villages
-
పల్లెను చిదిమేశారు!
సాక్షి, అమరావతి : పల్లెలు కళ తప్పుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కళావిహీనంగా తయారవుతున్నాయి. బడ్జెట్లో పల్లెల ప్రగతి కోసం పైసా కూడా కేటాయించక పోవడం పట్ల గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి బాటలు పడ్డాయి. 2 వేల జనాభా కలిగిన ప్రతి గ్రామంలో ఓ సచివాలయం, ఆ పక్కనే రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రం, పల్లెవాసుల ఆరోగ్య పరిరక్షణ కోసం విలేజ్ క్లినిక్, పిల్లల చదువుల కోసం డిజిటల్ లైబ్రరీ.. నాడు–నేడు ద్వారా ఆధునిక సౌకర్యాలతో రంగు రంగుల స్కూళ్లు.. ఇలా గ్రామ స్వరూపాన్నే మార్చేశారు. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా రూ.4,750 కోట్లతో 10,893 సచివాలయ భవనాలు మంజూరు చేయగా, 9,585 సచివాలయాల భవన నిర్మాణాలు చేపట్టి, 6,879 సచివాలయాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.575 కోట్లతో 3,589 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. నాడు–నేడు పథకం కింద గ్రామాల్లో ఉండే పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టి.. తొలి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూల్స్‌ను అభివృద్ధి చేశారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలు, 447 జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.1,726 కోట్లతో 8,299 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టి, 3,104 భవనాల నిర్మాణం పూర్తి చేశారు. రూ.2,446 కోట్లతో 10,216 ఆర్బీకేల నిర్మాణం చేపట్టగా, దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చు చేసి 5,333 ఆర్బీకే భవనాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.281 కోట్లతో 1,589 బల్క్ చిల్లింగ్ సెంటర్లు నిర్మించారు. నిర్మాణంలో ఉన్న మిగిలిన భవనాలన్నీ దాదాపు 70–80 శాతం పూర్తయ్యాయి.కొద్దిపాటి నిధులు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తవుతుంది. అలాంటిది బడ్జెట్లో వీటి ప్రస్తావన మాట మాత్రంగా కూడా లేకపోవడం విచారకరం. గతేడాది బడ్జెట్లో పైసా కేటాయించలేదు. కనీసం ఈ ఏడాదైనా నిధుల కేటాయింపులుంటాయని భావించారు. వీటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దురాలోచనతోనే ఇలా నిర్లక్ష్యం చేశారని ప్రజలు మండి పడుతున్నారు. -
గ్రామాలే మన బలగం
న్యూఢిల్లీ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా మోదీ 3.0 సర్కారు తాజా బడ్జెట్లో పూర్తి అండదండలు అందించింది. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు ఫ్లాగ్షిప్ పథకాలకు కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు పుష్కలంగా నిధులు కేటాయించారు. అలాగే, ఉపాధికి ఢోకా లేకుండా.. గ్రామీణ రోడ్లు పరుగులు తీసేలా.. బడ్జెట్లో ఫోకస్ చేశారు. ఇక తాగునీటి పథకం.. జల్ జీవన్ మిషన్‌ను 100% పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పొడిగించి, నిధుల వరద పారించారు. భారత్‌నెట్ గొడుగు కింద ఇకపై గ్రామాల్లో ప్రభుత్వ సెకండరీ స్కూళ్లు, పీహెచ్‌సీలకు సైతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం దక్కనుంది. సొంతింటికి ఫుల్ సపోర్ట్ (పీఎంఏవై) 2025–26 కేటాయింపులు: రూ.74,626 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.46,096 కోట్లు (సవరించిన అంచనా)పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి ఫుల్ సపోర్ట్ లభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పీఎంఏవై 2.0 స్కీమ్ కింద చేపట్టనున్నట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే. పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అదనంగా కోటి ఇళ్లు అందించే పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.19,794 కోట్లు కేటాయించారు. 2025–26లో గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందుకు మొత్తం రూ.3,500 కోట్లను కేటాయించారు. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,832 కోట్లు దక్కాయి. 2029 మార్చికల్లా రూ.3.06 లక్షల నిధులతో 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 2024–25లో 40 లక్షల ఇళ్ల లక్ష్యానికి గాను డిసెంబర్ నాటికి 18 రాష్ట్రాల్లో 27.78 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామీణ రోడ్లు.. టాప్ గేర్2025–26 కేటాయింపులు: రూ.19,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.14,500 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను గత బడ్జెట్లో సీతారామన్ ప్రకటించగా.. ఇప్పుడు జోరందుకుంటోంది. 25,000 ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు దృష్టిపెట్టుకుని పక్కా రోడ్లతో అనుసంధానించనున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 17,570 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 35,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘గ్రీన్’టెక్నాలజీతో 18,000 కిలోమీటర్ల రోడ్లు వేయనున్నారు.‘ఉపాధి’కి ఢోకా లేదు2025–26 కేటాయింపులు: రూ.86,000కోట్లు2024–25 కేటాయింపులు: రూ.86,000కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారీ నిధుల ‘హామీ’దక్కింది. అయితే, 2024– 25 సవరించిన అంచనాల (రూ.86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో కేటాయించారు. రా ష్ట్రాల్లో లక్ష్యాలు, అవసరాలను బట్టి అవసరమైతే మరి న్ని నిధులను కేటాయించే అవకాశం ఉంది. 2023– 24లో రూ.60,000 కోట్లు కేటాయించగా, వాస్తవ వ్యయం రూ.89,153 కోట్లు కావడం గమనార్హం.జల్‌జీవన్ మిషన్... మరో మూడేళ్లు పొడిగింపు2025–26 కేటాయింపులు: రూ.67,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.22,694 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రా>మ్ను అమలు చేస్తున్నారు. 2024 నాటికి ఇది సాకారం కావాల్సి ఉండగా.. 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పొడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఏకంగా మూడు రెట్లు నిధులు పెంచారు. కాగా, ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2025–26లో 1.36 కోట్ల కనెక్షన్లు అందించాలనేది బడ్జెట్ లక్ష్యం. కాగా, ‘జన్ భాగీధారీ’ద్వారా నీటి సరఫరా మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెట్టున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.కనెక్ట్ టుభారత్ నెట్.. 2025–26కేటాయింపులు: రూ.22,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 6,500 కోట్లు (సవరించిన అంచనా)దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను (దాదాపు 2.5 లక్షలు) హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ ఉద్దేశం. ఇప్పటిదాకా 2,14323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 6,92,676 లక్షల కి.మీ. పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. అదనంగా 1,04,574 వైఫై హాట్ స్పాట్స్, 12,21,014 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించనుండగా... 64,000 పంచాయతీల్లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నారు.స్వచ్ఛ భారత్.. విస్తరణ2025–26 కేటాయింపులు: రూ. 12,192 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 9,351 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2025–26లో 2 లక్షల వ్యక్తిగత టాయిలెట్లు, 20,000 కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించనున్నారు. 98 శాతం వార్డుల్లో ఇంటింటికీ ఘన వ్యర్థాల సేకరణను అమలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 89,000 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణలోకి తీసుకురానున్నారు. 60,000 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయనున్నారు. అలాగే 800 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. కాగా, స్వచ్ఛభారత్ 2.0 కింద తాగునీరు, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల కోసం 100 నగరాలను గుర్తించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
కష్టం.. అయినా ‘సాగు’ ఇష్టం!
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా కొనసాగుతోంది. 2016–17 సంవత్సరంలో నిర్వహించిన నాబార్డు రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవపసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా, 2021–22లో అది 57 శాతానికి పెరిగింది. అంటే దేశం మొత్తం మీద వ్యవసాయ కుటుంబాలు 9 శాతం మేర పెరిగినట్లు సర్వే స్పష్టం చేసింది.ఏపీతో సహా 20 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాలు(farming families) 34 శాతం ఉంటే, 2021–22లో 53 శాతానికి పెరిగాయి.అంటే రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం మేర పెరిగినట్లు స్పష్టం అవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో అత్యధిక కుటుంబాలు వ్యవసాయేతర కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్నట్లు సర్వే పేర్కొంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో అత్యధికంగా 82 శాతం వ్యవసాయేతర కుటుంబాలే ఉన్నాయి. కేవలం 18 శాతం కుటుంబాలే ఈ రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలున్నట్లు సర్వే వెల్లడించింది. -
పల్లె కన్నీరు పెడుతోందో..
సాక్షి, రాజమహేంద్రవరం/చాగల్లు: సంక్రాంతి వస్తోందంటే గోదావరి వాసుల అతిథి మర్యాదలే గుర్తుకొస్తాయి. గోదారోళ్లా మజాకా అనిపిస్తారు. అందుకే ఎక్కడున్నా ఈ పెద్ద పండగకు వారం నుంచి మూడు రోజుల ముందే స్వగ్రామాలకు వచ్చేస్తారు. ఆటపాటలు, కోడి పందేలు, బావామరదళ్ల అల్లర్లతో అసలు తగ్గేదేలే అన్నట్టుగా సంబరంగా ఈ పండగ నిర్వహించుకుంటారు. నచ్చిన వంటకాలు చేసుకుంటారు. కుటుంబమంతా ఒక్కచోటకు చేరి సంతోషంగా గడుపుతారు. కొత్త అల్లుళ్లకు పదుల సంఖ్య వంటలు వండి విందుభోజనం పెడతారు. గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంక్రాంతి సందడి ఈ ఏడాది ఆశించిన మేర కనిపించడం లేదు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల వద్ద పుష్కలంగా డబ్బులుండేవి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా.. జనం కష్టపడి సంపాదించుకున్నదానికి ప్రభుత్వం అందించే సొమ్ము తోడయ్యేది. ఫలితంగా గత ఏడాది సంక్రాంతి పండగను ప్రజలు ఎంతో సంబరంగా నిర్వహించుకున్నారు. కానీ, ఈ ఏడాది ఆ సందడి కానరావడం లేదు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. వరుస విపత్తులతో ఖరీఫ్ పంటలు దెబ్బ తినడం.. ఆర్థిక సమస్యలు.. పెరిగిన ధరలు వంటి కారణాలతో ప్రజల వద్ద డబ్బు లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది దాదాపు ఏ వ్యాపారమూ ఆశించిన మేర జరగడం లేదు. గ్రామీణ ప్రజల్లో పండగ జోష్ కూడా కనిపించడం లేదు. ఊనగట్ల.. పండగ కనబడటంలే.. మూడు గ్రామాలకు వ్యాపార కేంద్రంగా ఉన్న ఊనగట్ల జనాభా 7,500. గ్రామంలో 5,300 మంది ఓటర్లున్నారు. ఉదయం 9 గంటల సమయంలో ‘సాక్షి’ బృందం ఆ గ్రామంలోకి అడుగు పెట్టింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విస్తృతంగా పర్యటించింది. కనబడిన ప్రతి ఒక్కరినీ పలకరించింది. గత ఏడాది ఈపాటికే గ్రామంలో కొద్ది రోజుల ముందే సంక్రాంతి సందడి కనిపించేది. కానీ ఈసారి భోగి పండగ ముందు రోజు కూడా వీధుల్లో సంక్రాంతి ముగ్గులు, ఇళ్లల్లో బంధువుల సందడి కనిపించలేదు. గొబ్బెమ్మల కోలాహలమే లేదు. దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో పిండివంటలు వెతికినా దొరకని పరిస్థితి. అదేమని గ్రామస్తులను ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. ‘గత ఏడాదే నయం. చేతి నిండా డబ్బుండేది. పండగ ధూం ధాంగా చేసుకునే వాళ్లం’ అంటూ నిట్టూర్చారు.వైఎస్సార్ సీపీ హయాంలో రూ.51.07 కోట్ల మేర సంక్షేమం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. ఈ క్రమంలో ఊనగట్ల గ్రామానికి 33 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ , పరోక్ష చెల్లింపుల విధానంలో ఏకంగా రూ.51.07 కోట్ల మేర లబ్ధి చేకూరింది. డీబీటీ ద్వారా రూ.33,70,37,857, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.14,28,32,390 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఇవి కాకుండా నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేపట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే చేర్చారు. అమ్మ ఒడి, పింఛన్లు, చేయూత, జగనన్న విద్యా, వసతి దీవెన వంటి అనేక పథకాలతో ఆర్థిక ఆసరా కల్పించారు. పండగ సమయానికి ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. దీంతో అప్పట్లో సంక్రాంతి పండగను సంతోషంగా నిర్వహించుకునే వారమని పలువురు ‘సాక్షి’కి చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గ్రామానికి రూ.51.07 కోట్ల లబ్ధి చేకూర్చాం. రూ.1.30 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశాం. రూ.80 లక్షలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు చేపట్టాం. రూ.2.20 కోట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాం. 204 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికాం. రూ.1.03 కోట్లతో ఊనగట్ల – అమ్ముగుంట రోడ్డు పనులు నిర్వహించాం. రూ.50 లక్షలతో ఊనగట్ల – కలవలపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం పథకాలేవీ అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – మట్టా వెంకట్రావు, ఊనగట్ల,సర్పంచ్ -
అయ్యవారికి దండం పెట్టు..
వేలేరు: సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దుల వారికి పండుగే. బసవన్న కాలికి, మెడకు గజ్జెల పట్టీలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించి, కొమ్ములకు రంగులద్ది.. సన్నాయి ఊదుతూ.. ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. అయితే పండుగ వేళ ఇళ్ల ఎదుట సందడి చేసే గంగిరెద్దుల ఆటలు నేటి ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామంలో సుమారు 45 గంగిరెద్దుల వారి కుటుంబాలు నివసిస్తున్నాయి.వీరికి గంగిరెద్దుల ఆటనే ప్రధాన వృత్తి. తాతల కాలం నుంచి అదే వృత్తిని నమ్ముకుని జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి అంతో ఇంతో ఆదాయం వచ్చేది సంక్రాంతి పండుగ సమయంలోనే. మిగతా సమయంలో గంగిరెద్దుల ఆటతో వచ్చే ఆదాయం సరిపోక బతుకుదెరువు కష్టమై కూలి పనులు చేస్తున్నారు. అలాగే ఎవరైనా చనిపోతే దశదినకర్మ సమయంలో వెళ్లి ఆటలు ఆడిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాల్లో వెలుగులు రావడం లేదని వారు వాపోతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. తాతల కాలం నుంచి గంగిరెద్దులను ఆడిస్తూనే బతుకుతున్నాం. మాకు ఏ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందలేదు. ఎన్నికలప్పుడు నాయకులు ఓట్లు వేయించుకోవడానికే మా దగ్గరికి వస్తారు. తర్వాత మా ఇళ్లవైపు కన్నెత్తి చూడరు. మా గంగిరెద్దుల కుటుంబాలకు 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వమైనా మాకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఆదుకోవాలి. – బత్తుల మల్లయ్యకులవృత్తే జీవనాధారం..కులవృత్తిలో భాగంగా నా భర్త గంగిరెద్దులను ఆడిస్తాడు. సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడంతో పండుగ ఖర్చులు వస్తాయి. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దశదినకర్మ వద్దకు వెళ్లి గంగిరెద్దులను ఆడిస్తుంటారు. మిగతా సమయాల్లో కూలి, ఇతరత్రా పనులు చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ లేదు. – ఆవుదొడ్డి దుర్గమ్మ -
ఆ దున్నపోతు మాదే!
అనంతపురం: దేవర దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఇందు కోసం దేవరలో బలి ఇచ్చేందుకు గ్రామానికి ఒక దున్నపోతును వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు. 21వ తేదీన ముద్దలాపురంలో దేవర ఉంది. దీంతో పక్క గ్రామంలో కట్టేసిన దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. తమ దున్నపోతును వదిలేస్తు దేవర చేసుకుంటామని కోరగా కడదరకుంట గ్రామస్తులు ఇందుకు ససేమిరా అన్నారు. అది తమదేనని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ముద్దలాపురం గ్రామస్తులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించే సోమవారం రోజున రావాలంటూ సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. -
నగరాలు నిండిపోతున్నాయ్..!
సాక్షి, అమరావతి: నగరాలు నిండిపోతున్నాయి. సమీప గ్రామాలు సైతం పట్టణాల్లో విలీనమవుతున్నాయి. మరో పదేళ్లల్లో దేశజనాభాలో 40 శాతం పట్టణాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారని కేంద్రం అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోతే ప్రమాదమని కేంద్రం భావిస్తోంది. దీంతో పట్టణీకరణపైనా, మౌలిక సదుపాయాల కల్పన పైనా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది.పట్టణీకరణపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా కమిటీని వేయడంతో పాటు వచ్చే ఐదు దశాబ్దాలు మన నగరాలు ఎలా అభివృద్ధి చెందాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2022లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీనిప్రకారం 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 60 కోట్లకు చేరుతుందని, 2047 నాటికి 80 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో పట్టణీకరణ సమీప భవిష్యత్‌లో అత్యవసరమని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్ నగరీకరణ ప్రణాళిక, సంస్కరణలను సిఫారసు చేసింది.ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్ అవశ్యంపట్టణ ప్రణాళికను పర్యవేక్షిస్తున్న శిక్షణ పొందిన నిపుణులకు ప్రాధాన్యతనిస్తూ, టౌన్ ప్లానింగ్‌లో అర్హత కలిగిన ప్లానర్లను నియమించుకోవడానికి ‘ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్’ అవసరాన్ని నివేదిక పునరుద్ఘాటించింది. ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ తరహాలో ఉండాలని పేర్కొంది. దీంతోపాటు నేషనల్ అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ అథారిటీని రూపొందించడానికి, బలోపేతం చేయడానికి టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సూచించింది.పట్టణాలకు ఆర్థిక స్థిరత్వంపట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేది సిఫార్సుల ముఖ్యాంశాల్లో ఒకటి. ఒక నగరం బడ్జెట్ మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నగరాలు, పట్టణాల్లో వసూలు చేసే ఆక్ట్రాయ్ పన్నుల ద్వారా ఆదాయం సమకూరే అవకాశం లేనందున నగరాల్లో చేపట్టే ప్రాజెక్ట్‌లకు ఆర్థిక వనరులను మల్టీ లేటరల్ లోన్లు, దేశీయ టర్మ్లోన్లు, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం, మునిసిపల్ బాండ్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని సూచించింది. తమిళనాడు తరహాలో పట్టణాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలని తెలిపింది.అలాగే పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ)లు సమర్థవంతమైన పనితీరుతో స్వతహాగా ఆర్థిక వనరులను పెంచుకోవాలని, జీఎస్టీ రాబడిలో కొంత భాగాన్ని పంచుకోవడం తప్పదని కమిటీ సిఫారసు చేసింది. ఉదాహరణకు... మహారాష్ట్రలో వసూలు చేసే జీఎస్టీలో స్థానిక సంస్థల పన్నులు కూడా ఉన్నాయని, ఆ మొత్తాన్ని యూఎల్బీలకు ఇస్తున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ‘నగర ఆర్థిక అభివృద్ధి కౌన్సిళ్లు’ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. స్థానిక వ్యాపారాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో ఈ స్టాండింగ్ కమిటీ ఉండాలని పేర్కొంది.ఇది కేవలం సలహా సంఘంగా మాత్రమే కాకుండా పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యాల కొరతను పూరించడానికి వాటితో సంఘటితం కావాలని సూచించింది. ఈ సూచనలను అసోం, గుజరాత్, హరియాణా, జమ్మూ–కశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పరిస్థితుల అధ్యయనం తర్వాత చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఇదే తరహా విధివిధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది.పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న సాగుభూమిపట్టణ జనాభా 1961లో 79 మిలియన్ల నుంచి 2011లో 388 మిలియన్లకు పెరిగింది, 2030 నాటికి 630 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ సమయంలో తలసరి సాగు భూమి 1950–51లో 0.83 హెక్టార్లు ఉండగా, ఇది 2015–16 నాటికి 0.12 హెక్టార్లకు తగ్గిపోయింది. 2030 నాటికి ఇది మరింత క్షీణించి 0.08 హెక్టార్లకు తగ్గుతుందని అంచనా. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని నివేదిక హెచ్చరించింది. ఈ క్షీణత ఆహార భద్రత, స్థిర వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధికి గణనీయ సవాళ్లను విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.చాలా దేశాల్లో నగరాలు బహుళజాతి సంస్థల్లా నడుస్తూ, సొంతంగా నిధులు సమకూర్చుకుంటుంటే, మన దేశంలో ఇంకా నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా నిధులు సమకూరుస్తుండగా, యూఎల్బీలు తమ రాబడి నుంచి 15 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. నగరాల మౌలిక సదుపాయాల అవసరాల్లో 5%మాత్రమే ప్రైవేట్ వనరుల ద్వారా నిధులు వస్తున్నాయని.. వీటిని మరింత పెంచాల్సిన అవసరముందని పేర్కొంది. పట్టణీకరణను నివారించాలని సూచనపరిశ్రమలు, వ్యాపార ప్రాంతాల (బ్రౌన్ఫిల్డ్) కోసం వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలనే రియల్టర్ల ఆశ పట్టణ విస్తరణలకు దారితీసింది. ఫలితంగా పర్యావరణం క్షీణించడం, వ్యవసాయ యోగ్యమైన భూమిని కోల్పోవడంతో పాటు పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. -
జీవన గమనం.. పట్నం పయనం!
పల్లెలు మెల్లిమెల్లిగా ఖాళీ అవుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలే గ్రామాలు వదిలి వెళ్తుండటంతో జనం లేక కళతప్పుతున్నాయి. మారిన జీవన గమనంలో వివిధ అవసరాల నిమిత్తం పల్లెజనం పట్నం బాట పడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నదాంట్లోనే సర్దుకుపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల మొగ్గు పట్టణాల వైపే కనిపిస్తోంది. పట్టణాల్లో స్థిరపడేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే జిల్లాలోని పట్టణాల్లో జన సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పల్లెల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. రూ.15 వేలు అంతకంటే తక్కువ వేతనం ఉన్న ప్రైవేటు ఉద్యోగులు సైతం పట్టణాల్లో స్థిరపడుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే తమ పిల్లలను పట్టణాల్లో చదివించేందుకు ఎక్కువమంది తల్లిదండ్రులు వస్తున్నట్లు తేలింది. పదేళ్లలోనే లక్షన్నర మంది.. అనంతపురం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి పరిధిలో 6.27 లక్షల మంది మాత్రమే నివసించేవారు. తాజా అంచనాల ప్రకారం ఈ సంఖ్య సుమారు 7.72 లక్షలకు చేరింది. ఒక్క అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 80 వేలకు పైగా జనాభా పెరిగినట్టు తేలింది. తాడిపత్రి, గుంతకల్లు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెల్లో ఉపాధి కరువై.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది పట్టణాలకు వలస వస్తున్నట్టు తేలింది. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కూలి పనులకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. మరికొంతమంది పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూనే పిల్లల చదువుల కోసం పట్టణాలకు వస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి లాంటి పట్టణాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. ప్రభుత్వాలు జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించలేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. సమస్యలెన్నో.. మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుకూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువై అనర్థాలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న మున్సిపాలిటీల్లో నిధులు సమకూరకపోవడంతో వ్యర్థాల నిర్వహణ చాలా అధ్వానంగా తయారైంది. ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ఇవ్వడం సాధ్యపడటం లేదు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1.88 లక్షల గృహాలుండగా ఇంకా 80 వేల గృహాలకు నీటి కొళాయి కనెక్షన్ అందించాల్సి ఉంది. రోడ్లు, నీటి కొళాయిలు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేక పట్టణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనరులు చాలడం లేదు ప్రజలు పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు రావడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు, పిల్లల చదువులే. దీంతో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టు మున్సిపాలిటీల్లో వసతులు సమకూర్చాలంటే ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులు సరిపోవడం లేదు. మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. –నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అనంతపురంజీవనం కష్టంగా మారిందినా భార్యతో కలిసి రెండున్నరేళ్ల క్రితం కళ్యాణదుర్గం వచ్చా. ప్రస్తుతం పట్టణంలోని శంకరప్ప తోట కాలనీలో నివాసముంటున్నాం. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పట్టణంలో ఇంటి బాడుగలు అధికమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం కరెంటు చార్జీలను సైతం పెంచేసింది. మా లాంటి వారు జీవించాలంటే కష్టంగా ఉంది. – మోహన్, శెట్టూరు పల్లెల్లో పనులు లేవు..మా స్వగ్రామం గుమ్మఘట్ట మండలం కలుగోడు. మొదట్లో గ్రామంలోనే ఉండేవాళ్లం. అక్కడ పనులేవీ దొరక్క పదేళ్ల కిత్రం రాయదుర్గం పట్టణానికి వలస వచ్చాం. నా భార్య టైలరింగ్ పనులు చేస్తుంది. నేను హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. నాలాగే చాలామంది పల్లెలు వదిలి పట్టణాల్లో జీవనం సాగిస్తున్నారు. – షమీవుల్లా, రాయదుర్గంటీ కొట్టుతో జీవనం మాది కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామం. నా చిన్నప్పుడే ఊరు వదిలి బళ్లారిలోని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరా. ఆదాయం సరిపోక రాయదుర్గం వచ్చి టీ కొట్టు ప్రారంభించా. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటున్నారు. పల్లెల నుంచి పట్నం చేరే వారి సంఖ్య క్రమంగా ఎక్కువైంది. అనేక కారణాలతో ప్రజలు గ్రామాలను వీడుతున్నారు. – రంగప్ప, రాయదుర్గం -
Telangana: జిల్లాలన్నీ 'ఉడా'లే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని గ్రామాలు మినహా.. రాష్ట్రమంతా వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ–ఉడా)ల పరిధిలోకి వెళ్లింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉడాలు ఉండగా, తాజాగా వాటి పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతోపాటు.. ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, కొన్ని జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇప్పటివరకు ఉడాలు లేని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కొత్తగా మరో 19 ఉడాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఉడాలు ఏర్పాటైనట్టయ్యింది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆ జిల్లాలోని మండలాల్లో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు చేరాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉడాల పరిధిలోకి రావడం గమనార్హం. ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాలే ఉడాల పరిధిలో.. రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో ఏర్పాటు చేసిన మొత్తం 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఇప్పటివరకు చుట్టుపక్కలున్న గ్రామాలు మాత్రమే ఉండేవి. మిగతా గ్రామాలన్నీ డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోకి వచ్చేవి. దీంతో 800 చదరపు గజాల పైబడి నిర్మాణాలకు, గ్రామాల్లో సాగే లే అవుట్ల అనుమతులన్నీ డీటీసీపీ ద్వారానే తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాల పరిధి మొత్తానికి ఉడాలను విస్తరించడంతో లే అవుట్లతో పాటు 800 చదరపు గజాల నిర్మాణాల అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటైన ఉడాల ద్వారానే పొందే అవకాశం లభించింది. జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్‌కు అవకాశం రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు కూడా సరైన మాస్టర్‌ప్లాన్ లేదు. ఉడాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కొన్ని ప్రయత్నాలు గతంలో జరిగినా వివిధ కారణాల వల్ల కొలిక్కి రాలేదు. ఇప్పుడు జిల్లా పరిధినే యూనిట్‌గా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా మొత్తానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే అవకాశం లభించినట్లయిందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు మండల కేంద్రాల మాస్టర్ ప్లాన్లను కూడా ప్రత్యేకంగా రూపొందించే అవకాశం లభించింది. కేంద్ర నిధులు పెరిగేందుకు దోహదం గ్రామాల్లో సాగే పేదల గృహనిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు కూడా ఉడాల ఏర్పాటు దోహదపడనుంది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పట్టణాలు, కార్పొరేషన్లతో పాటు 10 నుంచి 15 మండలాల్లోని గ్రామాలు వస్తుండడంతో కేంద్రీకృతమైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యధాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యథాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. -
ఎక్కువ పొదుపు చేస్తుంది.. వ్యవసాయ కుటుంబాలే
దేశంలోని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలే అత్యధికంగా పొదుపు చేస్తున్నాయి. మొత్తం పొదుపు చేస్తున్న కుటుంబాల్లో... 71% వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో 58% మాత్రమే పొదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని నాబార్డు వెల్లడించింది. 2021 జూలై నుంచి 2022 జూన్ (వ్యవసాయ సంవత్సరం) వరకు ఆల్–ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వేను నాబార్డుకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. భారత్‌లోని గ్రామీణ జనాభా ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థపై నాబార్డు చేసిన ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక శాతం గ్రామీణ కుటుంబాలు వాణిజ్య బ్యాంకుల్లోనే పొదుపు చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి -
పట్టణాలతో సమానంగా గ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో గ్రామీణ ప్రజల జీవన విధానం మెరుగుపడింది. దీంతో రాష్ట్రంలో వినియోగదారుల వ్యయంలో పట్టణాలు, గ్రామాల ప్రజల మధ్య అంతరం తగ్గిపోతోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు పెరగడంతో అభివృద్ధిలో కూడా అంతరం తరిగిపోయి పట్టణాలతో గ్రామాలు పోటీపడుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం మధ్య అంతరాలను, అసమానతలను ఎస్బీఐ నివేదిక విశ్లేíÙంచింది. గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో తేడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో దేశంలో ఏపీ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.దీనివల్ల రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల మధ్య అసమానతలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. దేశంలో 2009–10లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య తలసరి వ్యయం వ్యత్యాసం 88.2 శాతం ఉండగా 2022–23 నాటికి 71.2 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2029–30 నాటికి ఇది 65.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. – సాక్షి, అమరావతి దేవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.6,459 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 3,773 ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలో 2022–23 నాటికి పట్టణాలు, గ్రామాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 39.3 శాతమేనని తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ. రూ. 6,782 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 4,870 ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న దిగువ, మధ్య తరగతి జనాభా ఆదాయాలు మెరుగుపడటం వల్ల నెలవారీ తలసరి వ్యయంలో అంతరాలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద లబి్ధదారులకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని నివేదిక వివరించింది. గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం వల్ల కూడా గ్రామీణ ప్రజల ఆదాయం పెరగడంతో పాటు నెలవారీ తలసరి వ్యయం పెరుగుతోందని తెలిపింది. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్ల కూడా గ్రామీణ జీవనం గణనీయంగా మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది. 2011–12తో పోల్చి చూస్తే 2022–23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏపీలో అసమానతలు గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అదే ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒడిశా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసమనాతలు పెరగ్గా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అసమానతలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. -
పచ్చటి పల్లెలపై బాబు విషం
సాక్షి, అమరావతి: 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏనాడూ గ్రామాల అభివృద్ధికి, గ్రామీణుల సంక్షేమానికి చర్యలు చేపట్టని చంద్రబాబు.. నేడు వైఎస్ జగన్ హయాంలో గ్రామీణాభివృద్ధి జరగలేదనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఎప్పుడూ కార్పొరేట్లు, పెత్తందారుల సంక్షేమం కోసం పనిచేసే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ సీఎంగా పనిచేసిన కాలంలో ఏనాడూ గ్రామాల అభివృద్ధికి కనీస ప్రయత్నం చేయలేదు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, వారికి కావాల్సిన సౌకర్యాలు, విద్య, వైద్యం గురించి కనీస ఆలోచనే చేయలేదు. గ్రామాలను సర్వనాశనం చేసిన చంద్రబాబే.. ఆ విషయాలన్నింటినీ దాచిపెట్టి, గ్రామాలను అభివృద్ధి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు పాలనలో కుదేలైపోయిన గ్రామాలకు పునరుజ్జీవం కల్పించి, గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధిని సాకారం చేసందే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామగ్రామంలో అభివృద్ధి జరిగింది. రైతులు, అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ అందించిన చేయూతతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రజల అవసరాలు, ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య అన్నీ గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. గ్రామ స్వరాజ్య నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేసి ఫలితాలు చూపించి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. » 2019కు ముందు రాష్టంలో 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2019లో వైఎస్ జగన్ సీఎంగా వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఓ విప్లవం. ప్రతి గ్రామస్తుడికీ, ప్రతి ఇంటికీ వలంటీర్లు సహకారం అందించేవారు. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే వారు. గ్రామ సచివాలయాల్లో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ప్రజలకు అత్యంత వేగంగా సేవలందించేలా కంప్యూటర్లు, ప్రింటర్లు సహా అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. వీటి ద్వారా కుగ్రామాల్లో ఉండే వారు కూడా ఊరు దాటి వెళ్లకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ ఊర్లోనే అందుకొంటున్నారు. » ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్‌లను జగన్ నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,726 కోట్లతో 8,299 హెల్త్ క్లినిక్‌లు నిరి్మస్తున్నారు. వీటిలో 14 రకాల పరీక్షలు చేస్తారు. వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. » విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కోసం రైతులు పడుతున్న అగచాట్లను దూరం చేసేందుకు వైఎస్ జగన్ ప్రతి గ్రామలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. వీటిలో పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం, తేమ కొలిచే యంత్రాలు, విత్తనాలు, భూసార పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా రైతుల ఖర్చు, సమయం చాలా ఆదా అయ్యేవి. » నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ సూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. అత్యా«ధునిక డిజిటల్ తరగతులు, డిజిటల్ ల్రైబరీతో పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారు. » వైఎస్ జగన్ ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడ్డారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేవారు. మార్కెట్లో పంట ఉత్పత్తులు ధరలు పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ప్రభుత్వమే కొనుగోలు చేసేది. దీని ద్వారా రైతు ఎప్పుడూ నష్టం చవిచూడలేదు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినా వెంటనే జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలిచేది. అదే సీజన్లో బీమా పరిహారం అందించేది. ఇదీ చంద్రబాబు పాలన.. చంద్రబాబు పాలనలో గ్రామీణ ప్రజల కష్టాలు దేవుడికే ఎరుక. పంచాయతీల నిధులు గ్రామాల వరకు వచ్చేవి కావు. కనీసం తాగు నీరూ దొరికేది కాదు. పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవి. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా మండల కేంద్రం లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. ఇచి్చన కాస్తంత పింఛనుకూ ఎంతగా ఏడిపించుకు తిన్నారో ప్రతి గ్రామీణుడికీ అనుభవమే. రెండు మూడు వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా కనీసం పంచాయతీ కార్యదర్శి కూడా ఉండేవారు కాదు. సమస్య చెప్పుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీసు ఒక్క రోజూ తెరిచి ఉండేది కాదు. అప్పట్లో... ఊళ్లో ఎవరికన్నా కొత్తగా పింఛను కావాలన్నా, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఏడాదికో, ఆరు నెలలకో జరిగే జన్మభూమి కార్యక్రమం కోసం ఎదురు చూడాల్సివచ్చేది. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చేసిన మోసానికి అన్నదాతలు, అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా కుదేలైపోయి, గ్రామాల్లో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వర్షాభావంతో పంటలు పండక, ప్రత్యామ్నాయం లేక ఊళ్లకు ఊళ్లే వలసపోయాయి. -
PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్‌యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆ ‘క్రీమీలేయర్’ రాజ్యాంగంలో లేదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల అమలు విషయంలో క్రీమీలేయర్ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. -
ఒడిశాలో భారీ వర్షాలు.. 18 గ్రామాలకు సంబంధాలు కట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మల్కన్‌గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు.మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ పరిధిలోని బయపదర్ ఘాట్ రోడ్డులోని తుంబపదర్ గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్‌గిరి, కోరాపుట్‌లోని లమటాపుట్, నందాపూర్ ప్రాంతా నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. ఉత్తర ఒడిశాలోని గంగా మైదానాల్లో అల్పపీడనం ప్రభావంతో జూలై 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం(నేడు) మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, బోలంగీర్, నువాపాడా, సోన్పూర్, ఝర్సుగూడ, సుందర్ఘర్, సంబల్పూర్, కియోంజర్, అంగుల్, డియోగర్, కలహండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.ఆదివారం బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. బార్గఢ్, జార్సుగూడ, సుందర్ఘర్, నుపాడా, నబరంగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
యూపీలో వరదలు.. 500 ఇళ్లలోకి సరయూ నీరు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సరయూ నది వరదల కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు వరదల బారిన పడ్డారు అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.వరద బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. బారాబంకి డీఎం సత్యేంద్ర కుమార్, ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు మూడు రోజులుగా సరయూ నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే 20 సెంటీమీటర్ల మేర పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15 గ్రామాల్లోని 500 ఇళ్లలోకి నీరు చేరిందని డీఎం పేర్కొన్నారు. ఈ కుటుంబాలకు చెందిన వారు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల్లో అధికారులు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు. -
‘ఉపాధి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో పవన్‌కళ్యాణ్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, పనుల పురోగతి, నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసుల వివరాలను అధికారులు పవన్‌కు తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని.. గ్రామాల్లో ప్రొటోకాల్‌ను అనుసరించి సోషల్ ఆడిట్ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చిన్నారుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచాలిగ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక ప్రదర్శనలు గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలన్నారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు పవన్‌కు తెలియజేయగా.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెద్దామని పవన్ అన్నారు. కాగా, తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించిన పవన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడంతో పాటు రక్షిత మంచి నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తుపాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులపై చర్చించారు. -
విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
గ్రామాల ఆగ్రహం.. ఓటింగ్‌కు దూరం
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు మంగళవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. అయితే అనేక ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఓటింగ్ ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు.ప్రాథమిక సమాచారం మేరకు.. బరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామం, సూరత్ జిల్లాలోని సనాధార, బనస్కాంత జిల్లాలోని భఖారీ ఓటర్లు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించగా, జునాగఢ్ జిల్లాలోని భట్గాం గ్రామం, బోడోలి, మహిసాగర్ జిల్లాలోని కుంజర గ్రామాలు పాక్షికంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. సనాధార గ్రామం బార్డోలి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 320 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. స్థానిక ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వయంగా వచ్చి అభ్యర్థించినా గ్రామస్తులు ఒక్క ఓటు కూడా వేయలేదు.పటాన్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బఖ్రీ గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్లు తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు ప్రయత్నించినప్పటికీ, గ్రామస్తులు తమ నిర్ణయం మార్చుకోలేదు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసి వేచి చూసినా గ్రామస్తులు ఓటేయడానికి రాలేదు. బీజేపీ అభ్యర్థి భరత్‌సింగ్ దాభి స్వయంగా గ్రామానికి వెళ్లి అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.భరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామంలో దాదాపు 350 మంది ఓటర్లు కూడా ఒక్క ఓటు కూడా వేయలేదు. ఇక్కడ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి కాదు. నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. సూరత్ స్థానాన్ని బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది. -
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్‌గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్‌లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్‌షాప్స్‌ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్‌బ్యాక్స్‌కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్‌యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
గ్రామాల అభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’
అహ్మదాబాద్: గ్రామాలకు సంబంధించిన ప్రతి అంశానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) 50వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. లక్ష మందికిపైగా రైతులు, పాడి పశువుల పెంపకందారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత అమూల్ కంపెనీని నిర్వహిస్తున్న జీసీఎంఎంఎఫ్ని ప్రపంచంలో నంబర్ వన్ డెయిరీగా మార్చడానికి కృషి చేయాలని పాడి రైతులకు, భాగస్వామ్యపక్షాలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సహకార సంఘం(అమూల్) ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీగా స్థానం దక్కించుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ రంగం ఏటా 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, మన దేశంలో మాత్రం 6 శాతం వృద్ధిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. ఇప్పటికే 8 వేల ఎఫ్పీఓలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సన్నకారు రైతులను వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, ఎగుమతిదారులుగా మార్చాలని సంకలి్పంచామని అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకొచి్చన పథకాలను ప్రస్తావించారు. రైతుల కోసం మైక్రో ఏటీఎంలు, గోబర్దన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఇంధన దాతగా, ఎరువుల దాతగా రైతులు జంతు సంపదను వ్యాధుల బారి నుంచి కాపాడానికి రూ.15,000 కోట్లతో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని, ఇప్పటికే 60 కోట్ల టీకా డోసుల ఇచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రామాల్లో కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ పంటలకు సంబంధించి రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని వివరించారు. సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను ‘అన్నదాత’ నుంచి ఇంధన దాతగా, ఎరువుల దాతగా మార్చాలన్నదే ప్రభుత్వ అకాంక్ష అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతన్నల బాగు కోసం ఇప్పటిదాకా ఎన్నో చర్యలు చేపట్టామని, చెరకు ధర పెంచడం కూడా అందులో ఒకటి అని తెలిపారు. దీనివల్ల కోట్లాది మంది చెరకు రైతులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ మోదీ గురువారం ‘ఎక్స్’లో పలు పోస్టు చేశారు. క్వింటాల్ చెరకు కనీస ధర(ఎఫ్ఆర్పీ)ను మరో రూ.25 చొప్పున పెంచుతూ మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ చెరకు కనీస ధర రూ.350కు చేరుకుంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు ఒంటెలు వంటి జంతువుల సంతతి వృద్ధికి సంబంధించిన పరిశ్రమలు, వ్యక్తులకు 50 శాతం పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నన్ను అవమానించడమే వారి ఎజెండా నవ్సారీ: సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్ పారీ్టపై విమర్శల బాణాలు వదిలారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్సారీ పట్టణంలో ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ మోదీ కులాన్ని ఎంత మంది కాంగ్రెస్ నేతలు దూషించారో మీరందరూ చూసే ఉంటారు. కానీ కాంగ్రెస్ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లెంతగా నన్ను తిడతారో 400 లోక్‌సభ సీట్లు గెలవాలన్న మా సంకల్పం అంతగా బలపడుతుంది. దేశం కోసం కాంగ్రెస్‌కు ఎలాంటి ఎజెండా లేదు. నన్ను తిట్టడమే వారి ఎజెండా. దేశ భవిష్యత్తుపై వాళ్లకు ఎలాంటి చింతా లేదు. ఎంతగా మాపై బురద జల్లుతారో అంతగా ఆ బురదలో 370(సీట్లు) కమల పుష్పాలు విరబూస్తాయి’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 370 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘వారసత్వ రాజకీయాల మాటకొస్తే కాంగ్రెస్‌ను మించినది మరోటి లేదు’ అని విమర్శించారు. ‘బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి దేశ ఘన వారసత్వ పరిరక్షణ చేతకాదు’ అని వ్యాఖ్యానించారు. 2 అణు విద్యుత్ రియాక్టర్లు జాతికి అంకితం సూరత్: నవ్సారిలో సభ అనంతరం ఆయన పొరుగునే సూరత్ జిల్లాలో ఉన్న కక్రాపర్కు చేరుకున్నారు. కక్రాపర్ అణు విద్యుత్ స్టేషన్ వద్ద ప్రధాని మోదీ రెండు అణు విద్యుత్ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు. కక్రాపర్ ఆటమిక్ పవర్ స్టేషన్లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను న్యూక్టియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) రూ.22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెస్సరైజ్డ్ హెవీ వాటర్ రియా క్టర్లు ఇవే కావడం విశేషం. ప్రధాని ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక్కడ తయారైన విద్యుత్ గుజరాత్‌తోపాటు మహా రాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలకు సరఫరా అవుతుంది. -
Fact Check: ఆర్బీకేలపై నిత్యం ఏడుపే
సాక్షి, అమరావతి: రైతుకు అడుగడుగునా అండగా నిలిచి, వారిని చేయిపట్టి నడిపించే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఆర్బీకేలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. వాటి సేవలను రైతులకు దూరం చేయడమే లక్ష్యంగా ఈనాడు దినపత్రిక నిత్యం విషం కక్కుతోంది. ఏపల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని ఓర్వలేక అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టింది. తాజాగా ‘రైతు సేవ వట్టిదే..భరోసా దక్కదే..!’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. ఆరోపణ: వేధిస్తోన్న సిబ్బంది కొరత వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు రేషనలైజేషన్ చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, 1896 మంది అవసరమని గుర్తించి ఆ పోస్టుల భర్తీ చేపట్టారు. ఇటీవలే ఫలితాలు విడుదల చేయగా, ఎంపికైన వారికి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. నెలకు రూ.12వేల వేతనంతో తాత్కాలిక సిబ్బంది(ఎంపీఈవో)ని రెండు దఫాలుగా నియమించి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కర్ని ప్రభుత్వం తొలగించిన దాఖలాలు లేవు. ఆరోపణ: లక్ష్యాల పేరిట సిబ్బందిపై ఒత్తిళ్లు వాస్తవం: వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు సర్టిఫైడ్ సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వీరిపై అదనపు బాధ్యతలు మోపకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేసుకునే వాతావరణాన్ని సృష్టించిందే తప్ప లక్ష్యాల పేరిట ఏ ఒక్కర్ని ఒత్తిడికి గురిచేసిన దాఖలాలు లేవు. అలా అని ఏ ఒక్క సిబ్బంది ఫిర్యాదు చేసిన ఘటనలు లేవు. సిబ్బందికి సచివాలయ శాఖ నుంచి సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మండల అధికారుల సిఫార్సుతో సెలవులు మంజూరు చేస్తున్నారు. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా హాజరు వేసే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది అంతర్గత బదిలీలకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 186 మందిని వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఆరోపణ: అద్దె భవనాలే దిక్కు వాస్తవం: 526 గ్రామాల్లో సొంత భవనాలుండగా, 10,252 గ్రామాల్లో రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.1090.23 కోట్లతో నిర్మించిన 4,554 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.357 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వాటిని మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఆరోపణ: అద్దెలు, బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలేవీ? వాస్తవం: అద్దె భవనాల్లో ఉన్న 3,830 ఆర్బీకేలకు అద్దెల రూపంలో రూ.43 కోట్లు ఖర్చుచేయగా, వచ్చే మార్చి వరకు అద్దెల నిమిత్తం సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. వచ్చే మార్చి వరకు బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా, స్టేషనరీ కోసం ఖర్చు చేసిన సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు జమ చేసారు. స్థానికంగా అందుబాటులో ఉన్న హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్ రైతు భరోసా మాస పత్రిక కోసం ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేర్చే‡ కార్యక్రమం చేపట్టారే తప్ప వీటి కోసం సిబ్బందికి ఎలాంటి టార్గెట్లు విధించలేదు. ఆరోపణ: ఆర్బీకేలకు ఆదరణ కరువు వాస్తవం: అదును దాటక ముందే.. సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతులకు అందిస్తున్నారు. తొలి ఏడాది(2020–21) 1.07 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగ్గా, 3వ ఏడాది (2022–23) 4 లక్షల టన్నులకు అమ్మకాలు చేరాయి. తొలి ఏడాదిలో 2.55 లక్షల మంది ఎరువులు తీసుకుంటే..గతేడాది 10.90 లక్షల మంది తీసుకున్నారు. 2023–24లో ఇప్పటివరకు 8.95లక్షల మంది రైతులు 3.89 లక్షల టన్నుల ఎరువులు తీసుకున్నారు. ఆర్బీకే ద్వారా అమ్మే ఎరువుల రవాణా, నిల్వ, అమ్మకానికి కావాల్సిన సదుపాయాల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. మరొక వైపు 34.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రూ.1,040.39 కోట్ల రాయితీతో 58.74 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13.90 కోట్ల విలువైన 1,784.47 క్వింటాళ్ల పత్తి, మిరప, సోయాబీన్ తదితర విత్తనాలను 44వేల మంది రైతులకు సరఫరా చేశారు. 2020–22 మధ్య 1.51 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేయగా, ఈ ఏడాది ప్రస్తుత రబీలో ఇప్పటికే రూ.18.57లక్షల విలువైన 1657 లీటర్ల పురుగుల మందులను 6వేల మంది రైతులకు పంపిణీ చేశారు. ఆర్బీకేలు లాభాపేక్షతో కూడిన వాణిజ్య కేంద్రాలు కాదు. రైతులకు గ్రామస్థాయిలో ఏర్పాటైన సేవా కేంద్రాలన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగుల మందుల అమ్మకాలు వ్యాపారం కాదు..ఒక సదుపాయం మాత్రమే. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు, ఇథియోపియా, బంగ్లాదేశ్, జర్మనీ, వియత్నాం వంటి విదేశీ ప్రతినిధుల బృందాలు ఆర్బీకే సేవలను శ్లాఘిస్తున్నాయి. అనతికాలంలోనే అవార్డులు, రివార్డులతో పాటు ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఆర్బీకేలపై ఈనాడు విషం కక్కడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘గిరి’ రహదారులకు మోక్షం
మెళియాపుట్టి: ‘గిరి’ గ్రామాల రహదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎత్తయిన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటికి దశాబ్దాలుగా రహదారి సౌకర్యాలు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించి, గిరి శిఖర గ్రామాలను సందర్శించి వారి సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు. రహదారి కష్టాలు తీరితే అన్ని సౌకర్యాలు వారికి అందుతాయనే ఆలోచన చేసి, విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామమైన చందనగిరి గ్రామానికి (రూ.1.25 కోట్లతో 3.10 కి.మీ), హడ్డివాడ (రూ.1.75 కోట్లతో 2.3 కి.మీ), కేరాసింగి (రూ.92 లక్షలతో 1.5 కి.మీ), కేరాసింగిగూడ (రూ.1.5కోట్లతో 2.5 కి.మీ), మొత్తంగా రూ.5.42 కోట్లతో గిరి శిఖర గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు నిధులు తీసుకువచ్చి పనులు సైతం వేగవంతం చేశారు. ప్రస్తుతం హడ్డివాడ గ్రామానికి రహదారి పూర్తి కాగా.. మిగిలిన గ్రామాలకు రహదారి పనులు చివరి దశలో ఉన్నాయి. గిరిజనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే గౌరవం లభించిందని, పోడుపట్టాలు అందుకున్నామని, రైతుభరోసాతోపాటుగా అన్ని పథకాలు అందుతున్నాయని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కొండలపైనుంచి కిందికి దిగి, రేషన్ సరుకులు మోసుకుంటూ వెళ్లిన రోజులు మర్చిపోయేలా చేసి కొండలపైకి నేడు ట్రాక్టర్‌పై సరుకులు తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే రహదారి నిర్మాణాలు పూర్తిచేసి గిరిజనుల కష్టాలకు తెరదించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. గత తెలుగుదేశం పాలకులు గిరిజనులకు చేసిందేమీ లేకపోవడంతో జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేక విమర్శలకే పరిమితమయ్యారు. ఆనందంగా ఉంది గడప గడపకూ వెళ్లిన సమయంలో రహదారులు చూసి బాధపడ్డాను. వారి గ్రామాలకు వెళ్లి కష్టాలను చూశాను. వారి బతుకులు బాగుచేయాలని ఆలోచించి జగనన్న దృష్టికి సమస్యను తీసుకువెళ్లాను. గిరిజనుల సమస్య అనగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. రహదారుల మంజూరుతో ప్రస్తుతం గిరిజనుల కష్టాలు తీరనున్నందుకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేగా వారికష్టాలు తీర్చడం చాలా ఆనందంగా ఉంది. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసిన వ్యక్తి జగనన్న కాబట్టే ఇది సాధ్యమైంది. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు రహదారి కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాం. ఎంతో మంది చుట్టూ తిరిగాం. కానీ మా స్థితి మారలేదు. మహిళా ఎమ్మెల్యే అయినా.. రెడ్డి శాంతమ్మ కాలినడకన మా గ్రామానికి వచ్చి ‘గడప గడపకూ కార్యక్రమం’ నిర్వహించారు. మా సమస్యలు చెప్పుకొన్నాం. అన్నీ చేస్తానని మాటిచ్చారు. రహదారి మంజూరు చేశారు. రోడ్డు పూర్తి కావడంతో మాకష్టాలు తీరాయి. సంతోషంగా ఉంది. – చందనగిరి పోలయ్య, హడ్డివాడ గ్రామం సంతోషంగా ఉంది జగనన్నను పాదయాత్రలో కలిసి గిరిజనుల కష్టాలను వివరించాను. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాన్నారు. ఎమ్మెల్యే దృష్టికి గిరిజనుల సమస్యలు తీసుకెళ్లా.. ఆమె స్పందించారు. కృషికి ఫలితం లభించింది. ఎంతోకాలంగా కొండప్రాంతాలకు సరైన రహదారులు లేక ఇబ్బందులు పడ్డాం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మా గిరిజనుల కష్టాలు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జెడ్పీటీసీగానే కాకుండా నేను కూడా గిరిజనుల్లో ఒకడ్ని కావడం ఆనందంగా ఉంది. సీఎం జగన్, ఎమ్మెల్యే రెడ్డి శాంతికి రుణపడి ఉంటాను. – గూడ ఎండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు, మెళియాపుట్టి మండలం -
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
జగనన్న పాలనలో పల్లెకు పండగొచ్చింది
-
భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలు చూసారా..? (ఫోటోలు)
-
మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం కోరిన ఎమ్మెల్యే కేటీఆర్..
రాజన్న సిరిసిల్ల: 'సిరిసిల్ల 2016లో అక్టోబర్‌లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. అయితే సిరిసిల్ల పట్టణ జనాభా 83 వేల వరకు ఉంది. లక్ష జనాభా ఉంటే ద్వితీయశ్రేణి మున్సిపాలిటీల జాబితాలో చేరడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు సమకూరి.. అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో సిరిసిల్లలో ఏడు గ్రామాలను 2018లో విలీనం చేశారు. ఫలితంగా 33 వార్డులుగా ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీ 39 వార్డులుగా మారింది. అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు చొరవతోనే ఏడు గ్రామాలు మున్సిపల్లో కలిపారు.' - ‘సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాలకు మినహాయింపునిస్తూ.. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపండి. ఆ ఏడు గ్రామాలు సిరిసిల్ల నుంచి విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందరితో చర్చించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించి పంపితే ప్రభుత్వం పరిశీలిస్తుంది..’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే, కేటీఆర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళకు మంగళవారం సూచించారు. - ‘రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్దాపూర్ గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో బలవంతంగా విలీనం చేశారు. మున్సిపల్ నుంచి వేరు చేసి గతంలో మాదిరిగా ఆ పల్లెలను గ్రామపంచాయతీలుగా ఉంచేలా కృషి చేస్తాను. మీ ఏడు గ్రామాల ప్రజల ముంగిట ప్రమాణం చేస్తున్నాను..’ అని నవంబరు 28న సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు. కోర్టుకెక్కిన పల్లెలు సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాల తరఫున పెద్దూరు, సర్దాపూర్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు సిరిసిల్లలో విలీనాన్ని వ్యతిరేకించారు. శ్రీపల్లెలను చంపేస్తారా.. పట్టణీకరణ పేరిట పంచాయతీలను పట్టణాల్లో కలిపేస్తార?శ్రీ అంటూ న్యాయస్థానం విలీన పల్లెల పిటిషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ చివరికి ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఏడు గ్రామాల విలీనం పూర్తయింది. ఆ పల్లెల్లో పదేళ్ల వరకు ఎలాంటి ఆస్తిపన్నులు పెంచబోమని, వేగంగా అభివృద్ధి చేస్తామని విలీన సమయంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి అంతంతే..! సిరిసిల్లలో విలీనమైన ఆ ఏడు గ్రామాల్లో అభివృద్ధి పనులు గత ఐదేళ్లలో అంతంతమాత్రంగానే జరిగా యి. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ భవనా లు వార్డు అభివృద్ధి కేంద్రాలుగా మారాయి. గ్రామపంచాయతీ రికార్డులను మున్సిపల్‌కు అప్పగించారు. ఆ పల్లెల్లో పనిచేసే సిబ్బందిని సైతం మున్సి పల్లో కలిపేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేసే ఉపాధిహామీ పథకం ఆ ఏడు గ్రామాలకు దూరమైంది. మున్సిపల్ నుంచి విడదీసి ఏడు గ్రామాలతో సిరిసిల్ల అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. మొత్తంగా సిరిసిల్లలో విలీనమైన ఆ పల్లెల్లో ఒకరకమైన వ్యతిరేకభావం నెలకొంది. వేములవాడలో తెరపైకి డిమాండ్.. వేములవాడలోనూ ఇలాగే తిప్పాపూర్, అయ్యోరుపల్లె, కోనాయపల్లె, శాత్రాజుపల్లె, నాంపల్లి గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆ గ్రామీణ ప్రజలు కూడా ప్రత్యేకంగా గ్రామాలుగా ఉండాలని కోరుకుంటున్నాయి. సిరిసిల్లలో విలీనబంధం వీడి తే.. అక్కడ కూడా ఇదే డిమాండ్ తెరపైకి వస్తుంది. కౌన్సిల్లో తీర్మానం జరిగేనా? సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో విలీన గ్రామాలను వేరు చేస్తూ తీర్మానం జరుగుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్లో కలి సిన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. మళ్లీ ఆ గ్రామాలు పంచాయతీలుగా మారితే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా గ్రామాల్లో భూములపై పెట్టుబడులు పెట్టారు. విలీనబంధం విడిపోతే ఏడు గ్రా మాలు దూరమై సిరిసిల్ల పట్టణ జనాభా తగ్గిపోయి మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం పడిపోతుంది. ఇలాంటి కారణాలతో కౌన్సిల్లో ఏకాభిప్రా యం సాధ్యమవుతుందా? అనే సందేహాలు ఉన్నా యి. ఒక వేళ కౌన్సిల్ తీర్మానం చేసినా.. ప్రభుత్వ స్థాయిలో ఆమోదం లభిస్తుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో విలీన గ్రామా ల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇవి చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం! -
Telangana: మందు బాబులకు షాకింగ్ న్యూస్..
కరీంనగర్ క్రైం: పల్లె ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్న బెల్ట్‌షాపుల నిర్వహణకు ప్రభుత్వ కళ్లెం వేసేలా చర్యలకు ముందడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులు ఎత్తివేసేలా సర్కారు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా సుమారుగా మూడువేల వరకు బెల్ట్షాపులుండగా రూ.కోట్లలో వ్యాపారం సాగుతోంది. పల్లెల్లో పదుల సంఖ్యలో కిరాణషాపులు, హోటళ్లలో బాహటంగానే దందా నడుస్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు శ్రీమామూలుశ్రీగా తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యానికి బానిసలుగా.. ► గ్రామాల్లో బెల్ట్‌షాపుల పేరిట మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉండడంతో కూలీలు మొదలుకుని రైతులు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారు కష్టపడి సంపాదించిన దాంట్లో ఎక్కువశాతం తాగడానికే వెచ్చించడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ► వైన్స్‌లు నిర్ణీత సమయాల్లో మూసివేస్తున్నా.. బెల్ట్‌షాపులకు నియంత్రణ లేకపోవడంతో యువత ఎక్కువశాతం బానిసలవుతున్నారని మహళల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ► బెల్ట్‌షాపులను మూసివేయాలని పలుమార్లు మహిళలు, వివిధ సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో బెల్ట్‌షాపులపై ఎకై ్సజ్‌శాఖ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బెల్ట్‌షాపులు నిర్వహించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేదిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ► అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు అన్ని బెల్ట్‌షాపులు మూసివేయించారు. కోడ్ ముగియగానే మళ్లీ బెల్ట్‌షాపుల దందాలకు రెక్కలొచ్చాయి. జిల్లావ్యాప్తంగా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్ట్‌షాపులకు సంబంధించిన అధికారుల మూముళ్ల విషయం వైన్స్ నిర్వాహకులే చూసుకుంటున్నట్లు తెలిసింది. ► రూరల్ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు కొందరు ఈ వ్యవహరాన్ని మామూలుగా తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో బెల్ట్‌షాపులు మూసివేసి వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
సారూ..! మా గ్రామాలకు 'మహాలక్ష్మి' కరుణించేదెలా?
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణా వ్యవస్థను మహిళలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం చాలామందికి చేరడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కలిపి మొత్తం 487 సర్వీసులున్నాయి. రోజుకు సుమారు లక్ష యాభై వేల మంది మహిళా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని ఎన్నో మారుమూల గ్రామాలకు నేటికీ బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో వారిపై రవాణా భారం పడుతుంది. ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఎంతోమంది అతివలు ఈ అదృష్టానికి నోచుకోవడం లేదు. కారణాలు అనేకం.. ఆదాయం సరిగా రావడం లేదని ఉద్దేశంతో జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం మానేసింది. కరోనా మహమ్మారి అనంతరం పెద్ద సంఖ్యలో పల్లెలకు బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ..తిరిగి ఆయా రూట్లలో పునరుద్ధరించడంలో వెనకడుగు వేసింది. ఆదాయం సరిగా రావడం లేదని, రహదారి సౌకర్యం సరిగా లేదనే కారణాలతో బస్సులను పూర్తిస్థాయిలో నిలిపేయడం వలన పల్లె ప్రజానీకానికి ప్రజా రవాణా వ్యవస్థ దూరమవుతోంది. మండల, జిల్లా కేంద్రాలకు నిత్యం రాకపోకలు సాగించే మహిళలే పల్లె వెలుగు బస్సుల్లో అధికంగా ప్రయాణిస్తుంటారు. వారు బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో అన్ని రూట్లకు బస్సులను నడిపితే పెద్ద సంఖ్యలో మహిళలకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలెన్నో.. ► జిల్లాలోని 18 మండలాల్లో 556 గ్రామాలు ఉండగా, వీటిలో ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ► సిరికొండ మండల కేంద్రానికే బస్సు లేకపోవడం గమనార్హం. అలాగే మండల పరిధిలో ఉన్న 52 గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం లేదు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం సమయంలో బస్సులను ప్రత్యేకంగా నడిపేవారు. ప్రస్తుతం వాటిని నిలిపివేయడంతో ఆయా గ్రామాలవాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ► ఇచ్చోడ మండలంలో 32 గ్రామాలు ఉండగా ఒక్క గ్రామానికి కూడా బస్సు వెళ్లని పరిస్థితి. ► బజార్హత్నూర్ మండలంలోని 64 గ్రామాలు ఉండగా ఇందులో 54 బస్సు సౌకర్యానికి దూరంగా ఉంటున్నాయి. ► తాంసి మండలంలోని తాంసి మండల కేంద్రం, గిరిగాం, అంబుగాం, అట్నం గూడా, భీంపూర్ మండలంలోని గొల్లఘాట్, గుబిడిపల్లి, గుంజాల గ్రామాలకు, జైనథ్ మండలంలోని మాకోడ,పిప్పల్ గావ్ గ్రామాలకు బస్సు సదుపాయం అందుబాటులో లేదు. ► నేరడిగొండ మండల కేంద్రం నుంచి గతంలో బొందిడి గ్రామం వరకూ ఓ సర్వీస్ నడిపేవారు. ప్రస్తుతం దానిని నిలిపివేయడంతో అటువైపుగా ఉన్న వడూరు, బొందిడి, భవా ని తండా, గంభీర్ తండా, దర్బా, దర్బాతండా సుర్దాపూర్, రేంగన్వాడి గ్రామాలకు వెళ్లే వారికి ప్రైవేట్ వాహనాలే దిక్కువుతున్నాయి. ► బేల మండలంలోని బాధి, హేటి, దేవో జిగూడ, భవానిగూడ, రాయిపూర్ తండా, దుబ్బగూడా వంటి పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. అలాగే ఉట్నూరు, నార్నూరు, ఇంద్రవెల్లి, గాదిగూడ, తలమడుగు, బోథ్ మండలాల్లోనూ ఎన్నో గ్రామాల జనం ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి! సిరికొండలోని మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నాను. బస్సు సౌకర్యం లేక నేను ఇచ్చోడ నుంచి సిరికొండకు ప్రైవేట్ వాహనాల్లో రావాల్సి వస్తుంది. సమయానికి వాహనాలు లేక అప్పుడప్పుడు ఆలస్యమవుతుంది. ఇప్పటికై నా మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలి. – ఉష, ఉపాధ్యాయురాలు, సిరికొండ మహాలక్ష్మి వర్తించట్లే..! మా గ్రామాలకు బస్సే రానప్పుడు మహాలక్ష్మి పథకం ఎట్ల వర్తిస్తది. పథకంతోని పైసలు లేకుండా ఎంత దూరమైనా పోవచ్చని చెప్తున్నరు. ఇట్లాంటి పథకం పెట్టినట్టు చాలామంది మహిళలకు తెల్వది. ఈ పథకం గురించి అందరికీ చెప్పుడే కాకుండా దీన్ని వాడుకునేలా ప్రచారం చేయాలి. – సంగీత, గిరిజాయి, బజార్హత్నూర్ బస్సు నడిపిస్తే మంచిగుంటది.. అప్పట్లో మా ఊరు సైడు బస్సు నడిచేది. ఇప్పుడు బంద్ అయింది. అప్పటినుంచి ఆటోలల్లనే నేరడిగొండకు పోతున్నం. ఇప్పుడు ఫ్రీగా బస్సులో పోవచ్చని చెబుతున్నరు. సార్లు మళ్లా మా ఊరికి బస్సు నడిపేట్లు చూస్తే మంచిగుంటది. – ఆడే పారు బాయి, రెంగన్వాడి, నేరడిగొండ అప్పుడే ఫాయిదా..! మా ఊరుకు సక్కగా రోడ్డు గాని బస్సు సౌకర్యం గాని లేదు. అసలు మాకు బస్సు ఫ్రీ చాలు అయిందనే విషయమే తెలవదు. ఫ్రీగా బస్సు ఎక్కాలంటే మా ఊరు నుంచి ఆటో ఎక్కి సోన్ కాస్ గ్రామం లేకపోతే బేల వరకు పో వాల్సి వస్తది. అక్కడ నుంచి వేరే దగ్గరికి పో వాలనుకుంటే ఫ్రీ బస్సు ఫాయిదా అవుతది. – తులబాయి, రాయ్‌పూర్ తండా, బేల ఇవి చదవండి: ఎంపీ సీటుపై ‘బండి’ ఫోకస్! -
ఇక పోలీసు అధికారుల పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర.. పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు. యాప్ ద్వారా డేటా సేకరణ.. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి.. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం. – రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా -
అలిగిన గ్రామీణం.. ఎన్నికల బహిష్కరణ మంత్రం
Rajasthan elections 2023: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మిజోరాం, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇప్పటికే ఎన్నికలు పూర్తవ్వగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఐదేళ్లకు ఒక సారి వచ్చే ఎన్నికల ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అయితే ప్రభుత్వాల ఉదాసీనత, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన పలు గ్రామాలు ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తున్నాయి. శనివారం జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అనేక గ్రామాలు బహిష్కరించాయి. తాగునీటి సమస్యపై.. హనుమాన్‌గఢ్ జిల్లాలోని టిబ్బి తహసీల్ పరిధిలోని దౌలత్పురాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ కపిల్ యాదవ్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రౌండ్ లెవల్లో దెబ్బతిన్న వాటర్ ట్యాంక్, ఫిల్టర్లను పునర్నిర్మించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని మెమోరాండంలో పేర్కొన్నారు. అలాగే శ్రీగంగానగర్ జిల్లాలోని సూరత్‌గఢ్ తహసీల్‌కు చెందిన తుక్రానా పంచాయతీ ఫరీద్సర్ గ్రామ ప్రజలు కూడా తాగునీటి సమస్యపై నిరసనగా ఓటింగ్‌ను బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు సూరత్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్‌కు మెమోరాండం ద్వారా తెలియజేశారు. ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజా ప్రతినిధులపై ఆగ్రహంతో కూడిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం భిల్వారా జిల్లా నుంచి తొలగించి షాపురా జిల్లాలో చేర్చిన ఎనిమిది గ్రామ పంచాయతీల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. భిల్వారాను విభజించి షాపురా జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు మండల్గర్ సబ్‌డివిజన్‌లోని 16 పంచాయతీలు షాపురా జిల్లాలో చేర్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల తరువాత, ప్రభుత్వం వీటిలో ఎనిమిది పంచాయతీలను తిరిగి భిల్వారాలో చేర్చింది. మిగిలిన ఎనిమిది షాపురాలోనే ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా పోస్టర్లు అంటించి నిరసనలు చేపట్టారు. ఏకంగా 50 గ్రామాలు ఇక జైసల్మేర్ జిల్లాలోని సోను గ్రామంలో గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు సంఘీభావంగా 50 గ్రామాలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించాయి. సోను గనుల నుంచి సున్నపురాయిని రవాణా చేయడానికి ఈ ప్రాంతంలో దాదాపు 400 ట్రక్కులు ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్లు సరుకు రవాణా ఛార్జీలను టన్నుకు రూ.3 పెంచాలని కోరుతున్నారు. అయితే రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ కాంట్రాక్టర్ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు సమీపంలోని 50 గ్రామాల ప్రజలు లారీ డ్రైవర్లకు మద్దతుగా నిలిచారు. సికార్ జిల్లాలోని నీమ్ కా థానా తహసీల్‌కు చెందిన లాడి కా బస్ గ్రామస్థులు తమ గ్రామ పంచాయతీని అజిత్‌గఢ్ పంచాయతీ సమితి నుంచి తొలగించి పటాన్ పంచాయతీ సమితిలో తిరిగి చేర్చాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూ గ్రామస్తులు ఆరుసార్లు ఎన్నికలను బహిష్కరించారు. రోడ్డు సమస్య.. ఝలావర్ జిల్లాలోని ఓద్పూర్ గ్రామస్థులు రాష్ట్ర రహదారికి సరైన రహదారిని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అదేవిధంగా కోటా జిల్లాలోని సంగోడ్ తహసీల్‌లోని లాడ్పురా రైతులు తమను చంబల్ నది నుంచి నీటిని వాడుకునేందుకు అనుమతించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు. టోంక్ జిల్లాలోని డియోలి గ్రామస్తులు తమ రోడ్డును బాగు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన మార్గాల్లో కాంక్రీట్ రోడ్లు నిర్మించకపోతే బహిష్కరిస్తామని టోంక్ జిల్లాలోని సీసోలా ప్రజలు హెచ్చరించారు. అదే విధంగా ధోల్పూర్ జిల్లా బసేరి అసెంబ్లీ నియోజకవర్గం చంద్రావళి గ్రామ ప్రజలు దశాబ్ద కాలంగా తమ గ్రామ రహదారికి మరమ్మతులు చేపట్టలేదని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక భిల్వారాలోని 43వ వార్డు ప్రజలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించడమే కాకుండా రాజకీయ నేతలను తమ వార్డులోకి రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నేతలను హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
మా ఊళ్లలో ఉండండి.. రూ.26 లక్షలు అందుకోండి: ఓ ప్రాంతం బంపరాఫర్!
