NMACC Extends Art And Crafts Exhibition SWADESH - Sakshi
Sakshi News home page

నీతా అంబానీ ఎగ్జిబిషన్‌కు అనూహ్య స్పందన.. మరికొన్ని రోజులు పొడిగింపు

Published Wed, May 31 2023 8:29 AM | Last Updated on Wed, May 31 2023 8:57 AM

NMACC extends art and crafts exhibition SWADESH - Sakshi

ముంబై: స్వదేశ్‌ పేరిట నిర్వహిస్తున్న సాంప్రదాయ ఆర్ట్స్, క్రాఫ్ట్‌ ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంఏసీసీ) నిర్ణయించింది. ఎగ్జిబిషన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ తెలిపారు.

తమ నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేలా కళాకారులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తలపెట్టినట్లు ఆమె వివరించారు. వాస్తవానికి ఈ ఎగ్జిబిషన్‌ను తొలుత మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించారు. ఇందులో తంజావూరు పెయింటింగ్‌లు, తోలుబొమ్మలు మొదలైన వాటిని ప్రదర్శిస్తున్నారు.

ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్‌ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement