NMACC
-
Nita Ambani birthday: దీపాలతో వేడుక : ఉత్సాహంగా చిన్న కోడలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ వ్యాపారవేత్త ,పరోపకారి, నీతా అంబానీ 60వ పుట్టిన రోజు (నవంబరు 1). ఈ సందర్భంగా కొత్తకోడలు, నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, రాధిక మర్చంట్, కంపెనీ సిబ్బంది ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీకి స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. Paltan, join us in wishing Mrs. Nita Ambani, a very Happy Birthday! 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/MQlPXKqLGx— Mumbai Indians (@mipaltan) November 1, 2024అలాగే పలువురు సెలబ్రిటీలు నీతా అంబానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. ఐపీఎల్టీం ముంబై ఇండియన్స్ కూడా ఎక్స్ ద్వారా విషెస్ తెలిపింది. Today, on the birthday of our Founder and Chairperson, Mrs. Nita Ambani, we celebrate her passion for the arts! pic.twitter.com/Sq47Fpg55r— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2024నీతా బర్త్‌డేను కంపెనీ సిబ్బంది దీపాలతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు. దీపాలను వెలిగించిన పళ్లెంతో ఆమెకు హారతి ఇచ్చారు. హ్యాపీ బర్త్‌డే పాటను ఆలపించారు. దీంతో నీతా అంబానీ ఆనందంతో మెరిసి పోయింది. ఈ వేడుకలో చిన్నకోడలు రాధిక మర్చంట్ ఉత్సాహంగా పాల్గొంది. పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గులాబీ రంగు చీరలో మెరిసారు. మెడలో మూడు పేటల ముత్యాల హారం, మ్యాచింగ్ చెవిపోగులు, రింగుల జుట్టుతో మరింత అందంగా కనపించారు. అత్తగారికి తగ్గట్టుగా చోటి బహు, రాధిక మర్చంట్ కూడా గులాబీ రంగు పూల దుస్తుల్లో మెరిసింది. -
గ్రాండ్ వెడ్డింగ్ : పవిత్ర కాశీ నగరంపై నీతా అంబానీ ప్రత్యేక వీడియో, వైరల్
లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ పవిత్ర వారణాసి నగర గొప్పదనాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఎన్ఎంఏసీసీని స్థాపించిన తమ దార్శనికతకు అనుగుణంగా, తమ కుటుంబంలోని వివాహ వేడుకలకు ముందు పవిత్ర నగరమైన వారణాసికి నివాళులర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. నీతా అంబానీ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అరుదైన రంగత్ స్వదేశీ బనారసీ చీరలో హుందాగా కనిపించారు.~ Auspicious Beginnings: An Ode to Kashi ~ pic.twitter.com/GXVcIXIeBh— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 12, 2024కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకల్లో భాగంగా వరుడి తల్లి, నీతా అంబానీ వారణాసిని సందర్శించి వివాహ తొలి ఆహ్వానాన్ని కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. -
IOC Session తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో నీతా అంబానీ ఒకరు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా అనేక సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తొలి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఈసీసీ) ద్వారా భారతీయ కళలకు ఆమె ఇస్తున్న ప్రోత్సాహం పలువురి ప్రశంసలందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లోని ఎన్‌ఎంసీసీలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ మీట్ సన్నాహాలకు సంబంధించిన వీడియోను ఎన్ఎంఏసీసీ షేర్ చేసింది. ప్రపంచ దేశాలనుంచి హాజరు కానున్న డెలిగేట్లకు అద్భుతమైన అనుభూతిని అందించేలా కృషి చేస్తోంది. భారతదేశం 40 సంవత్సరాల తర్వాత 141వ IOC సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 14న ప్రారంభించనున్నారు. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి IOC సెషన్లలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశానికి సంతోషకరమైన క్షణం. 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్‌కుఆతిథ్యమివ్వడం భారత్‌కు గర్వకారణమని నీతా సంతోషాన్ని ప్రకటించారు. "ప్రపంచం నలుమూలల నుండి ముంబై నగరానికి వచ్చే ప్రతినిధులందరినీ స్వాగతం చెప్ప బోతున్నాం. 