విదేశాల్లో, ఏదైనా కొత్త ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటలీలోని ఓ ప్రాంతం బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ నివాసముంటే చాలు సుమారు రూ.26 లక్షలు మీ సొంతమవుతాయి. అలా అని అదేదో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతం కాదు. సముద్ర తీరాన, సుందరమైన పర్వతాల అంచున ఉండే అందమైన ప్రాంతమది. ఇటలీలోని దక్షిణ కాలాబ్రియా (Calabria) ప్రాంతం డబ్బు సంపాదించాలనుకునే, కొత్త ప్రాంతాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అక్కడ నివసిస్తూ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అర్హతలు ఇవే.. కాలాబ్రియా అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ ఆమోదం పొందిన 90 రోజులలోపు నివాసం ఉండటానికి సిద్ధంగా ఉండాలి. కాలాబ్రియా గురించి.. కాలాబ్రియా ప్రాంతాన్ని ఇటలీ "బొటనవేలు" గా పేర్కొంటారు. అందమైన సముద్ర తీరం, గంభీరమైన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందుకో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో స్థానిక కమ్యూనిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలాబ్రియా ఈ అసాధారణ ప్రణాళికను ప్రారంభించింది. రూ. 26.48 లక్షల వరకూ ప్రోత్సాహకం ప్రణాళికలో భాగంగా కాలాబ్రియా ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు మూడు సంవత్సరాల పాటు రూ. 26.48 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలు, హోటళ్లు వంటి బిజినెస్‌లను ప్రారంభించేందుకు స్థానిక అధికారులు ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడం, కమ్యూనిటీల్లో కొత్త జీవితాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని దీన్ని రూపొందించినవారిలో ఒకరైన జియాన్లూకా గాల్లో పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపు ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 6.31 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమం రాబోయే వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాలాబ్రియా ప్రాంతంలోని 75 శాతానికి పైగా మునిసిపాలిటీలలో 5,000 కంటే జనాభా ఉన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం యువ పారిశ్రామికవేత్తలకు కాలాబ్రియా ప్రాంత విశిష్టతను, సంస్కృతిని పరిచయం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
వేసవిలో ‘ఉపాధి’కి కసరత్తు
సాక్షి, అమరావతి: పేదలకు వచ్చే వేసవిలో కూడా సొంత ఊళ్లలోనే పెద్ద ఎత్తున పనులు కల్పి0చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. 2024–25 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌పై అన్ని గ్రామాల్లో కసరత్తు మొదలైంది. గత మూడేళ్లుగా గ్రామాల వారీగా ఉపాధి పథకం పనులకు వచ్చిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని.. వచ్చే ఆరి్థక సంవత్సరంలో ఎంత మందికి ఈ పథకం ద్వారా పనులు కల్పి0చాలన్న అంచనాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి ఇప్పటికే కలెక్టర్లతో పాటు డ్వామా పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. గతంలో చేపట్టి ఇప్పటికీ పూర్తి కాని పనులను 20వ తేదీకల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది సందర్శించి సమీక్షిస్తారు. నవంబర్ 10కల్లా గ్రామాల్లో అదనంగా చేపట్టే కొత్త పనులను గుర్తిస్తారు. నవంబర్ 15కల్లా ఆయా గ్రామాల్లో ఎంత మందికి ఎన్ని పనిదినాలు కల్పించాలన్న వివరాలతో లేబర్ బడ్జెట్‌ను రూపొందించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య.. కొత్తగా గుర్తించిన పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి అనుమతి తీసుకుంటారు. అవసరమైతే మండల, జిల్లా స్థాయిలో కూడా అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపడతారు. 2024–25 ఆరి్థక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి పనులు కల్పి0చాలనే వివరాలను గుర్తించి.. అందుకు అవసరమయ్యే పనులకు కలెక్టర్ల ద్వారా అనుమతి తీసుకునే ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తారు. గ్రామాల వారీగా తయారు చేసిన ఈ అంచనాలతో రాష్ట్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌ను రూపొందించి.. దానిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతికి పంపిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కొత్త పనుల గుర్తింపులో కనీసం 60 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రామాల వారీగా కమిటీలు.. 2024–25 ఆరి్థక ఏడాదికి సంబంధించిన లేబర్ బడ్జెట్ అంచనాల తయారీ, కొత్త పనుల గుర్తింపు కోసం గ్రామాల స్థాయిలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్లు, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు, పొదుపు సంఘాల గ్రామ స్థాయి లీడర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మండల స్థాయి అధికారులు ఈ గ్రామ కమిటీలకు తగిన సహకారం అందజేస్తారు. -
పల్లెకు పోదాం.. ప్రజాసేవ చేద్దాం!
సాక్షి, అమరావతి: ‘దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు’ అనే నానుడిని నిజం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ప్రగతి పథంలో పయనించినట్టే. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి చేయడానికి యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ప్రభుత్వం రంగంలో దింపుతోంది. ఉన్నత భారత్ అభియాన్ పేరుతో గ్రామాల్లో సామాజిక సేవలో పాలుపంచుకునేలా వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తోంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 129 విద్యా సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఒక్కో సంస్థ ఐదు చొప్పున 645 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ప్రాధాన్యత రంగాల్లో విద్యా సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇలా గ్రామాలను దత్తత తీసుకుంటూ పల్లె సేవలో భాగస్వాములవుతున్న సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందిస్తోంది. 50 వేల విద్యా సంస్థలు.. 2.5 లక్షల పంచాయతీలు.. పరిశోధన ఫలాలు, ప్రభుత్వ పథకాలను సమన్వయపరుస్తూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఉన్నత భారత్ అభియాన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 వేల విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం, వీటితో 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ సంయుక్త ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐఐటీ ఢిల్లీ, రాష్ట్ర స్థాయిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సమన్వయ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆరు ప్రాధాన్యతా రంగాల్లో.. 129 విద్యా సంస్థలు ఆయా గ్రామాల్లో సురక్షిత మంచినీరు, ఆరోగ్యం–పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి ఆరు ప్రాధాన్యతా రంగాల్లో సౌకర్యాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ తోడ్పాటుతో కృషి చేస్తాయి. ఈ 129 విద్యాసంస్థలకు చెందిన 1.93 లక్షల మంది విద్యార్థుల ద్వారా దత్తత తీసుకున్న 645 గ్రామాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నూతన ఆవిష్కరణల ఫలాలు, పరిశోధన ఫలితాల ద్వారా పల్లె ప్రగతికి బాటలు వేస్తున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన మూడు ఆవిష్కరణలు పల్లె ప్రగతిలో కీలకంగా మారే నూతన ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించినట్లైతే అందుకు అవసరమైన తోడ్పాటును జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అందిస్తారు. గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందించే ఆవిష్కరణలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి.. వచ్చే లాభాల్లో రాయల్టిని ఆయా విద్యాసంస్థలు, విద్యార్థులకు చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు తిరుపతి ఐఐటీ విద్యార్థులు తాగునీటిని శుద్ధి చేసేందుకు రూపొందించిన కెపాసిటివ్ డీఅయోనైజేషన్ పరికరం, వైఎస్సార్ జిల్లా మనూ పాలిటెక్నిక్ విద్యార్థులు.. చేతివృత్తులు వారు సహజ ఉత్పత్తులు తయారీ చేసేందుకు అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన సోలార్ మొబైల్ చార్జర్ వంటి ఆవిష్కరణలను జాతీయ స్థాయి పరిశీలనకు పంపించారు. వీటితో పాటు మరో ఏడు విద్యాసంస్థలు కూడా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం.. https://unnatbharatabhiyan.gov.in ద్వారా నమోదైన విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్‌కు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే, ముందు ప్రాంతీయ సమన్వయ సంస్థ, ఆ తర్వాత జాతీయ సమన్వయ సంస్థ వివరాలు తనిఖీ చేసి ఆమోదముద్ర వేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆ విద్యాసంస్థకు రూ.10 లక్షల గ్రాంటు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని గ్రామాలను గుర్తించడం, అక్కడ పర్యటించడం, సమస్యలను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆయా పల్లెలకు ఉపయోగపడేలా చేపట్టే పరిశోధనలకు కూడా వాడుకోవచ్చు. దత్తత గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే మద్దతును వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దత్తత తీసుకున్న పల్లెల్లో స్థానిక ప్రాధాన్యాల గుర్తింపు, సాంకేతికత బదిలీ వంటి కీలక అంశాల్లో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. ఆయా విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యేనాటికి మంచి నైపుణ్యాలను పొందుతారు. నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు ఉన్నత భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అవి అభివృద్ధి చేసే నూతన ఆవిష్కరణలను నేరుగా పల్లెలకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే 129 విద్యాసంస్థలు నమోదయ్యాయి. వీటి నుంచి 1.93 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. 645 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం. – ప్రొ.సర్జన్ రెడ్డి, కేంద్ర సమన్వయకర్త, ఉన్నత్ భారత్ అభియాన్ -
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్‌రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
ఏకరూప పంచాయతీలపై కసరత్తు!
సాక్షి, అమరావతి: ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలపై విధాన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని పంచాయతీలలో ఏకరూపత సాధించే దిశగా చర్యలు చేపడుతోంది. కనీస నిర్ణీత జనాభా సంఖ్య ఆధారంగా దేశమంతటా గ్రామ పంచాయతీలను పునర్విభజన జరిపే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరుగా.. ఒకే రాష్ట్రంలోనూ వేర్వేరు పంచాయతీలలో ఉండే జనాభా సంఖ్య మధ్య ఊహించని స్థాయిలో వేల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట 15 వేల నుంచి 20 వేల జనాభా ఉండే ఓ పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంటే.. కొన్నిచోట్ల 500 జనాభా ఉండే గ్రామం మరో పంచాయతీగా ఉంటోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 13,300కి పైగా గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీ సరాసరి జనాభా 2,800 వరకు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఒక్కో పంచాయతీలో 20 వేలకు పైనే.. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో సరాసరి జనాభా 20 వేలకు పైబడి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కేరళ వంటి రాష్ట్రంలో అతి చిన్న గ్రామ పంచాయతీలో సైతం 10 వేలకు తక్కువ జనాభా ఉండదని చెబుతున్నారు. మన రాష్ట్రంలో వందలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు సైతం ఉండగా.. 30 వేల జనాభా గల గ్రామాలు కూడా పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిన కనీస ఓ నిర్ధిష్ట జనాభా సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలను పునర్విభజన చేయడం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల స్థాయిలోనూ మెరుగైన, సమర్థవంతమైన పరిపాలనకు అవకాశం ఉంటుందా అన్న దానిపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది. నేడు, రేపు వర్క్‌షాప్ చాలా రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన కొనసాగుతోంది. కానీ ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని తేవడం వంటి స్థానిక సంస్థల స్థాయిలో పరిపాలనకు సంబంధించి అనేక అంశాలపై అవసరమైతే చట్ట సవరణలు తెచ్చేందుకు సోమ, మంగళవారాల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాల అధికారులు ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మన రాష్ట్రం నుంచి 9 మంది, 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది హాజరవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రెండు విడతలకోసారి రోటేషన్ పద్ధతిన రిజర్వేషన్ల మార్పులు, చేర్పులు చేసుకునే అంశాన్ని వర్క్‌షాప్ అజెండాలో చేర్చారు. -
తండ్రి ఆశయాలతో..పేద పిల్లల కోసం ఫ్రీ బోర్డింగ్ స్కూల్
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే పిల్లల్లో ఒకరిగా మారి ఆనందించేవాడు.పేదపిల్లల కోసం ఏదైనా చేయాలనేది ఆయన కల. ఆ కల సాకారం కాకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.తండ్రి కలను నెరవేర్చడానికి సేవాపథంలోకి వచ్చింది పోర్షియా పుటతుండ... ఝార్ఖండ్‌లోని రాంచీలో పుట్టిన పోర్షియా పుటతుండ కోల్‌కతా, దిల్లీ, నోయిడా, ముంబైలలో పెరిగింది. పోర్షియా తండ్రికి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో కలిసి నర్సరీ రైమ్స్ పాడడం ఇష్టం. ఆటలు ఆడుతూ పాఠాలు చెప్పడం ఇష్టం. గ్రామీణ ప్రాంతాలలోని పేదపిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంచేవాడు.పేద పిల్లల కోసం తనవంతుగా ఏదైనా చేయాలని నిరంతరం తపించేవాడు. తన కలలు సాకారం కాకుండానే ఆయన చనిపోయారు. తండ్రి జ్ఞాపకాల స్ఫూర్తితో ఆయన ఆశయాలను నెరవేర్చే క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కోమిక్ అనే గ్రామంలో అక్కడి అట్టడుగు వర్గాల పిల్లల కోసం ఫ్రీబోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది పోర్షియా. ‘హైయెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా’గా పేరున్న కోమిక్లోని ఎంతోమంది పేద పిల్లలకు పోర్షియా ఇప్పుడు తల్లి, గురువు, సంరక్షకురాలు. జర్నలిజంలో డిగ్రీ చేసిన పోర్షియా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో పనిచేసింది. ఆ తరువాత ‘సీఎన్ఎన్’లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించింది. కొంతకాలం తరువాత జర్నలిజాన్ని వదులుకొని సేవాదారిలోకి వచ్చింది. పోర్షియా ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం? ఆమెకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. తొలిసారిగా హిమాచల్‌ద్రేశ్‌లోని స్పితి లోయకు వచ్చినప్పుడు తనకు ఎంతో మనశ్శాంతిగా అనుభూతి చెందింది. ఆ ప్రాంతంతో ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించింది. తండ్రి చనిపోయిన తరువాత పోర్షియాపై కుంగుబాటు నీడలు కమ్ముకున్నాయి. చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి పోర్షియా ఆలోచిస్తున్నప్పుడు స్పితి గుర్తుకు వచ్చింది. అక్కడి పేదపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా తండ్రితో మాట్లాడినట్లే అనిపించింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. స్కూల్ ప్రారంభానికి ముందు కజా ప్రాంతంలోని ఒక స్థానిక కుటుంబంతో నెలరోజులు గడిపింది. ఆ కుటుంబంలోని పిల్లలకు పాఠాలు చెప్పింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం కోసం ఊళ్ల వెంట తిరుగుతున్నప్పుడు చదువుకు దూరమైన, సరైన చదువు లేని ఎంతోమంది పేదపిల్లలు కనిపించారు. వారిని విద్యావంతులను చేయాల్సిన అవసరం కనిపించింది. ‘ఉద్యోగాన్ని, ముంబైని విడిచి ఇక్కడకు రావడం అనేది సాహసంతో కూడుకున్న పని. కాని నేను ఇష్టంతో ఇక్కడకు వచ్చాను. ముంబైని విడిచి రావాలనే ఆలోచన నా స్నేహితులు, సన్నిహితులు ఎవరికీ నచ్చలేదు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు అని ముఖం మీదే చెప్పారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తావు అని కూడా అన్నారు. అయితే అవేమీ నా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఇక్కడికి వచ్చిన తరువాత నా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్లు అనిపించింది’ అంటుంది పోర్షియా. తొలి అడుగులో భాగంగా.... పిల్లలు ఆడుకునే చోటుకు వెళ్లేది. ‘మీకు బొమ్మలు ఎలా వేయాలో నేర్పిస్తాను’ ‘కొత్త ఆటలు నేర్పిస్తాను’ ‘ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పిస్తాను’ అంటూ వారితో స్నేహం చేసేది. చెట్టు కింద కూర్చొని బొమ్మలు గీయడం, రైమ్స్ పాడడం నేర్పేది. ఒక్కరొక్కరుగా నలభై మంది పిల్లల వరకు ఆమెకు దగ్గరయ్యారు. ఆ సమయంలో తనకు ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ఆలోచన వచ్చింది. కోమిక్‌లో ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు పెద్ద సమస్య వచ్చింది. ‘ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఏం చేయాలి? చిన్నాచితకా పనులు చేసుకుంటే ఏదో విధంగా బతుకుతారు’ అంటూ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించేవారు. వారి ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి పోర్షియా చాలా కష్టపడాల్సి వచ్చింది.పాఠాలతో పాటు తోటపని నుంచి నృత్యం వరకు పిల్లలకు ఎన్నో నేర్పుతోంది పోర్షియా. ‘నా కల సాకారం అవుతుందా, లేదా అనుకునేదాన్ని. స్కూల్ ప్రారంభించిన తరువాత నా మీద నాకు, నా పై పిల్లల పేరెంట్స్‌కు నమ్మకం వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే’ అంటుంది పోర్షియా పుటతుండ. -
పొంగిన మున్నేరు వాగు.. కంచికచర్ల-చెవిటికల్లు మధ్య రాక పోకలు బంద్
సాక్షి, ఎన్టీఆర్\కృష్ణా జిల్లా: భారీ వర్షాలతో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కంచికచర్ల-చెవిటికల్లు రహదారిపై వరద ప్రవాహం కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయం భారీ వర్షానికి మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పేర్ని నాని పర్యటించారు. డ్రైవర్ కాలనీ, గుమస్తాల కాలనీ, సుందరయ్య నగర్‌ను పరిశీలించారు. వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 10.20 అడుగులకు నీటిమట్టం చేరింది. 7.67 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య -
అది ‘లైఫ్‌లైన్’.. పేదల పాలిట ‘హెల్ప్‌లైన్’
ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరి హృదయాలను కలచివేసింది. ఇటువంటి సందర్భాలలో క్షతగాత్రులను రక్షించేందుకు రైల్వేశాఖ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటే బాగుండునని చాలామంది భావించారు. దీనికి సమాధానం రైల్వేశాఖ వద్ద ఏనాడో ఉంది. ప్రపంచంలోనే తొలి హాస్పిటల్ ట్రైన్ భారత్ ఖాతాలో ఉంది. ఇది ఒక స్పెషల్ ట్రైన్. దీనిని భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక సందర్భాలలో వినియోగిస్తుంటుంది. ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అందుబాటులో ఆధునిక వైద్య పరికరాలు భారతీయ రైల్వే ఈ ట్రైన్‌కు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ అనిపేరు పెట్టింది. దీని ద్వారా భారతీయ రైల్వే దేశంలోని సుదూర ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేస్తుంది. ఆసుపత్రులు లేని ప్రాంతాలకు, ఔషధాలు, వైద్యులు అందుబాటులో లేని ప్రాంతాలకు ఈ రైలు చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. ఈ రైలును ఆసుపత్రి మాదిరిగా డిజైన్ చేశారు. దీనిలో బాధితుల కోసం బెడ్లు ఉంటాయి. ఆధునిక వైద్య పరికరాలు కూడా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, మెడికల్ స్టాప్ ఉంటారు. 12 లక్షలమందికి వైద్య సేవలు ఈ లైఫ్‌లైన్ ట్రైన్‌లోని ప్రతీ కోచ్‌లో పవర్ జనరేటర్, మెడికల్ వార్డు, ప్యాంట్రీకార్ మొదలైన ఏర్పాట్లు ఉంటాయి. ఈ రైలును భారతీయ రైల్వే 1991లో ప్రారంభించింది. ఈ రైలులోని అన్ని బోగీలలో ఏసీ సదుపాయం ఉంది. సులభంగా ఆసుపత్రులకు చేరుకోలేనివారిని దృష్టిలో ఉంచుకుని, వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ రైలులో అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం సహాయం పొందలేనివారికి కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆసుపత్రి రైలు ఇప్పటివరకూ 12 లక్షలమంది బాధితులకు వైద్య సేవలు అందించింది. ఇది కూడా చదవండి: భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. పచ్చని పకృతి, పల్లె అందాలకు మురిసిపోతూ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. భారతదేశంలోని 10 అత్యంత అందమైన గ్రామాల లిస్ట్‌ను షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా నుండి మేఘాలయలోని మావ్లిన్నాంగ్ వరకు ఉన్న ఫోటోలు మిమ్మల్ని ఆనంద పరవశంలో ముంచేస్తాయి. దేశంలో పలు ప్రాంతాల శోభను ప్రతిబింబించేలా దేశం నలుమూలలా పరుచుకున్న ప్రకృతి మాత ఒడిలో, ఎనలేని సోయగంతో అలరారే అద్భుత అందాలను చూసి తరించాలని అందరికీ ఉంటుంది. రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి సేదదీరేందుకు సాధారణంగా పల్లెలకు పరుగులు తీస్తాం. అక్కడి అందాలను ఆత్మీయతలను జీవిత మంతా పదిలపర్చుకుంటాం. కానీ ఈ విశాల ప్రపంచంలో ప్రతీ మూలలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) అలాంటి వారికి భారీ ఊరటనిచ్చేలా దేశంలోని అందమైన టాప్ టెన్ పల్లెల అద్భుతమైన ఫోటోలను కలర్స్ ఆఫ్ భారత్ పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. వీటిని చూసిన ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర వాటిని రీట్వీట్ చేశారు. మండు వేసవిలో చల్లని చిరుజల్లుల్లా ఉన్న ఫోటోలనుచూసి ఆయన మురిసిపోయారు. మన చుట్టూ ఉన్న అందాలు చూసి తనకు మాటలు రావడం లేదంటూ పరశించిపోయారు. భారతలో తాను ఆస్వాదించాల్సిన అందమైన ప్రాంతాల లిస్ట్ పెరిగిపోతోంది అంటూ కమెంట్ చేశారు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) This beauty around us just left me speechless…My bucket list for travel in India now overflows…. https://t.co/WXunxChIKg — anand mahindra (@anandmahindra) June 8, 2023 -
మారుమూల పల్లెల్లోనూ బ్యాంకులు!
సాక్షి, విశాఖపట్నం: మారుమూల పల్లెల్లోనూ బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఐదు కిలోమీటర్లకు మించి బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామాలు 186 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ గుర్తించింది. ఆ జాబితాను స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ)కి సమర్పించింది. దీనిపై తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఎస్ఎల్బీసీ సన్నద్ధమవుతోంది. మూడు వేల లోపు, ఆ పైన జనాభా కలిగిన గ్రామాల్లో బ్యాంకు శాఖల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సంబంధిత జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్ల (ఎల్డీఎం)కు సూచించింది. దీనికి అనుగుణంగా ఎంపిక చేసిన గ్రామాల వారీగా ఆయా లీడ్ బ్యాంకులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, పల్నాడు, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఈ 186 గ్రామాలున్నాయి. వీటిలో ఎక్కువ గ్రామాలు అల్లూరి, మన్యం, కాకినాడ, పల్నాడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. తొలి దశలో 11 పల్లెల్లో.. తొలి దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మారుమూల పల్లెల్లో కొత్తగా బ్యాంకు శాఖలు (ఏపీజీవీబీ–2, బ్యాంక్ ఆఫ్ బరోడా–1, కెనరా బ్యాంకు–1, డీసీసీబీ–1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–3, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–3 చొప్పున) ఏర్పాటు చేయాలని ఎస్ఎల్బీసీ సూచించింది. అయితే వీటిలో ఇప్పటివరకు ఏపీజీవీబీ (రాజవొమ్మంగి/లబ్బర్తి), బ్యాంక్ ఆఫ్ బరోడా (మారేడుమిల్లి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎటపాక), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కొయ్యూరు)ల్లో శాఖలను ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో జనాభా ఆధారంగా బ్యాంకు సేవలు అందని ఆరు గ్రామాల్లో బ్యాంకు శాఖలు తెరవాలని ఆ జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (జియ్యమ్మవలస–బొమ్మిక), బ్యాంక్ ఆఫ్ బరోడా (కొమరాడ–గంగిరేగులవలస), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కురుపాం–మొండెంకల్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (పాచిపెంట–మత్తుమూరు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (పాచిపెంట–పి.కోనవలస), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (భావిుని–గురండి) ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సత్వరమే కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని ఎస్ఎల్బీసీ సంబంధిత బ్యాంకు యాజమాన్యాలను కోరింది. మూడు వేలకు పైగా జనాభా.. మరోవైపు మూడు వేలకు పైగా జనాభా కలిగి ఉన్నప్పటికీ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు సేవలకు నోచుకోని గ్రామాల్లోనూ కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) ఎస్ఎల్బీసీకి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రంలో అలాంటి గ్రామాలు 21 వరకు ఉన్నాయని 26 మంది ఎల్డీఎంలు ఎస్ఎల్బీసీకి నివేదించారు. -
భారతదేశంలోని అత్యంత అందమైన టాప్ 10 గ్రామాలు
-
టీఎస్ఆర్టీసీలో ఇక విలేజ్ బస్ ఆఫీసర్లు.. వీళ్లు చేస్తారంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గడపకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్లో విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థను సజ్జనార్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విలేజ్ బస్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ‘టీఎస్ఆర్టీసీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ప్రజలకు, సంస్థకు మధ్య మీరు అనుసంధానకర్తల్లాగా వ్యవహారించబోతున్నారు. సంస్థపై ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచడంలో మీ వంతుగా కృషి చేయాలి. మన సంస్థ ప్రజలకు కల్పిస్తోన్న సౌకర్యాలను, వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించండి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం, తదితర అంశాలు ప్రజలకు చెప్పాలి. జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేలా డిపో యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) పెంచేలా పాటుపడాలి. గ్రామాల్లోని ప్రజల రవాణా అవసరాలకు మీరే గుర్తు వచ్చే విధంగా వారితో మమేకమవ్వాలి. మిమల్ని అధికారులుగా గుర్తించి ఇచ్చిన ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు సమర్థవంతంగా నిర్వహించాలి. సంస్థను ప్రజలకు మరింతగా దగ్గర చేయడంలో మీ పాత్ర కీలకమనే విషయం మరిచిపోవద్దు’ అని అన్నారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని హితవు చెప్పారు. టీఎస్ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినేలా వ్యవహారించొద్దని, స్వీయ క్రమ శిక్షణ కలిగి ఉండాలని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ గతకొంత కాలంగా ఐటీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకుని టీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలకు వివరించాలన్నారు. విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరించిన విలేజ్ బస్ ఆఫీసర్లను సంస్థ గుర్తించి సత్కరిస్తుందని, ఈ ప్రోత్సహకాలను మోటివేషన్‌గా తీసుకుని మంచిగా పనిచేసి.. సంస్థ వృద్దికి కృషి చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. అనంతరం విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ పోస్టర్, కరదీపికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ విలేజ్ బస్ ఆఫీసర్‌కు ఐడీ కార్డుతో పాటు బ్యాగ్‌ను అందజేశారు. తమను అధికారులుగా గుర్తించి ఈ బాధ్యతను అప్పగించింనందుకు సజ్జనర్‌కు విలేజ్ బస్ ఆఫీసర్లు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవన ప్రసాద్, చీఫ్ మేనేజర్(ప్రాజెక్ట్స్ అండ్ ఎస్టేట్స్) విజయ్ కుమార్, సీఈఐటీ రాజశేఖర్, బిజినెస్ హెడ్ సంతోష్ కుమార్, సీటీఎం(మార్కెటింగ్) సుధా పరిమళ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్ఎంలు వెంకన్న, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ‘కేటీఆర్‌కు ఓయూ, కేయూకు వెళ్లే దమ్ముందా?’ -
భారీ పెట్టుబడితో 4జీ నెట్వర్క్ - గ్రామాలపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కనెక్టివిటీ లేని అన్ని గ్రామాలకు 2024 కల్లా 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చెప్పారు. ‘4జీ విస్తరణ ప్రాజెక్టు గురించి మాట్లాడితే.. దాదాపు 38,000 - 40,000 గ్రామాలకు సిగ్నల్స్ లేవు. ప్రతి ఇంటికీ చేరే దిశగా.. 2024 నాటికల్లా 4జీ పూర్తి స్థాయిలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ’మన్ కీ బాత్’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ప్రసారం సందర్భంగా చౌహాన్ మాట్లాడారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, సేవలను మరింతగా ప్రజలందరి వద్దకు చేర్చేలా ప్రధాని ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు. కనెక్టివిటీ లేని గ్రామాలకు కూడా 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల సామాజిక - ఆర్థిక పరివర్తన సాధ్యపడుతుందని, డిజిటల్ అసమానతలను తొలగించవచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఎంత మేర జవాబుదారీతనంతో వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. కవరేజీ లేని గ్రామాలన్నింటిలోనూ 4జీ మొబైల్ సర్వీసులను విస్తరించే ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ 2022 జూలైలో ఆమోదించింది. దీని మొత్తం వ్యయం రూ. 26,316 కోట్లు. దీనితో చేరుకోవడం కష్టతరంగా ఉండే 24,680 పైచిలుకు మారుమూల గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. -
మరో చరిత్రకు ముందడుగు
వాళ్లంతా నల్లగొండ జిల్లా చిలుకూరు విద్యార్థులు. కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. తమ ఊరి చరిత్రను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఇటీవల గ్రామపెద్దలను కలిశారు. ఇక్కడ 1969లో ప్రారంభమైన గ్రంథాలయం ప్రజల్లో తెచ్చిన చైతన్యం గురించి తెలుసుకున్నారు. అదే ఊళ్లోని కాకతీయుల కాలం నాటి కోదాడ రామాలయ నిర్మాణం తీరును పరిశీలించారు. అందులోని కోనేరులో ఆలయ అవసరాలతోపాటు వ్యవసాయం కోసం నిర్మించిన మోట బావి విశేషంగా ఉంది. ఈ కోనేరు ప్రత్యేకతను విద్యార్థులు పట్టుకోగలిగారు. చెన్నకేశవాలయంలో పురాతన శాసనం ఒకటి ఉంది. పాత చారిత్రక గ్రంథాలను తీసి పరిశోధించాల్సి ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. సాక్షి, సిటీడెస్క్ : ‘చరిత్ర మరిచిన మనిషి పూడ్చిపెట్టిన శవం లాంటి వాడు’.. వర్తమానం నుంచి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు చరిత్ర ఎంతగానో దోహదపడుతుంది. సమాజ పురోగమనానికి బాటలు వేస్తుంది. రాతలు, శాసనాలు, కట్టడాలు, పురాతన ఆధారాల స్వరూపమే చరిత్ర. ఇప్పటివరకు తెలియని, ప్రాచుర్యంలోకి రాని ఘట్టాలను తెలుసుకునే అన్వేషణలో భాగంగానే తెలంగాణ రాష్ట్రావిర్భావం అనంతరం ప్రస్తుతం మొదలైంది. ఓ యజ్ఞంలా ముందుకు సాగుతోంది. అటువంటి ఆలోచనే ‘మన ఊరి చరిత్రను మనమే తెలుసుకుందాం’ప్రాజెక్టు సర్వే. దీని ద్వారా మరుగునపడ్డ గత కాలపు వైభవాలు, జ్ఞాపకాలు, విశిష్టత, చారిత్రక నేపథ్యం బయటపడుతున్నాయి. ఆ బాధ్యతను ఇప్పటికే భుజానికెత్తుకున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ విశేషాలపై ప్రత్యేక కథనం. ఇండియన్ విలేజ్.. ఓ ప్రేరణ చారిత్రక అన్వేషణకు స్ఫూర్తి నింపింది ఇండియన్ విలేజ్ పుస్తకం. 1950–51లో అప్పటి ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ దూబే 15 మంది విద్యార్థులతో శామీర్‌పేటలో పర్యటించి అక్కడి సామాజిక అంశాలపై ‘ఇండియన్ విలేజ్’పుస్తకాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆ గ్రంథమే నేటికీ సామాజిక శాస్త్రాలకు, గ్రామీణ ప్రాంతాలపై పరిశోధనకు కొలమానంగా నిలిచింది. దీని ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ సాహిత్య అకాడమీ పల్లె బాట పట్టింది. గ్రామ చరిత్రల నిర్మాణానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఓ ప్రశ్నావళి రూపొందించింది. దీనికి అనుగుణంగా గ్రామ నైసర్గిక స్వరూపం, ఎప్పుడు ఏర్పడింది? కాలానుగుణ మార్పు లు, ఊరికి పేరురావడానికి ప్రత్యేక కారణాలు న్నాయా? అలనాటి అవశేషాలు, సామాజిక వర్గాల జీవనం ఎలా తదితర వివరాలు సేకరిస్తున్నారు. సర్వే ఎవరు చేస్తున్నారు? రాష్ట్రంలోని వివిధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న అయిదువేల మందికి పైగా విద్యార్థులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ నల్లగొండలోని నాగార్జున కళాశాల వేదికగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామాల్లో చరిత్ర మూలాల కోసం శోధన జరుగుతోంది. క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామపెద్దలు, వయోవృద్ధులు, గ్రామ పురోహితులు, స్వాతంత్య్ర సమరయోధులు, రెవెన్యూ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న కవులు, రచయితలు, సామాజికవేత్తలు, మేధావులతో జూలూరిఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన ఉద్యమం విద్యార్థులు తమ ఊరు చరిత్ర తామే రాయడం ఓ మధురానుభూతి. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు తెలంగాణ పల్లెల ప్రస్థానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. ఈ పరిశోధనకు సంబంధించి ఓ పుస్తకాన్ని తెచ్చేందుకు సమాయత్తమవుతున్నాం. పల్లెల్లోని మట్టి మూలాలను జల్లెడ పట్టి ప్రపంచానికి పరిచయం చేసేందుకు శరవేగంగా అక్షర యాత్ర సాగిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్ర సాహిత్య అకాడమీ పూనుకోని అద్భుతమైన ఉద్యమానికి మేము తెరలేపాం. భావితరాలకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఈ ప్రాజెక్టు సక్సెస్‌కు కళాశాల విద్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. –జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ ఆనందంగా ఉంది పూర్వం బూరుగడ్డ గ్రామాన్ని శాల్మిల కందపురంగా పిలిచేవారు. శాల్మిల కంద అనగా భృగు చెట్టు. పూర్వం భృగు మహర్షి తపస్సు చేసిన ప్రదేశం కావడంతో ఈ గ్రామానికి భృగు గడ్డ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా బూరుగడ్డగా మారింది. ఇక్కడి శాల్మిల కందలో ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి ఆలయాన్ని 1172లో నిర్మించారు. దీని గర్భగుడిలో ఒకే పీఠంపై వరాహస్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, వేణుగోపాల స్వామి కొలువై ఉండటం ప్రత్యేకత. – విష్ణు, డిగ్రీ ఫైనల్ ఇయర్, కోదాడ ఇదో గొప్ప అవకాశం ‘మన ఊరు చరిత్ర మనమే తెలుసుకుందాం’లో భాగంగా ప్రాజెక్ట్ సూర్యాపేట జిల్లా సమన్వయకర్తగా ఉన్నాను. మా కాలేజీలోని ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఊరి చరిత్రను తెలుసుకోవడంలో భాగస్వాములయ్యారు. గ్రా మాల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పోరాట చరిత్రను వెలికితేసే క్రమంలో భాగస్వామ్యం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. –డా. నిర్మల కుమారి, ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్, కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కోదాడ -
రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు.. ఫార్మింగ్.. చూసి కళ్లు తెరవండయ్యా
సాక్షి ప్రతినిధి, కడప: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా అంటేనే ఫ్యాక్షన్ చరిత్రకు పర్యాయపదంగా చెప్పుకునేవారు అనేకమంది. కాలక్రమంలో ఫ్యాక్షన్ హత్యలు కనుమరుగయ్యాయి. హత్యలే కాదు, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. 1990 దశకంలో 119 ఫ్యాక్షన్ గ్రామాలు జిల్లాలో ఉంటే, ప్రస్తుతం 60 గ్రామాల్లో మాత్రమే ఫ్యాక్షన్ వాసన అడపాదడపా కనిపిస్తోంది. 2022లో ఒక్క ఫ్యాక్షన్ హత్య కూడా జిల్లాలో నమోదు కాలేదన్న వాస్తవాన్ని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి ఫ్యాక్షన్ క్రమేపీ తెరమరుగవుతుందన్నది సుస్పష్టం. అందుకు ప్రధాన కారణం విద్యాధికులు పెరగడమే. పుష్కరకాలం క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రధాన తోడ్పాటుగా నిలిచింది. రైతు కుటుంబాల నుంచి వేలాది మంది విద్యావంతులయ్యారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో ఆర్థిక పరపతి పెరగడం, ఆయా కుటుంబీకులు పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు. ప్రధానంగా హార్టికల్చర్ పంటల సాగు గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఆదాయం గడిస్తుండడంతో ఫ్యాక్షన్ మూలాలను వదిలేశారు. పైగా మెట్ట ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చి చేరడంతో జిల్లా ‘కల్చర్’ పూర్తిగా మారిపోయిందనడంలో సందేహం లేదు. నాడు నెత్తుటి మరకలు.. నేడు పచ్చని పంటలు.. అడవిచెర్లోపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామం. ఇప్పుడు ఆ గ్రామంలో విదేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ పంటను యువరైతు గంగిరెడ్డి పండిస్తున్నాడు. తన సోదరుడు అస్వస్థతకు గురైతే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లిన గంగిరెడ్డికి డిశ్చార్జి సందర్భంగా డాక్టర్లు డ్రాగన్ ఫ్రూట్స్ వాడడం చాలా మంచిదని చెప్పారు. వారి సూచన మేరకు కొనుగోలు చేస్తే ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ ధర రూ.150 పలికింది. ఆ పండు ధర గంగిరెడ్డి మదిలో పడింది. పంట సాగుపై అధ్యయనం చేశాడు. ఎలాంటి రకం పెడితే మన ప్రాంతంలో దిగుబడి సాధించవచ్చో తెలుసుకున్నాడు. తమిళనాడు నుంచి మొక్కలు తెప్పించి సక్సెస్‌ఫుల్‌గా దిగుబడి సాధిస్తున్నాడు. ప్రస్తుతం టన్ను రూ.1.5 లక్షలు ధర పలుకుతుండగా, ఎకరాకు 7 టన్నులు తక్కువ లేకుండా దిగుబడి సాధిస్తున్నాడు. ఫ్యాక్షన్ గ్రామంలో ఆదర్శ రైతుగా గంగిరెడ్డి నిలుస్తున్నాడు. ఈ విధంగా యువకులు, విద్యాధికులు హార్టికల్చర్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పులివెందుల అరటి.. విదేశాలకు ఎగుమతి.. పులివెందుల ప్రాంతంలో పండించే అరటి పంట మంచి నాణ్యత కలిగి ఉంటోంది. అరటి రైతులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజు కొన్ని వందల టన్నులు తరలివెళ్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాలలో మంచి డిమాండ్ ఉంటోంది. ప్రతి ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రైతులు వారు పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. మన దేశంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, మహరాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు పులివెందుల ప్రాంత అరటి వెళ్తోంది. ఈ ప్రాంత అరటికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు దక్కింది. సాధారణంగా అరటి పండ్లు ఏడు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇక్కడి అరటి పండ్లు 14రోజుల వరకు నిల్వ ఉంటాయని రైతులు వివరిస్తున్నారు. కృష్ణాజలాల రాకతో.. ‘మెట్ట ప్రాంతంలో కృష్ణాజలాలు పారించిన రోజు నా జన్మ ధన్యం’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. వాస్తవంగా కృష్ణా జలాలు రాయలసీమకు రావడంతో సీమ ప్రజల తలరాత మారుతోంది. ఎప్పుడూ కరువు విలయతాండవం చేసే అనంతపురం జిల్లా పంటలతో కళకళలాడుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో గండికోట, వామికొండ, సర్వరాయసాగర్, బ్రహ్మంసాగర్‌లో నీరు పుష్కలంగా ఉంది. కృష్ణా జలాల కారణంగా ఆక్వా ఉత్పత్తుల పట్ల సైతం జిల్లా వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా చేపల పెంపకంపై దృష్టి సారించారు. చాపాడు, వీరపునాయునిపల్లె, కొండాపురం, ముద్దనూరు, బి.మఠం, బి.కోడూరు మండలాల పరిధిలో చేపల పెంపకం సాగిస్తున్నారు. క్రమేపీ ఈ రంగంలోనూ రైతులు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధులయ్యారు. ఎప్పుడూ రక్తచరిత్ర పేరుతో బురద చల్లే సినీ ప్రముఖులకు కూడా జిల్లా వాసులు సవాల్ విసురుతున్నారు. మా కల్చర్ మారిందని నిరూపిస్తున్నారు. యువ రైతు పేరు మూలి గంగిరెడ్డి. వీరపునాయునిపల్లె మండలం అడవిచెర్లోపల్లె గ్రామం. ఇతర దేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ పంటపై దృష్టి పెట్టాడు. ఎకరాకు రూ.4లక్షలు పెట్టుబడి వెచ్చించి, 4 ఎకరాల్లో పంట సాగు చేశాడు. రాయలసీమ ప్రాంతానికి అనువైన తైవాన్ పింక్ రకం వేస్తే ఇక్కడి వాతావరణానికి తట్టుకోగలదని తెలుసుకొని తమిళనాడు నుంచి మొక్కలు తెచ్చుకున్నాడు. పట్టువదలని గంగిరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ పంట దిగుబడిలో సక్సెస్ అయ్యాడు. దిగుబడికి తగ్గట్టుగా ధర ఎప్పటికీ తగ్గకుండా ఉండడంతో గణనీయంగా ఆదాయం గడిస్తున్నాడు. ప్రస్తుతం ఆసక్తి ఉన్న రైతులకు ఆయనే అంట్లు కట్టి మొక్కలను అందిస్తున్నాడు. జి.పవన్‌కుమార్‌రెడ్డి ఎంబీఏ చదివాడు. అమెరికాలో వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగించేవాడు. స్వగ్రామం అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం యనమవాండ్లపల్లె. అమెరికాలో ఎంత సంపాదిస్తున్నా తృప్తిలేదు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు మట్టి వాసనపై మమకారం పోలేదు. వ్యవసాయంపై మక్కువతో అమెరికా నుంచి వచ్చి సంబేపల్లె మండలంలోని దేవపట్లకు చెందిన తన బావ ఆవుల హర్షవర్దన్‌రెడ్డి పొలంలో 30 ఎకరాలు బొప్పాయి పంటసాగు చేశాడు. నాణ్యమైన పంట కోసం మహరాష్ట్ర నుంచి 786 రకం బొప్పాయి నారు తెప్పించాడు. ఒక కోతకు 60 టన్నులు పంట దిగుబడి రానున్నట్లు అంచనా వేస్తున్నాడు. ఒకసారి పంట సాగుచేస్తే 10 నుంచి 15 కోతలు రానున్నాయి. పంటల సాగులో ఆదర్శంగా నిలుస్తుండటంతో మండల రైతులు శభాష్ అంటున్నారు. -
ఊళ్లకు ఆర్టీసీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: పల్లెలకు క్రమంగా ఆర్టీసీ బస్సులు దూరమై ప్రయాణికులకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు చేరువగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ పేరుతో తమ ప్రతినిధులను పల్లెబాట పట్టించనుంది. ప్రతి ఊరిలోనూ తమ ప్రతినిధిని అందుబాటులో ఉంచనుంది. గ్రామాలకు ప్రజారవాణా అవసరాలేంటో గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్రతినిధికి ఐదు ఊళ్లకు మించకుండా బాధ్యత అప్పగించేలా మే ఒకటో తేదీ నుంచి 2 వేల మంది ప్రతినిధులను రంగంలోకి దింపనుంది. రెగ్యులర్ డ్యూటీ చేస్తూనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఈ ప్రతినిధుల బాధ్యత భుజానికెత్తుకోనున్నారు. వీక్లీ ఆఫ్, ఇతర సెలవు రోజుల్లో వారు గ్రామాలకు వెళ్లి గ్రామస్తులు, సర్పంచులతో చర్చించి ఆయా ఊళ్లు ఆర్టీసీ నుంచి ఏం కోరుకుంటున్నాయో, ఆయా ఊళ్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీకి ఉన్న అవకాశాలేంటో తెలుసుకోనున్నారు. ప్రజలు బస్సెక్కేలా చేయడమే లక్ష్యం... రాష్ట్రంలో 12,769 గ్రామాలున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు తప్ప మిగతా ఊళ్లకు పల్లెవెలుగు/ఇతర కేటగిరీల ఆర్టీసీ బస్సులు నడిచేవి. కానీ ఏడెనిమిది ఏళ్లుగా ఆదాయం కోసం శ్రమిస్తున్న ఆర్టీసీ... ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న గ్రామాలకు ట్రిప్పులు తగ్గించి ఆదాయం ఎక్కువగా ఉండే మార్గాలకు మళ్లించింది. కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతోపాటు సర్విసుల సంఖ్య తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణమైంది. అద్దె బస్సుల సంఖ్య పెరగడం, వాటి నిర్వాహకులు ఆదాయం ఉన్న మార్గాలపైనే దృష్టి పెట్టడంతో వేల సంఖ్యలో ఊళ్లకు ఆటోలే దిక్కయ్యాయి. ఈ తరుణంలో ప్రజారవాణాను మెరుగుపరిచి గతంలోలాగా ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించేలా చేయాలన్నది యాజమాన్యం లక్ష్యం. నెలకు రూ. 300 అదనపు చెల్లింపులు! ఊళ్లతోపాటు హైదరాబాద్ సహా ఇతర మున్సిపాలిటీల్లో కూడా వార్డులు, డివిజన్ల బాధ్యతను ఆర్టీసీ ప్రతినిధులకు అప్పగించనున్నారు. వారికి నెలకు రూ. 300 వరకు అదనంగా చెల్లించనున్నట్లు తెలిసింది. ప్రతి మూడు నెలలకు సమీక్షించి ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందించనుంది. అయితే కేవలం బస్సులు నడిచే ఊళ్ల బాధ్యతే అప్పగిస్తారా, బస్సు సౌకర్యంలేని ఊళ్ల బాధ్యత కూడా ఉంటుందా అన్నది ఇంకా తెలియరాలేదు. కాగా, ఆర్టీసీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారని, ఈ తాజా నిర్ణయానికి కూడా సానుకూలంగా స్పందించి ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొంటున్నారు. ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ విధులు ఏమిటంటే..? ♦ ప్రతి 15 రోజులకోసారి ఊళ్లకు వెళ్లి సర్పంచులు, సాధారణ ప్రజలతో కలసి ఆయా ఊళ్ల రవాణా అవసరాలపై వివరాలు సేకరించాలి. ♦ ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చైతన్యపరచాలి. ♦ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనంగా ట్రిప్పులు అవసరమన్న విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. ♦ఆయా ఊళ్లలో ఉత్సవాలు, జాతరలు, పెళ్లిళ్ల తేదీల వివరాలు సేకరించి వాటి రూపంలో ఆదాయం పెంచుకొనే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులకు చెప్పాలి. ♦ ఇతర రోజుల్లో కూడా తమకు వివరాలు ఫోన్ చేసి చెప్పొచ్చని గ్రామీణులను కోరాలి. -
పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత
పులి భయంతో రెండు గ్రామాలు వణికిపోత్నున్నాయి. ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసి చంపేయడంతో మరింత ఎక్కువైంది. దీంతో యంత్రాంగం కదిలి వచ్చి గ్రామంలో కర్ఫ్యూ విధించి, అంగన్ వాడిలు, పాఠశాలలను మూసివేయాలని ప్రకటించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోనిచోటు చేసుకుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లోని రిఖానిఖాల్, ధూమాకోట్ తహసీల్ గ్రామాలు పులి భయంతో హడలిపోతున్నాయి. అదీగాక ఇటీవల ఇద్దరు వ్యక్తులను పులి హతమర్చాడంతో దెబ్బకు పౌరీ గర్హ్వల్ జిల్లా యంత్రాంగం కదిలి వచ్చి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. అలాగే ఆయ ప్రాంతాల్లోని అంగన్వాడీలు, పాఠశాలలను ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 18 వరకు మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను జారీ చేసింది. యంత్రాంగం ఆదేశాల మేరకు ధుమాకోట్, రిఖానిఖాల్ తహసీల్దార్లను పులి ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్ చేసి పులిబారినపడే అవకాశం ఉన్న కటుంబాలను, ఇళ్లను గుర్తించాలని సూచించింది. కాగా, లాన్స్‌డౌన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దలీప్ రావత్ ఈ ప్రాంత నివాసితులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరారు. (చదవండి: భార్యను పాము కాటేస్తే..ఆ భర్త చేసిన పనికి వైద్యులు నివ్వెరపోయారు) -
రూ. లక్షల్లో జరిమానాలు.. మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు..
జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల ఆగడాలు రోజు రోజుకూ శృతి మింపోతున్నాయి. సమాజం ఒకవైపు సాంకేతికంగా పరుగులు పెడుతుంటే మరో వైపు వీడీసీల పనితీరు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది. గ్రామాభివృద్ధికి ఏర్పడిన కమిటీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. కానీ ఇవి గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి. మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు మాట వినకుంటే బహిష్కరణ పంచాయతీ తీర్పుల్లో రూ. లక్షల్లో జరిమానాలు రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్న అధికారులు ఖలీల్‌వాడి: గ్రామాల్లో చిన్న, పెద్ద పంచాయతీలు వీడీసీ వద్దకు చేరితే మాట వినని వారిని బహిష్కరణ వేటు తప్పదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వీడీసీల్లో తలదూర్చని పరిస్థితి ఉంది. దీంతో పంచాయతీలో వీడీసీలు పెదరాయుళ్లు తీర్పులు ఇస్తారు. చిన్నతప్పు జరిగినా ర. లక్షల్లో జరివనాలు విధిస్తారు. వినకపోతే సాంఘిక బహిష్కరణే. అక్కడ వీరు చెప్పిందే చట్టం చేసిందే న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మర్, బాల్కొండ, నిజామాబాద్ రరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాపు వరకు.. గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం వీడీసీలు కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాప్‌లకు టెండర్లు నిర్వహిస్తారు. గ్రామంలో వేలం పాటను నిర్వహిస్తాయి. కోడిగుడ్డు నుంచి కూల్‌డ్రింక్స్‌ను గ్రామంలో వేలంపాటలో దక్కించుకున్న వారే అమ్మాలి. ఇతరులు అమ్మితే వారికి జరిమనా వేస్తారు. కోడిగుడ్లు, కూల్డింక్స్ను మార్కెట్ రేటు కంటే అదనంగా డబ్బులు అమ్మకాలు చేస్తారు. బెల్ట్‌షాపుల వేలం దక్కించుకున్నవారు దాని రేటు కంటే రూ.10 నుంచి 50 వరకు ధరలను పెంచి అమ్ముతారు. వీడీసీకి ప్రజాప్రతినిధులు దాసోహం.. మంలో వీడీసీ వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులను బహిష్కరించిన ఘటనలు ఉన్నాయి. ఆర్మర్ మండలంలోని పెర్కిట్ వీడీసీ అప్పటి ఆర్మర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను బహిష్కరించారు. వీడీసీలు ఇచ్చిన తీర్పుకు బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లవద్దు, న్యాయస్థానాలు ఆశ్రయించవద్దు. ఇలాంటి అనేక ఆంక్షలు పెట్డడంతో పెత్తనం పెరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు వీడీసీలకు దూరంగా ఉంటేనే తమ పనులను చక్కబెట్టుకుంటారు. వీడీసీ అగడాలను పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. 1970లోనే ఏర్పాటు.. జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలు 1970లో ఏర్పడ్డాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పించుకోవడానికి వీడీసీలు అప్పట్లో ఏర్పడ్డాయి. కుళాయి, బోరు నీటి కోసం, మురికి కాలువలు, రోడ్లు, వీధిదీపాలు పెట్టించటం ఇలా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీడీసీలు పనిచేసేవి. వీడీసీలు గ్రామంలో ప్రతి ఇంటికి కొంత డబ్బులు కలెక్ట్ చేసి వాటితో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించేవారు. కాని రానురానూ అవి పూర్తిగా మారిపోయాయి. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో వీడీసీలో క్యాషియర్ పోస్టు కోసం రెండు గ్రూపులుగా చీలిపోయి. రెండు వర్గాల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతనే ఉన్నాయి. ఈ గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు 8 మంది సభ్యులు, ఇతర కులాలకు చెందిన 10 మంది సభ్యులు వీడీసీలో ఉంటారు. క్యాషియర్ పదవీ విషయంలో విభేదాలు రావడంతో వీడీసీ రెండుగా చీలింది. ఎవరికి వారు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత మండలమైన వేల్పర్లోని రామన్నపేట్లో వీడీసీ ఆగడాలు మితిమీరిపోయాయి. రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేయడంతో పొలాలకు వెళ్లే వారికి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రశ్నింనందుకు ఓ కులానికి చెందిన 300 కుటుంబాలను బహిష్కరించారు. వీడీసీ ఆదేశాల మేరకు గ్రామంలో ఈ కులస్తులకు కిరాణ సామానుతో పాటు హోటల్లో టీ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఒక వర్గంపై మరో వర్గం రాళ్లదాడి కూడా చేసుకున్నాయి. రెండు వర్గాలను పిలి అధికారులు, పోలీసు లు సమస్యను పరిష్కరించారు. ఇప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. సిరికొండలోని గడ్కోల్‌లో న్నపిల్లల మధ్య గొడవ కాస్త ఓ కుటుంబం బహిష్కరణకు దారి తీసింది. చిన్నారుల గొడవ కారణంగా ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగి వారు మొదట సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయగా తగాదా కోర్టుకు చేరింది. కోర్టులో ఓ మహిళ కుటుంబానికి న్యాయస్థానం ఫైన్ వేయగా వారు కట్టేశారు. అయితే కుల సంఘంలోకి సదరు మహిళ కుటుంబం రావాలంటే ఆల్ కమిటీ(వీడీసీ)కి ర. లక్ష చెల్లించాలని తీర్మానించారు. కోర్టుకు వెళ్లి జరివనా కట్టామని మళ్లీ మీకు ఎందుకు కట్టాలని వారు ఆల్ కమిటీ(వీడీసీ)ని ప్రశ్నించారు. దీంతో ఈ కుటుంబాన్ని ఇప్పటివరకు కులసంఫనికి సంబంధించిన ఏ కార్యక్రవన ఏ కార్యక్రమాలకు పిలవట్లేదు. మాట్లాడట్లేదు. వరికి ఆల్‌కమిటీ(వీడీసీ) చేసిన నిర్వాకంపై శుక్రవారం బాధిత కుటుంబం ఏసీపీ కిరణ్‌కుమార్‌ను ఆశ్రయించింది. -
10వేల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భూముల సమస్యలన్నింటికీ చరమగీతం పాడేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వేలో ముఖ్య ఘట్టమైన డ్రోన్ సర్వే 10,206 గ్రామాల్లో పూర్తయింది. మొత్తం 13,500 గ్రామాల్లో డ్రోన్లు ఎగరాల్సి వుండగా 75 శాతం గ్రామాల్లో ఎగురవేసి భూముల కొలతను పూర్తిచేశారు. నంద్యాల, శ్రీ సత్యసాయి, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే చివరి దశకు వచ్చింది. నంద్యాల జిల్లాలో 441 గ్రామాలకు గాను 400 గ్రామాల్లో పూర్తయింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు 416, విజయనగరం జిల్లాలో 983కి 906, అనకాపల్లి జిల్లాలో 715కి 661, కాకినాడ 417కి 340, తూర్పుగోదావరిలో 272కి 236, కృష్ణాజిల్లాలో 502కి 460 గ్రామాల్లో సర్వే పూర్తిచేశారు. మిగిలిన జిల్లాల్లోనూ 50–60 శాతానికిపైగా సర్వే పూర్తయింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లతోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా విమానాలు కూడా వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది. చివరికి ప్రభుత్వం సైతం సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలట్లుగా శిక్షణ ఇచ్చి మరీ సర్వే చేస్తోంది. దీంతో ఈ సర్వే దాదాపు తుదిదశకు వచ్చింది. ఈ ఏడాది జూన్ నాటికి అన్ని జిల్లాల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేస్తోంది. ఏ జిల్లాల్లో డ్రోన్ సర్వే ఇంకా ఎన్ని గ్రామాల్లో చేయాలో దృష్టిపెట్టి సర్వేను పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు. అల్లూరి జిల్లాలో ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలు మరోవైపు.. కొండలు, అటవీ ప్రాంతాలతో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్ సర్వేకు అవకాశం లేకపోడంతో డీజీపీఎస్ సర్వేను ప్రత్యేక ప్రణాళికతో చేపట్టింది. కొండల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందకపోవడంతో భూమిపై నుంచే సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 2,980 గ్రామాలు ఉండడం, అక్కడ డ్రోన్ సర్వేకు అవకాశం లేకపోవడం రెవెన్యూ యంత్రాంగానికి సవాలుగా మారింది. రాష్ట్రమంతా రీ సర్వే ఒక ఎత్తయితే ఈ జిల్లాలో మాత్రం మరోలా ఉంది. ఈ జిల్లాలోని గ్రామాలను ఐదు గ్రూపులుగా విభజించి పాడేరు సబ్‌కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీఓ, రంపచోడవరం సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ, అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్లకు వాటిని అప్పగించారు. వీరితో ప్రత్యేకంగా అక్కడ రీ సర్వే చేయిస్తున్నారు. దీంతో అల్లూరి జిల్లాలో డీజీపీఎస్ సర్వే శరవేగంగా జరుగుతోంది. -
భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉడాన్: ఏకంగా ఆరు రెట్లు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో శీతల పానీయాలకు డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో తమ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగాన్నిఆరు రెట్లు విస్తరించు కోవాలని బీ2బీ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్ భావిస్తోంది. ఏడాది వ్యవధిలో 10,000 చిన్న పట్టణాలు, గ్రామాలకు చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగం హెడ్ వినయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకోసం ’ప్రాజెక్ట్ విస్తార్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్, జౌన్పూర్ జిల్లాల్లోసుమారు 3,000 మంది వరకు జనాభా ఉన్న గ్రామీణ మార్కెట్లలో దీన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కి అనుగుణంగా వివిధ బ్రాండ్లకు సంబంధించి పలు చిన్న ప్యాక్‌ల నిల్వలను పెంచుకుంటున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కోకా-కోలా, పెప్సీకో, డాబర్, హెక్టర్ బెవరేజెస్ (పేపర్‌బోట్) వంటి కీలక బ్రాండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. -
హలో.. అవుటాఫ్ కవరేజ్.. వారికి ఇంకా మొబైల్ కవరేజ్కష్టాలు!
సాక్షి, అమరావతి: దేశంలో 38,901 మారుమూల గ్రామాలకు ఇంకా మొబైల్ కవరేజ్ లేదని కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. వాణిజ్యపరంగా ఇది సాధ్యం కాకపోవడంతోపాటు జనాభా అక్కడక్కడ కొద్దికొద్దిగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలుండగా 6,05,230 గ్రామాలకు మొబైల్ కవరేజ్ ఉందని, మిగతా 38,901 గ్రామాలకు లేదని వివరించింది. అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో 6,592 గ్రామాలకు.. ఆ తరువాత రాజస్థాన్‌లో 3,316 గ్రామాలకు మొబైల్ కవరేజ్ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.26,316 కోట్లతో ప్రాజెక్టు దేశవ్యాప్తంగా మొబైల్ కవరేజీ లేని గ్రామాల్లో 4జి మొబైల్ సేవలను దశల వారీగా సంతృప్త స్థాయిలో కల్పించడానికి రూ.26,316 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.2,211 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 2జీ టెక్నాలజీని రూ.2,425 కోట్ల అంచనా వ్యయంతో 4జీ టెక్నాలజీ స్థాయికి పెంచనున్నామని పేర్కొంది. అంతేకాక.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించడానికి రూ.3,673 కోట్ల వ్యయం అంచనాతో పథకాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలోని 7,287 గ్రామాలకు.. అలాగే, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని 502 గ్రామాలకు 4జీ మొబైల్ కనెక్టివిటీని అందించడానికి రూ.7,152 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. -
వింత వింతల ఊళ్లు
దేశంలోని ఊళ్లన్నీ కాస్త హెచ్చుతగ్గులుగా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇళ్లూ వాకిళ్లూ పొలాలూ పశువులూ, అరకొర సౌకర్యాలు, ఇక్కట్లతో ఈదులాడే జనాలు దాదాపు అన్ని ఊళ్లలోనూ ఉంటారు. అరుదుగా కొన్ని ఊళ్లు మాత్రం మిగిలిన ఊళ్లకు భిన్నంగా ఉంటాయి. కొన్ని ఊళ్లు వాటి వింతలు విడ్డూరాలతో మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇంకొన్ని ఊళ్లు పట్టణాలను తలదన్నే అభివృద్ధి సాధించి, అందరినీ అవాక్కయ్యేలా చేస్తాయి. ఏదో ఒక రీతిలో ప్రత్యేకత నిలుపుకొనే ఇలాంటి ఊళ్లే వార్తలకెక్కి, విస్తృత ప్రచారం పొందుతాయి. ఇలాంటి ఊళ్లు ప్రపంచంలోని అక్కడక్కడా ఉన్నాయి. అలాగే మన దేశంలోనూ కొన్ని వింత వింతల ఊళ్లు ఉన్నాయి. మన దేశంలో ఉన్న కొన్ని వింత వింతల ఊళ్ల కథా కమామిషూ తెలుసుకుందాం... ప్రాచీన జీవనశైలి కాలంతో పాటే లోకం ముందుకు పోతుంది. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులను అందిపుచ్చుకుంటుంది. కాల గమనంలో ఇది సహజ పరిణామం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఫలితంగా కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక, పాతవాటి వినియోగం క్రమంగా కనుమరుగవుతుంది. కాలంతో కలసి ముందుకు పయనించడమే మానవ స్వభావం. అందుకు భిన్నంగా వెనుకటి కాలానికి వెళ్లి ఎవరైనా జీవించాలనుకుంటే, అది కచ్చితంగా విడ్డూరమే! అలాంటి విడ్డూరం కారణంగానే శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం ఇటీవల విస్తృతంగా వార్తలకెక్కింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ గ్రామం గురించి, అక్కడి జనాలు స్వచ్ఛందంగా అనుసరిస్తున్న ప్రాచీన జీవనశైలి గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఫలితంగా దేశ విదేశాలకు చెందిన కొందరు సంపన్నులు కూర్మ గ్రామంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎగబడుతున్నారు. కూర్మ గ్రామంలో ఇళ్ల నిర్మాణం కూడా ప్రాచీన పద్ధతిలోనే ఉంటుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, కాంక్రీటు వాడరు. ఇక్కడివన్నీ సున్నం, బెల్లం, మినుములు, మెంతులు, కరక్కాయలు, గుగ్గిలం మిశ్రమంతో నిర్మించుకున్న మట్టి ఇళ్లే! ఈ గ్రామంలో విద్యుత్తు ఉండదు. విద్యుత్తుతో పనిచేసే ఏ వస్తువూ ఇక్కడ కనిపించదు. ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్’ (ఇస్కాన్) ఆధ్వర్యంలో దాదాపు ఐదేళ్ల కిందట ఇక్కడ గ్రామాన్ని నెలకొల్పుకున్నారు. వేకువ జామున నాలుగు గంటలకే నిద్రలేవడం, ‘హరేకృష్ణ’ నామ కీర్తన సాగిస్తూ ఊరంతా పదహారుసార్లు తిరగడం, ఆధ్యాత్మిక సాధన, వేదాధ్యయనం చేయడం, పాత పద్ధతుల్లోనే వ్యవసాయం ద్వారా గ్రామానికి అవసరమైన పంటలు పండించు కోవడం వంటి జీవనశైలి ఈ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది. ఇక్కడ పన్నెండు కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ నడిపే గురుకులంలో పదహారుమంది విద్యార్థులు వేదాభ్యాసం చేస్తున్నారు. మరో ఆరుగురు బ్రహ్మచారులను కలుపు కొని ఈ గ్రామ జనాభా యాభైఆరు మంది. వీరంతా తమ ఇళ్లను తామే స్వయంగా నిర్మించుకుంటారు. తమ దుస్తులను తామే నేసుకుంటారు. ఈ గ్రామాన్ని తిలకించడానికి విదేశీయులు కూడా వస్తుంటారు. జీవితాలను యాంత్రికంగా మార్చేసిన అధునాతన సాంకేతికత కంటే, ఇక్కడి ప్రాచీనమైన గ్రామీణ జీవనశైలి ఎంతో హాయిగా ఉంటుందని పలువురు చెబుతుండటం విశేషం. సంస్కృతమే వారి భాష ప్రాచీన భాష అయిన సంస్కృతం మృతభాషగా మారిందని ఆధునికులు చాలామంది తీసిపారేస్తున్నా, ఆ గ్రామ ప్రజలు మాత్రం సంస్కృతాన్ని ఇప్పటికీ సజీవంగా బతికించుకుంటున్నారు. దేశంలోనే ఏకైక సంస్కృత గ్రామంగా పేరుపొందిన మత్తూరు గ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. ఇక్కడి ప్రజలు సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకుని, ఇప్పటికీ దాన్ని కాపాడుకుంటున్నారు. పిల్లలూ పెద్దలూ అందరూ ఇక్కడ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. మత్తూరు సంస్కృత గ్రామంగా మారడానికి వెనుక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ‘సంస్కృత భారతి’ సంస్థ ఈ గ్రామంలో 1981లో సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించింది. దీనికి హాజరైన ఉడిపి పెజావర మఠాధిపతి సంస్కృతం పట్ల గ్రామస్థుల ఆసక్తిని గమనించి, ఈ గ్రామాన్ని సంస్కృత గ్రామంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పడంతో గ్రామస్థులు ఆ ఆలోచనను స్వాగతించారు. నాటి నుంచి సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకున్నారు. సంస్కృతాన్ని మాతృభాషగా చేసుకున్నప్పటికీ ఈ గ్రామస్థులు ఆధునికతకేమీ దూరం కాలేదు. ఇక్కడి నుంచి ఉన్నత చదువులు చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవారూ ఉన్నారు. సంస్కృతంపై ఆసక్తిగల వారెవరికైనా ఆ భాషను నేర్పడానికి వీరు నిత్యం సంసిద్ధంగా ఉంటారు. పక్షులే నేస్తాలు ఆ ఊరి ప్రజలకు పక్షులే నేస్తాలు. ఏటా నవంబర్ నుంచి జూలై మధ్య కాలంలో ఆ ఊళ్లో పక్షుల సందడి కనిపిస్తుంది. దేశ దేశాలు దాటి వచ్చే పక్షులు చనువుగా మనుషుల భుజాల మీద వాలే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ ఊరు కొక్కరెబెళ్లూరు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. వలసపక్షుల సీజన్లో ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శతాబ్దాలుగా ఇక్కడకు వలస పక్షులు వస్తున్నా, ఇక్కడి మనుషులు వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. సీజన్లో వచ్చే వలస పక్షులు యథేచ్ఛగా చెట్లపై గూళ్లు పెట్టుకునేవి. ఒక్కోసారి వేగంగా గాలులు వీచేటప్పుడు గూళ్లు నేల రాలేవి. వాటిలో పక్షులు పెట్టుకున్న గుడ్లు పగిలిపోయేవి. ఇంకా రెక్కలురాని పక్షిపిల్లలు పిల్లులకు, కుక్కలకు ఆహారంగా మారేవి. ‘మైసూర్ అమెచ్యూర్ నేచురలిస్ట్స్’ వ్యవస్థాపకుడు మను 1994లో ఇక్కడకు వచ్చినప్పుడు ఈ దయనీయమైన పరిస్థితిని గమనించారు. పక్షుల రక్షణ కోసం గ్రామస్థులు చొరవ తీసుకుంటే బాగుంటుందనుకుని, వారితో చర్చించారు. గ్రామంలో ‘హెజ్జర్లె బళిగె’ (కొంగలతో నేస్తం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులంతా ఇందులో భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి ఈ గ్రామస్థులకు ఇక్కడకు వచ్చే వలసపక్షులతో స్నేహం మొదలైంది. అవి ఇక్కడ పెట్టుకునే గూళ్లు, వాటిలోని గుడ్లు, పక్షిపిల్లలు సురక్షితంగా ఉండేందుకు అన్ని సేవలూ చేస్తారు. అందుకే వలసపక్షులు ఈ గ్రామస్థులతో చాలా చనువుగా ఉంటాయి. -
స్టేషన్‌కి చేరిన దున్నపోతు పంచాయితీ! మాదంటే..మాది అని గొడవ
ఉండేది ఒకేఒక్క దేవర దున్నపోతు.. రోజుల వ్యవధిలో రెండు గ్రామాల్లో దేవర (జాతర) ఉంది. దేవరపోతు లేకుంటే జాతరే జరగదు. ఊరి దేవర చేయకపోతే గ్రామానికి అరిష్టమని అందరూ భావిస్తున్నారు. దీంతో ఉన్న ఒక్క దేవరపోతును వదులుకునేందుకు రెండు గ్రామాల ప్రజలు ఇష్ట పడడం లేదు. దీంతో ఆ దున్నపోతు తమదంటే.. తమదంటూ గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ అంశాన్ని రెండు గ్రామాల పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, కణేకల్లు: కణేకల్లు మండలానికి పడమట అంబాపురం, ఉత్తరాన రచ్చుమర్రి గ్రామాలున్నాయి. పదేళ్లకోసారి ఊరి దేవర జరపడం ఈ రెండు గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఊరి దేవర జరిగిన నెల తర్వాత అమ్మవారి పేరున ఓ మూడు నెలల వయసున్న దున్నపోతును కొనుగోలు చేసి వదులుతుంటారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఈ రెండు గ్రామాల్లోనూ ఊరి దేవర ముగిసిన తర్వాత మళ్లీ దున్నపోతును అమ్మవారి పేరున వదిలేశారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఊరి దేవరకు గ్రామస్తులు పెద్త ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. పట్టుదలకు పోయిన గ్రామ పెద్దలు.. ఈ నెల 17న అంబాపురంలో, మరో రెండు నెలల్లోపు రచ్చుమర్రిలో ఊరి దేవర నిర్వహించాలని గ్రామ పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో తాము అమ్మవారి పేరుతో వదిలిన దేవర దున్నపోతు కోసం అంబాపురం గ్రామస్తులు నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో గాలించి, చివరకు బొమ్మనహాళ్ మంలడం కొలగానహళ్లిలో కనిపించిన దున్నపోతును తీసుకెళ్లి గ్రామంలోని బందులదొడ్డిలో బంధించారు. విషయం తెలుసుకున్న ఉద్దేహాళ్ గ్రామస్తులు అంబాపురానికి చేరుకుని బందులదొడ్డిలో ఉంచిన దున్నపోతును గమనించి, అది తమదని వాదనకు దిగారు. అయితే ఆ పోతు తమదేనంటూ అంబాపురం వాసులు నచ్చచెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో రచ్చుమర్రి గ్రామస్తులొచ్చి పోతు తమదేనంటూ భీష్మించారు. తాము వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ అంబాపురం గ్రామ పెద్దలను నిలదీశారు. వారం రోజులుగా ఇరు గ్రామాల మధ్య ఈ వివాదం చెలరేగుతూ వస్తోంది. ఇరు గ్రామాల పెద్దలు పట్టుదలకు పోయి విశ్వ ప్రయత్నాలు చేస్తుండడంతో పలు మార్లు పంచాయితీలూ జరిగాయి. ఎవరూ రాజీ పడలేదు. ఊరి దేవరకు తేదీ నిశ్చయించుకున్నామని, ఊరంతా సంబరాలకు సిద్ధమైన తరుణంలో ఇలా ఘర్షనకు దిగడం సరికాదంటూ అంబాపురం వాసులు అంటున్నారు. అయితే ఈ పోతును వదులుకుంటే రెండు నెలల్లోపు తమ గ్రామంలో ఊరి దేవర ఎలా జరుపుకోవాలంటూ రచ్చుమర్రి వాసులు నిలదీస్తున్నారు. దీంతో పోతును వదులుకునేందుకు ఇరు గ్రామస్తులూ సిద్ధంగా లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది. స్టేషన్‌కు చేరినా తెగని పంచాయితీ.. చివరకు దేవర పోతు సమస్య కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. రెండు గ్రామాల పెద్దల మధ్య సఖ్యత కుదిర్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ పోతు తమదంటే తమదంటూ స్టేషన్లోనే రెండు గ్రామాల ప్రజలు మొండిగా వాదనకు దిగారు. దీంతో ఎవరికీ సర్ది చెప్పలేక పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు. పోతు కోసం తాము ఎందాకైనా పోతామంటూ ఒకరిపై మరొకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో అంబాపురంలో రేయింబవళ్లూ దున్నపోతుకు యువకులు పహారా కాస్తున్నారు. గ్రామంలో కొత్త వ్యక్తుల కదలికలపై పటిష్ట నిఘా వేశారు. (చదవండి: -
ఆ మూడు గ్రామాల్లో దసరా జరుపుకోరు...రావణుడే వారి దేవుడు
దసరా ఉత్సవాలను యావత్ భారతదేశం అంగ రంగ వైభవంగా జరుపుకుంటోంది. అలాగే దసరా అనగానే గుర్తుకొచ్చేది రావణ దహనం. ఈ విజయదశమి రోజునే రాముడు రావణుడిని చంపి విజయం సాధించినట్లుగా పురాణాల కథనం. అలాగే పాండవుల రాజ్యాన్ని పోగొట్టుకుని వనవాసం చేయాల్సి రావడంతో... జమ్మి చెట్టును పూజించి అక్కడే తమ ఆయుధాలను దాచినట్లు మహభారతగాథ తెలుపుతోంది. ఆనాటి నుంచి దసరా చివరి రోజు అనగా విజయదశమి రోజున రావణ దహనం చేయడం, జమ్మి చెట్టును పూజించడం వంటివి అనాదిగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓ మూడు గ్రామాల వారు దసరానే జరుపుకోరు, పైగా రావణ దహనాన్ని వ్యతిరేకిస్తారట. అంతేగాదు వారికి రావణుడే ఆరాధ్య దేవుడు. ఇంతకీ ఏంటా గ్రామాలు? ఎందుకు చేసుకోరో తెలుసుకుందామా!. 'రావణ' పేరుతో గ్రామం ఉత్తరప్రేదేశ్‌లోని, బిస్రాఖ్, బరాగావ్ అనే రెండు గ్రామాలు రావణ దహనం చేయరు, అలా చేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఉత్తరప్రేదేశ్‌లోని బాగాపత్ జిల్లాలో బరాగావ్ గ్రామం ఉంది. ఆ గ్రామవాసులు రావణుడిని దైవంగా భావిస్తారు. ఈ గ్రామాన్ని "రావణుడు" అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం....రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి శక్తి పొందాడని, తనతో శక్తిని తీసుకువచ్చేటప్పడూ అతడు ఈ గ్రామం గుండా వెళ్లినట్లు కథనం. ఐతే ఆ శక్తిని రావణుడు భరించలేకపోవడంతో ఆ గ్రామంలోని ఒక రైతుకి ఇచ్చాడని, అతను ఆ శక్తిని నేలపై పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో శక్తి రావణడుతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఏ ప్రదేశంలో శక్తి నెలపై ఉంచబడిందో అక్కడే మానసా దేవి ఆలయాన్ని నిర్మించి పూజించనట్లు ఆ ఆలయ పూజారి గౌరి శంకర్ పూరాణ కథను వివరించారు. అందువల్లే ఆ గ్రామంలో నివాసితులు ఈ పండుగను జరుపుకోవడానికి నిరాకరిస్తారు. రావణడు జన్మించిన గ్రామం అలాగే ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలోని బిస్రాఖ్ వాసులు కూడా బరాగావ్ గ్రామ వాసుల మాదిరిగానే దసరాను జరుపుకోరు. ఐతే ఈ గ్రామంలో కూడా రావణ, మేఘనాథ్, కుంభకర్ణలను దహనం చేసేందుకు ఒప్పుకోరట. పురాణల ప్రకారం... విశ్రవ రుషికి జన్మించిన రావణుడి బాల్యం బిస్రాఖ్‌లో జరిగింది. లంకేశ్వరుడైన రావణుడు తమ గ్రామంలో జన్మించాడని, గొప్ప శివభక్తుడైన రావణుడు పూజించిన ఆలయం 'మహంత్‌ని' రావణ ఆలయంగా పిలుస్తామని ఆ గ్రామా నివాసి రామదాస్ చెబుతున్నారు. తమ గ్రామం రావణుడిని తమ ఊరి బిడ్డగా నమ్ముతోందన్నారు. అలాగే రావణుడు తండ్రి విశ్రవస్ వల్ల తమ గ్రామానికి పేరు వచ్చిందని తాము విశ్వాసిస్తామని చెప్పారు. అందుకు గర్విస్తున్నామని కూడా చెబుతున్నారు. రావణుడంత తెలివి, భక్తి కావాలని.... మహారాష్ట్రాలోని అకోలా జిల్లాలోని సంగోలా గ్రామం రావణుడిని తమ ఆరాధ్యం దైవంగా కొలుస్తోంది. రావణుడి ఆశీర్వాదం వల్లే తాము జీవనోపాధిని పొందుతున్నట్లు నమ్ముతారు. అంతేగాదు రావణుడి వల్లే తమ గ్రామం శాంతి సౌఖ్యాలతో ఉన్నట్లు గ్రామస్తులు విశ్వసిస్తారు. గత 300 ఏళ్లుగా ఆ గ్రామంలో రావణుడిని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని నివాసితులు చెబుతున్నారు. పైగా రావణుడి అంత తెలివి, భక్తి పెంపొందాలని పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Dussehra 2022: పాలయమాం దేవీ!) -
భారతీయ గ్రామాల్లో ఇంగ్లిష్ విప్లవం
ఇంతవరకు దేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్రాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్ పదాలు వచ్చిచేరాయి. ఇంగ్లిష్ పదాలతో మార్కెట్ అనేది మార్పుకు అసలైన యజమానిగా మారిపోయింది. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆపలేవు. అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అదే రోజు భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం కూడా. భారతదేశంలో ఇంగ్లిష్ భాషలో విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. యాదృచ్ఛికంగా అక్టోబర్ 5న నా 70వ జన్మదినం కూడా! ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తేవాలంటూ గత 30 సంవత్స రాలుగా నేను చేస్తూ వస్తున్న ప్రచారం ఇప్పుడు ఒక అర్థవంతమైన దశకు చేరుకుంది. విలియం కారీ, రాజా రామమోహన్ రాయ్ 1817లో నాటి కలకత్తాలో దేశంలోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. 2022 నాటికి ప్రధానంగా వైద్యశాస్త్రం వల్ల ప్రపంచం కాస్త ఉపశమనం చెందింది. అంతర్జాతీయ ప్రసార కర్తగా ఇంగ్లిష్ భాషను ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం నిజంగానే ప్రపంచం ధ్వంసం కాకుండా కాపాడింది. సైన్స్, ఇంగ్లిష్ రెండూ కలిసి మనలేకపోయి ఉంటే, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మరుభూమి అయిపోయి ఉండేది. భారతదేశంలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ఒకట్రెండు రాష్ట్రాలే తమ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇప్పటికే చాలాకాలంగా నాగాలాండ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలోనే బోధన కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి. కశ్మీర్ చాలా కాలానికి ముందే ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా ప్రారంభిం చేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ బోధించడాన్ని ఎంతగానో ప్రోత్సహించింది. వీటితో పాటుగా, భారతదేశ వ్యాప్తంగా వేలాది ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కూడా ఉన్న విషయం తెలిసిందే. నా చిన్నతనంలో నా కుల ప్రజలు మానవులతోనే కాకుండా, జంతువులతో కూడా కురుమ అని పిలిచే భాషలో మాట్లాడేవారు. చాలా కొద్దిమంది ప్రజలు మాత్రమే ఆ భాషను అర్థం చేసుకునేవారు. దానికి లిపి ఉండేది కాదు. నా మొత్తం కమ్యూనిటీ నిరక్షరాస్య కమ్యూనిటీ. లిపి లేని భాష తమలో తాము మాత్రమే మాట్లాడుకునేది. ఇతర గ్రామీణులకు ఆ భాష అర్థమయ్యేది కాదు. నా చిన్ని గ్రామం చుట్టూ లంబాడా గిరిజన గుడిసెలు ఉండేవి. వారు గొర్ బోలి అనే లంబాడా భాషను మాట్లాడేవారు. గ్రామం లోపల కొన్ని ముస్లిం ఇళ్లు ఉండేవి. వారి పిల్లలు ఉర్దూ మాట్లాడే వారు. ఇక వ్యవసాయ పనులు చేసే అనేక కులాలు తెలంగాణ మాండలికంలోని తెలుగు మాట్లాడేవారు. దాంట్లో చాలా ఉర్దూ పదాలు ఉండేవి. గత 65 సంవత్సరాల నా చైతన్యపూర్వకమైన, భావ ప్రసార జీవితంలో ఒక మందగమనంతో కూడిన నిశ్శబ్ద విప్లవం చోటుచేసుకుంది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, గ్రామీణులు, పట్టణ వాసులు తేడా లేకుండా అన్ని ఇళ్లలో నిదానంగా ఇంగ్లిష్ మెల్లగా అడుగుపెట్టేసింది. మార్పు తీసుకురావడానికి ఇది ప్రారంభం. ఈ క్రమంలో బియ్యం స్థానంలో రైస్ అనే పదం వచ్చి చేరింది. మాంసం స్థానంలో మటన్ వచ్చి చేరింది. చేపలు అనే పదాన్ని ఫిష్ తోసి పారేసింది. కోడికూర స్థానంలో చికెన్, కూరగాయల స్థానంలో వెజిట బుల్స్ వంటి ఇంగ్లిష్ పదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల్లో, కుగ్రామాల్లో అన్ని కమ్యూనిటీలకు సొంతమైపోయాయి. గ్రామాల్లోని అన్ని సంతల్లో, అంగళ్లలో కూడా తెలుగు పదాలు పక్కకుపోయి ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరాయి. ఒక తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సరుకులకు ఉపయోగించే రోజువారీ పేర్లు, పదాలకు సంబంధించి కూడా ఇంగ్లిష్ పదాలు చలామణిలో ఉంటున్నాయి. నిదానంగా అయినా సరే, భారతీయ జీవనం తప్పనిసరిగా ఆంగ్లీకరణకు గురవుతోందని చెప్పాలి. తెలుగు, ఉర్దూ లేదా లంబాడి భాష మాట్లాడే ప్రజలు కూడా నిత్యం ఉప యోగించే ఆహార పదార్థాలు, పేర్లు, నూతన టెక్నాలజీలకు ఇంగ్లిష్ పదాలు జోడించడం అలవాటైపోయింది. వారి జీవితంలోకి ప్రవేశి స్తున్న ఇంగ్లిష్ వారి భవిష్యత్తును కూడా మారుస్తోంది. ఇప్పటికైతే ప్రతి గ్రామంలోనూ స్త్రీ పురుషులకు కొన్ని వందల ఇంగ్లిష్ పదాలు తెలుసు. ఈరోజు ఇంగ్లిషులో ఉన్న మెషిన్లను ఉపయోగిస్తున్నవారు సెల్ ఫోన్ వంటి ఇంగ్లిష్ పేర్లనే వాడుతున్నారు. వీరి మాతృభాషలో సెల్, ఫోన్ వంటి ఇంగ్లిష్ పదాలకు సరిసమాన పదాలు లేవు. ప్రాంతీయ టీవీ ఛానల్స్ అయితే 30 నుంచి 40 శాతం వరకు ఇంగ్లిష్ పదాలు, వాక్యాలనే వాడుతున్నాయి. మార్నింగ్ న్యూస్, ఈవెనింగ్ న్యూస్, బర్నింగ్ టాపిక్, గన్ షాట్, బిగ్ ఫైట్, బిగ్ డిబేట్, న్యూస్ ఎక్స్‌ప్రెస్ వంటివి తెలుగు టీవీ స్క్రీన్లపై సాధారణంగా ఉపయో గించే పదాలుగా మారిపోయాయి. ప్రాంతీయ భాషలను మాత్రమే ఉపయోగించే ఛానల్స్‌కు వీక్షకులు పెద్దగా లేరు. 1950లలో బస్సు, ట్రెయిన్ వంటి ఇంగ్లిష్ పదాలు మన గ్రామా లను చేరుకున్నాయి. ఎందుకంటే ఈ వాహనాల్లో వారు ప్రయాణిం చడం మొదలెట్టారు. అలా ప్రయాణిస్తున్నప్పుడు టికెట్, కండక్టర్ వంటి పదాలను కూడా వారు నేర్చేసుకున్నారు. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచే కొద్దీ పనిముట్ల పేర్లు, మెషిన్లు వంటి యంత్రాల పేర్లకు పలు ఇంగ్లిష్ పదాలు వాడటం వారి జీవితంలో భాగమై పోయింది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర అనే తేడా లేకుండా ఈ మార్పు జరుగుతూ వచ్చింది. నా తొలి బాల్యంలో నేను ఉపయోగించిన కురుమ భాష అంతరించిపోయినందుకు నేను విచారించలేదు. అప్పట్లోనే అనేక ఉర్దూ పదాలు కలిసిపోయిన తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. మా గ్రామం మాజీ నిజాం రాజ్యంలో ఉంటున్నందున నాటి తెలుగును గ్రామంలో లేదా సమీ పంలోని పట్టణంలో చాలామంది ప్రజలు అర్థం చేసుకునేవారు. ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరుతున్నాయి. వ్యాకరణంతో కూడిన భాషలో మాట్లాడకుండానే ఒక ఇంగ్లిష్ పదం లేదా పేరును ఉపయోగించడం ద్వారా చాలామంది ప్రజలు ఇప్పుడు పరస్పరం భావ ప్రసారం చేసుకుంటున్నారు. గ్రామంలో ఉత్పాదక భాష ఎన్నడూ వ్యాకరణ కేంద్రకంగా ఉండేది కాదు. అది భావ ప్రసార కేంద్రకంగా ఉండేది. ఇంగ్లిష్ పదాలు తమ కమ్యూనికేషన్ పరిధిని విస్తరించుకున్నాయి. నా తొలి బాల్యంలో గ్రామస్థులు ఇంగ్లిష్ పేర్లు కలిగి ఉన్న మెషిన్లను వాడటం మొదలెట్టారు. వాటి విడిభాగాలు కూడా ఇంగ్లిషులోనే ఉండేవి. ఉదా. 1960ల మొదట్లో సైకిల్ అనే పేరున్న వాహనం వారి జీవితంలోకి వచ్చేసింది. అలాగే చైన్లు, హ్యాండిల్స్ వంటి పదాలు కూడా. ఆ కాలంలోనే వారి గ్రామంలోకి వచ్చిన కరెంట్ అదే పేరుతో చలామణీ అయ్యేది. ఆయిల్ ఇంజిన్ అదే పేరుతో పిలిచేవారు. వాటి పేర్లతోనే ప్రజలు వాటి పాత్రలను, విధులను అర్థం చేసుకునేవారు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్ పదాలు వచ్చిచేరాయి. ఆరెస్సెస్– బీజేపీ, కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు లేక ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చినా, లేకున్నా ఈ భాషా విప్లవాన్ని ఆపలేకపోయాయి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టులు, పార్సీలు వంటి అన్ని మతాల వాడుకలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరాయి. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆప లేవు. ఇంగ్లిష్ పదాలతో మార్కెట్ అనేది మార్పుకు అసలైన యజ మానిగా మారిపోయింది. ఈ మార్పును నేను చూడగలిగాను. ఇత రుల భాషను అర్థం చేసుకోలేని గ్రామాల్లోని ఇరుగుపొరుగు వారు కూడా ఇంగ్లిష్ పదాలను ఉత్తమంగా అర్థం చేసుకోవడం మొద లెట్టారు. ఎందుకంటే ఇంగ్లిష్ పదాలు వారిని మార్కెట్‌కు అను సంధానం చేశాయి. ఇంగ్లిష్ పదాలతో గ్రామ ప్రజలు ఇండియన్స్ అయిపోయారు. ఇంగ్లిష్ వారిని జాతీయవాదులను చేసింది. హిందీతో సహా ఏ ఇతర ప్రాంతీయ భాష కూడా దీన్ని సాధించలేకపోయింది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రెండు దశాబ్దాల్లోనే మారిన దశ.. నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం
సిరిసిల్ల: గోధూళి వేళ.. వ్యవసాయ పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు చేరుతున్నారు.. సూర్యుడు అస్తమించాడు.. చీకటి కమ్ముకుంటుంది.. అంతలోనే కంజీరమోతలు.. ఎర్రెర్రని పాటలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. దోపిడీలేని సమాజం కోసం విప్లవించాలనే నినాదాలు.. ప్రజాకోర్టు.. ఊరిలోని అంశాలపై బహిరంగ చర్చలు.. లాల్ సలామ్ అంటూ.. వీడ్కోలు..! మరసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు.. బూట్ల చప్పుళ్లతో ఊరు తెల్లవారింది.. ఆ పల్లెలోని వారిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి. గ్రామ చావడి వద్దకు అందరిని చేర్చి ప్రజాదర్భార్. మేమున్నదే మీకోసం అంటూ అడవుల్లో తిరిగే వాళ్లకు మీరు అన్నం పెట్టొద్దు.. మొన్న వాళ్లకు అన్నం పెట్టిన వారు ఎవరో మాకు తెలుసు.. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.. మీరు మాత్రం వాళ్లకు సహకరించొద్దు. చట్టం ఉందే మీకోసం.. అంటూ.. ఖాకీ డ్రెస్సుల పిలుపు..! ఇది రెండు దశాబ్దాల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కల్లా ప్ర జలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఊరు మారింది ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు, ఇప్పటి స్థితిని అంచనా వేస్తే పల్లెలు ఎంతో మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేటను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ పల్లెకు వాహనయోగం వ చ్చింది. అప్పట్లో ఊరు మొత్తంలో మూడు, నాలు గు వాహనాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంటికో బైక్, ఊరి నిండా ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు ఇలా ఎంతో మార్పు వచ్చింది. జిల్లాలోనే అత్యధి క కోళ్ల పరిశ్రమ ఆ గ్రామంలో విస్తరించింది. 20 కోళ్ల ఫారాలతో పౌల్ట్రీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఆ ఊరిలో పట్టణాల తరహాలో సూపర్మార్కెట్లు నడుస్తున్నాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఇప్పుడు ప్రశాంతంగా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. బావుసాయిపేట ఊరి జనాభా నాలుగు వేలు. ఓటర్ల సంఖ్య 2,740, వార్డులు పది. నివాసాల సంఖ్య 876. చిన్న ఊరే అయినా అభివృద్ధిలో అగ్రపథాన నిలుస్తుంది. తీరొక్కటి దొరికే... సంత బావుసాయిపేటలో ప్రతీ బుధవారం జరిగే వారసంతలో తీరొక్క వస్తువులు దొరకుతాయి. చేపలు, రొయ్యలు మొదలు కొని బట్టలు, నిత్యసవరమైన వస్తువులు అన్నీ లభి స్తాయి. దీంతో కొండాపూర్, వెంకట్రావుపేట, బండపల్లి, గోవిందరా వుపల్లె గ్రామాల వాసులు వారసంతకు వచ్చి సరుకులు కొనుగోలు చేస్తారు. ఊరు శివారులో మూలవాగు, మరో రెండు చెరువులు ఉండడంతో భూగర్భజలాలకు కొదువ లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను సాగుచేస్తారు. భూములు కొనుగోలు, విక్రయాలతో ఊరి ఆర్థికస్థితి మెరుగుపడింది. వ్యవసాయంలో బావుసాయిపేటలో అగ్రగామిగా నిలుస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థికస్థితి ఎంతో బాగుపడింది. ఊరిలో రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్లు పల్లె అందాన్ని పెంచాయి. ఎంతో మార్పు వచ్చింది ఒకప్పటితో పోల్చితే ఊరిలో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు బాగుపడ్డాయి. రవాణా వసతి పెరిగింది. కమ్యూనికేషన్ పెరిగింది. ప్రజల జీవనంలోనూ మార్పు వచ్చింది. పట్టణాల్లో దొరికేవి అన్ని పల్లెల్లో అన్నీ లభిస్తున్నాయి. – బైరగోని నందుగౌడ్, చైతన్య యూత్, అధ్యక్షుడు వేగంగా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పల్లెల్లో అభివృద్ధి వేగంగా సాగుతుంది. అన్ని రంగాల్లో మార్పు వేగంగా జరిగింది. ఇంటింటా సెల్‌ఫోన్ యుగమైంది. గతంలో పోల్చితే.. పల్లె ముఖచిత్రం ఎంతో మారింది. కల్లోల పల్లెల్లో వ్యవసాయ విస్తరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. – కెంద గంగాధర్, గ్రామ సర్పంచ్ -
జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లతో క్రీడలకు మహర్దశ
సత్తెనపల్లి: గల్లీ, గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు యాప్‌లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, 366 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని పాఠశాలల్లో ఇప్పటికే క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఎంతోమంది మెరికల్లా తయారవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిలో వెటరన్ క్రీడాకారులనూ భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇదీ ప్రణాళిక జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటుకు రెండు నెలల క్రితమే ఉత్తర్వులొచ్చాయి. అప్పటి నుంచి పూర్తి మార్గదర్గకాలు రూపొందించేందుకు వివిధ రంగాల్లో నిపుణులైన క్రీడాకారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. తాజాగా దీనిపై ఒక ప్రణాళిక రూపొందించారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచే క్రీడాకారుల ఎంపిక, తర్ఫీదు, పోటీల నిర్వహణ చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని సచివాలయ అడ్మిన్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలు స్పోర్ట్స్ క్లబ్‌ల నిర్వహణకు గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ పరిధిలో క్రీడాప్రాధికార సంస్థ కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారు. క్రీడలను ప్రోత్సహించే దాతలనూ ఇందులో భాగస్వాములను చేయనున్నారు. రూ.50 వేలు, ఆపైన విరాళంగా అందించే దాతలు, అదే గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు, పీఈటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తహసీల్దార్, ఎంఈవో, మండల ఇంజినీర్, ఎంపీడీవో, ఎస్సై, క్రీడాకారుడు, క్రీడాకారిణి, దాత.. ఇలా 11 మంది సభ్యులుగా ఉంటారు. స్పోర్ట్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్ ఇలా ► మొదటగా గూగుల్ ప్లే స్టోర్‌లో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► డౌన్లోడ్ అయిన తర్వాత పేరు, మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► రిజిస్టర్ అయిన తర్వాత గ్రామం, సచివాల యం, పాఠశాల వివరాలు నమోదు చేయాలి. ► ఏ క్రీడపై ఆసక్తి ఉంటే దానిపై టచ్ చేసి రిజిస్టర్ కావాలి. ► అప్పటి నుంచి జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లలో సభ్యులుగా మారుతారు. ఆ తర్వాత నోటిఫికేషన్ల రూపంలో క్రీడల వివరాలు అందుతాయి. పల్లె మట్టి వాసనల్లో మరుగున పడిన క్రీడా ఆణిముత్యాలు ఇకపై అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు బాటలు పడ్డాయి. మారుమూల వీధుల్లో ఖోఖో అంటూ కూత పెట్టే యువతరం ఇక ఉన్నత స్థాయిలో మోత మోగించనుంది. మెరికల్లాంటి ఆటగాళ్లలో ప్రతిభను వెలికి తీస్తూ కబడ్డీ తొడగొట్టనుంది. సీనియర్ సిటిజన్స్ నుంచి చిన్నారి బుడతల వరకు ప్రతి ఒక్కరినీ ఆటలో అందలమెక్కిస్తూ శారీరక దారుఢ్యం పెంచుతూ క్రీడా రంగానికి ఉజ్వల భవిష్యత్ తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ద్వారా క్రీడాకారుల తర్ఫీదు, పోటీల నిర్వహణకు సమగ్ర విధివిధానాలు రూపొందించింది. పోటీల నిర్వహణ ఇలా.. ► పంచాయతీ కార్మదర్శులు, సచివాలయ అడ్మిన్ ప్రతి నెలా స్పోర్ట్స్ క్లబ్ సమావేశం నిర్వహిస్తారు. తొలుత వీఆర్వో, సర్వేయర్ల ద్వారా ఆట స్థలాన్ని గుర్తిస్తారు. క్రీడాకారులను ఇందులో భాగస్వాములను చేస్తారు. ఒక్కో క్రీడాంశానికి ఒక్కో క్లబ్‌ను ఏర్పాటు చేస్తారు. ► వెటరన్స్ కోసం జగనన్న వాకింగ్ క్లబ్‌లు రూపొందించారు. మహిళలకు స్కిప్పింగ్, టెన్నికాయిట్, త్రోబాల్ తదితర ఆటలు నిర్వహిస్తారు. ► సామాజిక భవనాలు, పంచాయతీ హాళ్లలో వసతులు గుర్తించి చెస్, క్యారమ్స్, ఉచిత యోగా శిక్షణ ఏర్పాటు చేస్తారు. ► క్రీడా స్థలాలు లేకపోతే వీధుల్లోనే దీనికి అనువైన ప్రదేశాలను గుర్తించి కబడ్డీ, వాలీబాల్, రబ్బర్ బాల్‌తో క్రికెట్ వంటి అనువైన ఆటలు ఆడిస్తారు. ఎన్ఆర్ఐలు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి క్రీడా సామగ్రి సమకూరుస్తారు. ► మండల క్రీడాప్రాధికార సంస్థ సభ్యులు దేశీయ క్రీడలను ప్రోత్సహించడం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు అందజేస్తారు. టోర్నమెంట్లు, మ్యాచులు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించి స్పోర్ట్స్ అథారిటీకి ఆదాయాన్ని పెంచుతారు. ► ప్రతి మూడు నెలలకోసారి మండల, నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా పరిషత్‌ల ఆదాయం నుంచి నాలుగు శాతాన్ని క్రీడలకు వెచ్చిస్తారు. మంచి వేదిక క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి స్పోర్ట్స్ క్లబ్ మంచి వేదిక. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. యువత తమకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో యాప్‌లో నమోదు చేసుకోవాలి. క్రీడలు, వ్యాయామం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను రూపొందించింది. – ఎ.మహేష్ బాబు చీఫ్ కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, పల్నాడు -
పెళ్లి కోసం పట్నాలకు వలసలు
సాక్షి, అమరావతి: పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు ఎవరన్నా వలస పోతున్నారంటే.. ఉద్యోగం, ఉపాధి పనుల కోసమో.. అదీ కాకుంటే పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అందరూ అనుకుంటుంటారు. కానీ.. అది వాస్తవం కాదట. 2020 జూలై నుంచి 2021 జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వలసలపై కేంద్రం నిర్వహించిన పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేంద్రం ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో నూటికి 47.5 శాతం మంది పెళ్లిళ్ల కారణంగానే పట్టణాలకు వలస వెళ్లినట్టు తేలింది. అంటే దాదాపు మొత్తం వలసల్లో సగం మంది వలసలకు ఇదే కారణమని స్పష్టమైంది. ఉపాధి.. ఉద్యోగాల కోసం వెళ్లేది 10.8 శాతమే ► ‘ఉపాధి హామీ పథకం–గ్రామాల్లో వలసలు’ అనే అంశంపై రెండు రోజుల క్రితం లోక్‌సభలో చర్చకు రాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే వివరాలను అధికారికంగా వెల్లడించింది. ► 2020–21 మధ్య పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు 47.5 శాతం కాగా.. వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉందని పేర్కొంది. ► ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం పట్నం వెళ్లిన వారి సంఖ్య కేవలం 10.8 శాతమే అని తెలిపింది. ► పిల్లల చదువుల నిమిత్తం పట్టణాలకు వలస వెళ్తున్న వారు 2.4 శాతం మంది ఉన్నట్టు పేర్కొంది. ► సంపాదించే కుటుంబ యజమాని స్థల మార్పిడి కారణంగా 20 శాతం మంది పట్టణాలకు చేరుకున్నారని వెల్లడించింది. ► 2020 మార్చిలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూలై నాటికి లాక్డౌన్ నిబంధనలను చాలావరకు కేంద్రం సడలించింది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకే కేంద్రం ఈ సర్వే చేయించింది. ► అప్పట్లో పట్నాల నుంచి పల్లెటూరు వెళ్లిన వారి సంఖ్యతో పాటు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వారి వివరాలను కూడా ఈ సర్వే ద్వారా కేంద్రం గుర్తించింది. ► మొత్తం 122 కోట్ల దేశ జనాభాలో 0.7 శాతం మంది అంటే 85 లక్షల మంది సర్వే జరిగిన ఆ ఏడాది కాలంలో తాత్కాలికంగా వలస బాట పట్టారని తేల్చింది. పట్నం బాట పట్టడానికి కారణాలు.. వలస వెళ్లిన వారి శాతం -
జీవన సంగీతం
ఒకప్పుడు ఏ ఊరికైనా వెళ్తే, ఆ ఊరు దానికదే ముచ్చటగా కనబడేది. ఆ ఇళ్ల నిర్మాణం, వాటి వాకిళ్లు, వాటి ముందరి చెట్లు, అవి పాకలే అయినా సరే భిన్నంగా ఉండేవి. కలిమిలేముల సమస్య కాదిది. ఈ భూప్రపంచంలో ఆ ఊరిని పోలిన ఊరు ఇంకోటి ఉండకపోయేది. అది దానికదే యునీక్, స్పెషల్. ఇప్పుడు ఏ ఊరిని చూసినా అవే సిమెంటు పౌడరు అద్దుకున్న ముఖాల్లా ఉంటాయి. అంతవరకూ పోనీ అనుకుంటే, ఏ ఊరిలోనైనా ఒకే రకం బ్యానర్లు తగులుతాయి. మనం ఇంకో ఊరికి పోయామన్న అనుభూతే దొరకదు. పోనీ మనుషులను అయినా పలకరిద్దామా అంటే, వాళ్లందరూ ఒకే విషయాలు మాట్లాడుతుంటారు. మనం మన ఊరిలో మాట్లాడే విషయాలే ఆ పక్క ఊరిలో కూడా మాట్లాడుతుంటే వినడం ఎంత విసుగు! ఈ ‘ఒకే రకం’ అనేదే ఇప్పుడు పెద్ద సమస్య. ఏదీ ప్రత్యేకంగా ఉండదు, ఎందులోనూ జీవం తొణికిసలాడదు. నాస్టాల్జియాను కలవరించడంలో అంత దోషమేమీ లేదు. అది మన విలువైన గతం. ప్రపంచంలో ఇలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అని నమ్మకం కలిగించేట్టుగా ఎవరూ ఉండటం లేదు. అతనూ అదే పాపులర్ సినిమా గురించో, అవే రాజకీయాల గురించో మాట్లాడతాడు. కారణం ఏమంటే, అందరమూ ఒకే రకమైన సమాచారాన్ని డంప్ చేసుకుంటున్నాం. కెరియర్ వరకూ ఏమో గానీ, కరెంట్ ఎఫైర్స్‌లో మాత్రమే జీవితం లేదు. సమాచారం రోజురోజుకూ దొర్లిపోయేది. అందులో జీవిత కాలానికి స్వీకరించగలిగే బరువు ఉండదు. కానీ ప్రపంచమంతా అనుసంధాన మయ్యాక అందరూ చూస్తున్నది ఒకటే, అందరూ చదువుతున్నది ఒకటే. వేరు చూపు లేదు, వేరు ఆలోచన లేదు, వేరుగా దర్శిస్తున్నది లేదు. మొత్తంగా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోయింది. అసలు అనుభవాలే భిన్నంగా ఉండకపోయాక ఇంక ఒరిజినాలిటీ ఎక్కyì నుంచి వస్తుంది? కానీ ప్రకృతి మనిషినే కాదు, జీవరాశినే అలా పుట్టించలేదు. ప్రతిదీ దానికదే భిన్నమైనది. ఉదాహరణకు కంచర గాడిదల చర్మాలు జాగ్రత్తగా చూడండి. అన్నీ నలుపూ తెలుపూ చారలే. కానీ ఏ ఒక్క చార కూడా ఇంకో చారను పోలివుండదు. ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకోదానికి ఉండవు. వాటిదైన చర్మపుముద్ర అది! ప్రతి చెట్టు, ఆకు, పువ్వు – ఏ ఒక్కటీ ఒకే రకంగా ఉండవు. కానీ స్థూలంగా అంతా ఒకటే. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అదే పోగొట్టుకుంటున్నామా అని అనుమానం. ‘‘ప్రతి మనిషికంటూ ఉన్న తనదైన రహస్యం ఏదో మాయమైపోయి, అది కేవలం సమాచారంతో భర్తీ అయిపోయింది. జీవిత రహస్యానికీ, ఈ సమా చారానికీ ఏ సంబంధమూ లేదు. ఈ జీవిత రహస్యం అనేది కొంచెం సంక్లిష్టమైనదీ, సులభంగా అర్థం చేసుకోలేనిదీ. దాని చుట్టూ మనం నర్తించగలం, అబ్బురపడగలం. కానీ అది కిలోబైట్లు, గిగా బైట్ల సమాచారంతో మాత్రం భర్తీ చేసుకోలేనిది’’ అంటారు స్వెత్లానా అలెక్సీవిచ్. చెర్నోబిల్ దుర్ఘ టన, సోవియట్ పతనం, సోవియట్– అఫ్గానిస్తాన్ యుద్ధం లాంటి బీభత్సాల అనంతరం స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరితోనూ స్వెత్లానా మాట్లాడారు. బాధిత జనాల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వెలువరించిన మౌఖిక చరిత్రలకుగానూ రష్యన్ భాషలో రాసే ఈ బెలారూస్ పాత్రికేయురాలు నోబెల్ గౌరవం పొందారు. ‘‘ప్రపంచంలో ఎటు చూసినా ఈ ‘బనాలిటీ’ (ఒరిజినాలిటీ లేకుండా పోవడం) నిండిపోయివుంది. వారిదైన సొంత మాట మాట్లాడేస్థాయికి తేవాలంటే మనుషులలోని దీన్ని ఒలిచెయ్యాలి. అప్పుడు మాత్రమే వాళ్లు అంతకు ముందు ఏ మనిషీ చెప్పలేని మాటలు చెబుతారు. మనుషులను ఆ స్థాయికి తీసుకెళ్లడం నాకు ముఖ్యం’’ అంటారు స్వెత్లానా. అప్పుడు మాత్రమే ‘‘నాకు అది తెలుసని నాక్కూడా తెలియదు’’ అని వాళ్లే ఆశ్చర్యపోతారు. యుద్ధం లేదా అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే మనిషి ఉద్వేగమూ, వివేకమూ పైస్థాయికి వెళ్తాయి. విషయం మొత్తాన్నీ చాలా పైచూపుతో చూడగలిగే దృష్టి అలవడుతుంది. ఆ స్థితిలో చేయగలిగే వ్యాఖ్యానం జీవితాన్ని దర్శింపజేస్తుంది. అందుకే ప్రపంచంలో చాలా కళాఖండాలు యుద్ధ ఫలితంగా పుట్టాయి. కానీ గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. కళ కంటే కూడా ఏ కాలంలోనైనా ప్రాణం ముఖ్యం. అందుకే మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకో గలగడం తెలియాలి. ‘ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతా’నన్న కవీంద్రులం కావాలి. జీవితంలో నలిగిపోయిన మనిషి మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నలిగిన మనిషి ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు: ఎవరు కాదు? ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్ప దృష్టితో చూడగలగడానికి అర్హులే అయినప్పుడు మరి అందరూ ‘ఒకే రకం’ అన్న ఫిర్యాదు ఎటుపోయింది? సమాచార బదలాయింపు అనే అర్థంలేని మాటలకే మనం పరిమితమవుతున్నాం కాబట్టి. నిజంగా ఒక లోలోతైన సంభాషణ జరగడానికి అవకాశం ఇస్తున్నామా? మాట్లాడే మనుషులు ఉండటమే కాదు, ఆ మాటలకు అంతేస్థాయిలో ప్రతిస్పందించగలిగేవాళ్లు కూడా ఉన్నప్పుడే గొప్ప సంభాషణలు జరుగుతాయి. సాంకేతికంగా అవి ఎక్కడా రికార్డు కాకపోవచ్చుగాక. కానీ మూకుమ్మడి మానవాళి ఉద్వే గపు సంరంభంలో అజ్ఞాతంగా భాగమవుతాయి. వివేకపు రాశులుగా పోగుపడి మనల్ని వెనకుండి నడుపుతాయి. ఆ జీవన సంగీతం చాలా సున్నితమైనదీ, చెవి నుంచి చెవికి సోకేంత రహస్యమైనదీ, వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిదీ! ఆ జీవనసంగీతమే ప్రపంచంలో వ్యాపిస్తున్న నిర్హేతుకత, మూర్ఖత్వాలకు జవాబు కాగలదు. -
15 రోజులు.. 6.51లక్షల మంది శ్రమదానం
సాక్షి,హైదరాబాద్: పల్లెల్లో సైతం పట్టణ సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి (ఐదో విడత) కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఇందులో భాగంగా 12,769 గ్రామపంచాయతీలలో ప్రజలను భాగస్వా మ్యం చేస్తూ వివిధ కమిటీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు అభివృద్ధి పనుల్లో 6.51 లక్షలమంది శ్రమదానం చేసినట్లు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 63 వేల కి.మీ. పొడవైన రోడ్లను, 36 వేల కి.మీ.పొడవైన మురుగు కాల్వలు, 80,405 సంస్థలను పరిశుభ్రం చేసినట్లు వెల్లడిం చారు. 19,349 లోతట్టు ప్రాంతాలు, 1,098 పనికి రాని బోరుబావులు, 1,902 నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చి వేయగా.. అవెన్యూ ప్లాంటేషన్ కోసం 10,946 కి.మీ రోడ్లు గుర్తించడంతో పాటు 17,710 విద్యుత్ స్తంభాలకు మూడో వైరును, 1,206 విద్యుత్తు మీటర్లు సమకూర్చినట్లు తెలిపారు. మొత్తం 15 రోజుల పాటు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు కలిపి మొత్తం 8,286 మంది, రాష్ట్రస్థాయి అధికారులు 10,012 పాల్గొన్నారని వివరించారు. ‘ప్రగతి’సోపానాలివే...: పల్లె ప్రగతిలో ఇప్పటివ రకు రూ.116 కోట్లతో 19,472 పల్లె ప్రకృతి వనాలు, రూ.1,555 కోట్లతో 12,669 వైకుంఠధా మాలు, రూ.318 కోట్లతో 12,753 డంపింగ్ యార్డులు నిర్మించినట్లు సుల్తాని యా తెలిపారు. 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.9,800 కోట్ల మేర గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటు మంజూరు చేయగా..గ్రామాల్లో అభివృద్ధి కార్య క్రమాల నిమిత్తం ప్రతీనెల రూ.256.66 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 545 గ్రామీణ మండలాల్లో మండలానికి ఐదు చొప్పున 5 నుంచి 10 ఎకరాల్లో 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, వీటిలో 594 బృహత్ వనాలు ఏర్పాటు కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. -
జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు.. గ్రామాలకు క్రీడా పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్’ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. క్రీడలపై అవగాహన పెంపొందించేలా సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి ప్రత్యేక జాబ్ చార్ట్‌ను కేటాయిస్తూ గురువారం మార్గదర్శకాలు (జీవోఆర్టీ నంబర్ 84, 85) విడుదల చేసింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా, ముఖ్యమైన తేదీల్లో స్థానికంగా పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. స్థానిక పాఠశాలలు, కళాశాలల్లోని పీడీ, పీఈటీలకు కో–ఆరి్డనేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పర్యవేక్షణలో ఈ స్పోర్ట్స్ క్లబ్‌లను నిర్వహించనున్నారు. పక్కా ప్రణాళికతో.. ఒక్కో క్రీడకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేసుకునేలా.. మొత్తం గ్రామంలో 25 క్రీడాంశాలకు పైబడి క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రతి స్పోర్ట్స్ క్లబ్బు అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, పాలకమండలి సభ్యులతో కార్యకలాపాలు సాగించేలా రూపకల్పన చేసింది. మూడునెలలకు ఒకసారి మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో స్పోర్ట్స్ క్లబ్బులు పోటీలు నిర్వహించేలా మార్గదర్శకాల్లో పొందుపరిచింది. శాప్ అధికారులు స్పోర్ట్స్ క్లబ్బుల రిజిస్ట్రేషన్‌ను పక్కాగా ప్రత్యేక యా ప్ ద్వారా చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నారు. గ్రామాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో కూడా స్పోర్ట్స్ క్లబ్బులు ఏర్పాటు చేస్తారు. పంచాయతీ, మండల స్పోర్ట్స్ అథారిటీల పర్యవేక్షణ.. గ్రామాల్లోని స్పోర్ట్స్ క్లబ్బులను పంచాయతీ స్పోర్ట్స్ అథారిటీ (పీఎస్ఏ), మండల స్థాయిలో మండల స్పోర్ట్స్ అథారిటీ (ఎంఎస్ఏ) పర్యవేక్షిస్తాయి. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నిధులు సమకూర్చుకుంటూ ఈ క్లబ్బులు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తాయి. సర్పంచ్ చైర్మన్‌గా ఉండే పీఎస్ఏలో పంచాయతీ సెక్రటరీ, గ్రామానికి చెందిన జిల్లాస్థాయి క్రీడాకారుడు లేదా క్రీడాభివృద్ధికి ముందుకు వచ్చే దాత, స్థానిక హైసూ్కల్ పీఈటీ సభ్యులుగా ఉంటారు. ఎంపీపీ చైర్మన్‌గా ఉండే ఎంఎస్ఏలో తహసీల్దార్, ఎంఈవో, ఎస్ఐ, మండల ఇంజనీరు, ఎంపీడీవో, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్/హెచ్ఎం, మండలం నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన పురుష, మహిళా క్రీడాకారులు (ఒక్కొక్కరు), స్వచ్ఛంద సేవకులు సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా గ్రామాలు, మండలాల్లో అవసరమైన క్రీడా వసతులు గుర్తించడంతోపాటు మరుగున పడిన స్థానిక యుద్ధ కళలను కూడా ప్రోత్సహించేలా శాప్‌తో కలిసి పని చేయనున్నారు. పిల్లలు, మహిళలకు ప్రత్యేక క్రీడా పోటీలతో పాటు సీనియర్ సిటిజన్లకు రిక్రియేషన్, వాకింగ్, జాగింగ్ పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ అథారిటీలు ప్రతి నెలా సమావేశమై స్పోర్ట్స్ కాలెండర్ అమలు తీరుపై ప్రత్యేకంగా సమీక్షించనున్నాయి. మండల, జిల్లా పరిషత్‌లు వాటి నిధుల్లో క్రీడలపై 4 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారా అంతర్ గ్రామాల క్లబ్‌ల క్రీడలను నిర్వహించవచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది విలేజ్ స్పోర్ట్స్ క్లబ్బులతో మారుమూల పల్లెల్లోని ప్రతిభగల క్రీడాకారులు త్వరగా వెలుగులోకి వస్తారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా వారిని తీర్చిదిద్దవచ్చు. గ్రామాలు, స్కూళ్లు, కళాశాలల వారీగా స్పోర్ట్స్ కబ్బులను ప్రోత్సహిస్తున్నాం. వీటిద్వారా ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది. పూర్తిస్థాయిలో క్రీడాక్లబ్బులు అందుబాటులోకి వస్తే గ్రామాల్లో నిత్యం క్రీడాపండుగ కనిపిస్తుంది. – ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి -
'పల్లె' వించిన పట్టణీకరణ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలయ్యాయి.. పట్టణాలకు ఆనుకుని ఉన్న పల్లెలు వాటిలో అంతర్భాగమయ్యాయి. గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనువుగా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు పట్టణ స్థానిక సంస్థలుగా మారడంతోపాటు తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 15 మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని.. అభివృద్ధికి వినియోగించుకోవడంతో ఆయా గ్రామాల స్థాయి పెరిగింది. జిల్లాలవారీగా కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలు ఇవే.. అనంతపురం జిల్లాలోని కోనపురం, వెంకటరెడ్డిపల్లిని కలిపి పెనుగొండ పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ని 2020 జనవరిలో ఏర్పాటు చేశారు. ఇదే నెలలో పలు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా మునిసిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ► చిత్తూరు జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంలో సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా మార్చారు. ఇదే జిల్లాలో జనాభా పరంగా పెద్దదైన బి.కొత్తకోట కూడా యూఎల్‌బీగా మారింది. ► గుంటూరు జిల్లాలోని గురజాల, జంగమహేశ్వరపురం పంచాయతీలు కలిసి గురజాల మునిసిపాలిటీగా, దాచేపల్లి, నడికుడి గ్రామాలు కలిసి దాచేపల్లి మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► కృష్ణా జిల్లాలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం కలిసి కొండపల్లి మునిసిపాలిటీగా, తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలు కలిసి వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీగా ఏర్పాటయ్యాయి. ► కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బుగ్గనపల్లి కలిపి బేతంచర్ల యూఎల్‌బీగా ఏర్పాటు చేశారు. ► ప్రకాశం జిల్లాలోని పొదిలి, కంబాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలు కలిసి పొదిలి యూఎల్‌బీగా, దర్శి గ్రామ పంచాయతీ ఒక్కటీ మరో యూఎల్‌బీగా ఏర్పాటయ్యాయి. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అల్లూరు, సింగంపేట, నార్త్ మోపూరు గ్రామాలు కలిసి అల్లూరు మునిసిపాలిటీగా, ఇదే జిల్లాలోని అవ్వేరు, కట్టుబడిపాలెం, ఇసకపాలెం, పల్లిపాలెం కలిసి బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, చింతలపూడి గ్రామ పంచాయతీలు వేర్వేరు పట్టణ స్థానిక సంస్థలుగా మారాయి. ► వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం గ్రామ పంచాయతీ సైతం యూఎల్‌బీగా మారింది. ► రాష్ట్రంలో కమలాపురం, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, బేతంచర్ల, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, కుప్పం, పెనుగొండ మునిసిపాలిటీలు 2020 జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా ఏర్పాటయ్యాయి. చింతలపూడి, అల్లూరు, పొదిలి, వైఎస్సార్ తాడిగడప, బి.కొత్తకోట మునిసిపాలిటీలను 2021లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్లో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా, 2021లో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో 23 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో సమీపంలోని గ్రామాలను విలీనం చేసి ఆయా పంచాయతీల స్థాయి పెంచింది. శ్రీకాకుళం మునిసిపాలిటీలో ఏడు పంచాయతీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పది పంచాయతీలు, భీమిలి మునిసిపాలిటీలో ఐదు పంచాయతీలు, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. అదేవిధంగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఐదు పంచాయతీల చొప్పున, తణుకు, భీమవరం మునిసిపాలిటీల్లో మూడు పంచాయతీల చొప్పున కలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలు, జగ్గయ్యపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీలు, నాయుడుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాలు, మరో పంచాయతీని కలిపారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో 21 గ్రామాలు విలీనం గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో అత్యధికంగా 21 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. బాపట్ల మునిసిపాలిటీ సమీపంలో వెలసిన కొన్ని కొత్త ప్రాంతాలు, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి దాని స్థాయిని పెంచారు. అదేవిధంగా పొన్నూరు, కందుకూరు, కావలి, గూడూరు మునిసిపాలిటీల్లోనూ పదుల సంఖ్యలో గ్రామాలను, సమీప కాలనీలను విలీనం చేశారు. కర్నూలు కార్పొరేషన్లో సైతం మూడు సమీప పంచాయతీలను కలిపారు. నంద్యాల మునిసిపాలిటీలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కొంత భాగాన్ని విలీనం చేశారు. ఇక పుంగనూరు మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాన్ని, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలను కలిపారు. -
పల్లె జనం.. పట్టణ జపం
సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి : పల్లె తల్లి వంటిది.. అందుకే గతంలో స్వగ్రామాలను విడిచి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అంతా పట్నం బాటే పడుతున్నారు. ఫలితంగా పంటపొలాలకు లోగిళ్లుగా చెప్పుకునే పల్లెలు వివిధ కారణాలతో ఇప్పుడు పట్టణాలకు చేరువయ్యాయి. బతుకుతెరువు కోసం వచ్చి పట్టణాల్లో స్థిరపడిపోయిన కుటుంబాలు భారీగా పెరుగుతున్నాయి. ఎకరాల కొద్దీ మాగాణి భూములతో అలరారిన కుటుంబాలు సైతం ఇప్పుడు పట్టణాలను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నిటికీ ఒకటే సూత్రం..బతుకుదెరువు. లేదా పిల్లల చదువులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తాజాగా సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. చదువుల కోసం నగరాలకు.. 2000 సంవత్సరానికి ముందు ఉపాధి కోసం ఎక్కువ మంది పట్టణాలకు చేరుకునే వారు. చిన్న చితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. దీంతో పట్టణ జనాభా కొద్దికొద్దిగా పెరుగుతూండేది. 2000 సంవత్సరం తర్వాత పిల్లలను చదివించుకోవాలన్న తపన తల్లిదండ్రుల్లో ఎక్కువైంది. దీంతో భూములను కౌలుకు ఇవ్వడం, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పట్టణాల్లో స్థిరపడి పిల్లలను చదివించుకుంటున్నారు. ఈక్రమంలోనే గడిచిన 20 ఏళ్లలో పట్టణాలకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా విషయానికే వస్తే అనంతపురం నగరానికి పక్కనే ఉన్న నారాయణపురం పంచాయతీ జనాభా ఒకప్పుడు 8 వేల లోపే. ప్రస్తుత లెక్కల ప్రకారం జనాభా 24 వేలు ఉందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే, హిందూపురానికి దాదాపు 5 కిలోమీటర్ల పైనే దూరముండే కొట్నూరుకూడా పట్టణంలో కలిసిపోయింది. 1991 లెక్కల ప్రకారం సదరు పంచాయతీ జనాభా 1,350 కాగా ఇప్పుడు దాదాపు 4,500 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ ఒక్క పంచాయతీనే కాదు సడ్లపల్లి, పూలకుంట పంచాయతీలు కూడా హిందూపురం పట్టణంలో దాదాపు కలిసిపోయాయి. 2008 తర్వాత నుంచి భారీగా.. గతంలో ఇంజినీరింగ్ చదవాలంటే ఏ కొద్దిమందికో అవకాశం ఉండేది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య చదివే అవకాశం వచ్చింది. దీంతో పాటు మెరిట్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దీంతో పిల్లలను చదివించుకోవడానికి తల్లిదండ్రులు పట్టణాలకు క్యూ కట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని లక్షలాదిమంది ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలా రకరకాల కారణాల వల్ల పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పట్టణాల్లో ఒకప్పుడు చదరపు కిలోమీటరకు 111 మంది ఉండగా..ఇప్పుడు 213కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 242కు చేరి ఉంటుందని అంచనా. అంటే పట్టణాలు ఎంత ఇరుకుగా మారుతున్నాయో అంచనా వేయచ్చు. పెరిగిన కాలనీలు.. ఒకప్పటి అనంతపురం నగరానికి ఇప్పటికీ భారీగా తేడా కనిపిస్తోంది. గతంలో పాతూరు, కొత్తూరు ప్రాంతాలు మాత్రమే ఉండేవి. శ్రీకంఠం సర్కిల్ వరకూ పాతూరు.. ఆ పైభాగం మొత్తం కొత్తూరుగా పిలుచుకునే వారు. ప్రస్తుతం బుక్కరాయసముద్రం పూర్తిగా నగరంలో కలిసిపోయిన పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే బళ్లారి రోడ్డుకు ఎస్టేట్‌కాలనీ, సిండికేట్‌నగర్, రాచానపల్లిపల్లి వరకూ నగరం విస్తరించింది. కళ్యాణదుర్గం రోడ్డుకు ఒకప్పడు బైపాస్ తర్వాత చివరన రాజా హోటల్ ఉండేది. అక్కడి వరకూ కూడా ఆటోలు రావాలంటే గగనంగా ఉండేది. ఇప్పుడు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల భారీ భవనాలు వెలిశాయి. కక్కకలపల్లి కాలనీ, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ, అక్కంపల్లి, ఎన్ఆర్కాలనీ, ధర్మభిక్షకాలనీ ఇలా కురుగుంట వరకూ నగరం విస్తరిచింది. ఆలమూరు రోడ్డుకు రుద్రంపేట, కట్టకిందపల్లి రూరల్ మండల పరిధిలో ఉండేవి. ప్రస్తుతం ఇవి కూడా నగరంలోకి కలిసిపోయాయి. కొత్తగా ప్రభాకర్‌చౌదరి కాలనీ, పంతులకాలనీ, చంద్రబాబు కొట్టాల, వికలాంగుల కాలనీ, అజయ్‌ఘోష్ నగర్, ఆదర్శనగర్ తదితర పేర్లతో కాలనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పట్టణం.. సౌకర్యవంతం మాది సోమందేపల్లి మండలం మండ్లి పంచాయతీ రూకలపల్లి. గ్రామం కావడంతో ఉపాధి కోసం హిందూపురం పట్టణానికి 2008లో వచ్చాము. ముద్దిరెడ్డిపల్లిలో పవర్ లూమ్స్‌లో చీరల నేస్తూ ఇక్కడే సిర్థపడ్డాను. ఉపాధి దొరకడంతో పాటు పట్టణం కావడంతో అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. – రవికుమార్ రెడ్డి, హిందూపురం పిల్లల ఉన్నత చదువుల కోసం వచ్చాం మా ఊరు పెద్దవడుగూరు మండలంలోని కిష్టిపాడు. నేను గుత్తి మండలం వన్నేదొడ్డి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నా. నాకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం చేశా. కుమారుడు అనంతపురం పీవీకేకే కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వాడికి ఇబ్బంది ఉండవద్దని ‘అనంత’కు వచ్చి స్థిరపడ్డాం. – మస్తాన్‌వలి, టీచర్, అనంతపురం ఒకప్పుడు పల్లె... నేడు పట్టణం మాది నారాయణపురం. 30 సంవత్సరాల క్రితం మాదొక పల్లెటూరు. నగరంలో నివాసముంటున్న వారి దుస్తులు తీసుకొని గాడిదలపై వేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నగరం బాగా పెరిగింది. ఈ ఊరు నగరంలో కలిసిపోయింది. రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు మీ ఊరేది అంటే అనంతపురం అని చెబుతున్నాం. – చాకలి సుబ్బరాయుడు, నారాయణపురం పంచాయతీ -
Andhra Pradesh: పల్లెకు ‘స్పెషల్’ వైద్యం
మూడేళ్ల క్రితం..ఏలూరు జిల్లా టెక్కినవారిగూడేనికి చెందిన ఉమ్మడి దుర్గారావు మూడేళ్ల క్రితం వరకూ వైద్య చికిత్స కోసం 15 కి.మీ. దూరంలోని జంగారెడ్డిగూడెం వెళ్లేవారు. అక్కడ కూడా అరకొర సేవలే అందుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. రూ.వెయ్యి నుంచి రూ.1,500 దాకా ఖర్చయ్యేది. మరి ఇప్పుడు.. దుర్గారావు కుటుంబంతోపాటు పరిసర గ్రామాల్లో ఇప్పుడు ఎవరు అనారోగ్యానికి గురైనా జంగారెడ్డిగూడెం పరిగెత్తడం లేదు. లక్కవరం పీహెచ్‌సీలోనే చికిత్స పొందుతున్నారు. నాడు– నేడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల నిధులతో స్థానికపీహెచ్సీని అభివృద్ధి చేసింది. ఇద్దరు వైద్యులతో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్, అటెండర్, వాచ్మెన్ ఇతర సిబ్బందిని నియమించారు. వీడీఆర్ఎల్, టైపాయిడ్ ఇతర పరీక్షలు చేస్తున్నారు. నాడు సాధారణ వైద్య సేవలే గగనంగా మారిన చోట నేడు ప్రతి సోమవారం చెవి, ముక్కు సమస్యలకు చికిత్స, బుధవారం నేత్ర సేవలు అందుతున్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి గురువారం ప్రత్యేక వైద్య శిబిరం, శుక్ర, శనివారాల్లో 13 – 18 ఏళ్ల వారికి వైద్య పరీక్షలు, నెలకొక సారి దంత, మెంటల్ హెల్త్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఒక్కప్పుడు ఇక్కడ రోజుకు 30 లోపు ఓపీలు ఉండగా ప్రస్తుతం 60 నుంచి 80 వరకు పెరిగాయి. గత సర్కారు హయాంలో అత్యవసర ఔషధాలూ అందుబాటులో లేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. చెంతనే స్పెషలిస్టు సేవలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన చల్లా వెంకట కోటమ్మ ఆయాసానికి చికిత్స కోసం 50 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట లేదా 80 కి.మీ దూరంలో ఉండే గుంటూరు వెళ్లాలి. చార్జీల భారంతో పాటు రోజంతా పొలం పనులు ఆగిపోయేవి. ఇప్పుడు కరాలపాడు పీహెచ్సీలో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో తమ ఇబ్బందులు తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీల్లో ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రాణం పోసి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. ప్రతి చోటా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బంది కలిపి 12 మంది ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే 909 మంది డాక్టర్లు, 1,113 మంది నర్సులు, 4233 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, వైద్య సేవల్లో మార్పులు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడయ్యాయి. టెలి మెడిసిన్ సేవల్లో రికార్డు సాధారణ వైద్య సేవలతో పాటు టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రజలకు పీహెచ్‌సీలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచే స్పెషాలిటీ సేవలు అందించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది. ఇప్పటివరకూ ఏకంగా 1.40 కోట్ల కన్సల్టేషన్లు నమోదయ్యాయి. రోగులతో వాయిస్, వీడియో కాల్స్‌లో మాట్లాడి డాక్టర్లు వైద్య సేవలు అందించారు. దేశంలో తొలిసారిగా ‘స్పెషల్’.. దేశంలోనే తొలిసారిగా తొమ్మిది స్పెషాలిటీల్లో ఓపీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌సీల్లో అందుబాటులోకి తెచ్చింది. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జన్, డెంటల్ సర్జన్, పల్మనరీ మెడిసిన్ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసింది. ఇందుకోసం ఒక్కో స్పెషాలిటీలో 142 మందిని నియమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,276 మంది స్పెషలిస్టుల అవసరం ఉండగా ఇప్పటికే 979 మందిని నియమించారు. వైద్య పరీక్షల్లో 57 శాతం పెరుగుదల నాడు–నేడులో భాగంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ల్యాబ్‌లను బలోపేతం చేసి 35 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2017–18తో పోలిస్తే 2021–22లో వైద్య పరీక్షలు 57.85 శాతం పెరిగాయి. గతంలో 60,60,854 పరీక్షలు మాత్రమే చేయగా ఇప్పుడు 1,04,76,190 పరీక్షలు నిర్వహించారు. మంచి స్పందన.. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరిగింది. ప్రసవాలు కూడా చేస్తున్నాం. స్పెషాలిటీ క్లినిక్‌లకు మంచి స్పందన లభిస్తోంది. – అల్లాడి అశోక్‌కుమార్, లక్కవరం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పట్టించుకోరనుకున్నాం... ప్రభుత్వ ఆసుపత్రి అంటే సరిగా పట్టించుకోరని భావించాం. అక్కడకు వెళ్లాక ఆ భావన తొలగిపోయింది. వైద్యులు, సిబ్బంది పనితీరు బాగుంది. – దేవి, టెన్నేరు గ్రామం, కృష్ణా జిల్లా ప్రైవేట్ కంటే మెరుగ్గా.. ప్రైవేట్ ఆస్పత్రులకన్నా ప్రభుత్వ ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంది. సేవలు పెరిగాయి. స్థానికంగా లభించని వైద్యానికే ఇప్పుడు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం. – పసుపులేటి చిన్నారి, లక్కవరం, జంగారెడ్డిగూడెం మండలం కీళ్ల నొప్పులకు ట్రీట్మెంట్.. కీళ్లు, మోకాళ్లు, కండరాలు, మెడ నొప్పి బాధితులకు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మెరుగైన వైద్యం అందుతోందని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – టి. సంజీవ్, తిప్పాయపాలెం పీహెచ్సీ వైద్యుడు (ఎమ్మెస్ ఆర్థో స్పెషలిస్ట్) ప్రకాశం జిల్లా -
‘భగీరథ’ ప్రయత్నం ఫలించిందా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ద్వారా 2019 తర్వాత ఎండాకాలంలోనూ పల్లెల్లో తాగునీటి సమస్యలు లేకుండా చేశామని అధికారులు చెబుతు న్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య మిషన్ భగీరథతో తీరిందని చెబు తున్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలతో పాటు తాగునీటి నాణ్యత సరిగా లేని ఇతర ఆవాసాలన్నింటికీ శుద్ధిచేసిన తాగునీటిని తెలంగాణ అందిస్తోందని 2020 సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రకటించింది. అయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, పరిశీలకులు మాత్రం ఈ పథకం అమల్లోకి వచ్చినా పూర్తిస్థాయి నీటి సరఫరా జరగడం లేదని, ఇంకా గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందు లపై ‘సాక్షి’ దృష్టి సారించింది. ఏమిటీ మిషన్ భగీరథ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని (ఔటర్ రింగ్ రోడ్ ఆవల) ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షి తమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లా ద్వారా సర ఫరా చేసే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు. కృష్ణా, గోదావరి నదులు, ప్రధాన రిజర్వాయర్లు మొదలైన ఉపరితల జల వనరుల నుండి శుద్ధిచేసిన తాగునీటిని అందించాల్సి ఉంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో అయితే 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల తాగునీరు సరఫరా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు 2015 చివర్లో మొదలుపెట్టిన ఈ పథకాన్ని 2019 కల్లా పూర్తి చేయగలిగామని అధికారులు వెల్లడించారు. ప్రజలు, పరిశీలకులేమంటున్నారు.. ► పైప్లైన్లకు మరమ్మతులు సకాలంలో జరగడం లేదు. లీకేజీల సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు సందర్భాల్లో ప్రజలకు కొన్నిరోజుల పాటు భగీరథ నీళ్లందడం లేదు. ► చాలా గ్రామాల్లో ఇళ్లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. ► నేటికీ గ్రామాల్లో 2–3 ఆర్వో ప్లాంట్లు ఉంటున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా జరిగే నీటి అమ్మకాలు కూడా ఎక్కువే. ► మిషన్ భగీరథను ప్రారంభించిన గజ్వేల్‌లోనే యాభైకి పైగా ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాంటులో రోజూ సగటున 500 లీటర్లు అమ్ముతున్నారు. 24 గంటల్లోనే సమస్య పరిష్కారం ప్రతి గ్రామానికీ భగీరథ పైప్‌లైన్ చేరుకుంది. దాదాపుగా వందశాతం గ్రామాల్లోని ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా అవుతోంది. నీటి సరఫరాలో లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలు తలెత్తితే 24 గంటల వ్యవధిలోనే సరిచేస్తున్నాం. లేనిపక్షంలో ఎప్పటిలోగా పరిష్కరిస్తామో చెబుతున్నాము. ఎండాకాలంలో కూడా నీటికొరత ఏర్పడకుండా చూస్తున్నాం. గతంలో షాద్‌నగర్‌లో భూగర్భ జలాలు శూన్యం. నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు కరువు పీడిత ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందజేస్తున్నాం. శుద్ధిచేసిన నీటి కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, ఇతర వ్యాధులు తగ్గిపోయాయి. – కృపాకర్‌రెడ్డి, ఈఎన్సీ, మిషన్ భగీరథ ఫిల్టర్ నీళ్ళు కొంటున్నాం.. నల్లా నీళ్ళు రావడం లేదు. నెల రోజుల క్రితం నల్లా బిగించారు. ఒకరోజు కొన్ని నీళ్ళు వచ్చినయి. గతంలో కృష్ణా జలాల ట్యాంకుల వద్ద నీళ్ళు తెచ్చుకొనే వాళ్ళం. ప్రస్తుతం ఈ ట్యాంకుల్లో నీళ్ళు ఉండటం లేదు. గ్రామా పంచాయతీ కనెక్షన్ ద్వారా నీళ్ళు మంచిగానే వస్తున్నాయి. తాగునీటి కోసం ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుంటున్నం. – దోటి పద్మ,వావిళ్ళపల్లి గ్రామం నీటి సమస్య తీరింది.. మా గ్రామంలో రెండేళ్ల కిందటి వరకు తాగునీటికి ఇబ్బందులు పడ్డాం. కి.మీల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ ట్యాంకు వద్దకు పోయి నీటిని తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ నీరు వస్తుండటంతో తాగునీటి సమస్య తీరింది. రోజూ ఉదయం గంటన్నర సేపు నీళ్లొస్తున్నాయి. – చెన్నమ్మ, మంచాలకట్ట,పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
విశాఖ జిల్లాలో మరికొన్ని కొత్త గ్రామాలు
-
Andhra Pradesh: తాగినంత నీరు..
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మంచినీటి సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని ప్రాంతాలకు సంతృప్త స్థాయిలో రక్షిత మంచినీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో గ్రామంలో ప్రతి ఒక్కరికి రోజుకు కనీసం 55 లీటర్ల చొప్పున ఇంటి వద్దే కొళాయి ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. వచ్చే రెండేళ్లలో 2024 మార్చి నెలాఖరు వరకు గ్రామాల్లో రక్షిత మంచినీటి వసతుల కోసం రూ.17,989.32 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్ డబ్ల్యూఎస్) తయారు చేసిన నివేదికను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఇప్పటికే గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలున్నా నీటి సదుపాయం లేక వృథాగా ఉన్న చోట్ల శ్వాశత నీటి వసతి కల్పనకు రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లు, నదుల నుంచి ఏడాది పొడవునా కాల్వల ద్వారా రక్షిత మంచినీటి పథకాలకు నీళ్లు అందజేసే అవకాశం ఉన్న చోట అందుకనుగుణంగా చర్యలు చేపడతారు. అలా వీలుకాని చోట్ల మంచినీటి పథకాలకు అనుబంధంగా కొత్తగా బోర్లు తవ్వి క్లోరినేషన్ చేసి రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారు. మొత్తం 56,448 పనులకు సంబంధించి ప్రణాళిక రూపొందించారు. 2,935 పంచాయతీల్లో 100 % రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా ఆర్డబ్ల్యూఎస్ విభాగం వీటిని 48,488 నివాసిత ప్రాంతాలుగా వర్గీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.16 లక్షల ఇళ్లు ఉండగా 49.46 లక్షల ఇళ్లకు (51.97 శాతం) ప్రభుత్వం ఇప్పటికే ఇంటింటికీ కొళాయి సదుపాయాన్ని కల్పించింది. గత రెండేళ్లలో కొత్తగా 18.72 లక్షల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. 2,935 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇళ్లకు ఇప్పుడు కొళాయిల ద్వారానే ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది. జల్ జీవన్‌తో.. జల్ జీవన్ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో రూ.3,090 కోట్ల వ్యయంతో 12,529 నివాసిత ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు కొత్తగా కుళాయిల ఏర్పాటుతో పాటు రోజూ నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు ఇళ్లు లేని పేదల కోసం ప్రభుత్వం జగనన్న హౌసింగ్ కాలనీలను ప్రత్యేకంగా నిర్మించి అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న హౌసింగ్ కాలనీల్లో కొత్తగా ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు రక్షిత మంచినీటి పథకాల కోసం రెండేళ్లలో రూ.3,250 కోట్లు వ్యయం చేయనున్నారు. తీవ్ర సమస్యలున్న చోట్ల తొలుత.. వచ్చే 35 ఏళ్లలో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంత మంచినీటి అవసరాలతో పాటు పారిశ్రామిక వినియోగాన్ని కూడా కలిపి రూ.50 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తీవ్ర తాగునీటి సమస్యలున్న చోట్ల పనులను తొలుత ప్రాధాన్యతగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీరంలో ఉప్పునీటి కష్టాలు తీరేలా... ఉభయ గోదావరి జిల్లాల్లో సముద్ర తీరం వెంట ఉప్పనీటి కారణంగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాల్లో రూ.3,050 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులను రెండేళ్లలో చేపట్టనున్నారు. రూ.1,650 కోట్లు తూర్పు గోదావరిలో, రూ.1,400 కోట్లు పశ్చిమ గోదావరిలో ఖర్చు చేస్తారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో శ్వాశత రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తారు. చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,550 కోట్లతో పనులు చేపడతారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మంచినీటి కష్టాల పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా రూ.1,200 కోట్లతో శాశ్వత రక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మంచినీటి సౌకర్యాల కల్పనకు రూ.750 కోట్లు కేటాయించారు. ఉద్దానం, పులివెందుల, డోన్‌లో ఇప్పటికే.. రూ.700 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో, రూ.460 కోట్లతో వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో, రూ.224.32 కోట్లతో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. నీటి పరీక్షలు, నిర్వహణకు రూ.425 కోట్లు రక్షిత మంచినీటి పథకాల ద్వారా రాష్ట్రమంతటా బోరు బావి నీటి నాణ్యత పరీక్ష, నిర్వహణ ఖర్చులకు రూ.425 కోట్లు కేటాయించారు. 20 ఏళ్లుగా... వృథాగా గుంటూరు జిల్లా రొంపిచర్లలో రెండు దశాబ్దాల క్రితం రూ.1.20 కోట్లతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్ అన్నీ ఉన్నా నీటి వసతే లేక నిరుపయోగంగా మిగిలిపోయింది. గ్రామంలోని బోర్లు, బావుల్లో తగినంత నీరు లేకపోవడం, ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడడంతో తాగునీటి పథకం మూలన పడింది. -
గ్రామాల్లో టాయిలెట్ వేస్ట్ శుద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: సెప్టిక్ ట్యాంకులు నిండి ఇబ్బందిపడుతున్న గ్రామాల్లో.. టాయిలెట్ వేస్ట్ శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. సెప్టిక్ ట్యాంకుల నుంచి శుద్ధి కేంద్రాలకు టాయిలెట్ వేస్ట్‌ను తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. సబ్సిడీ కమ్ లోన్ విధానంలో నిరుద్యోగ యువతకు ఈ వాహనాలను అందజేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే రోజూ 5,940 కిలోలీటర్ల టాయిలెట్ వేస్ట్.. సెప్టిక్ ట్యాంకులకు చేరుతుంది. కానీ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో కేవలం రోజుకు 1,145 కిలోలీటర్ల టాయిలెట్ వేస్ట్‌ను శుద్ధి చేసే కేంద్రాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో టాయిలెట్ వేస్ట్‌ను శుద్ధి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్‌కి ఒకటి చొప్పున గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన టాయిలెట్ వేస్ట్‌ను.. సేంద్రియ ఎరువుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. తొలిదశలో 23 గ్రామాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 46 గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 23 గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కొక్క చోట కనీసం అర ఎకరా స్థలంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క శుద్ధి కేంద్రం నిర్మాణం కోసం గరిష్టంగా రూ.1.80 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మిగిలిన గ్రామాల్లో రెండో దశలో చేపడతారు. -
Up Assembly Election 2022: ఆ 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు
ఏ దేశానికేగినా, ఎందుకాలిడినా.. మొదట అడిగేది నీవెక్కడి వాడివోయ్ అనే! అలా చెప్పుకోవడానికి అస్తిత్వమే లేకపోతే.. మనకంటూ ఓ ఊరు, ఓ ఉనికే లేకపోతే... ఎంతో దుర్భరంగా ఉంటుంది కదా! తమ పూర్వీకుల తాలుకూ ఇళ్లు,, జ్ఞాపకాలు నదీగర్భంలో కలిసిపోతే... రచ్చబండ, చేదబావి, ఊరిచెరువు... ఈతపళ్లు... ఈ జ్ఞాపకాలన్ని కనుమరుగైపోతే... మెరుగైన జీవనానికంటూ పట్టణాలకు పరుగులు పెడుతున్న నేటి కుర్రకారుకు వాటి విలువ తెలియకపోవచ్చు.. కానీ మట్టిలో ఆడి.. ఎండిన చెరువుల మడుల్లో పాపెర్లు పట్టిన చిట్టి చేతులకు తెలుసు అవెంతటి విలువైన జ్ఞాపకాలో... నా పల్లెకేమైందని... గొంతుకేదో అడ్డం పడుతోంది.. మాట పెగలట్లేదు! మార్పు ఓ నిరంతర ప్రక్రియ. కొత్తనీరు వచ్చి నపుడు పాతనీరు కొట్టుకుపోతుంది. అభివృద్ధి జరగాల్సిందే కానీ... ఉన్న గతాన్నంతా ఊడ్చేసి మాత్రం కాదు. పుట్టిన ఊరితో, పెరిగిన వీధితో, చెడ్డీ దోస్తులతో పెనవేసుకున్న బంధాలు మాత్రం ఎన్నేళ్లయినా... ఎంత ఎత్తుకు ఎదిగినా... గుండెను తడుముతూనే ఉంటాయి. ఒక్కసారైనా ఊరెళ్లి మనోళ్లందరినీ కలిసి రావాలని మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర్ జిల్లా దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలుగా మారాయి. దీంతో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్న ఈ 11 గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించట్లేదు. సోన్‌భద్ర్‌లో నిర్మిస్తున్న కన్హర్ డ్యామ్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ అయిన దుద్ధి నియోజకవర్గంలో అప్నాదళ్ (సోనేలాల్)కు చెందిన హర్ ఇరాం బీఎస్పీ అభ్యర్థిపై 1,085 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా 8,522 మంది ప్రజలు నోటాకే మొగ్గు చూపారంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు రూ.2,700 కోట్లతో నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న కన్హర్ డ్యామ్‌ను వచ్చే ఏడాది కల్లా సిద్ధం చేసేందుకు కొన్నేళ్లుగా చర్యలు వేగవంతం అయ్యాయి. సోన్‌భద్ర్ జిల్లాలోని అమ్వార్ గ్రామంలో పాగన్ నది, కన్హర్ నది సంగమం వద్ద జరుగుతున్న డ్యామ్ నిర్మాణంతో సిందూరి, భీసూర్, కోర్చి గ్రామాలతో పాటు కలిపి మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో పరిహారం, పునరావాసం విషయంలో తాము చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరూ సహకరించట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చదవండి: (మీసం మెలేసేది రైతన్నే!) కన్హర్ డ్యామ్ కోసం 1976 నుంచి 1982 వరకు ప్రజల నుంచి భూమిని తీసుకుని ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. అయితే 1984లో ఆనకట్ట పనులు ఆగిపోవడంతో ప్రజలు ఎవరూ గ్రామాలు ఖాళీ చేయలేదు. కాగా ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కన్హర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 65% భూసేకరణ పూర్తయిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2023 వర్షాకాలానికి ముందే ఈ మెయిన్ డ్యాంలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాంతో ఈసారి ఈ 11 గ్రామాలకు చెందిన ప్రజలు బరువెక్కిన గుండెతో కన్నీటి బొట్టునే చూపుడు వేలిపై సిరా చుక్కగా మలచుకొని... తమదిగా చెప్పుకోగలిగే ప్రాంతంలో ఆఖరిసారిగా ఓటేసి... తట్టాబుట్టా సర్దుకొని తలోవైపు వెళ్లిపోనున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
సంక్రాంతి సంబరం.. ఆయ్.. మా ఊరొచ్చేశామండీ..
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): పండగంటే పదిమందీ కలవడమే.. అయినవాళ్లతో ఆనందం కలబోసుకోవడమే.. ఉపాధికో ఉద్యోగ రీత్యానో చెల్లాచెదురై ఏడాదికోసారైనా కన్న ఊరికి చేరుకోవడమే.. ఆత్మీయ పలకరింపుల మధ్య అన్నీ మరచిపోవడమే.. అనుబంధాలన్నీ పెనవేసుకోవడమే.. చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడమే.. తీపి అనుభూతులను మూటగట్టుకోవడమే.. ఔను అదే పండగ.. కాదు.. అనురాగ నిలయమైన మన గోదావరి జిల్లాలో ఇది పెద్ద పండగే.. అందుకే ఏటా సంక్రాంతి కోసం అన్ని ఎదురు చూపులు.. అంత సంతోషం.. ఆ రోజే రానే వచ్చింది. ప్రతి లోగిలీ మమతల కోవెల.. జిల్లాకు చెందిన వేలాది కుటుంబాలు ఉద్యోగ, ఇతర వృత్తుల రీత్యా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడ్డాయి. వారందరూ భోగి నాటికే (శుక్రవారం) సొంతూళ్లకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయారు. లోగిళ్లన్నీ పలకరింపులతో పులకరించిపోతున్నాయి. అయినవారి ఆనంద కాంతులతో మెరిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కళ తప్పిన పల్లెలు కళకళలాడుతున్నాయి. తండ్రి, తల్లి, కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లతో ప్రతి ఇల్లూ ఓ మమతల కోవెలను తలపిస్తోంది. కోడి పందేలు, ప్రభల తీర్థాలు, సహపంక్తి భోజనాలు, గ్రామీణ క్రీడలు, పచ్చని కొబ్బరి తడికలతో జోడెడ్ల గూడు బండ్ల వంటి అరుదైన అనుభూతులను వారు చవి చూస్తున్నారు. తాము హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ సంక్రాంతికి అమలాపురం వచ్చి పండగ మూడు రోజులూ ఆనంద సాగరంలో మునిగిపోతామని కోనసీమకు చెందిన మెట్రో కెమ్ కంపెనీల అధినేత నందెపు బాలాజీ అన్నారు. గంగలకుర్రులో ఉమ్మడి కుటుంబంలా సహపంక్తి భోజనాలు చేస్తున్న బంధువులు ఆయ్ తినండి మరీ.. మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేయడం జిల్లా వాసుల సహజ లక్షణం. సరికొత్త రుచులతో కొసరి కొసరి వడ్డించేస్తారు. పూత చుట్టలు, కజ్జికాయలు, పోక ఉండలు, జంతికలు, మినపసున్నుండలే కాదు.. గోదావరి పాయల్లో దొరికే చందువ, పండుగప్ప వంటి చేపలే కాకుండా కోడి పందేల్లో వీర మరణం పొందిన పుంజు కోస మాంసం కూరలు వడ్డించి తినమంటూ సుతిమెత్తని ఒత్తిడి పెట్టేస్తారు. కోనసీమ సంప్రదాయాలు సూపర్ నాది తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట. ఉద్యోగ రీత్యా కుటుంబ సమేతంగా కొన్నేళ్లుగా మలావి దేశంలో స్థిరపడ్డాను. అక్కడ నాతో కలిసి పని చేసే అంబాజీపేటకు చెందిన పరసా బాలాజీతో కలిసి కోనసీమ వచ్చాను. మా కోనసీమ రుచులు, సంక్రాంతి సంబరాలు స్వయంగా చూడాలని చెప్పి నా స్నేహితుడు బాలాజీ ఈ సీమకు తీసుకు వచ్చాడు. ఇక్కడి సంక్రాంతి సంబరాలు, పిండి వంటలు అన్ని అద్భుతంగా, అమోఘంగా ఉన్నాయి. ఈ మధురానుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. – నేగూరి నవీన్, అంబాజీపేట పుణె నుంచి పుట్టింటికి.. సంక్రాంతి పండగలెప్పుడొస్తాయా అని పుణెలో ఎదురు చూస్తూంటాను. పండగ రాగానే రెండు రోజుల ముందే పుట్టిల్లయిన అంబాజీపేట మండలం గంగలకుర్రు వచ్చే స్తాం. ఇక్కడికి దగ్గర్లో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం చూడడం కోసమైనా పుణె నుంచి వస్తాం. ఉద్యోగ రీత్యా మేము అక్కడ ఉంటున్నా సంక్రాంతికి రెక్కలు కట్టుకు వచ్చి మరీ వాలిపోతాం. – పమ్మి అరుణ, గృహిణి, గంగలకుర్రు ఉమ్మడి కుటుంబ వారసత్వం అంబాజీపేట మండలం గంగలకుర్రు, ఇందుపల్లి గ్రామాల బ్రాహ్మణుల వీధిలోని 300 కుటుంబాలకు చెందిన ఇళ్లన్నీ పండగ సందర్భంగా ఓ స్వర్గసీమగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాల ఉనికిని చాటుతున్నాయి. పండగ మూడు రోజులూ ఈ కుటుంబాలన్నీ ఒకచోట సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గంగలకుర్రుకు చెందిన ఆకెళ్ల పద్మామహాలక్ష్మి కుటుంబం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా సంక్రాంతికి కుటుంబ సమేతంగా పుట్టింటికి వచ్చారు. ఇదే గ్రామానికి చెందిన పుల్లెల సతీష్ కుటుంబం అమెరికాలో ఉంటున్నా సంక్రాంతికి ఆ ఊరి వేడుకలకు హాజరు కావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. -
సంక్రాంతి పండుగకు గ్రామాల్లో హరిదాసుల సందడి
-
'పల్లె నాడి పట్టే మెడికో'.. ఎన్ఎంసీ వినూత్న ఆలోచన
వారు వైద్య విద్యార్థులు.. రెండు వారాలకోసారి మీ ఊరిలో నేరుగా మీ ఇంటికి వస్తారు. మీతో, మీ ఇంట్లో వారితో మాట్లాడుతారు. అందరి ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఏదైనా సమస్య ఉంటే తగిన సూచనలు చేస్తారు. మీ ఆరోగ్య సమస్యకు కారణాలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తారు. మంచి అలవాట్లు, పరిశుభ్రత కోసం ఏం చేయాలో చెప్తారు. అదే సమయంలో వైద్యం, ఆరోగ్యంపై తామూ కొంత నేర్చుకుంటారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సిఫార్సులు అమల్లోకి వస్తే.. ఇది అమల్లోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కోర్సులో గ్రామాలు/ప్రజల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సిఫా ర్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావ డం, అదే సమయంలో వైద్య విద్యార్థుల్లో వివిధ వ్యాధులు, క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. సమాజంలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్ఎంసీకి చెందిన యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈడీ) ఒక నివేదికను రూపొందించింది. అందులో కీలక సిఫార్సులు చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉండనుంది. క్షేత్రస్థాయికి వెళ్లేలా.. ఎన్ఎంసీ సిఫార్సుల ప్రకారం.. ఒక్కో బ్యాచ్ ఎంబీ బీఎస్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవా లి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. వారు ఆ కుటుంబా ల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను గుర్తించి, ఏవైనా సమస్యలు వస్తే ప్రాథమిక సలహా ఇవ్వాలి. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వారికి స్థానిక ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్సు తొలి ఏడాదిలో కనీసం 10 సార్లయినా గ్రామాలను సందర్శించాలి. వారు గ్రామా ల్లో గడిపే సమయాన్ని కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందేలా పాఠ్యాంశాలు, సిలబస్‌ను రూపొందిస్తారు. ఇక ఈ దత్తత కార్యక్రమంతో విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళతారు. ఎంబీబీఎస్ తొలి ఏడాది కోర్సు నుంచే ప్రజలతో మమేకమవుతారు. గ్రామాల ఆరోగ్యానికి.. గ్రామాలను దత్తత తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో స్వయంగా ప్రజల ఆరో గ్య సమస్యలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇదివారిలో సామాజిక బాధ్యత, అవగాహన పెరగడానికి తోడ్పడనుంది. సరైన ఆహార అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, అనారోగ్యం బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే వీలు కలుగుతుంది. ఒక్కో విద్యార్థికి ఏడు కుటుంబాల వరకు బాధ్యత ఇవ్వడం వల్ల.. ఆయా కుటుంబాల్లోని వారిలో ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే తాము చదివే మెడికల్ కాలేజీకి రమ్మనడానికి, ఏదైనా ఆస్పత్రికి రిఫర్ చేయడానికి వీలుంటుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఆయా గ్రామాలు ఆరోగ్యంగా మారుతాయని చెప్తున్నారు. 33 కాలేజీలు.. 20 వేల మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 165 బ్యాచ్‌ల్లో కలిపి దాదాపు 20 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. వీరితోపాటు ఆయుష్, డెంటల్ విద్యార్థులకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మరో ఐదారు వేల మంది అవుతారు. ఇంతమందికి గ్రామాల దత్తత బాధ్యత ఇస్తే ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందుతాయని.. విడతల వారీగా కొత్త గ్రామాల్లోనూ వైద్య చైతన్యం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. పల్లెల్లో ఏం చేయాలంటే? ►తమకు కేటాయించిన ఐదు నుంచి ఏడు కుటుంబాల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలి. ►కుటుంబాల్లోని వారు ఎటువంటి జబ్బులతో బాధపడుతున్నారో గుర్తించి నోట్ చేసుకోవాలి. ► ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారుంటే.. అవసరమైన వైద్య సలహాలు ఇవ్వాలి. ► ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. ► రోజువారీ ఆహారపు అలవాట్లు, వ్యసనాలు వంటివి గుర్తించాలి. ► రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేయాలి. ► సమీపంలోని ప్రభుత్వ డయాగ్నొస్టిక్ సెంటర్లలో వారికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు చేయించాలి. ► కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ టెస్టులు చేయించాలి. ఈ మేరకు వారిని ప్రోత్సహించాలి. ► పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు ఇతర చెకప్‌లు చేయించుకోవాల్సిందిగా సూచించాలి. ► అవసరమైనప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటూ.. వైద్య సలహాలు ఇవ్వాలి. -
పండగ పూట... ఊరు పిలుస్తోంది
నను గన్న నా ఊరుకు వందనం. నా మాటలు విని నాకు మాటలు చెప్పిన రావిచెట్టు అరుగుకు వందనం. సైకిల్ టైరును కర్రపుల్లతో పరుగులెత్తించే వేళ నన్ను విమానం పైలెట్‌లా ఫీలయ్యేలా చేసిన ఊరి వీధులకు వందనం. కరెంటు స్తంబం దగ్గర రేగుపళ్లను అమ్మిన అవ్వకు వందనం. దొంగ కొంగలను అదిలించక చేపలకు భద్రం చెప్పిన చెరువుకు వందనం. అక్కా.. పిన్ని... బాబాయ్ పలకరింపులకు వందనం. తప్పు చేస్తే ఉమ్మడిగా కలిసి ప్రేమగా విధించిన దండనకు వందనం. పండగొచ్చింది. ఊరెళ్లాలి. కోవిడ్ సమయం ఇది. జాగ్రత్తగా వెళ్లాలి. సురక్షితంగా తిరిగి రావాలి. పొలిమేరల్లో అడుగుపెడుతూనే జిల్లున తండ్రి పేరు వినపడుతుంది. ‘ఏయ్యా... నువ్వు వెంకన్న కొడుకువే కదా’... ‘ఏమ్మా... రామారావు మేష్టారి చివరమ్మాయివేగా’... ఊరికి అందరూ తెలుసు. ఊరు తన మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. తల్లిదండ్రులతో పాటుగా పిల్లల్ని. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులని. బ్యాగ్ పట్టుకుని నడుస్తూనే అవే వీధులు. అవే ఇంటి పైకప్పులు. అవే డాబాలు. అవే చిల్లర అంగళ్లు. కొన్ని ఏవో మారిపోయి ఉంటాయి. పాత దగ్గర కొత్తవి వచ్చి ఉంటాయి. మేకప్ కొద్దిగా తేడా. ముఖం అదే. చిర్నవ్వు అదే. కళ్లాపి చల్లిన ముంగిళ్లు ఎదురు పడతాయి. వాటి మీద వేసిన ముగ్గులు తమ రంగులను లెక్కపెట్టమంటాయి. ఒక తల్లి ఎవరో ముసుగు తన్ని నిద్ర పోతున్న పిల్లలను లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక ఇంటి మీద పాకిన గుమ్మడిపాదు తన కాయలను నీకివ్వను పో అంటూ ఉంటుంది. ఈ మనుషుల మధ్యే కదా బాల్యం గడిచింది అని గుండెలకు కొత్త గాలి ఏదో తాకుతుంది. పొద్దున్నే పాల కోసం గిన్నె పట్టుకుని వచ్చింది ఈ వీధుల్లోకే. అదిగో సుబ్బయ్య టీ అంగడి. మళ్లీ ఇస్తాలే అని తాగి మర్చిపోయిన ఒకటి రెండు టీల బాకీ గుర్తుకొస్తోంది. పుల్లట్లు వేసే కాంతమ్మ ఇంటికి కొంత దూరం నడవాలిలే. ఆ చట్నీ అంత రుచిగా ఎలా ఉంటుందో కెఎఫ్సి వాడికి తెలిసుంటే ఫార్ములా కొనుక్కొని వెళ్లేవాడు. పెద్ద శెట్టి అంగడి ఇంకా తెరవలేదు. పండక్కి అమ్మ చీటి రాసిస్తే ఈ అంగడిలోనేగా చక్కెర, బెల్లం, యాలకులు, సగ్గుబియ్యం, ఎండు కొబ్బరి కొనుక్కుని వెళ్లేది. బెల్లం పొట్లం కట్టాక చేయి సాచితే కొసరు అందేది. బుగ్గ పండేది. అబ్బ. కచ్చేరి అరుగు. ఉదయం అక్కడే పేపర్ చదవాలి. మధ్యాహ్నం అక్కడే గోలీలాడాలి. సాయంత్రం అక్కడే ట్రాన్సిస్టర్‌లో పాటలు వినాలి. పులిజూదం ఆటలో ఒలింపిక్స్ మొనగాళ్లు మామూలు లుంగీల్లో అక్కడే తిరుగాడుతుండేవారు. ఊరి వార్తలు చెవిలో పడేసే మహా మహా జర్నలిస్టులు రాత్రి కూడు తినేసి పై కండువా సర్దుకుంటూ వచ్చేసేవారు. అందరికీ నీడనిచ్చే అరుగు చెట్టు వేల కొద్ది గువ్వలకు పురుళ్లు పోసి పోసి పండిపోయి ఉండేది. అది ఆకులు రాల్చి మోడుగా నిలిచే రోజుల్లో ఊరు చిన్నబుచ్చుకుని ఉండేది. నాన్న సైకిల్ ఈ దారుల్లోనే తిరిగేది. అమ్మ చేయి పట్టుకొని తొలాటకు ఇటుగానే వెళ్లేది. ఐసు బండి వస్తే ఏ రంగుది కొనుక్కోవాలో తెలియక రెండు మూడు నిమిషాలు నెత్తి గీరుకునేది. గెలిచిన గోలీలు దొంగలించిన శీనుగాడి మీద నాలుగైదు వారాలు పగబట్టేది. ఊళ్లోని మేనత్త మేమమామలు అసలు చుట్టాలుగా అనిపించకపోయేది. రైలు దిగి వచ్చే బాబాయి పిన్నే తమను కూడా వెంటబెట్టుకుని వెళతారని సంబరం కలిగిచ్చేది. పండగ సెలవుల్లో స్కూలు మైదానంలో గాలిపటాలు ఎగిరేవి. తోకలు లేని పిట్టలు తోకలు ఉన్న పటాల దారాలు లాగేవి. బిళ్లంగోడు దెబ్బకు బిళ్ల గిర్రున గాలిలో లేచేది. హరిదాసు చిడతలకు వాకిట్లో ఇల్లు గుమిగూడేది. బుడబుడల డమరుకానికి పాత బట్టలనీ వెలికి వచ్చేది. గంగిరెద్దుల సన్నాయికి ఒక్కటే పాట వచ్చు. కొమ్మదాసులు చెట్టెక్కి దిగకపోయేది. పిట్టలదొరల కోతలకు పంట చేలు కూడా అచ్చెరువొందేవి. కోలాటానికి మోత ఫెళ్లుఫెళ్లున మోగేది. పులేషగాళ్లు నిమ్మకాయను పళ్లతో కొరికి భయపెట్టేవాళ్లు. తప్పెట్లు తాటాకు మంటల చివరలకు బెదరక సెగ పొందేవి. ఊరి దేవత ఊరేగింపు సంబరంగా జరిగేది. పిండి వంటలు లేని ఇల్లు ఎక్కడ? కనిపెట్టిన వారికి బహుమానమండోయ్. ఈ ఇంటి మనుబూలు.. ఆ ఇంటి అరిసెలు... పొరుగింటి లడ్లు... ఇరుగింటి పాయసం. పెద్దవాళ్లు అడక్క పోయినా పిల్లలకు సినిమాకు చిల్లర ఇచ్చేవారు. కొత్త సినిమాల పోస్టర్లు టైమ్ మొత్తం తినేసేవి. ఊరు వదిలి ఉపాధి కోసం వచ్చేశాము. ఊరు గుండెల్లోనే ఉంది. పండగ వచ్చిందంటే అది జాబు రాయకనే పిలుస్తుంది. ఊరిని చూడాలి. మళ్లీ బతకాలి. నేస్తుల్ని కలవాలి. ఊసులను రాసి పోయాలి. ఊరికి బయలుదేరుతున్నా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. దూరం పాటిస్తా. పిల్లలను గుంపులో వెళ్లకుండా చూసుకుంటా. ఈ పండగను వదలుకోలేను. ఊరికి వెళతాను. కాని ఊరిని నా నుంచి నన్ను ఊరి నుంచి సురక్షితంగా ఉంచేలా వెళతాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి. -
Sankranti: ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త.. ఈ విషయం మరిచారో అంతే..!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు వెళ్లే ఆయా కాలనీ, అపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో సంక్రాంతి సెలవుల్లో జరిగిన దొంగతనాలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇళ్లల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో గానీ, లాకర్లు లేని వారు వాటిని తమ బంధువుల ఇళ్ళలో భద్రపరుచుకోవాలి. అదే విధంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ ఊరికి ప్రయాణం కట్టిన పరిస్థితుల్లో తెలిసిన వారిని తమ ఇళ్లల్లో రాత్రివేళ పడుకునేలా చర్యలు తీసుకోవాలి. చదవండి: నుమాయిష్‌కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’ ఊరికి వెళుతున్న విషయాన్ని ప్రచారం చేసుకోకుండా ఉండటం మంచిది. కొందరు తమ వెంట బ్యాగుల్లో బంగారు ఆభరణాలతో బస్సుల్లో ప్రయాణం తలపెడతారు అటువంటి సమయంలో బస్సుల్లో కూడా దొంగతనాలు జరిగే అవకాశం సంఘటనలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరికి వెళ్లే ముందు కిటికీలు, తలుపుల బోల్ట్‌లు, తాళాలు సరిగా వేసింది లేనిది మహిళలు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుంటే మంచిది. ఆర్ధిక స్థోమత ఉన్న వారు అలారం ఏర్పాటు చేసుకోవటంతో పాటు సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకుంటే మంచిది. సీసీ కెమెరాలు ఉన్నవారు ఆన్‌చేసి వెళ్లాలి. ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు ఈ పండుగ సెలవులు ముగిసే వరకు కొందరు యువకులతో రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చు. అపార్ట్మెంట్ల్లో సెక్యురిటీని పెంచుకోవాలి. వాటిలోకి వచ్చి పోయే వారి పేర్లు తప్పనిసరిగా నమోదు చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, గ్యాస్ స్టవ్ రిపేర్ పేరిట అపార్ట్మెంట్లకు వచ్చే కొత్త వ్యక్తులను అనుమతించ కూడదు. ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లే వారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేస్తే దొంగతనాలు జరగకుండా ఆయా గల్లీల్లో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టి గట్టి నిఘా ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ సూచనలు, సలహాలను సంక్రాంతి పండుగకు తమ స్వంత ఊరుకు వెళ్లే ప్రతి ఒక్కరు పాటిస్తే మంచిది. ►ఊరు వెళ్లాల్సివస్తే విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. ►సెలవుల్లో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ, అలారం మోషన్ సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. ►తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి. ►కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ వుంటే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. లేదా 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. ►వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయటంతో పాటు వీలైతే చక్రాలకు కూడా చైన్స్‌తో కూడిన తాళం వేయటం మర్చిపోవద్దు. ►ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ►సంక్రాంతి సెలవుల్లో ఊరుకు వెళుతున్న వారు ఇంటి బయట, ఇంటిలో కనీసం 1, 2 లైట్లు వేసి వుంటే మంచిది. ►ఇంటికి ఇరువైపులా నమ్మకమైన వారు ఉంటే మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లటం మంచిది. జాగ్రత్తలు పాటించాలి సంక్రాంతి సెలవుల్లో తమ స్వంత ఊరుకు వెళ్లే వారు ఇంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ఇరుగు పొరుగు వారికి తమ ఇంటిపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా దొంగతనాలను అరికట్టేందుకు ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలను పంపిణీ చేయటంతో పాటు కాలనీ అసోసియేషన్ సంక్షేమ సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నాం. –కూకట్పల్లి సీఐ నర్సింగ్‌రావు -
కవ్విస్తున్న డ్రాగన్‌తో కష్టాలు
అసలే సంబంధాలు అంతంత మాత్రమైనప్పుడు, కొద్దిపాటి కవ్వింపు చర్యలైనా పరిస్థితిని క్లిష్టతరం చేస్తాయి. భారత్‌తో సరిహద్దు వెంట చైనా తాజా చర్యలు అచ్చం అలాగే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా తన సొంత నామకరణాలు చేస్తూ, డిసెంబర్ 30న చేసిన ప్రకటన అలాంటి చర్యల్లో ఒకటి. అలాగే, ఆంగ్ల సంవత్సరాదికి గల్వాన్ లోయలో చైనా సైనికులు తమ దేశ పతాకావిష్కరణ చేసి, ‘ఒక్క అంగుళం భూమినైనా వదిలేది లేదు’ అని పేర్కొన్న వీడియోలు కాక రేపుతున్నాయి. ఇక, జనవరి 1 నుంచి చైనా సరికొత్త సరిహద్దు చట్టం తెచ్చింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట సైనిక, పౌర వినియోగాలకు వీలుగా చైనా మరిన్ని నమూనా సరిహద్దు గ్రామాలను నిర్మించనుంది. వెరసి, దేశ ఉత్తర సరిహద్దుల్లో భారత్ మరిన్ని సవాళ్ళను ఎదుర్కోక తప్పేలా లేదు. అరుణాచల్‌ను ‘దక్షిణ టిబెట్’ పేరిట తమ అధికారిక చైనీస్ పత్రాలు, భౌగోళిక పటాల్లో ప్రమాణీకరించాలని డ్రాగన్ చూడడం దురాలోచన. ‘అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం’ అని మన ప్రభుత్వం ఘాటుగా చైనాకు చెప్పాల్సి వచ్చింది. 2017 ఏప్రిల్‌లో కూడా చైనా ఇలాగే అరుణాచల్‌లోని 6 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది. అప్పట్లో దలైలామా భారత సందర్శనతో ఈ కడుపుమంట చర్యకు దిగింది. గతవారం పలువురు భారత పార్లమెంట్ సభ్యులు ప్రవాసంలో ఉన్న టిబెటన్ పార్లమెంట్ ఉత్సవానికి హాజరయ్యారు. దానికి ప్రతిచర్య అన్నట్టుగా అరుణాచల్‌లోని 25 జిల్లాల్లో 11 జిల్లాలకు విస్తరించిన తాజా పేర్ల జాబితా వెలువడింది. అందులో 8 పట్నాలతో పాటు, 4 కొండలు, 2 నదులు, ఓ కొండ కనుమ ఉన్నాయి. జాగ్రత్తగా చూస్తే, మొత్తం అరుణాచల్ అంతటి పైనా తనదే పట్టు అని పునరుద్ఘాటించడానికే చైనా ఈ నిర్ణీత స్థలాలను ఎంపిక చేసుకుంది. భారత్, భూటాన్లతో భౌగోళిక సరిహద్దులను ఏకపక్షంగా పునర్లిఖించే ప్రయత్నంలో భాగంగానే చైనా కొత్త సరిహద్దు చట్టం తెచ్చినట్టు కనిపిస్తోంది. ఒక పక్క ఆ చట్టం, మరోపక్క భారత్‌తో వివాదం ఉన్న భూసరిహద్దుల్లో 2017 నుంచి 628 ‘షియావోకాంగ్’ నమూనా గ్రామాల నిర్మాణం ఆందోళన రేపుతున్నాయి. సరిహద్దు సమస్యకు ‘సైనిక పరిష్కారం’ అనే పరిస్థితిని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) సృష్టిస్తోందా అనిపిస్తోంది. చైనా అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ స్థాయీ సంఘం నిరుడు అక్టోబర్ 23న ఈ కొత్త సరిహద్దు చట్టానికి ఆమోదముద్ర వేసింది. మొత్తం 7 అధ్యాయాలు, 62 అధికరణాలున్న చట్టం ఇది. ‘చైనాలోని భూసరిహద్దు ప్రాంతాల రక్షణ, వినియోగం కోసం’ అంటూ ఈ చట్టం తెచ్చామన్నారు. దాదాపు 22,457 కిలోమీటర్ల మేర భూసరిహద్దును 14 దేశాలతో చైనా పంచుకుంటోంది. మంగోలియా, రష్యాల తర్వాత చైనాకు మూడో అతి పెద్ద సరిహద్దు భారత్‌తోనే! తూర్పు లద్దాఖ్ సరిహద్దు అక్సాయ్ చిన్‌లో భారత భూభాగంలో 38 వేల కి.మీ.ల భాగాన్ని చైనా ఆక్రమించుకుందని దీర్ఘకాలంగా మన దేశ ఆరోపణ. ఇది కాక, 1963లో పాకిస్తాన్ తాను ఆక్రమించుకున్న భారత భూభాగంలో 5,180 కి.మీ.ల మేర చైనాకు కట్టబెట్టింది. ఆ సరిహద్దు సమస్యలు సాగుతుండగా, లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత, చైనా సేనల మధ్య హింసాత్మక ఘర్షణ రేగింది. గత 45 ఏళ్ళుగా ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికుల మరణం, ఇరుదేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన, 20 నెలలుగా అనేక విడతలుగా దౌత్య, సైనిక వర్గాల చర్చలు నడుస్తున్న చరిత్ర. గతంలో లౌక్యంగా దౌత్యం నడుపుతూ వచ్చిన బీజింగ్ తన ఆర్థిక, సైనిక సంపత్తితో ఇప్పుడు ఏ దేశాన్నైనా అయితే మిత్రుడు, కాదంటే శత్రువు అన్న పద్ధతిలోనే చూస్తోంది. ఒక పక్క సరిహద్దు గ్రామాల నిర్మాణంతో ఇరుకున పెడుతూనే, రాజకీయ స్థాయిలో మన దేశానికీ – పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌లకూ మధ్య చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లో, ఇంకా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో భారత ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తోంది. అందుకే, జాతీయ భద్రత భారత్ ముందున్న సవాలు. భారతీయ ప్రాంతాలకు చైనీయుల కొత్త నామకరణం ప్రతీకాత్మకమే కావచ్చు. కానీ, తద్వారా సరిహద్దు వివాదాలపై చైనా సరికొత్త వైఖరి ఏమిటన్నది అర్థమవుతోంది. అదీ కీలకం. కొత్త సరిహద్దు చట్టం తీసుకురాక ముందు నుంచీ భారత్‌తో దూకుడుగా ఉన్న చైనా... అవసరమైతే ఇక ఈ చట్టాన్ని సాధనంగా వాడుకుంటుంది. ఏ దేశమైనా తమ భూభాగాన్ని రక్షించుకోవడం చేసే పనే. చైనా ఆ పనే చేస్తానంటోంది. కానీ ఆ భూభాగం ఏమిటన్నదే ప్రశ్న. ఇప్పటి దాకా చర్చలతో ఎల్ఏసీ సహా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చూశారు. ఇప్పుడిక బలప్రయోగంతో డ్రాగన్ ఆ పని చేయాలనుకుంటోందన్న మాట. ఈ చట్టం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది అందుకే. సైనిక స్థాయిలో భారత్ ఇప్పటికే అమెరికాకు దగ్గరై, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి చతుర్భుజ కూటమి ‘క్వాడ్’లో పాల్గొంటూ చైనాకు చెక్ పెట్టాలనుకుంటోంది. ఆర్థిక స్థాయిలో చైనా ప్రాబల్య మున్న ఆసియా ప్రాంత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ‘ఆర్సీఈపీ’కి భారత్ దూరంగా నిలిచింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇజ్రాయెల్ లాంటి వ్యూహాత్మక భాగస్వాములతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్రయత్నాల్లో ఉంది. ఇక, జాతీయ భద్రతలో చైనా ముప్పు తప్పించుకోవాలంటే దేశమంతటా ఒక్క తాటిపైకి రావాలి. మతప్రాతిపదికన మనుషులను కేంద్రీకృతం చేసే రాజకీయం అందుకు ఇబ్బంది అని గ్రహించాలి. సరిహద్దు భద్రతే సర్వోన్నతమని గుర్తించాలి. -
రికార్డులలో పేర్లున్నాయ్ కానీ.. ఊళ్లు లేవ్
చరిత్ర పుటల్లో చెదరని చరితం ఆ గ్రామాల సొంతం. భౌతికంగా అక్కడ ఊళ్లు లేకపోయినా రికార్డుల్లో చిరునామాలు మాత్రం ఉన్నాయి. గతంలో అక్కడ ప్రజలు నివసించే వారని చెప్పేందుకు ఆనవాలుగా శిథిల గోడలు, బావులు, గ్రామ చావిడిలు దర్శనమిస్తున్నాయి. ఇదీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని ఈచనహాల్, గుర్రాలదొడ్డి, కాటదొడ్డి, కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం, కలవలగుండు, పుట్టకుంట, పెండేకల్లు, ఎండపల్లి గ్రామాల పరిస్థితి. దొంగల బెడదతో.. కౌతాళం–ఉరకుంద గ్రామ రోడ్డులో ఈచనహాల్ గ్రామం ఉండేది. ఒకప్పుడు దాదాపు 40 కుటుంబాలు ఆ ఊళ్లో నివాసం ఉండేవి. గ్రామం వంకను ఆనుకుని ఉండటం.. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రాత్రిళ్లు దొంగలు ఇళ్లలో ప్రవేశించి విలువైన వస్తువులు అపహరిస్తుండేవారట. దొంగల బెడద భరించలేక అక్కడ ఉన్న కుటుంబాలు ఓబుళాపురం, కామవరం, కౌతాళం గ్రామాలకు వలస వెళ్లి పోయారు. బంగారమ్మవ్వ, ఆంజనేయస్వామి ఆలయాలు, శిథిలమైన గ్రామచావిడి, రాతి బావి ఇప్పటికీ గ్రామానికి సాక్షీభూతంగా నిలిచాయి. రెవెన్యూ రికార్డులలో 816 ఎకరాల సాగుభూమి ఈచనహాల్ గ్రామ పంచాయతీ పేరుపైనే ఉండటం విశేషం. ఈచనహాల్ గ్రామానికి చెందిన గ్రామ చావిడి (శిథిలస్థితిలో) పట్నం బాటలో పెండేకల్లు కోసిగి మండల కేంద్రానికి ఈశాన్య దిశగా పెండేకల్లు ఉండేది. చాలా కాలం క్రితం దాదాపు 35 కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. ఏళ్ల క్రితం నుంచి ఒక్కొక్కరు మండల కేంద్రానికి వలసబాట పట్టారు. కోసిగిలో వారిని పెండేకల్లు ఇంటిపేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. దాదాపు 150 కుటుంబాలు కోసిగిలో ఉన్నాయి. గ్రామ గుర్తుగా పెండేకల్లు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామానికి సంబంధించి రెవెన్యూ రికార్డులో 1423.16 ఎకరాల సాగుభూమి ఉంది. వరద పోటుతో.. కౌతాళం మండలంలో తుంగభద్ర నది ఒడ్డున ఒకప్పుడు కాటదొడ్డి, గుర్రాలదొడ్డి ఉండేవి. ఏళ్ల క్రితం గుర్రాలదొడ్డి పూర్తిగా కనుమరుగైంది. ఆ పక్కనే ఉన్న కాటదొడ్డిలో 20 కుటుంబాలకుపైగా ఉండేవి. వరద పోటుకు కుటుంబాలన్నీ గుడికంబాలి, కుంభళనూరు గ్రామాలకు వలస వెళ్లాయి. రెవెన్యూ రికార్డుల్లో 418 ఎకరాలు సాగుభూమి కాటదొడ్డి గ్రామం పేరుపైనే ఉంది. గుర్రాలదొడ్డి గ్రామం పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం ప్రస్తుత ఆర్డీఎస్ ఆనకట్టను ఆనుకుని ఉండేది. వరదల కారణంగా ఊరంతా కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. కొందరు అగసనూరు, సాతనూరు, కందకూరు గ్రామాల్లో స్థిరపడ్డారు. బాత్ర బొమ్మలాపురం పేరుపై 600 ఎకరాల భూములు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఉన్నాయి. గ్రామం గుర్తుగా మారెమ్మ ఆలయం మాత్రం దర్శనమిస్తుంది. ప్లేగు వ్యాధి కారణంగా.. ప్లేగు వ్యాధి కారణంగా ఎన్నో పల్లెలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోవలోనే కోసిగి మండలం కలవలగుండు, పుట్టకుంట, ఎండపల్లి గ్రామాలు కనుమరుగైనట్లు పెద్దలు పేర్కొంటున్నారు. కలవలగుండు గ్రామంలో 574.95 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పొలాలు పల్లెపాడు, చింతకుంట, పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. కలవలగుండు ప్రాంతంలో సుంకులమ్మ ఆలయం, కొండపై, కింద భాగాల్లో రాతి రోళ్లు ఉన్నాయి. కోసిగి మండలం అర్లబండ, కడదొడ్డి గ్రామాల మధ్యలో పుట్టకుంట అనే గ్రామం ఉండేది. అంతుచిక్కని వ్యాధి కారణంగా కుటుంబాలు అర్లబండ బాట పట్టాయి. కోసిగి మండలం దుద్ది గ్రామం దక్షిణ దిశగా ఎండపల్లి గ్రామం ఉండేదట. శతాబ్దాల క్రితమే గ్రామం కనుమరుగై పోయింది. దుద్ది, కోసిగి గ్రామాల్లో ఎండపల్లి వాసులు నివాసం ఉంటున్నారు. కొందరు ఎండపల్లి ఇంటి పేరుగా కొనసాగుతున్నారు. ప్లేగు వచ్చి ఊరు వదిలారు నా పేరు శివారి గజ్జయ్య. మాది కోసిగి మండలం పల్లెపాడు గ్రామం. మా గ్రామానికి దక్షిణ దిక్కున నాలుగు తరాల క్రితం కలవలగుండు అనే ఊరు ఉండేదని మా పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ గ్రామం ఆనవాలుగా బండరాళ్లపై రోళ్లు, పాడుబడిన గోడలు ఉన్నాయి. అక్కడే సుంకులమ్మ ఆలయం, కొంత దూరంలో ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి. అప్పట్లో ప్లేగు వచ్చి ఊరు ఖాళీ అయ్యిందట. మా ముత్తాతల నాడే వలస నా పేరు గోపాలు. మా ముత్తాతలు ఈచనహాల్ నుంచి కౌతాళం మండల కేంద్రానికి వచ్చారట. అందుకే మా ఇంటి పేరు ఈచనహాల్గా మారిందట. దోపిడీ దొంగల బెడద కారణంగా మా ముత్తాతలు ఊరిని వదిలేసి వచ్చారని చెబుతారు. ఇప్పటికీ మాకు ఆ గ్రామ పొలిమేరలోనే రెండు ఎకరాల భూమి ఉంది. వరదలకు ఊరు ఖాళీ నా పేరు ఈరన్న. మాది కాటదొడ్డి గ్రామం. గ్రామంలో గతంలో 20 కుటుంబాలకుపైగా ఉండేవారు. గతంలో వరదలకు ఊరు ముంపునకు గురి కావడంతో కుటుంబాలన్నీ కుంబళనూరుకు మారాయి. ఆంజనేయస్వామి గుడి ఉండటంతో పూజారులుగా మా మూడు కుటుంబాలు ఇక్కడే ఉండిపోయాం. -
గ్రామం కనుమరుగై 200 ఏండ్లు.. అయినా ఆనవాళ్లు ఇప్పటికి పదిలం
సాక్షి, కర్నూలు( కోయిలకుంట్ల): కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని శతాబ్ధాల క్రితం కనుమరుగైన గ్రామాలు ఆనవాళ్ల ఆధారంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కుందూనది పరివాహకంలోని బొబ్బిలి గుంతల, కనుమలపాడు, దద్దనాల గ్రామాలు రెండు వందల ఏళ్ల క్రితం కనుమరుగు కాగా అదే సమయంలో పట్టణానికి ఆరు కి.మీ దూరంలో ఉన్న గుండుమల గ్రామం ఖాళీ అయినట్లు పలు ఆనవాళ్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. రెండు శతాబ్ధాల క్రితం నుంచి గ్రామం లేకపోయినా ఆ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు గ్రామాన్ని గుర్తుచేస్తున్నాయి. కాలగమనంలో కలిసిన గుండుమల: కోవెలకుంట్ల పట్టణ శివారులోని ఎస్సార్బీసీ నుంచి పొలాలకు వెళ్లే రహదారిలో సుమారు ఆరు కి.మీ దూరంలో రెండు వందల సంవత్సరాల క్రితం వరకు గుండుమల గ్రామం ఉండేది. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి సుమారు 300 కుటుంబాలు జీవనం సాగించేవి. సుద్దరాళ్లతో తక్కువ ఎత్తులో నిర్మించుకున్న ఇళ్లు, కొట్టాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం, కులవృత్తుల ఆధారంగా కుటుంబాలను పోషించుకునే వారు అక్కడ నివసించే ప్రజలు. కొర్ర, ఆరుకలను ప్రధాన పంటలుగా, సజ్జ, జొన్న, వేరుశనగ, కంది, పెసర, తదితర పంటలను సాగుచేసేవారు. కుండలు చేయడం, చెప్పులు కుట్టడం, మగ్గంనేయడం, తదితర కులవృత్తులతో ఆయా కులాల్లోని కుటుంబాలు కుల వృత్తులు నిర్వహించేవారు. వీరభద్రస్వామి, శ్రీరాముడు, ఆంజనేయస్వాములను ఆరాధ్య దైవాలుగా కొలిచినట్లు ప్రస్తుతం లభ్యమైన ఆధారాల ద్వారా తెలుస్తోంది. గ్రామస్తులు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి పండులను అత్యంత వైభవంగా నిర్వహించేవారని బయటపడ్డ ఆధారాల ద్వారా వెల్లడి అవుతోంది. కుందూనది వరదలు, దొంగల బెడదతో గ్రామం ఖాళీ: పట్టణానికి సుదూరంలో ఉండటం, చుట్టుపక్కల కనుచూపుమేర గ్రామాలు లేకపోవడం, పక్కనే కుందూనది ఉండటంతో నదికి తరుచూ సంభవించే వరదలు, దొంగల బెడదతో రెండు వందల సంవత్సరాల క్రితం గ్రామం ఖాళీ అయింది. గ్రామానికి అతి సమీపంలోనే కుందూనది ప్రవహిస్తుండటం, ఆకాలంలో అధికంగా వర్షాలు కురిసేవి. వర్షాకాలమంతా నది ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తేది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి, పంటనష్టం జరిగి గ్రామస్తులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. వేసవికాలంలో దొంగలు పడి గ్రామంలో పడి డబ్బులు, బంగారు ఆభరణాలు, ధాన్యం, తదితర విలువైన వస్తువులు దోచుకెళ్లేవారు. వరదలు, దొంగల బెడదతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి గ్రామానికి సమీపంలో ఉన్న భీమునిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల ప్రాంతాలకు వలస వెళ్లడంతో క్రమేపి గ్రామం ఖాళీ అయ్యింది. ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వంశస్తులు ఇప్పటికి ఆయా గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారు. రెండు శతాబ్ధాలు గడిచినా ఆనవాళ్లు పదిలం: గ్రామం కనుమరుగై రెండు వందల సంవత్సరాలు దాటినా గ్రామానికి సంబంధించిన పలు ఆనవాళ్లు ఇప్పటికి పదిలంగా ఉన్నాయి. ఇళ్లకు సంబంధించి పునాది గోడలు, గ్రామ ప్రజల దాహార్తి తీర్చే కుంట, ప్రజలు ఆరాధ్య దైవాలుగా కొలిచే వీరభద్రస్వామి, రామునిరాతి విగ్రహాలు, వీరభద్రస్వామిని ఊరేగించే రథచక్రాలు, కుంటకు సంబంధించిన మెట్లు గ్రామాన్ని గుర్తు చేస్తున్నాయి. గ్రామం కనుమరుగు కాగా గ్రామం ఉన్న ప్రాంతం క్రమేపి వ్యవసాయ భూమిగా మార్పు కావడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో రైతులు శెనగ, జొన్న పంటలు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో గ్రామానికి సంబంధించిన భూములను ఇప్పటికి గుండుమల పొలాలుగా పిలుస్తుండటం విశేషం. చదవండి: అదొక చిన్న గ్రామం.. అయితేనేం ప్రభుత్వ ఉద్యోగుల అడ్డాగా మారింది -
పల్లెల ప్రగతికి ‘స్వామిత్వ యోజన’
భోపాల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్ అబాదీ సర్వే, మ్యాపింగ్(స్వామిత్వ) యోజన పల్లెల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ పథకం అమలుతో ప్రజలకు వారి స్థిరాస్తులపై వివాదాలకు తావు లేకుండా స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయని తెలిపారు. దేశంలో పల్లె సీమల ప్రగతిలో ఇదొక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో స్వామిత్వ యోజనను ప్రారంభించి 10 నెలల పూర్తయిన సందర్భంగా బుధవారం వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భూ యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ హర్దా జిల్లాలోని కొందరు ‘స్వామిత్వ యోజన’ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కమల్ 2008లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నపుడు హర్దా జిల్లాలో ‘ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ అధికార్ పుస్తికా’ పేరిట గ్రామస్థులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఇలాంటి పథకం ఇదే మొదటిది. ఈ యాజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంకుల నుంచి రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు. స్వామిత్వ పథకాన్ని ప్రధాని మోదీ 2020 ఏప్రిల్‌లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా ప్రారంభించారు. గ్రామ స్వరాజ్య సాధనతోపాటు సామాజిక–ఆరి్థక సాధికారతను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా పల్లె ప్రాంతాల్లో ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో భూములను సర్వే చేస్తారు. దీంతో ప్రజలకు స్పష్టమైన భూయాజమాన్య హక్కులు లభిస్తాయి. అంతేకాకుండా లీగల్ ఓనర్షిప్ కార్డులు జారీ చేయడం ద్వారా యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ కల్పిస్తారు. గ్రామాల్లోని భూములను సమగ్రంగా సర్వే చేయడమే స్వామిత్వ పథకం ఉద్దేశం. కేంద్ర, రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖలు, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా డ్రోన్ల సాయంతో సర్వే చేస్తాయి. భూముల హద్దులను తేల్చి, యజమానులకు చట్టబద్ధమైన ప్రాపర్టీ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి.