drinks
-
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!
శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం. శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్ మిల్క్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్ డైట్ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.లీఫీ స్మూతీస్: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది. బోన్ సూప్: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్‌సూప్ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది. టోఫు స్మూతీస్: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు. ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..! ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పై పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి. కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి! -
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ప్యాకేజ్డ్ ఫుడ్స్, కొన్ని రకాల ప్రిజర్వేటెడ్ డ్రింక్స్ తింటే మంచిదికాదని విన్నాం. వాటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడం జరిగిది. అయితే శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో అదే నిజమని ధృవీకరించారు. అందుకోసం సుమారు 30 ఏళ్లు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..బాగా ప్రాసెస్ చేసిన పిండులు(మైదా వంటివి)తో తయారు చేసే స్నాక్స్లు, డ్రింక్‌లు తీసుకుంటే ఆయుర్ధాయం తగ్గి, అకాల మరణాలు సంభవిస్తాయని వెల్లడయ్యింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా..ఆలు చిప్స్, బర్గర్, బేకరి పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. వీటిలో శరీరానికి అవసరమయ్యే ఫైబర్, విటమిన్లు లేకపోవడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వీటిని ఎక్కువుగా తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో వెల్లడయ్యింది. అందుకోసం తాము 1984 నుంచి 2018 మధ్య సుమారు 11 యూఎస్ రాష్ట్రాల నుంచి70 వేల మంది మహిళా నర్సుల దీర్ఘాకాలిక ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. బాగా శద్ధి చేసిన పిండులతో చేసిన బేకరి పదార్థాలను రోజుకు ఏడుసార్లకు పైగా తీసుకున్న వారిలో అకాల మరణాల ప్రమాదం 4% అని, ఇతర కారణాల వల్ల 9% అని వెల్లడించారు. వీటిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మరణాలు సంభవించే ప్రమాదం 8%కి పైగా ఉందని చెప్పుకొచ్చారు పరిశోధకులు.ఇక మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత ఉత్పత్తుల వల్ల కూడా అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువేనని చెప్పారు. ఇది పరిశీలనాత్మక అధ్యయనమే అయినప్పటికీ..ఇది ఎంతవరకు నిజం అనేందుకు కచ్చితమైన నిర్థారణలు లేవు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య కోసం శుద్ధి చేసిన పిండులతో చేసే పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయాలనే విషయాన్ని మాత్రం అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో పాసెస్డ్ ఫుడ్స్ వినియోగంపై మరిన్ని పరిశోధనలు చేసి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు పరిశోధకులు. (చదవండి: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త!
మొన్నమొన్నటి దాకా చల్లగా సాగిన ప్రయాణం ఇప్పుడు వేసవి కొలిమికి సిద్ధమైంది. సమ్మర్ వార్తలు కొంతకాలంగా డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ఓ వైపు వాతావరణంలో మొదలైన మార్పులు, మరోవైపు నిపుణుల హెచ్చరికలు తెలియకుండానే గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక నుంచి ఏం తిన్నా, ఏం తాగినా ఆపసోపాలే! ఎటు వెళ్లినా, ఎక్కడాగినా నీరసాలు, నిట్టూర్పులే! మరి ఈ ఎండాకాలాన్ని ఎలా దాటెయ్యాలి? ఈ వేసవి తాపానికి డీహైడ్రేషన్, వడదెబ్బ, కళ్లు తిరగడం, నీరసం, వాంతులు, జీర్ణసమస్యలు ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతర కాలాల్లో అనారోగ్యం వస్తే.. ఏదో ఒకటి తిని, ఓ టాబ్లెట్ వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రైనాపోవచ్చు. కానీ ఈ ఎండాకాలంలో నిద్ర కూడా పట్టదు. పరచుకున్న పరుపులోంచి, మూసి ఉన్న తలుపుల్లోంచి వేడి తన్నుకొచ్చి.. కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి వడగాల్పులను తట్టుకోవాలంటే.. చలువ చేసే ఆహారాలు, చల్లబరచే పానీయాలను పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తినేవాటిలో ఆయిల్ లెస్, తాగేవాటిలో సుగర్ లెస్ తప్పదంటున్నారు. జంక్ ఫుడ్‌కి, సాఫ్ట్ డ్రింక్స్‌కి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు. నిజానికి వేసవిలో ఎక్కువగా తినాలనిపించదు. ఆరారగా పానీయాలు తాగాలనిపిస్తుంది. అసలు తినడానికైనా, తాగడానికైనా ఏవేవి మంచివో చూద్దాం. ఎండాకాలం ఆహారాలు దోసకాయ, పుచ్చకాయ, మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, అనాసకాయ ఇలా ప్రతి పండూ వేసవిలో ఆస్వాదించతగ్గదే! వాటిలోని వాటర్ కంటెంట్ బాడీలోని ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గిస్తాయి. అలాగే అరుగుదల సజావుగా చేసి.. జీర్ణకోశాన్ని తేలికపరుస్తాయి. ఆయా పండ్లతో చిక్కగా జ్యూసులు చేసుకుని తాగొచ్చు. భోజనం విషయానికి వస్తే ఆకుకూరలు, కూరగాయలకే పోపు పెట్టడం మంచిది. సమ్మర్లో మాంసం, చేపలు వంటివి తినడం వల్ల అరుగుదల ఆలస్యం అవుతుంది. కడుపు బరువుగా మారుతుంది. నాన్‌వెజ్ వంటకాల్లో నూనె, మసాలా వంటివి ఎక్కువగా వాడాల్సి రావడంతో అవన్నీ వేసవి కాలంలో జీర్ణక్రియ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తినేటప్పుడు తేలికగా అరిగేవి ఎంచుకోవాలి. వేపుళ్లు తినడం వల్ల వడదెబ్బను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి, ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీరు, జావలు, జ్యూసులు, ద్రవాహారాలను తీసుకోవాలి. డబ్ల్యూఎంఓ హెచ్చరిక ఈ వేసవి మూడునెలలు మండుతున్న కుంపటే అని మన వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్నే ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) కూడా వెల్లడించింది. ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. గత ఏడాది జూన్‌లో ‘ఎల్ నినో’ ఏర్పడిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉండబోతున్నాయని వెల్లడించింది. ఇవి అస్సలు తినొద్దు... కెఫీన్, ఆల్కహాల్: ఈ రెండూ బాడీని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అందుకే వేసవిలో కాఫీ, టీలతో పాటు మద్యానికీ దూరంగా ఉండటం ఉత్తమం. స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ చెమటలు పుట్టిస్తాయి. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఉక్కబోతల వాతావరణంలో మరింత వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు బాడీని ఎక్కువగా డీహైడ్రేషన్‌కి గురిచేస్తాయి. ఇలాంటివి తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని వల్ల నీరసంగా, అలసటగా ఉంటుంది. అరుగుదల లోపంతో తెలియకుండానే ఆపసోపాలు మొదలవుతాయి. వేసవి పానీయాలు సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ‘ఉత్త నీళ్లు ఎన్నని తాగుతాం‘ అనుకునేవారు ’ఇలా చిటికెలో అయ్యే చలవ పానీయాలను తయారుచేసుకుని తాగండి’ అంటున్నారు నిపుణులు. అయితే పంచదారకు బదులుగా తేనె వాడుకోవడం మంచిది. తేనె లేని సమయంలో తక్కువ మోతాదులో బెల్లం పాకం వాడుకోవచ్చు. సబ్జా నీళ్లు.. ఈ సమ్మర్ సీజన్ లో సబ్జా నీళ్లు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే పెక్టిన్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సీజన్లో సబ్జా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి సమస్యలు దరిచేరవు. అందుకే నీళ్లలో సబ్జా వేసుకుని తాగడం మంచిది. తేనె– నిమ్మరసం నీళ్లు ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మచెక్కను పిండుకుని, ఒకటిన్నర లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి తాగొచ్చు. ఇది తక్షణశక్తిని అందిస్తుంది. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. సోంపు నీళ్లు సోంపులో ఈస్ట్రాగోల్, అనెథాల్, ఫెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచి, జీర్ణ సమస్యలను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తేనె లేదా బెల్లం పాకం కలిపి తీసుకుంటే మంచిది. కొబ్బరి బోండం.. కొబ్బరి నీళ్లు ఎల్లప్పుడూ బాడీని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉండే ఈ సహజపానీయం వేసవిలో వేడిని తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది. జీలకర్ర నీళ్లు.. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలానే ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ వాటర్ వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. సమ్మర్లో రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఏలకుల నీళ్లు ఏలకుల్లోని ఔషధ గుణాలు.. బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. కడుపులో వేడి, మంట, వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. ఒక గ్లాసుడు వేడి నీళ్లల్లో ఏలకుల్ని దంచి వేసుకుని, బాగా కలుపుకుని, వడకట్టి తాగాలి. అభిరుచిని బట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ నీళ్లు శరీరంలో వేడిని వేగంగా తగ్గిస్తాయి. మెంతుల నీళ్లు మెంతుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్ , పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని మెంతుల్ని గ్లాసు నీళ్లల్లో నానబెట్టి, వడకట్టుకుని తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి, చల్లబడుతుంది. దనియాల నీళ్లు ఒక టీస్పూన్ దనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి, వడగట్టుకుని పది నిమిషాల పాటు మరిగించి, చల్లార్చుకుని తాగితే మంచిది. దనియాల్లోని పైబర్ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే ఈ వాటర్.. బాడీలోని టాక్సిన్స్‌ను తొలగించి.. చల్లదనాన్ని అందిస్తుంది. మజ్జిగ.. వేసవికి అసలు సిసలు చల్లదనం మజ్జిగతోనే వస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని, గిలక్కొట్టి అందులో ఓ గ్లాసుడు నీళ్లు కలిపితే చాలు, మజ్జిగ రెడీ. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే కడుపులో చల్లగా ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటిని పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయట పడొచ్చు. అలాగే ఫ్రిజ్‌లో వాటర్ కంటే మట్టికుండను ఇంట్లో పెట్టుకోవడం మంచిది. చర్మసంరక్షణ అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోయి దెబ్బతింటుంది. మొటిమలు రావడం, ముఖం కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం, సాయంత్రం తప్పకుండా చల్లటి నీళ్లతో స్నానం చెయ్యాలి. ముఖాన్ని నీళ్లతో కొట్టినట్లుగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు అయినా నేచురల్ స్క్రబ్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన తగ్గుతుంది. క్రీమ్స్ అండ్ లోషన్స్ సాధారణంగా మాయిశ్చరైజర్ శీతాకాలంలో మాత్రమే అవసరం అనుకుంటాం. కానీ వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూడా మాయిశ్చరైజర్ అవసరం అంటారు నిపుణులు. చర్మసంరక్షణలో భాగంగా సమ్మర్ క్రీమ్స్ వాడితే మంచిది. బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరచిపోవద్దు. అది సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మంలోని తేమను కాపాడుతుంది. హెయిర్ కేర్ ఎవరికైనా కురులే ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. కానీ వేసవి వచ్చేసరికి చెమటకు, ఉక్కపోతలకు ఆ కురులే విసుగుపుట్టిస్తుంటాయి. అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వేసవిలోనూ జుట్టు ఆరోగాన్ని కాపాడుకోవచ్చు. పొడవాటి జుట్టున్నవారు పైకి ముడిపెట్టుకునేటప్పుడు జాగ్రత్తపడాలి. చిక్కులు పడకుండా అనువైన క్లిప్స్ వాడుకోవాలి. స్విమ్మింగ్ పూల్‌లో కాని, బీచ్‌లో కాని తల తడిసినప్పుడు ఇంటికి వచ్చి మంచి నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారిపోయి బలహీనంగా,పెళుసుగా మారతాయి. కెమికల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. తల స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత కురులను బలంగా రుద్దకూడదు. బాగా ఆరిన తర్వాతే జుట్టుని అల్లుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు జుట్టుకి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. తల స్నానం తర్వాత వెంట్రుకలకు కండిషనర్ వాడటం మంచిది. గొడుగైనా.. హ్యాట్ అయినా.. ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోవడంతో బయటకి వెళ్లేప్పుడు తగుజాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయితే వేసవికి మరిన్ని జాగ్రత్తలు అసవరం అంటున్నారు నిపుణులు. వేసవిలో ప్రయాణాలు అంత మంచివి కావు. తప్పనిసరి అయితే మాత్రం వెంట తీసుకుని వెళ్లాల్సిన లిస్ట్ ఇదే. ఒక వాటర్ బాటిల్, ఒక గొడుగు లేదా హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్కార్ఫ్ లేదా హెడ్ బ్యాండ్ మాస్క్.. ఇవన్నీ వెంట తీసుకుని వెళ్లాల్సినవే. మొత్తానికీ ఈ వేసవి చల్లగా ఉండాలంటే ‘లైట్ ఫుడ్, లాట్ ఆఫ్ లిక్విడ్స్’ అనే పాలసీని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉంటే కుండలో నీళ్లనే తాగాలి. బయటికి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టాలి. మన సంగతి సరే! పాపం మనతో పాటు జీవించే జంతువులు, పక్షులకూ ఈ వేసవి ప్రాణసంకటమే! కాస్త వాటి దాహాన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి. ఇంటి ముందు చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెడదాం. నాలుగు ధాన్యపు గింజలు ప్లేటులో వేసి, గోడ మీద పెడదాం. ఇవి చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు! -
రాగిపాత్రల్లో ఈ పానీయాలను అస్సలు తాగొద్దు!
రాగి గిన్నెల్లో నీరు తాగడం మంచిదని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెగ వాడేస్తుంటారు. రాగి పాత్రలో తినడం కూడా మంచిదే కానీ కొన్నింటికి దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. కేవలం కొన్ని పదార్థాలకే పరిమితం. భోజనానికి కూడా రాగి ప్లేట్లు వాడుతుంటారు. కానీ కొన్ని రకాలు పులుపు వంటి పదార్థాలు రాగి గిన్నెలో తినకపోవటమే మంచిది. ముఖ్యంగా పెరుగు లాంటివి తింటే చాలా ప్రమాదం. అసలు రాగి పాత్రలో ఎలాంటి పదార్థాలు ఎలాంటి పానీయాలు తాగకూడాదో చూద్దామా! ముఖ్యంగా మామిడికాయ, పచ్చళ్లు, జామ్‌లు ఎప్పుడు రాగిపాత్రల్లో తినకూడదు, భద్రపరచకూడదు. ఈ ఆహారాలతో రాగి రియాక్షన్ చెందుతుంది. తత్ఫలితంగా వికారం లేదా వాంతులు వంటివి రావొచ్చు. లేదా పాయిజనింగ్‌కి దారితీయొచ్చు. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం, తేనె కలుపుకుని తాగే అలవాటు ఉంటుంది చాలమందికి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. అయితే ఇలాంటి పానీయాలు కూడా రాగి గిన్నెల్లో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చర్య పొంది కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు సంబంధిత సమ్యలు తలెత్తుతాయి. అలాగే రాగి పళ్లెంలో అన్నం తినేటప్పుడు పెరుగు అన్నం అస్సలు తినొద్దు. పెరుగులోని గుణాలు రాగితో ప్రతిస్పందిస్తాయి దీంతో జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఇక ఇతర పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం కూడా హానికరమే. పాలలోని ఖనిజాలు విటమిన్లలు రాగితో రియాక్షన్ చెంది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంది. (చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!) -
ప్రభుత్వాఫీస్‌లో అధికారి జల్సాలు..
లక్నో:ప్రజలకు సేవచేయాల్సిన స్థానంలో ఉండి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. ప్రభుత్వ ఆఫీసులు తమ సొంత నివాసాలుగా భావిస్తుంటారు. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో జల్సాలు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తించాల్సిన సమయంలో కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో కపూర్ సింగ్ అనే అధికారి స్వైజ్పూర్ రిజిస్టర్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీస్‌కు వచ్చి టేబుల్ మీదే దర్జాగా మద్యం సేవించారు. ఓ చేతిలో ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో మద్యం సేవిస్తూ స్థానిక మీడియాకు చిక్కారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. #हरदोई- सरकारी दफ्तर में एक कर्मचारी का शराब पीते वीडियो वायरल,रजिस्ट्री ऑफिस सवायजपुर में तैनात चपरासी कपूर सिंह का दारू पीने का वीडियो हुआ वायरल,ऑफिस में जाम छलकते नजर आ रहा है कर्मचारी,हरदोई के सवायजपुर रजिस्ट्री ऑफिस का बताया जा रहा है @hardoipolice#ViralVideos @dmhardoi pic.twitter.com/5gVKmrEI6u — anuj Pal (@anujPal50037043) August 27, 2023 సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు చివాట్లు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల పంజాబ్‌లోని హోషియాపూర్‌లో సెంట్రల్ జైలు పోలీసులు అంబులెన్స్‌లోనే మద్యం సేవించిన ఘటన మరవకముందే యూపీలో ఈ ఘటన జరిగింది. ఇదీ చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి.. -
ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
హాట్‌గా ఉన్న సమ్మర్లో ఏదైనా తాగాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెప్సీ, కోకో కోలా లాంటి సాఫ్ట్ డింక్సే. ఇప్పుడు ఈ శీతల పానియాల్ని తయారు చేస్తున్న కంపెనీలను ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ అంతర్యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం పెప్సీ, కోకోకోలా, ఫీజీ కూల్ డ్రింక్స్‌తో పాటు క్యాండీ (స్వీట్స్)లలో ఉపయోగించే ఓ పదార్ధం సుడాన్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పుడు ఆ పదార్ధం కొరత తయారీ కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. సూడాన్‌లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలే కాదు.. అంతర్జాతీయ కంపెనీలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొడక్ట్‌ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సుడాన్లో దొరికే పదార్ధాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పెప్సీ, కోకో కోలాలో ఉపయోగించే పదార్ధం పెప్సీ, కోకో కోలాలో సాధారణంగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థం 'గమ్ అరబిక్'. పెప్సీ, కోకో కోలా కంపెనీలు తయారు చేసే సాఫ్ట్ డ్రింక్స్‌లో ఈ గమ్ అరబిక్‌ను కలుపుతారు. దీన్ని కలపడం వల్ల కూల్ డ్రింక్‌ను తయారీ కోసం వినియోగించే ఇంగ్రీడియంట్స్ విడిపోకుండా ఉంటాయి. లేదంటే ఇంగ్రీడియంట్స్ విడిపోయి రుచి, పచి ఉండవు. కాబట్టే తయారీ సంస్థలు ఈ గమ్ అరబిక్‌ను ఉపయోగిస్తాయి. ఇక ఆ పదార్ధం సుడాన్‌లోని అకాసియా చెట్టు నుంచి పూసే జిగురు తరహాలో ఉంటుంది. ఈ జిగురు ప్రపంచ దేశాలకు సూడాన్ నుండే రవాణా అవుతుంది. ప్రపంచంలో 70 శాతం గమ్ అరబిక్ సరఫరా ఆఫ్రికాలోని సూడాన్ గుండా ప్రవహించే సాహెల్ ప్రాంతం నుండి ఎగుమతి అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలకు గమ్ అరబిక్ సరఫరా చేసే కెర్రీ గ్రూప్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిచర్డ్ ఫిన్నెగన్ను ఉటంకిస్తూ రాయిటర్స్‌లోని ఓ నివేదిక పేర్కొంది. డచ్ సప్లయర్ ఫోగా గమ్ భాగస్వామి మార్టిజెన్ బెర్గ్కాంప్ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు! 'గమ్ అరబిక్' ఉత్పత్తి ఏటా ప్రపంచవ్యాప్తంగా 120.000 బిలియన్ డాలర్ల విలువైన 1,1,500 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని కెర్రీ గ్రూప్ అంచనా వేసింది. తూర్పు నుండి పశ్చిమ ఆఫ్రికా వరకు 500 మైళ్ళలో విస్తరించి ఉన్న ప్రాంతం నుండి ఈ గమ్‌ను సేకరిస్తారు. గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజాలు తమ ఉత్పత్తులలో గమ్ అరబిక్ లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం సాధ్యం కాదని అగ్రిగమ్ మార్కెటింగ్ డైరెక్టర్ డాని హద్దాద్ చెప్పారు. ఫిజీ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్లో గమ్ అరబిక్కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతుండగా.. సూడాన్ అంతర్యుర్ధం ముగింపుపై ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు సైతం ఐక్యారాజ్య సమితి వేదికగా తమ గొంతుకను వినిపిస్తున్నాయి. 500 మందికి పైగా మృతి సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరులో నార్త్ ఆఫ్రీకా దేశమైన సూడాన్ అతలాకుతలమవుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఘర్షణలు మొదలైన ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు (మే1) లక్ష మందికిపైగా పౌరులు సూడాన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 3.30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. మరోవైపు, ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతిచెందగా.. నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ -
పోలీస్టేషన్లో నవ వధువు హంగామా!..మద్యం మత్తులో ఊగిపోతూ..
ఇటీవల పెళ్లి వేడుకల్లో మద్యం తాగి వచ్చిన పెళ్లి కొడుకులు సృష్టించిన హంగామా గురించి విన్నాం. దీంతో అర్థంతరంగా పెళ్లిళ్లు ఆగిపోయి లబోదిబోమన్న వారిని చూశాం. వాటికి భిన్నంగా ఇక్కడొక నవ వధువు మద్యం తాగి పోలిస్ స్టేషన్లో హల్చల్ చేసింది. వారు ఎంతగా కంట్రోల్ చేసేందుకు యత్నించినా ఆగకపోగా నేను రెండో పెళ్లి చేసుకుంటా అంటూ అరుస్తూనే ఉంది. అసలేం జరిగిందంటే.. మద్యం మత్తులో ఉన్న ఒక నవ వధువు పోలిస్ స్టేషన్‌కి వెళ్లి పెద్ద హంగామా సృష్టించింది. రెండో పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. నాకు రెండో పెళ్లి కావాలి అంటూ స్టేషన్‌లోని కాగితాలను, ఫోన్లను విసిరేసింది. చివరికి ఓ లేడి కానిస్టేబుల్ అదుపు చేసి గదిలోకి లాక్కెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు మొదటి పెళ్లి ఆమెకు బాధ కలిగించిందేమో! అందుకే ఇలా చేసిందని ఒకరూ, ఆ అమ్మాయి చాలా ఆవేదనలో ఉందని మరొకరు కామెంట్లు చేశారు. తప్పతాగి ఇలా చేయడమేంటని మరొక నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "Do shaadi karenge Do Shaadi" Woman demands marriage with lover soon after her wedding with a man Police watches as mute spectators Feeling so bad for her Husband EQUALITY ! pic.twitter.com/S6zbiqE731 — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 30, 2023 (చదవండి: కాఫీ షాప్ పార్కింగ్ ఆఫర్..రూ 60 కోసం పదేళ్లు పోరాడి గెలిచాడు) -
భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉడాన్: ఏకంగా ఆరు రెట్లు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో శీతల పానీయాలకు డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో తమ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగాన్నిఆరు రెట్లు విస్తరించు కోవాలని బీ2బీ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్ భావిస్తోంది. ఏడాది వ్యవధిలో 10,000 చిన్న పట్టణాలు, గ్రామాలకు చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగం హెడ్ వినయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకోసం ’ప్రాజెక్ట్ విస్తార్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్, జౌన్పూర్ జిల్లాల్లోసుమారు 3,000 మంది వరకు జనాభా ఉన్న గ్రామీణ మార్కెట్లలో దీన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కి అనుగుణంగా వివిధ బ్రాండ్లకు సంబంధించి పలు చిన్న ప్యాక్‌ల నిల్వలను పెంచుకుంటున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కోకా-కోలా, పెప్సీకో, డాబర్, హెక్టర్ బెవరేజెస్ (పేపర్‌బోట్) వంటి కీలక బ్రాండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. -
తాటి వనంలో కళ్ళు తాగిన ఎమ్మెల్యే రాజయ్య
-
డయాబెటీస్ ఉన్న వాళ్లు ఇవి తిన్నా ముప్పే!
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీసే ప్రధాన కారకాల్లో చక్కెర ఒకటి. అందుకే మధుమేహులు తాము తినే ఆహారాల్లో ఎంత చక్కెర ఉందని చెక్ చేస్తుంటారు. అయితే ఒక్క చక్కెర మాత్రమే కాదు.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరిగేందుకు దారి తీసే పదార్థాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే ఈ ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ప్యాక్ చేసిన స్నాక్స్: ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా డయాబెటీస్‌కు దారితీస్తాయి. ఎందుకంటే వీటిని శుద్ధి చేసిన పిండితో తయారు చేయడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుతాయి. అందువల్ల వీటి జోలికి వెళ్లకుండా ఉండటం మేలు. అంతగా తినాలనిపిస్తే.. వీటికి బదులుగా గింజలు లేదా మొలకలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్: పండ్లలో ఎక్కువ మొత్తంలో తీపి ఉంటుంది. ఎండిన పండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎండు ద్రాక్షల్లో 115 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఇది మామూలు ద్రాక్షలో కంటే చాలా ఎక్కువ. ఒకవేళ ఎండు పండ్లను తినాలనుకుంటే చక్కెర తక్కువగా ఉండే పండ్లను తినడం మంచిది. ఆల్కహాల్ పానీయాలు: ఆల్కహాలిక్ పానీయాల్లో చక్కెరతోపాటు పిండిపదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు బీర్, వైన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని నిపుణుల సలహా. మధుమేహులు ఆల్కహాలిక్ పానీయాలు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. పండ్ల రసం: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా. పండ్ల రసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పండ్ల రసాలలో బయటినుంచి కలిపే చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. అందువల్ల పండ్లరసాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ..వీటిని తగిన మోతాదులోనే తీసుకోవడం మంచిది. వేపుళ్లు: వేయించిన ఆహారాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అలాగే కొవ్వులు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ టైంపడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు: వైట్బ్రెడ్, పాస్తా, మైదాతో చేసిన ఆహారాలన్నీ శుద్ధి చేసిన పిండితో తయారు చేసినవే. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. పోషకాలు అసలే ఉండవు. మధుమేహులు వీటిని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయులు బాగా పెరుగుతాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తినడం చాలా మంచిది. -
మండే ఎండల్లో ఈ డ్రింక్స్ గురించి తెలిస్తే..
-
క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!
ప్రముఖ కంపెనీ ఇటీవల ఇచ్చే కొన్ని అడ్వర్టైస్మెంట్ల విషయంలో కాస్త జాగురకతతో వ్యవహరించకపోతే ఇంతే సంగతులు. ఇటీవల కొన్ని అడ్వర్టైస్మెంట్లు ఆ పరిస్థితిని ఎదుర్కొన్న ఘటనలను కూడా చూశాం. అయితే వినియోగదారులకు ఉపయుక్తంగా ఇచ్చే క్యూఆర్ కోడ్ పట్ల పాకిస్తాన్లో ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా క్యూర్ కోడ్ తీసేయాలి అని హెచ్చరించాడు. (చదవండి: కోవిడ్ అంటే కరోనా కాదు మనిషి పేరు అని తెలుసా!!) అసలు విషయంలోకెళ్లితే...పాకిస్తాన్‌లోని కరాచీలో రద్దీగా ఉండే రహదారిపై ముల్లా అనే వ్యక్తి సెవెన్ అప్ పెప్సీ బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ పై అభ్యంతరం తెలిపాడు. ఈ క్యూఆర్ కోడ్‌లో ప్రవక్త ముహమ్మద్ పేరు ఉందని చెబుతున్నాడు. అయితే అతను పక్కన ఉన్న వ్యక్తి ఇమ్రాన్ నోషాద్ ఖాన్ ఇది క్యూఆర్ కోడ్ అని చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అంగీకరించలేదు. అంతేకాదు సెవెన్ అప్ బాటిల్ ట్రక్‌కి నిప్పు పెడతానంటూ హెచ్చరించాడు కూడా. అయితే క్యూఆర్ కోడ్ వినియోగదారులకు పోషకాహార సమాచారం, తయారీ సమాచారాన్ని అందించే నిమిత్తం పానీయాల కంపెనీలు సీసాలు, డబ్బాలపై ఇస్తారు. ఈ మేరకు ముల్లా ఈ కోడ్‌ని కంపెనీలు తొలగించాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని తన సహచరుడు ఇమ్రాన్ నోషాద్ ఖాన్ పట్టుబట్టాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సంబంధిత కంపెనీ ప్రతినిధి ఖాన్‌కు కృతజ్ఞతలు తెలపడమే కాక క్యూఆర్ కోడ్‌ను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారని ఆయన తెలిపారు. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) Lack of awareness. I spotted this Ashiq e Rasool he was threatening this poor truck driver on University Road and the Mob was gathering and threatening to burn the truck. The truck belongs to a well known Beverage brand I tried to explain to him that this is a QR code 1/2 pic.twitter.com/RnLS71Bf3M — Imran Noshad Khan - عمران نوشاد خان (@ImranNoshad) December 31, 2021 -
బాస్ మీద కోపం.. డ్రింక్‌లో కరోనా రోగి లాలాజలం
ఇస్తాంబుల్: బాస్ మీద కోపంతో ఓ ఉద్యోగి కోవిడ్ రోగి లాలాజలంతో తన బాస్‌ని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి కారు డీలర్షిప్ యజమానిగా పని చేస్తున్నాడు. రంజాన్ సిమెన్ అనే వ్యక్తి మూడేళ్లుగా అతడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. చెప్పిన పని చేస్తూ.. నమ్మకంగా ఉండటంతో ఇబ్రహీం అప్పుడప్పుడు రంజాన్ చేతికి డబ్బులు కూడా ఇచ్చే వాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇబ్రహీం కారు అమ్మగా వచ్చిన 2,15,000టర్కిష్ లిరాలను(2,22,2160 రూపాయలు) రంజాన్ సిమెన్కి ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఆఫీసులో జమ చేయాల్సిందిగా కోరాడు. అయితే ఇంత పెద్ద మొత్తం చేతికి రావడంతో రంజాన్ మనసులో చెడు ఆలోచనలు ప్రవేశించాయి. పైగా అప్పటికే అతడు లోన్ బకాయి ఉన్నాడు. ఈ క్రమంలో ఇబ్రహీం ఇచ్చిన డబ్బు తీసుకుని ఉడాయించాడు రంజాన్. దాంతో ఇబ్రహీం అతడి మీద పోలీసులకు ఫిర్యాడు చేయడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అప్పటి నుంచి రంజాన్ బాస్ మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపాలని భావించాడు. ఈ క్రమంలో ఓ దారుణమైన ఆలోచన చేశాడు. బాస్, అతడి కుటుంబ సభ్యులు తాగే డ్రింక్స్‌లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి లాలాజలాన్ని కలిపి అందరిని ఒకేసారి చంపాలని భావించాడు. ఇందుకు గాను ఓ కరోనా రోగికి 50 టర్కిష్ లిరాలు (రూ. 516)చెల్లించి అతడి లాలాజలాన్ని కొన్నాడు. అయితే ఇబ్రహీం అదృష్టం కొద్ది రంజాన్ చేస్తోన్న దారుణం గురించి అతడికి ముందే తెలిసింది. రంజాన్ సహోద్యోగి ఒకరు దీని గురించి బాస్‌కు తెలపడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలు సమర్పించాడు. దాంతో పోలీసులు రంజాన్ మీద హత్యానేరం కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరిగినా రంజాన్ మాత్రం మారలేదు. ‘‘నేను నిన్ను వైరస్‌తో చంపడం కాదు.. ఈ సారి నీ పుర్రెని పుచ్చకాయాల పేల్చేస్తాను’’ అంటూ బాస్‌కి బెదిరింపు సందేశాలు పంపుతున్నాడట. ఇబ్రహీం దీని గురించి మాట్లాడుతూ.. ‘‘రంజాన్‌ను చూస్తే.. భయం వేస్తుంది. ప్రస్తుతం నేను, నా భార్య, పిల్లలు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. మా సొంత ఇంట్లోనే మేం బందీలుగా బతుకుతున్నాం. ఇలా ఇంకేన్నాళ్లో’’ అంటూ వాపోయాడు. చదవండి: ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’ -
పక్కా దేశీ పేరెంట్స్ అనిపించుకున్నారుగా..!
ఎంత మోడ్రన్‌గా ఉన్నా.. ఆధునికంగా ఆలోచించినప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇండియన్ పేరెంట్స్ మార్పు అంగీకరించరు. ముఖ్యంగా ఆడపిల్లలు మద్యం సేవించే విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. మద్యపానం మగవారికి మాత్రమే అని ఏళ్లుగా నమ్ముతున్న సమాజం మనది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతన్నప్పటికి నేటికి మన సమాజంలో నూటికి 95 శాతం కుటుంబాల్లో ఆడవారు తాగకూడదు అనే నియమం చాలా కఠినంగా పాటిస్తారు. ఒక వేళ అందుకు భిన్నంగా జరిగితే తల్లిదండ్రుల రియాక్షన్ ఇలా ఉంటుందంటన్నారు మిషా మాలిక్. కొలంబియాలో నివసిస్తున్న మిషా మాలిక్ రెండు రోజుల క్రితం తన ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో మిషా తన తల్లిదండ్రుల ఎదురుగా మద్యం సేవిస్తూంటుంది. మరో వైపు మిషా తల్లి.. కూతుర్ని తాగవద్దని బతిమిలాడటం వినిపిస్తుంది. ‘ఇది జరిగాక మా అమ్మానాన్నలు నన్ను ఇండియా తిరిగి పంపిచడానికి టికెట్లు బుక్ చేశారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ‘ఇండియన్ పేరెంట్స్ అంటేనే ఓవర్ కేరింగ్ అని నిరూపించుకున్నారం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. It was at this moment that my parents decided they were sending me back to India pic.twitter.com/MQ64wuYESO — Misha Malik (@MishaMalik138) March 18, 2019 -
ఎయిర్‌పోర్టుల్లో ఎమ్మార్పీకే టీ, స్నాక్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వాధీనంలోని 90కి పైగా విమానాశ్రయాల్లో కొన్ని రకాల తినుబండారాలు, పానీయాలు ఇకపై సరసమైన ధరలకే లభించనున్నట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) శనివారం ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లోని విమానాశ్రయాలకు ఇది వర్తించదు. పలు వస్తువులను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే అమ్మేందుకు ఎయిర్‌పోర్టుల్లోని వ్యాపారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకుంటారని ఏఏఐ అధికారి ఒకరు చెప్పారు. టీ, కాఫీ వంటి వాటినీ అత్యధిక ధరలకు అమ్ముతున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. మధ్య తరగతి వారు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్న అంశాన్ని పరిగణనలోని తీసుకుని పలు వస్తువులను ఎమ్మార్పీకే అమ్మేందుకు నిర్ణయించామని ఏఏఐ అధికారి చెప్పారు. -
సమ్మర్ కేర్
వేసవిలో పిల్లలు కుదురుగా ఇంట్లో ఉండమంటే ఉండరు. పైగా ఎండ వేడి. పిల్లలు ఎండలను తట్టుకొని, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లులకు తెలిసుండాలి. చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ ఇప్పించవద్దు. వాటికి బదులు కొబ్బరి నీళ్లు, లస్సీ, షర్బత్ లాంటివి ఇస్తే దాహం తీరుతుంది. డయేరియా దరిచేరదు. ఫ్రూట్స్ తినని పిల్లలకు వాటితో వెరైటీ స్వీట్స్, జ్యూస్ చేసి ఇస్తే ఇష్టపడతారు. ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్స్‌తో ఆడుకోవడమన్నా, వాటినలాగే తినడమన్నా, చల్లటి నీటిని తాగడమన్నా పిల్లలకు సరదా. వీటి వల్ల గొంతుకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎండ వేడిమిని తట్టుకోవడానికి కాటన్ దుస్తులనే వేయాలి. నైలాన్ దుస్తులు వేస్తే చెమట పొక్కులు, ర్యాష్ వస్తాయి. -
ఆహారం, పానీయాలపై సర్వీస్ చార్జీ చెల్లించొద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: హోటళ్లలో ఆహారం, పానీయాలపై కస్టమర్లకు సేవల రుసుము (సర్వీస్ చార్జ్) విధింపు ఎంతమాత్రం సమంజసం కాదని కేంద్ర వినిమయ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ బుధవారం స్పష్టం చేశారు. ఇలాంటి రుసుముల విధింపు అసమంజస వ్యాపార పద్దతి కిందకే వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి చార్జీని వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఇలాంటి చార్జీలు విధించిన హోటళ్లు, రెస్టారెంట్లపై న్యాయపరమైన చర్యలకు ప్రస్తుత చట్టాల నిబంధనలు ఏవీ వీలు కల్పించడంలేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
కొరుక్కుంటూ తాగండి
మనం కూల్ డ్రింక్స్ కూల్‌గా ఉండటానికి ఏం చేస్తాం..? ఆ డ్రింక్ ఉన్న గ్లాసుల్లో రెండు ఐస్ ముక్కలు వేసుకుంటాం. కానీ మీకెప్పుడైనా ఐస్ గ్లాసుల్లోనే డ్రింక్స్ తాగాలని, వాటిని అమాంతం కొరుక్కు తినాలనిపించిందా? అయితే... తప్పకుండా మీకీ గ్లాసులు నచ్చుతాయి. వీటి కోసం షాపులకు తిరగాల్సిన పని లేదు. మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే... ‘సూపర్ కూల్ ఐస్ షాట్-గ్లాస్ మోల్డ్ ట్రే’ అని కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇందులో నీళ్లు పోసి డీప్‌ఫ్రిజ్‌లో పెడితే చాలు. ఐస్ గ్లాసులు రెడీ అయిపోతాయి.. తర్వాత దాంట్లో మీకు నచ్చిన ఫ్రూట్ జూస్ లేదా డ్రింక్స్‌ను పోసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు.. ముందుగా ఆ ట్రేలో ఒక జూస్‌ను పోసి, అది గ్లాసుగా మారాక అందులో మరోరకం జూస్‌ను పోసుకొని కూడా తాగొచ్చు. దాంతో ఒకేసారి రెండు జూసులను కూల్‌గా టేస్ట్ చేయొచ్చు. అలాగే పిల్లలకు ఇష్టమైన చాక్లెట్ లిక్విడ్స్లాంటివి కూడా ఇందులో పోసుకోవచ్చు. -
ఆయుర్ ( ఆయుర్వేదం) కూల్...
సమ్మర్ స్పెషల్ ఆయుర్వేదం అన్నిరకాల ఆహార పదార్థాల గుణగణాల్ని, ప్రయోజనాల్ని... అవి మనపై చూపే ప్రభావాల్ని నిశితంగా పరిశీలించి వివరించింది. జీవనాధారమైన నీళ్లలోనే వర్షపునీరు, బావినీరు, తటాకజలం, నదీజలం, సముద్రజలం వంటివాటి మధ్య తేడాలు చెప్పింది. చెరకురసం, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దోస, రకరకాల ఫలాలు, వాటి రసాల ప్రయోజనాలను పేర్కొంది. వరి, గోధుమ, బార్లీలతో ద్రవాహారం ఎలా చేసుకోవాలో పేర్కొంది. పండ్లకు తోడుగా ఆహార దినుసులు, మూలికలూ, చక్కెర, పటికబెల్లం (మిశ్రీ), బెల్లం, నీరు మొదలైన వాటితో వివిధ పానీయాలు, పానకాలు (షర్బత్తులు) ఎలా చేసుకోవాలో చెప్పి, వేసవి తాపాన్ని ఎలా అధిగమించవచ్చో తెలియజేస్తుంది ఆయుర్వేదం. వాటిని చేసుకుందాం. వేసవి వేడిమిని జయిద్దాం. ఫల రస పానీయాలు ఈ కింద పేర్కొన్న పండ్లరసాలకు చక్కెర, ఏలకులు, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క వంటి ద్రవ్యాలను చేర్చుతారు. ఇలా వాటితో పాటు నిమ్మవంటి పానీయాలకు అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకుంటారు. (బత్తాయి వంటి వాటికి నీళ్లు కలపరు). ఇలా పలచగా, రుచికరంగా చేసుకునే ద్రవాహారాలను పానీయాలు అంటారు. ఇవన్నీ ఆకలిని కలిగించి, జీర్ణశక్తిని పెంచి, నీరసాన్ని తగ్గిస్తాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అవి... ద్రాక్ష: ఇది తాజాఫలాలన్నింట్లోనూ అత్యుత్తమమైంది. కించిత్ వగరుతో మధురంగా ఉండే ఫలమిది. శీతలం కలిగిస్తుంది. కళ్లకు మంచిది. మలమూత్రాలను సాఫీగా వచ్చేలా చేస్తుంది. నోటి చెడును తగ్గిస్తుంది. రక్తస్రావాలను అరికడుతుంది. సురాపానపు మత్తు (మదాత్యయము)ను/హ్యాంగోవర్‌ను తగ్గిస్తుంది. జ్వరం, దప్పిక, దగ్గు, ఆయాసం, గొంతునొప్పి, ఛాతీనొప్పి, నీరసాలను తగ్గిస్తుంది. దానిమ్మ (దాడిమ): ఇది తియ్యని రుచితో ఉన్నప్పుడు త్రిదోషశ్యామకమై, చలువ చేస్తుంది. పుల్లటి రుచితో ఉంటే వాతకఫాలను హరిస్తుంది. ఈ రెండూ కూడా రక్తవర్ధకాలే. రుచిని కలిగిస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. కదళీ (అరటి / మోచ ): ఇది బరువైన ఆహారం. చలువ చేసి పోషకవిలువలందించి బలాన్ని, పుష్టిని కలిగిస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. శుక్రవృద్ధిని కలగజేస్తుంది. ఉదరవాయువును, కొంచెం మలబంధాన్ని కలగజేస్తుంది. దప్పికను పోగొడుతుంది. మామిడి (ఆమ్ర): పచ్చి మామిడి: పచ్చిగా ఉన్నప్పుడు వగరు, పులుపు రుచులు కలిగి ఉంటుంది. వాతపిత్తశ్యామకం. ముదిరిన కాయ మిక్కిలి పుల్లగా ఉండి రక్తదోషాలను హరిస్తుంది. త్రిదోషాలనూ నివారిస్తుంది. పండు మామిడి: ఇది మధుర రసాన్ని కలిగి ఉంటుంది. చెట్టుకు పండినది కాస్త పులుపుతో ఉంటుంది. ముగ్గవేసింది చాలా తియ్యగా ఉండి చలవ చేసి, త్వరగా జీర్ణమవుతుంది. శుక్రవృద్ధికి తోడ్పడుతుంది. అగ్నిదీప్తికరం (ఆకలి పుడుతుంది). గమనిక: పుల్ల మామిళ్లు ఎక్కువగా తింటే అగ్నిమాంద్యం, విషమజ్వరాలు, రక్తవికారాలు, మలబంధం కలగజేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసం (జంబీర): పులుపు రుచితో ఉండి వాతకఫాలను దూరం చేస్తుంది. మలబంధాన్ని పోగొడుతుంది. అరుచి, అజీర్తి, దప్పిక, వాంతి, ఉదరశూలలను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. తయారు చేసే పద్ధతి: గ్లాసెడు నీళ్లలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచా నిమ్మ రసం, నాలుగు చెంచాల చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. తియ్య నిమ్మ, బత్తాయి (మిష్టనింబు): మధురంగా ఉంటుంది. విషహరం. సహజ, కృత్రిమ విషాలకు విరుగుడు. నీరసాన్ని తగ్గిస్తుంది. అరుచి, దప్పిక, వాంతులను దూరం చేస్తుంది. బలకరం. పుచ్చకాయ (కాలింద): దప్పిక తీరుస్తుంది. కఫవాతహరం. ఖర్బూజ (ఖర్జూజ దోస): మధురం. మల, మూత్రాలు సాఫీగా అయ్యేలా చేస్తుంది. చలువ చేస్తుంది. బలకరం. జీర్ణకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నేరేడు (జంబు): ఈ పండు చలవ చేస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. కఫ, పిత్త హరం. వాతకరం. కంఠానికి మంచిది కాదు. మాదీఫలం: దీని తొక్క చేదు, కారంగా ఉంటుంది. స్నిగ్ధం, వాతహరం. పండులోని గుజ్జు మధురంగా పోషకవిలువలతో ఉంటుంది. వాతకఫశ్యామకం. వీటి కేసరాలు నోరు పొడిబారడం, అరుచి, తేన్పులు, వాంతులు, దగ్గు, ఆయాసం, ఉదర రోగాలు, కడుపు నొప్పి, ఆకలిలేకుండటం, అజీర్తిని తగ్గిస్తాయి. రేగు (బదరీ): పెద్ద సైజు కాయను ‘సౌవీరం’ అంటారు. ఇది చలువ చేస్తుంది. విరేచనకారి, శుక్రకరం, శక్తివర్ధకం. చిన్నరేగు పండును ‘కోలము’ అంటారు. ఈ పండ్లు ఆకలిని కలిగించి, దప్పికను తగ్గించి, నీరసాన్ని పోగొడతాయి. లవలీ (రాచ ఉసిరిక): పండు మూత్రాశయంలోని రాళ్లను పోగొడుతుంది. అర్శమొలలు తగ్గిస్తుంది. రుచికరం. సహజ పానీయాలు నీళ్లు (అంబు / తోయ / ఉదకం / జలం) శరీరానికి తృప్తిని ఇచ్చే ప్రాణాధారం నీరు. దప్పికను తగ్గించి, అంతర్గత మాలిన్యాలన తొలగిస్తుంది. నీళ్లు తెలివితేటలను పెంచుతాయి, దేహాన్ని చల్లబరుస్తాయి. ‘‘జీవనం తర్పణం హృద్యం హ్లాది బుద్ధిప్రబోధనం, తను అవ్యక్తరసం మృష్టం శీతం లఘు అమృతోపమ్, గంగాంబు నాభసో... ’’ నీళ్లను రాత్రిపూట రాగి పాత్రలో పోసి మరుసటి దినం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా రాత్రి వెన్నెట్లో పెట్టిన నీరు కూడా తాగితే మంచిది. చల్లటి నీళ్ల ఉపయోగం: ఇవి తాగితే గ్లాని, శ్రమ, మూర్ఛ, వమనం, భ్రమ, శరీరంలో మంట తగ్గుతాయి. విషాలను హరిస్తుంది. రక్తస్రావం తగ్గుతుంది. ఉష్ణోదకం: వేణ్ణీళ్లు ఆకలిపుట్టించి, జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. కడుపులో వాయువులు తగ్గి ఉదరం తేలిక అవుతుంది. తేనె (మధు) శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. దప్పిక, తేన్పులను పోగొడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కఫహరం. రక్తస్రావం, ప్రేమేహం, అతిసారం, శ్వాస-కాస (దగ్గు)-చర్మరోగాలను పోగొడుతుంది. వ్రణరోపణాలు (గాయాలు) త్వరగా మానిపోయేలా చేస్తుంది. కొబ్బరి నీళ్లు (నారికేళోదకం) కొంచెం జిడ్డుగా, తియ్యగా ఉండి శరీరాన్ని తేలిక పరచి చలువచేస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి. దప్పికను పోగొడతాయి. మగవారిలో శుక్రకణాలను వృద్ధిచేస్తాయి. మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తాయి. ‘‘నారికేళోదకం స్నిగ్ధం స్వాదు వృష్యం హిమం లఘు,తృష్ణా పిత్తానిలహరం దీపనం వస్తిశోధకం’’కొబ్బరినీళ్లలో పొటాషియం లవణాలు ఎక్కువ. కొబ్బరి నీరు హై బీపీని నియంత్రిస్తుంది. అందువల్ల ఇది గుండె జబ్బుల వారికి మేలు చేస్తుంది. పాలు జిడ్డుగా తియ్యగా ఉండి సప్తధాతు వర్థకమైన ద్రవాహారం పాలు. శీతలకరం. ఆవుపాలు శ్రేష్ఠమైనవి. ‘‘ప్రాయః పయో అత్ర గవ్యంతు జీవనీయం రసాయనం, క్షతక్షీణహితం మేధ్యం బల్యం స్తన్యకరం సరం. శ్రమ భ్రమ మద అలక్ష్మీ శ్వాసకాస అతితృట్ క్షుధః జీర్ణ జ్వరం మూత్ర కృచ్ఛ్రం రక్తపిత్తంచ నాశయేత్’’ ప్రాణప్రదం, బలవర్ధకం ఓజోవర్ధకం, మేధావర్ధకం, దౌర్బల్యాన్ని పోగొడుతుంది. బాలింతలకు పాలుపడతాయి. అలసట, తలతిరుగుడు, ఆయాసం, దగ్గు, దప్పిక, ఆకలి, చిరకాల జ్వరాలను పోగొడుతాయి పాలు. రక్తస్రావాన్ని అరికడతాయి. మూత్రవిసర్జనలో ఇబ్బందులు, అవరోధాలను పోగొట్టి సాఫీగా అయ్యేలా చేస్తాయి. మజ్జిగ (తక్రం) ‘‘తక్రం లఘు కషాయామ్లం దీపనం కఫవాతజిత్, శోఫ, ఉదర, అర్మ, గ్రహణీ దోష, మూత్రగ్రహ, అరుచీఃగుల్మ ప్లీహ ఘృతవ్యాపత్ గరపాండు - ఆమయాన్జయేత్ తత్ వమనస్తు సరం, స్రోతః శోధి విష్టంభజిత్ లఘు’’ మజ్జిగ కొంచెం వగరుగా, తియ్యగా ఉండి... రుచినీ, ఆకలినీ కలిగిస్తుంది. పొట్ట ఉబ్బరం, శరీరంలోని వాపులు, మూలశంకలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం వంటపట్టనప్పుడు, మూత్రం సాఫీగా రానప్పుడు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. వాంతులు, రక్తహీనత, ప్లీహరోగాల్ని పోగొడుతుంది. రసాల: పెరుగును చిలికి మజ్జిగ చేసే సమయంలో అందులో చక్కెర, మిరియాల పొడి వంటివి కలిపితే దాన్ని ‘రసాల’ అంటారు. ఇది బలకరం, వీర్యవృద్ధి కలిగిస్తుంది. చేసుకునే పద్ధతి : పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి, కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగట్టి రోజూ రెండు మూడు సార్లు తాగాలి. చెరకు రసం (ఇక్షురసం): ఇది కొంచెం జిడ్డుగానూ, తియ్యగానూ ఉంటుంది. శరీరానికి చలవు చేస్తుంది. దేహశక్తిని పెంచి నీరసాన్ని తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. వృష్యం, కామోద్దీపనం. చెరుకుగడను బాగా నమలడం వల్ల వచ్చే రసాన్ని సేవించడం ఉత్తమం. అప్పుడు చెరకురసం సహజగుణాలు మారవు. యంత్రాలతో తీసిన రసం అంత శ్రేష్ఠం కాదు. ఇది కొన్ని మలినాలతో ఉంటుంది. యంత్రాలతో తీసిన చెరకురసంతో అరుగుదల కష్టమై, కడుపులో మంట కూడా కలగవచ్చు. మలబంధం కూడా కలిగే అవకాశం ఉంది. ‘‘మూలాగ్రజ జంతుజఘ్నాది పీడతాత్ మలసంకరాత్, కించిత్ కాలవిఘృత్యా చ వికృతిం యాతి యాంత్రికః...’’ ధాన్య పానీయాలు బార్లీ (యవలు): నీటితో వీటిని కలిపి, మరిగించి జావ కాసుకొని తాగవచ్చు. ఇవి బలకరం. చలువచేస్తాయి. ఉదరంలో వాయువును పోగొట్టి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. వృష్యమై కామోద్దీపన కలిగిస్తాయి. మూత్ర వికారాల్ని, ధాతు పరిణామ వికారాలల్లీ తగ్గిస్తాయి. దగ్గు, జలుబు, ఆయాసం, కంఠ, చర్మరోగాల్ని తగ్గిస్తాయి. త్రిదోషశ్యామకం. మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తాయి. ఒంట్లో వాపులు తగ్గిస్తాయి. వరి అన్నంతో చేసిన గంజి, ఇతర జావలు: బియ్యాన్ని శుభ్రం చేసి బాగా మెత్తగా ఉడికించి, పిసికి, జావలాగా తయారు చేయాలి. ఇది అతిచిక్కగా ఉంటే, దాన్ని కాంజికము (గంజి) అంటారు. దీన్ని చిక్కదనం తగ్గిస్తూ పల్చగా తయారుచేసుకుంటే దాన్ని ‘మండ, పేయ, వివేపి, యవాగు’ అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఇది ఆకలి పుట్టిస్తుంది. బలం కలిగిస్తుంది. పొట్టలోని వాయువును, దప్పికను తగ్గిస్తుంది. గోధుమ జావ: గోధుమరవ్వను (దలియా) జావగా కాసుకొని తాగవచ్చు. ఇది జిడ్డుగా, తియ్యగా ఉండి శరీరానికి చలవ చేస్తుంది. ధాతువర్ధకమై, బలస్థైర్యాలను పెంచుతుంది. జీవనీయం. వృష్యం (వీర్యవృద్ధిని కలిగిస్తుంది). లాజ (పేలాల పానీయం): ‘భృష్టానాం తండులాః లాజాః’ పేలాలను నీటిలో నానబెట్టి మెత్తగా పలుచగా చేసి తాగాలి. ఇది తేలికగా జీర్ణమై శరీరానికి చలువచేస్తుంది. దగ్గు, కఫం, దప్పిక, అతిసారం, మధుమేహాలను తగ్గిస్తుంది. ధాన్యాది హిమ ( ధనియాలతో చేసే పానీయం): ధనియాల పొడిని వేడినీళ్లలో కలిపి, రాత్రిపూట చంద్రకిరణాలు సోకేట్లుగా ఉంచి, మరుసటి దినం బాగా కలిపి వడగట్టాలి. ఈ పానీయం దప్పికనూ, మంటను తగ్గిస్తుంది. ఇతర పానీయాలు బాదం (వాతామ): స్నిగ్ధకరం, ఉష్ణకరం, వాతహరం. మృదురేచకం (మలవిసర్జన మృదువుగా అయ్యేలా చేస్తుంది). వీర్యవృద్ధికరం, కామోద్దీపకరం. దప్పికనూ, వికారాన్ని, దగ్గును తగ్గిస్తుంది. పుష్టికరం. బిల్వ (మారేడు) : ఇది బాగా పండినదైతే పొట్టలో వాయువుకు కారణమవుతుంది. కానీ కాయ ఆకలిని పుట్టిస్తుంది. అరుగుదలకు మంచిది. ఈ రెండూ కూడా విరేచనాలను తగ్గించి, మలబంధాన్ని కలగజేస్తాయి. ముళ్లదోస (త్రపుస): లేత కాయ అయితే దప్పిక, మంట, నీరసాలను పోగొడుతుంది. మధురరసం. చలువ చేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఇక గింజలు చలువ చేస్తాయి. మూత్రం సాఫీగా అయ్యేలా చూడటమేగాక, మూత్రసమయంలో వచ్చే మంటను తగ్గిస్తాయి. రక్తస్రావాన్ని అరికడతాయి. షడంగ పానీయం: చందనం (మంచి గంధం), ముస్తా (తుంగముస్తలు), ఉశీరం (వట్టివేళ్లు), ఉదీచ్య (కురువేరు), నాగర (శొంఠి), పర్పాటక... వీటన్నింటినీ దంచి కషాయంలా కాచుకోవాలి. ఈ కషాయాన్ని 30 మి.లీ. తీసుకొని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రీ) కలిపి రోజూ తాగాలి. సాధారణ జాగ్రత్తలు పిల్లలు వేసవి తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఆరు బయట ఆడుకుంటుంటారు. అందుకే వాళ్ల ఒంట్లోంచి లవణాలు బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాళ్లకు వేసవిలో కూల్‌డ్రింక్స్‌కు బదులు సహజ పానీయాలు ఇస్తుండాలి. బయట అమ్మే చెరకు రసం, సోడాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీముల జోలికిపోవద్దు పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహార మందుల ఉన్నాయేమో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్షపండ్ల మీద మనకు తెల్లగా పొరలా కనిపిస్తుంటే అది సహజత్వానికి భిన్నం. అలాంటి పండ్లను ఉప్పు కలిపిన నీళ్లలో రెండుమూడుసార్లు నానబెట్టి శుభ్రపరచుకోవాలి. పండ్లరసాలు తాగగానే వెంటనే వాటి దోషాలను నివారణగా (ముఖ్యంగా గొంతులో గరగర వంటివి) కొన్ని వేడినీళ్లు తాగాలి. అందులో చిటికెడు మిరియాల పొడి, శొంఠి పొడి కలిపితే ఇంకా మంచిది. పానీయ పరిమళాలు పానీయాలకు, ద్రవాహారాలకు రుచినీ, సువాసనలనూ (ఫ్లేవర్స్) సమకూర్చడానికి ఉపకరించడంతో పాటు... ఔషధగుణాలు సైతం కలిగి ఉన్న పదార్థాలివి... తులసీ (సురసా / గౌరీ) ‘‘తులసీ కటుకా తిక్త హృద్య ఉష్ణా దాహ పిత్త కృత్ దీపనీ కుష్ట కృచ్ఛ్రాస్ర పార్శ్వరుక్ కఫవాత జిత్ శుక్లా కృష్ణాచ తులసీ గుణైః తుల్యా ప్రకీర్తితా’’ తులసిలో ‘తెల్ల తులసి, నల్ల తులసి’ అని ప్రధానంగా రెండు రకాలుంటాయి. తులసి ఆకులు కలిపాక పానీయాలకు కాస్త చేదు, కారం రుచి వస్తుంది. ఆకలి పుట్టించే గుణం తులసికి ఉంటుంది. రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తుంది తులసి. మూత్రవిసర్జన సాఫీగా అయ్యేలా చూడటంతో పాటు చర్మరోగాలు, విషరోగాలను హరిస్తుంది. ఇది మధుమేహహరం (డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది). కరివేప (సురభినింబ): ఆకలిని పుట్టించి, జీర్ణశక్తిని పెంచుతుంది. తేన్పులు, కడుపు ఉబ్బరం,కడుపునొప్పి (ఉదరశూల), నీళ్లవిరేచనాలను తగ్గిస్తుంది. పచ్చకామెర్లు, రేచీకటి, శరీరం వాపులను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను నివారిస్తుంది. పుదీన (పూతిహా): అజీర్తినీ, కడుపు ఉబ్బరాన్నీ తగ్గిస్తుంది. గొంతునొప్పి, జలుబు, ఎక్కిళ్లు తగ్గుతాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. రుతుశూలను తగ్గిస్తుంది. అల్లం: ఇది ఘాటుగా ఉంటుంది. ఆకలిని పుట్టించి, అజీర్తిని తగ్గిస్తుంది. రక్తప్రసరణాన్ని పెంచుతుంది. గొంతునొప్పిని తగ్గిస్తుంది.శుంఠి (శొంఠి): అజీర్ణాన్ని తొలగించి, కడుపునొప్పి, ఉదరవాయువులను పోగొడుతుంది. దగ్గు ఆయాసం, వాంతి వికారాలు, కీళ్లనొప్పులు, అర్శమొలలను పోగొడుతుంది. సోంఫ్ / సోంపు ( మిసిః / సదాప): ఆకలిని పుట్టించి, జీర్ణక్రియను పెంచి, విరేచనాలన్ని సాఫీగా అయ్యేలా చేస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. కంటిచూపును పెంచుతుంది. మిరియాలు (మరిచ): కఫవాత హరం. శరీరంలోని కొవ్వులను తగ్గిస్తాయి. దగ్గు, ఆయాసం, కడుపునొప్పులను తగ్గించి, ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణక్రియను పెంచుతాయి.జీలకర్ర (జీరక): అరుచిని పోగొట్టి, ఆకలి పుట్టించి, జీర్ణప్రక్రియను పెంచుతుంది. ఉదరవాయువులను తొలగిస్తుంది. అతిసారహరం. జీలకర్రతో పొట్టలోని క్రిములు తొలగిపోతాయి.దనియాలు (ధాన్యకః): అరుచిని పోగొట్టి, ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణక్రియను వృద్ధి చేస్తాయి. దప్పిక, మంట, వాంతులను తగ్గిస్తాయి. దగ్గు ఆయాసాలను తొలగిస్తాయి. కడుపునొప్పి, నీళ్లవిరేచనాలను తగ్గిస్తాయి. బాగా నిద్రపట్టేలా చేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఇప్పుడు కూడా పారేస్తారా?!
వేసవి అప్పుడే దాడి చేస్తోంది. దాహంతో చంపేస్తోంది. దాన్ని చల్లార్చుకోవడానికి మన ఫ్రిజ్‌ని కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్‌తో నింపేస్తాం. ఆపైన వాటిని ఖాళీ చేస్తాం. ఆ తర్వాత ఖాళీ అయిన ఆ సీసాలను ఏం చేస్తాం? డస్ట్ బిన్లో వేస్తాం. అలా వేయడంలో గొప్పేముంది... అందరూ చేసేది అదేగా అనుకున్నారు కొంతమంది. వాటితో ఏం చేద్దామా అని చించీ చించీ కొన్ని కొత్త వస్తువులకు రూపకల్పన చేశారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిల్‌తో ఒకరు పెన్సిల్ స్టాండ్ చేస్తే, మరొకరు ఫ్లవర్‌వాజ్ చేశారు. ఇంకొకరు జ్యూయెలరీ స్టాండ్ తయారుచేస్తే... మరొకరు దాన్ని మధ్యకు కత్తిరించి, జిప్ పెట్టి, పౌచ్లా మార్చి పారేశారు. కొందరైతే వాటికి రంగులేసి తమ చిన్నారులకు ఆట వస్తువులుగా కూడా మార్చేశారు. సృజన ఉండాలే కానీ మన కంటికి ఏదీ పనికి రానిదిగా కనిపించదు. అందుకు ఇవే ఉదాహరణ. మీ ఇంట్లోనూ వాడేసిన ప్లాస్టిక్ సీసాలు ఉండి ఉంటాయి. వాటితో మీరేం చేయగలరో, ఇతర పనికిరాని వస్తువులతో కూడా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచించండిక! -
కూల్‌డ్రింక్ అనుకుని..
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాల మండలం పాండురంగాపురంలో చిన్నారులు కూల్‌డ్రింక్ అనుకుని ఇంట్లో ఉన్న పురుగుమందు తాగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలో ఓ రైతుకు ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు హిమజ, హేమశ్రీ ఉన్నారు. వారు మంగళవారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ బాటిల్లో కనిపించిన పురుగుమందు తాగారు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి ఇద్దరినీ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. -
‘టేస్టీ’ తలనొప్పి... ఐస్‌క్రీమ్ హెడేక్!
మెడి క్షనరీ ఐస్‌క్రీమ్ లాంటి చల్లటి పదార్థాలు తినగానే తలనొప్పి వస్తోందా? కూల్‌డ్రింక్స్ లాంటివి తాగగానే హెడేక్ మొదలవుతోందా? వైద్యపరిభాషలో ‘స్ఫినోపాలటైన్ గాంగ్లియోన్యూరాల్జియా’ అనే వ్యాధికి వాడుకలో ఉన్న పేరే ‘ఐస్‌క్రీమ్ హెడేక్’. కొంతమంది మైగ్రేన్ బాధితుల్లో కూడా ఈ తరహా తలనొప్పి కనిపిస్తుంటుంది. ఐస్ తగలగానే నోటిలోని ఖాళీస్థలాలలోకి తెరచుకునే రక్తనాళాలు సంకోచించండంతో, ఆ విషయాన్ని మెదడుకు తెలిపే నరం కూడా ప్రతిస్పందిస్తుంది. అలా నోట్లోని ఇబ్బందికరమైన పరిస్థితి తలకూ పాకుతుంది. ఇలా ఒకచోటి సమస్య మరోచోటికి పాకడాన్ని ‘రిఫరింగ్ పెయిన్’ అంటారు. నోటిలోని పైకప్పు అంటే... అంగిలిలోని నొప్పి ఇలా పాకడం వల్ల ఈ నొప్పిని కూడా రిఫరింగ్ పెయిన్ అంటారు. అయితే ఈ నొప్పి 20 సెకండ్ల నుంచి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాస్త గోరు వెచ్చని నీళ్లను పుక్కిలించగానే ఈ నొప్పి తగ్గిపోతుంది. కాస్తంత వేడిగా ఉండే గాలిని పీల్చినా నొప్పి తగ్గుతుంది. -
పానీయాల నావికుడు
లోకల్ బాల్యం గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. మీ ఊరి తిరునాళ్లకో లేదా జాతరకో వెళ్లండి ఒకసారి....ఎర్రటి ఎండలో తిరిగీ తిరిగీ, అలసిపోయి దాహం వేసినప్పుడు... నన్నారి బండి దగ్గరికో, పుదీన డ్రింక్స్ దగ్గరికో, ఎర్రై నిమ్మకాయ షర్బత్ బండి దగ్గరికో పరుగెత్తుకు వెళ్లి హాయి హాయిగా, తీయతీయగా దాహం తీర్చుకున్న జ్ఞాపకం... ఇప్పటికీ మీతో భద్రంగా ఉండే ఉంటుంది. ఊళ్లో ఉన్నా సరే.... ఏ దేశానికో వెడుతూ విమాన ప్రయాణంలో ఉన్నాసరే... యంబీఏ చదువుకున్న నీరజ్ కక్కర్.... ఆరోజు విమాన ప్రయాణంలో ఉన్నారు. ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి చేతిలో సరికొత్త ‘సట్టు డ్రింకు’ కనిపిస్తుంది. అది ‘పేపర్ బోట్’ అనే సంస్థకు చెందిన ఉత్పత్తి. నీరజ్ టీషర్ట్ మీద కనిపించిన ‘పేపర్ బోట్’ సంస్థ లోగోను చూసి ‘‘పేపర్ బోట్ వాళ్లు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారండీ’’ అని మెచ్చుకోలుగా మాట్లాడాడు ఆయన పక్కన కూర్చున్న బీహార్‌కు చెందిన న్యాయవాది. ‘సట్టు డ్రింక్’ను ఆ న్యాయవాది ఇష్టపడడం వెనుక ప్రధాన కారణం... అది తమ ప్రాంతానికే చెందిన ఇష్టమైన పానీయం కావడం. ఒక్క ‘సట్టు డ్రింకు’ అని మాత్రమే కాదు... ఆమ్స్,్ర ఆమ్పాన, జామున్ కల్కత్తా, ఇమిలీ కా ఆమ్లాన, రసం, తులసి, జింజర్, లెమన్ ఐస్ టీ... ఎలా ఎన్నో ప్రాంతాలకు చెందిన ఇష్టమైన పానీయాలను సరికొత్త రీతిలో ఉత్పతి చేస్తూ ప్రాచుర్యం పొందుతోంది ‘పేపర్ బోట్’. ఈ విజయం వెనుక ప్రధాన కారకుడు నీరజ్ కక్కర్. ఒకప్పుడు ఆయన కోకోకోలా కంపెనీలో ఉద్యోగి. విశేషమేమిటంటే తన స్నేహితులతో కలిసి నీరజ్ ఏర్పాటు చేసిన ‘పేపర్‌బోట్’ పానీయాల సంస్థ ప్రసిద్ధ కోకోకోలా, పెప్సిలాంటి భారీ పానీయాలతో పోటీ పడుతుండటం. మరిచిన పోయిన సంప్రదాయ పానియాలను ‘పేపర్‌బోట్’ మరోసారి గుర్తుకు తెస్తోంది మరి. ‘‘ఒకే ప్రాంతానికి పరిమితమై పానీయాలను జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయాలనే ఆలోచనలో భాగంగానే పేపర్బోట్ను ప్రారంభించాం. పేపర్‌బోట్ అనేది భౌగోళిక, చరిత్ర జ్ఞాపకాలతో మిళితమైన పానీయం’’ అంటున్నారు కక్కర్. బాల్య జ్ఞాపకాలకు బలమైన ప్రతీకగా నిలుస్తుందనే కారణంతో తమ పానీయాల ఉత్పత్తికి ‘పేపర్ బోట్’ అని నామకరణం చేశారు కక్కర్. ఎసిడిటీ కారకాలు దరి చేరకుండా ఈ సంప్రదాయ పానీయాలను తయారుచేశారు. ఢిల్లీ కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న ‘పేపర్ బోట్’ పానీయాలు కేవలం మన దేశంలోనే కాకుండా అమెరికా, యుఎయి, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా... మొదలైన దేశాల్లో అమ్ముడవుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పంపిణీ వ్యవస్థ బలంగా ఉండడం కూడా ‘పేపర్ బోట్’ విజయ రహస్యం. -
ఒక్క గుక్కకు... రెండు కిక్కులు!
పానీయాలు... ఎండ తీవ్రతను అధిగమించే ఉపాయాలెన్నో. గొడుగులు విప్పి అడుగులు ముందుకేస్తారు కొందరు. మడుగుల్లో దిగి ఈదులాడుతూ సేద దీరుతారు ఇంకొందరు. రుచీ పచీ లేని ఇలాంటి ఉపాయాలు మనకేల? ఎండకు మండే డ్యూటీ కొండలకు వదిలేసి... గ్లాసు నిండా పానీయాలను నింపుకునేలాంటివీ, నోటి నిండా రుచులను ఒంపుకునేలాంటివీ ప్లాన్ చేద్దాం. టెంప్టయిపోయి మగ్గును ఎంప్టీ చేసే ఈ ప్లాన్‌తో ఒక్క గుక్కకు రెండు కిక్కులు! మొదటిది వడదెబ్బకు, రెండోది రుచులు కోరే జిహ్వకు. జిహ్వకో రుచి అన్న సామెతను అబద్ధం చేస్తూ... షడ్రుచులకు ఒకటి తగ్గించి అచ్చంగా ఐదు రుచుల పానీయాలను ఏర్పాటు చేస్తున్నాం. నాల్కపై ఒక్కో చుక్క వేస్తూ ఎండను ఏడిపించండి. వడదెబ్బను ఓడించండి. పానీయాల స్విమ్మింగ్ పూల్‌లో నాల్కలను ఈదులాడిద్దాం రండి. ఆమ్ పన్నా కావలసినవి: పచ్చి మామిడికాయ - 1 (పెద్దది); జీలకర్ర పొడి - టేబుల్ స్పూను; నల్ల ఉప్పు - టీ స్పూను; పంచదార / బెల్లం - తగినంత; మిరియాలు - 4; పుదీనా ఆకులు - గుప్పెడు; చల్లటి నీళ్లు - తగినన్ని తయారీ: ఒక గిన్నెలో మామిడికాయ, మూడు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి బయటకు తీసి చల్లారాక మామిడికాయ తొక్క, టెంక వేరు చేసి, గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక గిన్నెలో ముప్పావు కప్పు నీళ్లు, పావు కప్పు పంచదార వేసి కరిగేవరకు ఉంచి, దించేసి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి. (బెల్లం వాడుతుంటే కప్పుడు బెల్లం తురుము, రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లం కరిగించి, వడపోయాలి. అలా చేయడం వల్ల తుక్కు వంటివి ఉంటే పోతాయి. ఆ తరువాత స్టౌ మీద ఉంచి పాకం చిక్కబడేవరకు సన్నని మంట మీద ఉంచి ఉడికించి, దించేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి సుమారు గంట తరువాత బయటకు తీయాలి. మామిడికాయలో ఉండే పులుపును బట్టి ఉపయోగించే పదార్థాల పరిమాణం పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేయాలి. మామిడికాయ మరీ పీచు ఉన్నదైతే రసం తయారుచేసుకున్నాక వడకట్టాలి) మిక్సీలో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పంచదార పాకం, పావు టీ స్పూను జీలకర్ర పొడి, పావు టీ స్పూను నల్ల ఉప్పు, మిరియాలు, పుదీనా ఆకులు వేసి మెత్తగా చేయాలి పావు కప్పు చల్లటి నీళ్లు జత చేసి, మరో మారు మిక్సీలో తిప్పాలి గ్లాసులలోకి పోసి చల్లగా అందించాలి. రాగి ఆల్మండ్ డ్రింక్ కావలసినవి: రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు - 10 +4 (వేయించి మెత్తగా పొడి చేయాలి); చల్లటి నీళ్లు - అర కప్పు; బెల్లం తురుము / డేట్స్ సిరప్- 3 టేబుల్ స్పూన్లు; చల్లటి పాలు - గ్లాసు తయారీ: ముందుగా కప్పు చల్లటి నీళ్లలో రాగిపిండి, బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి నాలుగు కప్పుల నీళ్లలో బె ల్లం తురుము వేసి స్టౌ మీద ఉంచి కరిగించాలి మంట తగ్గించి రాగి పిండి + బాదం పప్పుల నీళ్లు పోయాలి సుమారు రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మిశ్రమం చిక్కగా తయారవుతుంది మంట మీద నుంచి దింపి, చల్లారనివ్వాలి చల్లబడేసరికి మిశ్రమం బాగా చిక్కగా అవుతుంది చల్లటి పాలు జత చేసి గిలక్కొట్టాలి బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి కుకుంబర్ మింట్ స్మూతీ కావలసినవి: కీర దోసకాయ ముక్కలు - అర కప్పు (దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు గా తరగాలి); పుదీనా ఆకులు - 5; ఐస్ క్యూబ్స్ - కొన్ని; గట్టి పెరుగు - రెండు కప్పులు; నీళ్లు - కొద్దిగా; చాట్ మసాలా - చిటికెడు; నల్ల ఉప్పు - కొద్దిగా తయారీ: కీరదోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో పెరుగు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, టేబుల్ స్పూను నీళ్లు వేసి గిలక్కొట్టాలి కీరదోస + పుదీనా పేస్ట్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి గ్లాసులలో ఈ మిశ్రమం వేసి ఐస్ క్యూబ్స్ జత చేసి అందించాలి. ఐస్డ్ లెమన్ మింట్ టీ కావలసినవి: చల్లటి నీళ్లు - కప్పు; మామూలు నీళ్లు - ఒకటిన్నర కప్పులు; పంచదార / తేనె - 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; టీ బ్యాగ్ - ఒకటి; ఐస్ క్యూబ్స్ - కొద్దిగా; పుదీనా ఆకులు - 5; నిమ్మ చెక్కలు - 2 తయారీ ఒక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార జత చేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగించాలి కిందకు దించి, అందులో ఒక టీ బ్యాగ్ వేసి చల్లారే వరకు ఉంచాలి చల్లబడిన టీకి, చల్లటి నీళ్లు, నిమ్మరసం జత చేయాలి పుదీనా ఆకులను చేతితో గట్టిగా నలిపి మెత్తగా చేయాలి రెండు గ్లాసులు తీసుకుని, ఒక్కో గ్లాసులో పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ నిమ్మ చెక్క వేయాలి నిమ్మరసంతో తయారైన టీని గ్లాసులలో పోసి అందించాలి. స్పైసీ బటర్‌మిల్క్ కావలసినవి: మజ్జిగ - 4 గ్లాసులు (ఒక భాగం పెరుగు, 3 భాగాలు నీళ్లు పోసి చేయాలి); ఉప్పు - తగినంత; నిమ్మ రసం -2 టేబుల్ స్పూన్లు; నూనె - పావు టీ స్పూను; ఆవాలు - పావు టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; అల్లం తురుము - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 4 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కొత్తిమీర తరుగు - టీ స్పూను; నిమ్మ ఆకులు - 2 (చిన్న ముక్కలుగా చేయాలి) తయారీ: ఒక పాత్రలో మజ్జిగ, ఉప్పు, నిమ్మ రసం వేసి కవ్వంతో బాగా గిలక్కొట్టాలి స్టౌ మీద బాణలి ఉంచి నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొద్దిగా కరివేపాకు జత చేసి దించేయాలి మజ్జిగ ఉన్న పాత్రలో... వేయించి ఉంచుకున్న ఆవాలు, కరివేపాకు వేయాలి అల్లం తురుము, పచ్చిమిర్చి, నిమ్మ రసం వేసి గిలక్కొట్టాలి కొత్తిమీర, నిమ్మ ఆకులు వేసి గాజు గ్లాసులలో పోసి అందించాలి.