
విరజ ఫ్రిల్స్‌లో మిసెస్ ఇండియా తెలంగాణ మిటాలీ
ఆకట్టుకుంటున్న టోపోగ్రఫీ
సాక్షి, సిటీబ్యూరో : ఇటీవల మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేతగా నిలవడం సంతోషంగా ఉందని మిసెస్ మిటాలీ అగర్వాల్ తెలిపారు. సెపె్టంబర్‌లో జరగనున్న మిసెస్ ఇండియా ఫ్యాషన్‌లో పాల్గొంటానని, ఈ పోటీల్లోనూ విజేతగా నిలవడానికి సన్నద్ధమవుతున్నానని ఆమె తెలిపారు. నగరంలోని కూకట్‌పల్లి వేదికగా వనితల కోసం ఏర్పాటు చేసిన విరజ ఫ్రిల్స్ ఉమెన్స్ వేర్ స్టోర్‌ను ఆదివారం ప్రారంభించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం అభినందనీయమన్నారు.
సాధికారతతో మహిళా దినోత్సవాన్ని జరుపుకునే ప్రతి మహిళా ఒక సెలిబ్రిటీనే అని మిటాలీ అన్నారు. విరజ ఫ్రిల్స్ వేదికగా స్మార్ట్ క్యాజువల్స్, బిజినెస్ క్యాజువల్స్‌తో పాటు మహిళల సరికొత్త స్టయిల్ కోసం లేటెస్ట్ ట్రేడింగ్ కలెక్షన్‌అందుబాటులో ఉందని నిర్వాహకులు అనుషా నామా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మిసెస్ మిటాలీ అధునాతన వ్రస్తాలంకరణతో అలరించారు.
చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!
ఆకట్టుకుంటున్న టోపోగ్రఫీ
బంజారాహిల్స్: రోడ్ నెం.10లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ చిత్ర కళాకారులతో పాటు భారతీయ కళాకారుడు, టోపోగ్రఫీస్ ఆఫ్ టెంట్స్ టెర్రకోట అండ్ స్టైమ్ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శన ఔత్సాహిక కళాకారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సృష్టి ఆర్ట్ గ్యాలరీ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గోతేజంత్రం భాగస్వామ్యంతో టోపోగ్రఫీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. జర్మనీకి చెందిన ప్రముఖ చిత్రకళాకారుడు ఆర్నాల్డో డ్రెస్ గోన్జాలెజ్, స్వెన్ కహ్లర్ట్‌తో పాటు భారతీయ చిత్రకారుడు సుధాకర్ చిప్పా వేసిన పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచారు. విభిన్న కళాత్మక భాషలు, జీవిత అనుభవాలను ఈ చిత్రాల్లో కళ్లకు కట్టారు. నెలా 15 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 50కి పైగా సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు ఆలోచనాత్మక రీతిలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది.

Comments
Please login to add a commentAdd a comment