సెలబ్రిటీ సీక్రెట్‌: అద్భుతమైన వెయిట్‌ లాస్‌ డ్రింక్‌! | Celebrity beauty drinks for weight loss, glowing skin | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ సీక్రెట్‌: అద్భుతమైన వెయిట్‌ లాస్‌ డ్రింక్‌!

Published Sat, Feb 1 2025 5:11 PM | Last Updated on Sat, Feb 1 2025 5:25 PM

Celebrity beauty drinks for weight loss, glowing skin

పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్‌ జ్యూస్‌ను తీసుకుంటే బరువు తగ్గడమే కాదు బాడీ మొత్తం డిటాక్స్‌ కూడా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆ జ్యూస్‌ ఏంటీ..? దాన్ని ఎలా ప్రిపేర్‌ చేసుకోవాలి..? వంటి విషయాలపై ఓ లుక్కేసేద్దామా..

ముందుగా ఒక క్యారెట్, ఒక కీర  దోసలను తీసుకోవాలి. వాటికి చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అలాగే ఒక పియర్‌ పండును కూడా తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు బ్లెండర్‌ తీసుకుని అందులో కట్‌ చేసి పెట్టుకున్న క్యారెట్‌ ముక్కలు, కీరదోస ముక్కలు, పియర్‌ పండు ముక్కలు, గింజ తొలగించిన మూడు ఖర్జూరాలు, చిటికెడు పింక్‌ సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క ΄÷డి, ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్‌–కీర–పియర్‌ జ్యూస్‌ సిద్ధమైనట్లే. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల అందులో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ΄ోషకాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బాడీని డిటాక్స్‌ చేస్తాయి. అలాగే అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అతి ఆకలి సమస్యను దూరం చేస్తాయి. కాబట్టి, ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో.. వారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకునేందుకు  ప్రయత్నించండి.  

ఇదీ చదవండి: చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్‌ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర

 

Union Budget 2025 మఖానా ట్రెండింగ్‌ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement