతో, ఆ లక్ష్యాలతోనే ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించార’ని అన్నారు. ఆంధ్రా బ్యాంక్ చరిత్ర జాతీయ ఉద్యమంలో భాగం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సేవాభావానికి చిహ్నం. పవిత్రమైన ఆశయాలతో స్థాపితమై క్రమంగా జాతీయ స్థాయికి ఎదిగిన ఆంధ్రా బ్యాంక్ పేరుని మార్చడం ఆంధ్రులకు అవమానం. వ్యాసకర్త: ప్రొ‘‘ అయ్యగారి ప్రసన్నకుమార్, విశాఖపట్నం -
సీఎల్పీ విలీనంపై స్పీకర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన తాజా వ్యాజ్యంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన పైలట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె.సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఇదే తరహాలో దాఖలైన మరో రెండు వ్యాజ్యా లతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పటికే రిట్ దాఖలు చేశారు. ఈ కేసులో పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం ట్రిబ్యు నల్గా వ్యవహరించే మండలి చైర్మన్‌కు, ఇతర ప్రతి వాదులకు హైకోర్టు మంగళవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మండలిలో మాదిరిగా అసెంబ్లీలోనూ చేయనున్నారంటూ గత ఏప్రిల్ 29న కాంగ్రెస్ నాయకులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన కేసులోనూ అదే తరహా నోటీసులు శాసనసభ స్పీకర్, ఇతరులకు జారీ అయ్యా యి. బుధవారం జరిగిన తాజా రిట్‌ను కూడా ఉత్తమ్, భట్టిలే దాఖలు చేశారు. ఈ కేసులన్నింటినీ కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
టీఆర్ఎస్లో సీఎల్పీ.. త్వరలో వీలినం?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనానికి రంగం సిద్ధమైంది. మున్సిపల్, రెవెన్యూ కొత్త బిల్లుల ఆమోదం కోసం మే నెలలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోపే టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం పూర్తి కానుంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరికపై వారం రోజుల్లోపే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్సుంది. తర్వాత టీఆర్ఎస్లో సీఎల్పీ విలీన ప్రక్రియ వేగంగా పూర్తి కానుంది. దీనికి సంబంధించి అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎల్పీ విలీనానికి అవసరమైన న్యాయ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ విషయాన్ని ఇటీవలే ధ్రువీకరించారు. విలీనం ఖాయమని దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ మిగలరని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనానికి అవసరమైన అంశాలన్నీ పూర్తయినట్లేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రాష్ట్రంలో కొత్త రాజకీయానికి తెరలేవనుంది. తెలంగాణ అసెంబ్లీలో మొదటిసారిగా మజ్లిస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది. హైదరాబాద్ నగరానికి పరిమితమైన పార్టీగా భావించే మజ్లిస్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా కీలకపాత్ర పోషించనుంది. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం తర్వాత మజ్లిస్‌కు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు మిగలనున్నారు. సీఎల్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ సభ్యుల బలం ఇంకా తగ్గే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. లెక్కలన్నీ పక్కాగా వేసుకుని 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో రెండోసారి అధికారం చేపట్టింది. టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, మజ్లిస్ 7, టీడీపీ 2, బీజేపీ 1, ఏఐఎఫ్బీ 1, స్వతంత్ర అభ్యర్థిæ ఒకచోట గెలిచారు. ఫలితాల అనంతరం ఏఐఎఫ్బీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర ఎమ్మెల్యే లావుడ్య రాములునాయక్ (వైరా) టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస మొదలైంది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితారెడ్డి, బానోత్ హరిప్రియానాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రె రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యే చేరికకు రంగంసిద్ధమైంది. నలుగురు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఇద్దరు చేరతారని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడిన వెంటనే టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి కానుంది. కాంగ్రెస్‌ను వీడుతున్న 13 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీనంపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఉమ్మడిగా లేఖ ఇవ్వనున్నారు. వెంటనే దీనిపై స్పీకర్ ప్రకటన జారీ చేయనున్నారు. అనంతరం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఆరుకు తగ్గనుంది. దీంతో సభలో ఏడుగురు సభ్యులున్న మజ్లిస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది. నిబంధనల ప్రకారం మజ్లిస్‌కు అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకున్నా.. సంఖ్యా బలం ప్రకారం ప్రధాన ప్రతిపక్షంగా మారనుంది. ఇంటర్ వివాదం నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ముందే సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తూ వచ్చారు. అయితే ఇంటర్మీడియట్ మార్కుల వివాదం నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలను కొన్ని రోజులు వాయిదా వేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ వివాదం విషయం సద్దుమణిగిన తర్వాతే సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలలోపే సీఎల్పీ విలీనం జరిగి.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరం కానుంది. టీడీపీ సైతం.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ శాసనసభాపక్షాన్ని సైతం టీఆర్ఎస్లో విలీనం దిశగా అధికార పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే ప్రకటించారు. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా మరో ఎమ్మెల్యేను చేర్చుకునేలా టీఆర్ఎస్ ఏర్పా ట్లు చేస్తోంది. ఇద్దరు ఒకేసారి చేరడంతో టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసే అవకాశముంది. దీనికి అనుగుణంగానే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికీ అధికారికంగా తమ పార్టీలో చేరలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
వొడాఫోన్ లాభం రూ. 9,805 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియా కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,805 కోట్ల నిర్వహణ లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.30,690 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయని వొడాఫోన్ తెలిపింది. ఐడియా సెల్యులార్తో విలీనం వచ్చే నెల కల్లా పూర్తవ్వగలద ని అంచనాలున్నాయని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ కొలావో పేర్కొన్నారు. బహుశా ఇవే తమ చివర స్టాండలోన్ ఫలితాలు కావచ్చని వ్యాఖ్యానించారు. 86 శాతం తగ్గిన డేటా చార్జీలు... టారిఫ్‌ల యుద్దం తమపై తీవ్రంగానే ప్రభావం చూపించిందని కొలావో అంగీకరించారు. మొబైల్ టర్మినేషన్ చార్జీలను తగ్గించడం మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని తెలిపారు. 2016–17లో రూ.42,927 కోట్లుగా ఉన్న సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 19 శాతం క్షీణించి రూ.35,045 కోట్లకు పడిపోయిందని వివరించారు. తీవ్రమైన పోటీ కారణంగా డేటా చార్జీలు 86 శాతం తగ్గాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో కోటి మంది కొత్త వినియోగదారులు లభించారని, దీనికి చాలా ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. ఇదే క్వార్టర్లో 5.76 లక్షల పోస్ట్–పెయిడ్ వినియోగదారులను కోల్పోయామని తెలిపారు. -
ఆ ఏడు గ్రామాలకు పట్టణ శోభ!
శివారు గ్రామాలకు ఇక పట్టణ శోభ రానుంది. త్వరలోనే ఈ పంచాయతీలు పురపాలక శాఖ పరిధిలో చేరనున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలు కొత్తగా ఏర్పాటయ్యే నగర పంచాయతీ/మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ మేరకు ప్రతిపాదిత నగర పంచాయతీల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. స్థానిక శాసనసభ్యుల సూచనలకు అనుగుణంగా జాబితాను ఖరారు చేసిన అధికారులు.. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగరీకరణ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిని అనుకొని ఉన్న పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులు.. గ్రేటర్లో కలపడం తగదని స్పష్టం చేశారు. ఈ గ్రామాలను నగర పంచాయతీ లేదా మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాతే గ్రేటర్లో కలిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎమ్మెల్యేల అభిప్రాయంతో ఏకీభవించిన మంత్రి కేటీఆర్.. గ్రేటర్లో విలీనం చేయాలనే యోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఇప్పటికే నగరంలో అంతర్భాగమైన గండిపేట మండలంలోని మణికొండ, పుప్పాల్‌గూడ మినహా మిగతా పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలపడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలనాపరంగా, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగాలంలే ఇది తప్పనిసరి అని తేల్చిచెప్పారు. కొత్త నగరపంచాయతీ/మున్సిపాలిటీల ఏర్పాటుపై మంగళవారంలోగా ప్రతిపాదనలు అందజే యాలని శాసనసభ్యులకు కేటీఆర్ సూచించారు. దీని కి అనుగుణంగా ప్రతిపాదిత నగర పంచాయతీలు, వాటి పరిధిలోకి వచ్చే గ్రామాల కూడిన జాబితాను పంపారు. కొత్తగా ఏడు మున్సిపాలిటీలు ప్రభుత్వ తాజా నిర్ణయానికి అనుగుణంగా జిల్లాలో కొత్తగా ఏడు నగర పంచాయతీలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గండిపేట/బండ్లగూడ, తుర్కయంజాల్, తుక్కుగూడ, ఆదిబట్ల/కొంగరకలాన్, శంషాబాద్, శంకర్పల్లి, ఆమనగల్లు పురపాలక సంఘాలుగా మారే వీలుంది. ఇవేగాకుండా కొత్తూరును నగర పంచాయతీగా మార్చే అంశంపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సమీప గ్రామాలను కలిపినా.. నిర్దేశిత జనాభా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తోంది. గండిపేట మండలం కేవలం మణికొండ, పుప్పాల్‌గూడ మాత్రమే జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని, మిగతా గ్రామాలన్నింటిని కలుపుతూ గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ఖానాపూర్, వట్టినాగుపల్లి, గండిపేట గ్రామాలు ఔటర్ రింగ్‌రోడ్డు అవతల ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మ్యాపుల తయారీలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. 48 గ్రామాలు ఉష్కాకి! కొత్త మున్సిపాలిటీలతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 48 గ్రామాలను పురపాలక శాఖలో విలీనం కానున్నాయి. గండిపేట, శంకర్పల్లి, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు మండలాల పరిధిలోని ఈ గ్రామాలు నగర పంచాయతీల సరసన చేరనున్నాయి. కాగా, షాద్‌నగర్‌కు చేరువలో ఉన్న కొన్ని గ్రామాలను ఆ మున్సిపాలిటీలో చేర్చాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అయితే, గ్రామాల్లో ఇంకా 80శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున.. వాటి విలీనంపై పునరాలోచన చేస్తోంది. మరోవైపు తుర్కయంజాల్‌లో మునగనూరు చేరికపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భౌగోళికంగా పెద్దఅంబర్‌పేట, జీహెచ్ఎంసీకి దగ్గరగా ఉన్న ఈ గ్రామాన్ని యంజాల్ మున్సిపాలిటీలో ప్రతిపాదిస్తే స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సివస్తుందని యంత్రాంగం అంటోంది. నగర పంచాయతీల ఏర్పాటుపై శాస్త్రీయత ప్రశ్నిస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. తుర్కయంజాల్: రాగన్నగూడ, తుర్కయంజాల్, ఇంజాపూర్, మునగనూరు, తొర్రూరు, బ్రాహ్మణపల్లి, కమ్మగూడ, ఉమర్‌ఖాన్‌గూడ దాయర, కోహెడ, బండ్లగూడ లేదా గండిపేట: కిస్మత్పూర్, నార్సింగి, హైదర్షాకోట్, పీరంచెరువు, మంచిరేవుల, నెక్నాంపూర్, గండిపేట, వట్టినాగులపల్లి, ఖానాపూర్, బండ్లగూడ, హిమాయత్‌సాగర్, కోకాపేట్ కొంగర లేదా ఆదిబట్ల: బొంగ్లూరు, మంగల్‌పల్లి, కొంగరకలాన్, ఆదిబట్ల, పటేల్‌గూడ, రాందాస్‌పల్లి తుక్కుగూడ: మంకాల్, రావిర్యాల, తుక్కుగూడ, సర్దార్‌నగర్ శంషాబాద్: సాతంరాయి, చిన్నగొల్లపల్లి, ఊట్పల్లి, కొత్వాల్‌గూడ, శంషాబాద్, తొండుపల్లి శంకర్పల్లి: ఫతేపూర్, బుల్కాపూర్, సింగాపూర్, శంకర్పల్లి ఆమనగల్లు: ఆమనగల్లు, విఠాయిపల్లి -
143 స్కూల్స్ మూసివేత?
సర్కారు బడులకు మూసివేత ముప్పు ఉందా? రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నిర్ధిష్ట సంఖ్య కంటే విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలపై అధికారులు కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఆ బడుల జాబితాను జిల్లా విద్యాశాఖ రూపొందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా /కొత్తూరు: నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పాఠశాలల రేషనలైజేషన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య అతి తక్కువగా ఉన్న బడుల జాబితాను సిద్ధం చేయాలని ఇటీవల విద్యా శాఖ డైరక్టరేట్ నుంచి మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పది మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత బడులు, 30 మంది విద్యార్థులూ లేని ఉన్నత పాఠశాలల వివరాలు సేకరించాలని చెప్పారు. దీంతోపాటు నిర్ధిష్ట సంఖ్య కంటే విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్ల సమీపంలోని.. ప్రభుత్వ బడులు, వీటి మధ్య దూరం, భౌగోళికంగా ఉన్న అడ్డంకులు (జాతీయ రహదారులు, అడవులు తదితర), రవాణా సౌకర్యం, రోడ్డు సదుపాయం తదితర వివరాలు కావాలని కోరింది. ఈ మేరకు అన్ని మండలాల విద్యాధికారులు దాదాపు వారం రోజుల పాటు కసరత్తు చేసి సమగ్ర వివరాలను సంపాదించి జిల్లా విద్యాశాఖకు అందజేశారు. అక్కడ ఉన్నతాధికారులు జాబితాను తయారు చేసి పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు పంపినట్లు తెలిసింది. ‘సాక్షి’కి అందిన సమాచారం ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 143 స్కూళ్లు మూతపడనున్నట్టు తెలుస్తున్నది. ఉన్నత బడులకు ముప్పు లేనట్లే.. కొంతకాలంగా స్కూళ్ల హేతుబద్ధీకరణ చేపట్టాలన్న సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూనే ఉంది. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేక వ్యక్తమవుతుండడంతో వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో గతేడాది కూడా విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్ల వివరాలను విద్యాశాఖ సేకరించింది. తాజాగా వచ్చిన ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. గత నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని జాబితాను రూపొందించారు. దీని ప్రకారం మొత్తం 143 స్కూళ్లలో నిర్దిష్ట సంఖ్య కంటే తక్కువగా విద్యార్థులు ఉన్నారు. పదిలోపు విద్యార్థులు నమోదైన ప్రాథమిక పాఠశాలలు 92, ఇరవై మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 51 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న బడులను.. సమీప పాఠశాలల్లో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే ఇవన్నీ మూతపడే ప్రమాదం ఉంది. ఇక 30 విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలు ఒక్కటీ లేకపోవడం శుభపరిణామం. తప్పెవరిది? వివిధ కారణాల వల్ల ప్రభుత్వ బడుల్లో ఏటేటా ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. సర్కారు బడులపై సమాజంలో నమ్మకాన్ని కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమవడమూ ఓ కారణం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, ఇంగ్లిష్ మీడియాన్ని అన్ని స్కూళ్లలో పరిచయం చేయకపోవడం, మౌలిక వసతులు కొరత, కనీస సౌకర్యాల లేమి తదితర కారణాల వల్ల ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరమవుతున్నారు. మరోపక్క ప్రైవేటు స్కూళ్లు ఏడాదికేడాది కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలే తప్ప.. కార్యరూపం దాల్చడం లేదు. ఈ పరిణామాల తో ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ విద్యార్థులను సమీప బడుల్లో విలీనం చేసి, ఉపాధ్యాయులందరినీ ఆయా బడుల్లో సర్దుబాటు చేయాలన్న దిశగా సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి చర్యల వల్ల.. ఏళ్లుగా అక్షర జ్ఞానాన్ని పంచిన పాఠశాలలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. పాఠశాలల బలోపేతం దిశగా చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే విలీనమనే మాటే ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పది మంది విద్యార్థులలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు : 92 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు : 51 తాజాగా వచ్చిన ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. గత నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని జాబితాను రూపొందించారు. దీని ప్రకారం మొత్తం 143 స్కూళ్లలో విద్యార్థులు నిర్దిష్ట సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. -
మరిన్ని బ్యాంకుల విలీనం: క్యాబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పీఎస్‌యూ బ్యాంకుల విలీనానికి సూత్రప్రాయ అంగీకారం లభించింది. ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్మీట్లో వివరాలను వెల్లడించారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం, ఆర్థిక వృద్ది లక్ష్యాలతో బ్యాంకుల విలీనానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. చట్టప్రకారం, సెబి నిబంధనల ప్రకారం ఆయా బ్యాంకులు తగు చర్యలు తీసుకుంటాయని జైట్లీ ప్రకటించారు. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంకోసం ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని క్యాబినెట్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ విలీన ప్రక్రియకోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యామ్నాయ యంత్రాంగం చర్చలు నిర్వహిస్తుంది. ఎస్సెట్ క్వాలిటీ, మూలధన సంపద నిష్పత్తి, బ్యాంకుల లాభాలు, స్థానం ఆధారంగా ఈ విలీనం చోటు చేసుకోనుంది. మరోవైపు ఈ వార్తలతో స్టాక్మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభపడ్డాయి. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, దెనా బ్యాంక్, యూకో , కెనరా, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ కూడా హై పాయింట్ వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా ఇటీవలి నెలల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టనున్నబ్యాంకుల మెర్జర్ ప్రణాళికలపై చాలా అంచనాలు నెలకొన్నాయి. వేగవంతమైన ఆర్థిక విస్తరణకు మద్దతుగా విస్తృత బ్యాంకింగ్ రంగ సంస్కరణలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
‘మోదీ’ ఆశ పడ్డారు ...!
► విలీనంపై పన్నీరు వ్యాఖ్య ►పళనిస్వామితో ఫలితం శూన్యం ► అన్నీ నాటకాలే సాక్షి, చెన్నై : ముక్కలైన అన్నాడీఎంకే మళ్లీ ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ పడ్డారని అన్నాడిఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన సూచనతో విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నానని పేర్కొన్నారు. అయితే, అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా రాజకీయాల్లో రావొచ్చని, అయితే, ప్రజాభీష్టం మేరకే నాయకుడిగా అవతరించాల్సి ఉంటుందని రజనీ రాజకీయంపై వ్యాఖ్యానించారు. అన్నాడిఎంకే అమ్మతో ఇక, విలీనం ప్రసక్తే లేదని పురట్చి తలైవీ శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చర్చలకు ఎంపిక చేసిన కమిటీనీ కూడా రద్దుచేశారు. రెండు రోజుల క్రితం తాను తీసుకున్న నిర్ణయంపై బుధవారం మద్దతు నేతలు, ఎమ్మెల్యేలతో పన్నీరు సెల్వం చర్చించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సమీక్షించుకున్నారు. ఈసందర్భంగా విలీనం విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందంటే.. అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పన్నీరు స్పందించారు. మోదీ ఆశపడ్డారు : దివంగత నేతలు ఎంజియార్, అమ్మ జయలలిత చేతుల మీదగా మహా శక్తిగా అన్నాడిఎంకే అవతరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ముక్కలు కావడం వేదన కల్గించినా, పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. అమ్మ ఆశయ సాధనతో పాటుగా, ఆమె గతంలో తనకు అప్పగించిన బాధ్యతల మేరకు పార్టీని రక్షించుకునేందుకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోక తప్పలే దని వివరించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడిఎంకే ముందుకు సాగాలని, అవినీతి రహిత పాలన సాగాలంటే, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని మోదీ సూచించారని వివరించారు. అవినీతి అన్నది బయట పడ్డ పక్షంలో ప్రభుత్వం పని పడుతానన్న హెచ్చరికను సైతం ఆయన చేశారని పేర్కొన్నారు. అన్నాడిఎంకే ఒకే వేదికగా సాగాలని మోదీ ఆశ పడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తు చేశారు. నాటకాలు రక్తికట్టాయి విలీన నినాదంతో ప్రయత్నాలు సాగిన సమయంలో అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టాయని ఆరోపించారు. ప్రధానంగా తనను మోసం చేయడం, ఒంటరిని చేయడం, తన పేరుకు కళంకం తీసుకు రావడం లక్ష్యంగా ఆ నాటకాల్ని ఎంత అద్భుంతంగా అంటే, అంతగా...రక్తి కట్టించారని మండి పడ్డారు. విలీనానికి తాను మొగ్గు చూపినా, ఈ నాటకాలతో అస్సలు విషయాన్ని గ్రహించి వెనక్కు తగ్గక తప్పలేదని స్పష్టంచేశారు. శశికళ, దినకరన్ చెప్పినట్టుగానే పళని స్వామిలు నాటకాలు రచించారన్నది తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నాటకాల్లో కొన్ని ఆథ్యాత్మికంగాను, మరికొన్ని భావోద్వేగంగాను, ఇంకా చెప్పాలంటే, ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగాయని వివరించారు. దినకరన్ నాటకం నమ్మకాన్ని కల్గించ లేదని, పళని తృప్తి పరచలేదని ఎద్దేవా చేస్తూ, అందుకే విలీనంకు ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్నాడిఎంకే ముక్కులైనా కేడర్ చెల్లా చెదరు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన వైపు కింది స్థాయి కేడర్, ద్వితీయ శ్రేణి వర్గాలతో పాటుగా ప్రజలు ఉన్నారని, వారి వైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల బలం ఉందని వ్యాఖ్యానించారు. అందరూ తలా ఓ దిక్కున ఉన్నారేగానీ, మరో పార్టీలోకి వెళ్ల లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్నాడిఎంకే బలం అన్నాడిఎంకేదేనని, ఇతరులు ఎవ్వరూ కేడర్‌ను తమ వైపుకు తిప్పుకోవడం ఇక్కడ వీలు కాదన్నారు. రజనీ రాజకీయాలపై స్పందిస్తూ, ఎవరైనా రావొచ్చని, అయితే, ప్రజల ఆదరణ, అభిష్టం ఉంటే తప్ప, నాయకుడిగా ఎదగలేడని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై శరవణన్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఇందులో తమ వాళ్లెవ్వరూ లేరని అన్నారు. ముడుపుల వ్యవహారాల్ని ఉపేక్షించకూడదన్నారు. చివరగా, సంధించిన ప్రశ్నకు, చిన్నమ్మ శశికళ చేతిలో పళని స్వామి రిమోట్టే అంటూ, ఆమె కంట్రోల్లోనే ఇక్కడ వ్యవహారాలు సాగుతున్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు. -
దక్కని అనుగ్రహం
► కమలం పెద్దల అనుమతి నిరాకరణ ► చెన్నైకు దినకరన్ ► మద్దతు దారులతో భేటీ ► 33కు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ► పన్నీరుపై పళని వ్యంగ్యాస్త్రం ► నేడు మద్దతుదారులతో పన్నీరు భేటీ ► పది మంది ఎమ్మెల్యేల కొత్త నినాదం ► ఎయిమ్స్ మంజూరు చేయకుంటే రాజీనామా ► కేంద్రానికి మదురైలో హెచ్చరికలు సాక్షి, చెన్నై: బీజేపీ పెద్దల అనుగ్రహం టీటీవీ దినకరన్‌కు దక్కలేదు. నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్న ఆయన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు సంఖ్య తాజాగా 33కు చేరింది. ఇక, విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంపై సీఎం పళనిస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు పన్నీరు సెల్వం ఆదివారం మద్దతుదారుల భేటీకి పిలుపునివ్వడం గమనార్హం. కాగా మదురైకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. మదురైకు ఏయిమ్స్ మంజూరు చేయని పక్షంలో రాజీనామా చేస్తామని కేంద్రానికి హెచ్చరికలు పంపించారు. అన్నాడీఎంకే ఎపిసోడ్లో సాగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కంటూ ఓ గ్రూపు సిద్ధం చేసుకున్న ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఢిల్లీ పెద్దల అనుగ్రహం కోసం ప్రయత్నించి ఢీలా పడ్డారు. రెండు రోజులు ఢిల్లీలో తిష్ట వేసినా కమలం పెద్ద అనుమతి దక్కని దృష్ట్యా, నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్నారు. వచ్చి రాగానే, తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు సెంథిల్ బాలా జి, పళనియప్పన్ ఈ భేటీకి హాజరయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా 33కు చేరింది. ఒట్ట పిడారం ఎమ్మెల్యే సుందరరాజన్ దినకరన్‌కు జై కొట్టారు. ఇక, ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని అమ్మ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్‌ను ఉద్దేశించి జయలలిత మేన కోడలు, ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై నేత దీప ఆరోపించారు. దినకరన్‌కు మున్ముందు సంకట పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. శశికళ కుటుంబానికి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. విలీనంలో నాన్చుడు : విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంను ఉద్దేశించి సీఎం పళనిస్వామి పెదవి విప్పారు. సింహం, పులి, నక్క, తోడేలు అంటూ...మాతృగూటికి రావడానికి ఎందుకింత నాన్చుడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, సీఎంపై ఎదురు దాడి చేస్తూ పన్నీరు శిబిరం నేత మధుసూదనన్ స్పందించారు. ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ ఇంటి మెట్లు ఎక్కుతుంటే, వారించకుండా మౌనం వహించడం ఎందుకో అని ప్రశ్నించారు. నిజంగా దినకరన్‌ను బహిష్కరించి ఉంటే, ఆయన్ను కలిసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. అలాగే, మంత్రి జయకుమార్ నోటికి కల్లెం వేస్తే శ్రేయస్కరం అని హితవు పలికారు. ఇదిలా ఉండగా, విలీనం విషయంగా నిర్ణయాన్ని తీసుకునేందుకు పన్నీరు సిద్ధమైనట్టున్నారు. ఇందు కోసం ఆదివారం వేలప్పన్ చావడిలోని ఓ హాల్ వేదికగా మద్దతు నేతల సమావేశానికి పిలుపు నివ్వడం గమనార్హం. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీనామా నినాదం : బలం పెంపునకు దినకరన్, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు పళని, కుర్చీ కైవసానికి పన్నీరు ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో మదురై జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అటు కేంద్రానికి, ఇటు తమ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కొత్త నినాదంతో రాజీనామా హెచ్చరికలు చేయడం గమనార్హం. తంజావూరు చెంగి పట్టిలో ఎయిమ్స్ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే, మదురైలో ఏర్పాటుకు తొలుత నిర్ణయించిన ఎయిమ్స్ ఆసుపత్రి తంజావూరుకు తరలుతున్నట్టుగా వచ్చిన సమాచారంతో ఎయిమ్స్ సాధన లక్ష్యంగా రాజీనామా నినాదాన్ని పది మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందుకోవడం, ఈ ప్రకటనను స్వయంగా రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేయడం గమనించాల్సిన విషయం. -
అంగన్వాడీలపై కత్తి!
