ఆర్డినెన్స్ ఆమోదంపై ఆగ్రహజ్వాల
ఆర్డినెన్స్ ఆమోదంపై ఆగ్రహజ్వాల
Published Sat, Jul 12 2014 2:52 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
భద్రాచలం: పోలవరం ఆర్డినెన్స్‌కు పార్లమెంటు ఆమోదముద్ర వేయటంపై తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌తో పాటు ఇతర అధికారులను ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రామాలయంలో జరిగిన పుష్కరాల సమీక్షలో పాల్గొని వస్తున్న అధికారులను బయటకు వెళ్లకుండా రహదారిపై బైఠాయించారు.
కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐటీ డీఏలో వరదలపై సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులను బయటకు వెళ్ల నీయకుండా అడ్డుకోవటంతో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ రంగనాథ్ అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేతో చర్చించారు.
ఆదివాసీల గోడును కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రాజయ్య చేతులు జోడించి వేడుకున్నారు. అనంతరం భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పీఏపీపీ ఆధ్వర్యంలో ఒడిశాలోని పొడియా నుంచి భద్రాచలం వరకూ చే పట్టిన పాదయాత్ర శుక్రవారం భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడె ం చేరుకుంది.
Advertisement