Swadesh
-
అంతర్జాతీయ బ్రాండ్‌తో చేతులు కలిపిన స్వదేశ్.. లిమిటెడ్ ఎడిషన్!
హైదరాబాద్: భారతీయ కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే స్వదేశ్ బ్రాండ్, అంతర్జాతీయ వస్త్ర తయారీదారులు ఫాల్గుణి షేన్ పీకాక్‌తో కలిసి హైదరాబాద్‌లో స్వదేశ్ ఫ్లాగ్ షిప్ స్టోర్‌లో ప్రత్యేక ప్రదర్శనను ప్రకటించారు. ఫాల్గుణి షేన్ పీకాక్ 20వ వార్షికోత్సవంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ పద్ధతులను అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్ తో మేళవించారు. కాంచీవరం సిల్క్స్, చికంకారీ ఎంబ్రాయిడరీ, బనారసి బ్రోకేడ్స్ వంటి ఐకానిక్ భారతీయ హస్తకళలు ఉన్నాయి.స్వదేశ్లో ప్రత్యేకంగా లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ కోచర్.. భారతీయ హస్తకళా వారసత్వాన్ని పునఃసమీక్షిస్తుంది. వినూత్న డిజైన్‌తో పాటు అద్భుతమైన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఫాల్గుణి షేన్ పీకాక్ 20 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ లగ్జరీ కోచర్ డిజైనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంప్రదాయ కళానైపుణ్యాన్ని జోడిస్తూ, రంగులతో ప్రయోగాలు చేస్తూ సరిహద్దులను విస్తరించింది. వర్చువల్ స్టైలింగ్ వంటి మార్గదర్శక ఫీచర్ల ద్వారా టెక్నాలజీ పరంగా బ్రాండ్ అభివృద్ధి చెందింది. అందుకే ఇది సెలబ్రిటీలకు సైతం నచ్చేసింది.రెండు దశాబ్దాల ఫ్యాషన్ ఆవిష్కరణను ప్రతిబింబిస్తూ, ఫాల్గుణి షేన్ పీకాక్ సహ వ్యవస్థాపకుడు షేన్ పీకాక్ ఇలా పేర్కొన్నాడు, "స్వదేశ్‌తో కలిసి నడవడం స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే మా డిజైన్లకు భారతీయ హస్తకళ తోడవటంతో ఫ్యాషన్‌లో కొత్త కోణాలను అన్వేషించేందుకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా భారత్‌తో పనిచేసి ఇక్కడి వారసత్వం, సంస్కృతి నుంచి ప్రేరణ పొందే ఆకృతులను తయారు చేశాం. ఈ లిమిటెడ్ ఎడిషన్ సేకరణలో క్లిష్టమైన జరీ వర్క్ తో బెస్పోక్ చీరలు ఉన్నాయి. హైదరాబాద్ లోని స్వదేశ్ స్టోర్‌ను సందర్శించేందుకు వస్త్రప్రియులను ఆహ్వానిస్తున్నాము" అని చెప్పారు. -
హైదరాబాద్‌లో స్వదేశ్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన నమ్రతా(ఫోటోలు)
-
Nita Ambani: రిలయన్స్ ‘స్వదేశ్ స్టోర్’ లాంఛ్. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో రిలయన్స్ ‘స్వదేశ్’.. నీతా అంబానీ చేతుల మీదుగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ ‘స్వదేశ్’ తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్పర్సన్ నీతా అంబానీ చేతుల మీదుగా ఈ స్టోర్ ప్రారంభం కానుంది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరింది. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఫర్నిచర్, బొమ్మలు, ఆభర ణాలు, గృహాలంకరణ వస్తువులు, పెయింటింగ్స్, యాక్సెసరీస్‌తోపాటు వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారు. దేశవ్యాప్తంగా చేతి వృత్తుల కళాకారులకు చెందిన గుర్తింపు ఉన్న సంఘాల నుంచి నేరుగా వీటిని సేకరిస్తారు. రూ.6 లక్షలకుపైగా ధర పలికే వస్తువులనూ విక్రయిస్తారు. -
నీతా అంబానీ ఎగ్జిబిషన్‌కు అనూహ్య స్పందన.. మరికొన్ని రోజులు పొడిగింపు
ముంబై: స్వదేశ్ పేరిట నిర్వహిస్తున్న సాంప్రదాయ ఆర్ట్స్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) నిర్ణయించింది. ఎగ్జిబిషన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. తమ నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేలా కళాకారులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తలపెట్టినట్లు ఆమె వివరించారు. వాస్తవానికి ఈ ఎగ్జిబిషన్‌ను తొలుత మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించారు. ఇందులో తంజావూరు పెయింటింగ్‌లు, తోలుబొమ్మలు మొదలైన వాటిని ప్రదర్శిస్తున్నారు. ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు -
Highway to Swades: మనలోనే సూపర్శక్తి
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు. ‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్ అఫ్ కచ్ వరకు, దక్కన్ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది. ► స్వయంగా తెలుసుకుని... 2014లో ఒక రోజు రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్ పవర్లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు. ► సమయపాలన చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను. ► రోడ్ ట్రిప్స్.. మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ. 1896లో స్థాపించిన ఎస్.సి.ఏ. గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
‘స్వదేశ్’ మహిళకు చేదు అనుభవం
న్యూయార్క్: షారూక్ ఖాన్ ’స్వదేశ్’ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగు తేజం అరవింద పిల్లలమర్రికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. గతేడాది డిసెంబర్ 21 ఉదయం మేరీల్యాండ్‌లోని బెల్ ఎయిర్‌లో నడిచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నావా? అంటూ ప్రశ్నించారు. వరుసగా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదని, నేర విచారణ జరుగుతోందని భయపెట్టేందుకు ప్రయత్నించారు. అరవింద గట్టిగా నిలదీయడంతో వెనక్కి తగ్గిన పోలీసులు తమ వద్ద ఉన్న కంప్యూటర్లో వివరాలు తెలుసుకుని ఆమెను విడిచిపెట్టారు. అరవింద భారత్‌లోనే జన్మించినా... తల్లిదండ్రులతో కలసి అమెరికాలో స్థిర నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.