
హస్తకళ, మహిళా కళాకారులకు ఘన సత్కారం
తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్టులకు స్వదేశ్ ప్రశంసలు .
దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతులకు చెందిన హస్తకళలతో తయారు చేసిన విలాసవంతమైన కళాకృతులకు గమ్యస్థానమైన జూబ్లీహిల్స్‌లోని స్వదేశ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సృజనాత్మక కళాకారులైన మహిళా ఛాంపియన్స్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఆర్ట్ క్రాఫ్ట్స్‌తో చక్కటి హస్తకళ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే మహిళలను అభినందించారు. స్టోరీ టెల్లింగ్, స్ఫూర్తి ప్రదాతలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో హెర్ సర్కిల్ సీఈఓ థాన్య చైతన్య మోడరేటర్‌గా ఫైర్ చాట్ నిర్వహించారు. ఈ వేదికగా ఆరుగురు ప్రముఖ క్రాఫ్ట్ మాస్టర్లు హస్తకళలతో తయారు చేసిన సంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో వారి ప్రయాణాలు, సవాళ్లు, ఆవిష్కరణలను పంచుకున్నారు. ఈ సెషన్‌లో వారి కథలతో స్ఫూర్తిని నింపారు. సమకాలీన భారతదేశంలో చేతిపనుల ప్రాముఖ్యతను బలోపేతం చేశారు.
ఈ ప్రత్యేక వేదికగా.. డిజైన్ ఇన్నోవేషన్ జాతీయ అవార్డు గ్రహీత సునేత్రలహరి (పశ్చిమ బెంగాల్), తోలుబొమ్మలాటతో జాతీయ అవార్డు పొందిన డి.శివమ్మ (ఆంధ్రప్రదేశ్), సిల్వర్ ఫిలిగ్రీ జాతీయ అవార్డు గ్రహీత అర్రోజు ధనలక్ష్మి (తెలంగాణ), కాలిఘాట్ పెయింటింగ్ అవార్డీ స్వర్ణ చిత్రకార్ (పశ్చిమ బెంగాల్), ఇక్కత్ చేనేత జాతీయ అవార్డు గ్రహీత సుకాంతి మెహెర్ (ఒడిశా), మధుబని పెయింటింగ్ జాతీయ అవార్డు గ్రహీత ఆశా ఝా (బీహార్)ను స్వదేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించారు.
అత్యుత్తమ వర్క్ ప్లేస్‌గా సింక్రోనీ..
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థల్లో అత్యత్తుమ టాప్ 50 పని ప్రదేశాల్లో నగరానికి చెందిన సింక్రోనీ ఇండియా ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక ‘ఆల్ 2025’ నిర్వహించిన అధ్యయనంలో బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2025 లార్జ్ కేటగిరీలో సింక్రోనీ ఇండియా ఎంపికైంది. ఈ సందర్భంగా సంస్థ హెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రచనా బహదూర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 1,800కు పైగా సంస్థల్లోని 57 లక్షలకు పైగా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఈ అధ్యయనంలో సింక్రోనీ శ్రేష్ఠతకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించడం తమకు గర్వకారణమన్నారు
Comments
Please login to add a commentAdd a comment