న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో శీతల పానీయాలకు డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో తమ ఎఫ్‌ఎంసీజీ వ్యాపార విభాగాన్నిఆరు రెట్లు విస్తరించు కోవాలని బీ2బీ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్ భావిస్తోంది. ఏడాది వ్యవధిలో 10,000 చిన్న పట్టణాలు, గ్రామాలకు చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎఫ్‌ఎంసీజీ వ్యాపార విభాగం హెడ్ వినయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకోసం ’ప్రాజెక్ట్ విస్తార్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్, జౌన్‌పూర్ జిల్లాల్లోసుమారు 3,000 మంది వరకు జనాభా ఉన్న గ్రామీణ మార్కెట్లలో దీన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కి అనుగుణంగా వివిధ బ్రాండ్‌లకు సంబంధించి పలు చిన్న ప్యాక్‌ల నిల్వలను పెంచుకుంటున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కోకా-కోలా, పెప్సీకో, డాబర్, హెక్టర్ బెవరేజెస్ (పేపర్‌బోట్) వంటి కీలక బ్రాండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment