celebrity
-
కేన్సర్‌ని జయించిన స్టార్లు వీరే..!
-
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్‌లుక్స్ వరకు ప్రతిదీ సూపర్‌గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్‌తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్‌కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు. అలా చాలామంది బ్రైడల్స్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, వారి ఫొటో షూట్స్‌కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్‌పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ స్టయిలింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్‌తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్‌కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండి -
సెలబ్రిటీ సీక్రెట్: అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్!
పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్‌ను తీసుకుంటే బరువు తగ్గడమే కాదు బాడీ మొత్తం డిటాక్స్ కూడా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆ జ్యూస్ ఏంటీ..? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..? వంటి విషయాలపై ఓ లుక్కేసేద్దామా..ముందుగా ఒక క్యారెట్, ఒక కీర దోసలను తీసుకోవాలి. వాటికి చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పియర్ పండును కూడా తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, పియర్ పండు ముక్కలు, గింజ తొలగించిన మూడు ఖర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క ΄÷డి, ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్–కీర–పియర్ జ్యూస్ సిద్ధమైనట్లే. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల అందులో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ΄ోషకాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బాడీని డిటాక్స్ చేస్తాయి. అలాగే అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అతి ఆకలి సమస్యను దూరం చేస్తాయి. కాబట్టి, ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో.. వారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇదీ చదవండి: చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర Union Budget 2025 మఖానా ట్రెండింగ్ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు! -
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
ఫ్యాషన్.. ప్రయాణం.. ఒరు పెన్!
అభిరుచినే వృత్తిగా చేసుకునే అవకాశం కొందరికే దొరుకుతుంది. ఆ కొందరిలో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ ప్రజన్య ఆనంద్‌ను చేర్చవచ్చు! అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలకు రూపం ఇస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను క్రియేట్ చేసుకున్న ఆమె గురించి..చెన్నైకి చెందిన ఒరు పెన్ (ఒక వనిత) ప్రజన్య. ఆమెకు ఫ్యాషన్ అన్నా, ప్రయాణాలు అన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన తోబుట్టువులకు, ఫ్రెండ్స్‌కి రకరకాల జడలువేసేది. మేకప్ చేసి వాళ్లను మురిపించి, తాను మురిసిపోయేది. ఊహ తెలిశాక ప్రయాణాల్లోని మజాను ఆస్వాదించసాగింది. కాలేజ్ డేస్ నుంచి సోలో ట్రావెల్‌ను స్టార్ట్ చేసింది. అలా ప్రయాణాల్లో తనకు పరిచయమైన కళలు, తెలుసుకున్న సంస్కృతి, కనిపించిన ఒరవడి అన్నిటితో స్ఫూర్తి పొంది సరికొత్త డిజైన్స్‌కు రూపమిచ్చేది. అప్పుడనుకుంది తన కాలింగ్ ఫ్యాషనే అని! సెకండ్ థాట్ లేకుండా పర్ల్ అకాడమీలో చేరింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర ఇంటర్న్‌గా జాయిన్ అయి పనిలో మెలకువలను నేర్చుకుంది. తర్వాత అవకాశాల వేట మొదలుపెట్టింది. నాలుగేళ్లు ఫ్యాషన్ ఇండస్ట్రీ కారిడార్లోనే గడిపింది. అవకాశాలను అందుకోవడం అంత సులువుకాదని గ్రహించింది. దాంతో దాన్నో సవాలుగా తీసుకుంది. ప్రతి అడ్డంకిని లక్ష్యానికి మెట్టుగా మార్చుకుంది. ఆ పట్టుదలకు చాన్స్‌లు చలించి.. ప్రజన్య చెంత చేరాయి. తన డిజైన్స్కున్న ప్రత్యేకతను చూపింది. కాస్ట్యూమ్స్‌లోనే కాదు జ్యూల్రీ, మేకప్, హెయిర్ స్టయిల్.. ఇలా స్టయిలింగ్కి సంబంధించిన ప్రతి రంగంలోనూ తనకున్న పట్టును ప్రదర్శించింది. నాలుగేళ్ల నిరీక్షణ విలువేంటో చాటింది. ‘ప్రజన్య’ పేరుతో లేబుల్నూ లాంచ్ చేసి, బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తన అద్భుతమైన డిజైన్స్‌తో ఐశ్వర్యా రాయ్, నయనతార, హృతిక్ రోషన్ల మెప్పు పొందింది. ఇంకెందరికో అభిమాన స్టయిలిస్ట్ అయింది. ‘డిజైన్డ్ స్టూడియో’ పేరుతో ఫ్యాషన్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వటమూ ప్రారంభించింది. ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్స్‌ను కూడా నిర్వహిస్తోంది ప్రజన్య. -
ద స్టయిల్ ఎలివేటర్
ఈశా అమీన్.. కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్! స్వస్థలం మంగళూరు అయినా ముంబైలో స్థిరపడిన కుటుంబం ఆమెది. ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఏర్పడుతున్న వయసులో ఫ్యాషన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తగ్గట్టుగానే నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. యూరోపియన్ ఎక్స్పోర్ట్ హౌస్‌లో డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అందులో పనిచేస్తున్నప్పుడే డిజైన్‌కి సంబంధించి పలు బ్రాండ్లతో సమావేశమవడానికి తరచుగా యూరప్‌కి ప్రయాణం చేసేది. ఆ సమయంలోనే వివిధ కంపెనీల యాడ్ షూట్స్నీ పర్యవేక్షించాల్సి వచ్చేది. అప్పుడే అక్కడ స్టయిలింగ్ ట్రెండ్‌ని గమనించి, అవసరమైనప్పుడు షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ కూడా చేసేది. దాంతో స్టయిలింగ్నీ కెరీర్‌గా మలచుకోవచ్చనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది. ఓ వైపు డిజైనర్‌గా పనిచేస్తూనే, వీలుచిక్కినప్పుడల్లా స్టయిలింగ్ ప్రాజెక్ట్స్నీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఆమె తొలిసారి స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీ.. స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా. ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం సానియాకు స్టయిలింగ్ చేసి గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దృష్టిలో పడింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పోటీదారులకు స్టయిలింగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఆ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే ఫిల్మ్‌ఫేర్, ఫోర్బ్స్, ఫెమినా, స్టార్‌డస్ట్, ఎగ్జిబిట్ లాంటి పత్రికల ముఖచిత్రాల మోడల్స్కీ కాస్ట్యూమ్ డిజైన్, స్టయిలింగ్ చేసే చాన్స్ దొరికింది. ఇక అక్కడి నుంచి ఈశాకు వెనక్కి మళ్లే అగత్యమే రాలేదు. ఆమె పనితీరుకు బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముచ్చటపడ్డాయి. సింగ్ ఈజ్ బ్లింగ్, ఆదత్, మణిదన్, బోగన్ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా ఆమెకు టైటిల్ కార్డ్ ఇచ్చాయి. ఇంకోవైపు ఎండార్స్మెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్, మ్యారేజ్ ఈవెంట్స్ కోసం సెలబ్రిటీలకు డ్రెస్ డిజైన్‌తో పాటు స్టయిలింగ్ చేసే అవకాశాలూ రాసాగాయి. హెవీ కాస్ట్యూమ్స్, ఊపిరి సలపని యాక్ససరీస్‌తో కాకుండా లైట్ వెయిట్.. కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, మినిమమ్ యాక్ససరీస్‌తో కంఫర్ట్‌గా ఉండే ఆమె డిజైన్స్ అండ్ స్టయిలింగ్కి బాలీవుడ్ తారలు ఇంప్రెస్ అయ్యారు. కరిశ్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, లారా దత్తా, బిపాశా బసు, చిత్రాంగదా సింగ్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసూజా, నీరజ్ చోప్రా, ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధవన్, అమీ జాక్సన్, పూజా హెగ్డే, కార్తిక్ ఆర్యన్, నర్గిస్ ఫఖ్రీ, కల్కి కొచ్లిన్, తమన్నా, రియా చక్రవర్తి, సంజనా సంఘీ, అనుప్రియా గోయెంకా, కరిశ్మా తన్నా లాంటి తారలు ఆమెను తమ డ్రెస్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. సెలబ్రిటీలకు ఈశా.. స్టయిలింగ్ చేసే కంటే ముందు వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్లకున్న ఇమేజ్‌ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత వాళ్ల శరీరాకృతి, కలర్ టోన్, వాళ్ల వైబ్.. సౌకర్యం వంటివన్నీ పరిశీలించి, తదనుగుణంగానే డ్రెస్ డిజైనింగ్ గానీ.. స్టయిలింగ్ గానీ చేస్తుంది. ఇంత ఎఫర్ట్ పెడుతుంది కాబట్టే సెలబ్రిటీల దృష్టిలో ఆమె పర్ఫెక్ట్ స్టయిలిస్ట్ అయింది. తన పనికి ప్రేరణ, స్ఫూర్తి ప్రయాణాలే అని చెబుతుంది. మహిళల కంఫర్ట్ వేర్ కోసం ‘ఈశా అమీన్’ పేరుతోనే ఒక లేబుల్‌ని లాంచ్ చేసింది. లగ్జరీ వెడ్డింగ్ స్టయిల్ కోసం ‘ద స్టయిల్ ఎలివేటర్’ అనే కన్సల్టెన్సీనీ స్థాపించింది. పెటా వీగన్ ఫ్యాషన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఏకైక ఇండియన్ స్టయిలిస్ట్‌గా గౌరవం దక్కించుకుంది.స్టయిల్ అంటే నా దృష్టిలో ఒక ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సెలబ్రిటీస్‌లో సైఫ్ అలీ ఖాన్‌కి స్టయిలింగ్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. ఆయనతో వర్క్ అంటే భలే సరదాగా ఉంటుంది. సైఫ్.. క్లాసియెస్ట్ అండ్ నైసెస్ట్ పర్సన్!– ఈశా అమీన్ -
స్టార్స్.. ఫిట్నెస్ ట్రైనర్స్..
ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం. అయితే సినిమా తారలకు సంబంధించి వ్యాయామ అవసరాలు విభిన్నం. ఆరోగ్యంతో పాటు వారు పోషించే పాత్రలు వ్యాయామ శైలులను, అంతేకాదు వ్యాయామ శిక్షకులనూ నిర్ధేశిస్తాయి. అందుకే అందరికీ శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తయితే.. సెలిబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం మరో ఎత్తు అంటారు స్టార్ ట్రైనర్స్. ఈ నేపథ్యంలో నగరంలో సెలబ్రిటీ ట్రైనర్స్‌గా పేరొందిన కొందరి పరిచయం.. నగరంలోని సెలబ్రిటీ ట్రైనర్‌గా పేరొందిన వారిలో ముందు వరుసలో ఉంటారు కుల్దీప్ సేథ్.. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన జిమ్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ‘చిరుత’నయుడైన రామ్ చరణ్ దాకా శిక్షణ ఇచ్చారాయన. విజయ్ దేవరకొండ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, అందాల ‘రాశి ఖన్నా’, రషి్మక.. తదితర తారలు ఎందరినో చెక్కిన శిల్పిగా పేరు తెచ్చుకున్నారు.సమంత..సత్తా.. అఖిల్‌కూ ఆయనే.. నటి సమంత తన ‘నాగిన్ మొబిలిటీ డ్యాన్స్’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు వర్కవుట్ వీడియో వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత శిక్షకుడు ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. అతని గురువు ముస్తఫా అహ్మద్‌ల ఆలోచనే ఇది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన జునైద్, స్పెషల్ వర్కవుట్ల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. ఆయన క్లయింట్లలో అఖిల్ అక్కినేని, మోడల్–డిజైనర్ శిల్పా రెడ్డి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.ఎన్టీఆర్‌కూ లాయిడ్.. సినిమా అవసరాలను బట్టి ట్రైనర్స్‌ని మార్చడం స్టార్స్‌కు తప్పనిసరి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని గిరిజన యోధుడిగా తన పాత్రకు తగిన టార్జాన్ లాంటి శరీరాకృతిని సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ లాయిడ్ స్టీవెన్స్‌నే ఎంచుకున్నాడు. అదే విధంగా తాజాగా రాజమౌళి సినిమా చేస్తున్న మహేష్ బాబు అందులోని పాత్రకు తగ్గట్టు తన రూపాన్ని మార్చుకోడానికి లాయిడ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో లాయిడ్ జాన్ అబ్రహం, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కి శిక్షణ ఇచ్చారు.మహేష్‌కి మినాష్.. ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ గత ఐదేళ్లుగా మహేష్ బాబుతో కలిసి పని చేస్తున్నాడు. ‘ఒకరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఒకరోజు కార్డియో ఇలా షూట్ ముగిసిన తర్వాత రోజూ సాయంత్రం పూట శిక్షణ ఉంటుంది’ అని మినాష్ అంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 60 నిమిషాల పాటు కఠినమైన కసరత్తులు చేసే మహేష్ సెట్లో, సెట్ వెలుపల కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అనీ, గాయాలతో పోరాడడం, వాటిని అధిగమించడం, అద్భుతమైన ఆకృతిని పొందడం..సాధ్యం. ప్రస్తుతం మహేష్ వయసు వెనక్కు వెళుతోంది’ అంటూ తన సూపర్‌స్టార్ స్టూడెంట్‌ని ప్రశంసిస్తారాయన.అనసూయ.. ఆర్జీవి.. అరవై ఏళ్లొచి్చనా ఇంకా ఫిట్‌గా కనిపించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఫిట్నెస్ శిక్షకునిగా పనిచేశారు విజయ్ గంధం. అలాగే యాంకర్, నటి అనసూయ, నాగేంద్రబాబు.. తదితరులకూ శిక్షణ అందించారు. ‘ఇప్పుడు నటీనటులకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు సైతం ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన, ఆసక్తి ఏర్పడింది. క్రమశిక్షణతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు’ అంటారు విజయ్ గంధం. గత కొంత కాలంగా అనేక అగ్రస్థాయి బ్రాండెడ్ జిమ్స్‌లో ట్రైనర్‌గా పనిచేసిన విజయ్.. టాలీవుడ్ తారలు మాత్రమే కాకుండా నగరంలో పలువురు వ్యాపార ప్రముఖులకూ ట్రైనర్‌గా పేరొందారు.వారి ఆసక్తినిబట్టే.. ‘తెరపై తారలు పోషించాల్సిన పాత్రలు, వారి ఇష్టాలు, శరీర తీరుతెన్నులకు అనుగుణంగా వర్కవుట్లను సృష్టించడానికి ఇష్టపడతాను, ఉదాహరణకు హీరో అఖిల్ అక్కినేని క్రీడా అభిమాని. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన వర్కవుట్లు చాలా వరకూ క్రీడల చుట్టూ డిజైన్ చేశా. అదే విధంగా కొందరికి సైక్లింగ్, బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. నేను అలాంటి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. వ్యాయామం సరదాగా ఉండాలి తప్ప బాధపెట్టకూడదు. సమంత చూడడానికి సున్నితంగా కనిపిస్తుంది. కానీ వర్కవుట్ చేసే టైమ్‌లో బలమైన శక్తిగా మారుతుంది. అందుకే ఆమె నా ఫేవరెట్ క్లయింట్.’ – జునైద్ షేక్, ఫిట్నెస్ ట్రైనర్ -
Rashmita Thapa: సింపుల్ సిగ్నేచర్
రశ్మితా పుట్టి పెరిగిందంతా ముంబైలోనే! సినిమాలు అంటే పిచ్చి! వారానికో సినిమా చూసి అందులోని హీరోయిన్ స్టయిలింగ్‌ను కాపీ చేసేది. అలా గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీదున్న ఆసక్తితో డిగ్రీ చదువుతుండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత గ్రహించింది తన అసలు ఆసక్తి స్టయిల్ని కాపీ చేయడంలో కాదు క్రియేట్ చేయడంలో అని! అందుకే చదువుతున్న డిగ్రీకి గుడ్ బై చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేరింది. ఆ కోర్స్ పూర్తయిన తర్వాత పలు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పనిచేసింది. స్టయిలింగ్‌లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల వద్ద ఇంటర్న్‌గా చేరింది. ఆమె పరిశీలన, పనితీరుకు చాలామంది సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యి, ఆమెను స్టయిలిస్ట్‌గా పెట్టుకున్నారు. వారిలో శ్రీలీల, రీతూ వర్మ, లావణ్యా త్రిపాఠీ, నేహా శెట్టీ, నిధీ అగర్వాల్, చాందినీ చౌదరి, రుహానా శర్మ, నభా నటేశ్, ఆకాంక్షా సింగ్, అనుపమా పరమేశ్వరన్, కీర్తీ సురేష్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, అవికా గోర్, సోనాల్ చౌహాన్ కూడా ఉన్నారు. రశ్మితా స్టయిలింగ్ మంత్ర.. సింపుల్ అండ్ కంఫర్ట్! దానివల్లే ఎందరో సెలబ్రిటీలకు ఆమె ఫేవరట్ స్టయిలిస్ట్ అయింది. క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్ల దాకా.. సందర్భానికి తగ్గట్టు సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేసి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలబెడుతుంది. అందుకే ఆమెకు ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఫ్యాన్సే! వాళ్లలో అల్లు శిరీష్ ముందుంటాడు. తర్వాత విజయ్ దేవరకొండ. ఆ ఇద్దరికీ రశ్మితానే స్టయిలింగ్ చేస్తోంది. తన క్రియేటివ్ జీల్‌తో ఫ్యాషన్ వ్లాగ్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీ సంపాదించింది. వీటితోపాటు అప్పుడప్పుడు మోడల్‌గానూ మెరుస్తోంది. -
సిగకారుడు.. సావియో జాన్ పరేరా
సావియో జాన్ పరేరా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెయిర్ స్టయిలిస్ట్. బాలీవుడ్ స్టార్స్, స్పోర్ట్స్ లెజెండ్స్ జుట్టు ఆయన చేతుల్లోనే ఉంటుంది. సినిమా ప్రమోషన్, అవార్డ్ ఫంక్షన్, రెడ్ కార్పెట్ వాక్.. ఏ ఈవెంట్‌కైనా.. సావియో వచ్చి సెలబ్రిటీల కొప్పు ముడిస్తేనే వాళ్లు గడప దాటేది! అంతెందుకు ఇంగ్లిష్ యాక్ట్రెస్ లిజ్ హార్లీ.. తన పెళ్లిలో కేశాలంకరణకు ఏరికోరి మరీ సావియో జాన్నే అపాయింట్ చేసుకుంది! అదీ ఈ ముంబై వాసి రెప్యుటేషన్!!హెయిర్ డ్రెసింగ్‌లో సావియోది దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హెయిర్ డ్రెసర్స్, హెయిర్ స్టయిలిస్ట్‌లు అందరి దగ్గరా శిక్షణ పొంది వచ్చాడు. నైపుణ్యం సాధించాడు. హెయిర్ సెలూన్స్ పెట్టాడు. ఫ్యాషన్ షోస్‌కి, అడ్వర్టయిజ్మెంట్ క్యాంపెయిన్స్కి, ఎల్, వోగ్, హార్పర్స్ బజార్, కాస్మోపాలిటన్ లాంటి మేగజీన్స్ ఫొటో షూట్స్‌కి పనిచేశాడు. బాంబే టైమ్స్, హిందుస్తాన్ టైమ్స్, మిడ్–డే, ముంబై మిర్రర్, సినీ బ్లిట్జ్ వంటి పత్రికలకు కాలమ్స్ రాస్తుంటాడు. జూమ్, ఎన్డీటీవీ గుడ్ టైమ్స్ వంటి చానల్స్కీ పానలిస్ట్గా ఉన్నాడు. ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లకు జడ్జిగా వ్యవహరించాడు. ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు హెయిర్ డ్రెసర్‌గా పనిచేశాడు. ప్రియంకా చోప్రా, ప్రీతి జింటా, కంగనా రనౌత్, సోనాక్షీ సిన్హా, శిల్పా శెట్టీ, నేహా ధూపియా, అదితీరావ్ హైదరీ, డింపుల్ కపాడియా, మేరీ కోమ్, ఇంతియాజ్ అలీ, యువరాజ్ సింగ్ లాంటి సెలబ్రిటీలకు పర్సనల్ హెయిర్ డ్రెసర్‌గా ఉన్నాడు. హెయిర్ డ్రెసింగ్‌లో మెలకువలు సంపాదించుకోవాలనుకునేవాళ్ల కోసం ‘సావియో జాన్ పరేరా.. ది అకాడమీ’నీ నెలకొల్పాడు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో గెలుచుకున్నాడు.‘నాకు పనే దైవం. అందులో నిత్యం ఏదో కొత్తదనాన్ని చూపించడానికి ఇష్టపడతాను. నా క్లయింట్స్ కాన్ఫిడెన్స్‌ను పెంచే స్టయిల్స్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటా. స్టయిల్ అనేది వ్యక్తిగతం. పరిశీలన, మెలకువలతో ఎవరికివారే తమదైన సిగ్నేచర్ స్టయిల్ని క్రియేట్ చేసుకోవాలి. అలాంటి సృజనకు ఆకాశం కూడా హద్దు కాదు. స్టయిల్ అనేది ఒక ఐడెంటిటీ. అది వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది’ అంటాడు సావియో జాన్ పరేరా. -
Aanchal Morwan: సిగ ధగ నైపుణ్యం
ఒత్తయిన తలకట్టుతోనే అందం, ఆకర్షణ! ఆరోగ్యకరమైన జుట్టుంటే ఎన్ని సోకులైనా పోవచ్చు!అలా సెలబ్రిటీల హెయిర్‌ని హెల్దీగా ఉంచుతూ .. ఆన్‌స్క్రీన్ పాత్రలకు తగ్గట్టు, ఆఫ్ స్క్రీన్ వేడుకలకు సూట్ అయ్యేట్టు కేశాలను అలంకరిస్తూ, తారల మీద నుంచి తల తిప్పుకోనివ్వకుండా చేసేది హెయిర్ స్టయిలిస్ట్లే! ఆ లిస్ట్‌లో.. బాలీవుడ్ జపించే పేరు ఆంచల్ మోర్వానీ!ఇన్‌స్టా హ్యాండిల్ ‘హాట్ హెయిర్ బెలూన్’తో ప్రసిద్ధి!జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కృతి సనన్, దీపికా పదుకోణ్, తృప్తి డిమ్రీ, నోరా ఫతే, కియారా ఆడ్వాణీ, సుహానా ఖాన్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, డయానా పెంటీ, శనాయా కపూర్, దిశా పాట్నీ, మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్నా, మిథిలా పాల్కర్, యామీ గౌతమ్, అమలా పాల్, చిత్రాంగదా సింగ్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రా, స్వరా భాస్కర్, రియా కపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందో! ఆమె చేతికి జుట్టిచ్చి.. అందాన్ని తురుముకునే సెలబ్రిటీలు! నటీమణులే కాదు మోడల్స్ కూడా ఆంచల్ చేత జుట్టు ముడిపించుకోవాలని ఆరాటపడుతుంటారు. సిల్వర్ స్క్రీన్, ర్యాంప్‌ల మీదే కాదు ఫొటో షూట్స్, రెడ్ కార్పెట్ వాక్స్, సినిమా ఈవెంట్స్, పార్టీలకూ ఆంచల్ చేసిన హెయిర్ స్టయిల్‌తోనే హాజరవుతుంటారు. సినిమా లోకానికి అవతల కూడా ఆంచల్ హెయిర్ స్టయిలింగ్కి అశేష అభిమానగణం ఉంది. పండుగలు, బర్త్‌డేలు, పెళ్లిళ్లు, పురుళ్లు ఇలా ప్రతి సందర్భానికీ ఆమె హెయిర్ స్టయిల్ని కోరుకునేవారున్నారు. ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముంబై వాసి ఈ రంగంలోకి ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..‘నాకు చిన్నప్పటి నుంచీ రకరకాల జడలు వేయడమన్నా, వేయించుకోవడమన్నా చాలా ఇష్టం. క్లాస్‌లో నా ముందు కూర్చున్న ఫ్రెండ్స్‌కి జడలు వేసి టీచర్‌తో తిట్లు తినేదాన్ని. ఇంట్లో కూడా అమ్మ, నానమ్మ, అత్త, పిన్ని, కజిన్స్.. అందరినీ రకరకాల హెయిర్ స్టయిల్స్‌తో ముస్తాబు చేసేదాన్ని. నా ఈ కళకు మా అమ్మ తెగ మురిసిపోయేది. హెయిర్ స్టయిల్స్లోనే కాదు కుట్లు, అల్లికలు, పెయింటింగ్‌లో కూడా ఫస్ట్ ఉండేదాన్ని. అయితే హెయిర్ స్టయిలిస్ట్‌ను అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అసలు దాన్నో కెరీర్‌గా తీసుకుంటారనీ తెలియదప్పుడు. అందుకే ఏంబీఏ అయిపోగానే ఒక అడ్వర్టయిజ్మెంట్ కంపెనీలో చేరాను. కానీ జాబ్ శాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో మిస్ అవుతున్న భావన. దాన్ని వదిలేసి మా సొంత సంస్థలో కొంతకాలం మార్కెటింగ్ జాబ్ చేశాను. అదీ నచ్చలేదు. క్రియేటివ్ వర్క్ మీదకే పోయేది మనసు. అప్పుడు గ్రహించాను హెయిర్ స్టయిలింగే నా కాలింగ్ అని. దాని మీద రీసర్చ్ చేస్తే తెలిసింది దానికోసం స్పెషల్ కోర్సులున్నాయని. అంతే పేరెంట్స్‌కి చెప్పి లండన్ వెళ్లాను. అక్కడ Vida Sassoon Academyలో చేరాను. దాని తర్వాత అక్కడే స్టయిలింగ్కి సంబంధించే మరో రెండు కోర్సులు చేసి, ఇండియా వచ్చేశా. ఈ రంగంలో అవకాశాలైతే కనపడ్డాయి కానీ మొదట్లో కొంత స్ట్రగుల్ తప్పలేదు. భయపడలేదు. నా విద్యనే నమ్ముకున్నాను. వమ్ము చేయలేదు. ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడలేదు. నచ్చిన పని ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు’ అని చెబుతుంది ఆంచల్. బాలీవుడ్లో పనిచేస్తూనే, ‘హాట్ హెయిర్ బెలూన్’ పేరుతో ఇన్‌స్టాలో జుట్టు సంరక్షణకు సంబంధించిన టిప్స్ ఇస్తోంది. హెయిర్ కేర్ ట్యుటోరియల్స్ కూడా నిర్వహిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇన్‌స్టాలో ఆమెకు అసంఖ్యాకమైన ఫాలోయింగ్ ఉంది. ‘మనలో ఎంత క్రియేటివిటీ ఉన్నా దానికి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. అది మన సృజనను సానబెడుతుంది’ అంటూ ఔత్సాహిక హెయిర్ స్టయిలిస్ట్లకు సలహా ఇస్తుంది ఆంచల్ మోర్వానీ. -
Shree Naval Kishori: పద్ధతిగా పాపులర్ అయ్యింది
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదిప్పుడు. అందుకే రోటీన్‌కు భిన్నంగా ఆలోచన చేస్తున్నారు కొందరు. అయితే.. తన గాత్రానికి హవభావాల్ని జోడిస్తూ భక్తిరసాన్ని వొలికిస్తూ .. పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ నవల్ కిషోరీ Shree Naval Kishori. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఈ అమ్మాయి.. గత ఏడాది జూన్‌లో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది. సంప్రదాయ దుస్తులు.. నుదట నామాలు ధరించి భక్తి పాటలే ప్రధానంగా ఆమె వీడియోలు చేస్తోంది. అలా ఏడాది తిరగకముందే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్, ఇతరత్రా ఫ్లాట్‌ఫామ్స్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. మ్యూజికల్ యాప్స్‌తోనూ అలరిస్తోంది. నార్త్-సౌత్ తేడా లేకుండా.. అన్ని ప్రాంతాల నుంచి నెటిజన్లు ఈ యంగ్ డివోషనల్ సింగర్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఉదయం నుంచి ఆమె అప్లోడ్ చేసే ప్రతీ వీడియోకు లక్షల్లో లైకులు, వ్యూస్. శ్రీ నవల్ క్రేజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. తనను అనుసరిస్తూ అనుకరించి వీడియోలు చేస్తున్న వాళ్లను సైతం ఆమె ఎంకరేజ్ చేస్తుండడం విశేషం. -
సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే..
పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో కచ్చితంగా అమ్మాయిల చేతికి ఉండేది మెహిందీ. ఇది లేకుంటే పండుగే లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొందరూ మాత్రం ఈ రంగంలో మంచి అందె వేసిన చేయిలా నైపుణ్యం సంపాదిస్తున్నారు. సెలబ్రెటీ స్థాయి మెహిందీ డిజైనర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు వీణ నగ్దా. ఆమె ముంబైలో ప్రముఖ మెహిందీ డిజైనర్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు గాంచారుఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు అభిమానులు. తన సృజనాత్మకతో కూడిన కళా నైపుణ్యంతో వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు వీణా. ఆమె వేసే మెహిందీ డిజైన్లు అన్ని చాలా క్లిష్టమైనవే. అదే ఆమె ప్రత్యేకత. మరొకరు అనుకరించడం కూడా కష్టమే. ప్రతీ డిజైన్‌ను విభిన్న కళానైపుణ్యంతో వేస్తారామె. అంతేగాదు ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వివాహ వేడుకలో కూడా ఆమెనే మెహిందీ డిజైనర్. ముఖేష్, నీతా అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆ వేడుకకు హాజరైన అతిధులకు మెహందీలు పెట్టే బాధ్యత ఈమెదే. అయితే ఇలా డిజైన్ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేస్తారట. సాధారణంగా ఒక్కో డిజైన్‌కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ మెహిందీ ప్రారంభ డిజైనే ఏకంగా రూ. 5,500 నుంచి మొదలవుతుందట. దీపిక పడుకోన్-రణవీర్ సింగ్, కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ వంటి ప్రముఖల వివాహాల్లో మెహిందీ డిజైనర్ వీణ నగ్దానే. ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకలో ఆమె కచ్చితంగా ఉంటారు. వీణ మెహిందీ డిజైన్లలోని మ్యాజిక్ అలాంటిది మరి. -
సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో చేతులు కలిపింది. ’భారత్‌లో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్‌లా జీవించండి’ స్లోగన్‌తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్ చేస్తోంది. తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌బీఎన్‌బీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్సన్ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్‌లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్టీఫెన్సన్ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్‌లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు. -
అంబానీకి కాబోయే కోడలితో డ్యాన్సులు, ఫోటోలు.. ఎవరీ వ్యక్తి?
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓరీ.. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. తారలు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఇతడు బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్లో ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ వాలిపోతాడు. వారిపై చేయి వేసి ఫోటో దిగుతుంటాడు. అలా అతడు చేయి ఆనిస్తే అవతలి వారి వయసు తగ్గిపోయినట్లు ఫీల్ అవుతారట! ఎవరీ ఓరీ.. ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, స్టైలిష్‌గా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్‌బాల్ కూడా ఆడతాను. పార్టీలో ఫోటోలు దిగితే.. నా దృష్టిలో జీవితమంటే కలలు కనడం.. ఆ కలల్లో విహరించడం.. వాటిని సాకారం చేసుకునేందుకు దొరికిన అవకాశాన్ని వాడుకోవడం' అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అది సరే.. ఇంతకీ ఎంత సంపాదిస్తాడు? అనుకుంటున్నారా? స్టార్ హీరోహీరోయిన్లకన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. జస్ట్ ఒక్క పార్టీకి వెళ్లి అక్కడున్నవారితో ఫోటోలు దిగితే చాలు.. రూ.20-30 లక్షలు ఇస్తారట! ఓరీయే ఈ విషయం చెప్పాడు. తింటాడు, కానీ బిల్లు కట్టడు ఇతడికి ఐదుగురు మేనేజర్లు ఉన్నారు. ఇద్దరు సోషల్ మీడియా మేనేజర్స్, ఒక పీఆర్ మేనేజర్, అన్ని బ్రాండ్లు చూసుకోవడానికి ఓ మేనేజర్, తను ఏం తింటున్నాడో చూసేందుకో మేనేజర్ ఉన్నారు. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్తే కూడా ఎంచక్కా కావాల్సింది తినేసి బిల్లు కట్టకుండా దానికి బదులు సెల్ఫీ ఇచ్చి వెళ్లిపోతాడట! ఈ మధ్య అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లోనూ తెగ హడావుడి చేశాడు. అనంత్‌కు కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి దాండియా ఆడాడు. ఫోటోలు దిగాడు. ఆ సెలబ్రేషన్స్‌కు వచ్చిన పాప్ సింగర్ రిహాన్నాతో కలిసి ఫోటోలు క్లిక్‌మనిపించాడు. తన ఇయర్ రింగ్స్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) #orry and #RadhikaMerchant wonderful garba dance #AnantRadhikaWedding pic.twitter.com/wBrVupiH9W — Media Buzz (@brain_bursts_) March 13, 2024 చదవండి: టాలీవుడ్ లేడీ విలన్ అరెస్ట్? నటి ఏమందంటే? -
కేసీఆర్‌కు ప్రముఖుల పరామర్శ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుధవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సినీ నటుడు నాగార్జున ఉన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. -
కలల సౌధాన్ని డిజైన్ చేస్తాను!
‘ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఇంటి యజమానిప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ ఇంటి డిజైనింగ్ ఉండాలి. వారి కలల సౌధాన్ని కళ్ల ముందు నిలపడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని తన గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి వివరించారు ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రోఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్త. 48 ఏళ్ల షబ్నమ్ గుప్త 16 ఏళ్ల వయసు నుంచే ఈ రంగంలోకి వచ్చానని వివరించింది. ఆమె డిజైన్స్ సెలబ్రిటీల ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అపార్ట్మెంట్లు, ఫామ్‌హౌజ్‌లు, హాస్పిటల్స్ నుంచి మట్టితో కట్టిన చిన్న రూమ్‌లను కూడా తన విలక్షణమైన శైలితో ఆవిష్కరిస్తుంటారు. తనే ఇన్నేళ్ల ప్రయాణం గురించి షబ్నమ్ వివరిస్తూ.. ‘‘నా జీవితంలో అత్యంత ప్రభావాన్ని కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మానాన్నలు, మా వారు. వాళ్లతో చేసే చర్చలు నాలో ఇంకా స్థిరత్వానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్లే నా వర్క్‌లో మొదటి అతిపెద్ద విమర్శకులు. దేనినీ త్వరగా మెచ్చుకోరు. వాళ్లను మెప్పించడం అంటే నేను సూపర్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను. అంతగా నా వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతాను. మొదటిసారి మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నేను చాలా ఆసక్తి కనబరిచాను. చాలా మార్పులు, చేర్పులు చేశాను. నాన్నగారు కూడా నా సూచనలను చాలా బాగా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాను. ముంబయ్ ర హేజా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కోర్స్ పూర్తి చేసుకున్నాక సొంతంగాప్రాక్టీస్ మొదలు పెట్టాను. దీనికి ముందు ప్రముఖ ఆర్కిటెక్ట్ తుషార్ దేశాయ్‌తో కలిసి పనిచేయడం ద్వారా డిజైనింగ్‌లో చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫిల్మ్ప్రోడక్షన్ హౌజ్‌లో ఒక చిన్న పనితో నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి నా సొంత లేబుల్ పెరుగుతూ వచ్చింది. నా ఖాతాలో ఆదిత్యా చోప్రా, రాణీ ముఖర్జీ, పరిణీతి చోప్రా.. వంటి చాలా మంది బాలీవుడ్ తారల ఇళ్లు, మీడియా హోజ్లు, హాస్పిటల్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి. టీమ్ వర్క్.. డిజైనింగ్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలకు స్పేస్ ఉంటుంది. ఇందులో ప్రకృతి, మన సంప్రదాయం, కళలు అన్నింటినుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ డిజైనింగ్‌లో ప్రకృతితో మనకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఏ ఒక్కరి జీవిత ప్రయాణం మరొకరితో పోల్చలేం. చాలామంది విజయాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం చేసే పనిలో సంతృప్తి పొందితే చాలు. మిగతా ట్యాగ్లు ఏవీ అక్కర్లేదు. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను కూడా. ఇప్పటివరకు నా ప్రయాణం ప్రశాంతతను నేర్పింది. చాలా మందితో కలిసి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానవ సంబంధాలను తెలుసుకునే వీలుంటుంది. మా టీమ్‌తో పనిచేసే సమయంలో చాలా జోవియల్‌గా ఉంటాను. ఎలా అంటే ఒక మానసిక వైద్యుడిలా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటంతో పనిప్రదేశంలో ఉల్లాసంగా ఉంటాం. పట్టణ, నగర వాసాల నుంచి, గ్రామీణ ఇండ్ల వరకు డిజైన్ చేసినవన్నీ నా జాబితాలో ఉన్నాయి. ఈ రంగంలో మన చేత వర్క్ చేయించుకునేవారితో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ముఖ్యం. అలాగే, వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇదే ఇన్నేళ్ల నా ప్రయాణంలో సాధించిన విజయం అనుకుంటాను. ప్రతిదీ సాధనే.. ఆర్కిటెక్చర్లో భాగంగా దేశమంతా తిరిగాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్ప్రాధాన్యమున్న స్థలాలన్నీ సందర్శించాను. అవగాహన చేసుకున్నాను. విదేశాల్లోని కట్టడాలు, ఇంటీరియర్ వర్క్ చూస్తూ ప్రయాణించడంతో ప్రతిదానినీ అర్ధం చేసుకుంటూ, ఇంకాస్త మెరుగైన పనితనాన్ని నా వర్క్‌లో చూపించడం ఎప్పటికప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రోజు ఇంకో రోజుతో పోల్చలేం. చేయాలనుకున్న పనుల జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లడమే. మొదట్లో గందరగోళంగా ఉండేది. తర్వాత ఏ రోజు పనులు ఆ రోజు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నా జీవనశైలిలో నా మైండ్ స్పేస్‌ను అర్థం చేసుకోవడం చాలా సవాల్‌గా ఉండేది. జీవితంలో ఏదైనా రూపొందించాలనుకున్నప్పుడు అదొకప్రాక్టీస్గా ఉండాలి. క్లయింట్స్ ఇళ్లను డిజైన్ చేయడంలో నా స్కిల్‌ని మాత్రమే చూపించాలి. ఇదీ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమే. ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆర్కిటెక్ట్‌గా ఎక్కువ సమయం సిమెంట్, దుమ్ము కొట్టుకుపోయి పనిలో గడిచిపోతుంటుంది. అయినా నాకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటాను. ప్రయాణాలు నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది ఎల్లప్పుడూ నన్ను పునరుజ్జీవింపజేస్తుంది. చాలాసార్లు పని నుంచి రిలాక్స్ అవడానికి టూర్స్‌ని ఎంచుకుంటుంటాను. వందల ఇళ్లు డిజైన్ చేసి ఉంటాను. ఎన్నో అవార్డులు ఈ రంగంలో అందుకున్నాను. కానీ, నా ఇంట్లో ఏది ఎలా ఉండాలనే నియమం లేదు. అక్కడంతా నా పిల్లల ఇష్టమే. ఎందుకంటే వారి దగ్గర నేను తల్లిని మాత్రమే. భవిష్యత్తు తరాలకు.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ది ఆరెంజ్ లేన్ ఆ తర్వాత పీకాక్ లైఫ్ పేరుతో ఇంటీరియర్ స్పేస్‌లను క్రియేట్ చేశాను. హైదరాబాద్‌లో కోషా పేరుతో వింటేజ్ స్టైల్ ఫర్నీచర్‌ను లాంచ్ చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లలోని అతిప్రాచీన కళా ఖండాలను సేకరించడం, వాటిని రీ మోడలింగ్ చేసి, నేటి తరానికి అందించడంలో నాటి కళను భవిష్యత్తు తరాలకు తీసుకెళుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో వ్యక్తిగత అలంకరణ కూడా అంతే ఇష్టం. నా వ్యక్తిగత అలంకరణ కొంచెం బోహో స్టైల్లో ఉంటుంది. ఇది స్వేచ్ఛా, స్ఫూర్తిలకు ప్రతీకగా ఉంటుంది. ఎదుటివారు మనల్ని పరిశీలనగా గమనించేంత ప్రత్యేకంగా ఉంటాయి’ అని నవ్వుతూ వివరించారు షబ్నమ్. – నిర్మలారెడ్డి, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
కొత్త కారు కొన్న రణబీర్ కపూర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు!
Ranbir Kapoor Range Rover: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ 'రణబీర్ కపూర్' ఇటీవల బ్రిటీష్ బ్రాండ్ 'రేంజ్ రోవర్' (Range Rover) కంపెనీకి చెందిన ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. దీని ధర ఏకంగా రూ. 4 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి కార్ల మీద సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు మక్కువ చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే వారు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు రణబీర్ మరో ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. రేంజ్ రోవర్ ఫీచర్స్.. రణబీర్ కపూర్ కొత్త రేంజ్ రోవర్ లాంగ్ వీల్‌బేస్ వెర్షన్, ఇది VIP నంబర్ ప్లేట్ కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారులో 35 స్పీకర్లతో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. భారతదేశంలో రేంజ్ రోవర్ మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కారు - కేవలం 10 మందికి మాత్రమే.. రణబీర్ బెల్గ్రావియా గ్రీన్ షేడ్‌లో కనిపించే కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లను అజయ్ దేవగన్, సంజయ్ దత్, నిమ్రత్ కౌర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు కూడా కలిగి ఉన్నారు. రణ్‌బీర్ కపూర్‌కు లగ్జరీ ఎస్‌యూవీలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఆతని వద్ద కొత్త రేంజ్ రోవర్ కారుతో పాటు మెర్సిడెస్-AMG G63, ఆడి A8L వంటి మరెన్నో ఖరీదైన కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. -
పెళ్లితో ఒక్కటైన సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే.. చూడముచ్చటైన జంటలు (ఫొటోలు)
-
సెలబ్రిటీలకు చీరలు కట్టేది ఈమే.. ఎంత సంపాదిస్తోందో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రత్యేకతే వేరు. మగువ అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది చీర. సినిమా హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు పలు ఈవెంట్లలో చీరలో మెరుస్తుంటారు. అయితే వారి చీరకట్టు వెనుక ఉన్నది మాత్రం డాలీ జైన్. పెళ్లి వేడుకలైనా లేదా ఏదైనా ఈవెంట్ అయినా సరే చీర కట్టడం లేదా దుపట్టా కట్టడం విషయంలో డాలీ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఆమె కేవలం 18 సెకన్లలో చీర కట్టగలదు. అది నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అయితే ఆమె సంపాదన చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! డాలీ జైన్ చీరకట్టుతో మెరిసిన కొంతమంది సెలిబ్రిటీల గురించి ఇటీవల రెడ్డిట్‌లో షేర్ చేశారు. తనకు 325 రకాల డ్రేపింగ్ స్టైల్స్ తెలుసని డాలీ చెబుతుంటారు. దీపికా పదుకొణె రిసెప్షన్ చీర, సోనమ్ మెహందీ, అలియా భట్, నయనతారల పెళ్లి చీరలు కట్టింది ఆమె. కాగా డాలీ జైన్ చీర కట్టడానికి ఒక్కొక్కరితో తీసుకుంటున్న మొత్తం గురించి తెలిసి నెటిజెన్లు నోరెల్లబెడుతున్నారు. పలు నివేదికల ప్రకారం, చీర కట్టడానికి డాలీ ఒక్కో సెలబ్రిటీ నుంచి రూ. 35,000 నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆమె అద్భుతమైన ప్రతిభను చూసి కొంతమంది ప్రశింసించగా మరికొంత మంది ఆమె సంపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకల్లో అంతర్జాతీయ సెలెబ్రిటీ జిగి హడిద్కు డాలీ అందంగా చీర కట్టి ప్రశంసలు అందుకుంది. ఇది మాత్రమే కాదు, మెట్ గాలా 2022 ఈవెంట్లో నటాషా పూనావాలా ధరించిన బంగారు చీరను కూడా కట్టింది డాలీనే. డాలీ జైన్ డ్రేపింగ్ (చీరలు, లెహంగాలు కట్టడం) వృత్తిగా తీసుకోవడానికి వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇంత అందంగా చీరలు కట్టే డాలీకి మొదట్లో చీరలు కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ తన అత్త ఆమెను చీర తప్పా మరో డ్రెస్‌ను ధరించనిచ్చేది కాదు. దీంతో చీరకట్టును అలవాటు చేసుకున్న డాలీ జైన్ దాంట్లోనే ప్రావీణ్యం సంపాందించి దాన్ని వృత్తిగా స్వీకరించారు. ఇండియన్ ఐడల్ 13 అనే రియాలిటీ షో పాల్గొన్న ఆమె ఆమె తన ప్రయాణం గురించి వివరించారు. ఏదో ఒకటి సాధించాలని కలలు కనే గృహిణులందరికీ డాలీ జైన్ నిజమైన స్ఫూర్తి. ఇదీ చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా -
నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి 'నిహారిక కొణిదెల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లి తెరమీద, వెండి తెర మీద తనదైన రీతిలో ప్రేక్షలకులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత వెబ్ సిరీస్ వంటివి చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇంతకీ నిహారిక ఆస్తులు విలువ ఎంత? ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1993 డిసెంబర్ 18 న జన్మించిన నిహారిక హైదరాబాద్ సెయింట్ మెరీన్ కాలేజీలో చదువుకుంది. చదువు పూర్తయిన తరువాత టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి ఢీ జూనియర్ వంటి వాటికి హోస్ట్‌గా వ్యవహరించి ఒక మనసు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఈమె తమిళ వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ 2020 నాటికి 4 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ. ఈమె ఒక్కో సినిమాకి సుమారు రూ. 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది కూడా చెబుతున్నారు. నిహారిక హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో నివసించేది, ఆమెకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది. అయితే ఈమె వివాహం 2020లో చైతన్య జొన్నల గడ్డతో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఇతడు 2018లో 'ది హరికేన్స్' అనే సొంత కంపెనీని ప్రారంభించాడు. చైతన్య జొన్నల గడ్డ ప్రస్తుతం మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూనే నెస్లే, ఐబిఎమ్, ఎయిర్టెల్ అంటి అనేక ఇతర ప్రసిద్ధ భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం. వీటి కుటుంబ ఆస్తుల విలువ కూడా కోట్లలో ఉంది. కాగా ఇటీవల నిహారిక పింక్ ఎలిఫేంట్ అనే ప్రొడక్షన్ కోసం కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది, ఈ ఆఫీస్ ప్రారంభానికి చైతన్య రాకపోవడం గమనార్హం. మొత్తం మీద బుల్లితెర నుంచి కోట్లు సంపాదించేవరకు ఎదిగింది కొణిదెల నిహారిక. -
కొత్త కారు కొన్న తీన్మార్ బ్యూటీ.. ధర ఎంతో తెలుసా?
హిందీ, కన్నడ భాషలతో పాటు తెలుగులో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన 'కృతి ఖర్బందా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో బోణి చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈమె పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో కూడా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఖరీదైన ఒక రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, కృతి ఖర్బందా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వెలార్ ధర సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు వైట్ కలర్లో చూడచక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేంజ్ రోవర్ వెలార్ ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే కృతి డీజిల్ కారుని కొన్నట్లు సమాచారం. ఈ ఇంజిన్ 204 పీఎస్ పవర్ 430 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటి వాటితో పాటు.. 3D 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 12 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 14 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇది భారతీయ విఫణిలో కూడా త్వరలో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు మార్కెట్లో మెర్సిడెస్ GLE, ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, పోర్స్చే మకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అభిమానులు కలిగి ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమై 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా మారి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ రోజు దక్షిణాది చిత్ర సీమలో ఎక్కువ సంపాదిస్తున్న నటులలో ఈయన ఒకరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 571 కోట్లు. ఈయన నెలకు రూ. 3 కోట్లు వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు తీసుకునే వారని, ఆర్ఆర్ఆర్ మూవీకి 45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్ కూడా సంపాదిస్తారు. ఇతర హీరోలతో పోలిస్తే అలాంటి సంపాదన ఎన్టీఆర్‌కి కొంత తక్కువనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తరువాత ఇప్పుడు తన రెమ్యునరేషన్ రూ. 60 నుంచి 80 కోట్లకు పెంచారు. టాలీవుడ్లో యంగ్ టైగర్‌గా పిలువబడే Jr NTR హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ. 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబముతో కలిసి నివసిస్తున్నారు. బెంగళూరులో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా హైదరాబాద్ శివార్లలోని గోపాలపురంలో 'బృందావనం' అనే ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారుని కలిగి ఉన్నారు. అంతే కాకుండా రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే 718 కేమాన్, బిఎండబ్ల్యు 720LD, మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 250డి, 4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే ఎఫ్1తో పాటు ఖరీదైన వాచీలు, సుమారు రూ. 8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు. -
ఆ ప్రాంతంలో ఈ పిల్లి ఫేమస్.. చూసేందుకు ఎగబడుతున్న పర్యాటకులు!
ఈ పొటోలో కనిపిస్తున్న పిల్లిని చూశారు కదా! భలే బొద్దుగా ముద్దుగా ఉంది కదూ! ఇది పోలండ్‌లోని స్కజేషిన్ నగరంలో ఉంటుంది. ఈ పిల్లి అక్కడ చాలా ఫేమస్. జర్మనీ సరిహద్దుల్లో ఉండే పురాతన నగరమైన స్కజేషిన్లో ఈ పిల్లి పర్యాటక ఆకర్షణగా మారింది. స్థానికులు ఈ పిల్లికి ‘గకేక్’ అని పేరు పెట్టుకున్నారు. స్కజేషిన్ నగరం శివార్లలోని కస్జుబ్స్కా ప్రాంతంలో పదేళ్ల కిందట ఇది తొలిసారిగా కనిపించింది. అప్పటి నుంచి ఇది అదే వీథిని తన నివాసంగా చేసుకుని, ‘కింగ్ ఆఫ్ కస్జుబ్స్కా స్ట్రీట్’గా పేరు పొందింది. స్కజేషిన్ నగరానికి వచ్చే పర్యాటకులు నగరంలోని మ్యూజియం, పార్కులు, ఇతర పర్యాటక కేంద్రాలను చూడటంతో పాటు ఈ పిల్లిని కూడా ప్రత్యేకంగా చూసి, ఫొటోలు తీసుకుని వెళుతుండటం విశేషం. చదవండి: Anjali Sood: అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో.. -
Valentines Day 2023: ప్రేమతో దగ్గరై పెళ్లితో ఒక్కటైన సెలబ్రిటీ కపుల్ (ఫొటోలు)
-
అబోలీ.. ద డిజేబుల్డ్ సెలబ్రెటీ
కొంతమందికి పరిస్థితులన్నీ చక్కగా అనుకూలంగా ఉంటే, మరికొందరికి కనీసం వయసుకు తగ్గినట్లుగా శరీరం ఎదగక నానా ఇబ్బందులు పడుతుంటారు. అబోలి జరీత్ జీవితం సరిగ్గా ఇలానే ఉంది. శరీరం ఎదగకపోడంతో తన పనులు తాను సరిగా చేసుకోలేని సమస్యతో బాధపడుతోంది. బతికినంత కాలం సమస్య తీరదని తెలిసినప్పటికీ తను ఒక స్టార్‌గా ఎదగాలనుకుంటుంది అబోలి. కేవలం మూడు అడుగుల ఎత్తున్న అబోలీ... స్టార్ అయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ నెటిజన్లతో అబ్బో..లీ అనిపిస్తుంది. నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ జరీత్ చిన్నారిగా ఉన్నప్పుడే ఆస్టియోమలాసియా (అస్థిమృదుత్వం) వచ్చింది. చిన్నపిల్లల్లో అసాధారణంగా వచ్చే ఈ వ్యాధి విటమిన్ లోపం కారణంగా వస్తుంది. అబోలికి ఈ సమస్య రావడంతో ఎముకలు సరిగా ఎదగలేదు. దీనికితోడు కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం మానేశాయి. ఫలితంగా తన ఎత్తు కేవలం మూడు అడుగుల నాలుగు అంగుళాలు మాత్రమే పెరిగింది. ఈ అనారోగ్య సమస్య వల్ల ప్రస్తుతం 19 ఏళ్ల అబోలీ ఐదేళ్ల చిన్నారిలా కనిపిస్తుంది. కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో నిత్యం డయపర్లు వేసుకుని ఉండాల్సిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదని డాక్టర్లు స్పష్టం చేయడంతో మరింత దిగులుపడింది అబోలి. ఒకపక్క మానసిక బాధ, మరోపక్క తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా కదలలేని పరిస్థితి. అయినా అబోలి ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఉపశమనం కలిగించే వైద్యచికిత్సలు తీసుకుని కాస్త అటూ ఇటూ కదలగలిగేలా శక్తిని పుంజుకుంది. స్టార్‌గా ఎదగాలని.. ఆరోగ్యం బాగోకపోయినా అబోలికి చిన్నప్పటి నుంచి స్టార్‌గా ఎదగాలనే కల ఉంది. ఈ విషయం తెలిసిన వారు నిరుత్సాహపరిచేలా గేలిచేయడం, ఆమె దురదృష్టాన్ని అవహేళనచేస్తూ తనని మరింత కుంగదీసేవారు. అయినా అబోలి అధైర్యపడలేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎలాగైనా స్టార్‌గా ఎదగాలనుకుంది. ఈ క్రమంలోనే.. ముందుగా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంది. కానీ శరీరం సహకరించకపోవడంతో..గాయనిగా మారాలనుకుంది. సంగీతం నేర్చుకుంటూనే ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్ వరకు చేరింది. అంతేగాక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాక్టింగ్ చేస్తోన్న ఫోటోలు, వీడియోలు, పాటలు పాడుతోన్న వీడియోలు పంపుతూ నెటిజన్లను అలరిస్తోంది. తన హావభావాలతో ఏడువేలమందికి పైగా ఫాలోవర్స్‌ను మెప్పిస్తూ డిజేబుల్డ్ సెలబ్రెటీగా దూసుకుపోతోంది. నాకు నేనే ప్రేరణ.. సంగీతం నేర్చుకుంటూ, పాటలు పాడుతూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాను. నా గురించి ఎవరు ప్రతికూలంగా మాట్లాడినా నేనస్సలు పట్టించుకోను. చిన్నప్పటి నుంచి ఎదుర్కోన్న అనే అనుభవాలు నాకు నేనే ప్రేరణగా తీసుకునేలా చేశాయి. నాకున్న ఒకే ఒక కల పాపులర్ సింగర్‌ని కావడం. నా దృష్టి మొత్తం దానిమీదే ఉంటుంది. – అబోలి -
Kili Paul: ఆస్పత్రిలో ఇంటర్నెట్ సెన్సేషన్.. కత్తులు, కర్రలతో దాడి!
Kili Paul Attacked: ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా, యాక్టివ్‌గా స్టెప్పులేసే అతను.. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ మీద దీనస్థితిలో ఉన్నాడు. చేతి బొటనవేలుకి రక్తపు మరకతో బ్యాండేజ్. కాళ్ల మీద గాయపు గుర్తులు.. ఇంటర్నెట్ సెన్సేషన్‌గా పేరొందిన కిలి పాల్ పరిస్థితి ఇది. కత్తులతో, కర్రలతో ఆయన మీద ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌ని, సోషల్ మీడియాలో ఇతర ఫ్లాట్‌ఫామ్స్ ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిలి పాల్. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ స్టార్స్, ప్రముఖుల దాకా ఈ టాంజానియా ఇంటర్నెట్ సెలబ్రిటీకి ఫ్యాన్స్. అతని ఇన్‌స్టా రీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది భారతీయుల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్, నీమాపాల్‌లు. అయితే కిలి పాల్ మీద ఎవరో దుండగులు దాడి చేశారు. ‘కొందరు తనను కింద పడేయాలని చూస్తున్నారు. కానీ, దేవుడు మాత్రం తనకి సాయం చేస్తూ వస్తున్నాడు. నా కోసం ప్రార్థించండి’ అంటూ ఓ స్టోరీ పోస్ట్ చేశాడు కిలి పాల్. అయితే అతని మీద హత్యాయత్నం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్‌లో వీడియోల ద్వారా పాపులర్ అయిన కిలి పాల్.. ఎక్కువ భారతీయ సినీ గేయాలు, డైలాగులకే డ్యాన్సులు చేస్తుంటాడు. తక్కువ టైంలో గుర్తింపు దక్కిన అతనికి ఫిబ్రవరిలో భారత హై కమిషన్ ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. అంతెందుకు ప్రధాని మోదీ సైతం తన మన్ కీ బాత్‌లో కిలి పాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. -
తప్పునాదే.. తెలుసుకున్నా: కచ్చా బాదామ్ సింగర్
రాత్రికి రాత్రే దక్కిన ఫేమ్, డబ్బుతో గర్వం తన తలకెక్కిందని, అదే తన కొంప ముంచేందుకు ప్రయత్నించిందని అంటున్నాడు కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామంలో గల్లీలో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే భూబన్.. ఆ అమ్మే క్రమంలో పాటలు పాడుతూ ఇంటర్నెట్ ద్వారా వరల్డ్‌వైడ్ ఫేమస్ అయ్యాడు. Kacha Badam రీమిక్స్‌తో అతని జీవితమే మారిపోయింది కూడా. కానీ.. ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు.. విమర్శలతో తనకు ఇప్పుడు తత్వం బోధపడింది అంటున్నాడు భూబన్. ‘నేనొక సెలబ్రిటీని అనుకోవడం కంటే.. ఇప్పటికీ నేనొక పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా అనుకోవడమే మంచిది. ఎందుకంటే.. ఎటూకానీ వయసులో సడన్‌గా వచ్చిన పేరు, డబ్బు నన్ను పైకి తీసుకెళ్లాయి. నాశనం చేయాలని ప్రయత్నించాయి. ఆ రంగు, హంగులు చూసి నాకు గర్వం తలకెక్కింది. కానీ, ఇప్పుడు నేల దిగొచ్చా. వాస్తవమేంటో అర్థం చేసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సెకండ్ హ్యాండ్ కారు కొని.. యాక్సిడెంట్‌కు గురైన కచ్చా బాదమ్ సింగర్ భూబన్.. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం రెండు పాటలు రికార్డింగ్ చేస్తున్నభూబన్.. వీలైనంత మేర సాధారణ జీవితం గడిపేందుకు రెడీ అంటున్నాడు. తప్పంతా నాదే. నేనేం సెలబ్రిటీని కాదు. అవసరం అయితే మళ్లీ పచ్చి పల్లీలు అమ్ముకుంటూ బతికేస్తా. నన్ను నమ్మండి.. నేను సాధారణంగా బతికేందుకే ప్రయత్నించా. గాల్లో మేడలు కట్టాలని నేనెప్పుడు అనుకోలేదు. కానీ, సోషల్ మీడియా సెలబ్రిటీ అనే మరక నన్ను దిగజార్చే ప్రయత్నం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు భూబన్. కచ్చా బాదమ్‌తో ఫేమస్ అయిన భూబన్.. ఆ తర్వాత పేటెంట్ హక్కులు, రెమ్యునరేషన్ అంటూ వార్తల్లోకి ఎక్కాడు. అటుపై కాస్త డబ్బు చేతిలో పడడంతో సాధారణ జీవనానికి బై చెప్పి.. పోష్ లుక్‌తో కొన్ని ఈవెంట్లలో కాస్త తలపొగరు ఆటిట్యూడ్‌తో కనిపించాడు. దీంతో భూబన్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. -
అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లినే టాప్
ముంబై: భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీ– 2021గా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకుముందేడాదితో పోలిస్తే కోహ్లీ సంపద తగ్గినా సెలబ్రిటీలందరితో పోలిస్తే బ్రాండ్ విలువ పరంగా ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లుండగా, 2021లో 18.57 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,400 కోట్లు) పరిమితమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫస్ తెలిపింది. వరుసగా ఐదేళ్లుగా ఈ జాబితాలో కోహ్లీనే టాప్‌లో ఉంటున్నారు. కోహ్లీ తర్వాత స్థానాన్ని 15.83 కోట్ల డాలర్లతో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఆక్రమించారు. రణ్వీర్ తర్వాత 13.96 కోట్ల డాలర్లతో హిందీ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. ఒలింపిక్ విజేత పీవీ సింధు 2.2 కోట్ల డాలర్లతో 20వ స్థానం దక్కించుకున్నారు. (చదవండి: పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది.. క్షమాపణలు చెప్పను: బైడెన్) -
ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 53 లక్షలు సంపాదిస్తోంది..
తమ అభిమాన తారలకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, వస్తువులు.. ఇలా వేటినైనా తెగ ఇష్టపడుతుంటారు డై హార్డ్ ఫ్యాన్స్. వారు వాడే యాక్సెసరీల నుంచి ఆటోగ్రాఫ్ చేసిన పేపర్ వరకు ఏది దొరికినా వాటిని మధుర జ్జాపకంగా పదిలంగా దాచుకుంటారు. ఇప్పటి వరకు స్టార్స్ తమ వాచ్‌లు, షర్ట్స్, బైక్‌లు వంటి వస్తువలను వేలంలో అమ్మి డబ్బులు సంపాదించిన ఘటనలు ఎన్నో చూశాం కానీ ఓ టీవీ స్టార్ తన అపాన వాయువును (పిత్తు) అమ్మి లక్షల్లో ఆదాయం గడిస్తుందంటే నమ్ముతారా.. నిజమేనండి. బహిరంగంగా మాట్లేందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యే అపానవాయువుతో డబ్బులు కూడా సంపాదిస్తున్నానని స్టెఫానీ మాటో అనే టీవీ ఆర్టిస్ట్ చెప్పడం వైరల్‌గా మారింది. 90డే ఫియాన్స్ అనే టీవీ షో ద్వారా స్టెఫానీ మట్లో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించింది. అయితే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో తన అపానవాయువును అమ్మే బిజినెస్‌ను ప్రారంభించింది. ఆ వాయువును అమ్ముతూ వారానికి ఏకంగా 70 వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 53 లక్షల రూపాయలను ఆమె సంపాదిస్తోంది. ఈ విషయాన్ని స్టెఫానీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు తన అపానవాయువును ఓ గాజు పాత్రలో వేసి ఒక్కో యూనిట్‌ను 1,400 డాలర్లకు (సుమారు లక్ష) తన అభిమానులకు ఆన్లైన్లో అమ్ముకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తూ అపానవాయువును అమ్మడం ద్వారా డబ్బు ఎలా సంపాదిస్తుందో పేర్కొంది. అలాగే అపానవాయువు బయటకు రావడం కోసం తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందో వివరించింది. వీడియోలో బీన్స్, ప్రోటీన్ మఫిన్, గట్టిగా ఉడికించిన గుడ్లు, ప్రోటీన్ షేక్, పెరుగు చూపిస్తుంది. ఇంతకూ గబ్బు లేపే అపానవాయువును కొనేదెవరు? ఈ సోది ఏంటి అనేగా మీ సందేహం. రెండు రోజుల్లోనే ఆమె 90 జార్లు అమ్మేసిందంటే... వాటికి ఎంత డిమాండ్ ఉందో ఆలోచించండి. తను అపానవాయువు పంపే గాజు పాత్రలో పూల రేకులు పెట్టడంతో అది సువాసన భరితంగా ఉంటుందని ఆమె తెలిపింది. వీటికి తోడు ఓ నోట్ కూడా రాసి పంపుతోంది. ఇంకేముంది అభిమాన తార నుంచి అపురూప కానుక అంటూ ఫ్యాన్స్ వేలకు వేలు పోసి కొనుక్కుంటున్నారు. చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే.. బజ్‌ఫీడ్ అనే మీడియా కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెఫానీ మాట్లాడుతూ.. ‘అపానవాయువు అమ్ముకోవడం నాకు తగిన పని అని అనిపించింది. అంతేగాక కొంచెం ఫన్నీగా, డిఫరెంట్‌గా ఫీల్ అయ్యాను. ఇది కొత్త ఉపాధి కూడా’ అని ఆమె పేర్కొంది. View this post on Instagram A post shared by Stephanie Matto (@stepankamatto) View this post on Instagram A post shared by Stephanie Matto (@stepankamatto) -
ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా.. వందల కోట్లు కట్టాల్సిందే...!
చైనాలో సెలబ్రిటీలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారిపై ఆంక్షలు విధిస్తూ వేధిస్తుంది. ఇంతకీ అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎందుకు అలా చేస్తుంది..? చర్యలతో ఏం సాధించాలని చూస్తుంది..? చైనా కమ్యూనిజానికి మించి అక్కడి సెలబ్రిటీలు పాపులర్ కావడం సహించలేక పోతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలబ్రిటీలపై గుర్రుగా ఉంది. వారిపై కొత్త ఆంక్షలు విధించి వేధిస్తుంది. సోషల్ మీడియాలో వారి సంపద, లైఫ్‌స్టైల్ పై గొప్పలు చెప్పకుండా నిషేధం విధించింది. అందుకే సెలబ్రిటీ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు కొత్తరూల్ తెచ్చినట్లు సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా తెలిపింది. సెలబ్రిటీ కల్చర్ చాలా ప్రమాదం.. సెలబ్రిటీ కల్చర్, సంపాదించాలనే అత్యాశ పాశ్చాత్య దేశాలకు చెందిందని, అది ప్రమాదకర అంశం అనేది చైనా ప్రభుత్వ బావన. ఇదే చైనా దేశ కమ్యూనిజానికి ముప్పు తెస్తుందనేది వారి వాదన. అందుకే సెలబ్రిటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. కొందరి సెలబ్రిటీలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చి కదలికలను కనిపెడుతోంది.అంతేకాదు ట్యాక్స్‌లు ఎగ్గొట్టారంటూ అక్రమ కేసులు బనాయించి..సెలబ్రిటీలకు భారీగా జరిమానా విధిస్తుంది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తుంది. వారి వాదనలు ప్రజల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. వెబ్సైట్ల నుంచి సెలబ్రిటీల వీడియోల్ని తొలగించి వారిని ఫ్యాన్స్‌కి దూరం చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే జెంగ్ షువాంగ్ ఉదంతం. 2009లో తైవాన్ టీవీ సీరిస్ 'మేటర్ షవర్' (Meteor Shower) రీమేక్ తో 'జెంగ్ షువాంగ్' బుల్లితెరకు పరిచయమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె చైనా దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలబ్రిటీలలో తొలిస్థానంలో ఉంది. మిగిలిన సెలబ్రిటీల కంటే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగే ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. డ్రాగన్ కంట్రీ సెలబ్రిటీలపై తెచ్చిన కొత్త చట్టం జెంగ్ షువాంగ్ను ఆకాశం నుంచి అథఃపాతాళానికి..చేర్చింది. చైనా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నటిపై చర్యలు తీసుకుంది. ఆమె పన్నులు చెల్లించడం లేదనే కారణంతో ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రూ.337 కోట్లు జరిమానా విధించి, చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ రెగ్యూలేటర్ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను నిలిపివేసింది. నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వరాదని డ్రాగన్ కంట్రీ హెచ్చరికులు జారీ చేసింది. చదవండి: చైనా మీదే జోక్.. భారీ డ్యామేజ్ భయంతో ముందే క్షమాపణలు! -
Big B Amitabh: మరో ప్రయోగం.. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు చేయనిది!
బిగ్‌బి అమితాబ్ బచ్చాన్ మరో కొత్త అధ్యాయానికి తెర లేపారు. వెండితెర రారాజుగా వెలిగి బుల్లితెర మీద కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన ఒకప్పటి ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ ఎవరికీ అంతు చిక్కని రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ప్రయోగాలకు వెరవసి సాహసి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి సిద్ధమయ్యారు. Amitabh Bachchan NFT Collection : అతి త్వరలోనే అమితాబ్‌బచ్చన్ నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) కలెక్షన్ ప్రారంభించబోతున్నారు. తన ఆర్ట్ వర్క్, పర్సనల్స్కి సంబంధించిన కలెక్షన్స్‌ని ఎన్ఎఫ్టీలోకి తీసుకు వస్తున్న మొదటి ఇండియన్‌గా అమితాబ్ రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు రితీ ఎంటర్టైన్మెంట్, ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్న నో కోడ్ సంస్థలతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. నవంబర్‌లో అమితాబ్ బచ్చన్‌కి సంబంధించి ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వారు వాటిని వేలంలో దక్కించుకోవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్కార్లును ఉపయోగించి ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు BeyondLife.Club ద్వారా వేలంలో పాల్గొనవచ్చని రితీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఎన్ఎఫ్టీ అంటే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వచ్చిన తర్వాత బ్యాంకులు, వ్యక్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. ట్రెండ్ మారుతోంది మనకు గాంధీజి ఉపయోగించిన కళ్లజోడు, స్వామి వివేకనంద రాసిన ఉత్తరం, పికాసో వేసిన పెయింటింగ్, టిప్పు సుల్తాన్ వాడిన కత్తి, సచిన్ వందో సెంచరీ చేసిన బ్యాట్, షారూక్ఖార్ వాడిన బైక్ ఇలా ప్రముఖులకు సంబంధించిన ఆర్ట్‌వర్క్ లేదా వారు ఉపయోగించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు. వీటి కోసం వేలం పాటలు అక్కడక్కడా జరిగేవి. కొన్ని సార్లు ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం సెలబ్రిటీలే ముందుకు వచ్చి తమకు సంబంధించిన వస్తువులు వేలంలో ఉంచేవారు. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ట్రెండ్ మారింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత తమ ఆర్ట్‌వర్క్‌లను సెలబ్రిటీలే నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)గా వేలంలో ఉంచుతున్నారు. అమితాబ్‌తో మొదలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పాలిగజ్ వంటి డీఫై యాప్‌లు స్టార్టప్‌లుగా ఉండగా ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం ఇండియాలో కార్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో మంచి గుర్తింపు, నమ్మకం ఉన్న అమితాబ్‌ను ఎంచుకున్నాయి. బిగ్‌బి బ్రాండ్ ఇమేజ్ను వాడుకుంటూ క్రిప్టోకరెన్సీ, ఎన్ఎఫ్టీ అస్సెట్స్కి ఇండియాలో మార్కెట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అమితాబ్‌కి సంబంధించిన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. మీకెం కావాలో అడగండి గతంలో వేలం పాటలో సాధారణంగా గతానికి సంబంధించిన వస్తువులు లేదా ఆర్ట్‌వర్క్‌ను వేలంలో ఉంచేవారు. ఈ ఎన్ఎఫ్టీలో మీకేం కావాలో అడగండి సెలబ్రిటీలు ఆ పని చేసి మీకు డిజిటల్ ఫార్మాట్లో మీకు మాత్రమే స్వంతం అయ్యేలా అందిస్తారంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారను. దీనిపై రితి ఎంటర్టైన్మెంట్ ఎండీ ఆరుణ్ పాండే మాట్లాడుతూ టెక్నాలజీకి తగ్గట్టుగా సెలబ్రిటీలు, సినితారలు వేగంగా మారిపోతున్నారు. ఈ ఎన్ఎఫ్టీల ద్వారా సెలబ్రిటీలకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు వారి అభిమానులకు విలువైన ఆస్తులు అందివ్వడమే మా లక్ష్యం అని చెప్పారు. అభిమానులు ఆలస్యం చేయకుండా బిగ్ బి నుంచి ఏం కోరుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి అంటూ కోరుతున్నారు. చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి.. -
ఇంత పిచ్చేంటి బాబు.. ఖాళీ కవర్‌కి 5 లక్షలా.. అది కూడా పోటీ పడి!
సాధారణంగా వేలంలో కొన్నిసార్లు మామూలు వస్తువులు మన ఊహకందని రేట్లకు అమ్ముడై మనల్ని ఆశ్చర్యపరుస్తాయ్. ఒక్కోసారి విలువైన వస్తువులు అనుకున్న దాని కంటే తక్కువ మొత్తానికి అమ్ముడవుతుంటాయ్. తాజాగా ఓ ప్రాంతంలో ఏమీ లేని ఒక ప్లాస్టిక్ కవర్ వేలంలో 5 లక్షల ధర పలికింది. అది కూడా పోటి పడి అంత మొత్తానికి కొనడం చూస్తుంటే ఆశ్చర్యానికే ఆశ్చర్యం వేస్తుందేమో. ఈ వింత వేలం ఇటీవల అట్లాంటీస్ లో జరిగింది. అసలు ఆ ప్లాస్టిక్ కవర్లో కేవలం గాలి మాత్రమే ఉంది. మరి గాలికి ఎందుకంత అంత ఖర్చు పెట్టారో తెలుసుకుందాం రండి. ఆ గాలి.. డొండా డ్రాప్ అనే ఒక ఈవెంట్‌కు సంబంధించింది. డొండా డ్రాప్ అంటే అదేదో ప్రత్యేక ప్రదేశం నుంచి తెచ్చిన గాలి అనుకున్నారో పొరపాటే. అది ఒక కన్సర్ట్కు సంబంధించిన ఈవెంట్ దగ్గర నింపిన గాలి కవర్. అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్, కన్యె వెస్ట్ తెలుసా? అమెరికాలో అతనికి క్రేజ్ మామూలుగా ఉండదు. డొండా అనే ఒక ఆల్బమ్‌ను ఈ సింగర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాడు. దాని కోసం ప్రివ్యూ కన్సర్ట్ను అట్లాంటాలోని మెర్సిడిస్ బెంజ్ స్టేడియంలో ఏర్పాటు చేశాడు. జులై 22న ఈ కన్సర్ట్ను ఏర్పాటు చేయగా.. ఓ వ్యక్తి ఆ కన్సర్ట్కు వెళ్లి ఆక్కడ స్టేడియంలో గాలిని ప్లాస్టిక్ కవర్లో నింపి దాన్ని ఈబేలో వేలం వేయగా.. దాన్ని కొనేందుకు జనాలు ఎగబడ్డారు. చివరకు ఆ కవర్‌ను ఓ అభిమాని 7600 డాలర్లకు( రూ. 5లక్షలు) కొనుగోలు చేశాడు. ఇలాంటి అభిమానం చూసి ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. -
అగ్గిపెట్టె మచ్చా పేరిట అరుదైన ఘనత!
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్‌లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం. ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్‌లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం. చిరు సాయం కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని మార్చండి మచ్చాకి ఉన్న ఫేమ్‌తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్‌ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు! -
వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’
సోషల్ మీడియాతో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. చూపులేకున్నా తన టాలెంట్‌తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు బిలాల్ గోరెజెన్. ఒకప్పుడు వీధుల్లో డ్రమ్స్ వాయించే బిలాల్‌కు ఈ క్రేజ్ దక్కడానికి కారణం.. తెగ ఊగిన ఓ పిల్లితో ఉన్న అతని వీడియో ఒకటి వైరల్ కావడమే. టర్కీకి చెందిన బిలాల్ వయసు 33 ఏళ్లు. పుట్టుకతోనే అంధుడు. కానీ, డ్రమ్స్ నేర్చుకుని వీధుల్లో వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2011లో ఓ సెస్ టర్కీ అనే రియాలిటీ షో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, ఆర్థికంగా మాత్రం సాయం అందించలేదు. రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్తో కలిసి చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ‘లెవన్ పొల్క్కా’ వీడియో అతని నుదుటిరాతను పూర్తిగా మార్చేసింది. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) పిల్లి తెచ్చిన లక్ లెవాన్ పొల్క్కా ఒక ఫిన్లాండ్ పాపులర్ సాంగ్. ఆ సాంగ్‌ను తనకొచ్చిన రీతిలో పాడుతూ.. డ్రమ్స్ వాయించాడు బిలాల్. అయితే ఆ వీడియోకు జపాన్ వైబింగ్ క్యాట్(పిల్లి సరదాగా తల ఊపిన వీడియో)ను ఎడిట్ చేయడంతో అది బాగా పేలింది. సోషల్ మీడియాలో బిలాల్‌కు పేరు దక్కింది. ఆ వీడియో తర్వాత బిలాల్ ఎన్నో ఫేమస్ పాటలకు డ్రమ్స్ వాయించాడు. మన వరకు బాలీవుడ్ ‘ఖలియో కా ఛమన్’, దలేర్ మెహందీ ’తున్క్ తున్క్ తున్’ ఆల్బమ్స్, లేటెస్ట్గా త్రీ ఇడియెట్స్లో ‘ఆల్ ఈజ్ వెల్’తో ఇండియన్స్‌ను బిలాల్ ఆకట్టుకోగలిగాడు. షకీరా ఆల్బమ్స్‌ను సైతం తన స్టయిల్లో కంపోజ్ చేశాడతను. ఇక పాపులర్ పాప్ సాంగ్స్‌తో పాటు టీవీ సిరీస్‌ల థీమ్ సాంగ్‌లను నోటితో హమ్మింగ్ చేస్తూ డ్రమ్స్ వాయిస్తాడు బిలాల్. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) దేవుడంటే కోపం లేదు బిలాల్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యాక ఈమధ్య ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో యాంకర్ దేవుడు కరుణించి వరాలిస్తే ఏం కోరుకుంటావని బిలాల్‌ను అడిగాడు. దానికి బిలాల్ స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ముఖం చూడాలని ఉందని చెప్తా. ఆమె నన్ను కన్నదని ఈ మాట చెప్పట్లేదు. కానీ, నా అవిటితనపు బాధను ఆమె అనుభవించింది. కన్నీళ్లు కార్చింది. ఆ బాధను మోస్తున్నప్పుడు ఆమె ముఖం చూడాలన్నదే నా కోరిక’’ అని చెప్పాడు. పనిలో పనిగా రంగులు చూడాలన్న కోరికను కూడా అడిగేస్తానని చెప్పాడు. నాకు ఆ భగవంతుడి మీద నాకెలాంటి కోపం లేదు. ఎందుకంటే నా జీవితమే నాకు గొప్ప అని చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ నిల్చుని చప్పట్లతో బిలాల్ పట్ల గౌరవం ప్రదర్శించారు. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) -
వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనిషి.. పరిష్కారం కోసం షార్ట్‌కట్‌ను ఆశ్రయిస్తాడు. కానీ, ఆ షార్ట్‌కట్ కోసం ప్రయత్నించే క్రమంలోనే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది!. అలా కష్టపడేవాళ్లను చూసి జాలిపడే కుర్రాడే ఖబి లామె. ఫేస్బుక్లో ఎక్కడో ఒక దగ్గర మీమ్‌గా, కామెంట్ సెక్షన్లో ఫొటోగా కనిపించి నవ్వులు పూయించే ఖబి.. ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీగా వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఖబి లామె.. పాపులర్ టిక్‌టాకర్. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా తన చేష్టలతోనే నవ్వించే వ్యక్తి. ఇటలీకి చెందిన ఈ 21 ఏళ్ల కుర్రాడి దృష్టిలో లైఫ్ హ్యాక్స్ అంటే పనికిరాని విషయం. రోజూవారీ పనుల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు టిప్స్ లాగా లైఫ్ హ్యాక్స్(మన దగ్గర జుగాద్) పనికొస్తాయంటారు. అయితే వాటివల్ల తాత్కాలిక ఉపశనమే ఉంటుందని, అవి అనవసరమైనవని అతని ఉద్దేశం. సుఖం కోసం కష్టపడడం ఎందుకు? మామూలు ప్రయత్నాలు ఉంటాయి కదా అంటాడతను. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) కారులో టీషర్ట్ ఇరుక్కుపోతే దానిని కత్తెరతో కట్ చేయాలని వ్యూయర్స్‌కి సలహా ఇచ్చే లైఫ్ హ్యాకర్స్.. సింపుల్‌గా డోర్ తీస్కోమని చెప్పొచ్చు కదా అని అతని స్టైల్లో అడుగుతున్నాడు ఖబి. టిక్‌టాక్‌లోనే కాదు.. అది బ్యాన్ ఉన్న మనలాంటి దేశంలో అభిమానులకు నవ్వులు పంచేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడు ఖబి. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) ఖబీ పుట్టి వెస్ట్ ఆఫ్రికాలోని సెనెగల్‌లో. పెరిగింది మాత్రం ఇటలీలోని చివాస్సో. చదువుతోంది గ్రాడ్యుయేషన్. వీడియో గేమర్గా సంపాదిస్తున్నాడు కూడా. ఏడాది క్రితం వరకు ఇతను ఒక మామూలు వ్యక్తి. లాక్‌డౌన్‌తో టిక్‌టాక్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇతను ఒక ఈ-సెలబ్రిటీ. టిక్‌టాక్‌లో ఐదున్నర కోట్లకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి 70 లక్షలకుపైనే ఫాలోయింగ్ ఉంది. వీడియోలో అతని హావభావాలే అతన్ని వైరల్ సెలబ్రిటీని చేశాయి. బెస్ట్ ఫ్రెండ్ జైరా నక్కీతో ఖబి రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖబి మంచి మనసున్నోడు కూడా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సంపాదించే దాంట్లో సగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు అతను. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) -
ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ
టాలెంటును ప్రదర్శించడానికి వయసు అడ్డురాదని చెబుతున్నారు 110 ఏళ్ల ఎమీ హాకిన్స్. ఒకే ఒక్కపాటతో ఈ బామ్మగారు ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాగా పాపులర్ అయిన ‘‘ఇట్స్ ఏ లాంగ్ వే టు టిప్పరరే’’ అనే పాటను ఎమీ పాడింది. దానిని ఆమె మనవరాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో ఎమీ హాకిన్స్ పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేగాకుండా ఈ వీడియో సాంగ్‌ను లక్షమందికి పైగా చూశారు. వేల్స్నగరానికి చెందిన ఎమీ ఒకప్పుడు డ్యాన్స్ ట్రూప్‌లో నర్తకిగా పనిచేసేవారు. అయితే ఇన్నేళ్లలో రాని గుర్తింపు తాజాగా ఆమె పాడిన ఒక పాటకు వచ్చింది. గత వారంలో ఆమె 110 వ ఏటలోకి అడుగుపెట్టగా, ఆ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఎమీ లాంగ్ వేటు పాట పాడింది. దాన్ని టిక్‌టాక్‌లో షేర్ చేయగా అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. వరల్డ్‌వార్–1 ముగిసే సమయానికి ఎమీకి ఏడేళ్లు. 1911 కార్డిఫ్‌లో ఎమీ జన్మించినప్పటికీ తన చిన్నతనం మొత్తం న్యూపోర్ట్‌లో గడిపారు. ఎమీకి ఐదుగురు సోదరులతోపాటు ఒక సోదరి కూడా ఉన్నారు. ఆమె తన 14వ ఏట డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఒక నృత్య బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. (చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య) 1937లో సైన్ రైటర్ జార్జ్ హాకిన్స్‌ను వివాహం చేసుకుని చాలా కాలం పాటు న్యూపోర్ట్‌లో నివసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎమీ హాకిన్స్ ఫైర్ వాచర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దక్షిణ వేల్స్‌లోని మోన్‌మౌత్‌షైర్‌లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి జీవిస్తున్నారు. బామ్మ పాటను టిక్‌టాక్‌లో షేర్ చేయాలన్న నిర్ణయం ఇంతటి సంతోషాన్ని ఇస్తుందనుకోలేదు. బామ్మకు సోషల్ మీడియా అంటే ఏంటో పెద్దగా తెలీదు. కానీ ఆమె ఒకపాటతో సింగింగ్ సెన్సేషన్‌గా నిలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఆమెకు దక్కిన సూపర్ బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నామని మనవరాలు ఫ్రీమన్ చెప్పుకొచ్చింది’’. -
మోడల్స్.. మెరుపుల్
-
అక్షయ్ 2 రజనీ 13 ప్రభాస్ 44
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రతి ఏడాది టాప్ 100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదల చేసిన ‘ఇండియన్ టాప్ 100’ సెలబ్రిటీల జాబితాలో సినీ రంగం నుంచి 293.25 కోట్ల ఆర్జనతో రెండో స్థానంలో నిలిచారు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్. 2017లో నాలుగు, 2018లో మూడు స్థానాలను కైవసం చేసుకున్న అక్షయ్ ఈసారి మరో మెట్టు పైకి ఎక్కి రెండో స్థానం సంపాదించడం విశేషం. ఇక 2017, 2018 సంవత్సరాల్లో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ 229.25 కోట్ల ఆర్జనతో ఈ ఏడాది మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంకా హిందీ పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్ (4,) షారుఖ్ ఖాన్ (6), రణ్వీర్ సింగ్ (7), ఆలియా భట్ (8), దీపికా పదుకోన్ (10) టాప్ టెన్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఇక వందకోట్ల సంపాదనతో ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచి దక్షిణాది స్టార్స్‌లో అందరికంటే ముందు ఉన్నారు రజనీకాంత్. గత ఏడాది ఫోర్బ్ జాబితాలో రజనీది 14వ స్థానం. ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ 16, మోహన్‌లాల్ 27వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు మన తెలుగు పరిశ్రమ నుంచి ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో నిలిచిన వారిలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. 2017లో 22వ స్థానం, గత ఏడాది అసలు ఈ లిస్ట్‌లోనే లేని ప్రభాస్ 2019 లిస్ట్‌లో 44వ ర్యాంక్‌లో నిలిచి టాలీవుడ్ హీరోల తరఫున ఈ లిస్ట్‌లో బోణీ కొట్టారు. ఇక 2017లో 37, 2018లో 33 ర్యాంకర్‌గా నిలిచిన మహేశ్‌బాబు ఈ ఏడాది 54వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా 68వ స్థానంలో తాప్సీ, 77వ స్థానంలో త్రివిక్రమ్ నిలిచారు. ఇక క్రీడా రంగంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇతర స్టార్ క్రికెటర్స్ ఎమ్ఎస్. ధోనీ (05), సచిన్ టెండూల్కర్ (09) టాప్‌టెన్ జాబితాలో ఉన్నారు. మరో క్రికెటర్ రోహిత్ శర్మ 11వ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు (63), సైనా నెహ్వాల్ (81) కూడా లిస్ట్‌లో ఉన్నారు. క్రికెటర్ మిథాలీ రాజ్ 88వ స్థానం దక్కించుకున్నారు. సెలబ్రిటీల క్రేజ్, ప్రింట్, సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ వంటి కొన్ని అంశాల ఆధారంగా ఈ ర్యాంక్‌లు నిర్ణయించినట్లు ఫోర్బ్స్ ప్రతినిధులు తమ వెబ్సైట్లో పేర్కొన్నారు. అలాగే కొంతమంది సంపాదన అధికంగా ఉన్నప్పటికీ వారి ఫేమ్‌ని దృష్టిలో ఉంచుకుని ర్యాంక్‌లను కేటాయించినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఆలియా భట్, దీపికా పదుకోన్, తాప్సీ -
సెలబ్రిటీల హ్యాపీ దసరా..
ముంబై : దేశవ్యాప్తంగా విజయదశమి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుండగా ప్రముఖలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందచేశారు. రావణుడిని వధించిన ఈరోజు ప్రపంచమంతా వెలుగులు నిండాయని బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ అన్నారు. చీకటిని చీల్చుతూ వెలుగులు విరజిమ్మిన శక్తికి ప్రతీకగా మనం ఈ పండుగ జరుపుకుంటామని, అందరూ దసరాను ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ సోనం ట్వీట్ చేశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అన్నారు. ఈ ఏడాది అంతా మన జీవితం వెలుగులు నింపాలని కోరుతూ హ్యాపీ దసరా అంటూ హీరో అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, తమన్నా, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మి, సుస్మితా సేన్, ఆదితిరావు హైదరి, జుహి చావ్లా తదితరులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
క్యాంటీన్ సాంగ్‌కి సురేఖా వాణి కుమార్తె వీడియో
సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ప్రాచుర్యం కలిగించడం తెలిసిందే. కానీ స్వయంగా సెలబ్రిటీలే తమ ఫ్యాన్స్‌కి ప్రచారం ఇవ్వడమే వింత. వండర్స్‌కి కేరాఫ్ అయిన సోషల్ మీడియా పుణ్యమాని అభిమానులకు ఈ అదృష్టం దక్కుతోంది. తమ ప్రతిభకు సెలబ్రిటీలు గులామ్ అయి సలామ్ చేయడం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది. సినిమాల్లో హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్స్ నుంచి చేసే డ్యాన్స్‌ల దాకా మక్కీకి మక్కీ అనుకరించడం వాటి ద్వారా చుట్టుపక్కల వారి క్లాప్స్, కాంప్లిమెంట్స్ కొట్టేయడం ఫ్యాన్స్‌లో చాలా మంది చేసేదే. అయితే ఇప్పుడు సెలబ్రిటీలే తమ ఫ్యాన్స్ టాలెంట్‌ను స్వయంగా చూసి, క్లాప్స్, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంతేకాదు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫ్యాన్స్ ప్రతిభను పోస్ట్ చేస్తున్నారు. తద్వారా వారి ప్రతిభకు ప్రపంచవ్యాప్త ప్రచారం కలిగిస్తున్నారు. డియర్ కామ్రేడ్‌లోని క్యాంటీన్ సాంగ్‌కి సిటీ కాలేజీలో వీడియో రూపొందించిన సుప్రీతి (నటి సురేఖా వాణి కుమార్తె) ‘ఓ బేబీ’ని అనుసరించిన‘కామ్రేడ్’ అదే విధంగా ‘ఓ బేబీ’ మూవీ విడుదల సమయంలో సమంత ఫ్యాన్స్‌కి మరో ఆఫర్ ఇచ్చింది. తను సినిమాలో ధరించిన పాత్ర తరహాలో అభిమానులు కూడా తనను రెట్రో లుక్‌తో ఆకట్టుకోవాలని కోరింది. అలా రెట్రోలుక్తో అదరగొట్టిన అభిమానుల ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో సమంత పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ తన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో హిట్టయిన క్యాంటీన్ సాంగ్‌కి తమదైన శైలిలో డ్యాన్స్ చేయమంటూ ఫ్యాన్స్‌కి పిలుపిచ్చాడు. దీంతో సిటీలోని కాలేజీ క్యాంటీన్లు ఆట–ఆ పాటలతో ప్రతిధ్వనించాయి. దీనికి వచ్చిన క్రేజ్‌కి నిదర్శనం ప్రముఖ సినీ నటి సురేఖావాణి కుమార్తె, కాలేజీ విద్యార్ధిని సుప్రీతి తానూ డ్యాన్స్ చేసి విజయ్ దేవరకొండకు షేర్ చేయడం... చాలెంజ్ నుంచియూ టర్న్.. ఇది ఓ రకంగా సెలబ్రిటీలు చేసే చాలెంజ్‌కి స్వల్ప మార్పులతో కొనసాగింపు అని చెప్పొచ్చు. చాలా రకాలుగా యూత్ ట్రెండ్స్‌ని సృష్టించే స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ ట్రెండ్‌కు కూడా ఇక్కడ తానే శ్రీకారం చుట్టింది. తన సినిమా ‘యూటర్న్’ కోసం సమంత ది కర్మ థీమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అది బాగా పాపులరైంది కూడా. దీంతో ‘ఆ థీమ్ సాంగ్‌కి మీరు కూడా డ్యాన్స్ చేసి...వాటిని నాకు పంపితే బాగున్న వీడియోస్‌కి నన్ను ట్యాగ్ చేయండి. నాకు నచ్చితే నా ప్రొఫైల్‌లో రీపోస్ట్ చేస్తా’ అని సమంత ఇచ్చిన ఆఫర్‌కి సిటిజనుల్లో బాగా క్రేజ్ వచ్చింది. దీనికి స్పందనగా వీడియోలు పంపిన సమంత అభిమానులతో పాటు సహ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ప్రియమణి, హీరోలు అఖిల్, నవీన్ చంద్ర వంటి వారు సైతం ఉండడం విశేషం. ఓ సాకి సాకి హిందీ పాటకి వీడియో రూపొందించిన సిటీ యువతి శ్రుతీ మిట్టల్ త్రీ ఇన్ వన్ ట్రెండ్ ఈ తరహా పిలుపులకు ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు. ఇవిసినీ తారలకు ఓ వైపు సినిమాప్రమోషన్స్కి మరోవైపు అభిమానులతో మరింత సన్నిహితం కావడానికి ఉపకరిస్తున్నాయి. అలాగే ఫ్యాన్స్‌కి కూడా అరుదైన అపురూప తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకునే అవకాశం అందుతోంది. దీంతో రాను రాను ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బాలీవుడ్కీసై అంటున్న సిటీ... గత కొన్ని నెలలుగా బాలీవుడ్ సైతం ఇదే బాట పట్టింది. పలు సినిమాలలోని తమ పాటలు, డైలాగ్స్...వగైరాలతో హీరో హీరోయిన్లు అభిమానులకు ఛాలెంజ్‌లు విసురుతున్నారు. సదరు నటీ నటులకు ఉన్న లక్షల సంఖ్యలోని ఫాలోయర్స్‌కు తమ ప్రతిభ సైతం పరిచయం అవుతుందనే సంతోషంతో ఫ్యాన్స్ భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. తాజాగా బాట్లా హౌజ్ బాలీవుడ్ సినిమాలోని ఓ సాకీ సాకీ అంటూ సాగే నోరా పటేíß (తార) డ్యాన్స్ ఐటమ్ సాంగ్‌కి సిటీలోని ఎమ్జె డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. -
లైఫ్ ఈజ్ వండర్ఫుల్
మెరుగైన చికిత్స కోసం జర్మనీ వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు సుస్మితకు ‘సినాథెన్’ అనే పరీక్ష చేశారు. స్టెరాయిడ్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నదీ లేనిదీ తేల్చి చెప్పే పరీక్ష అది. ఆ పరీక్షను సుస్మితకు రెండుసార్లు చేసి వైద్యులు చెప్పిందేమిటంటే... ఆమె ఇక ఎప్పటికీ స్టెరాయిడ్స్ వాడుతూనే ఉండాలని! వాడకుంటే బతకడం కష్టమని!! సెలబ్రిటీల జీవితాల్లోని గ్లామర్ ఒక్కటే మనకు కనిపిస్తుంది. తమ జీవితంలోని కల్లోల సమయాల్లో వాళ్లు చేసిన పోరాటం గురించి వాళ్లకై వాళ్లు బయటపెడితే తప్ప ప్రపంచానికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. నాలుగేళ్ల క్రితం దీపికా పడుకోన్ తను డిప్రెషన్లోకి వెళ్లిన బాలీవుడ్ ప్రారంభపు రోజుల గురించి బహిర్గత పరిచినప్పుడు అభిమానులు నిర్ఘాంతపోయారు. ఇంత చలాకీగా, చక్కగా కెరీర్లో ఎదుగుతున్న అమ్మాయి జీవితంలోనూ డిప్రెషన్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అయితే అంతకన్నా ఆశ్చర్యం ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ఆమె చేసిన పోరాటం. అలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటమే ‘విశ్వసుందరి’ సుస్మితా సేన్ జీవితంలో ఉందని ‘ఇండియా టుడే’కి ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడయింది. 2014లో బెంగాలీ సినిమా ‘నిర్బాక్’ చిత్రీకరణ పూర్తి అవుతుండగా సుస్మిత ఒక్కసారిగా కుప్పకూలిపోయి, తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యారు. అలా ఎందుకయ్యిందో వెంటనే ఎవరూ తెలుసుకోలేకపోయారు. అనేక నిర్థారణ పరీక్షలు జరిపాక ఆమె దేహంలో అడ్రినల్ గ్రంథి.. కార్టిసాల్‌ను ఉత్పత్తి చెయ్యడం ఆగిపోయిందని వైద్యులు కనిపెట్టారు. కార్టిసాల్ అనేది ఒక ఉత్ప్రేరక హార్మోన్. రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను, జీర్ణక్రియను నియంత్రిస్తుంది. నొప్పుల్ని, వాపుల్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తికి సహాయకారిగా ఉంటుంది. దేహంలోని ఉప్పును, నీటిని సమన్వయపరిచి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మనిషి ఆరోగ్యానికి ఇంత కీలకమైన కార్టిసాల్‌ను అడ్రినల్ గ్రంథులు మూత్రపిండాల పైభాగంలో ఉంటాయి. అవి కార్టిసాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్లనే సుస్మిత అకస్మాత్తుగా పడిపోయి, ఆ వెంటనే పూర్తి అనారోగ్యంలోకి వెళ్లారు. కారణం తెలిసిన వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స మొదలు పెట్టారు. ‘హైడ్రోకార్టిసన్’ అనే స్టెరాయిడ్‌ను ఇచ్చి, ప్రతి ఎనిమిది గంటలకొక ఇంజెక్షన్ తీసుకోవాలనీ లేకుంటే కోలుకోవడం కష్టం అని చెప్పారు. ఆ తర్వాత ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా మాత్రల్ని సిఫారసు చేశారు. దాదాపు రెండేళ్ల పాటు (2015–16) ఆ స్టెరాయిడ్‌ను వాడారు సుస్మిత. ఆ సమయంలో ఆమె నరకం అనుభవించారు. అంతకంటే ఎక్కువగా స్టెరాయిడ్ దుష్ప్రభావంతో శారీరకంగా, మానసికంగా ఆమె నలిగిపోయారు. చర్మం మునుపటి మెరుపు కోల్పోయింది. జుట్టు ఊడిపోవడం మొదలైంది. ఒంట్లో స్టెరాయిడ్ నిల్వలు పేరుకుని పోయి ముఖం చిన్నబోయింది. మెరుగైన చికిత్స కోసం జర్మనీ వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు సుస్మితకు ‘సినాథెన్’ అనే పరీక్ష చేశారు. స్టెరాయిడ్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నదీ లేనిదీ తేల్చి చెప్పే పరీక్ష అది. ఆ పరీక్షను సుస్మితకు రెండుసార్లు చేసి వైద్యులు చెప్పిందేమిటంటే... ఆమె ఇక ఎప్పటికీ స్టెరాయిడ్స్ వాడుతూనే ఉండాలని! ఆ మాటతో సుస్మిత ప్రపంచం తలకిందులైపోయింది. రోజుకు 60 మిల్లీ గ్రాముల స్టెరాయిడ్స్‌ను వైద్యులు సిఫారసు చేశారు. శక్తి మరీ సన్నగిల్లుతున్నప్పుడు ఆ మోతాదును 100 మిల్లీ గ్రాముల వరకు పెంచుకోవచ్చని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్సులు అవీ ఉన్నప్పుడు మోతాదును పెంచి వేసుకునేవారు సుస్మిత. ఆ మోతాదుల ప్రభావంతో ఆమె కంటి చూపు మందగించింది. దేహంలోని శక్తి హరించుకుపోయింది. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన గురించి మొత్తం రాసుకోవాలని భావించి కూడా ఆఖరు నిముషంలో ఆ ప్రయత్నం మానుకున్నారు. ‘సుస్మితాసేన్ ఇలాక్కాదు తన అభిమానులకు గుర్తుండి పోవాలసింది’ అనుకున్నారు. బతుకును ఇచ్చే నెపంతో చావుకు దగ్గర చేస్తున్న స్టెరాయిడ్‌తో ఫైట్ చెయ్యాలనుకున్నారు. డాక్టర్లు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఏ పనీ చేయకూడదని, అలా చేస్తే బ్రెయిన్‌కు రక్తం సరఫరా అవదని, అది మరింత ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించినప్పటికీ సుస్మిత వినలేదు. తన దేహంలో ఏం జరుగుతోందో తనకై తను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన అనారోగ్యంపై యోగాను ప్రయోగించుకున్నారు. 2016 అక్టోబర్ నాటికి మరీ శిథిలమైపోయారు. వెంటనే ఆమెను అబూధాబి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కూడా సుస్మితకు సినాథెన్ పరీక్ష జరిపి ఆమెను డిశ్చార్చ్ చేశారు. అక్కడి నుంచి దుబాయ్ వెళుతుండగా.. అబుధాబి డాక్టర్ నుంచి ఫోన్ వచ్చింది.. ‘సుస్మితా మీరు ఈ పూట డోస్ వేసుకున్నారా?’’ అని. ‘‘లేదు. ఏదైనా తిని వేసుకుంటాను’’ అన్నారు. సుస్మిత. ‘‘అక్కర్లేదు. మీరిక పిల్స్ వేసుకోనక్కర్లేదు’’ అన్నాడు డాక్టర్. సుస్మిత ఆశ్చర్యపోయి, ‘‘ఎందుకు?’’ అని అడిగారు.అప్పుడు డాక్టర్ చెప్పిన మాటకు ఆమె కొన్ని క్షణాల వరకు మామూలు మనిషి కాలేకపోయారు. డాక్టర్‌ను అడిగి మళ్లీ అదే మాట చెప్పించుకున్నారు. ‘‘మీరిక కార్టిసాల్ పిల్స్ వేసుకోనక్కర్లేదు సుస్మితా. ఎందుకంటే మీ ఆడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌ను తిరిగి ఉత్పత్తి చెయ్యడం మొదలు పెట్టాయి’’ అని చెప్పారు డాక్టర్. ఒక విధంగా అది వండర్. ఎందుకంటే తన ముప్పై ఐదేళ్ల ప్రాక్టీస్‌లో ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని చూడలేదట ఆ డాక్టర్. ఇక సుస్మిత అయితే తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయారు. 2016 అక్టోబర్‌లోనే మందులు మానేశారు. మానేశాక కొంతకాలం మానడం వల్ల సంభవించే దుష్పరిణామాలు ఆమెను బాధించినా, తట్టుకుని నిలబడ్డారు. ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘వైద్యులు చెయ్యొద్దన్న దానిని చెయ్యడం నా ఉద్దేశం కాదు. మరణాన్ని తప్పించుకునే పోరాటప్రయత్నంలో నేను ఎలా మార్పు చెందుతానో అలా మారడానికి నా మనసు అంగీకరించలేదు కాబట్టి.. వైద్యులు వారిస్తున్నా నేను చెయ్యాలనుకున్నట్లుగా యోగా చేశాను. జిమ్నాస్టిక్స్‌ని కూడా మొదలు పెట్టాను’’ అన్నారు సుస్మిత. ∙ -
లోక్‌సభలో సెలబ్రిటీల పనితీరిదీ!
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాలకు సినీ తారలకు అవినాభావ సంబంధం ఉంటుందని తెల్సిందే. కొంత మంది సినీ నటీనటులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీచేసి చట్టసభల్లోకి అడుగుపెడితే మరి కొందరు నామినేషన్ పద్ధతిలో చట్టసభల్లోకి అడుగుపెడతారు. ఇంకొందరు ఎన్నికల ప్రచారానికే పరిమితం అవుతారు. అలాగే ఈసారి లోక్‌సభ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి సినీ నటీనటులు సన్నీ డియోల్, ఊర్మిళా మటోన్డ్‌కర్, ప్రకాష్ రాజ్, గాయకుడు హాన్స్ రాజ్ హాన్స్‌లు అడుగుపెట్టిన విషయం తెల్సిందే. సాధారణంగా సినీ రంగం నుంచి చట్టసభల్లోకి వచ్చిన వారు సరిగ్గా సమావేశాలకు హాజరుకారని, హాజరైనా కాసేపు కాలక్షేపం చేసి వెళతారని, ఏ చర్చా గోష్టిలో పొల్గొనరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది నిజమా ? కేవలం అపోహ మాత్రమేనా? 2014 ఎన్నికల అనంతరం ఏర్పడిన 16వ లోక్‌సభలో వీరి పనితీరు ఎలా ఉందో చూద్దాం! లోక్‌సభలో మొత్తం పార్లమెంట్ సభ్యుల హాజరు సరాసరి 80 శాతం ఉండగా, 19 మంది సెలబ్రిటీల హాజరు సరాసరి 66 శాతం ఉంది. మధుర నుంచి ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి హేమ మాలిని హాజరు 39 శాతం ఉంది. అతి తక్కువ హాజరు కలిగిన సెలబ్రిటీలో ఆమె రెండో వారు. పశ్చిమ బెంగాల్ నుంచి తణమూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న బెంగాల్ నటుడు దీపక్ దేవ్ అధికారికి కేవలం 11 శాతం మాత్రమే హాజరీ ఉంది. ఇక చర్చా గోష్ఠుల్లో పాల్గొన్న ఎంపీల సరాసరి హాజరు 67 శాతం కాగా, అదే సెలబ్రిటీల హాజరి శాతం 22 మాత్రమే. మొత్తం ఎంపీలు కలిసి 293 ప్రశ్నలను లేవనెత్తగా సెలబ్రిటీలు 101 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఏ చర్చా గోష్ఠుల్లో పాల్గొన లేదు. ఒక్క ప్రశ్నకూడా అడగలేదు. ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించిన అమితాబ్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఐదేళ్ల కాలంలో ఒకే ఒక్క ప్రశ్న వేశారు. ‘అమితాబ్ నోరు విప్పారు’ అంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. 2014 జూన్ నెల నుంచి 2019 ఫిబ్రవరి వరకు 331 రోజులు లోక్‌సభ సమావేశాలు జరగ్గా సెలబ్రిటీలకు సరాసరి 66 శాతం హాజరీ ఉంది. వారిలో బెంగాలీ నటుడు జార్జి బేకర్‌కు 98 శాతం హాజరీ ఉంది. 2015, జూలై 13వ తేదీన ఆయన్ని బీజేపీ నామినేట్ చేయగా, అప్పటి నుంచి లోక్‌సభ 228 రోజులు సమావేశం కాగా, 223 రోజులు ఆయన హాజరయ్యారు. బీజేపీ ఎంపీ, మరాఠా నటుడు శరద్‌కుమార్ బన్సోడేకు 93 శాతం హాజరీ ఉంది. భోజ్‌పూర్ గాయకుడు చోటేలాల్‌కు 88, తెలుగు సినిమా నుంచి వెళ్లిన మురళీ మోహన్‌కు 85 శాతం, సినీ–టీవీ నటి కిరణ్ కేర్‌కు 84 శాతం హాజరీ ఉంది. ప్రశ్నల్లో ముందున్న వారు హాజరీలో కాస్త వెనకబడినా ప్రశ్నలు అడగడంలో ముందున్నారు బీజేపీ ఎంపీ కిరణ్ కేర్. ఆమె ఏకంగా 335 ప్రశ్నలు అడిగారు. సభ్యుల సరాసరి ప్రశ్నల సంఖ్య 293. ఆ తర్వాత మురళీ మోహన్ అత్యధికంగా 267 ప్రశ్నలు అడిగారు. శత్రుఘ్న సిన్హాతోపాటు బెంగాలీ, ఒడియా నటి మూన్‌మూన్ సేన్ కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. సిన్హా ఒక్క డిబేట్లో కూడా పాల్గొనలేదు. సేన్ మాత్రం ఒకే ఒక డిబేట్లో పొల్గొన్నారు. ఎంపీలాడ్స్‌లో సెలబ్రిటీలదే పైచేయి ఎంపీలాడ్స్ కింద విడుదలైన నిధులను వినియోగించడంలో రాజకీయ నాయకులకన్నా సెలబ్రిటీలే ముందున్నారు. ఇతర రాజకీయ ఎంపీలు ఎంపీలాడ్స్‌ను సరాసరి 82.9 శాతం వినియోగించగా, ఈ సెలబ్రిటీలు 87.6 శాతం వినియోగించారు. ఎంపీ లాడ్స్ కింద ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం అభివద్ధికి ఐదేళ్ల కాలానికి ఐదు కోట్ల రూపాయలను కేటాయించడం తెల్సిందే. సెలబ్రిటీల్లో సంధ్యారాయ్ 98.8 శాతం నిధులను వినియోగించగా, హాజరీలో అందరికన్నా వెనకబడిన దీపక్ దేవ్ అధికారి ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. ఆయన 96.7 శాతం నిధులను అభివద్ధి కార్యక్రమాలకు వినియోగించారు. శత్రుఘ్న సిన్హా 91.1 శాతం వినియోగించారు. ఎంపీ లాడ్స్ వినియోగంలో కూడా హేమ మాలిని వెనకబడి ఉన్నారు. -
ఆ సెలబ్రిటీ వెంటపడి ఖాకీలకు చిక్కాడు..
ముంబై : సెలబ్రిటీలను ఫాలో అవుతూ వారిని చికాకు పెట్టే అభిమానులు కొందరైతే వెంటపడి వేధించే ప్రబుద్ధుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా ముంబైలో టీవీ దిగ్గజం ఏక్తా కపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏక్తా కపూర్‌ను గత నెలరోజులుగా అనుసరిస్తూ ఆమె ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షం కావడంతో పాటు ఆమెను సమీపించేందుకు ప్రయత్నించిన 32 ఏళ్ల క్యాబ్‌డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలరోజుల్లో దాదాపు 30 సార్లు నిందితుడు ఏక్తాను ఫాలో అయ్యాడని పోలీసులు చెప్పారు. క్యాబ్ డ్రైవర్‌ను హర్యానాకు చెందిన సుధీర్ రాజేందర్ సింగ్‌గా గుర్తించారు. కొద్ది రోజుల కిందట ఏక్తా కపూర్ జుహులోని ఓ ఆలయం సందర్శించగా, అక్కడికి చేరుకున్న సింగ్ ఆమెకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె సెక్యూరిటీ గార్డులు అడ్డుకుని హెచ్చరించి పంపారని పోలీసులు చెప్పారు. ఏక్తా కపూర్ కదలికలను పసిగట్టిన సింగ్ అంథేరి వెస్ట్‌లో తరచూ ఆమె వెళ్లే జిమ్‌లోనే నిందితుడు సభ్యత్వం తీసుకోవడం పోలీసులను షాక్‌కు గురిచేసింది. ఈనెల 16న ఏక్తా జిమ్‌కు వెళ్లగా అక్కడ నిందితుడిని చూసిన ఆమె సెక్యూరిటీ గార్డులు అతడిని అడ్డుకున్నారు. ఏక్తా ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
అమ్మ.. నాన్న.. ఓ ప్రేమకథ
మూడు రోజుల ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’ లో చివరి రోజు సెషన్లలో ప్రముఖంగా ఆకర్షించిన సెలబ్రిటీ షబానా ఆజ్మీ. ఆదివారం నాడు ఆమె తన తండ్రి, ప్రముఖ ఉర్దూ కవి కైఫీ ఆజ్మీ రాసిన కవితలను, పాటలను పాడి అలరించారు. అరవై ఎనిమిదేళ్ల వయసులో ఆమె గ్లామర్‌తోపాటు స్వరంలో తియ్యదనం ఆకట్టుకున్నాయి. తండ్రి కైఫీ జీవితాన్ని ‘కైఫీయత్’ పుస్తకంగా వెలువరించారు షబానా. ఆ పుస్తకం మీద చర్చతో పాటు, కైఫీ జీవితం మీద ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో పాల్గొనడానికి హైదరాబాద్‌కి వచ్చారు షబానా. ఆమె పుట్టింది కూడా హైదరాబాద్‌లోనే. షబానా తల్లి షౌకత్‌ది హైదరాబాద్. ఆమె కైఫీ రచనలకు అభిమాని. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పడడానికి ప్రయత్నించి మరీ తన ప్రేమను వ్యక్తం చేసినట్లు చెప్పారు షబానా. కైఫీ రక్తంతో రాసిన ప్రేమలేఖలను నమ్మవద్దని, అందులో వ్యక్తం చేసిన భావుకతలకు మురిసిపోవద్దని షౌకత్‌ను ఆమె తండ్రి (షబానా తాతగారు) హెచ్చరించినట్లు కూడా చెప్పారు షబానా. అయినప్పటికీ పట్టుపట్టి మరీ అతడినే పెళ్లి చేసుకున్న వైనాన్ని వివరించారు, పెళ్లి తర్వాత పెద్దగా సంపాదన లేని కైఫీ ఎనిమిది కుటుంబాలకు కలిపి ఒకటే టాయిలెట్ ఉండే ఇంట్లో కాపురం పెట్టారు. డబ్బు లేని బాల్యమే అయినా అందమైన జీవితాన్ని గడిపిన రోజులవి అన్నారామె. తండ్రి ఫొటో పేపర్లో ప్రచురించినప్పుడు ఫ్రెండ్స్ ప్రశంసలను ఎంజాయ్ చేయడం వంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారామె.కైఫీ చిన్నప్పటి నుంచి పండక్కి కొత్త దుస్తులు వేసుకోవడాన్ని వ్యతిరేకించేవారని, రైతు బిడ్డ కొత్త దుస్తుల కోసం ఆరాటపడకూడదని చెప్పేవారని ఆమె తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. పదకొండేళ్ల వయసులో తండ్రి రాసిన కవితను, ఆయన తండ్రి విశ్వసించకపోవడాన్ని, మళ్లీ రాసి చూపించిన తర్వాత నమ్మిన విషయాలను పంచుకున్నారు. ‘‘మా అమ్మ చాలా ప్రాక్టికల్‌గా ఉండేది. వారి దాంపత్యంలో ఎంత ప్రేమ ఉండేదో అంతటి గొడవలు కూడా ఉండేవి. మా నాన్న చాలా నైస్‌గా చక్కదిద్దేవారు. వాళ్ల కాపురంలో సమానత్వం కోసం ప్రయత్నించడం జరగలేదు, వారి ఆచరణలో ఉండేది. నాన్న రాసిన ‘నా వెనుక నడిచే అనుచరురాలు కాదు... నువ్వు నా పక్కన నడిచే సహచరిగా ఉండాలి’ అనే కవిత మా అమ్మను ఆయన ప్రేమలో పడేసింది. అది చివరి వరకు వాళ్ల జీవితంలో కొనసాగింది. అది మా అమ్మానాన్నలకే కాదు, ప్రతి జంటకీ వర్తిస్తుంది. అన్వయించుకోగలిగితే ప్రేమబంధం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’ అన్నారు షబానా. సమాజంలో మత సంఘర్షణలు వాటికవిగా జరగవు. వాటి వెనుక కొన్ని ప్రయోజనాలుంటాయి. అవి ప్రేరేపించినప్పుడే మతకల్లోలాలు జరుగుతాయని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘మీటూ ఉద్యమం చాలా గొప్ప సామాజికోద్యమం. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ పూరిత వాతావరణం ఉండాలి. తమకు జరుగుతున్న అన్యాయం మీద గళమెత్తిన అమ్మాయిలకు సెల్యూట్’’ అని ప్రశంసించారు. ఇన్పుట్స్ : మంజీర, ఓ మధు -
కోహ్లి బ్రాండ్ @రూ.1200కోట్లు
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది దేశంలో ‘మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్’గా నిలిచాడు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రముఖ గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ సలహాదారు సంస్థ ‘డఫ్ అండ్ ఫెల్ఫస్’ తాజా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్ విలువ ఏకంగా దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది. దీంతో ఈ జాబితాలో భారత కెప్టెన్ అగ్రస్థానం మరింత పదిలమైంది. కోహ్లి గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇదే సమయానికి 21 ఉత్పత్తులను ఎండార్స్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ రూ.718 కోట్ల (102.5 మిలియన్ అమెరికన్ డాలర్లు) బ్రాండ్ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ (రూ.473 కోట్లు), రణ్వీర్ సింగ్ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. -
ఫేస్బుక్ లైవ్‌తో సెలబ్రిటీ హోదా
-
జవాబు ఎక్కడ?
సెలబ్రిటీల బర్త్ డేలకు కొన్ని వందల విషెస్ అందుతుంటాయి. అన్ని శుభాకాంక్షలకు సమాధానం చెప్పాలంటే కొంచెం కష్టమే. మే 1న అనుష్కా శర్మ బర్త్ డే. అనుష్క ఫోన్ ఆమె ఫ్యాన్స్ విషెశ్తో నిండిపోయినట్టుంది. అవన్నీ చూసుకునే తీరిక ఆమెకు ఉండి ఉండకపోవచ్చు. అందుకేనేమో అమితాబ్ విషెశ్కు రిప్లయ్ ఇవ్వలేకపోయి ఉంటారు. అమితాబ్ బచ్చన్ ఊరుకుంటారా? ట్వీటర్లో తమాషాగా ‘‘అనుష్కా.. నేను అమితాబ్ బచ్చన్‌ను. నీ బర్త్‌డేకు ఎస్ఎమ్ఎస్ ద్వారా శుభాకాంక్షలు పంపాను. రెస్పాన్స్ రాలేదు. విషయం కనుక్కుంటే నువ్వు నంబర్ మార్చేశావన్నారు. మళ్లీ విషెస్ చెబుతున్నాను. హ్యాపీ బర్త్ డే. మంగళవారం జరిగిన ఐపీయల్ మ్యాచ్‌లో చాలా అందంగా కనిపించావు’’ అని ట్వీట్ చేశారు అమితాబ్. ‘‘థ్యాంక్యూ సో మచ్ సార్. ఈ ట్వీట్ పంపుతూనే మీ ఎస్ఎమ్ఎస్కు కూడా రిప్లయ్ ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనుష్కా. -
చరిత్రలో నిలిచిపోయిన సెలబ్రిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సూపర్ స్టార్ శ్రీదేవీ దుబాయ్‌లో అకాల మరణం చెందడం దశాబ్ద కాలంలోనే పెద్ద చర్చనీయాంశం అయింది. భారతీయులతోపాటు పాకిస్థాన్ ప్రజల నివాళులను అందుకుంటున్న ఏకైక తార శ్రీదేవీయే కాచ్చు! జాతి, మత, కుల వైషమ్యాలు లేకుండా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకుని చరిత్రలో నిలిచిపోయే వారు అతి కొద్ది మందే ఉంటారు. మైఖేల్ జాక్సన్ (1958–2009) పాప్ సింగర్‌గా ‘కింగ్ ఆఫ్ పాప్’ విశ్వవిఖ్యాతి చెందిన మైఖేల్ జాక్సన్ 2009లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో, తన ఇంట్లో అకాల మరణం పొందారు. ఆయన తన పాటలకు సంబంధించి 26 లక్షల డిజిటల్ ట్రాక్‌లను విక్రయించడం ద్వారా పది లక్షల డిజిటల్ ట్రాక్లకన్నా ఎక్కువగా విక్రయించిన ఏకైన సింగర్‌గా కూడా రికార్డు సృష్టించారు. ఎల్విస్ ప్రెస్లీ (1935–1977) ప్రముఖ అమెరికా గాయకుడు, కంపోజర్, నటుడు ఎల్విస్ ప్రెస్లీ తన గానామతంతో ‘కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా గుర్తింపు పొందారు. 20వ శతాబ్దంలో ఆయన పాట వినని ఇల్లంటూ అమెరికా, యూరప్ దేశాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకన్న ఆయన తన 42వ ఏట బాత్రూమ్లోనే కన్నుమూశారు. ఆయన అప్పటికే చిన్న ప్రేగు సమస్యతో బాధ పడుతున్నారు. ప్రిన్సెస్ డయానా (1961–1997) బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ డయానా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఎంటర్డేన్మెంట్ సెలబ్రిటిగా గుర్తింపు పొందారు. 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. ఆమెతోపాటు అ ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు. మార్లిన్ మాన్రో (1926 –1962) హాలీవుడ్ శృంగార తారగా 1950వ దశకంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మార్లిన్ మాన్రో పిన్న వయస్సులో, అంటే 36వ ఏట అకాల మరణం చెందారు. నాడీ మండలం చికిత్సకు వాడే ‘బార్బిటు రేట్’ ఒవర్ డోస్ వల్ల మరణించారు. విట్నీ హూస్టన్ (1963–2012) తన పాటలతో ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తూ ‘బిల్బోర్డ్ ఆల్బమ్ అవార్డు’ను దక్కించుకొని అనేక అవార్డులు పొందిన మహిళా సింగర్ ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కిన విట్నీ హూస్టన్ కూడా వాటర్ టబ్‌లోనే మరణించారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌లో గెస్ట్ రూమ్‌లో 2012, ఫిబ్రవరి 11వ తేదీన ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత మూడేళ్లకు అంటే, 2015లో ఆమె కూతురు బొబ్బి కష్ణా బ్రౌన్ కూడా నీటి తొట్టిలోనే కోమాలోకి వెళ్లి ఆర్నెళ్లలోగా మరణించారు. ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ (1958 నుంచి 2016) పాటకు తగ్గ నత్యంతో యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ అమెరికా సింగర్ ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ తన 57వ ఏట ‘ఫెంటానిల్’ ఒవర్ డోస్ కారణంగా అకాల మరణం చెందారు. అభిమానులు ‘ప్రిన్సి’గా పిలుచుకునే రోగర్స్ పలు వాయిద్యాల్లో ఆరితేరిన విద్వాంసుడు. బెస్ట్ సెల్లింగ్ పాప్ సింగర్‌గా పాపులర్. -
డిజిటల్ ఫీవర్
అమితానందం సెలబ్రిటీలన్నా, వారి ఆటపాటలన్నా, వారి పర్సనల్ ఫొటోలు, వీడియోలన్నా అందరికీ పండుగే. వాళ్లకి కష్టమొస్తే అభిమానులు దుఃఖపడతారు. వాళ్లు పెళ్లి చేసుకుంటే వీళ్లు పండుగ చేసుకుంటారు. వాళ్ల బర్త్‌డేలు, జీవితంలోని ఇతర ముఖ్యమైన రోజులు అభిమానులందరికీ అతి ముఖ్యమైనవే. అమితాబ్ బచ్చన్ ఇష్టం లేనిదెవరికి? ఆయన భార్య జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు విశ్వసుందరి ఐశ్వర్యా బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్... టోటల్ ఫ్యామిలీ అంతా సెలబ్రిటీలే... వీళ్లందరూ కలసి ఒకచోట కనిపిస్తే.. అదీ ఏ సినిమా షూటింగ్‌లోనో కాకుండా... ప్రైవేట్‌గా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా సందడి చేస్తూ కంటపడితే... అభిమానులకు పండుగే పండుగ కదా! అది వైరల్ కాక ఏమవుతుంది మరి! తేనెపొట్ట తేనెటీగలంటే మీకు ఇష్టమా? మీకేమైనా పిచ్చా? తేనె అంటే ఇష్టమే కానీ, తేనెటీగలెవరికయినా ఇష్టం ఉంటుందా? ఒకవేళ ఇష్టం ఉంటే మాత్రం వాటినేమైనా ముద్దుపెట్టుకుంటామా? అంటారా? అలా అయితే మీరు వెంటనే సైడ్ తీసుకోవలసిందే... ఎందుకంటే ఈ ఫొటోలో ఉన్న అమ్మడు ప్రకృతి ప్రేమికురాలు. ఓహియోకు చెందిన ఎమిలీ ముల్లర్ అనే ఈ ముప్ఫై ఏడేళ్ల ఆమెకు తేనెటీగలంటే వల్లమాలిన అభిమానం ఉండటం వల్ల ఎంతో ప్రేమగా తేనెటీగలను పెంచుకుంటోంది. ఇటీవల ఆమె నాలుగోసారి గర్భం ధరించడంతో ఫొటో షూట్ చేయించాలనుకున్నాడామె భర్త. అంతే! తాను ముద్దుగా పెంచుకుంటున్న 20,000 తేనెటీగలను పిలిచి, పొట్టమీదకి ఎక్కించుకుని మరీ ఫొటోలకు స్టిల్సిచ్చింది. టీన్ ఇన్ ఫిఫ్టీ జూహీచావ్లా... ఒకనాటి విశ్వసుందరి. 80ల చివరి నుంచి 90ల చివరి వరకు వెండితెరను ఏలిన అందాల తార. ఖయామత్ సే ఖయామత్ తక్, ఇష్క్ తదితర చిత్రాలలో నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన తారాజువ్వ. ముద్దుగారే ముఖం, మిలమిలా మెరిసే కళ్లు, చురుక్కున గుచ్చినట్టుండే నవ్వు... ఆమె నటించిన చిత్రాలను ఒకసారి చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూసి మరీ సూపర్ డూపర్ హిట్ చేసేవారు. చాలా రోజులుగా తెరమరుగున ఉన్న ఈ తార ఉన్నట్టుండి వార్తల్లోకెక్కింది. మొన్నీమధ్యే యాభయ్యవ పుట్టిన రోజు జరుపుకున్న ఈ సుందరిని చూసిన వారందరా వహ్వా అన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆట్టే తేడా ఏం కనిపించట్లేదన్నారు.అందరి కామెంట్లూ ఆనందంగా స్వీకరించిందామె. రిటర్న్ గిఫ్ట్‌గా తన బ్యూటీ సీక్రెట్స్ అందరితోనూ పంచుకుంది. ఆమె షేర్ చేసిన బ్యూటిప్పులు, ఆమె బర్త్‌డే ఫొటోలు వాట్సప్పుల్లో, ఫేస్బుక్లో వేలాది షేర్లు, లక్షలాది లైకులుగా హల్ చల్ చేస్తున్నాయి. అది నిజమైతే ఎంత బావుణ్ణు! ఒక బీద కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఒక తండ్రి, తల్లి, ముగ్గురు పిల్లలు. తం్రyì కి ఎప్పుడూ ఆరోగ్యం బాగోదు. ఒకరోజు తండ్రి చనిపోయాడు. మూడు రోజుల వరకు బంధువులు ఆహారం పంపించారు. తరువాత ఆకలితో భరించాల్సిన రోజులు వచ్చాయి. తల్లి కొన్ని రోజులు ఎలాగో అవస్థలు పడి పిల్లలకి ఆహారం పెట్టగలిగింది. కానీ తరువాత ఆహారం లేక ఆకలితో ఉండవలసి వచ్చింది. ఆకలితో ఉండటం వలన 8 సంవత్సరాల బాబుకి జ్వరం వచ్చింది. మంచంలో ఉన్నాడు. ఒకరోజు ఐదేళ్ల పాప వాళ్ళ అమ్మని అడిగింది‘‘అమ్మా!! అన్నయ్య ఎప్పుడు చచ్చిపోతాడు..?’’అప్పుడు అమ్మ, పాపని అడిగింది ‘‘ఎందుకు అలా అడుగుతున్నావు’’ అని.అమ్మాయి బాధతో సమాధానం చెప్పింది. ఆ సమాధానం విని అందరికీ అప్పుడు ఏడుపొచ్చింది..సమాధానం ఏంటంటే!... ‘‘అన్నయ్య చచ్చిపోతే మన ఇంటికి అన్నం వస్తుంది కదా...!’’ ప్రియమైన సోదర సోదరీ మణులారా! మన దగ్గర మిగిలి ఉన్న ఆహారాన్ని బీద ప్రజలకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వటం మన బాధ్యత కూడా. అలా మన బాధ్యత నెరవేర్చుకుంటే పైన ఉన్న భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడు.ఈ మెసేజ్ గత కొద్ది నెలలుగా వాట్సప్‌లో షేర్ అవుతూనే ఉంది. ఇప్పుడు పెళ్లి, ఇతర వేడుకల సందర్భంగా ఎక్కువగా వండి, మిగిలిపోయిన భోజనాన్ని తీసుకెళ్లి అనాథలకు పంచి పెట్టే స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమకు దగ్గరలో ఉన్న కార్యకర్తల కాంటాక్ట్ నంబరు దగ్గర ఉంచుకుంటే... ఇలాంటి పిల్లలకు అన్నం పెట్టవచ్చు. -
బిగ్‌బాస్: క్రిటిక్‌గా వెళ్లి సెలబ్రిటీగా వచ్చాను!
బిగ్‌బాస్ నుంచి మహేశ్ కత్తి ఔట్.. నేడు మరొకరు కూడా.. ఆసక్తిగా సాగుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో శనివారం ఎపిసోడ్లో పలు ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఈ షో నుంచి సినీ విమర్శకుడు మహేశ్ కత్తిని ఎలిమినేట్ చేస్తున్నట్టు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. ఇక, హౌజ్ కొత్త కెప్టెన్ ఎన్నికైన శివబాలాజీ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి తప్పించుకోగా.. ఇప్పటికే మిగతా సభ్యులైన హరితేజ, కల్పన, దీక్షాపంత్లపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ముగ్గురిలో మరొకరిని కూడా ఎలిమినేట్ చేయబోతున్నట్టు ప్రకటించి ట్విస్టు ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ వారం ఎలిమినేట్ అయ్యే మరో కంటెస్టెంట్ ఎవరనేది ఆదివారం ఎపిసోడ్లో తెలియనుంది. అంతేకాదు మరో సెలబ్రిటీ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి రాబోతున్నట్టు టీజర్ వదిలి ఆసక్తిని పెంచారు షో నిర్వాహకులు. హౌజ్‌లోకి రాబోతున్న కొత్త సెలబ్రిటీ ఎవరో నేడు తెలియనుంది. ఇక త్వరలోనే తన బిగ్‌బాస్ అనుభవాలను పంచుకోనున్నట్టు ఫేస్బుక్లో ఫిలీం క్రిటిక్ మహేశ్ కత్తి వెల్లడించారు. 'జీవించదగ్గ కాల్పనిక వాస్తవం-బిగ్ బాస్. నేను బయటికి వచ్చాను. చాలా అనుభవంతో. చాలా ఆలోచనలతో. త్వరలో పంచుకుంటాను. "వాస్తవానికి నిజానికీ మధ్య...50 లక్షలాట"' అంటూ ఆయన కామెంట్ పెట్టారు. ఫిలిం క్రిటిక్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ప్రవేశించిన తాను సెలబ్రిటీగా బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నదని, ఎయిర్‌పోర్టు వద్ద ఎంతోమంది సెల్ఫీలు కావాలంటూ తనను కోరారని, ఇది తనకు ఎప్పుడూ జరగలేదని మహేశ్ కత్తి ఫేస్బుక్లో తెలిపారు. -
అమ్మా నాకు జాబ్ వచ్చింది!!
పెద్ద పెద్ద సెలబ్రిటీలు... చిన్న చిన్న ఉద్యోగాలు! పూర్వాశ్రమం సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు బెంగుళూరులో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేసిన విషయం బహుశా ఈ తరం ప్రేక్షకులకు కూడా తెలిసే ఉంటుంది. అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. కచేరీలలో సంగీత వాద్యాలను అందించే సహాయకుడిగా పనిచేశారని తెలిస్తే ‘అవునా?’ అనిపిస్తుంది. బాలీవుడ్లో ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా ఉన్నవారు ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ‘అమ్మా నాకు జాబ్ వచ్చింది’ అని ఇంట్లో చెప్పుకుని పొంగిపోయారు. అందుకేవాళ్ల తొలి ఉద్యోగాలేమిటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. దేవానంద్ దేవానంద్ అంటే అమ్మాయిలు పడి చచ్చేవారు. ఆ స్టయిల్, ఆ యాక్టింగ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకునేవి. సినిమాల్లోకి రాకముందు ఆయన ముంబై చర్చిగేట్ ప్రాంతంలోని మిలటరీ సెన్సార్ ఆఫీసులో గుమస్తాగా పని చేశారు. ఆయన నెల జీతం రూ.165. అమితాబ్ బచ్చన్ షా వాలెస్ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు బిగ్ బి. ఆ తర్వాత ‘బర్డ్ అండ్ కో’ కంపెనీలో (అది కూడా షిప్పింగే) రవాణా బ్రోకర్‌గా నాలుగు రాళ్లు సంపాదించుకున్నారు. అమ్రిష్ పురి మదన్ పురి, చమన్ పురి. వీళ్లిద్దరూ అమ్రి పురి అన్నయ్యలు. బాలీవుడ్లో పేరున్న విలనయ్యలు. వీళ్లిద్దరి అడుగుజాడల్లో నడిచేందుకు అమ్రేష్ పురి కూడా సినీ రంగ ప్రవేశం చేయబోయారు. అయితే స్క్రీన్ టెస్ట్‌లో పాస్ కాలేదు. ఇక సినిమాలకు పనికి రాననుకుని డిసైడ్ అయ్యి ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’లో ఉద్యోగం సంపాదించుకున్నారు. తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. అక్షయ్ కుమార్ బ్యాంకాక్‌లోని నో హోటల్లో వెయిటర్‌గా, చెఫ్‌గా పని చేశారు అక్షయ్ కుమార్. అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. బ్యాంకాక్ నుంచి బాలీవుడ్‌కి వచ్చాక అతడి పేరు అక్షయ్ కుమార్ అయింది. ఖిలాడీ కుమార్ కూడా అతడే. రణవీర్ సింగ్ సినిమాల్లోకి రాకముందు రణవీర్ ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో కాపీ రైటర్. ప్రముఖ యాడ్ ఏజెన్సీలు ఓ అండ్ ఎం, జె.వాల్టర్ థాంప్సన్లకు ఆయన పనిచేశారు. నవాజుద్దీన్ సిద్ధిక్కీ రైతు కుటుంబం నుంచి వచ్చారు. యు.పి.కుర్రాడు. కెమిస్టుగా పనిచేసేవారు. నటన మీద ఉన్న ఇంట్రెస్టు కొద్దీ ఢిల్లీ వెళ్లి నాటకాలలో వేషాల కోసం ప్రయత్నించారు. కొన్నాళ్లు అక్కడే వాచ్‌మన్‌గా చేశారు. చివరికి బాలీవుడ్ తీరానికి చేరారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్. క్యాంటీన్ ఓనర్. పండ్లు కూడా అమ్మారు. బాలీవుడ్‌కి వచ్చి ట్రాజెడీ కింగ్ అయ్యారు. దిలీప్ కుమార్‌గా ప్రసిద్ధులయ్యారు. పరిణీతి చోప్రా ఈమె యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో మార్కెటింగ్ ఇంటెర్నీ. మెల్లిగా అక్కడే యాక్టింగ్‌లో తన ఆసక్తిని బయటపెట్టి సినిమాల్లోకి వచ్చేశారు. మెహమూద్ ఈ బాలీవుడ్ అగ్రశ్రేణి కమెడియన్ మొదట్లో ట్రక్కు డ్రైవర్. కోళ్లు, కోడిగుడ్లు కూడా అమ్మారు. టేబుల్ టెన్నిస్ కోచ్‌గా కొన్నాళ్లు ఉన్నారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు. మణిరత్నం మణిరత్నం ఎం.బి.ఎ. పట్టభద్రులు. చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పని చేశారు. తర్వాత సినిమా డెరైక్షన్లోకి వచ్చారు. గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కర్లా. గుల్జార్ అనే పేరుతో బాలీవుడ్ రైటర్‌గా ప్రసిద్ధులయ్యారు. సినిమాలకు రాయక ముందు కార్ల గ్యారేజీలో పనిచేశారు. కార్లకు పెయింట్ వేసేవారు. అవును. ఆక్సిడెంట్ అయిన కార్లకు రంగులు వేశారు. కవితలు రాస్తూ, సినిమా పాటల్లోకి, సినిమా మాటల్లోకి వచ్చారు. అర్షాద్ వార్సీ మొదట డోర్-టు-డోర్ కాస్మటిక్స్ సేల్స్‌మాన్! తర్వాత ఫొటో ల్యాబ్‌లో చేశారు. అక్కడి నుంచి బాలీవుడ్‌కి వచ్చారు. బొమన్ ఇరానీ ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో వైరస్‌గా విఖ్యాతుడైన బొమన్ ఇరానీ ఒకప్పుడు రెస్టారెంట్లో వెయిటర్. ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో రూమ్ సర్వీస్ అటెండెంట్. అక్కడి నుంచి యాక్టింగ్‌లోకి వచ్చారు. సోనాక్షీ సిన్హా సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’తో సినీ రంగ ప్రవేశం చేసేనాటికి సోనాక్షీ కాస్ట్యూమ్స్ డిజైనర్. 2005లో ‘మేరా దిల్ లేకే దేఖో’ చిత్రంలో స్క్రీన్ పైన కనిపించిన కాస్ట్యూమ్స్ సోనాక్షి వే. ఆ తర్వాత తనే స్క్రీన్ పైకి వచ్చేశారు. రణదీప్ హుడా మెల్మోర్న్లో చదివారు. ఎం.బి.ఎ. చేశారు. అక్కడ ఉన్నప్పుడే ఒక చైనీస్ రెస్టారెంట్లో పని చేశాడు. కార్లు తుడిచాడు. వెయిటర్‌గా పని చేశాడు. కొన్నాళ్లు కారు డ్రైవర్‌గా ఉన్నాడు. 2000లో ఇండియా వచ్చాక ఒక ఎయిర్ లైన్స్‌లో మార్కెటింగ్ విభాగంలో పనికి కుదిరాడు. తర్వాత బాలీవుడ్‌లోకి వచ్చాడు. షివాజీ సతమ్ ఇండియన్ టీవీ లెజండ్రీ ఎ.సి.పి. ప్రద్యుమ్న్ అసలు పేరు షివాజీ సతమ్. బ్యాంక్‌లో క్యాషియర్‌గా చేశారు. తర్వాత యాక్టింగ్‌లోకి వచ్చారు. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా బాలీవుడ్‌లోకి రాకముందు మెహ్రా యాడ్ ఫిల్మ్ మేకర్. అంతకన్నా ముందు వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్‌మన్. నిజమే. ఈ ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు యురేకా ఫోర్బ్స్ వారి వాక్యూమ్ క్లీనర్లను అమ్మారు! -
పోలీసులకు సలాం కొట్టకుండా ఉండలేం...
పాటతత్వం ‘‘అన్యాయం జరిగినప్పుడు.. ఆందోళనకు గురైనప్పుడు... ఆపదలో చిక్కుకున్నప్పుడు.. మనకు అర్జంటుగా గుర్తొచ్చేది పోలీసులే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరికీ కొండంత అండగా మేమున్నామంటూ ధైర్యాన్నిచ్చే పోలీసుల్లో జోష్ నింపే పాట ఇది. వాళ్లలో హుషారు నింపడంతో పాటు మనందరిలో పోలీసులపై సదభిప్రాయాన్ని తీసుకొస్తుందీ పాట. నిజంగా పోలీసుల కష్టాన్ని చూస్తే ‘సలాం’ కొట్టకుండా ఉండలేమండీ’’ అన్నారు గాయకుడు సింహా. గోపీచంద్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గోలీమార్’. చక్రి సంగీతమందించిన ఈ చిత్రంలో భాస్కరభట్ల రాసిన ‘సలాం పోలీస్..’ పాటను సింహా ఆలపించారు. ఈ పాటతత్వం గురించి సింహా మాటల్లో... వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా భాస్కరభట్లగారు ఈ పాటను రాసిన విధానం, చక్రిగారి సంగీతం సింప్లీ సూపర్బ్. చిన్నప్పట్నుంచీ పోలీస్ కావాలని కలలు కనే ఓ యువకుడు తన లక్ష్యాన్ని చేరుకున్న సందర్భమది. అప్పుడు పోలీస్ అయితే తానేం చేస్తాడో చెబుతూ, పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ పాట పాడతాడు. నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన, నేను పాడిన అత్యుత్తమ పాటల్లో ఇదొకటి. ఖాకీ చొక్కా వేసేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనేరా.. కష్టాలైనా కన్నీళ్లైనా నీ యెనకాలే ఉండేవాడు నీడై నీతో వచ్చేవాడు పోలీసోడేరా నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోణ్ణేలే ॥ఖాకీ॥ కష్టాలు.. కన్నీళ్లు.. మనం ఎంత ఆపదలో ఉన్నప్పటికీ, కాదనకుండా నీడల్లే మనతో వచ్చేది, మన వెనక వచ్చేది పోలీసులే. ఎక్కడైనా ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్, అగ్ని ప్రమాదాలు, విపత్తులు, మరోకటో సంభవించినప్పుడు ఉరుకుల పరుగులతో కాపాడడానికి వచ్చేది ఎవరండీ.. పోలీసులే కదా. అందుకే, దేవుడా.. నువ్వే దిక్కు నన్ను రక్షించాలని వేడుకుంటే పోలీసుల రూపంలో భగవంతుడు వస్తాడని, ‘ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోణ్ణేలే’ అని చెప్పారీ పల్లవిలో. తలపై టోపీ అంటున్నాది ఎనకడుగు వద్దంటూ రైళ్లూ బస్సులు తగలేస్తుంటే లోపల తోయంటూచుట్టం గిట్టం తెలవదు నాకు మంచోళ్లంతా చుట్టాలే భయ్యమ్ గియ్యమ్ జాన్తా నైరే ఆడెవడైనా తొక్కాలే పోలీసోడే లేని ఊరే లేదే.. వాడే లేడా ఊరు వల్లాకాడే ॥ఖాకీ॥ నిరసనకారులు తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడానికి బస్సులు, రైళ్లు తగలబెడుతుంటారు. అవి మన ప్రభుత్వ ఆస్తులే. అంటే ప్రజల ఆస్తులే. దీనివల్ల నష్టం ఎవరికి? మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తులను లోపల (జైల్లో) తోయడంలో తప్పేముంది. తప్పు చేసింది ఎవరైనా పోలీసులు భయపడరు. వాళ్లను లోపల తోసేయడమే. మంచి చేసినోడికి పోలీసోడు చుట్టం, చెడు చేసినోడికి చట్టం చేతిలో శిక్ష ఖాయం. ప్రజలకు ఇబ్బంది కలిగిన ప్రతి సందర్భంలోనూ పోలీసులు ప్రత్యక్షమవుతారు. సవాలక్ష ఒత్తిళ్ల మధ్య సమయానికి తగు రీతిలో స్పందించడం ఒక్కో సందర్భంలో ఆలస్యం కావొచ్చు. కానీ, అసలు పోలీసు రక్షణ లేని ఊరిని ఊహించుకోగలమా? అరాచక శక్తులు రాజ్యం ఏలుతాయి. వదలకు బ్రదరూ అంటున్నాది బిగిసిన ఈ బెల్టు అమ్మాయిలపై యాసిడ్ పోస్తే తాటే తీయంటూ తిండి నిద్ర గుర్తే రావు డ్యూటీలోకి దిగిపోతే ఇంకో జన్మే ఉన్నాదంటే మళ్లీ అవుతా పోలీసే రాత్రయిపోతే సూర్యుడు వెళిపోతాడే రాత్రి పగలూ ఉంటాడు పోలీసోడే ॥ పుష్కరాలు, పండగలు.. కష్టాలు, సుఖాలు.. రాత్రి, పగలు.. తేడా లేకుండా తిండి తిప్పలు మానేసి మరీ పోలీసులు ఎప్పుడూ డ్యూటీ చేస్తుంటారని ఈ చరణంలో చెప్పారు. నిజమే కదా.. మనమంతా పండగ చేసుకుంటుంటే వాళ్లు డ్యూటీ చేస్తుంటారు. మనం పుష్కర స్నానం చేస్తుంటే వాళ్లు సెక్యూరిటీ చూసుకోవడంలో బిజీగా ఉంటారు. ‘ఇంకో జన్మే ఉన్నాదంటే మళ్లీ అవుతా పోలీసే’ అనే లైన్ నాకు బాగా నచ్చింది. వందలో ఒకరో, ఇద్దరో పోలీసులు తప్పులు చేసుండొచ్చు. మెజారిటీ పోలీసులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. వాళ్లను మనం ఎప్పుడూ గౌరవించుకోవాలి. ‘మా గురించి చాలా మంచి పాట పాడావ్’ అని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పినప్పుడు ఎంతో సంతోషమేసింది. ఇంటర్వ్యూ: సత్య పులగం భాస్కరభట్ల గీత రచయిత సింహా గాయకుడు -
అధరం తాంబూలం!
సెలబ్రిటీలకు స్వేచ్ఛ ఉండదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన క్షణం నుంచీ రహస్య కెమేరాలు వెంటాడతాయ్. అది గ్రహించే ప్రముఖులు కూడా అప్రమత్తంగా ఉంటారు. అయినా ఏదో చోట దొరికిపోతారు. ఈ మధ్య ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలానే దొరికిపోయింది. ఈ టీనేజ్ బ్యూటీ ఇటీవల శిఖర్ పహారియా అనే కుర్రాడితో ముద్దుల మూడ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా ఎవరో కెమెరాలో బంధించారు. తీసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా జాన్వీ, శిఖర్‌ల ముద్దూ ముచ్చట తాలూకు ఫొటోను బయటపెట్టారు. ఇంతకీ ఈ శిఖర్ పహారియా ఎవరంటే.. కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు. ఓ ప్రైవేట్ పార్టీలో జాన్వీ, శిఖర్‌లు ఈ విధంగా పట్టుబడ్డారని టాక్. ప్రస్తుతం జాన్వీ న్యూయార్క్‌లో ఉంది. అక్కడ నటనలో శిక్షణ తీసుకుంటోంది. మరో రెండేళ్ల లోపు తను కథానాయికగా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. -
రకుల్ వెర్సెస్ ప్రీత్
రకుల్ ప్రీత్‌సింగ్ ‘స్టార్’ రకుల్ ప్రీత్సింగ్గా మనకు పరిచయం అయ్యే ముందు ఒక సాధారణ మిడిల్‌క్లాస్ అమ్మాయి. గొప్పగా ఆశలు, ఆశయాలు ఉన్న అమ్మాయి కూడా కాదు. అచ్చం మన పక్కింటి అమ్మాయి లాంటి అమ్మాయే. ‘దేవుడిచ్చిన అందం దేవుడే తీసుకెళ్లిపోతే అప్పుడు గర్వం గిర్వం జాన్తానై’ అనుకునే మనింటి అమ్మాయిలాంటిదే! సెలబ్రిటీ ఇంటర్వ్యూలా చెయ్యకుండా తను, తన ఆత్మ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అని ఇలా చేశాం. రకుల్ వెర్సెస్ ప్రీత్! ఎంజాయ్!! ప్రీత్: కాస్కో రకుల్! ఈరోజు నీతో చాలా విషయాలు బైటపెట్టించేస్తా! అవునూ ఏంటి రిలాక్డ్స్‌గా కనిపిస్తున్నావ్? రకుల్: ఇవాళ షూటింగ్ లేదు. అందుకే జస్ట్ రిలాక్స్ అయిపోతున్నాను. షూటింగ్ ఉన్నా నాకు నో టెన్షన్ అని నీకు బాగా తెలుసు కదా! వర్క్‌ని ఎంజాయ్ చేస్తాను. ప్రీత్: అది సరే! చిన్నప్పుడు అంత అల్లరి చేసినా, అమ్మానాన్న గ్రహించేవాళ్లు కాదు. బాగానే మ్యానేజ్ చేసేదానివి! రకుల్: అప్పట్లో అమాయకంగా కనిపించే నా మొహమే నాకు ఫుల్ ప్రొటెక్షన్. అయినా, అమ్మా నాన్నలకు తెలియకుండా విపరీతంగా అల్లరి చేసేదాన్ని. ప్రీత్: ఓసారి స్కూల్‌కి బంక్ కొట్టి, ఇరుక్కున్నావ్ కదూ? రకుల్: నువ్వేదో స్కీమ్ వేసి ఇలాంటి ప్రశ్నలడుగుతున్నావ్. అవును బంక్ కొట్టాను. ఒకరోజు దొరికిపోయాను. డీబార్ చేశారు. ఇంట్లోవాళ్లకి తెలియకుండా మ్యానేజ్ చేశాను. కానీ, నా టైమ్ బాగాలేక స్కూల్లో తమ్ముడు చేసిన అల్లరికి నాన్న వస్తే ప్రిన్సిపాల్ నా వ్యవహారం బైటపెట్టారు. ఆ తర్వాత బంక్ కొట్టలేదు. ప్రీత్: చిన్నప్పుడు డ్యాన్స్ చేయమనగానే చేయడం, పాటలు పాడమనగానే పాడడం చేసేదాన్ని. పెద్ద షో అప్ నువ్వు... రకుల్: సిగ్గు.. గిగ్గు అని ఏదేదో అనమాకు. నాకు టాలెంట్ ఉంది కాబట్టి ప్రదర్శించా. హుషారుగా ఉండడం నాకిష్టం. అందుకే అడగ్గానే చేసేదాన్ని. అభినందించాల్సింది పోయి అసూయతో నాకు సిగ్గు లేదంటున్నావ్! ప్రీత్: అద్దంలో మొహం చూసుకున్నప్పుడు ‘హీరోయిన్గా నా?’ అని ఎప్పుడూ అనుకోలేదా? అందగత్తెనని ఫీలింగా? రకుల్: నాకు కెమెరా ముందు నిలబడాలంటే ఇష్టం. గొప్ప అందగత్తె అనిపించుకోవడం కన్నా మంచి నటి అనిపించుకోవాలనే ఉండేది. ప్రీత్: ఇంతకీ నీలో నీకు నచ్చింది ఏంటి? రకుల్: నా కళ్లు, నవ్వు నచ్చుతాయి. అంతా అదే చెబుతారు. ప్రీత్: అవునూ.. ఆ మధ్య ‘బ్రూస్లీ’లో కొంచెం సన్నగా కనిపించావ్. ‘సరైనోడు’కి బరువు పెరగమన్నారు. ఇలా తగ్గి, పెరగాల్సి రావడంతో అసలెందుకీ జాబ్ అనిపిస్తోందా? రకుల్: ‘సరైనోడు’ కోసం రెండు కిలోలు పెరిగాను. నెక్ట్స్ సినిమాకి కావాలంటే తగ్గుతాను. నాకదేం ప్రాబ్లమ్ కాదు. సినిమా కోసం ఎలా అయినా మారిపోతాను. షూటింగ్ లేకపోతే నాకు తోచదు. బ్రేక్ టైమ్‌లో ఏం చేయాలో తెలియక నా మ్యానేజర్లతో ఫొటోషూట్ ప్లాన్ చేయమంటుంటాను. ఇలా ఏదో ఒక పనితో ఎంగేజ్ అయిపోతాను. లేకపోతే నా వల్ల కాదు. ప్రీత్: నువ్వెప్పుడూ ఆనందంగా ఉంటావ్ ఎలా? రకుల్: చిన్న చిన్న విషయాలకు కూడా చాలామంది ఒత్తిడికి గురవుతారు. నేనైతే పెద్ద పెద్ద విషయాలకు కూడా టెన్షన్ పడను. ప్రెషర్‌కి గురైతే ఉపయోగం ఉండదని నా నమ్మకం. ప్రీత్: ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యావు పొగరూ.. గట్రా... రకుల్: ‘నో వే’... అసలు పొగరెందుకు పెరగాలి? దేవుడు నిన్ను కనికరించి, అన్నీ ఇచ్చాడు కాబట్టి అలా మారాలా? అప్పుడు అన్నీ వెనక్కి తీసేసుకుంటాడు. అందుకే ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రీత్: అంతా బాగానే ఉంది.. హీరోయిన్గా చిట్టి పొట్టి దుస్తులు వేసుకుంటావ్ కదా? రకుల్: కాలేజీ డేస్‌లో కూడా నేను షార్ట్ డ్రెస్సులు వేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఎక్స్పోజింగ్ ఇచ్చి ‘ఇది నువ్వు కచ్చితంగా వేసుకుని తీరాలి’ అని ఎవరూ కండీషన్ పెట్టలేదు. వల్గారిటీకి, బ్యూటీకి మధ్య చిన్న గీత ఉంటుంది. నేను ‘బ్రూస్లీ’లో పొట్టి డ్రెస్సులు చాలా వేసుకున్నాను. నా ఫిజిక్ వాటికి సూట్ అయ్యింది. ప్రీత్: ఫిజిక్ బాగుంది కదా అని గొప్పలు చెబుతున్నావ్... రకుల్: నేనేం గొప్పలు చెప్పలేదు. అయినా బాగున్న ఫిజిక్ గురించి చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్లా? ప్రీత్: నిన్ను పడేయాలంటే అబ్బాయిలు ఏం చేయాలి? రకుల్: కచ్చితంగా లుక్స్‌తో కాదు. నాలా మంచి మాటకారి అయ్యుండాలి. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. పొగరుగా బిహేవ్ చేసే అబ్బాయిలంటే మంట. ప్రీత్: పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు అభిమానులు మాట్లాడాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలనీ కొంతమంది ఆకతాయి పనులు చేస్తారు కదా.. అప్పుడేమనిపిస్తుంది? రకుల్: అభిమానుల్లో స్వీట్‌గా బిహేవ్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. కొంతమందైతే ‘మేడమ్... ఒక సెల్ఫీ’ అని మొహం మీద ఫోన్ పెట్టి మరీ అడుగుతారు. రిలాక్సేషన్ కోసం ఏ సినిమాకో, హోటల్‌కో వెళ్లినప్పుడు తెగ ఎగబడ తారు... ఇబ్బందే! అలాగే, ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు, ఎవరో ఇద్దరు సెల్ఫీ తీసుకుంటూ, బ్యాక్‌గ్రౌండ్‌లో మేం కనిపించేట్లు ఫొటోలు తీసి, సోషల్ మీడియో పెట్టేస్తారు. ప్రీత్: సరదాగా కళ్లకి గ్లాసెస్ పెట్టుకుని వెళితే, రాత్రి మందు పార్టీ చేసుకుని ఉంటారని కూడా అనుకుంటారు కదూ! రకుల్: రోజంతా షూటింగ్ చేసి, అలసిపోతుంటాం. నేనైతే షూటింగ్ కోసం 20 గంటలు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటాను. ఉదయం నాలుగున్నరకే లేచేస్తా. కళ్లల్లో ఆ అలసట కనిపించకుండా గ్లాసెస్ పెట్టుకుని వెళ్లిపోతాను. అప్పుడు ఫొటోలు తీసేసి, ఏవేవో రాసేస్తారు. దానికి బాధపడను. బాధపడటానికి జీవితంలో ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి అనుకుంటా. ప్రీత్: మిస్ ఇండియా టైటిల్ రాకపోయినా ఎంజాయ్ చేశావట! రకుల్: ప్రతి ఏడాదీ ముగ్గురు విన్నర్స్ ఉంటారు. కానీ, ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా మాత్రమే లైమ్‌లైట్‌లో ఉన్నారు. మిగతావాళ్లు ఏమయ్యారు? అందుకే ఆ టైటిల్ వస్తే ఓకే.. లేకపోయినా ఓకే అనుకున్నాను. ఆ పోటీలో టైటిల్ గెల్చుకోనివాళ్లందరూ గ్రీన్ రూమ్‌లోకి వెళ్లిపోయి, ఏడ్చారు. నేను వాళ్ల దగ్గరికి వెళ్లి, ‘ఆఫ్టర్ పార్టీ ఉంది.. రెడీ అవ్వండి’ అన్నాను. వాళ్లు ఆశ్చర్యపోయి, ‘నీకు బాధగా లేదా’ అన్నారు. ‘బాధ ఎందుకు.. ఈ నెల రోజుల్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు.. నాకది చాలు’ అన్నాను. గెలవడం అంటే.. కిరీటం తెచ్చుకుంటేనే కాదు. గెలవనప్పుడు కూడా ఆనందంగా ఉండటం కూడా గెలుపే. ప్రీత్: బాగా చెప్పావ్.. అది సరే డబ్బూ, పేరు ఈ రెండింటిలో నీకేది ఆనందం ఇస్తుంది? రకుల్: ఇంతసేపు మాట్లాడితే ఇప్పటికి మెచ్చుకున్నావ్. డబ్బు, పేరు కాకుండా ఇంకో ఆప్షన్ ఇవ్వొచ్చు కదా. నా వర్క్ మాత్రమే నాకు ఆనందం ఇస్తుంది. డబ్బు శాశ్వతం కాదు. నేను ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిని. మా నాన్నగారి జీతం తక్కువ. అప్పట్లో మాకన్నా బాగా డబ్బున్న స్నేహితులు నాకు తెలుసు. వాళ్లు చాలా రిచ్ ఫుడ్ తినేవాళ్లు. కానీ, అన్నీ ఒంటరిగానే. వాళ్లకి ఫ్యామిలీ వేల్యూస్ తెలిసేవి కావు. నేను కాఫీ తాగినా మా అమ్మానాన్న, తమ్ముడితో కలిసి తాగేదాన్ని. ఆ ఆనందాన్ని ఎంత డబ్బిచ్చినా కొనలేం. ప్రీత్: మామూలుగా భాష తెలియనివాళ్లని ఆటపట్టించడానికి సరదాగా బూతులు నేర్పిస్తుంటారు.. నీక్కూడా అలా జరిగింది కదా.. ఏదీ ఓ రెండు బూతులు...? రకుల్: నువ్వన్నది కరెక్టే. నేను ముందు నేర్చుకున్నది బ్యాడ్ వరడ్సే. ఈ ఇంటర్వ్యూ అయ్యాక నాకు తెలిసిన ఆ బ్యాడ్ వర్డ్స్ చెబుతాను. తిట్టించుకోవడానికి ప్రిపేర్డ్‌గా ఉండు. ప్రీత్: టాపిక్ మార్చేద్దాం... ఇప్పుడు బాగానే ఉన్నావ్ కదా.. మరో పదేళ్ల తర్వాత హీరోయిన్గా పనికి రావని అనిపించుకోవడానికి రెడీయేనా? రకుల్: ఓ.. నాకేం బాధ లేదు. ఎవరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండలేరు కదా. వాస్తవం ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అది నాకు ఫుల్‌గా ఉంది. ప్రీత్: ధైర్యవంతురాలికి జోహార్లు.. ఓ 20 ఏళ్ల తర్వాత రకుల్ ఎలా ఉంటుంది? ఎంతమంది పిల్లలుంటారు? రకుల్: నాకు జోస్యం తెలియదు. కానీ, ఇద్దరు పిల్లలు కావాలి. పిల్లలంటే చాలా ఇష్టం. భర్త, పిల్లలతో హాయిగా సెటిలైపోతా. ప్రీత్: మరి.. మాంగల్యం తంతునానేనా ఎప్పుడు? రకుల్: పెళ్లెప్పుడు? అని డెరైక్ట్‌గా అడగొచ్చు కదా. ఇంకో ఐదారేళ్ల తర్వాత చేసుకుంటా. ఎందుకంటే కరెక్ట్ టైమ్‌లో పెళ్లి చేసుకోవాలి. 29 లేకపోతే 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రీత్: సినిమాలు చేయొద్దని కాబోయే భర్త అంటే.. త్యాగం చేయడానికి రెడీనా? రకుల్: అలా అనేవాళ్లని చేసుకోను. అసలు ఫ్యామిలీ లైఫ్ కోసం నేనే బ్రేక్ తీసేసుకుంటానేమో. బాలీవుడ్ నటి కాజోల్ హీరోయిన్గా పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. జ్యోతిక కూడా అంతే. వాళ్లు చక్కగా సెటిలయ్యారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత జ్యోతిక సినిమా చేస్తే అందరూ చూశారు. కాజోల్, జ్యోతికలాగే రకుల్ కూడా! ప్రీత్: అసలు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావ్? రకుల్: నాకన్నా చాలా ఎత్తు ఉండాలి. నేను ఫోర్ ఇంచ్ హీల్స్ వేసుకున్నప్పుడు కూడా నాకన్నా ఎత్తుగా ఉండాలి. అప్పుడే నాకన్నా పెద్దవాడు అనే ఫీలింగ్ వస్తుంది. ప్రీత్: అయితే.. నీకు అబ్బాయిని సెలక్ట్ చేసేశాను.. ఇక ఛాయిస్ నీదే.. రకుల్: ఎవరు? ప్రీత్: ఇంకెవరూ... మన టాలీవుడ్లో ఇంకా పెళ్లి కాని రానా, ప్రభాస్ సూపర్ హైట్. నువ్వు ఫోర్ ఇంచ్ హీల్స్ వేసుకున్నా.. వాళ్లు నీకన్నా ఎత్తుగానే ఉంటారు! రకుల్: అంటే నీ ఉద్దేశ్యం ఏంటి? ఇరుకుల్లో పెట్టే పని చేయమాకు. ఇంతసేపూ నువ్వు ఏమడిగినా చెప్పాను.. ఇక చాలా ఆపు. ఇప్పుడు మనిద్దరం ఒకటే.. నువ్వు ప్రీత్ కాదు..నేను రకుల్ కాదు.. మనిద్దరం ‘రకుల్ ప్రీత్‌సింగ్’ అయిపోదాం. - డి.జి. భవాని -
నటుడు రంగనాథ్‌కు ప్రముఖులు నివాళి
-
రంగనాథ్‌కు ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : సీనియర్ నటుడు రంగనాథ్ మృతితో తెలుగు సినీ ప్రరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం సాయంత్రం ముషీరాబాద్ పరిధిలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ రంగనాథ్‌కు ఆదివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళులర్పించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గాంధీ ఆసుపత్రిలో రంగనాథ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు చిరంజీవి, మురళీ మోహన్, జమున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీరాజా, పలువురు నివాళులు అర్పించారు. రంగనాథ్ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరనిలోటని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఎనభై ఏళ్ళ వృద్ధుడి సృష్టి... డాగ్ ట్రైన్
తొమ్మిది బోగీలున్న ఓ చిన్నపాటి ట్రయిన్ ఇప్పుడా పట్టణంలో అందరినీ ఆకర్షిస్తోంది. దానిపేరు డాగ్ ట్రైన్. కుక్కలను సరదాగా రైడింగ్ కు తీసుకెళ్ళేందుకు ఓ జంతు ప్రేమికుడి సృష్టి అది. టెక్సాస్ లోని ఫోర్ట వర్త్ గ్రామంలో తిరుగుతున్న ఆ బుజ్జి రైలు... అక్కడివారినే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. పదవీ విరమణ అనంతరం వ్యవసాయంలో స్థిరపడ్డ ఎనభై ఏళ్ళ వృద్ధుడు బోస్టిక్. నిరాశ్రయులకు, జంతువులకు స్నేహితుడుగా ఉంటూ, గ్రామంలో సెలబ్రిటీగా మారాడు. తన వద్ద ఉన్న తొమ్మిది పెట్స్ ఒకేసారి వాక్ చేసేందుకు వీలుగా ఓ కొత్తరకం రైలును సృష్టించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. బోస్టిక్.. పదిహేనేళ్ళ నుంచి స్వగ్రామమైన ఫోర్ట్ వర్త్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో వీధికుక్కలను చేరదీసి పెంచుతున్నాడు. వీధి చివరిలో ఉండే ఇంట్లో బోస్టిక్... అతడి సోదరుడూ నివాసం ఉంటారు. అయితే ఇతడు జంతుప్రేమికుడ్న విషయం తెలిసో ఏమో... చాలామంది వీధికుక్కలను సైతం ఇతడి ఇంటివద్ద వదిలి వెళ్ళిపోతుంటారు. దీంతో బోస్టిక్ వాటిని చేరదీసి వాటికి ఆహారం అందించడంతోపాటు, అవి నివసించేందుకు వీలుగా సౌకర్యాలు కూడ కల్పిస్తుంటాడు. తనవద్ద ఉన్న కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్ళడం కూడ అలవాటు చేశాడు బోస్టిక్... అయితే ఇంట్లో పెంచుకునే ఒక్కదాన్నివాకింగ్ కు తీసుకెళ్ళేందుకే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. తొమ్మిది కుక్కలను ఒకేసారి తీసుకెళ్ళడం అంటే మాటలా? అతడికి అదో పెద్ద ఛాలెంజింగ్ గా మారింది. ఎన్నోసార్లు పెంపుడు కుక్కల నిపుణులతో చర్చించాడు. ఐదు కుక్కలే ఉన్నపుడు అన్నింటినీ ఒకేసారి తన ట్రాక్టర్ లో బయటకు తీసుకెళ్ళేవాడు. అవి తొమ్మిదికి చేరిన తర్వాత వాటి రైడింగ్ కోసం బోస్టిక్ పలు విధాలుగా ఆలోచించాడు. ఒకరోజు ట్రాక్టర్ కు రాళ్ళను తగిలించి లాగడాన్ని గమనించాడు. అప్పుడే బోస్టిక్ కు డాగ్ ట్రైన్ తయారు చేయొచ్చన్న థాట్ వచ్చింది. అతడు స్వతహాగా మంచి వెల్డర్ కూడ కావడంతో.. అనుకున్నదే తడవుగా ప్లాస్టిక్ డ్రమ్ములకు రంధ్రాలు చేసి చక్రాలను అమర్చి ఒకదానికొకటి కట్టి, తక్కువ ఖర్చుతో ఓ కొత్త రకం ట్రైన్ ను తయారు చేశాడు. తొమ్మిది కుక్కలూ ఒకేసారి వాకింగ్ కు వెళ్ళేందుకు వీలుగా ఉన్న ఆట్రైన్ ను ఆ పెంపుడు జంతువులు కూడ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాయి. ట్రైన్ ను చూడగానే వాకింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమై... ఇబ్బంది పెట్టకుండా ఉత్సాహంగా ఒక్కోసీట్లో ఒక్కోటి ఎక్కి కూచోవడం ప్రారంభించాయి. డాగ్ ట్రైన్ చూసి స్థానికులు కూడ ఎంతో మురిసిపోతున్నారు. వారానికి రెండ్రోజులు తోకలూపుకుంటూ హ్యాపీగా ఆ పెట్ డాగ్స్ సంతోషంగా తిరిగి వస్తున్నాయి. ''నాకిప్పటికే ఎనభై ఏళ్ళు వచ్చాయి. ఇలా ఈ జంతువుల సంరక్షణ ఎంతకాలం నేను కొనసాగించగలనో తెలియదు. కానీ నేనున్నంతకాలం మాత్రం వీటి సంరక్షణకు ఏమాత్రం లోటు చేయను'' అంటున్నాడు బోస్టిక్. బోస్టిక్ సంరక్షణలో పెరుగుతున్న ఆ పెట్ డాగ్స్ ఎంత అదృష్టం చేసుకున్నాయో.. -
ఎమ్ఎఫ్ హుస్సేన్‌కు గూగుల్ పట్టం
న్యూఢిల్లీ: భారతీయ పికాసో, అరుదైన చిత్రకారుడుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అరుదైన చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ శతజయంతి ఇవ్వాళ.. సెలబ్రిటీ స్టేటస్ అరుదైన తొలి చిత్రకారుడుగా ఎంత పేరు సాధించాడో.. వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచాడు. స్వయంగా దేశ బహిష్కార శిక్ష విధించుకున్నా.. తుదకంటా.. భారతీయుడిగా ఉంటాననే మాటకు కట్టుబడ్డాడు..ఆయన శత జయంతికి గూగుల్ ఘనంగా నివాళులర్పించింది. భారతీయ లెజెండరీ చిత్రకాడు ఎమ్మ్ ఎఫ్ హుస్సేన్ మహరాష్ట్రలోని పండర్ పూర్ లో సెప్టెంబర్ 17న జన్మించారు. హుస్సేన్ తల్లి అతడు రెండేళ్ల బిడ్డగా ఉన్నప్పుడే మరణించింది. తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఇండోర్ వెళ్లిపోయాడు. 1935లో హుస్సేన్ ముంబై సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. మొదట్లో సినిమా హోర్డింగ్ లు, పెయింటింగ్ చేసేవాడు. తర్వాత అంచలంచలుగా ఎదిగి.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచాడు. భారత దేశపు ప్రసిద్ద చిత్రకారుల సరసన చేరాడు. ఆయన వేసిన చిత్రాలకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. 1973 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. కేరళ ప్రభుత్వం రాజా రవివర్మ అవార్డుతో సత్కరించింది. 1986లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. హైదరాబాద్ తో అనుబంధం ఎమ్ ఎఫ్ హుస్సేన్ కి హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా పోస్టర్లు చిత్రించే రోజుల్లో ఆయన హైదరాబాద్ లోనే ఉండేవారు. తర్వాత కాలంలో కూడా తరచూ హైదరాబాద్ సందర్శించే వారు. ఆయన పేరిట ఇప్పటికీ నగరంలో సినిమా ఘర్ ఉంది. ఆయన చేతి నుంచి జాలువారిన సినిమా పోస్టర్లు, ఆయన ఉపయోగించిన వస్తువులు ఈ ఇంట్లో భద్రపరిచారు. అరుదైన ఘనతలు భారత్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న కళాకారుడిగా.. ఎమ్ ఎఫ్ హుస్సేన్ ఖ్యాతి గాంచాడు. అతని కుంచె నుంచి జాలువారిన ఎన్నో కళాఖండాలు కోట్ల రూపాయల ధర పలికాయి. ఆయన చిత్రాల్లో న్యూడ్ గ్నీన్ లీవ్స్ అండ్ బస్ట్ 106 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ 475 కోట్లు. ఇప్పటికీ ఇది ఒక రికార్డు. సినిమాలో... తొలి నాళ్లలో సినిమా పోస్టర్లు, బ్యానర్లు డిజైన్ చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్.. తర్వాత సినిమా రంగాన్ని వదిలేశారు. అయితే చిత్రకారుడిగా ప్రసిద్ది గాంచిన తర్వాత బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, టబులతో సినిమాలు నిర్మించారు. మాధురీ దీక్షిత్ తో చేసిన గజగామిని, టబుతో నిర్మించిన మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. వివాదాలు.. అరుదైన చిత్రకారుడుగా.. సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న ఎమ్ ఎఫ్ హుస్సేన్ జీవితంలో వివాదాలు కూడా చాలా నే ఉన్నాయి. 1990 ప్రాంతంలో ఆయనపై వివాదాల తుఫాన్ రేగింది. హిందూ దేవతా చిత్రాలను అర్థ నగ్నంగా, అసభ్యంగా చిత్రించాడని ఆభియోగాలు నమోదయ్యాయి. 1998లో భజరంగ్ దళ్ సభ్యులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఒక వర్గం మనోభావాలు గాయపడ్డాయన్న ఆరోపణలపై హరిద్వార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన ఆస్తులను జప్తు చేసి.. బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో హుస్సేన్ తనకు తాను దేశ బహిష్కరణ శిక్ష విధించుకున్నాడు. ఖతార్ దేశం హుస్సేన్ కు పౌర సత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఖతార్ ఆఫర్ సున్నితంగా తిరస్కరించిన హుస్సేన్ తాను ఎప్పటికీ భారతీయుడినే అని..తన జన్మభూమి భారత్ అని ప్రకటించాడు. చివరికి 2011 జూన్ 9న లండన్ లో గుండెపోటుతో పరాయిగడ్డపై తుది స్వాస విడిచాడు. -
శింబు ఎందుకు బరస్ట్ అయ్యాడు!
ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కిందకు పడతారా? సెలబ్రిటీ బ్రేక్‌డౌన్ గురించి సైకాలజిస్టులు అదే అంటారు. వీళ్లు డిప్రెషన్ నుంచి బయటపడడం అన్నది చాలా కష్టం. బయటపడినవారు మాత్రం మనందరికి ఇన్స్పిరేషన్గా మారతారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా మనం రీసెంటుగా ఒక యువ హీరో బలి అవడం చూశాం. శింబు పోరాడుతున్నాడు... గెలవాలని ఆశిస్తున్నాం. శింబు! యాక్టర్, డెరైక్టర్, ప్లేబాక్ సింగర్. లిరిసిస్ట్. ఇవన్నీ ఎవరికి గుర్తు? స్మార్ట్ గై, రొమాంటిక్. కిస్సింగ్ కిల్లర్, అల్లరిచిల్లర్, ప్లేబాయ్. - ఇదీ ఐడెంటిటీ! అంతకన్న ముఖ్యమైన ఐడెంటిటీ... నయనతార కింది పెదవిని మునిపంటితో లాగి సాగదీయడం.అయితే శింబుకి ఇప్పుడు ఎలాంటి ఐడెంటిటీ లేదు. చివరికి ‘నా’ అనుకున్న హన్సిక కూడా లేదు. మనిషి కూడా మునుపటిలా లేడు. రెండున్నర ఏళ్ల నుంచీ శింబూ తమిళనాడులోనే ఉన్నాడు కానీ, తమిళ్ ఇండ్రస్టీలో లేడు. శింబుకి ఏమైంది? నల్ల చొక్కాతో ఎక్కువగా కనిపిస్తున్నాడు. తక్కువగా మాట్లాడుతున్నాడు. శింబు.. ఇప్పుడు ‘మ్యాన్ ఆఫ్ ఎమోటికాన్స్’. అతడిలో చిన్న స్ట్రింగ్ కదిలినా ఎమోషన్స్ గొంతులోకి వచ్చేస్తున్నాయి. శృతి, లయ తప్పిన ఉద్వేగాలవి.రెండేళ్లయింది. శింబుకి సింగిల్ రిలీజ్ కూడా లేదు. కెరీర్ దెబ్బ తింది. పర్సనల్‌గా కూడా దెబ్బతిన్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. హన్సికతో ఉన్నప్పుడు అతడు చాలా అనుకున్నాడు. ఇల్లు, పిల్లలు, భార్య అని కలలు కన్నాడు. కెరీర్లో తలకిందులైనప్పుడైతే హన్సిక తనను నిలబెడుతుందని అనుకున్నాడు. ఆమె నిలవలేదు. ఆమె ప్రేమ నిలవలేదు. ‘‘శ్వాస ఒక్కటే ఇప్పుడు నాతో నిలిచి ఉంది’’ అన్నాడు శింబు.. బాధగా అసలైతే శింబు ఎప్పుడూ ఎలాగుండేవాడంటే... చీర్‌ఫుల్‌గా, ఎంథూజియాస్టింగ్గా! సిల్వర్‌స్పూన్ తో పుట్టి సిల్వర్ స్క్రీన్ పై ఎదిగిన వాడు శింబు. తండ్రి టి. రాజేందర్, తల్లి ఉష.. ఇద్దరూ సినీ ప్రముఖులే. చదివింది డాన్ బాస్కోలో, సెయింట్ జాన్స్‌లో. చైల్డ్ ఆర్టిస్టుగా అతడివి పదకొండు సినిమాలు. స్టార్ ఆర్టిస్టుగా పదహారు సినిమాలు. ‘విన్నైత్తాండి వరువాయ’ (2010)లో శింబు నటకు ఫ్లాట్ అయిపోయిన కె.బాలచందర్ భేష్ అంటూ అతడికో బహిరంగ లేఖ రాశారు. ‘వానం’ (2011)లో అతడి యాక్షన్ అద్భుతంగా ఉందంటూ ‘ది హిందూ’ మాలతీ రంగరాజన్ ప్రశంసలు కురిపించారు. ‘వల్లవన్’ (2006)లో నయనతార పెదవిని లాగి మూటకట్టుకున్న అప్రతిష్టను శింబు ఈ రెండు సినిమాలతో తుడిచేసుకోగలిగాడు.‘వానం’ తర్వాత 2012 దీపావళికి ‘పోడా పోడీ’ రిలీజైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి శింబూ చిత్రం ఇంకోటి రాలేదు! రాబోయే చిత్రాలు మాత్రం ఎనిమిది వరకు ఉన్నాయి. (2015లో ఐదు, 2016లో రెండు, 2017లో ఒకటి). అయితే శింబు ఈ ఎనిమిదింటిలో ఇప్పుడు ఒకే ఒక చిత్రంగా గురించి మాట్లాడుతున్నాడు! అది తప్ప తనకు వేరే హోప్ లేదని అంటున్నాడు. గౌతమ్ మీనన్ ‘అచ్చమ్ ఎన్బతు మడమైఎడ’ చిత్రం అది. 2017 లో రిలీజ్ కావలసిన సినిమా అదే. ఎందుకు అఫర్స్ తగ్గిపోయినట్లు? రకరకాల సందేహాలు, వాటికి సమాధానాలుగా రకరకాల రూమర్లు. శింబు సెట్స్‌లోకి టయానికి రాడట! నిజమేనా? లేట్ అవుతుందని ముందే చెప్తాను. చెప్పినట్లే వెళతాను. ఇందులో చీటింగ్ ఏముంది?’’ అంటాడు. అయితే అలాంటి మైనెస్లు అతడిలో చాలా ఉన్నాయంటారు! ఊరికూరికే ఎవరితో పడితే వారితో ప్రేమలో పడిపోతాడు. ఎక్కడ పడితే అక్కడ పట్టుబడిపోతాడు. అలా పడడం, పట్టుపడిపోవడం అతడి షెడ్యూళ్లను తరచు దెబ్బతీస్తుంటుంది. అయితే శింబూ పాయింట్ వేరే! ‘‘నేనెప్పుడూ ఒకే టేక్‌లో షాట్ కంప్లీట్ చేస్తాను. ఆ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడరేమిటి?’’ అంటాడు. శింబు... ధనుష్‌తో, నయనతారతో (కలిసి, వేర్వేరుగా) పార్టీలకు తిరగడం కూడా ఇష్యూ అయింది. తన లోకంలో తను పడి, సినిమాను సెకండరీ చేసుకున్నాడన్న విమర్శలూ వచ్చాయి. కానీ ధనుష్ నాకు ముఖ్యం అంటాడు శింబు. ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్తారు. వీడియో గేమ్స్ ఆడుకుంటారు. ఈ పిల్ల చేష్టలను ఎంతో గంభీరమైన సినీ పరిశ్రమ సహిస్తుందా? హన్సిక కూడా ఇందుకే అతడిని వదిలేసిందా? లేక శింబూనే దూరం అయ్యాడా? రిలేషన్‌షిప్‌పై శింబుకి క్లారిటీ ఉంది. హన్సిక విషయంలో అతడే ఒప్పేసుకున్న నిజం ఏమిటంటే - పెళ్లి విషయంలో ఇద్దరికీ ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయట. అందుకే వద్దనుకుని, విడిపోయారట. మొత్తంగా చూస్తే శింబు స్థిరత్వం కోల్పోయిన మనిషని చెప్పాలా? ఆ అస్థిరతే ఇప్పుడు శింబుని ఆడియో ఫంక్షన్లో ‘బరస్ట్’ అయ్యేలా చేసిందా?ఇప్పుడేమిటి? శింబు మారతాడా? చెప్పలేం. శింబు మళ్లీ ప్రేమలో పడతాడా? ‘ఏమో చెప్పలేను. కనీసం కొన్నాళ్లయినా ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటున్నాను’’ అంటున్నాడు. శింబు. ప్రేమకు దూరం అవడం, సినిమాలకు అతడిని చేరువ చేస్తుందా? చూడాలి. గా‘కిస్సు’లు తమిళ నటి నయనతారకు. కన్నడ నటి హర్షికకు. మరాఠీ నటి హన్సికకు. గా‘సిప్పు’లు నయనతారతో పెళ్లి.హన్సికతో డేటింగ్. రీల్సైడ్ రోమియో. గా‘గ్యాపు’లు నటుడిగా 2007, 2009, 2012దర్శకుడిగా 2007-2012 సింగర్‌గా 2005 గీతరచయితగా 2007-2010 సెలబ్రిటీ డిప్రెషన్ సెలబ్రటీలలో డిప్రెషన్‌కు సాధారణంగా కనిపించే కారణం వారు ఒక్కసారిగా పైనుంచి కిందపడడం. దాంతో ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. అయితే కొందరిలో దీన్ని క్రైసిస్ అనలేం. జస్ట్ ఓపెన్ అయ్యారని అనుకోవాలి. అప్పుడప్పుడూ అలా ఓపెన్ అవడం మంచిదే. గుండె భారం తగ్గుతుంది. మళ్లీ మామూలు మనిషి కాగలుగుతారు. - డాక్టర్ షెఫాలీ బాత్రా, సైకియాట్రిస్ట్, ముంబై ఏదైనా చేయగలడు లవ్, వయొలెన్స్, యాక్షన్... ఎలాంటి పాత్రనైనా శింబు చక్కగా పోషించగలడు. సౌత్ ఇండియా రణబీర్ కపూర్ అతడు. - గౌతమ్ మీనన్, తమిళ దర్శకుడు (ప్రస్తుతం శింబుతో ‘అచ్చమ్ ఎన్బదు మడమైయాడ’ చిత్రాన్ని తీస్తున్నారు) వెరీ డిఫరెంట్! శింబు జీనియస్. తను డెరైక్ట్ చేస్తున్నా కూడా సెట్స్‌లోకి ఒక నటుడిలా వస్తాడు. అతడు డిఫరెంట్. మేధావి. - రీమాసేన్, బాలివుడ్ నటి ఒకటే రాశి! మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరిదీ ఒకటే రాశి. కుంభం. కానీ మా యాటిట్యూడ్‌లో కొన్ని వ్యత్యాసాలున్నాయి. ఏ పనైనా నేను త్వరత్వరగా చేసేస్తాను. తను నెమ్మదిగా చేసుకుపోతాడు. సహనం ఎక్కువ. మమ్మల్ని విడదీయాలని చాలామంది ట్రై చేశారు. మేము వాళ్లకా చాన్స్ ఇవ్వలేదు. - ధనుష్, తమిళ నటుడు మనమొక ఫ్యామిలీ శింబు అలా మాట్లాడగానే నేను మెసేజ్ పెట్టాను. ‘నేనున్నాను. నీకు ఏం కావాలన్నా చెప్పు. మనమొక ఫ్యామిలీ. రిలీజ్ కాని ‘వాలు’ సినిమా సంగతి కూడా నేను చూస్తాను. డిప్రెషన్ అవసరం లేదు. సంఘం తరఫున నిలబడతాను’ అని మెసేజ్ పెట్టాను. దానికి శింబు స్పందించి ‘మీరున్నారని నేను ధైర్యంగా ఉన్నాను. నాకేమన్నా కావాలంటే మిమ్మల్ని అడుగుతాను’ అన్నాడు. - ఆర్. శరత్‌కుమార్, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు తమిళ్ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ లాంటిదని, ఈ ‘ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే’ నాడు శింబుకి మేమందరం తోడుంటామని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ అన్నారు. -
అర్థం చేసుకోండి..
రీల్ లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన ప్రియాంక చోప్రా.. రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా సిగ్గరిని అని బడాయి పోతోంది. ‘సినిమా వాళ్ల దగ్గర బోలెడు డబ్బులుంటాయి.. ఏది కోరుకుంటే అది వాళ్ల కాళ్ల దగ్గరకు వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ సెలబ్రిటీ హోదాలో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాం’ అని వాపోతోంది ఈ ముద్దుగుమ్మ. తనకంటూ ప్రైవసీ కావాలంటోంది. తన విన్నపాలు జనం వినవలెనని కోరుతోంది. తాజాగా నిర్మాతగా మారిన ప్రియాంక ఇలాంటి కామెంట్లు చేయడంపై అప్పుడే సైటర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. -
సెలబ్రటీ గొర్రె పొట్టేలు
-
పెళ్లయ్యాక ప్రేమలో పడ్డాం...
‘‘పెళ్లయ్యాకే నేను ప్రేమలో పడ్డా’’ అంటున్నారు నటుడు అలీ. ఆయనే కాదు, ఆయన భార్య కూడా అదే మాట చెబుతున్నారు. జుబేదా బేగంతో ఆయన పెళ్లయి ఇప్పటికి ఇరవయ్యేళ్లు. ఇన్నేళ్ల సంసార జీవితంలో చిన్ని చిన్ని అలకలు, చిరు కోపాలు సర్వసాధారణమంటున్నారు జుబేదా. అవి ఉంటేనే మజా అని అలీ చెప్పారు. మొత్తానికి ‘మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘మేమిద్దరం.. మాకు ముగ్గురు’’ అంటూ, తమ దాంపత్య జీవితపు ముచ్చట్లను ఈ భార్యాభర్తలు ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా పంచుకున్నారు. పెళ్లి రోజే ఆమెను చూశా! అమ్మా నాన్నలు చూసిన అమ్మాయినే మనువాడాలన్నది అలీ ఆశయం. తమ మాట కాదనడనే నమ్మకంతోనే అలీ అమ్మా, నాన్న తమకు నచ్చిన ఓ అమ్మాయిని కోడలిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆ పిల్ల గురించి కొడుక్కి చెప్పారు. ‘‘అప్పట్లో నేను మద్రాసులో బిజీ ఆర్టిస్ట్‌ని. సినిమా తారలుగా మమ్మల్ని ఇష్టపడేవాళ్లు, పెళ్లాడతామనే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ నేను అమ్మా నాన్న చూసిన అమ్మాయినే పెళ్లాడాలనుకున్నా. అలాగే ఒక అమ్మాయిని వాళ్లు చూశారు. ఆమే జుబేదా బేగం. ‘ఈ అమ్మాయి చాలా బాగుంది. నాకూ, నాన్నకు నచ్చింది’ అని ఫోన్లో చెప్పింది అమ్మ. నేను అమ్మాయిని చూడకుండానే, ‘ఓకే’ అన్నా. పెళ్లి నాడే నా భార్యను చూశాను’’ అని భార్య కళ్లల్లోకి కొంటెగా చూస్తూ అలీ ఆ సంగతులు చెప్పుకొచ్చారు. అలీతో పెళ్ళికి కారణం ఆయనే! పెళ్లి నాటి విశేషాలను జుబేదా గుర్తు చేసుకుంటూ, ‘‘నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. ఎందుకంటే మా పెదనాన్న ఇర్షాద్గారు అప్పట్లో పెద్ద పెద్ద సినిమాలకు కాస్ట్యూమర్‌గా పని చేసేవారు. షూటింగ్‌లు చూడడం కోసం ఆయనతో పాటు అప్పుడప్పుడూ నేను వెళ్లేదాన్ని. అక్కడ ఏ ఆర్టిస్ట్ కనిపించినా ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో పాటు, ఫొటోలు కూడా దిగేదాన్ని. కానీ, ఓ సినిమా ఆర్టిస్ట్‌తో పెళ్లవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ సంబంధం రావడానికి కారణం కూడా మా పెదనాన్నగారే. ‘నేనా కుర్రాణ్ణి చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. చాలా మంచోడు’ అని ఆయనే మా అమ్మా నాన్నలతో చెప్పారు. ఆ విధంగా అలీ నా జీవితంలోకొచ్చారు. లెజెండ్ లాంటి ఆర్టిస్ట్ నాకు భర్తగా దొరికేలా చేసిన మా పెదనాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అన్నారు. మా పెళ్లైన కొత్తలోనే ఆవిడ ఆ మాట చెప్పింది! పెళ్లయ్యే నాటికే అలీ ఫుల్ బిజీ. ఎంత బిజీ అంటే కొత్తగా పెళ్లయ్యిందని మర్చిపోయేంత! ఇంటిని పట్టించుకునే తీరిక కూడా ఉండేది కాదు. భార్య సహకారం ఉండబట్టే, వృత్తిపై వంద శాతం దృష్టి పెట్టగలిగానంటారు అలీ. ‘‘జుబేదా అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ. మా పెళ్లయిన కొత్తలో ‘ఇంటి బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తిస్తా. మీ పని మీరు హాయిగా చేసుకోండి’ అని మా ఆవిడ చెప్పింది. ఆ రోజు నుంచీ ఈ రోజు వరకూ ఆమె ఉదయం 5 గంటలకు లేచి, ఎవరికి ఏం కావాలో స్వయంగా చూసుకుంటుంది. నా వరకూ నేను షూటింగ్ ఉంటే ఆ పని చూసుకుంటాను. లేదంటే... ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రపోతాను. ఇంటి పనులేవీ పట్టించుకోను. అంటే... ఆమె ఎంత బాగా చూసుకుంటోందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు అలీ. ఆ రోజు నుంచే అలీతో ప్రేమలో పడ్డా! అప్పటివరకూ సామాన్య జీవితం గడిపిన జుబేదా సెలబ్రిటీ భార్యగా మారిన తర్వాత కొత్త జీవితం చూడటం మొదలుపెట్టారు. పెళ్లయిన తర్వాతే విమానం ఎక్కానని ఆమె చెప్పారు. ‘‘పెళ్లయిన మొదటి రోజే మావారితో నేను ప్రేమలో పడ్డాను. ఎలా అంటే... నాకు చిన్నప్పట్నుంచీ విమానం అంటే ఇష్టం. విమానం వెళుతుంటే చూడటం తప్ప, ఎక్కే అవకాశం ఎప్పుడూ రాలేదు. మా పెళ్లయిన మరుసటి రోజే విమానం ఎక్కే అవకాశం దక్కింది. అప్పుడు కె. రాఘవేంద్రరావుగారి ‘ముద్దుల ప్రియుడు’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రాఘవేంద్రరావుగారు మా ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు పంపి, మమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకున్నారు. ‘ముద్దుల ప్రియుడు’ షూటింగ్ లొకేషన్లో ఆర్టిస్టులందరి మధ్యలో మాతో కేక్ కట్ చేయించారు. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించారు. నాకెప్పటికీ ఆ రోజు అలా గుర్తుండిపోతుంది’’ అన్నారు జుబేదా. ఆమెలో నాకు నచ్చిన లక్షణం అది! కొంతమంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత అత్తింటిని కూడా పుట్టింటిలా భావిస్తారు. జుబేదా అలాంటి అమ్మాయే అంటారు అలీ. ‘‘నాకు నలుగురు అక్కలు, ఒక తమ్ముడు. అందర్నీ ప్రేమగా చూసుకుంటుంది జుబేదా. ఎవరెవరికి ఏమేం కావాలో తెలుసుకుంటుంది. ఒక్కోసారి వాళ్ల కోసం తనే ఆలోచిస్తుంది. ఆమెలో నాకు బాగా నచ్చే లక్షణం అది’’ అని అలీ అన్నారు. ఆయనలో నచ్చిన లక్షణం అది! వెండితెరపై కామెడీ పండిస్తూ, అందర్నీ నవ్వించే అలీ విడిగా కూడా అలానే ఉంటారట. అలాగే, ఒక విషయాన్ని సరిగ్గా అంచనా వేసే విషయంలో కూడా ఆయన దిట్ట అంటారు జుబేదా. ‘‘ఎలాంటి పరిస్థితులనైనా అలీ కరెక్ట్‌గా జడ్జ్ చేస్తారు. ఎంత కరెక్ట్ అంటే కొన్నేళ్ల తర్వాత కూడా, ‘ఓ... అప్పుడు అలీ చేసింది అందుకా!’ అని అనిపించేంత. ఎలాంటి పరిస్థితిలోనూ టెన్షన్ పడరు. ఎవర్నీ తొందరపడి ఒక్క మాట అనరు. ఆయనలో నచ్చిన లక్షణం అది. చిన్నప్పటి నుంచి అలీ ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. తను పడ్డ కష్టాలు పిల్లలకు రాకూడదని నిరంతరం ఆయన శ్రమిస్తూనే ఉంటారు. వాళ్లను దగ్గర కూర్చోబెట్టుకుని మంచీ చెడు చెబుతారు. మా పిల్లలకు ఎండ విలువ, కష్టం విలువ తెలుసంటే దానికి కారణం అలీ. పిల్లలకేం కావాలో అది ఇస్తారు కానీ, అతి గారాబం చేయరు. ఆయనలో ఇంకో మంచి గుణం ఏంటంటే... పెళ్లయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్ అన్నట్టు ఎక్కడా ప్రవర్తించలేదు. ఉదయం లేచి ఆఫీసుకు వెళ్లినట్టు వెళతారు. అలానే వచ్చేస్తారు. ఎవరన్నా పక్కింటి వాళ్లు ఈ రోజు మీ ఆయన ఏ షూటింగ్‌కు వెళ్లారు అన్నప్పుడు మాత్రమే, ఈయన ఆర్టిస్ట్ కదా అని గుర్తొస్తుంది. అలాగే ఆహారపుటలవాట్లు కూడా. ముస్లిమ్ కాబట్టి ఆయనెప్పుడూ నాన్-వెజ్ తింటారనుకుంటే పొరపాటే. ఆయన రోజూ తీసుకెళ్లే లంచ్‌లో నాన్-వెజ్ ఉండదు. వారానికి ఒకసారి మాత్రమే తింటారు’’ అని వివరించారు. చేసే పనికి ఆమె అడ్డుపడడం ఇష్టముండదు! ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమించినా, వాళ్లలో నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి. మరి, ఈ అనురాగ దాంపత్యంలోనూ అలాంటివి ఉన్నాయా? భార్యలో తనకు నచ్చని విషయం గురించి అలీ చెబుతూ - ‘‘నేను చేసే పనికి అడ్డుపడి, ‘ఇది వద్దు, అలా చెయ్యాలి..’ అంటే నాకిష్టం ఉండదు. దాని గురించి వివరంగా చెప్పి, ‘ఇది మంచి, ఇది చెడు’ అంటే అప్పుడు వింటాను. నాకు సంబంధించిన ఏ పనిలోనైనా వేలు పెట్టడం నాకిష్టం ఉండదు. అది మా ఆవిడకు తెలుసు’’ అన్నారు. ఆయనలో నాకు నచ్చనివి అవే! భర్తలో తనకు నచ్చని విషయాలూ కొన్ని ఉన్నాయని జుబేదా చెబుతూ - ‘‘అలీ ఎవరినైనా వెంటనే నమ్మేస్తారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే చాలు కరిగిపోతారు. వాళ్లు వంద రూపాయలు అడిగితే ఈయన నాలుగు వందలిస్తారు. నాకు అది నచ్చదు. ఎందుకంటే... వాళ్లు చెబుతుంది నిజమో కాదో, వాళ్లు అడిగే డబ్బు మంచికో, కాదో కనుక్కొని సహాయం చేస్తే బావుంటుంది కదా అంటాను. నా మాట వినరు. ఆయన నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో లాంటి కారెక్టర్స్ నచ్చవు. అలాగే, ఆయనకు ఎంత కష్టం వచ్చినా తనలో తానే బాధపడతారు తప్ప, ఇంకొకరికి తెలియనివ్వరు.. అదే నాకు నచ్చదు. అమ్మ వైపు మాట్లాడను! అలాగని, మా ఆవిణ్ణి వెనకేసుకు రాను! ఎంత అన్యోన్యమైన కుటుంబం అయినా అత్తా కోడళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. మరి, అలీ ఇంట్లో పరిస్థితి ఏమిటి? ‘‘మా ఇంట్లోనూ వస్తాయి. కాకపోతే, అలాంటివి వచ్చినప్పుడు నేను ఏ ఒక్కరి వైపూ వకాల్తా తీసుకొని మాట్లాడను. ఎందుకంటే అమ్మ వైపు మాట్లాడితే మా ఆవిడ బాధపడొచ్చు. అదే మా ఆవిడను వెనకేసుకొస్తే... చిన్నప్పట్నుంచీ ఎన్నో కష్టాలకోర్చి పెద్ద చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన పెళ్లాం వైపు మాట్లాడుతున్నాడని అమ్మ అనుకోవడం సహజం. అందుకని నేనెవ్వరి వైపూ ఎప్పుడూ మాట్లాడను. రెండ్రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. అత్తాకోడళ్ళు తమకు తామే జోకులేసుకుంటూ మామూలు అయిపోతారు’’ అని వివరించారు అలీ. మాకు చదువు విలువ తెలుసు! చిన్నప్పుడే సినిమాల్లోకి రావడంవల్ల అలీకి పెద్దగా చదువుకునే వీలు చిక్కలేదు. జుబేదా కూడా పెద్దగా చదువుకోలేదు. అందుకే, తమ బిడ్డలను బాగా చదివించాలని పెళ్లయిన తొలినాళ్లల్లోనే నిర్ణయించుకున్నారు. దీని గురించి అలీ చెబుతూ -‘‘చిన్నప్పుడే ఆర్టిస్టుగా సెటిలయ్యాను. అలాగే, మా ఆర్థిక పరిస్థితి వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ జీవితాన్ని చదివాను. మాకు చదువు విలువ తెలుసు కాబట్టి పిల్లలను బాగా చదివించాలనుకుంటున్నాను. మా పెద్దమ్మాయి ఫాతిమాకు ఇప్పుడు 15 ఏళ్లు నిండాయి. కానీ మా అబ్బాయికి 5 ఏళ్లు. చిన్న పాపకు 3 ఏళ్లు. పిల్లల వయస్సులో ఇంత తేడా ఎందుకంటే... కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆ గ్యాప్ కావాలని డాక్టర్ చెప్పారు’’ అన్నారు. తాను పదో తరగతి వరకే చదివానని, ఆ తర్వాత పెళ్లి కావడంతో ఇక చదువు గురించి ఆలోచించలేదనీ జుబేదా చెప్పారు. అల్లా దయ వల్ల అందరం హ్యాపీ... అలీకి దైవభక్తి మెండు. ‘‘ఒక ముస్లింగా రంజాన్ మాసంలో రోజుకి అయిదు సార్లు ఖురాన్ చదువుతాను. జుబేదా కూడా ఖురాన్ చదవడం పూర్తి చేసింది. మా పెదపాప కూడా కోర్స్ పూర్తి చేస్తోంది. అందరం అల్లాను నమ్ముతాం. వేరే రోజుల్లో ఎలా ఉన్నా, తప్పనిసరిగా శుక్రవారం రోజు మాత్రం షూటింగ్ గ్యాప్లోనైనా సరే అయిదుసార్లు నమాజ్ చేస్తాను. అల్లా దయవల్ల మేం హ్యాపీగా ఉన్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి’’ అన్నారు అలీ. అలీ లాంటి భర్త దొరికితే ఆనందమే! ఏ అమ్మాయికైనా మంచి భర్త దొరికితే అంత కన్నా ఆనందం మరోటి ఉండదని జుబేదా చెబుతూ- ‘‘నేను మాత్రం అల్లా సాక్షిగా చెబుతున్నాను... ప్రతి ఆడపిల్లకూ అలీ లాంటి భర్త దొరకాలి. అప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు. - సంభాషణ, ఫొటోలు: శివ మల్లాల -
హీరోయిన్గా చేయమనగానే...నాలో దిగులు మొదలైంది!
తెలుగు తెరపై ప్రస్తుతం ‘గ్లామరస్ మదర్’ అనగానే.. టకీమని ప్రగతి గుర్తొస్తారు. ఆమె అభినయంలో సహజత్వం ఉట్టిపడుతుంటుంది. ప్రతి సినిమాలోనూ ప్రగతి వాంటెడ్. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, సెలబ్రిటీ స్థాయికి చేరిన ప్రగతితో ‘సాక్షి’ సంభాషణ. ఎలా ఉన్నారండీ? దేవుని దయవల్ల బాగున్నానండీ.. చేతిలో అయిదు సినిమాలున్నాయి. అన్నింట్లోనూ తల్లిగానే చేస్తున్నా. ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ అయిదు సినిమాలు? ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ప్రకాశ్‌రాజ్, జయసుధల కూతురి పాత్ర నాది. కాజల్ అగర్వాల్‌కి తల్లిని అన్నమాట. ప్రకాశ్‌రాజ్‌గారి పెయిర్‌గా చాలా సినిమాల్లో చేశాను. ఇప్పుడు కూతురిగా నటించడం కొత్త అనుభవం. గోపీచంద్ ‘లౌక్యం’లోనూ నాది తల్లి పాత్రే. అయితే... ఇది కామెడీ తల్లి పాత్ర. ఈ రెండింటికీ భిన్నమైన పాత్రను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో చేస్తున్నాను. వీటితో పాటు నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలో కూడా నాది తల్లి పాత్రే. మీ కెరీర్ హీరోయిన్గా మొదలైంది కదా? అవును. తమిళ్లో కె. భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘వీట్టులే విశేషం’ నా తొలి చిత్రం. ఇక్కడ ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’గా విడుదలైంది. హీరోయిన్గా మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటారు? ఎనిమిది సినిమాలే. అందులో ఒకటి మలయాళం. మిగిలిన ఏడూ తమిళంలోనే చేశాను. హీరోయిన్గా నా కెరీర్ కేవలం రెండేళ్లు. వెంటనే పెళ్లి చేసేసుకున్నాను. 1995లో నటనకు దూరమయ్యాను. 96లో అబ్బాయి పుట్టాడు. మళ్లీ 98 నుంచి నటించడం మొదలుపెట్టాను. హీరోయిన్గా చేసిన మీరు కేరక్టర్ నటిగా స్థిరపడ్డారు. ఈ మార్పు ఎలా ఉంది? అసలు నాకు హీరోయిన్ అవ్వాలని లేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయిందంతే. హీరోయిన్గా ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, పెద్ద తేడాగా కూడా ఏమీ లేదు. మళ్లీ నటన మొదలుపెట్టగానే... ముందు టీవీ సీరియల్స్ చేశాను. అక్కాచెల్లెళ్లూ, అమ్మ సీరియల్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘అక్కాచెల్లెళ్లు’ చూసే ‘నువ్వు లేక నేను లేను’ సినిమాలో అమ్మ వేషానికి పిలిపించారు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మీ సినీ ప్రయాణం యాధృచ్ఛికంగా మొదలైందన్నారు కదా... ఆ వివరాలు? మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ కష్టపడి చదివించింది. నేను యావరేజ్ స్టూడెంట్‌నే. అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాలని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే... టీవీల్లో వచ్చే కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పేదాన్ని. అలాగే మోడలింగ్ కూడా చేసేదాన్ని. చెన్నయ్‌లోని ‘మైసూర్ సిల్క్ ప్యాలస్’ షోరూమ్ కోసం మోడలింగ్ చేశాను. ఆ ఫొటోలు భాగ్యరాజాగారి వద్దకెళ్లాయి. ఆడిషన్స్‌కి వెళ్తే ఎంపిక చేశారు. చెల్లెలు పాత్రకేమో అనుకున్నాను. ఆ పాత్ర అయితే... పెద్దగా వర్కింగ్ డేస్ ఉండవు కాబట్టి, చేసేయొచ్చులే అనుకున్నా. కానీ... ‘ఓకే’ చేసింది హీరోయిన్‌కి. అది విని షాక్. నాలో దిగులు మొదలైంది. ‘షూటింగ్‌ల చుట్టూ తిరిగితే చదువు పాడవుతుందేమో’ అని అమ్మతో అన్నాను. అమ్మ ధైర్యం చెప్పడంతో అంగీకరించా. అదే ‘వీట్టులే విశేషం’. తెలుగు చక్కగా మాట్లాడతారు. నేపథ్యం వింటే చెన్నయ్‌లా అనిపిస్తోంది. మీ స్వస్థలమెక్కడ? నేను పక్కా తెలుగమ్మాయిని. మాది హైదరాబాద్. టెన్త్‌దాకా ఇక్కడే చదువుకున్నాను. తర్వాత చెన్నయ్ వెళ్లిపోయాం. అక్కడే నా కెరీర్ మొదలైంది. నేను చిన్నప్పుడే క్లాసికల్ నేర్చుకున్నాను. నటరాజ రామకృష్ణ మా గురువుగారు. మీ పాత్ర పోషణలో సహజత్వం కనిపిస్తుంటుంది... అమ్మ పాత్ర నటించకూడదు. ప్రవర్తించాలి. అమ్మ మనస్తత్వంలో మార్పు ఉండదు. జానర్లు మారే కొద్దీ బిహేవియర్, మాటతీరు మారుతుందంతే. దీన్ని బట్టి నడుచుకొని చేయాలి. అదే నా శైలి. నటిగా మీ లక్ష్యం? కేరక్టర్ యాక్ట్రెస్ అని కళ్లు మూసుకుంటే... కొందరు మనకు గుర్తొస్తారు. అలా భావి తరాలకు నేను గుర్తు రావాలి. రాబోయే తరంలో నా పాత్రలు ఎవరు చేసినా.. ‘ఈ పాత్ర ప్రగతి అయితే.. గొప్పగా చేసేది’ అని గుర్తు చేసుకొని మరీ మాట్లాడాలి. ఆ స్థాయికి రావాలనేది నా లక్ష్యం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరిప్పుడు సెలబ్రిటీ అవడం మీకు ఏమనిపిస్తోంది? ఇదంతా భగవదనుగ్రహం. జీవితంలో నిలబడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు. మావారు ఐటీ ఉద్యోగి. మాకు ఏ బాధలూ లేవు. అయితే బెంగల్లా ఒక్కటే. పాపులారిటీ, డబ్బు సంపాదించుకోగలిగాను కానీ, సంతృప్తి మాత్రం లేదు. నటిగా అనుకున్న స్థాయిలో నాకు ఇంకా గుర్తింపు రాలేదు. మన దర్శక, నిర్మాతలకు తల్లి పాత్ర అనగానే నేను గుర్తొస్తున్నాను. ఇది ఆనందించాల్సిన విషయమే కానీ, ఇంకా ఎన్నో వెరైటీ పాత్రలు చేయాలని ఉంది. -
వాడికి నేను...అక్కను కాదు అమ్మను!
