రశ్మితా పుట్టి పెరిగిందంతా ముంబైలోనే! సినిమాలు అంటే పిచ్చి! వారానికో సినిమా చూసి అందులోని హీరోయిన్ స్టయిలింగ్‌ను కాపీ చేసేది. అలా గ్లామర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ మీదున్న ఆసక్తితో డిగ్రీ చదువుతుండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత గ్రహించింది తన అసలు ఆసక్తి స్టయిల్‌ని కాపీ చేయడంలో కాదు క్రియేట్ చేయడంలో అని! అందుకే చదువుతున్న డిగ్రీకి గుడ్ బై చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేరింది. ఆ కోర్స్ పూర్తయిన తర్వాత పలు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పనిచేసింది.
స్టయిలింగ్‌లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల వద్ద ఇంటర్న్‌గా చేరింది. ఆమె పరిశీలన, పనితీరుకు చాలామంది సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యి, ఆమెను స్టయిలిస్ట్‌గా పెట్టుకున్నారు. వారిలో శ్రీలీల, రీతూ వర్మ, లావణ్యా త్రిపాఠీ, నేహా శెట్టీ, నిధీ అగర్వాల్, చాందినీ చౌదరి, రుహానా శర్మ, నభా నటేశ్, ఆకాంక్షా సింగ్, అనుపమా పరమేశ్వరన్, కీర్తీ సురేష్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, అవికా గోర్, సోనాల్ చౌహాన్ కూడా ఉన్నారు.
రశ్మితా స్టయిలింగ్ మంత్ర.. సింపుల్ అండ్ కంఫర్ట్! దానివల్లే ఎందరో సెలబ్రిటీలకు ఆమె ఫేవరట్ స్టయిలిస్ట్ అయింది. క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్‌మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్ల దాకా.. సందర్భానికి తగ్గట్టు సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేసి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలబెడుతుంది. అందుకే ఆమెకు ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఫ్యాన్సే! వాళ్లలో అల్లు శిరీష్ ముందుంటాడు. తర్వాత విజయ్ దేవరకొండ. ఆ ఇద్దరికీ రశ్మితానే స్టయిలింగ్ చేస్తోంది. తన క్రియేటివ్ జీల్‌తో ఫ్యాషన్ వ్లాగ్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీ సంపాదించింది. వీటితోపాటు అప్పుడప్పుడు మోడల్‌గానూ మెరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment