పోలవరంపై పంతం నెగ్గించుకున్నకేంద్రం
పోలవరంపై పంతం నెగ్గించుకున్నకేంద్రం
Published Sat, Jul 12 2014 1:56 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
బిల్లుకు లోక్‌సభ ఆమోదం...
ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ చట్ట సవరణ
బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్
ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తున్నారంటూ టీ-ఎంపీల ఆందోళన
తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ సభ్యుల మద్దతు
పోలవరంపై హామీని నెరవేర్చుతున్నామని కేంద్రం వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరంపై కేంద్రం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లును శుక్రవారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలతో పాటు పలువురు సభ్యులు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ.. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. మధ్యాహ్నం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అందజేసిన తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించారు.
ఈ తీర్మానంతో పాటే సవరణ బిల్లును కూడా ఎజెండాలో పెట్టారు. పోలవరం ఆర్డినెన్స్‌కు అనుగుణంగా కేంద్రం రూపొందించిన సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ వినోద్‌కుమార్ తన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అయితే ముందుగా సవరణ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్పీకర్ అనుమతినిచ్చారు.
ఈ సమయంలో టీఆర్‌ఎస్ ఎంపీలతో పాటు వైఎస్సార్‌సీపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ ఆందోళన మధ్యే రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును గతంలో ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గత మార్చి 1న గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే అపాయింటెడ్ డే అయిన జూన్ 2 కంటే ముందే రెండు రాష్ట్రాల సరిహద్దులను మార్చాల్సిన తక్షణ అవసరాన్ని గమనించాం. అందువల్ల వెంటనే ఆర్డినెన్స్ తెచ్చాం. దానికే ప్రస్తుతం చట్టరూపం ఇస్తున్నాం. ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. అలాగే పాలనాపరమైన సౌలభ్యం కూడా ఉంటుంది. భద్రాచలం ఆలయాన్ని తెలంగాణలోనే ఉంచాం. దానికి దారి కూడా వదిలాం. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం తూర్పు గోదావరి జిల్లాకు చెందినదే. అయితే 1958లో ఖమ్మం జిల్లాలో కలిపారు. పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించే సమయంలో అప్పటి ప్రధాని ఓ హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని, పునరావాస ప్యాకేజీ అమలు కోసం అవసరమైతే చట్టాన్ని సవ రిస్తామని తెలిపారు. అందువల్ల ఈ బిల్లును పరిశీలించి ఆమోదించాలని సభను కోరుతున్నా’ అని హోంమంత్రి పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణ ఎంపీల ఆందోళన కొనసాగుతుండగానే ఈ ప్రసంగమంతా సాగింది. దీంతో ఈ సవరణ బిల్లును పరిశీలనకు పెడుతున్నట్టు స్పీకర్ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడేందుకు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కు అవకాశమిచ్చారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ వినోద్‌కుమార్ ఆవేశంగా మాట్లాడారు. ‘ మార్చి 1నే గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడే తెలంగాణ రాష్ర్టం ఏర్పడినట్లు. అపాయింటెడ్ డేను ప్రకటించిన తర్వాత విభజన బిల్లును సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించాలి. సంబంధిత రాష్ట్రాల శాసన వ్యవస్థల అభిప్రాయం తెలుసుకున్నాకే రాష్ట్రపతి ఈ బిల్లును సిఫారసు చేయాలి. కానీ ఈ ప్రక్రియ జరగలేదు. అందువల్ల ఈ అంశంపై ముందు చర్చ జరిగాకే బిల్లులోకి వెళదాం. అందువల్ల ముందుగా స్టాట్యుటరీ రిజల్యూషన్‌పై చర్చకు అనుమతించండి.
దీన్ని బిల్లుతో కలపొద్దు’ అని ఆయన కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ‘ఆనవాయితీ ప్రకారం ఈ రెండింటినీ కలిపాం. మీరు తీర్మానంపై మాట్లాడినందున ఇప్పుడు బిల్లుపై మాట్లాడండి. ఒకవేళ మీరు మాట్లాడదలుచుకోని పక్షంలో మరో సభ్యుడికి అవకాశమిస్తాను’ అని పేర్కొన్నారు. దీంతో వినోద్ మాట్లాడుతూ.. ‘కేంద్రం ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులు మార్చాలనుకుంటున్న విషయం సభ్యులందరికీ తెలియనివ్వండి. అన్ని రాష్ట్రాలూ తెలుసుకోనివ్వండి’ అని అన్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో టీ-కాంగ్రె స్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ సూచించారు. అయితే ఇదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతరాయ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు.
ఆర్డినెన్స్‌ను ఏయే సందర్భాల్లో జారీ చేయాలన్న అంశాన్ని చదివి వినిపించారు. అలాగే రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగ నిబంధనలు వివరిస్తూ.. ఈ బిల్లును తెచ్చే ముందు ప్రభావిత రాష్ట్రాల అభిప్రాయాన్ని రాష్ర్టపతి తెలుసుకున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే, ఆ ప్రక్రియను పాటించకుండానే ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చట్ట సమ్మతం కాదు. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం’ అని పేర్కొన్నారు. తర్వాత స్పీకర్ స్పందిస్తూ.. ఎంపీ వినోద్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు.
‘స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను, ఆర్డినెన్స్‌ను చట్టరూపంలోకి తెచ్చే బిల్లును కలిపి ప్రవేశపెట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. వీటిని కలపరాదన్న నిబంధనేమీ లేదు’ అని పేర్కొన్నారు. అయితే వినోద్ కలుగుజేసుకుంటూ.. ‘ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పడం నా ఉద్దేశం. రెండు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే బిల్లును రాష్ర్టపతి సిఫారసు చేశారు. అందువల్ల దీన్ని సభలో ప్రవేశపెట్టేందుకు అర్హత లేదు’ అని పేర్కొన్నారు.
స్పీకర్ రూలింగ్..
ఈ సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ దీనిపై రూలింగ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ‘ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సభ్యులు సౌగత్‌రాయ్, వినోద్ చెప్పారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే రాజ్యాంగ నిబంధనల మేరకు పరిశీలన జరగాలి. దీని ప్రాథమిక బాధ్యత న్యాయస్థానానిది. పైగా సభ్యులు లేవనెత్తిన అంశం సభావ్యవహారాలను నియంత్రించేది కాదు’ అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు.
డిజైన్ మార్చాలి
ఎంపీ గుత్తా ఒకింత ఆవేశంగా మాట్లాడారు. ‘ఇరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లును తెచ్చారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. సాంకేతిక నిపుణులు కూడా పోలవరం డిజైన్ మార్చాలని చెప్పారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా బదిలీ చేస్తున్నారు. డిజైన్ మార్చడానికి కేంద్రమే సాంకేతిక నిపుణులను నియమించాలి. కొత్త డిజైన్ రూపొందించండి. గిరిజనుల అభిప్రాయాలు తీసుకోండి. నాలుగు రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే బిల్లును తేవాలి. మంద బలంతో సరిహద్దులు మార్చడం సరికాదు. బిల్లును ఉపసంహరించుకోవాలి’ అని పేర్కొన్నారు.
అనంతరం దీనిపై బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ మాట్లాడారు. ‘మేం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. కానీ దీని ప్రస్తుత డిజైన్ వల్ల 307 గ్రామాలు మునిగిపోతాయి. గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల ప్రాజెక్టు ఎత్తు పెంచకపోతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీనిపై సుప్రీంలో కేసు ఉంది. ఇక్కడ ఏ చట్టం చేసినప్పటికీ న్యాయస్థానం దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో సభ్యుల నినాదాలు హోరెత్తడంతో.. ఇక మాట్లాడే అవకాశం లేనందున బిల్లును ఆమోదించే ప్రక్రియను చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే టీఆర్‌ఎస్ తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ కోరగా మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో అది తిరస్కరణకు గురైనట్టు ప్రకటించారు. అలాగే మెజారిటీ సభ్యుల మద్దతుతో క్లాజులవారీగా బిల్లు ఆమోదం పొందింది. అప్పటికే ఆందోళన తీవ్రం కావడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
రాష్ట్రపతి ఆమోదం తర్వాత గత మార్చి 1న గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే అపాయింటెడ్ డే అయిన జూన్ 2 కంటే ముందే రెండు రాష్ట్రాల సరిహద్దులను మార్చాల్సిన తక్షణ అవసరాన్ని గమనించాం. అందువల్ల వెంటనే ఆర్డినెన్స్ తెచ్చాం. దానికే ప్రస్తుతం చట్టరూపం ఇస్తున్నాం. ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. అలాగే పాలనాపరమైన సౌలభ్యం కూడా ఉంటుంది. భద్రాచలం ఆలయాన్ని తెలంగాణలోనే ఉంచాం. దానికి దారి కూడా వదిలాం. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం తూర్పు గోదావరి జిల్లాకు చెందినదే. అయితే 1958లో ఖమ్మం జిల్లాలో కలిపారు. పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించే సమయంలో అప్పటి ప్రధాని ఓ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని, పునరావాస ప్యాకేజీ అమలు కోసం అవసరమైతే చట్టాన్ని సవ రిస్తామని తెలిపారు. అందువల్ల ఈ బిల్లును పరిశీలించి ఆమోదించాలని సభను కోరుతున్నా’ అని హోంమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఆందోళన కొనసాగుతుండగానే ఈ ప్రసంగమంతా సాగింది. దీంతో ఈ సవరణ బిల్లును పరిశీలనకు పెడుతున్నట్టు స్పీకర్ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడేందుకు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కు అవకాశమిచ్చారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ వినోద్‌కుమార్ ఆవేశంగా మాట్లాడారు. ‘మార్చి 1నే గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడే తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. జూన్ 2న అపాయింటెడ్ డేగా నిర్ణయించారు. మే 29న విభజన బిల్లును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించాలి. సంబంధిత రాష్ట్రాల శాసన వ్యవస్థల అభిప్రాయం తెలుసుకున్నాకే రాష్ట్రపతి ఈ బిల్లును సిఫారసు చేయాలి. కానీ ఈ ప్రక్రియ జరగలేదు. ఈ అంశంపై స్టాట్యుటరీ రిజల్యూషన్‌పై చర్చకు అనుమతించండి. దీన్ని బిల్లుతో కలపొద్దు. ఆ తర్వాతే బిల్లును పరిశీలించాలి’ అని ఆయన గట్టిగా కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ‘ఆనవాయితీ ప్రకారం ఈ రెండింటినీ కలిపాం. మీరు తీర్మానంపై మాట్లాడినందున ఇప్పుడు బిల్లుపై మాట్లాడండి. మాట్లాడదలుచుకోని పక్షంలో మరో సభ్యుడికి అవకాశమిస్తాను’ అని పేర్కొన్నారు. దీంతో వినోద్ మాట్లాడుతూ.. ‘కేంద్రం ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులు మార్చాలనుకుంటున్న విషయం సభ్యులందరికీ తెలియనివ్వండి’ అని ఆవేశంగా అన్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో టీ-కాంగ్రె స్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ సూచించారు.
అయితే ఇదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతరాయ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఆర్డినెన్స్‌ను ఏయే సందర్భాల్లో జారీ చేయాలన్న అంశాన్ని చదివి వినిపించారు. అలాగే రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగ నిబంధనలు వివరిస్తూ.. ఈ బిల్లును తెచ్చే ముందు ప్రభావిత రాష్ట్రాల అభిప్రాయాన్ని రాష్ర్టపతి తెలుసుకున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చట్ట సమ్మతం కాదు. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం’ అని పేర్కొన్నారు.
తర్వాత స్పీకర్ స్పందిస్తూ.. ఎంపీ వినోద్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. ‘స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను, ఆర్డినెన్స్‌ను చట్టరూపంలోకి తెచ్చే బిల్లును కలిపి ప్రవేశపెట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. వీటిని కలపరాదన్న నిబంధనేమీ లేదు’ అని పేర్కొన్నారు. అయితే వినోద్ కలుగుజేసుకుంటూ.. ‘రెండు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే బిల్లును రాష్ర్టపతి సిఫారసు చేశారు. దానిపై చర్చను మేం వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
స్పీకర్ రూలింగ్: ఈ సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ దీనిపై రూలింగ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ‘ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సభ్యులు సౌగత్‌రాయ్, వినోద్ చెప్పారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే రాజ్యాంగ నిబంధనల మేరకు పరిశీలన జరగాలి. దీని ప్రాథమిక బాధ్యత న్యాయస్థానానిది. పైగా సభ్యులు లేవనెత్తిన అంశం సభావ్యవహారాలను నియంత్రించేది కాదు’ అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు.
డిజైన్ మార్చాలి: ఎంపీ గుత్తా ఒకింత ఆవేశంగా మాట్లాడారు.
‘ఇరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లును తెచ్చారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. సాంకేతిక నిపుణులు కూడా పోలవరం డిజైన్ మార్చాలని చెప్పారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. గిరిజనుల అభిప్రాయాలు తీసుకోండి. నాలుగు రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే బిల్లును తేవాలి. బిల్లును ఉపసంహరించుకోవాలి’ అని పేర్కొన్నారు. అనంతరం దీనిపై బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ మాట్లాడారు.
‘మేం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. కానీ దీని ప్రస్తుత డిజైన్ వల్ల 307 గ్రామాలు మునిగిపోతాయి. గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల ప్రాజెక్టు ఎత్తు పెంచకపోతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీనిపై సుప్రీంలో కేసు ఉంది. ఇక్కడ ఏ చట్టం చేసినప్పటికీ న్యాయస్థానం దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో సభ్యుల నినాదాలు హోరెత్తడంతో.. ఇక మాట్లాడే అవకాశం లేనందున బిల్లును ఆమోదించే ప్రక్రియను చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే టీఆర్‌ఎస్ తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ కోరగా మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో అది తిరస్కరణకు గురైనట్టు ప్రకటించారు. అలాగే మెజారిటీ సభ్యుల మద్దతుతో క్లాజులవారీగా బిల్లు ఆమోదం పొందింది. అప్పటికే ఆందోళన తీవ్రం కావడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
టీఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్: లోక్‌సభ తిరిగి 2 గంటలకు సమావేశమైంది. ఈ సందర్భంగా రైల్వే బడ్జెట్‌పై చర్చ జరిగింది. అయితే రాజ్యాంగ వ్యతిరేకంగా పోలవరం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకున్నందున నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం పార్టీ సభ్యులతో కలిసి సభ నుంచి బయటకు వచ్చేశారు.
Advertisement
Advertisement