రాఖీ పండుగ... ఒకరికి ఒకరు అండగా నిలుస్తామని ప్రమాణం చేసే పండుగ... చెల్లెళ్లు అన్నయ్యలకు మాత్రమే రాఖీ కట్టే పండుగ కాదు... అక్కయ్యలు తమ్ముళ్లకు అండగా నిలుస్తామనే భరోసా ఇచ్చే పండుగ కూడా ... శ్రీకాంత్, అనిల్... . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తారలు... నిర్మల... ఆ సెలబ్రిటీల తోబుట్టువు... నలభై సంవత్సరాలుగా వీరి మధ్య అనుబంధం ఎంతో పొందికగా కొనసాగుతోంది... ‘మాకు అందరి కంటె మా అక్కే ఎక్కువ’ అని ఆ తమ్ముళ్లు చెబుతుంటే... ‘నాకు మా ఇద్దరు తమ్ముళ్లు దేవుడిచ్చిన బహుమతి... వాళ్లు నాకు పెద్ద కొడుకులు, ఆ తరవాతే మా అమ్మాయి’ అంటున్నారు అక్కయ్య నిర్మలచిన్నప్పటి నుంచీ తమ్ముళ్లతో టెన్షన్స్... తరవాత సరదాలు, సాహసాలూ... రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఈ అక్కాతమ్ముళ్ల ఆప్యాయతానురాగాలను శ్రీకాంత్ సోదరి నిర్మల ‘సాక్షి’ తో మురిపెంగా పంచుకున్నారు. రక్షాబంధనం... మా పెద్ద తమ్ముడు శ్రీకాంత్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నేను మొట్టమొదటిసారి రాఖీ కట్టాను. అప్పుడు వాడు తనకి స్పోర్ట్స్‌లో వచ్చిన బహుమతులలో నుంచి ఒక బొమ్మ తీసి, దాన్ని అందంగా ప్యాక్ చేసి, ప్రేమగా నా చేతికి ఇచ్చినట్లు గుర్తు. అప్పటి నుంచి ఈ రోజు వరకూ ఒక్క సంవత్సరం కూడా మానకుండా రాఖీ కడుతున్నాను. రక్షణకేనా... రాఖీ కట్టడమంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్లకు రక్షణ కల్పించడం అనుకుంటారు చాలా మంది. నా లెక్క ప్రకారం సందర్భాన్ని బట్టి ఒకరికొకరు రక్షణగా నిలబడాలి. నేను మా ఇంట్లో పెద్దదానిని. అందువల్ల మా తమ్ముళ్లకి రాఖీ కట్టి వాళ్లని ఆశీర్వదించే అవకాశం నాకు ఈ రోజు హక్కుగా సంక్రమించినట్టు, ‘భగవంతుడి రక్ష’ నాతో కట్టిస్తున్నట్టు భావిస్తాను. బాధగా ఉండేది... నేను పుట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత మా కాంతి (శ్రీకాంత్‌ని ప్రేమగా కాంతి అంటారు) పుట్టాడు. నా ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుంచి వాడంటే ప్రాణం. ఎవరైనా మా కాంతిని ఏమైనా అన్నారో, ఇక వాళ్ల పని అయిపోయినట్లే! బాల శ్రీకృష్ణుడు మా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా మేనత్త మా ఇంటికి వచ్చారు. మా కాంతి ఆవిడని ఏదో అడిగితే, ఆవిడ కాదన్నారు. అందుకు వాడికి కోపం వచ్చింది. వాడు అదనుకోసం చూస్తున్నాడు. ఆవిడ స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లి, తలుపు మీద బట్టలు వేయగానే, ఆ బట్టలు తీసుకుని, గోడ ఎక్కేశాడు. నాన్నగారు వాళ్లు చూస్తారేమోనని నాకు భయం. బట్టలు ఇచ్చేయమని వాడిని ఎంతో బతిమాలాను. ఈ లోపల అమ్మవాళ్లంతా అక్కడకు వచ్చారు. ఎలాగో చివరకు బట్టలు ఇచ్చాడు. అప్పటి నుంచి వాడిని మావాళ్లంతా ముద్దుగా శ్రీకృష్ణుడు అనేవారు. ఇంతా చేస్తే అప్పుడు వాడికి ఐదేళ్లు. మాఅత్తయ్య ఇప్పటికీ ఆ సంఘటన తల్చుకుని నవ్వుకుంటారు. స్కూల్లో నా పక్కనే... స్కూల్లో చేరిన కొత్తలో వాడు నా దగ్గరే కూర్చునేవాడు. కొన్నిరోజులయ్యాక వాడి క్లాస్‌లో కూర్చోవడం మొదలుపెట్టాడు. మా స్కూల్ పక్కన పెద్ద కాల్వ ఉంది. అందులో ఉండే చేపలకు క్యారేజీలో తెచ్చుకున్నదంతా వేసేవాడు. ఒకసారి చేప అనుకుని ఒక పాముని పట్టుకున్నాడు. వదిలేయమని నేను ఎంత గట్టిగా అరిచినా వాడు వదలలేదు. ఇంతలో ఆ పాము కరిచింది. దాంతో భయం వేసిందో ఏమో, స్పృహతప్పి పడిపోయాడు. నాకు చాలా భయం వేసింది. అది విషపు పాము కాకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ రోజు వాడితో ప్రమాణం చేయించుకున్నాను ‘సాహసాలు చేయను’ అని. అప్పటి నుంచి ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. కొండ మీద సాధువంటే... అమ్మో... వాడికి చిన్నప్పటి మా ఊళ్లో కొండ మీద ఉండే సాధువంటే భయం, భక్తీను. ఎప్పుడు అల్లరి చేసినా ఆ సాధువుకి ఇచ్చేస్తామని అనేవాళ్లం. మేం సరదాగా చెప్పిన మాటతో, కొండ మీద సాధువు ఏదో చేస్తాడని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఆ సాధువు భిక్ష కోసం రాగానే ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేసేవాడు. దొంగ భయం... వాడికి దొంగల భయం కూడా ఎక్కువే. వేసవికాలంలో మేమంతా ఆరుబయట పక్కలు వేసుకుని పడుకుంటే, వాడు మాత్రం తలుపులన్నీ వేసుకుని ఇంట్లో పడుకుని, కిటికీ దగ్గర నుంచి బయటకు చూస్తుండేవాడు, ఎవరైనా దొంగలు వస్తున్నారేమోనని. ఒకరోజు నిజంగానే ఒక దొంగ కిటికీ పక్క నుంచి వెళ్లాడు. దాంతో నన్ను లేపి, ‘అక్కా! ఇటు నుంచి దొంగ వెళ్లాడు’ అని చెప్పాడు. మేం వాడి మాట నమ్మలేదు. ఇంతలోనే పక్కింటి దగ్గర నుంచి పారిపోవడం చూశాం. వాడు చెప్పింది నిజమే అనుకున్నాం. ఆ సంఘటనతో వాడికి బాగా ధైర్యం వచ్చింది. అది చూసే వాడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. చిన్నప్పుడు ఒకసారి... చిన్నప్పటి నుంచి వాడు చేసే పనుల వల్ల సరదా కంటె టెన్షన్స్ ఎక్కువగా ఉండేది. ఇంటికి వచ్చిన చుట్టాలతో అమ్మ ఎప్పుడూ బిజీగా ఉండేది. అందువల్ల తమ్ముళ్ల బాగోగులన్నీ నేనే చూసేదాన్ని. వాడు ఏం చేసినా అమ్మానాన్నలకు చెప్పకుండా కవర్ చేసేదాన్ని. ఆ రోజు చాలా భయపడ్డాను... ఒకసారి నాన్నగారు మా కాంతిని కోప్పడ్డారు, సరిగ్గా చదవట్లేదని. అప్పుడు వాడు నాతో ‘నేను లేకపోతే కాని వీళ్లకి నా విలువ తెలియదు’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే ఒక కుర్రాడు వచ్చి, ‘మీ తమ్ముడు కాల్వ వైపుగా వెళుతూ కనిపించాడు’ అని చెప్పాడు. అంతకుముందే ఎవరో ఆ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని మా కాంతి విన్నాడు. ఒక్కసారి నా నవనాడులూ కుంగిపోయాయి. పరుగుపరుగున కాల్వ దగ్గరకు వెళితే, వాడు నెమ్మదిగా నడుచుకుంటూ కాల్వ వైపు వెళ్తూ కనిపించాడు. గభాల్న వాడిని పొదివి పట్టుకుని సర్ది చెప్పి ఇంటికి తీసుకువచ్చాను. ఆ రోజున ఎంత టెన్షన్ పడ్డానో, ఇప్పుడు మాత్రం... మా కాంతేనా నన్ను అంత ఇబ్బంది పెట్టింది అనుకుంటాను. టపాసుల్లో నా వాటా కూడా... దీపావళి పండుగకి, నాలుగు రోజులు ముందుగానే బాణాసంచా కొని అమ్మ మా ముగ్గురికీ సమానంగా పంచేది. పంచుతున్నంతసేపు కాంతి చాలా కామ్‌గా ఉండేవాడు. నేను, మా చిన్న తమ్ముడు అనిల్ జాగ్రత్తగా దాచుకునేవాళ్లం. మా కాంతి మాత్రం అన్నీ ముందే కాల్చేసేవాడు. ఒకసారి అలాగే వాడివన్నీ కాల్చేసుకుని, ఎవ్వరూ చూడకుండా నా వాటా బాణాసంచా ఎత్తుకుపోయి, పొలంలో గడ్డివాము దగ్గర కాల్చడం ప్రారంభించాడు. కొంతసేపటికే గడ్డివాములు కాలిపోయాయి. ‘అక్కడ ఎందుకు కాల్చావురా’ అని అడిగితే, ‘నేను అడిగితే నాకు ఇవ్వరుగా, అందుకే ఎత్తుకుపోయి కాల్చేశాను’ అన్నాడు. ఇప్పుడయితే తనే స్వయంగా కొని తీసుకువచ్చి, నన్ను కాల్చమంటాడు. నా ఉత్తరం రాకపోతే... ఇంటర్మీడియట్ ధార్వాడ్‌లో హాస్టల్లో ఉండి చదివాడు. వారానికొకసారి నా దగ్గర నుంచి ఉత్తరం అందితేనే పాఠాలు చదివేవాడు. ఎప్పుడైనా నా నుంచి లెటర్ అందడం ఆలస్యం అయితే ఇంక ఆ వారం చదువు అటకెక్కేదని వాడి స్నేహితులు చెప్పేవారు. మంచి బహుమతులు... మా తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లినా నా కోసం ఏదో ఒకటి తప్పకుండా తీసుకువస్తారు. నాకు ఆధ్యాత్మిక పుస్తకాలంటే చాలా ఇష్టం. ఒకసారి మా కాంతి వివేకానందుడి ఉపన్యాసాల బుక్స్ సెట్ కొని నాకు బహుమతిగా ఇచ్చాడు. అదలా ఉంచితే, ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి చీర కొంటారు. వాళ్లు బిజీగా ఉంటే, డబ్బులిచ్చి నన్నే కొనుక్కోమంటారు. వాళ్లు బయటి ప్రపంచానికి మాత్రమే సెలబ్రిటీస్. నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తమ్ముళ్లే. వివాహమయ్యాక... మా వివాహం జరిగాక మా కాంతి నాతో మా ఇంటికి వచ్చేశాడు. డిగ్రీ పూర్తి చేశాక సినిమాలలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు మా వారు. అసలు నా కంటె కూడా మా వారే మా తమ్ముళ్లని ప్రేమగా చూస్తారనిపిస్తుంది. వాళ్లు కూడా ఆయనతో చాలా స్నేహంగా ఉంటారు. అందువల్ల మా అనుబంధం ఇంకా బాగా కొనసాగుతోంది. బైక్ మీదే... ఇప్పటికీ చిన్న అవసరం ఉందని ఫోన్ చేస్తే చాలు క్షణాలలో వచ్చి వాలతారు. ఒకసారి నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి మా కాంతి ఎంతో టెన్షన్ పడి, బైక్ మీద బయలుదేరాడు. అప్పుడు మేం విజయవాడలో, వాడు చెన్నైలో ఉంటున్నాం. ‘ఎందుకురా అంత సాహసం చేశావు’ అని అడిగితే, ‘నీకు బాగాలేదని తెలిసింది. ఇంక ఉండలేకపోయాను. వచ్చేశాను. అంతే’ అన్నాడు. వాడికి నేను అక్కను కాదు! అమ్మను! తమ్ముళ్ల గురించి చెప్పాలంటే... వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. మా కాంతి బాగా సెంటిమెంటల్, ఎఫెక్షనేట్, ఫ్యామిలీ ఓరియెంటెడ్. చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. చిన్నప్పుడు వాళ్లకి ప్రతి విషయంలో ఎలా సలహాలు ఇచ్చానో, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వగలుగుతున్నాను. అదే సమయంలో వాళ్ల స్వేచ్ఛ, స్వాతంత్య్రం వాళ్లదే. అందువల్ల మా మధ్య తేడాలు రావట్లేదు. రక్తపు దుస్తులతో... ఒకసారి పోలీస్ డ్రెస్‌లో దెబ్బలతో, ఒంటి నిండా రక్తంతో మా ఇంటికి వచ్చాడు. అప్పటికింకా వాడికి పెళ్లి కాలేదు. వస్తూనే ‘చూడు నేను ఎలా ఉన్నానో’ అంటూ పడిపోయాడు. నాకు ఏడుపు వచ్చేసింది. మా వారు కూడా భయపడిపోయారు. ఐదు నిమిషాల తర్వాత (మొదటి సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్) నవ్వుతూ లేచి , ‘నేను పోలీసాఫీసరైతే ఇలాగే అవుతుంది’ అన్నాడు. షూటింగ్ డ్రెస్‌లో వచ్చి నన్ను అలా భయపెట్టాడు. వాడి అల్లరి పనులు అన్నీ ఇన్నీ అని చెప్పలేను. తమ్ముడి గురించి లెక్కలేనన్ని అనుభవాలు ఉన్నాయి. మా ఇద్దరు తమ్ముళ్లూ నాకు దేవుడిచ్చిన వరం. - డా. పురాణపండ వైజయంతి చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లే రోజుల నుంచి అక్కతో అటాచ్మెంట్ ఎక్కువ. సినిమాకి వెళ్లాలంటే అక్క దగ్గర డబ్బులు తీసుకుని, వెళ్లిపోయేవాడిని. అక్క రాకపోతే స్కూల్‌కి వెళ్లేవాళ్లం కాదు. ఏది కావాలన్నా ఎక్కువగా అక్కనే అడిగేవాళ్లం. ఇప్పటికి కూడా మా బాగోగుల గురించి అక్కే ఆలోచిస్తుంది. అక్కలా కాకుండా అన్నీ అమ్మలా చూస్తుంది. మా అవసరాలేంటో చిన్నప్పటి నుంచి తనే చూసుకునేది. మా పెళ్ళిళ్లయ్యాక కూడా ప్రతి ఫంక్షన్‌కీ కలుస్తుంటాం. మేమే కాదు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అక్క. తనంటే మాకు గౌరవం, ప్రేమ. - శ్రీకాంత్ -
మోడీ చలవతో.. సెలెబ్రిటీగా మారిన జీత్
ఖాట్మండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ సంరక్షణలో విద్యాబుద్దులు నేర్చి ప్రయోజకుడైన నేపాలీ కుర్రాడు జీత్ బహదూర్ ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయాడు. నేపాల్‌లో పర్యటించిన నరేంద్ర మోడీ జీత్‌ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని 26 ఏళ్ల జీత్.. భారత్, నేపాల్‌లోని వార్తపత్రికలు, టీవీ చానెళ్లలో పాపులర్ అయ్యాడు. నేపాల్‌లోని నవల్పారసి జిల్లా లోకహ గ్రామం జీత్ సొంతూరు. ఆదివారం రాత్రి జీత్ సొంతూరుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు జీత్‌ను చూడటానికి అతని చిన్న ఇంటి ముందు బారులు తీరుతున్నారు. సాధారణ ప్రజలేగాక జర్నలిస్టులు, స్థానిక నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వస్తున్నారు. జీత్ అందరితో ముచ్చటిస్తూ తీరికలేకుండా గడుపుతున్నాడు. భద్రత సిబ్బంది సాధారణ దుస్తుల్లో అతనికి రక్షణ కల్పిస్తున్నారు. సందర్శకుల కోసం అతని ఇంటి ముందు ప్రత్యేకంగా టెంట్ వేశారు. అహ్మదాబాద్‌లో బీబీఏ చదువుతున్న జీత్ వారం తర్వాత భారత్ తిరిగిరానున్నాడు. చిన్నతనంలో నేపాల్ నుంచి పారిపోయి వచ్చిన జీత్‌ను మోడీ చేరదేశారు. అతణ్ని చదవించి ప్రయోజకుడిని చేశారు. -
మోటార్‌బైక్ మహా క్రేజ్!
ఈ స్పీడు యుగంలో బాగా క్రేజ్ ఉన్న వాటిల్లో మోటార్‌బైక్‌లు కూడా ముఖ్యమైనవి. అబ్బాయిలకు వాటిని నడపడం క్రేజ్ అయితే, అమ్మాయిలకు వారి వెనుక దర్జాగా కూర్చోవడం క్రేజ్! సెలబ్రిటీల పాలిట కూడా బైక్‌లు సెలబ్రిటీలే! తమ బైక్‌లను అపురూపంగా చూసుకునే కొందరు సెలబ్రిటీలు వీరు. మహేంద్రసింగ్ధోనీ మ్యాచ్ ముగిశాక టీమ్‌లో ఎవరో ఒకరికి మ్యాన్ఆఫ్ది మ్యాచ్‌గా వచ్చే బైక్‌నైనా సరే ధోనీ ఒక రైడ్ కొట్టకుండా వదిలపెట్టడు. తన సహచరులను ఎక్కించుకొని స్టేడియంలోనే షికారుచేసే ధోనీ రాంచీలో ఖాళీగా ఉన్నాడంటే ఆ సమయాన్ని తన యమహా ఆర్డీ350పై రైడింగ్‌తోనే గడిపేస్తాడు. సంజయ్‌దత్ ప్రస్తుతానికి సంజూబాబా జైల్లో ఉన్నాడు. దీంతో ఇంటి దగ్గర ‘హార్లే డేవిడ్ సన్ ఫ్యాట్ బాయ్’ను పలకరించే వాళ్లు లేకుండా పోయారట. ఈ 1584 సీసీ బైక్‌కు భూమిపై లక్షల సంఖ్యలో ప్రేమికులు ఉన్నారు. సంజయ్‌దత్ కూడా ఎంతో మోజుతో దీన్ని కొనుక్కొన్నాడు. అతడు జైలు నుంచి బయటకు వచ్చే వరకూ ఈ బైక్‌తో విరహమే మరి! జాన్అబ్రహాం చూడటానికి హీమ్యాన్‌లా కనిపించే జాన్ అబ్రహాం శాకాహారి. అయితే బైక్‌ల విషయంలో జాన్ చాలా దూకుడుగా ఉంటాడు. చిరుతపులులను తలపించే బైక్‌లను ఎంచుకొంటూ ఉంటాడు. ప్రస్తుతం జాన్ మనసు యమహా వీ-మ్యాక్స్‌పై కేంద్రీకృతం అయ్యింది. ఇది 1700 సీసీ బైక్ అంటే ఆశ్చర్యపోని బైక్ ప్రేమికుడు ఉండడేమో! సైఫ్ అలీఖాన్ ఈ నవాబ్కు హార్లేడేవిడ్ సన్ అంటే ఎంతో మోజు. ఆ కంపెనీ నుంచి వచ్చే అధునాతన మోడల్స్‌లో దేన్నీ వదలకుండా కొనేస్తూ, అవకాశం దొరికితే ఒంటరిగా ముంబై వీధులను చుట్టేస్తూ ఉంటాడు! సల్మాన్‌ఖాన్ బాలీవుడ్ ఎంపరర్ ఖాన్‌కు కూడా భారీ సైజు బైకులంటే ఎంతో ఆసక్తి. సల్లూ తనకు ఎంతో ఇష్టమైన సుజుకీ ఇంట్రూడర్ బైక్‌ను దగ్గరుండి సర్వీసింగ్ చేయిస్తాడట. ఈ భారీ బైక్‌ను అమితంగా ప్రేమించే సల్మాన్ దానిపై షికారు చేసేది తక్కువే కానీ, దాని క్లీనింగ్‌కు విషయంలో మాత్రం చాలా శ్రద్ధ వహిస్తాడు. సల్లూ సుజుకీ ఇంట్రూడర్ 1800 సీసీబైక్! -
దటీజ్ తెరియా!
విజయం పోటీ పడనిదే గెలుపు దక్కదు. పరుగు తీయనిదే గమ్యం అందదు. తెరియాకి గెలుపు దక్కింది. ఇక గమ్యాన్ని చేరుకోవడమే మిగిలింది. ఇంతకీ ఆమె గమ్యం ఏమిటో తెలుసా... తన అభిమాన నటి సోనాక్షి సిన్హాలా నటి కావడం! డ్యాన్స ఇండియా డ్యాన్స లిటిల్ మాస్టర్స సీజన్ 3 ఫైనల్స్‌లో ఆఖరి రౌండ్ ముగిసింది. అందరూ ఊపిరి బిగబట్టి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పోటీలో పాల్గొన్న చిన్నారులంతా టెన్షన్ పడుతున్నారు. న్యాయ నిర్ణేతల నోటి వెంట ఎవరి పేరు వినిపిస్తుందోనని చెవులు రిక్కించి నిలబడ్డారు. వాళ్లు ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చింది. విజేత పేరు వెలువడింది. స్టేజిమీద నిలబడిన పదకొండేళ్ల తెరియా మగర్ ముఖం... గెలుపు తెచ్చిన ఆనందంతో వెలిగిపోయింది. రాత్రికి రాత్రే ఆ చిన్నారి పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది. నేపాల్‌లోని రుద్రపూర్ గ్రామంలో జన్మించింది తెరియా. అడుగులు పడుతున్నప్పుడే డ్యాన్సు స్టెప్పులు వేయడం ప్రారంభించింది. కూతురి ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. చదువులో సైతం అత్యంత చురుగ్గా ఉండే ఈ చిచ్చర పిడుగు... డ్యాన్స ఇండియా డ్యాన్సలో చోటు సంపాదించింది. కానీ గెలుస్తుంది అనైతే ఆమె ఇంట్లోవాళ్లుగానీ, ఆమె గానీ ఊహించనేలేదు. అందుకే ఆ విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని అంటోంది... సీజన్ 3 టైటిల్‌తో పాటు పది లక్షల నగదు అవార్డును కూడా గెలుచుకున్న తెరియా. ఇప్పుడే ఇంత సాధించావ్, పెద్దయ్యాక ఏం చేస్తావ్ అంటే.. మరో సోనాక్షీసిన్హాని అవుతా అంటోంది తెరియా తడుముకోకుండా. సోనాక్షి అన్నా, ఆమె నటన, డ్యాన్స తనకి చాలా ఇష్టమని, ఆమెలానే నటినవుతా అంటోంది తెరియా. అంతేకాదు... కొరియోగ్రఫీ కూడా చేస్తుందట. మరో ఏడెనిమిదేళ్లు గడిస్తే మనం మరో సోనాక్షిని తప్పక చూడొచ్చు. ఎందుకంటే... తెరియా చెప్పిందంటే చేసి తీరుతుంది. అనుకున్నది సాధించి చూపిస్తుంది! -
పవిత్ర దృక్పథం
ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసింది. అలాంటి ఆమె ఎలా ఆలోచించాలి? మంచి చిత్రాలు తీయాలి, పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, పెద్ద సెలెబ్రిటీ అవ్వాలి అనే కదా! పవిత్రాచలం కూడా మొదట అలానే అనుకుంది. కానీ ఓ ఊహించని సంఘటన ఆమె ఆలోచనలను వేరే దిశగా మళ్లించింది. ఓ వ్యక్తి అన్న ఒక్క మాట... ఆమెకో కొత్త గమ్యాన్ని నిర్దేశించింది. ఏమిటా గమ్యం? పవిత్రాచలం తీసిన డాక్యుమెంటరీలు చూస్తే... ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది! ‘‘సినిమా చూస్తే మనసు భారమైపోకూడదు. ఒత్తిళ్లను మర్చిపోవ డానికి సినిమాకెళ్తాం. అక్కడికెళ్లాక సరదాగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అక్కడికెళ్లి కూడా బాధపడితే ఇక సినిమాకి వెళ్లడం ఎందుకు? ఇలా అనుకునేవాళ్లెవరూ సందేశాత్మక చిత్రాలు చూడరు. ఇక డాక్యుమెంటరీలేం చూస్తారు, నావయితే అస్సలు చూడరు’’ అంటుంది పవిత్ర. అది నిజమే. ఆమె తీసే డాక్యుమెంటరీలు చూడాలంటే ప్రత్యేకమైన నేత్రం కావాలి. ఎదుటివాడి కష్టాన్ని చూసి కదిలిపోయే సున్నితమైన మనసు ఉండాలి. వాస్తవాలను తెలుసుకుని తట్టుకోగల స్థైర్యం ఉండాలి. అలాంటివాళ్లు మాత్రమే పవిత్ర చిత్రాలను చూడగలరు. పోతపోసిన ప్రతిభ... పవిత్రాచలం బెంగళూరులో జన్మించింది. ఆమెకు మొదట్నుంచీ చాలా ఆసక్తులున్నాయి. ప్రతిభాపాటవాలూ ఉన్నాయి. మొదట మౌంట్ కార్మెల్ కాలేజీలో బీఏ చేసింది. మంచి క్రీడాకారిణి. జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ చాంపియన్‌గా ఎదిగింది. జర్నలిజంలో డిప్లొమో చేసింది. న్యూయార్క యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా చేసింది. ఆ పైన ఓ జాతీయ చానెల్లో చేరింది. అప్పటివరకూ జరిగిందంతా ఒకెత్తు. 2003లో పాకిస్థాన్‌లో జరిగిన యువ శాంతి సదస్సులో పాల్గొనడానికి వెళ్లడం మరో ఎత్తు. ఆ పర్యటన... పవిత్రని, ఆమె ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. శాంతి గురించి, సమాజ శ్రేయస్సు గురించి అక్కడ యువతీ యువకులు చేసిన ప్రసంగాలు పవిత్రలో స్ఫూర్తిని నింపాయి. అప్పుడే తొలిసారిగా ఆమెలోని ఫిల్మ్‌మేకర్ మేల్కొంది. ఇరుదేశాల యువత మనోభావాలూ ప్రతిఫలించేలా ‘బస్’ అనే డాక్యుమెంటరీని తీసింది. తరువాత ఆమె వరుసగా తీస్తూనే ఉంది. కానీ అనుకోకుండా ఎదురైన ఓ అనుభవం... ఆమెను ఓ స్ఫూర్తిదాయక ఫిల్మ్‌మేకర్‌ను చేసింది. 2007లో క్యాన్సర్ మీద అవగాహన కలిగించే డాక్యుమెంటరీ తీయడానికి ఆయేషా అనే యువతి దగ్గరకు వెళ్లింది పవిత్ర. ఆయేషా వయసు 26. క్యాన్సర్ ముదిరిపోయింది. మనిషి శుష్కించిపోయింది. ఇప్పుడో రేపో అన్నట్టుంది. వీడియో తీయడానికి సహకరించే ఓపిక కూడా లేదామెలో. దాంతో నీకు ఓపిక ఉన్నప్పుడు చేద్దాంలే అని చెప్పి వచ్చేసింది పవిత్ర. తర్వాత రోజు ఆయేషా నుంచి ఫోన్ వచ్చింది. ‘రండి తీసేద్దాం’ అని ఆమె అనడంతో వెంటనే వెళ్లింది. ఆయేషాని పవిత్ర అడిగింది... ఇంత నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు చేయడం అని! ‘‘నేనెప్పుడు పోతానో నాకే తెలీదు, నేను పోయాక నా వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలు కదా’’ అంది ఆయేషా. ఆ మాట పవిత్ర మనసులోకి చొచ్చుకుని పోయింది. చనిపోతూ కూడా ఎదుటి వారికి ఉపయోగపడాలన్న ఆయేషా ఆలోచన... పవిత్రకు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసింది. ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది... ఇక మీదట సమాజానికి ఉపయోగపడే చిత్రాలు మాత్రమే తీయాలని! ‘కర్లీ స్ట్రీట్ మీడియా’ అనే సంస్థను స్థాపించి, సామాజిక సమస్యల్ని చిత్రాలుగా తీయడం మొదలుపెట్టింది. ట్రాఫికింగ్ గురించి ‘బౌండ్ బై అజ్’, దేవదాసీల గురించి ‘అనామిక’, మాదక ద్రవ్యాలకు బానిసైన వారి కోసం ‘మై ఫ్రెండ్ ద అడిక్ట్’, మానసిక వికలాంగ చిన్నారుల కోసం ‘ఖుష్బూ’, డౌన్ సిండ్రోమ్ బాధితుల గురించి ‘ఇన్ డెలిబుల్’... ఆమె తీసిన ప్రతి చిత్రమూ కదిలించింది. సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. ఉన్నట్టుండి ఈ సమాజాన్ని ఏ ఒక్కరూ మార్చేయలేరు. అందుకే... కనీసం సమస్యల విషయంలో అప్రమత్తం చేస్తోంది. వాటి పరిష్కారాల గురించి ఆలోచనలు రేకెత్తిస్తోంది. అందుకు పవిత్రని అభినందించి తీరాల్సిందే! - సమీర నేలపూడి పవిత్ర తీసిన డాక్యుమెంటరీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాయి. వాటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘రూట్ ఫర్ రూనా’ గురించి. ఓ రోజు ఓ ఆంగ్ల పత్రికలో రూనా అనే రెండేళ్ల అమ్మాయి గురించి కథనం వెలువడింది. త్రిపురకు చెందిన ఆ పాప హైడ్రోసెఫలస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ మెదడు సంబంధిత వ్యాధి ఉన్నవాళ్లకు తల అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. రూనాకి కూడా అలానే పెరిగిపోయింది. ఆమె ఫొటోని పత్రికలో చూడగానే పవిత్ర కదిలి పోయింది. ఆ వ్యాధి గురించి తన టీమ్‌తో కలిసి రీసెర్చ చేసింది. మన దేశంలో రూనాలాగా ఆ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారులు చాలమంది ఉన్నారని తెలుసుకుంది. వెంటనే ‘రూటింగ్ ఫర్ రూనా’ అనే డాక్యుమెంట రీని తీసింది. రూనా చికిత్సకి నిధులు సమకూరడంలో ఈ డాక్యుమెంటరీ పెద్ద పాత్రే పోషించింది. రూనాకి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. మెల్లగా కోలు కుంటోంది. అయితే రూనా లాంటి వారందరినీ కూడా వ్యాధి నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తున్నారు పవిత్ర టీమ్. ఆ వ్యాధిపట్ల అందరికీ అవగాహన కల్పించడంతోపాటు నిధులనూ సేకరిస్తున్నారు. ************** పవిత్రతో పాటు అడుగులు వేస్తున్నవాళ్లు కొందరున్నారు. అశ్విన్, అక్షయ్ శంకర్, అనన్య రాయ్, రిషి తుషు, జ్యోత్స్న బాలకృష్ణన్, తేజేష్ కిరణ్, అనితా తుషు... వీళ్లంతా పవిత్రలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న తపన ఉన్నవాళ్లు. అందుకే ఆమెతో చేతులు కలిపారు. ఆమెతో కలిసి అడుగులు వేస్తున్నారు. సమాజంలో ఉన్న సమస్యల మీద పరిశోధన చేయడం, వాటిని ఎలా చూపించాలి, దాని ద్వారా ఏ సందేశం ఇవ్వాలి అన్న విషయాలను అందరూ కలిసి చర్చించుకుంటారు. కలసికట్టుగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా సాగిపోతారు. -
ప్రాపర్టీలపై బాలీవుడ్ స్టార్ల క్రేజ్
వంద కోట్ల సినిమాలతో దూసుకెడుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఎడాపెడా ప్రాపర్టీలను కొనేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం లాల్బాగ్ ప్రాంతంలోని 64 అంతస్తుల బిల్డింగ్‌లో షారుఖ్ ఖాన్ రెండు ఫ్లోర్లు కొన్నాడు. ఇందుకోసం రూ. 100 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేశాడు. అటు సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బాంద్రా ప్రాంతంలో బంగళా కొనాలని చూస్తున్నాడు. ఇక, అమితాబ్ బచ్చన్‌కి ఇప్పటికే ముంబైలో నాలుగు ఇళ్లు ఉన్నాయి. తాజాగా అయిదో బంగళాను రూ. 50 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ఆయన కోడలు, నటి ఐశ్వర్యరాయ్ ముంబైలోనే రూ. 5-6 కోట్లు పెట్టి ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నారట. సొంతంగా ఉండటానికి కావొచ్చు.. ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా కావొచ్చు.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్‌పైనే దృష్టి పెడుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. రెండు ఇళ్లు తీసుకున్నాడు. ఆయుష్మాన్ ఖురానా రెండో ఇల్లు కొనుక్కున్నాడు. ముంబైలో ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రియల్టీ పెట్టుబడులతో సెలబ్రిటీలు తమ సంపదను పెంచుకుంటున్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
-
సిరి.. నడమంత్రం కాకూడదంటే..
హాలీవుడ్ సెలెబ్రిటీలపై డాలర్ల వర్షం కురుస్తుంటుంది. హీరో, హీరోయిన్ల సంగతైతే చెప్పనవసరమే లేదు. వారి నట్టింట్లో లక్ష్మీదేవి నడయాడుతూ ఉంటుంది. అయితే, ఆడంబరంగానో, అనాలోచితంగానో చేసిన ఖర్చులు, పెట్టుబడులతో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయి దివాలా తీసిన వారు కొందరుంటే జైలుపాలైన వారు మరికొందరున్నారు. డెమాలిషన్ మ్యాన్ వంటి సుప్రసిద్ధ సినిమాల్లో నటించిన వెస్లీ స్నైప్స్... పన్ను సంబంధ కేసుల్లో చిక్కుకుని కటకటాలపాలయ్యాడు. విమానాలు, విలాసవంతమైన కార్ల వంటివి కొనుగోలు చేసిన హీరో నికొలస్ కేజ్... ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నాడు. జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్ కూడా వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాబితాలో చాలామందే ఉన్నారు. వీరంతా ఎందుకు పప్పులో కాలేశారని అడిగితే, ఆర్థిక నిపుణులు చెప్పిన ఐదు కారణాలివీ... మనీ మేనేజ్మెంట్ తెలియదు సెలెబ్రిటీల్లో ఎక్కువ మంది చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కానీ, బిజినెస్ విషయాలకు తగినంత సమయం కేటాయించడానికి మాత్రం ఇష్టపడరు. ఫైనాన్షియల్ ప్లానర్లు, బిజినెస్ మేనేజర్ల సలహాలను వీరు తీసుకుంటారు. కానీ, వాటిని పట్టించుకోరు. తమ ఇష్టాయిష్టాల ప్రకారమే వ్యవహరిస్తారు. తగిన అడ్వయిజర్లు లేకపోవడం తమకు తగిన బిజినెస్, ఫైనాన్షియల్ మేనేజర్లను ఎంపిక చేసుకునే నైపుణ్యం కొంతమంది సెలెబ్రిటీలకు లేకపోవడం కూడా సమస్యలకు దారితీస్తోంది. తమ పెట్టుబడులపై అధిక ఆదాయం సంపాదించడమెలా అన్న అంశంపై వీరు దృష్టిపెట్టరు. తాము తర్వాత చేయబోయే పాత్ర గురించి ఆలోచిస్తారుగానీ, పెట్టుబడి ప్రణాళికలను పట్టించుకోరు. నమ్మకద్రోహం ఎంత గొప్ప సెలెబ్రిటీలైనా సాధారణ మనుషులే కదా. అందుకే, కుటుంబ సభ్యులనో, స్నేహితులనో పూర్తిగా నమ్మేసి మునిగిపోతుంటారు. చాలామంది సెలెబ్రిటీలు తమ స్నేహితులకు సాయం చేసే ఉద్దేశంతో వారిని వ్యాపారంలోకి భాగస్వాములుగానో, ఉద్యోగులుగానో తెస్తుంటారు. ఈ స్నేహితులు అవసరం తీరాక ముఖం చాటేసిన సంఘటనలెన్నో ఉన్నాయి. డ్రగ్స్, దురలవాట్లు సెలెబ్రిటీల పార్టీల్లో మద్యం ఏరులై పారుతుంటుంది. కొందరు డ్రగ్స్‌కు బానిసలవుతుంటారు. మద్యం, మత్తు ప్రభావంతో ఉన్న వారు తగిన వ్యాపార, పెట్టుబడి నిర్ణయాలను తీసుకోలేరు. గతంలో ఓ వెలుగు వెలిగిన కొందరు సెలెబ్రిటీలు దురలవాట్ల కారణంగా బికారులుగా మారిన సంఘటనలున్నాయి. ఆర్భాటం సెలెబ్రిటీలుగా మారి సంఘంలో కొంత గుర్తింపు రాగానే కుక్, డ్రైవర్, పర్సనల్ సై ్టలిస్ట్, పర్సనల్ అసిస్టెంట్... ఇలా బోలెడు మంది ఉద్యోగులను నియమించుకుంటారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. సినిమాల్లో అవకాశాలు ఆగిపోయినప్పటికీ తమకు మళ్లీ మంచి రోజులొస్తాయనే ఆశతో సిబ్బందిని కొనసాగిస్తారు. తద్వారా జేబులో చిల్లిగవ్వ మిగలని స్థితికి చేరుకుంటారు. హాలీవుడ్ సెలెబ్రిటీల కథలన్నీ సంతోషంగా ముగియవు. కానీ, మెరుగైన ఆర్థిక సలహాలు, సూచనలతో వీరి కథలు కనీసం విషాదాంతం కాకుండా ఉంటాయి. -
విశ్లేషణం : అంతఃసౌందర్యమే ఆమె ఐశ్వర్యం
ఐశ్వర్య మనసెంత అందమైనదో తెలియాలంటే.. ఆమె సౌందర్యం మాయనుంచి బయటపడి ఆమె చెప్పే మాటలు వినాలి. ఐశ్వర్యారాయ్... ప్రపంచాన్ని మైమరపించిన సౌందర్యం! మోడలింగ్‌తో మెరిపించి, ప్రపంచ సుందరిగా మురిపించి, అందమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, బచ్చన్ ఇంటి కోడలుగా మెప్పించి, ఆరాధ్యకు తల్లిగా ఆనందాన్ని అనుభవిస్తున్న అందాలరాశి. మరి ఈ సౌందర్య దేవత వ్యక్తిత్వం కూడా అందమైనదేనా? అందమైన ఆత్మవిశ్వాసం... సెలబ్రిటీతో మాట్లాడకుండా కేవలం వారి పబ్లిక్ బిహేవియర్‌ను మాత్రమే పరిశీలించి వ్యక్తిత్వాన్ని అంచనావేయడం కష్టమైన పనే, కానీ అసాధ్యం కాదు. ఒక వ్యక్తి ఒక్క పదం కూడా మాట్లాడకపోయినా బాడీలాంగ్వేజ్, హావభావాలు వారి అంతరంగం గురించి అనేక విషయాలు వివరిస్తాయి. అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఎంచుకునే మాటలు వారి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. ఐశ్వర్య కాలుమీద కాలు వేసుకుని హుందాగా కూర్చుంటుంది. చేతులు రెండూ కలిపి ఉంచి, అవసరమైనప్పుడు, ఏమైనా వ్యక్తం చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తుంది. దీన్ని బట్టి ఆమె ఆత్మవిశ్వాసంతో ఉంటుందని, మనసులోని భావాలను వ్యక్తం చేయడంలో సెలక్టివ్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కాస్త పైకి చూసి, ఆ తర్వాత ఎదుటివారివైపు సూటిగా చూస్తూ మాట్లాడుతుంది. ఆమె విజువల్ పర్సన్ అని అర్థమవుతుంది. గలగలా మాట్లాడుతూ... కిలకిలా నవ్వుతూ, అప్పుడప్పుడూ నాలుక బయటకు పెట్టి తిప్పేస్తూ... ఎదుటివారిని గిలిగింతలు పెట్టేస్తుంది. ఇలా నవ్వడం, నాలుకను తిప్పేయడం ఫ్లర్టింగ్ అనిపించినా... అది నెర్వస్‌నెస్‌ను దాచుకునే ప్రయత్నంలో భాగమని కూడా అనుకోవచ్చు. ఇక తానేదైనా విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలనుకున్నప్పుడు, ముఖ్యంగా సెటైరికల్‌గా చెప్పాలనుకున్నప్పుడు కొటేషన్ మార్క్‌ను వేళ్లతో చూపించడం ఐశ్వర్య ప్రత్యేక శైలి. మధ్యేమార్గం... అందమైన అమ్మాయి... అందులోనూ గ్లామర్ఫీల్డ్... ఎన్ని పుకార్లు పుట్టుకొస్తాయో అందరికీ తెలుసు. ఐశ్వర్య గురించి ఎన్నో పుకార్లు, మరెన్నో వివాదాలు. వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మౌనంగా ఉంటుంది, లేదంటే దాటవేస్తుంది, మరీ ఒత్తిడి చేస్తే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందే తప్ప... ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడాన్ని బట్టి ఆమె సంయమనాన్ని అర్థం చేసుకోవచ్చు. బుద్ధుని మధ్యేమార్గమే తన మార్గమని ఆమె చెప్పే మాటలు కేవలం మాటలు మాత్రమే కాదని, తాను నిజంగా ఆచరిస్తుందని అర్థమవుతుంది. జీవితం గురించి తాను ఎలాంటి ప్రణాళికలు వేసుకోనని, ఎలా వస్తే అలా జీవితాన్ని స్వీకరిస్తానని చెప్పడం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. కానీ తనగురించి అవాస్తవాలు రాసినప్పుడు ఎలాంటి జంకూగొంకూ లేకుండా మీడియాను సైతం విమర్శిస్తుంది. అందమైన మనసు... ఐశ్వర్య మనసెంత అందమైనదో తెలియాలంటే.. ఆమె సౌందర్యం మాయనుంచి బయటపడి ఆమె చెప్పే మాటలు వినాలి, ఆ మాటల్లోని మనసును అర్థం చేసుకోవాలి. చాలాకాలం కిందటే ఐశ్వర్యారాయ్ ఫౌండేషన్ స్థాపించి, దాని ద్వారా సమాజసేవ చేస్తున్న విషయం చాలామందికి తెలీదు. అలాగే పెటా, నేత్రదానం, పోలియో నిర్మూలన తదితర సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. 1994 లో మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యాక... మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారని అడిగితే... మదర్ థెరిస్సా అని చెప్పింది. సెలబ్రిటీలు అలాగే చెప్తారని అనుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరని అడిగితే... తన పనిమనిషని చెప్పింది. కొడుకు హీమోఫిలియాతో బాధపడుతున్నా చెదరని ఆమె ఆత్మవిశ్వాసమే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పడం ఐశ్వర్య ఎంత డౌన్ టూ ఎర్త్‌గా ఉంటుందో వెల్లడిస్తుంది. డబ్బుతో మనం సంతోషాన్ని కొనలేం, కానీ ఆ డబ్బుతో ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం సంతోషంగా ఉండవచ్చు అని చెప్పడం ఆమె అందమైన మనసుకు ఒక ఉదాహరణ మాత్రమే. షి ఈజ్ యాన్ ఇన్క్రెడిబుల్ ఉమన్! - విశేష్, సైకాలజిస్ట్ -
సర్కారీ పథకాలే బెస్ట్: గంగూలీ
సెలబ్రిటీలంటే ఎడాపెడా సంపాదిస్తారు కనుక వారి ఇన్వెస్ట్మెంట్లు కూడా అలాగే ఉంటాయనుకుంటాం. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా చూసుకుంటామంటున్న సెలబ్రిటీల కథలివి... బెంగాలీ బాబు.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై క్రికెట్ అభిమానులకున్న ఇష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఆటగాడిగానే కాక కెప్టెన్‌గా కూడా సుదీర్ఘ ఇన్సింగ్స్ ఆడాడు గంగూలీ. మరి పెట్టుబడుల గురించి గంగూలీ ఏమంటారు? తనైతే ఏం చేస్తారు? ఆయన అభిప్రాయమేంటి? ఆయన మాటల్లోనే చూద్దాం.. నా ఉద్దేశంలో ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మనకు ఏ రంగమైతే బాగా తెలుసో, ఎక్కడైతే మనకు అనుభవం ఉందో అక్కడే పెట్టుబడి పెట్టాలి. అంతేతప్ప మనకు తెలియని, అనుభవం లేని రంగం ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నా దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి మనకు నష్టాలు మిగల్చదన్న నమ్మకం మొదట మనకు కలగాలి. నా వరకూ మాత్రం నేను సురక్షితమైన పెట్టుబడులనే ఆశ్రయిస్తాను. ఏ మాత్రం రిస్కున్నా దూరంగా ఉంటాను. నాకు అనుభవం లేని, నాకు తెలియని రంగాల వైపు చూడనే చూడను. ఎక్కువగా ప్రభుత్వ మద్దతున్న రంగాలు, ఇన్వెస్ట్మెంట్లనే ఆశ్రయిస్తాను. పైవేటు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయను. ఇంకా చెప్పాలంటే ప్రైవేటు బ్యాంకులను కూడా పెద్దగా నమ్మను. ప్రభుత్వ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తా. దానివల్ల నేను, నా ఇన్వెస్ట్మమెంట్లు సేఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి పైసా మనం కష్టపడి సంపాదించిందే. పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించటం కష్టం. అయితే వ్యాపారాలు చేసేవారు కూడా ఇలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లు చేద్దామనుకుంటే కుదరదు. వ్యాపారంలో రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నచోటే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందో, ఎక్కడ వృద్ధికి అవకాశం ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ మనం గమనించాల్సిందొకటి ఉంది. జీవితానికి గ్యారంటీ లేదు. రేపు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే మనకు అనుభవం, నైపుణ్యం ఉండి... మన అదుపులో ఉండేచోటే ఇన్వెస్ట్ చేయాలన్నది ఎవరికైనా నేను చెప్పే సలహా. -
అంతా అకాడమీపైనే: మేరీ కామ్
సెలబ్రిటీలంటే ఎడాపెడా సంపాదిస్తారు కనుక వారి ఇన్వెస్ట్మెంట్లు కూడా అలాగే ఉంటాయనుకుంటాం. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా చూసుకుంటామంటున్న సెలబ్రిటీల కథలివి... బాక్సింగ్ మేరా కామ్ అని చెప్పే మేరీ కామ్... లేటు వయసులో ఒలింపిక్ పతకాన్ని సాధించి యావద్భారత దేశ దృష్టినీ ఆకర్షించిన మహిళ. మణిపూర్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చినా... కష్టపడి పెకైదిగి ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకం ఎగరేసింది. తనకు కష్టం విలువ తెలుసని చెప్పే మేరీకామ్ ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉంటాయి? ఆమె ఇతరులకిచ్చే సలహా ఏంటి? ఆమె మాటల్లోనే... కేంద్ర ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాకు చాలా బహుమతులొచ్చాయి. నా సంపాదనలో అత్యధికం కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన బహుమతి సొమ్మే. ఈవెంట్లలో గెలవటంతో పాటు ఆయా ప్రభుత్వాలిచ్చిన ప్రోత్సాహకాలు కూడా కొంతవరకూ ఉన్నాయి. వీటన్నిటినీ నేను మొట్టమొదట ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది నా అకాడమీపైనే. తరువాతి ప్రాధాన్యం నా కుటుంబానికి. నాకు ముగ్గురు అబ్బాయిలున్నారు. వాళ్ల పేరున కొంత ఫిక్స్డ్ డిపాజిట్లు చేశా. మిగిలిన మొత్తంతో కొంత రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నా. ఇదంతా నా కుటుంబంపై పెట్టిన పెట్టుబడిగా భావిస్తాన్నేను. చాలామంది నన్ను సాయం అడుగుతుంటారు. నేను మంచి స్పోర్ట్స్ ఉమన్‌గా ఎదిగాక ఇది ఇంకాస్త ఎక్కువయింది. అలా అడిగే వాళ్లకు వివిధ రూపాల్లో నేను సాయం చేస్తుంటా. ఈ సాయం అందుకునే వారు ఎక్కువమంది మణిపూర్ వారే కావచ్చు. వాళ్లకు నేను డొనేషన్లు ఇస్తుంటా. భోజనం పెడుతుంటా. ఇలాంటి సాయాన్ని కూడా నేను ఇన్వెస్ట్‌మెంట్‌గానే భావిస్తా. నా దృష్టిలో ఇది సమాజంపై పెట్టే పెట్టుబడి. నాకు ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్ సంగతులేవీ తెలి యవు. కానీ ఆదా చేయటం మాత్రం తెలుసు. మొదటి నుంచీ చేసిందే కాబట్టి! అందుకే నా సలహా అదే. కుటుంబం కోసం మనం కొంత ఆదా చేసి తీరాలి. ఇది ఏ కుటుంబానికైనా తప్పనిసరి. ఉన్నంతలో లేని వారికి సాయం చేయటం కూడా అవసరమే. -
You Tube స్టార్స్!
యూట్యూబ్... ఎవరికీ పరిచయం అక్కర్లేని వెబ్సైట్. వర్ణిస్తూ చెప్పాలంటే అదొక వినోద సామ్రాజ్యం. అంతులేని విహారం చేయవచ్చు. ఎన్నో వీడియోలను చూడవచ్చు. సినిమాలు , క్రికెట్, పాటలు, ఫైట్లు, కామెడీ, ఫన్, రియాలిటీ, షార్ట్ఫిలిమ్స్... ఇలా ఎన్నో రకాల వీడియోలు అందుబాటులో ఉంటాయి. అలాంటి యూట్యూబ్‌లో సర్ఫింగ్ చేయడం ఎవరికైనా ఇష్టమే. మరి వినోదం కోసం యూట్యూబ్‌ను చూడటం మనమందరం చేసే పనే.. కానీ కొంతమంది యువతీ, యువకులు యూట్యూబ్‌ను తమ ఉన్నతికి ఉపయోగించుకొంటున్నారు. అలాంటి వారిలో కొంతమంది ప్రయత్నాలు సూపర్‌హిట్ అయ్యాయి. వారికి గొప్ప గుర్తింపును సంపాదించిపెట్టాయి. యూట్యూబ్స్టార్లను చేసి పెట్టాయి. వారి ప్రతిభ, ప్రయత్నంలోని చిత్తశుద్ధి గురించి తెలుసుకొని తీరాల్సిందే! జెన్నా ఎన్ మౌరే... యూట్యూబ్ అకౌంట్‌తో ఒక సాధారణ అమ్మాయి సెలబ్రిటీగా మారిపోవచ్చని నిరూపించింది జెన్నా. యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసిన మూడున్నర నిమిషాల వీడియో జెన్నా గతిని మార్చేసింది. "How To Trick People Into Thinking You're Good Looking" పేరుతో జెన్నా అప్లోడ్ చేసిన వీడియో బీభత్సమైన స్థాయిలో వీక్షకాదరణ పొందింది. కాలేజీ స్టూడెంట్ అయిన జెన్నా అప్లోడ్ చేసిన ఆ వీడియోను తొలి వారంలోనే 53 లక్షల మంది వీక్షించారు. స్టార్‌హీరోల సినిమాల టీజర్లకు సమాన స్థాయిలో ఆదరణ పొందింది జెన్నా వీడియో. ఇప్పటి వరకూ ఈ వీడియోను దాదాపు నాలుగుకోట్ల మంది వీక్షించారు. దీంతో జెన్నా మార్బల్స్ పేరుతో ఆమె మొదలెట్టిన యూట్యూబ్ చానల్ కు ఎంతోపేరు వచ్చింది. అమెరికాకు చెందిన తను ఇప్పుడు యూట్యూబ్ పర్సనాలిటీగా, ఎంటర్టెయినర్గా గుర్తింపు సంపాదించుకొంది. సెలబ్రిటీగా మారిపోయింది. రే విలియమ్ జాన్సన్... ఎన్నో యేళ్ల కష్టం తర్వాత అదృష్టం, అవకాశం కలిసి వచ్చి ఓవర్‌నైట్ స్టార్లు అయినవారుండొచ్చు. అయితే కొన్ని గంటల పాటు కష్టపడి కొన్ని నిమిషాల నిడివి ఉండే వీడియోతో వండర్‌గా మారిన వాడు రే విలియమ్ జాన్సన్. ఈ అమెరికన్ వీడియో బ్లాగర్, Equals Three అనే వీడియోతో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం రే యూట్యూబ్ చానల్‌కు కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లున్నారు. వారందరినీ అలరించే వీడియోలను రూపొందించడమే ఇప్పుడు రే పని. నటాలీ ట్రాన్: యూట్యూబ్ మొదలైన కొత్తలోనే నటాలియా ఆ సైట్లో ఒక చానల్‌ను ప్రారంభించింది. సొంతంగా స్కిట్స్ రాసి, అభినయించగలిగిన తన టాలెంట్‌ను అక్కడ ప్రదర్శించసాగింది. నిమిషాల వ్యవధిలో సాగే ఆ వీడియోలకు లక్షలాది మంది ఫ్యాన్స్ గా మారారు. ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియన్ యూట్యూబ్ చానల్‌కు కోటిన్నర మంది సబ్స్క్రైబర్లున్నారు. జాక్ అండ్ ఫిన్.... యువతీ యువకులను లక్ష్యంగా చేసుకొని కొత్త థియరీలను, నయా వేదాంతాలను చెబుతూ వీడియోలను రూపొందించడమే దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కవల సోదరుల వృత్తి, ప్రవృత్తి. రూపానికి ఒకేలా ఉన్న ఈ కవల సోదరులు జంటగా చేసిన యూట్యూబ్ చానల్ ప్రయత్నం సూపర్‌సక్సెస్ అయ్యింది. వీళ్ల చానల్‌కు 40 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. వీళ్లకేం వస్తుంది..?! యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసి వీళ్లు సాధించేదేముంది? అంటే... పేరు, పాపులారిటీనే కాక డబ్బును కూడా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒరిజినల్ లేదా మీకు హక్కులున్న కంటెంట్‌ను యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. యూట్యూబ్ చానల్‌ను మొదలుపెట్టి అందులోకి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటే.. మీ వీడియోల ప్రారంభంలో ప్లే అయ్యే వ్యాపార ప్రకటనలను బట్టి డబ్బు వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ వ్యవహారాలు ‘గూగుల్ యాడ్సెన్స్’ అకౌంట్‌తో ముడిపడి ఉంటాయి. వీక్షకుల సంఖ్యను బట్టి యాడ్‌రెవెన్యూ వచ్చి చేరుతూ ఉంటుంది. ఈ ఆదాయం దేశదేశానికీ మారుతూ ఉంటుంది. ఈ లెక్కన కోట్లాది మంది వీక్షకులను కలిగిన వీరు మిలియనీర్లుగా మారి అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. అవకాశాలు వాటంతట అవే రావు. అదృష్టం కొద్దీ కలిసి రావు. వివిధ మార్గాల్లోని అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలోనే ఎవరి ప్రతిభ అయినా దాగి ఉంది. -
ప్రముఖుల కొత్త సంవత్సర
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరి శీలకుడు పిరియా సాయిరాజ్‌లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం జిల్లా ప్రజలకు అన్ని విధాలా శుభప్రదం కావాలని, అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాల న్నారు. 2013లో ప్రకృతి బీభత్సాలు, ఉద్యమాలతో ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, 2014లో ప్రజలకు అంతామంచే జరగాలని కోరారు. ప్రగతిపథంలో నడవాలి శ్రీకాకుళం కలెక్టరేట్: కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది జిల్లా వాసులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖామంత్రి కోండ్రు మురళీమోహన్, రాష్ట్ర అటవీశాఖఆమంత్రి శత్రుచర్లు విజయరామరాజు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. 2014 సంవత్సరంలో ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలన్నారు. ‘మంచిపాలన అందించే ప్రభుత్వం రావాలి’ శ్రీకాకుళం సిటీ: ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రావాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కింజరాపు రామ్మోహన్నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
అత్యంత శక్తిమంతమైన సెలబ్రిటీగా షారుక్ ఖాన్
న్యూఢిల్లీ: పోర్బ్స్ ఇండియా అత్యంత శక్తిమంతమైన సెలబ్రిటీగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నిలిచారు. కాగా, ఆ సంస్థ ప్రకటించిన టాప్ 100 జాబితాలో కింగ్‌ఖాన్ ప్రథమ స్థానంలో నిలవడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. ఈ ఏడాది విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా సూపర్‌హిట్ కావడం, భారీగా కలెక్షన్లు రాబట్టడం ఖాన్‌కు కలిసొచ్చింది. ఇక గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ ఏడాది రెండో స్థానానికి ఎగబాకారు. మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక స్థానం దిగజారి మూడోస్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్, ఐదో స్థానంలో అమితాబ్ బచ్చన్ నిలిచారు. నటులు అక్షయ్ కుమార్ 6వ స్థానం, రణ్‌బీర్ కపూర్ 8వ స్థానం, హృతిక్ రోషన్ 10వ స్థానం దక్కించుకున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి కత్రినాకైఫ్ కూడా టాప్ టెన్‌లో చోటు పొందారు. కాగా, గతేడాది ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన నటుడు కమల్‌హాసన్ ఈ ఏడాది 47వ స్థానంలో నిలవడం విశేషం. నటి శ్రీదేవికి 73వ స్థానం దక్కింది. -
టచ్ చేస్తే బ్లాగుల తుపాన్... టంబ్లర్!
‘‘ ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో బోర్ కొట్టేసింది.. రొటీన్ అప్డేట్స్తో నెటిజన్లు కొంచెం అలసిపోయారు.. తలకెక్కిన ట్విటర్ పిచ్చి తగ్గుముఖం పట్టింది.. అక్కడ సెలబ్రిటీలకు తప్ప సామాన్యుల ఘోషకు విలువలేదనిపిస్తోంది.. పింట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కలగనే లేదు.. గూగుల్ప్లస్లో గమ్మత్తులేమీ కనిపించలేదు...’’ ఈ తరహా అభ్రిపాయంతో ఉన్నవారికి, సోషల్నెట్వర్కింగ్లో కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకుంటున్న వారికి ఒక ఛాయిస్ ‘టంబ్లర్.కామ్’ ఈ బ్లాగర్ల కూడలిలోకి ఎంటరవ్వాలి కానీ.. ఎంటర్టైన్ మెంట్‌కు లోటే లేదు. ప్రత్యేకించి ఫేస్బుక్, ట్విటర్లపై బోర్కొట్టిన వారు దృష్టి పెట్టాల్సిన సైట్ టంబ్లర్.కామ్. లెక్కకు మించి బ్లాగులు, బ్లాగ్ పోస్ట్‌లు... టంబ్లర్ ఒక బ్లాగింగ్ సైట్. అయితే బ్లాగులంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్లాగ్స్పాట్.కామ్, వర్డ్‌ప్రెస్.కామ్ తదితరాలు. ఈ తరహాలోనే కొత్త ఫీచర్లతో ఉంటుంది టంబ్లర్. తెలుగులో బ్లాగు నిర్వహించాలనుకున్నవారికి, భావాలను అక్షరబద్ధం చేయాలనుకున్న వారికి బ్లాగ్స్పాట్.కామ్ ఇన్ని రోజులూ ప్రథమ ప్రాధాన్యతగా ఉంది. అయితే ఈ వెబ్సైట్ కన్నా ఎంతో భిన్నమైన, భారీస్థాయి కంటెంట్‌ను అందిస్తుంది టంబ్లర్.కామ్. ఇందులో 136.6 మిలియన్ బ్లాగులున్నాయి. అంటే దాదాపు 13 కోట్ల 66 లక్షల బ్లాగులన్నమాట! వీటిద్వారా 61.1 బిలియన్ పోస్టులు ప్రచురితం అయ్యాయని టంబ్లర్ లెక్కలు చెబుతున్నాయి. ఆర్ట నుంచి అడాల్ట్ వరకూ... యాక్సెసరీస్, యాక్టర్స్, ఆర్ట్, ఆర్టిస్ట్స్, బ్యూటీ, బుక్స్, బిజినెస్, చారిటీస్, కామిక్స్, కల్చర్, డిజైన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్, ఫిల్మ్, ఫిట్నెస్, హోమ్ అండ్ లైఫ్‌స్టైల్, మెడిసిన్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, పొయెట్రీ, పాలిటిక్స్, సైన్స్, స్పిరిచ్యువాలిటీ, స్పోర్ట్స్, స్టార్టప్స్, టెక్నాలజీ, ట్రావెల్, టెలివిజన్, యంగ్ అడాల్ట్.. ఇలా అన్ని విభాగాల కంటెంట్‌కు సంబంధించిన బ్లాగులూ ఉంటాయిక్కడ. బ్లాగ్స్పాట్.కామ్‌లో మనకు కావాల్సిన కేటగిరీ బ్లాగులను వెదుక్కోవడం కొంచెం కష్టమైన పనే. అయితే.. టంబ్లర్లో మాత్రం కావాల్సిన కేటగిరీని ఒకే క్లిక్‌తో క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది. క్రియేట్ చేయడానికి ముప్పై సెకన్ల సమయమే! జీమెయిల్, ఫేస్బుక్ యూజర్ ఐడీలతో టంబ్లర్లో బ్లాగ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ముప్పైసెకన్లలోనే బ్లాగ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టుగా తన హోమ్‌పేజ్‌లో పేర్కొంది టంబ్లర్. తెలుగులోనూ టైప్ చేయవచ్చు.. పీసీలో తెలుగు టైపింగ్ టూల్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా టంబ్లర్ పోస్ట్‌ను తెలుగులో టైప్ చేయవచ్చు. అయితే బ్లాగ్స్పాట్.కామ్‌లో తెలుగు పదాలకు ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్‌ను రాస్తే.. అది తెలుగు యూనిక్ కోడ్ ఫాంట్‌లోకి మారుతుంది. టంబ్లర్లో ఆ అవకాశం లేదు. ప్రాంతీయ భాషల బ్లాగర్లను లక్ష్యంగా చేసుకుని గూగుల్ జీమెయిల్లోని కంపోజింగ్ టెక్నిక్స్‌ను బ్లాగ్స్పాట్.కామ్‌లోకి అనువర్తింపజేసింది. అందరికీ దగ్గరయ్యింది. టంబ్లర్ ఈ విషయంలో ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంది. టంబ్లర్ స్టఫ్... టంబ్లర్స్టఫ్ పేరుతో ఫోటోల, వీడియోల రూపంలో ప్రతి బ్లాగర్కూ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను అందిస్తుంది ఈ సైట్. ఇవిగాక మీరు ఫాలో అయ్యే బ్లాగుల నుంచి ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పలకరిస్తుంటాయి. మొదలెట్టేస్తే ఫ్యాన్ ఫాలోయింగే! తెలుగు లేదా ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నా, ఫోటోగ్రఫీపై పట్టున్నా, షార్ట్ఫిలిమ్ వీడియోల పబ్లిషింగ్కైనా.. టంబ్లర్.కామ్ ఒక చక్కటి మార్గం. స్నేహితులను పట్టేయవచ్చు.. మీరు బ్లాగును ప్రారంభించిన తర్వాత.. మీ ఫ్రెండ్స్‌ని టంబ్లర్లో ఫైండ్ చేయడం చాలా సులువు. ఫేస్బుక్లో లేదా జీమెయిల్ ద్వారా మీకు స్నేహితులుగా ఉన్న వారెవరైనా టంబ్లర్ బ్లాగ్‌ను నడుపుతుంటే ‘పీపుల్ యూ నో’ మీద క్లిక్ చేయడం ద్వారా అన్వేషించవచ్చు. ఫేస్బుక్, జీమెయిల్ స్నేహాలను ఇక్కడ కూడా కొనసాగించవచ్చు. కార్ప్ మొదలెట్టాడు, యాహూ కొనుక్కొంది.. 2007లో టంబ్లర్.కామ్ మొదలైంది. దీన్ని డేవిడ్ కార్ప్ అనే టీనేజర్ ప్రారంభించాడు. అతడు సాదాసీదాగా మొదలుపెట్టిన ఈ వెబ్సైట్ ప్రారంభంతోనే అందరినీ కట్టిపడేసింది. ఇదే సమయంలో సోషల్నెట్వర్కింగ్లో గూగుల్, ఫేస్‌బుక్‌ల విజృంభణతో వెలవెలబోతున్న యాహూ.కామ్ టంబ్లర్పై దృష్టిపెట్టింది. 1.1 బిలియన్ డాలర్లసొమ్మును ఆఫర్ చేసి కార్ప్ నుంచి టంబ్లర్‌ను కొనుగోలు చేసింది. -జీవన్ రెడ్డి.బి