► హేతుబద్ధీకరణ ప్రక్రియ షురూ ► లబ్ధిదారులు 15 కంటే తక్కువగా ఉన్న కేంద్రాలకు ముప్పు ► సమీప కేంద్రాల్లో విలీనం దిశగా అడుగులు ► ఆ జాబితాలో 45 కేంద్రాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్లకే హేతుబద్ధీకరణ చూశాం. ఇదే విధానాన్ని అంగన్వాడీ కేంద్రాలకూ వర్తింపజేస్తున్నారు. ఫలితంగా నిర్దేశిత సంఖ్యలో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు నమోదుకాని అంగన్వాడీలను సమీపంలోని కేంద్రాల్లో విలీనం చేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 45 అంగన్వాడీ కేంద్రాలను హేతుబద్ధీకరణ గండం వెంటాడుతోంది. లబ్ధిదారులు 15మంది కంటే తక్కువగా నమోదైన కేంద్రాలను సమీపంలోని కేంద్రాలకు తరలిస్తారు. కనీసం 10మంది చిన్నారులు, మరో ఐదుగురు గర్భిణులు/బాలింతలు ఉంటే వాటిని కదిలించరు. అయితే, ఒకే కేంద్రం ఉన్న ఊళ్లకు హేతుబద్ధీకరణ వర్తించదు. అక్కడ నిర్దేశిత సంఖ్య కన్నా లబ్ధిదారులు తక్కువగా ఉన్నా యథావిధిగా కొనసాగిస్తారు. అయితే జిల్లాలోని చాలా పల్లెల్లో ఒకటికి మించి కేంద్రాలు ఉన్నాయి. జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో నాలుగు అంగన్వాడీలనూ నెలకొల్పారు. ప్రస్తుతం ఇటువంటి ప్రాంతాల్లోని కేంద్రాలకే ముప్పు పొంచి ఉంది. ఏ కేంద్రమూ చిన్నారులతో కళకళలాడడం లేదు. పట్టుమని పదిమంది కూడా కేంద్రాల్లో నమోదు కావడం లేదని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా కేంద్రాలపై దృష్టి సారించి... హేతుబద్ధీకరణ అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జిల్లా సంక్షేమాధికారికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో 1,600 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అనుబంధ పోషకాహారం, వ్యాధినిరోధక టీకాలు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందుతోంది. గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం అందజేస్తున్నారు. తద్వారా జిల్లాలో 1.56లక్షల మంది చిన్నారులు, 26,861 మంది గర్భిణీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. అయితే చాలా అంగన్వాడీ కేంద్రాల్లో వారి సందడి కనుమరుగైంది. రోజురోజుకీ కేంద్రాల్లో నమోదవుతున్న వారి సంఖ్య క్రమంగా పడిపోతోంది. జిల్లాలో 421 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. లబ్ధిదారులు ఈ కేంద్రాలకు వెళ్లకున్నా ప్రతినెలా ఈ కేంద్రాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా కేంద్రాల నిర్వహణ భారం తప్పడం లేదు. ఈ క్రమంలో స్పందన పెద్దగా లేని కేంద్రాల్లో కోత పెడితే .. కొంతైనా ప్రభుత్వంపై ఆర్థిక భారం తప్పుతుందని ఆలోచన చేస్తోంది. అంతేగాక జిల్లాలో ఆయా కేంద్రాలను అంగన్వాడీ టీచర్లు, ఆయాల కొరత వేధిస్తోంది. ఈ జాబితాలో లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కేంద్రాలూ ఉన్నాయి. ఇదే తరుణంలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే జరిగితే తక్కువ సంఖ్య ఉన్న కేంద్రాల్లోనూ నియామకాలు జరుగుతాయి. తద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారమే. అయితే భర్తీ ప్రక్రియ మొదలు కాకముందే లబ్ధిదారులు తక్కువగా ఉన్న అంగన్వాడీలను సమీపంలోని కేంద్రాల్లో విలీనం చేయాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఖాళీల లెక్క తేల్చనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైతే టీచర్ల బదిలీలు చేపట్టే అంశమూ వారి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మండల స్థాయి కమిటీలు.. లబ్ధిదారులు తక్కువగా ఉన్న కేంద్రాల వివరాలను న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం (ఎన్‌హెచ్‌టీఎస్) ద్వారా సేకరించారు. గతేడాది డిసెంబర్ నుంచి గతనెల వరకు హాజరు వివరాలను పరిగణనలోకి తీసుకుని 15 మందికి తక్కువగా నమోదవుతున్న అంగన్వాడీల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలను సమీపంలోని అంగన్వాడీల్లో విలీనం చేసే బాధ్యతలను మండల స్థాయి అంగన్వాడీ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీకి ఎంపీడీఓ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్థానిక ఎంఈఓ, సీడీపీఓ, అంగన్వాడీ సూపర్వైజర్ సభ్యులుగా ఉంటారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి.. హేతుబద్ధీకరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించుకున్నారు. -
ఇటా.. అటా..
విలీన ‘పంచాయితీ’ - ఎటపాక మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలపై గందరగోళం - తమకే దక్కుతాయంటున్న తెలంగాణ ప్రభుత్వం - ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు - సానుకూలంగానే ఉన్న కేంద్రం? నెల్లిపాక : రాష్ట్ర విభజన చిక్కులు ఎటపాక మండలాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 21 పంచాయతీలకు ఎటపాకను మండల కేంద్రంగా ప్రకటించడంతోపాటు విలీన మండలాలకు డివిజన్ కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి రెండేళ్లు కావస్తోంది. విభజన జరిగినప్పటి నుంచి నేటివరకూ ఈ ప్రాంతం అనేక సమస్యలతో సతమతమవుతనే ఉంది. కొన్నాళ్ల నుంచి మండల వాసులను మరో సమస్య వెంటాడుతోంది. భద్రాచలం పట్టణానికి సమీపాన ఉన్న ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్టణం, గుండాల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఐదింటినీ తిరిగి తెలంగాణలో కలపనున్నారనే చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ç ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు అనేకసార్లు చెప్పారు కూడా. ఈ ఐదు పంచాయతీలూ తెలంగాణలో తిరిగి విలీనం కానున్నాయని, ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణ సమస్య ఇదీ.. - ఎటపాక మండలంలోని ఈ ఐదు పంచాయతీలను తెలంగాణ పరిధిలోకి తీసుకురావడం ద్వారానే భద్రాచలం అభివృద్ధి సాధ్యపడుతుందన్నది ఆ రాష్ట్ర పాలకుల అభిప్రాయం. - ఈ ఐదు పంచాయతీల పరిధిలో 20 గ్రామాలున్నాయి. సుమారు 14 వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామాల జనాభా 15,041. - భద్రాచలం నుంచి తెలంగాణ ప్రాంతమైన దుమ్ముగూడెం వెళ్లాలంటే పట్టణానికి ఆనుకుని ఉన్న ఏపీలోని ఎటపాక మీదుగా కన్నాయిగూడెం దాటి 8 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ మార్గంలో భద్రాచలం నుంచి ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ పరిధిలోని రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే తెలంగాణ వాసులకు రహదారి సమస్య తలెత్తనుంది. - అంతేకాకుండా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 900 ఎకరాల భూమి ఈ పంచాయతీల్లో ఒకటైన పురుషోత్తపట్టణంలోనే ఉంది. రాముడు తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో ఉండటం ఆ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందనేది వాదన. - భద్రాచలం పట్టణానికి ఓపక్క గోదావరి నది ఉంది. పట్టణం అభివృద్ధి చెందాలంటే రెండోపక్కనే జరగాలి. కానీ, ఇటువైపు ఉన్న ప్రాంతం ఏపీలో ఉంది. ఇది పట్టణాభివృద్ధికి అవరోధంగా మారింది. - వీటన్నింటి నేపథ్యంలో ఈ ఐదు పంచాయతీలను తిరిగి కలుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఆంధ్రా సమస్య ఏమిటంటే.. - పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దున ఉన్న అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట (కొంత భాగం), నారాయణపురం, గుమ్మడవల్లి, ఆసుపాక, ఊట్లపల్లి గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి. దీనివలన ఏపీకి రహదారి సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. - ఈ కారణంగా ఈ ఐదు పంచాయతీలను ఏపీలో కలుపుకొని, ఎటపాక మండలంలోని ఐదు పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. - మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు మండలం నుంచి ఐరన్ ఓర్‌ను తరలించాలంటే తెలంగాణలోని ఐదు పంచాయతీల మీదుగానే వెళ్లాలి. అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే ఏపీ నుంచి వెళ్లే వాహనాలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. - ఈ కారణాలతో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునేవిధంగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. - ఈ సమస్యపై ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నారు. - ఇదే నిజమైతే ఎటపాక మండలం కేంద్రం మళ్లీ నెల్లిపాకగా మారనుంది. - ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతుందనుకుంటున్న తరుణంలో ఈ సమస్య ముందుకు రావడంతో పాలన తిరిగి కుంటుపడే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
-
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
తమిళనాట వేడిక్కిన రాజకీయం చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు విలీనం కానున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి చకచకా సాగిన పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. రెండు వర్గాల మధ్య విలీన చర్చలపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం మాట్లాడిన అనంతరం... సోమవారం ఉదయం కేబినెట్ మంత్రులతో సీఎం పళనిస్వామి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాత్రి బాగా పొద్దుపోయాక తమిళనాడు సీనియర్ మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. గ్రీన్‌వేస్ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో చర్చలు కొనసాగాయి. ఈ భేటీలో శశికర, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై చర్చించారు. భేటీ అనంతరం డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన విధివిధానాలు, సమైక్యంగా పార్టీని ముందుకు నడపడంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. విలీనంపై పన్నీర్‌సెల్వం ఆలోచనను భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్వాగతించారని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ వెల్లడించారు. అమ్మ పాలన కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే అందరి అభిప్రాయమన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్ దినకరన్ బెంగళూరులో ఉన్నందున తిరిగివచ్చాక ఈ అంశంపై ఆయనతో చర్చిస్తామని న్యాయ శాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. -
పశ్చిమలోకి అశ్వారావుపేట
జంగారెడ్డిగూడెం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన అనంతరం వాటి సరిహద్దు ప్రాంతాల్లో భౌగోళికంగా ఏర్పడిన సమస్యలను సరిచేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. సరిహద్దు గ్రామాల మార్పు, చేర్పులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలు పంపించినట్టు అధికార వర్గాల భోగట్టా. ఇందుకు కేంద్రం అనుమతి ఇస్తే మన జిల్లాతోపాటు పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం మారుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న అశ్వారావుపేట, ఆ మండల పరిధిలోని ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేలా.. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుందని సమాచారం. సమస్యల పరిష్కారానికే.. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు మన జిల్లాలో విలీనమయ్యాయి. అయితే, కుక్కునూరు నుంచి జీలుగుమిల్లి వరకు గల ప్రధాన రహదారి, దానిని ఆనుకుని ఉన్న గ్రామాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. కుక్కునూరు చేరుకోవాలంటే.. తెలంగాణ పరిధిలోగల అశ్వారావుపేట, ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితి వాహనాల రాకపోకలు, రెవెన్యూ విషయాల్లో సరిహద్దు సమస్యలకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా ఆ ఐదు గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇందుకు ప్రతిగా.. తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. జాతీయ రహదారి సమస్య ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులు సక్రమంగా లేకపోవడంతో జాతీయ రహదారి సమస్య కూడా తలెత్తింది. భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు గల ప్రధాన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించింది. భద్రాచలం, కుక్కునూరు ప్రాంతాల్లోని రహదారి మినహా అశ్వారావుపేట వరకు గల మార్గమంతా తెలంగాణలో ఉంది. అంతేగాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన అశ్వారావుపేట, వినాయకపురం, నారాయణపురం, ఆసుపాకల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఒక రాష్ట్రంలోని గ్రామాలకు మరో రాష్ట్ర సరిహద్దులను దాటుకుని వెళ్లాల్సి రావడంతో çసమస్య తలెత్తుతోంది. నియోజకవర్గం ఏర్పాటులోనూ.. నియోజకవర్గం ఏర్పాటు విషయంలోనూ సమస్యలు తలెత్తడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు, గ్రామాలను పరస్పరం మార్చుకునేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే విలీన మండలాలు, కొత్తగా కలిసే మండలాలు, గ్రామాలతో మన జిల్లా నైసర్గిక స్వరూపం మారుతుంది. -
వరల్డ్ టాప్-50 బ్యాంకులోకి ఎస్బీఐ
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రపంచంలోనే అతిపెద్ద టాప్-50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. 2017 ఏప్రిల్ 1 తనకు చరిత్రలో నిలిచిపోయే విధంగా అనుబంధ బ్యాంకులు ఐదింటినీ నేడు తనలో విలీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించేసింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనెర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్(ఎస్బీఐ), స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్(ఎస్బీఎం), స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా(ఎస్బీపీ), స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్(ఎస్బీటీ)లను నేటి నుంచి తనలో విలీనం చేసుకుంటున్నట్టు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ మహిళా బ్యాంకు విలీనాన్ని ప్రభుత్వం అంతకముందే చేపట్టింది. ఈ విలీనంతో ఆస్తుల పరంగా టాప్-50 గ్లోబల్ బ్యాంక్స్ లో ఒకటిగా చోటు దక్కించుకోబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రక్రియతో 37 కోట్ల కస్టమర్ బేస్ ను, దాదాపు 24వేల బ్రాంచుల నెట్ వర్క్, సుమారు 59వేల ఏటీఎంలు తన సొంతం కానున్నట్టు తెలిపింది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ కంటే 5 రెట్లు పెద్ద బ్యాంకుగా ఎస్బీఐ అవతరిస్తోంది. 2008లో మొదటిసారి ఎస్బీఐ స్టేట్ బ్యాంకు ఆఫ్ సౌరాష్ట్రను తనలో విలీనం చేసుకుంది. రెండేళ్ల తర్వాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండోర్ ను కలుపుకుంది. పూర్తిగా వ్యవస్థలన్నింటిన్నీ ఏకీకృతం చేయడానికి రెండు నెలలు పడుతుందని ఎస్బీఐ చెబుతోంది. -
తీరనున్న ‘అనుబంధం’
► ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం ► రేపటి నుంచి కనుమరుగుకానున్న ఎస్బీహెచ్ ► రెండింటిలో ఖాతా ఉంటే ఒకటే చెల్లుబాటు ► మూడు మాసాల వరకు కొంత వెసులుబాటు ఆసిఫాబాద్ : ఖాతాదారులకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో ఇక అనుబంధం తీరనుంది. ఇప్పటివరకు ఎస్బీఐతో అనుబంధం కలిగి ఉన్న బ్యాంకులన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి ఎస్బీఐలో విలీ నం కానున్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ uమొదటిపేజీ తరువాయి ఇండియా అతి పెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఎస్బీఐ అభ్యర్థన మేరకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ బ్యాంకు తన పరిధిలోని అనుబంధ బ్యాంకులను ఏప్రిల్ ఒకటి తర్వాత విలీ నం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. శనివారం నుంచి జిల్లాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనే బోర్డులు ఎక్కడా కనిపించవు. ఈ బ్యాంకులన్నీ యథావిధిగా లావాదేవీలు నిర్వహించనున్నప్పటికీ ఎస్బీఐ పేరుతో కొనసాగనున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో అత్యధిక బ్రాంచీలు కలిగి ఉన్న ఎస్బీఐకి విలీనానికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే వచ్చాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో చెస్ట్ బ్రాంచిలున్నాయి. ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బె న, వాంకిడి మండలాల్లోని బ్యాంకులకు ఆసిఫాబాద్ కంట్రోలింగ్ కేంద్రంగా, కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని బ్యాంకులకు కాగజ్‌నగర్ బ్యాంకులు కంట్రోలింగ్ కేంద్రంగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక బ్యాంకుల విలీనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగి ఖాతాదారులకు సేవలందిస్తున్న ప్రభుత్వ జాతీయ బ్యాంకు. ఈ బ్యాంకు కాలానుగుణంగా స్థానికతను దృష్టిలో పెట్టుకొని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్(ఎస్‌బీటీసీ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనూర్అండ్జైపూర్(ఎస్‌బీబీజే) బ్యాంకులను ఏర్పాటు చేసింది. అయితే దేశవ్యాప్తంగా అతిపెద్ద బ్యాంకుగా అవతరించడంతోపాటు ఎస్బీఐ పేరుతోనే చలామణి కావడానికి స్థానిక బ్యాంకులతో విలీనం చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కేంద్ర శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)తోపాటు కేంద్ర ప్రభుత్వానికి స్థానిక బ్యాంకుల విలీనంపై అప్పీల్ చేసింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత నెల రోజులుగా ఎస్బీహెచ్లో ఖాతా ఉన్న వ్యక్తులకు ఎస్బీఐలో కొత్త ఖాతా తెరిచేందుకు బ్యాంకు అధికారులు అనుమతించడం లేదు. దీంతో బ్యాంకుల విలీనంతో తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనున్నాయోనన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. రేపటి నుంచి ఎస్బీఐ పేరుతోనే దేశవ్యాప్తంగా ఐదు బ్యాంకులను విలీనం చేయాలని భావించిన ఎస్బీఐ ఏప్రిల్ ఒకటి నుంచి విలీన ప్రక్రియ ప్రారంభించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఎస్‌బీహెచ్‌కు 44 బ్రాంచిలు, ఎస్బీఐకి 14 బ్రాంచిలు ఉన్నాయి. సుమారు 15లక్షల ఖాతాదారులు ఉన్నారు. బ్యాంకుల విలీనంతో నెట్వర్క్ పెరగడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు సేవలు మెరుగుపడే అవకాశాలున్నాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఈ బ్యాంకులన్నీ యథాతథంగా ఉన్నా, నియంత్రణ మాత్రం ఎస్బీఐ నుంచి మాత్రమే జరగనుంది. ఏదైనా ఒకే అకౌంట్.. రెండు బ్యాంకుల విలీనంతో ఒక వినియోగదారుడికి ఎస్బీహెచ్, ఎస్బీఐ రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే, ఏదైనా ఒకే బ్యాంకు ఖాతా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొందరు వినియోగదారులకు రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉండగా..రెండింటిలోనూ లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఇక మీదట ఏదైనా ఒకే అకౌంట్ ఉంచుకోవల్సి వస్తుంది. దీంతో రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా వినియోగదారులు లావాదేవీలు జరిపేందుకు ఏదైనా ఒక ఖాతాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఎంఐసీఆర్ కోడ్ నంబర్ మూడు మాసాల వరకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత కొత్త కోడ్ నంబర్ కేటాయించనున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి విలీనం దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఒకే బ్యాంకుగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి విలీన విషయమై అప్పీల్ చేయగా, అంగీకారం వచ్చింది. దీంతో ఏప్రిల్ ఒకటి నుంచి జిల్లాలోని ఎస్బీహెచ్ బ్యాంకులన్నీ ఎస్బీఐలో విలీనం కానున్నాయి. అయినా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మెరుగైన సేవలందనున్నాయి. – కృష్ణమాచారి, బ్రాంచి మేనేజర్, ఎస్బీహెచ్, ఆసిఫాబాద్ -
టెలికం 'బాహుబలి' వస్తోంది..!
⇒ ఐడియా–వొడాఫోన్ విలీనానికి ఓకే ⇒ పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం... ⇒ విలీనం కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ⇒ ఐడియాకు 26% వాటా... మిగిలింది ఇన్వెస్టర్ల చేతిలో ⇒ 43% మార్కెట్ వాటా.. 40 కోట్ల మంది కస్టమర్లు... ⇒ చైర్మన్ బాధ్యతలు కుమార మంగళం బిర్లా చేతికి ⇒ నియంత్రణ పగ్గాలు ఇరు గ్రూప్‌ల చేతిలో... ముంబై: దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి లైన్‌క్లియర్ అయింది. బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్ విలీనం అవుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. తమ డైరెక్టర్ల బోర్డులు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయని ఇరు గ్రూప్‌లు పేర్కొన్నాయి. దీంతో విలీనం ద్వారా ఏర్పాటయే కొత్త కంపెనీ అటు ఆదాయ మార్కెట్ వాటా, కస్టమర్ల సంఖ్య పరంగా దేశీయంగా అగ్రగామి టెల్కోగా అవతరించనుంది. పూర్తిగా షేర్ల రూపంలో కుదిరిన ఈ డీల్ రెండేళ్లలోపు పూర్తికావచ్చని భావిస్తున్నారు. డీల్ స్వరూపం ఇదీ... షేర్ల లావాదేవీ రూపంలో విలీనం ఉంటుంది. విలీనం ద్వారా ఏర్పడే కొత్త కంపెనీలో వొడాఫోన్ ఇండియా, దాని పూర్తిస్థాయి అనుబంధ సంస్థ వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లు కలిసిపోతాయి. ఐడియా సెల్యులార్ వొడాఫోన్‌కు కొత్తగా షేర్లను జారీ చేస్తుంది. తద్వారా వొడాఫోన్ ఇండియా ప్రత్యక్షంగా భారత్ కార్యకలాపాల నుంచి వైదొలగుతుంది. విలీనం తర్వాత ఆవిర్భవించే కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ఉంటుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ వొడాఫోన్ ఇండియాకు చెందిన 4.9 శాతం వాటాను రూ.3,874 కోట్ల మొత్తానికి దక్కించుకోవడం ద్వారా కొత్త కంపెనీలో వొడాఫోన్ వాటా తగ్గనుంది. దీనిప్రకారం విలీన సంస్థలో ఐడియాకు 26 శాతం వాటా లభిస్తుంది. మిగతా వాటా ఇతర వాటాదారుల(పబ్లిక్) చేతిలో ఉంటుంది. కాగా, విలీన కంపెనీ నియంత్రణను వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌లు సంయుక్తంగా చేపడతాయి. కొత్త కంపెనీకి చైర్మన్‌గా కుమార మంగళం బిర్లా వ్యవహరించనున్నారు. వొడాఫోన్ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) నామినీగా ఉంటారని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ విటోరియో కొలావో... బిర్లా సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. రానున్న కాలంలో విలీన సంస్థలో ఇరు గ్రూపుల వాటా సమాన స్థాయికి చేరుతుందని బిర్లా, కొలావో పేర్కొన్నారు. తద్వారా వొడాఫోన్ భారత్ నుంచి క్రమంగా వైదొలగుతుందన్న సంకేతాలిచ్చారు. కాగా, ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు ఉన్న 42 శాతం వాటా ఈ విలీన ఒప్పందంలోకి రాదు. భారతీ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు కలిపి ఇండస్ టవర్స్‌ను ఏర్పాటు చేశాయి. బిర్లా గ్రూపునకు మరింత వాటా... కొత్తగా ఆవిర్భవించే విలీన సంస్థలో మరింత వాటాను కొనుగోలు చేసే హక్కు ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు ఉంటుందని.. కొంతకాలానికి ఇరు గ్రూప్‌ల వాటా సమానమవుతుందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందంలో అంగీకరించిన ఈ యంత్రాంగం ప్రకారం.. నాలుగేళ్ల తర్వాత బిర్లా గ్రూప్ వాటాను పెంచుకోవడం మొదలుపెడుతుందని కొలావో చెప్పారు. అప్పటినుంచి ఐదేళ్ల వ్యవధిలో వొడాఫోన్ షేర్లను విక్రయిస్తుందన్నారు. షేరు ఒక్కంటికి రూ.130 చొప్పున 9.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు బిర్లా గ్రూపునకు అవకాశం ఉంటుంది. వాటా సమానమయ్యేవరకూ వొడాఫోన్‌కు ఉన్న అదనపు షేర్లకు సంబంధించి ఓటింగ్ హక్కులకు ఆస్కారం ఉండదు. ఇరు గ్రూప్‌లూ సంయుక్తంగానే ఓటింగ్ హక్కు లను కలిగిఉంటాయని ప్రకటన తెలిపింది. విలీనం ద్వారా నాలుగో ఏడాది నుంచి వార్షికంగా 2.1 బిలియన్ డాలర్లమేర వ్యయాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. విలీనం సాహసోపేత నిర్ణయం: సీఓఏఐ వొడాఫోన్–ఐడియాల విలీనాన్ని సాహసోపేతమైన చర్యగా సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) అభివర్ణించింది. విలీనం ద్వారా ఆవిర్భవించే పటిష్ట కంపెనీ వల్ల అటు ప్రభుత్వానికి.. ఇటు దేశీ టెలికం మార్కెట్‌కూ ప్రయోజనం చేకూరుతుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ‘ఇరు కంపెనీలూ చాలా సాహసంతో నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో అత్యంత బలోపేతమైన టెల్కో ఆవిర్భవించడం వల్ల ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అత్యున్నత స్థాయి టెలికం నెట్వర్క్ ఆసరాతో వినియోగదారులకూ మేలు చేకూరుతుంది. వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ విలీనానికి సాధ్యమైనంత త్వరగా నియంత్రణపరమైన అనుమతులు లభిస్తాయని భావిస్తున్నాం’ అని మాథ్యూస్ పేర్కొన్నారు. జియో దెబ్బతో... దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో సంచలన అరంగేట్రం తర్వాత విలీనాలు, కొనుగోళ్లు జోరందుకున్నాయి. మొట్టమొదటిగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో సిస్టెమా శ్యామ్, ఎయిర్‌సెల్‌ల విలీనంతో దీనికి తెరలేచింది. ఆర్వాత వొడాఫోన్–ఐడియా విలీనం తెరపైకి వచ్చింది. కాగా, భారతీ ఎయిర్టెల్ కూడా ఈ రేసులో తాను ఉన్నానంటూ ఇటీవలే నార్వే టెలికం సంస్థ టెలినార్ ఇండియాను విలీనం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విలీనం పూర్తయితే... ఎయిర్టెల్ టెలికం యూజర్ల సంఖ్య 30 కోట్ల మార్కును అధిగమిస్తుంది. అదేవిధంగా మార్కెట్ వాటా కూడా 35 శాతానికి చేరుతుంది. అయినప్పటికీ.. వొడాఫోన్–ఐడియా విలీన సంస్థ తర్వాత రెండో స్థానానికే పరిమితం కావాల్సి వస్తుంది. కాగా, ఇటీవలే టాటా టెలీతో జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమో దీర్ఘకాల వివాదానికి కోర్టు వెలుపల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో టాటా టెలీ నుంచి డొకోమో వైదొలిగేందుకు మార్గం సుగమమైంది. మొత్తమ్మీద ఇప్పుడు భారత్‌కు దాదాపు విదేశీ టెలికం కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా గుడ్‌బై చెప్పేస్తున్నట్లు కనబడుతోంది. కాగా, భారత్‌కు నాలుగైదు పెద్ద టెల్కోలు ఉంటే సరిపోతుందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా విలీనాలకు అనుకూలంగా సంకేతాలివ్వడం గమనార్హం. నంబర్ వన్ స్థానానికి... ⇔ ట్రాయ్ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి వొడాఫోన్‌కు ఇండియాలో 20.46 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఉంది. మార్కెట్ వాటా 18.16 శాతంగా ఉంది. ⇔ ఇక ఐడియా సెల్యులార్ 16.9 శాతం మార్కెట్ వాటా, 19.05 కోట్లమంది యూజర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ⇔ భారతీ ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 26.58 కోట్లు కాగా, ఆదాయంలో మార్కెట్ వాటా 33 శాతం. ఆదాయం, కస్టమర్ల సంఖ్య పరంగా ప్రస్తుతం ఎయిర్టెల్ నంబర్ వన్ ర్యాంకులో ఉంది. ⇔ అయితే, ఇప్పుడు ఐడియా–వొడాఫోన్ విలీనంతో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టేసి టాప్ ర్యాంకును చేజిక్కించుకోనుంది. ఈ విలీన సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య దాదాపు 40 కోట్ల మందికి చేరనుంది. మొత్తం దేశీ టెలికం యూజర్ల సంఖ్యలో ఇది 40 శాతం. ⇔ బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం.. విలీనం సంస్థ ఆదాయం రూ.80,000 కోట్లుగా ఉంటుంది. ఆదాయంపరంగా దేశీ టెలికం పరిశ్రమలో 43 శాతం మార్కెట్ వాటా దీని సొంతం అవుతుంది. దీంతో నంబర్ వన్ కంపెనీగా ఆవిర్భవిస్తుంది. ⇔ విలీనం ఒప్పందం ప్రకారం వొడాఫోన్ ఇండియా ఎంటర్ప్రైజ్ విలువ రూ.82,800 కోట్లు(12.4 బిలియన్ డాలర్లు)గా లెక్కతేలుతోంది. ఇక ఐడియా విలువ రూ.72,200 కోట్లు(10.8 బిలియన్ డాలర్లు)గా అంచనా వేసినట్లు ఐడియా సెల్యులార్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. ⇔ వొడాఫోన్ ఇండియా, ఐడియాలకు డిసెంబర్ 2016 నాటికి రూ.1.07 లక్షల కోట్ల రుణ భారం ఉంది. ⇔ విలీన సంస్థకు సంయుక్తంగా దేశంలో ఇప్పటిదాకా కేటాయించిన స్పెక్ట్రంలో 25 శాతానికిపైగా ఉంటుంది. అయితే, స్పెక్ట్రం పరిమితి నిబంధనల ప్రకారం దా దాపు 1 శాతం స్పెక్ట్రం(విలువ సుమారు రూ.5,400 కోట్లు)ను ఈ విలీన సంస్థ విక్రయించాల్సి ఉంటుంది. ⇔ విలీనం పూర్తయిన తర్వాత వొడాఫోన్ గ్రూప్ నికర రుణ భారం దాదాపు 8.2 బిలియన్ డాలర్ల మేర తగ్గుతుందని అంచనా. విలీనం ద్వారా ఆవిర్భవించే కొత్త కంపెనీకి 10 బిలియన్ డాలర్ల మేర విలువ చేకూరుతుంది. వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూపుల నుంచి చెరో ముగ్గురు ప్రతినిధులు బోర్డులో ఉంటారు. ఇరు బ్రాండ్ల పటిష్టతల దృష్ట్యా విడివిడిగానే కొనసాగుతాయి. విలీన ప్రక్రియలో కొత్తగా పన్ను సంబంధ వివాదాలు తలెత్తే అవకాశం లేదు. – విటోరియో కొలావో, వొడాఫోన్ గ్రూప్ సీఈఓ ఈ విలీనం ఇరు గ్రూప్‌ల వాటాదారుల విలువ పెంచేందుకు దోహదం చేస్తుంది. డీల్‌లో భాగంగా వొడాఫోన్ నుంచి రూ.3,874 కోట్ల మొత్తానికి గాను 4.9 శాతం వాటాను ప్రమోటర్లు(ఆదిత్య బిర్లా గ్రూప్) కొనుగోలు చేస్తారు. ఐడియా దీనికి ఎలాంటి చెల్లిం పులూ చేయదు. అదేవిధంగా విలీనం తర్వాత ఐడియాలో ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రసక్తే లేదు. – కుమార మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ -
ఏప్రిల్ 1నుంచి ఈ బ్యాంకుల పేర్లు మారతాయి
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి అయిదు అసోసియేట్ బ్యాంకులు మాతృ సంస్థ ఎస్బీఐలో పూర్తిగా విలీనం కానున్నాయని ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్ లోతెలిపింది. 2017 ఏప్రిల 1 నుంచి ఇవి ఎస్బీఐ మారతాయని తెలిపింది. గత ఏడాదినుంచి వార్తల్లో ఈ విలీన ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపంలోకి రానుంది. ఈ విలీనం తరువాత డైరెక్టర్లు, అసోసియేట్ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ ధర్మకర్తలమండలి మినహా, బ్యాంకుల సిబ్బంది, అధికారులు ఎస్బీఐ పరిధిలోకి వస్తారు. వీరి జీతాలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే ఈ విలీన ప్రక్రియ ముగిసిన తరువాత అసోసియేట్ బ్యాంకులు ఎస్‌బీబీజే, ఎస్బీఎం, ఎస్బీటీ షేర్లను స్టాక్‌మార్కెట్ల నుంచి తొలగించనున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్ బ్యాంకుల విలీనానికి ఈ నెల 16న కేబినెట్ తుది ఆమోదం లభించింది. గత ఏడాది మేలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ బ్యాంకు ఈ విలీన ప్రతిపాదనకు స్వాప్ రేషియో ఆధారంగా ఆగస్టులో ఆమోదం లభించింది. అయితే భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్బీఐ విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్ణయంఇంకా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
విలీన వార్తలను ఖండించిన యాక్సిస్ బ్యాంకు
ముంబై: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ను, మరో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్టు వార్తలు మార్కెట్ లో హల్ చల్ చేశాయి. తర్వలోనే కొటక్ బ్యాంక్ చేతికిఽ యాక్సిస్ బ్యాంక్ వెళ్లిపోనుందని, ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంకును కోటక్ స్వాధీనం చేసుకోనుందనే నివేదికలు అటు ఇన్వెస్టర్లు, ఇటు మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేపాయి. అయితే ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవనీ కొట్టి పారేశారు. తాము బ్యాంకింగ్ సేవల్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా కొనసాగుతున్నామనీ, విలీనం అయ్యే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఇలాంటి స్పెక్యులేషన్స్ని నమ్మవద్దని కోరారు. కొటక్ మహీంద్రా మెర్జర్ ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు కొటక్ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు యాక్సిస్ టేకోవర్‌కు మరిన్ని దిగ్గజ బ్యాంకులు పావులు కదిపే అవకాశమున్నట్లు పుకార్లు చెలరేగాయి. అసలే డిమానిటైజేషన్ ప్రక్రియలో ఉద్యోగుల అక్రమాలతో ఇబ్బందుల్లో పడ్డ యాక్సిస్ బ్యాంక్ ఈ విలీనం వార్తలతో మరింత చిక్కుల్లో పడ్డట్టయింది. దీంతో మార్కెట్లో సంచలనంగా మారింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ షేరు దాదాపు 5.34 శాతం లాభపడగా కొటక్ బ్యాంక్ 0.4 శాతం నష్టపోయినా..చివరలో కోలుకుని 0.24 శాతం లాభాలతో ముగిసింది. -
92 ఏళ్ల సంప్రదాయానికి చరమగీతం
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లోనే కలిపే ప్రతిపాదనకు నరేంద్ర మోదీ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ఫిబ్రవరి 1న ఒకే బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. దీంతో ప్రత్యేక రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంస్కృతితోపాటు, 92ఏళ్ల నుంచి యూనియన్ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆచారానికి ఎన్డీయే సర్కార్ తిలోదాకాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 25 , 2017నుంచి ప్రారంభించేందుకు యోచిస్తోందని తెలిపాయి. అయితే విలీనం తర్వాత రైల్వే శాఖ ఎప్పటిలాగానే స్వతంత్రంగా వ్యవహరించేలా ఫంక్షనల్ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇకమీదట రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో డివిడెండ్ చెల్లింపు, తదితర అంశాలను సమీక్షించే రైల్వే కన్వెన్షన్ కమిటీ రద్దవుతుంది. ఇతర విభాగాలకు మాదిరిగానే, మూలధన వ్యయం కోసం రైల్వేలకు బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది. వివిధ వర్గాలకు అందించే అన్ని వాస్తవ రైల్వే పాస్ లు ఆధార్ నంబరుకు అనుసంధానం చేయబడతాయి. ఏప్రిల్ నెలకల్లా ద్రవ్యబిల్లు, డిమాండ్లు-గ్రాంట్లపై పార్లమెంటులో చర్చలను పూర్తిచేయాలని, మే నెల నుంచే రాష్ర్టాలకు నిధులను విడుదల చేయాలని భావిస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చించి ఆమోదం పొందినట్టు సమాచారం. -
ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
నల్లగొండ వద్దు..సూర్యాపేటే ముద్దు
నల్లగొండ: మిర్యాలగూడెం నియోజకవర్గాన్ని నల్లగొండలో కలిపేందకు ససేమిరా ఒప్పుకోమంటూ ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రి జి.జగదీశ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం నల్లగొండలోని మంత్రి నివాసంలో కలిసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సూర్యాపేట జిల్లాలో కలపాలంటూ అభ్యర్థించారు. వేముపల్లి, దామచర్ల, మిర్యాలగూడెం రూరల్ మండలానికి చెందిన జెడ్పీటీసీలు, వైస్‌ఎంపీపీలు, సర్పంచ్‌లు వివిధ గ్రామాల ప్రజలు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. -
ప్రత్యర్థి కంపెనీ దిదిలో ఉబర్ విలీనం!
చైనాలో రైడ్ షేరింగ్ దిగ్గజాలు ఉబర్, దిది చుక్సింగ్లకు మధ్య నెలకొన్న ప్రచండ యుద్ధానికి తెరపడనుంది. ఉబర్ ఓ మెట్టు దిగొచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా ఆపరేషన్స్‌ను ఉబర్, తన ప్రత్యర్థి కంపెనీ దిది చుక్సింగ్లో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విలీన డీల్‌తో 35 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2,33,551 కోట్లు)విలువగా సంయుక్త కంపెనీ ఆవిర్భవించబోతుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు నివేదించింది. ఈ సంయుక్త కంపెనీలో ఉబర్ చైనా ఇన్వెస్టర్లు 20 శాతం స్టాక్ ను పొందనున్నట్టు తెలిపింది. ఈ కొత్త డీల్‌తో ఉబర్‌లో దిది చుక్సింగ్ ఒక బిలియన్ డాలర్లను( సుమారు రూ.6,673 కోట్లను) పెట్టుబడులుగా పెట్టనుందని బ్లూమ్ బర్గ్ నివేదించింది.. చైనాలో ఉబర్‌కు ఎదురవుతున్న భారీ నష్టాలను తొలగించుకోవడానికి ఆ సంస్థ ఈ మేరకు పావులు కదుపుతుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు తెలిపింది. భవిష్యత్తులో తమ మనుగడును కొనసాగించడానికి ఈ డీల్ సాయపడనుందని ఉబర్ భావిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన నేడు(సోమవారం) వెలువడే అవకాశముందుని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ రిపోర్టులపై ఉబర్, దిది చుక్సింగ్ కంపెనీల అధికార ప్రతినిధులు వెంటనే స్పందించడానికి నిరాకరించారు. చైనా మార్కెట్ షేరును దక్కించుకోవడానికి, ఆధిపత్య స్థానంలో కొనసాగడానికి ఈ రెండు సంస్థలు బిలియన్ డాలర్లను డ్రైవర్లకు, ప్యాసెంజర్ల సబ్సిడీల కోసం వెచ్చిస్తూ ఉన్నాయి. చైనా రైడ్ షేరింగ్ మార్కెట్ లో 90శాతం స్థానాన్ని దిది సొంత చేసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. గత నెలే ఈ కంపెనీలో యాపిల్ ఇంక్ వంద కోట్ల డాలర్లను పెట్టుబడులుగా కూడా పెట్టింది. 50 దేశాలకు పైగా విస్తరించిన ఉబర్, అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఈ కంపెనీ చాలా ప్రాంతాల్లో రెగ్యులేటరీ నిబంధనను, టాక్సీ ఆపరేటర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ రిపోర్టులు వెలువడిన వెంటనే రైడ్ షేరింగ్‌పై కొత్త నిబంధనలు విధిస్తూ చైనీస్ అథారిటీలు ప్రకటన విడుదల చేశారు. తక్కువ ధరలకు రైడ్ షేరింగ్ ఆపరేట్ చేయడంపై నిషేధం, సబ్సిడీలు ఆఫర్లపై పరిమితులను ఈ నిబంధనలు విధించాయి. -
బీసీ హాస్టళ్లకు విలీనం ముప్పు
తక్కువుంటే తరలించడమే..! నాలుగు హాస్టళ్ల తరలింపునకు ఆదేశాలు విద్యార్థుల కొరతతోనే ఉత్తర్వులు భీమదేవరపల్లి : సంక్షేమ హాస్టళ్లను విద్యార్థుల కొరత వెంటాడుతోంది. సరిపడా సంఖ్యలో విద్యార్థులు లేని హాస్టల్‌ను పొరుగునే ఉన్న మరో హాస్టల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు హాస్టళ్లను ఆగస్టు ఒకటి లోపు తరలించేందుకు జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో హాస్టల్లో ప్రవేశాలు కావాలంటే పైరవీలు నడిచేవి. ప్రస్తుతం ప్రతి మండలంలో కస్తూరిబా, మోడల్ స్కూల్స్ ఏర్పాటు కావడం.. అక్కడే హాస్టళ్లు నిర్మించడంతో వాటి ప్రభావం వసతి గృహాలపై పడుతోంది. జిల్లాలోని ఎలిగేడు బీసీ హాస్టల్లో 100 మంది విద్యార్థులకు కేవలం 25 మంది, కాటారం మండలం దామెరకుంట బీసీ హాస్టల్లో 15 మంది, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బీసీ హాస్టల్లో 17మంది, చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో 22మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ హాస్టళ్లలో 100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. కనీసం 50 మంది విద్యార్థులు లేని పక్షంలో అట్టి హాస్టళ్లను విలీనం చేస్తామని గతేడాది జిల్లా అధికారుల నుంచి ఆయా వసతి గృహాల వార్డెన్లకు ఆదేశాలు అందాయి. విలీనం భయంతో కొన్నిచోట్ల వార్డెన్లు నానా తంటాలు పడి విద్యార్థులను వసతిగృహాల్లో చేర్పించారు. కానీ.. ఎలిగేడు, దామెరకుంట, ముల్కనూర్, బొమ్మనపల్లి బీసీ వసతి గృహాలకు మాత్రం విద్యార్థులు రాలేకపోయారు. ఈ క్రమంలో వీటిని సమీప వసతి గృహాల్లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎలిగేడు వసతి గృహాన్ని సుల్తానాబాద్‌కు, దామెరకుంట హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్టీ ఆశ్రమ హాస్టల్‌కు, ముల్కనూర్ హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ వసతి గృహానికి, బొమ్మనపల్లి హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో విలీనం చేశారు. వీరందరినీ ఆగస్టు ఒకటి లోపు తరలించాలని సిరిసిల్ల ఏబీసీడబ్ల్యూవో రాజమనోహర్ వెల్లడించారు. -
యూపీలో సరికొత్త రాజకీయ పరిణామం
న్యూఢిల్లీ: రానున్న యేడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరాష్ట్రంలో సరి కొత్త రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అప్నాదళ్ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఆపార్టీకి వారణాసి, మీర్జాపూర్ లో ఓబీసీ వర్గాల్లో మంచి పట్టుంది. దీంతో యూపీలో అధిక శాతంలో ఉన్న కుర్మిల్లాల మద్దతు బీజేపీకి లభించనుంది. ప్రస్తుతం అప్నా దళ్ పార్టీకి లోకసభలో రెండు స్థానాలున్నాయి. రేపు జరుగనున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆపార్టీ మిర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్ కు అవకాశం దక్కనుందని సమాచారం. -
ఎస్బీహెచ్ విలీనాన్ని నిలిపేయాలి: సీపీఎం
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) విలీన ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఏడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రజల బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన ఎస్‌బీహెచ్‌ను విలీనం చేయకుండా కాపాడుకోవడం అత్యంత అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అనుబంధ బ్యాంకులను విలీనం చేసే కీలక నిర్ణయానికి ముందు బ్యాంకు లాభ-నష్టాలు, రుణాల వసూళ్లు, బలహీనతలు, ప్రజాభిప్రాయం తదితర అంశాలపై లోతుగా చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఎలాంటి ముందస్తు నోటీసు, ఎజెండా లేకుండా ఒకే రోజు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అనేక శాఖలు మూతపడి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. -
విలీన బాటలో మరో మూడు బ్యాంకులు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, తన అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రతిపాదన అనంతరం మరో మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ విధానాన్ని కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. యూకో బ్యాంకుతో పాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కూడా దిగ్గజ సంస్థల్లో విలీనం చేయాలని భావిస్తోంది. బలహీనంగా ఉన్న ఈ బ్యాంకులను, ఆర్థికంగా బలంగా ఉన్న బ్యాంకుల్లో కలిపి, లాభాల్లో నడిపించాని చూస్తోంది. ఈ విలీనానికి సంబంధించి వివిధ ఆప్షన్ల కోసం ప్రభుత్వం అన్వేషణ ప్రక్రియలో ఉందని ఒక అధికారి వెల్లడించారు. స్టేట్ బ్యాంకు ప్రతిపాదించిన దాన్ని అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియను త్వరలోనే ప్రభుత్వం మొదలుపెడుతుందని తెలుస్తోంది. తన ఐదు అనుబంధ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకునే ప్రతిపాదనను ఎస్ బీఐ మంగళవారం కేంద్రప్రభుత్వం ముందుంచిన సంగతి తెలిసిందే. ఈ విలీనంతో రూ.5000 కోట్ల స్థిర మూలధనాన్ని అనుబంధ బ్యాంకుల నుంచి ఎస్ బీఐ పొందుతుందని ఆ బ్యాంకు చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. అదేవిధంగా విలీన ప్రక్రియ పూర్తైతే బ్యాంకు డిపాజిట్లు 21లక్షల కోట్లకు పైగా కలిగి ఉంటాయని, అడ్వాన్సులు రూ.17.5 లక్షల కోట్లకు పెరుగుతాయని రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అన్నీ ప్రపంచ బ్యాంకుల్లో ఉన్న తమ బ్యాంకింగ్ ర్యాంకును మెరుగుపరుచుకుంటామని, బ్యాలెన్స్ షీటు సైజులో 59 నుంచి 55కు పెరుగుతామని భట్టాచార్య పేర్కొన్నారు. యూకో బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకుల విలీన ప్రక్రియలో బ్యాక్స్ బోర్డు బ్యూరో(బీబీబీ) సహకారాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. టెక్నాలజీ పరంగా, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నింటి పరిష్కారంలో ప్రభుత్వానికి బీబీబీ సహకరించనుంది. అవసరమైతే బ్యాంకు బోర్డులతో కూడా బీబీబీ సమావేశం కానుందని అధికారులు చెబుతున్నారు. కలకత్తాకు చెందిన యూకో బ్యాంకుకు మొండిబకాయిలు 6.76 శాతం నుంచి 15.43శాతానికి పెరగడంతో, మార్చి త్రైమాసికంలో రూ.1,715 కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. అదేవిధంగా బ్యాంకు ఆఫ్ ఇండియా డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,506 కోట్ల నష్టాలను, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంకు రూ.1,425 కోట్ల నష్టాలను ప్రకటించాయి. -
టీడీపీకి తాళం!
- టీఆర్ఎస్ లో విలీనం చేసే యోచనలో పార్టీ తెలంగాణ నాయకత్వం - త్వరలో ఎన్నికల కమిషన్ కు లేఖ ఇచ్చే అవకాశం - గులాబీ కండువా కప్పుకోనున్న అయిదారు జిల్లాల అధ్యక్షులు - టీఆర్ఎస్ అధినేతతో ఇప్పటికే తెలంగాణ టీడీపీ ముఖ్యనేత మంతనాలు - తనతోపాటు వచ్చే నేతల భవిష్యత్‌పై చర్చలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో తెలుగుదేశం పార్టీ తెరమరుగు కానుందా..? ఇప్పటికే టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమై ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే పార్టీ నాయకత్వానికి మరో దిమ్మతిరిగే షాక్ తగలనుందా? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీటీడీపీని అధికార టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. వినడానికి ఇది ఒకింత ఆశ్చర్యమైనా.. అతి త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం శాఖను టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వడానికి టీటీడీపీ నాయకత్వం పావులు కదుపుతోంది. పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ శాఖను ఏమాత్రం పట్టించుకోకపోవడం, పార్టీ ఇక్కడ బతికి బట్టకట్టడం, భవిష్యత్ ప్రశ్నార్థకం కావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీపీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడితో ఆగకుండా తెలంగాణ టీడీపీ శాసన సభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేయాలంటూ స్పీకర్ లేఖ రాశారు. స్పీకర్ ఇప్పటికే విలీనం తంతును ముగించి, ఆ మేరకు వీరందరికీ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిపి సీట్లు కూడా కేటాయించారు. టీ టీడీఎల్పీ విలీనం జరిగిపోగా.. ఇప్పుడు పార్టీ రాష్ట్ర శాఖ వంతు వచ్చినట్లు చెబుతున్నారు. లేదు.. లేదంటూనే..! పార్టీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడానికి నాయకత్వంతో మంతనాలు జరిపారని, బయటకు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నా ఆయన చేరిక ఖరారైనట్లు సమాచారం. అలాగే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సైతం తాను పార్టీ మారడం లేదని అంటున్నా.. ఆయన చేరికపై ప్రచారం మాత్రం ఆగడం లేదు. పార్టీ వర్గాలు సమాచారం మేరకు టీటీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్, మరికొద్ది మంది నాయకులే మిగిలే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు టీఆర్ఎస్ బాట పట్టారు. మిగిలిన వారిలో కనీసం అయిదారు జిల్లాల అధ్యక్షులు, జిల్లా నేతలు, రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవులు, హోదాల్లో ఉన్న నేతలు సైతం మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చే రే యోచనలో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ టీడీపీ ముఖ్య నేత ఒకరు ఈ మేరకు ఇప్పటికే అధికార పార్టీ అధినేతతో మంతనాలు జరిపారని తెలిసింది. తనతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవుల్లో కొందరు నేతలు చేరతారని, వారి భవిష్యత్ మాటేమిటన్న చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. విలీన సమయంలోనే సిద్ధమయ్యారట! వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైన సమయంలోనే ఆయా ఎమ్మెల్యేలతో పలువురు జిల్లాల నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని, అయితే ఇప్పుడే వారందరినీ తీసుకువెళ్లి, ఎలా సర్దుబాటు చేయించాలో తెలియక ఆగిపోయారని చెబుతున్నారు. ‘‘జిల్లాల శాఖలన్నీ మూకుమ్మడిగా పార్టీ మారేందుకు, టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వచ్చారు. కానీ వారికి ఏ పదవులు ఇప్పించగలుగుతాం. వారిని ఎలా సర్దుబాటు చేస్తాం అన్న ప్రశ్నలతో మేమే వెనుకగడుగు వేశాం..’’ అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగినా.. టీడీపీ నుంచే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గులాబీ గూటికి చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ శాఖ గురించి అంత సీరియస్‌గా పట్టించుకోక పోవడం, టీటీడీపీలో ఒక నాయకుడిదే ఇష్టారాజ్యం కావడం, జిల్లాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు టీఆర్ఎస్ పంచన చేరడం తదితర పరిణామాల నేపథ్యంలో ఇక పార్టీ మనుగడ కష్టమన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీని విలీనం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. -
SBIలో విలీనం కాబోతున్న BMB..?
-
ఆరు జనతాపార్టీల విలీనం నేడే
ఢిల్లీ: ఎస్పీ అధినేత ములాయం సింగ్ నేతృత్వంలో జనతా పరివార్‌కు చెందిన ఆరు పార్టీల విలీనం బుధవారం జరగనుంది. ములాయం నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌జేటీ, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఐన్ఎల్డీ పార్టీల భేటీ జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శరద్ యాదవ్, కేసీ త్యాగి, హెచ్డి దేవెగౌడ, లాలూ ప్రసాద్, కమల్ మొరార్క, దుష్యంత్ చౌతాల,రాంగోపాల్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్త కూటమి పేరు, గుర్తును ఖారారు చేసే అవకాశం ఉంది. కొత్త పార్టీకి సమాజ్‌వాదీ జనతా పార్టీ లేదా సమాజ్‌వాదీ జనతాదళ్ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నూతన పార్టీకి సైకిల్ గుర్తును నిర్ధారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
విలీనం దిశగా ఎంఎఫ్ పథకాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) రంగంలో రానున్న రోజుల్లో పలు పథకాల విలీనాల జోరు కనిపించనుంది. ఒకే రకమైన పథకాలను విలీనం చేస్తే, ఆ పథకాలలో ఇన్వెస్ట్ చేసేవారికి మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఇస్తామన్న బడ్జెట్ ప్రతిపాదనే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం దాదాపు రూ.12 లక్షల కోట్లు విలువ ఉన్న ఎంఎఫ్ రంగంలో ఒకే లక్ష్యంతో నడిచే పథకాల ఏకీకరణకు దారితీయనుంది. పథకాల ఏకీకరణ వల్ల వాటి సంఖ్య తగ్గుతుంది. దీంతో వాటిని ఎంతో క్రియాత్మకంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఆనంద్ రాఠి ప్రైవేట్ వెల్త్ కంపెనీ డెరైక్టర్ ఫెరోజ్ అజీజ్ అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఒకే రకమైన పథకాలను విలీనం చేస్తే వాటికి పన్ను విధానంలో తటస్థ వైఖరిని అవలంబిస్తామని బడ్జెట్ లో ప్రతిపాదించింది. దీంతో రానున్న రోజుల్లో ఎంఎఫ్ రంగంలో పలు పథకాల విలీనాలు జరుగుతాయి’ అని యూటీఐ ఎంఎఫ్ గ్రూప్ ప్రెసిడెంట్ సూరజ్ కైలీ చెప్పారు. ఈ ప్రభుత్వ చర్య వల్ల భవిష్యత్తులో ఉత్పత్తుల హేతుబద్ధీకరణ జరుగుతుందన్నారు. ఎంఎఫ్ రంగ ఏకీకరణ వల్ల ఇన్వెస్టర్లు సరైన పెట్టుబడిదారి నిర్ణయాలను తీసుకుంటారని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఇన్వెస్టర్లపై పన్ను భారం తగ్గుతుందని క్వాంటమ్ ఏఎంసీ సీఈఓ జిమ్మి పటేల్ అన్నారు. -
ఏడీసీ కార్యాలయం ఎత్తివేత?
కర్నూలు(రాజ్‌విహార్) : వాణిజ్య పన్నుల శాఖ అప్పీలేట్ డిప్యూటి కమిషనర్ (ఏడీసీ) కార్యాలయానికి మంగళం పాడేందుకు కసరత్తు జరుగుతోంది. రాయలసీమ వాసుల కోసం కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని విజయవాడలోని ఏడీసీ ఆఫీస్‌లో విలీనం చేసేందుకు యత్నాలు జరగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాదులోని సీమ ట్రిబ్యూనల్ కోర్టు బెంచ్‌ను విశాఖపట్నంకు తరలిం చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ కన్ను ఏడీసీ కార్యాలమంపై పడింది. కోస్తాంధ్ర తెలుగుదేశం నేతలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వనరులను తమ ప్రాంతాలకు లాక్కెళ్లడమే లక్ష్యంగా ఉన్నారు. వాళ్ల కనుసన్నల్లో పరిపాలన నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతరుల ఇబ్బందులు, కష్టాలను పట్టించుకోవడం మానేశారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని కాదని రాజధానిని విజయవాడకు తరిలించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులోని వాణిజ్య పన్నుల శాఖ ట్రిబ్యూనల్ బెంచ్‌ను ఎత్తేసి కోస్తాలోని విశాఖపట్నం బెంచ్‌లో విలీనం చేశారు. కృష్ణా బోర్డు ఏర్పాటు పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. ఇప్పుడు తాజాగా వాణిజ్య పన్నుల శాఖ అప్పిలేట్ కార్యాలయాన్ని ఎత్తేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రం కర్నూలులో ఉన్న ఈ కార్యాలయాన్ని ఎత్తేసి విజయవాడలోని కార్యాలయంలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు రాలేదు అప్పీలేట్ డిప్యూటి కమిషనర్ కార్యాలయాన్ని ఎత్తేసి విజయవాడలో విలీనం చేస్తున్నట్లు ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయితే, కొంత మంది యూనియన్ నాయకులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా దీనిపై మాట్లాడలేము. ఉన్నతాధికారుల సూచనల మేరకు కార్యాచరణ ఉంటుంది. - తాతారావు, డిప్యూటి కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, కర్నూలు వ్యాపారులకు ఇబ్బందులే అప్పీలేట్ డిప్యూటి కమిషనర్ కార్యాలయాన్ని ఎత్తేసి విజయవాడలో విలీనం చేస్తే వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థల డీలర్లు, ట్రాన్స్‌పోర్టు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. ఇటు ఉద్యోగులు ఇబ్బంది పడతారు. భవిష్యత్తులో నియామకాలు ఆగిపోయే అవకాశం కూడా ఉంది. - జీ.ఎం. రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ సంఘం -
ఆంధ్రాబ్యాంక్ విలీనం వార్తలు
నిరర్థక ఆస్తులతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రాబ్యాంక్ మరో ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం అయ్యే అవకాశం ఉందంటూ గురువారం మార్కెట్లో వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తల నేపథ్యంలో గురువారం ఈ షేరు ధర ఒకానొక దశలో 6 శాతం వరకు పెరిగినా, చివరికి రెండు శాతం లాభంతో రూ. 96 వద్ద ముగిసింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ఎన్ఎస్ఈలో గురువారం ఒక్కరోజే ఆంధ్రాబ్యాంక్ కౌంటర్లో 1.70 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం. నిరర్థక ఆస్తులు కొండలా పెరిగిపోవడం, మూలధనం సమకూర్చుకోవడం కష్టం కావడంతో ఆంధ్రాబ్యాంక్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల్లో ఒకదాంట్లో విలీనం కావచ్చని మీడియాలో వార్తలో వెలువడ్డాయి. కానీ ఈ వార్తలను ఆంధ్రా బ్యాంక్ ఉన్నతాధికారులు ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రాబ్యాంక్ విలీనమయ్యే అవకాశాలు లేవంటున్నారు. రెండు రోజుల క్రితం బ్యాంకు మేనేజర్ల సమావేశంలో ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ మాట్లాడుతూ నిరర్థక ఆస్తులు తగ్గించుకోకపోతే టేకోవర్లకు టార్గెట్ బ్యాంక్‌గా తయారవుతామని, ఈ బ్యాంకును రక్షించుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందంటూ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని బ్యాంక్ విలీనమైపోతోందంటూ వార్తలు రాసాయని ఆంధ్రా బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
విలీనంపై మాటమార్చారు!
విశాఖ : గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్లో భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీ విలీనంపై మళ్లీ గందరగోళం నెలకొంది. మంత్రులు కూడా మాట మార్చారు. ఇన్నాళ్లూ తొందర్లోనే విలీన ప్రతిష్టంభనకు తెరపడుతుందని భావించిన అధికారులకు మంత్రులు షాకిచ్చారు. వుడాలో నిన్న జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. విలీన పంచాయతీలన్ని విలీనం నుంచి ఉపసంహరించి ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, దీనిపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మూడు మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సమస్యల్ని పరిష్కరిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ స్థానిక మంత్రి, భీమిలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు స్థానికుల అభిప్రాయం మేరకే విలీనంపై నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పుకొచ్చిన ఆయన మున్సిపల్ మంత్రి సమక్షంలో మాత్రం ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. -
‘పోలవరం’ ఆర్డినెన్స్ అప్రజాస్వామికం
టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం చంద్రశేఖర్ కాలనీ: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అప్రజాస్వామికమని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర , ఏపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పోశెట్టి మాట్లాడుతూ పార్లమెంట్లో బిల్లుపెట్టి పోలవరం ఆమోదించడంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షత స్పష్టమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు సుజీత్‌సింగ్, ఆదె ప్రవీణ్‌కుమార్, మట్టెల శేఖర్, అక్తర్, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు తారిక్ అన్సారీ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్ ఏనుగందుల మురళి, శీల మురళీధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్డినెన్స్ ఆమోదంపై ఆగ్రహజ్వాల
భద్రాచలం: పోలవరం ఆర్డినెన్స్‌కు పార్లమెంటు ఆమోదముద్ర వేయటంపై తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌తో పాటు ఇతర అధికారులను ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రామాలయంలో జరిగిన పుష్కరాల సమీక్షలో పాల్గొని వస్తున్న అధికారులను బయటకు వెళ్లకుండా రహదారిపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐటీ డీఏలో వరదలపై సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులను బయటకు వెళ్ల నీయకుండా అడ్డుకోవటంతో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ రంగనాథ్ అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేతో చర్చించారు. ఆదివాసీల గోడును కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రాజయ్య చేతులు జోడించి వేడుకున్నారు. అనంతరం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పీఏపీపీ ఆధ్వర్యంలో ఒడిశాలోని పొడియా నుంచి భద్రాచలం వరకూ చే పట్టిన పాదయాత్ర శుక్రవారం భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడె ం చేరుకుంది. -
పోలవరంపై పంతం నెగ్గించుకున్నకేంద్రం
బిల్లుకు లోక్‌సభ ఆమోదం... ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తున్నారంటూ టీ-ఎంపీల ఆందోళన తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ సభ్యుల మద్దతు పోలవరంపై హామీని నెరవేర్చుతున్నామని కేంద్రం వివరణ సాక్షి, న్యూఢిల్లీ: పోలవరంపై కేంద్రం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లును శుక్రవారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలతో పాటు పలువురు సభ్యులు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ.. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. మధ్యాహ్నం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అందజేసిన తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించారు. ఈ తీర్మానంతో పాటే సవరణ బిల్లును కూడా ఎజెండాలో పెట్టారు. పోలవరం ఆర్డినెన్స్‌కు అనుగుణంగా కేంద్రం రూపొందించిన సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ వినోద్‌కుమార్ తన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అయితే ముందుగా సవరణ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్పీకర్ అనుమతినిచ్చారు. ఈ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలతో పాటు వైఎస్సార్సీపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ ఆందోళన మధ్యే రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును గతంలో ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గత మార్చి 1న గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే అపాయింటెడ్ డే అయిన జూన్ 2 కంటే ముందే రెండు రాష్ట్రాల సరిహద్దులను మార్చాల్సిన తక్షణ అవసరాన్ని గమనించాం. అందువల్ల వెంటనే ఆర్డినెన్స్ తెచ్చాం. దానికే ప్రస్తుతం చట్టరూపం ఇస్తున్నాం. ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. అలాగే పాలనాపరమైన సౌలభ్యం కూడా ఉంటుంది. భద్రాచలం ఆలయాన్ని తెలంగాణలోనే ఉంచాం. దానికి దారి కూడా వదిలాం. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం తూర్పు గోదావరి జిల్లాకు చెందినదే. అయితే 1958లో ఖమ్మం జిల్లాలో కలిపారు. పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించే సమయంలో అప్పటి ప్రధాని ఓ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని, పునరావాస ప్యాకేజీ అమలు కోసం అవసరమైతే చట్టాన్ని సవ రిస్తామని తెలిపారు. అందువల్ల ఈ బిల్లును పరిశీలించి ఆమోదించాలని సభను కోరుతున్నా’ అని హోంమంత్రి పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణ ఎంపీల ఆందోళన కొనసాగుతుండగానే ఈ ప్రసంగమంతా సాగింది. దీంతో ఈ సవరణ బిల్లును పరిశీలనకు పెడుతున్నట్టు స్పీకర్ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కు అవకాశమిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ వినోద్‌కుమార్ ఆవేశంగా మాట్లాడారు. ‘ మార్చి 1నే గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడే తెలంగాణ రాష్ర్టం ఏర్పడినట్లు. అపాయింటెడ్ డేను ప్రకటించిన తర్వాత విభజన బిల్లును సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించాలి. సంబంధిత రాష్ట్రాల శాసన వ్యవస్థల అభిప్రాయం తెలుసుకున్నాకే రాష్ట్రపతి ఈ బిల్లును సిఫారసు చేయాలి. కానీ ఈ ప్రక్రియ జరగలేదు. అందువల్ల ఈ అంశంపై ముందు చర్చ జరిగాకే బిల్లులోకి వెళదాం. అందువల్ల ముందుగా స్టాట్యుటరీ రిజల్యూషన్‌పై చర్చకు అనుమతించండి. దీన్ని బిల్లుతో కలపొద్దు’ అని ఆయన కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ‘ఆనవాయితీ ప్రకారం ఈ రెండింటినీ కలిపాం. మీరు తీర్మానంపై మాట్లాడినందున ఇప్పుడు బిల్లుపై మాట్లాడండి. ఒకవేళ మీరు మాట్లాడదలుచుకోని పక్షంలో మరో సభ్యుడికి అవకాశమిస్తాను’ అని పేర్కొన్నారు. దీంతో వినోద్ మాట్లాడుతూ.. ‘కేంద్రం ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులు మార్చాలనుకుంటున్న విషయం సభ్యులందరికీ తెలియనివ్వండి. అన్ని రాష్ట్రాలూ తెలుసుకోనివ్వండి’ అని అన్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో టీ-కాంగ్రె స్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ సూచించారు. అయితే ఇదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతరాయ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఆర్డినెన్స్‌ను ఏయే సందర్భాల్లో జారీ చేయాలన్న అంశాన్ని చదివి వినిపించారు. అలాగే రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగ నిబంధనలు వివరిస్తూ.. ఈ బిల్లును తెచ్చే ముందు ప్రభావిత రాష్ట్రాల అభిప్రాయాన్ని రాష్ర్టపతి తెలుసుకున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే, ఆ ప్రక్రియను పాటించకుండానే ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చట్ట సమ్మతం కాదు. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం’ అని పేర్కొన్నారు. తర్వాత స్పీకర్ స్పందిస్తూ.. ఎంపీ వినోద్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. ‘స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను, ఆర్డినెన్స్‌ను చట్టరూపంలోకి తెచ్చే బిల్లును కలిపి ప్రవేశపెట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. వీటిని కలపరాదన్న నిబంధనేమీ లేదు’ అని పేర్కొన్నారు. అయితే వినోద్ కలుగుజేసుకుంటూ.. ‘ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పడం నా ఉద్దేశం. రెండు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే బిల్లును రాష్ర్టపతి సిఫారసు చేశారు. అందువల్ల దీన్ని సభలో ప్రవేశపెట్టేందుకు అర్హత లేదు’ అని పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్.. ఈ సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ దీనిపై రూలింగ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ‘ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సభ్యులు సౌగత్‌రాయ్, వినోద్ చెప్పారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే రాజ్యాంగ నిబంధనల మేరకు పరిశీలన జరగాలి. దీని ప్రాథమిక బాధ్యత న్యాయస్థానానిది. పైగా సభ్యులు లేవనెత్తిన అంశం సభావ్యవహారాలను నియంత్రించేది కాదు’ అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. డిజైన్ మార్చాలి ఎంపీ గుత్తా ఒకింత ఆవేశంగా మాట్లాడారు. ‘ఇరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లును తెచ్చారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. సాంకేతిక నిపుణులు కూడా పోలవరం డిజైన్ మార్చాలని చెప్పారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా బదిలీ చేస్తున్నారు. డిజైన్ మార్చడానికి కేంద్రమే సాంకేతిక నిపుణులను నియమించాలి. కొత్త డిజైన్ రూపొందించండి. గిరిజనుల అభిప్రాయాలు తీసుకోండి. నాలుగు రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే బిల్లును తేవాలి. మంద బలంతో సరిహద్దులు మార్చడం సరికాదు. బిల్లును ఉపసంహరించుకోవాలి’ అని పేర్కొన్నారు. అనంతరం దీనిపై బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ మాట్లాడారు. ‘మేం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. కానీ దీని ప్రస్తుత డిజైన్ వల్ల 307 గ్రామాలు మునిగిపోతాయి. గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల ప్రాజెక్టు ఎత్తు పెంచకపోతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీనిపై సుప్రీంలో కేసు ఉంది. ఇక్కడ ఏ చట్టం చేసినప్పటికీ న్యాయస్థానం దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో సభ్యుల నినాదాలు హోరెత్తడంతో.. ఇక మాట్లాడే అవకాశం లేనందున బిల్లును ఆమోదించే ప్రక్రియను చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే టీఆర్ఎస్ తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ కోరగా మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో అది తిరస్కరణకు గురైనట్టు ప్రకటించారు. అలాగే మెజారిటీ సభ్యుల మద్దతుతో క్లాజులవారీగా బిల్లు ఆమోదం పొందింది. అప్పటికే ఆందోళన తీవ్రం కావడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గత మార్చి 1న గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే అపాయింటెడ్ డే అయిన జూన్ 2 కంటే ముందే రెండు రాష్ట్రాల సరిహద్దులను మార్చాల్సిన తక్షణ అవసరాన్ని గమనించాం. అందువల్ల వెంటనే ఆర్డినెన్స్ తెచ్చాం. దానికే ప్రస్తుతం చట్టరూపం ఇస్తున్నాం. ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. అలాగే పాలనాపరమైన సౌలభ్యం కూడా ఉంటుంది. భద్రాచలం ఆలయాన్ని తెలంగాణలోనే ఉంచాం. దానికి దారి కూడా వదిలాం. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం తూర్పు గోదావరి జిల్లాకు చెందినదే. అయితే 1958లో ఖమ్మం జిల్లాలో కలిపారు. పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించే సమయంలో అప్పటి ప్రధాని ఓ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని, పునరావాస ప్యాకేజీ అమలు కోసం అవసరమైతే చట్టాన్ని సవ రిస్తామని తెలిపారు. అందువల్ల ఈ బిల్లును పరిశీలించి ఆమోదించాలని సభను కోరుతున్నా’ అని హోంమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఆందోళన కొనసాగుతుండగానే ఈ ప్రసంగమంతా సాగింది. దీంతో ఈ సవరణ బిల్లును పరిశీలనకు పెడుతున్నట్టు స్పీకర్ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కు అవకాశమిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ వినోద్‌కుమార్ ఆవేశంగా మాట్లాడారు. ‘మార్చి 1నే గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడే తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. జూన్ 2న అపాయింటెడ్ డేగా నిర్ణయించారు. మే 29న విభజన బిల్లును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించాలి. సంబంధిత రాష్ట్రాల శాసన వ్యవస్థల అభిప్రాయం తెలుసుకున్నాకే రాష్ట్రపతి ఈ బిల్లును సిఫారసు చేయాలి. కానీ ఈ ప్రక్రియ జరగలేదు. ఈ అంశంపై స్టాట్యుటరీ రిజల్యూషన్‌పై చర్చకు అనుమతించండి. దీన్ని బిల్లుతో కలపొద్దు. ఆ తర్వాతే బిల్లును పరిశీలించాలి’ అని ఆయన గట్టిగా కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ‘ఆనవాయితీ ప్రకారం ఈ రెండింటినీ కలిపాం. మీరు తీర్మానంపై మాట్లాడినందున ఇప్పుడు బిల్లుపై మాట్లాడండి. మాట్లాడదలుచుకోని పక్షంలో మరో సభ్యుడికి అవకాశమిస్తాను’ అని పేర్కొన్నారు. దీంతో వినోద్ మాట్లాడుతూ.. ‘కేంద్రం ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులు మార్చాలనుకుంటున్న విషయం సభ్యులందరికీ తెలియనివ్వండి’ అని ఆవేశంగా అన్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో టీ-కాంగ్రె స్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ సూచించారు. అయితే ఇదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతరాయ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఆర్డినెన్స్‌ను ఏయే సందర్భాల్లో జారీ చేయాలన్న అంశాన్ని చదివి వినిపించారు. అలాగే రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగ నిబంధనలు వివరిస్తూ.. ఈ బిల్లును తెచ్చే ముందు ప్రభావిత రాష్ట్రాల అభిప్రాయాన్ని రాష్ర్టపతి తెలుసుకున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చట్ట సమ్మతం కాదు. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం’ అని పేర్కొన్నారు. తర్వాత స్పీకర్ స్పందిస్తూ.. ఎంపీ వినోద్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. ‘స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను, ఆర్డినెన్స్‌ను చట్టరూపంలోకి తెచ్చే బిల్లును కలిపి ప్రవేశపెట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. వీటిని కలపరాదన్న నిబంధనేమీ లేదు’ అని పేర్కొన్నారు. అయితే వినోద్ కలుగుజేసుకుంటూ.. ‘రెండు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే బిల్లును రాష్ర్టపతి సిఫారసు చేశారు. దానిపై చర్చను మేం వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్: ఈ సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ దీనిపై రూలింగ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ‘ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సభ్యులు సౌగత్‌రాయ్, వినోద్ చెప్పారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే రాజ్యాంగ నిబంధనల మేరకు పరిశీలన జరగాలి. దీని ప్రాథమిక బాధ్యత న్యాయస్థానానిది. పైగా సభ్యులు లేవనెత్తిన అంశం సభావ్యవహారాలను నియంత్రించేది కాదు’ అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. డిజైన్ మార్చాలి: ఎంపీ గుత్తా ఒకింత ఆవేశంగా మాట్లాడారు. ‘ఇరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లును తెచ్చారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. సాంకేతిక నిపుణులు కూడా పోలవరం డిజైన్ మార్చాలని చెప్పారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. గిరిజనుల అభిప్రాయాలు తీసుకోండి. నాలుగు రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే బిల్లును తేవాలి. బిల్లును ఉపసంహరించుకోవాలి’ అని పేర్కొన్నారు. అనంతరం దీనిపై బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ మాట్లాడారు. ‘మేం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. కానీ దీని ప్రస్తుత డిజైన్ వల్ల 307 గ్రామాలు మునిగిపోతాయి. గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల ప్రాజెక్టు ఎత్తు పెంచకపోతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీనిపై సుప్రీంలో కేసు ఉంది. ఇక్కడ ఏ చట్టం చేసినప్పటికీ న్యాయస్థానం దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో సభ్యుల నినాదాలు హోరెత్తడంతో.. ఇక మాట్లాడే అవకాశం లేనందున బిల్లును ఆమోదించే ప్రక్రియను చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే టీఆర్ఎస్ తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ కోరగా మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో అది తిరస్కరణకు గురైనట్టు ప్రకటించారు. అలాగే మెజారిటీ సభ్యుల మద్దతుతో క్లాజులవారీగా బిల్లు ఆమోదం పొందింది. అప్పటికే ఆందోళన తీవ్రం కావడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. టీఆర్ఎస్ సభ్యుల వాకౌట్: లోక్‌సభ తిరిగి 2 గంటలకు సమావేశమైంది. ఈ సందర్భంగా రైల్వే బడ్జెట్‌పై చర్చ జరిగింది. అయితే రాజ్యాంగ వ్యతిరేకంగా పోలవరం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకున్నందున నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం పార్టీ సభ్యులతో కలిసి సభ నుంచి బయటకు వచ్చేశారు. -
పదవి రాగానే పాగా..!
అక్రమార్కులకు టీడీపీ నేతల అండదండలు ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో బుద్దాలపాలెం తవ్వకాలు తవ్వకం వైపు చూడొద్దంటూ ఆ ప్రజాప్రతినిధి ‘సింహ’గర్జన పట్టించుకోని రెవెన్యూ అధికారులు కోనేరుసెంటర్ (బుద్దాలపాలెం) : బందరు మండలం, బుద్దాలపాలెంలో అనుమతి లేకుండా చేపల చెరువుల తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఈ చెరువుల తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం, టీడీపీ నేతల అండదండలు మెండుగా ఉండటంతో గ్రామానికి చెందిన ఆ ప్రజాప్రతినిధి చెరువుల తవ్వకాలకు నాయకత్వం వహిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని తాళ్లపాలెం కాలువ గట్టు వెంబడి ఇరవై రోజులుగా చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ పచ్చగా కళకళలాడిన పంటపొలాలు నేడు చేపల చెరువులుగా మారుతున్నాయి. అక్రమంగా చెరువు తవ్వకాలకు పాల్పడే వారు అధికారుల కళ్లు గప్పి గుట్టుచప్పుడు కాకుండా పనులు పూర్తి చేస్తుంటారు. కానీ ఈ ప్రజాప్రతినిధి మాత్రం జంకూబొంకు లేకుండా అందరికీ తెలిసేలా దగ్గరుండి మరీ తవ్వకాలు జరిపిస్తున్నాడు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ‘ప్రభుత్వమే మాది. మంత్రి మా మనిషి. ఎవరేం చేస్తారు’ అంటూ ‘సింహ’గర్జన చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొం టున్నారు. పంట పొలాల మధ్య చెరువుల తవ్వకాల కారణంగా తమ పొలాలకు ఊట నీరు దిగటంతో తీరని నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులపై నేతల ఒత్తిడి గ్రామంలో చెరువు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారి ఒకరు ఇటీవల సదరు ప్రజాప్రతినిధిని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆ ప్రజాప్రతి నిధి టీడీపీ ముఖ్య నేతలను కలిసి రెవెన్యూ అధికారులు చెరువు తవ్వకాలను అడ్డుకోకుండా చూడాలని కోరారని తెలిసింది. దీంతో ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు సంబంధిత రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి ‘వాళ్లు మావాళ్లే చూసీ చూడనట్లు ఊరుకోండి’ అని ఆదేశించారని, దీంతో సదరు రెవెన్యూ సిబ్బంది చేసేదేమీ లేక ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ సిబ్బంది చెరువు తవ్వకాల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తుండగా ఆ ప్రజాప్రతినిధి గ్రామంలోని తన అనుచరులైన కొంత మందితో ఆ ప్రాంతంలో చెరువు తవ్వుకోవడం వలన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించి వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. -
పీఎస్‌యూల విలీనంపై నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలకు సంబంధించిన ముసాయిదా విలీన ప్రతిపాదనలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియుమించింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్, ఆర్థిక నిపుణుడు కె. నరసింహమూర్తిలు సభ్యులుగా ఉండే ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ షీలా బిందే చైర్మన్‌గా వ్యవహరించారు. జూన్ 2 నుంచి ఈ కమిటీ పని ప్రారంభించనుంది. -
కాంగ్రెస్‌ను టీడీపీలో విలీనం చేయడమే మేలు
సాలూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీని టీడీపీలో విలీనం చేయడమే ఉత్తమమని, అలా చేస్తే కనీసం ఆ పార్టీ కార్యకర్తలకైనా మేలు జరుగుతుం దని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఎద్దేవాచేసారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు కాకుండా టీడీపీ అభ్యర్థికి ఓటు వేయూలని ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఓటర్లను కోరడం నీతిమాలిన రాజకీయమన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో వారు నిస్సిగ్గుగా వ్యవహరించారన్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా కేవలం వైఎస్సార్ సీపీకి ఓట్లు దక్కకుండా చేయడానికే పోటీ చేయించారన్నారు. కాంగ్రెస్‌లో ఉండి టీడీపీని గెలిపించాలని కోరడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచారన్నారు. దాని కన్నా టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థు ల గెలుపు కోసం పని చేసి ఉంటే బాగుండేదన్నారు. నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు చెరో 5 వేలు కూడా లేవంటే వారు ఎంతగా కుమ్మక్కు రాజకీయాలు జరిపారో అర్థమవుతుందన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ జరజాపు ఈశ్వరరావు కూడా ఉన్నారు. -
పొత్తు పొడుస్తుందా..?
-
ఉషస్సులు వద్దంటున్న ఉత్తర కొరియా
విలీనం కోసం దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తన నాయకత్వంలోనే కార్యకలాపాలను నిర్వహింప చేస్తున్నారు. సైనిక విన్యాసాలతో, నిరంతర వివాదాలతో ఉత్తర కొరియా ఉంటున్నప్పటికీ ఏకీకరణ విషయంలో పార్క్ ప్రయత్నాలు ఆపలేదు. ‘నాసా’ అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం కొరియాల మధ్య వెలు గుల తేడాను చూపుతోంది. మధ్యలో దాదాపు చీకటిగా ఉన్న ప్రాంతం ఉత్తర కొరియా. కాస్త మినుకుమినుకు మంటున్న స్థలమే ఉత్తర కొరియా రాజధాని పైన్గాంగ్. కుడి పక్క దిగువ భాగం దక్షిణ కొరియా. ఆపైన ఎడమ భాగాన ఉన్నది చైనా. ఉత్తర కొరియా విద్యుత్ వినియోగం గంటకు 739 కిలోవాట్లు. దక్షిణ కొరియా వినియోగం గంటకు 10,162 కిలోవాట్లు. యుద్ధం చరిత్ర మీద మిగిల్చే విషాదానికి అంతు ఉండదు. తరం తరువాత తరం ఆ బాధను అనుభవిస్తూనే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం, దరిమిలా సోవియెట్ రష్యా, అమెరికా మధ్య నెలకొన్న ప్రచ్ఛన్నయుద్ధం ఎన్నో సమాజాలను, దేశాలను ఇలాంటి విషాదంలోకి నెట్టివేశాయి. ఉభయ కొరియాల గాథ అలాంటిదే. 1945లో తొందరపాటుతో జరిగిన కొరియా విభజన ఆధునిక ప్రపంచ చరిత్రకే పెద్ద పాఠం. వెయ్యేళ్లు కలసి జీవిం చి, ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో విడిపోయిన దక్షిణ, ఉత్తర కొరియాలను ఐక్యం చేయడానికి 1990లో ప్రారంభమైన ప్రయత్నం ఇప్పటికి కూడా ఊపందుకోలేదు. చెదురుమదురుగా ఉన్న సమాజాలను ఒకే దేశం కింద ఐక్యం చేయడానికి ఉద్యమించడం చరిత్రకు కొత్తకాదు. ఇటలీ, జర్మనీ ఏకీకరణలు ఇందుకు గొప్ప తార్కాణం. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిన తరువాత అప్పటిదాకా ఆ దేశం అధీనంలో ఉన్న కొరియా ద్వీపకల్పం అంతర్జాతీయ రాజకీయాలకు వేదిక అయింది. సోవియెట్ రష్యా మద్దతుతో కొరియా ఉత్తర భాగం పైన్గాంగ్ రాజధానిగా డెమాక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దీపీఆర్కే)గా అవతరించింది. ఇదే ఉత్తర కొరియా. మిగిలినది సియోల్ కేంద్రంగా దక్షిణ కొరియా పేరుతో, అమెరికా అండగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఆర్ఓకే) ఏర్పడింది. ఆగర్భ శత్రువులైనట్టు దాయాదుల మధ్య భీకర యుద్ధం (1950-53)కూడా జరిగింది. కానీ తూర్పు ఐరోపా, సోవియెట్ రష్యా పరిణామాలు ఉభయ కొరియాలను ఏకీకరణ దిశగా ఆలోచించేటట్టు చేశాయి. తమ రెండు దేశాల ఏకీకరణ వ్యవహారం కోసం 1990లోనే దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. రెండు దేశాల మధ్య విడిపోయిన బంధువుల సమావేశం ఈ ఫిబ్రవరి ఆఖరి వారంలో సియోల్‌లో జరిగింది. ఈ సమావేశాల ముగింపు, ప్రస్తుత కొరియా అధ్యక్షురాలు పార్క్ పదవిని చేపట్టి ఒక సంవత్సరకాలం పూర్తికావడం ఒకేసారి జరిగింది. ఆ సందర్భంగా చానళ్లలో ప్రసంగించిన పార్క్, ఏకీకరణకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని హామీ ఇచ్చారు. ఏకీకరణ కోసం రూపొందించిన మూడెంచల పథకానికి కొత్తరూపు ఇవ్వవలసిన సమయం కూడా వచ్చిందని ఆ శాఖ ప్రస్తుత మంత్రి రేయూ కిల్ జెయీ అనడం విశేషం. ఇలా బంధువుల కలయికకు అవకాశం కల్పిస్తూ 2010 తరువాత కార్యక్రమం జరగడం మళ్లీ ఇప్పుడే. నిజానికి 1990 ముందు కూడా ఐక్యత కోసం కొంత కృషి జరిగింది. సన్ మ్యూంగ్ మూన్ (1920-2012) అనే పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో ‘యూనిఫికేషన్ చర్చి’ పేరుతో 1954 నుంచి ఒక ప్రయత్నం జరిగింది. ఉత్తర కొరియాకే చెందిన మూన్ నలభయ్ దశకంలో కమ్యూనిస్టులతో కలసి జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడినవాడే. తరువాత ఉత్తర కొరియా ప్రభుత్వం చర్చి పట్ల విద్వేషపూరితమైన వైఖరి అవలంబించడంతో దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చాడు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ ఆసియాలో నాలుగో స్థానంలో ఉంది. ఉత్తర కొరియా కంటె నలభయ్ రెట్లు పెద్దది. అయినా ఆ దేశాన్ని కలుపుకోవాలని ఆశిస్తున్నది. కానీ ఈ ఆశయానికి యువతరం అనుకూలంగా లేకపోవడం గమనించాలి. సమస్యలతో సతమతమవుతున్న దేశాన్ని ఇప్పుడు విలీనం చేసుకోవలసిన అవసరం ఏమొచ్చిందన్నదే ఎక్కువ మంది యువకుల ప్రశ్న. అయితే రెండు దేశాల రాజ్యాంగాలు విలీనాన్ని ఒక ఆశయంగా పొందుపరుచుకున్నాయి. అయినా ఈ ప్రతిపాదనకు ఉత్తర కొరియా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ విలీనం కోసం దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తన నాయకత్వంలోనే నిర్వహింప చేస్తున్నారు. సైనిక విన్యాసాలతో, నిరంతర వివాదాలతో ఉత్తర కొరియా ఉంటున్నప్పటికీ ఏకీకరణ విషయంలో పార్క్ ప్రయత్నాలు మానుకోవడం లేదు. పార్క్ తొలి యేటి పని తీరుపై మంచి మార్కులు వేయడానికి ఆమె ఉత్తర కొరియా విధానం కూడా కారణమని పలువురు పేర్కొన్నారు. - కల్హణ