40 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఒలింపిక్ సెషన్‌ను NMACCలో నిర్వహిస్తున్నాం. 80 దేశాల ప్రతినిధులను స్వాగతించడం చాలా సంతోషకరమైన క్షణం. భారత జెండాను ఎగురవేద్దాం. భారతీయులందరి తరపున, ప్రతినిధులందరికీ పెద్ద స్వాగతం అన్నారామె.అంతేకాదు ఈసందర్బంగా IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్‌ను అంబానీ స్వగృహం యాంటిలియా వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీతా తనదైన సాంప్రదాయ చీరలో ఎవర్ గ్రీన్‌గా కనిపించారు. p> ఒలింపిక్స్‌లో క్రికెట్ చివరిసారిగా 1983లో సెషన్‌ను ఇక్కడనిర్వహించింది. ఈ సెషన్లో, లాస్ ఏంజెల్స్‌లో జరిగే 2028 గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడం గురించి విస్తృతంగా జరగనుంది. పారాలింపిక్ క్రీడలు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్స్) , స్క్వాష్‌లతో సహా 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు సిఫారసు చేయాలని నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సంతోషం వ్యక్తం చేసింది. నీతాదే కీలక పాత్ర IOC సెషన్‌కు హోస్టింగ్ హక్కులను భారత్ గెలుచుకోవడంలో నీతా అంబానీదే కీలక పాత్ర. 2023 IOC సెషన్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వాలనే ప్రతిపాదనను 2023లో ఒక ప్రతినిధి బృందం 139వ IOC సెషన్లో సమర్పించింది. ఇందులో నీతా, భారత ఒలింపిక్ సంఘం (IOA) మాజీ అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా నాయకత్వం వహించారు. 2016లో తొలి భారతీయ మహిళగా నీతా అంబానీ రికార్డ్ కాగా నీతా అంబానీ 2016లో IOCలో తొలి భారతీయ మహిళా సభ్యురాలిగా ఎన్నికయ్యారు.అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ఆగస్ట్ 28న ప్రకటించారు. భారతీయ క్రీడలకు ఇది స్వర్ణయుగం అని పేర్కొంటూ, 141వ IOC సెషన్ అక్టోబర్ 15-17 మధ్య NMACCలో జరుగుతుందని నీతా అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ ఏజీఎం: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నీతా అంబానీ కొత్త ప్లాన్స్
Reliance AGM Nita Amban NMACC 46వ రిలయన్స్ వాటాదారుల వార్షిక సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దేశ సంసృతినుంచి క్రీడల దాకా తమ ఫౌండేషన్ కృషిని వివరించారు. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ గురించి ప్రకటించారు. భారతీయ సంస్కృతి,కళ పట్ల తమ నిబద్ధతకు తాము లాంచ్ చేసిన ఎన్ఎంఏసీసీ అని తెలిపారు. రానున్న పదేళ్లలో 50వేల మంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం.బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిపి మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. 10 లక్షల మహిళల సాధికారత కోసం తాము బాగా కృషి చేయనున్నట్టు నీతా అంబానీ వెల్లడించారు. విద్య, క్రీడలు ఇప్పటివరకు 22 మిలియన్ల మంది యువకులకు చేరువయ్యాయని నీతా అంబానీ చెప్పారు ఈ సందర్భంగా బిల్ గేట్స్ దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. రానున్న పదేళ్లలో 50వేలమంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం. ఈ సెంటర్‌ను లాంచ్ చేసినప్పటినుంచి 20లక్షలమంది ఈ సెంటర్‌ను సందర్శించి నట్టు తెలిపారు. అలాగే ఐపీఎల్ టీం గురించి మాట్లాడారు.హార్ధిక ప్యాండ్యా, బుమ్రా,తిలక వర్మ గురించి చెప్పారు. విదేశాల్లో ముఖ్యంగా విమెన్ ఐపీఎల్ టీం ప్రారంభించినట్టు తెలిపారు. అంతర్జాతీయ ఒలంపిక్ మెంబర్‌గా ఇండియాకు ఎలంపిక్ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్ ఫౌండేషన్‌తో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ఆవిష్కరణలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే ఆ ఆవిష్కరణలను అత్యంత అవసరమైన వారికి అందించడంపై దృష్టి పెట్టడం కూడా బావుంది: బిల్ గేట్స్ అధిక-నాణ్యత, సరసమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేయడంలో భారతదేశం బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. రిలయన్స్‌తో ఫౌండేషన్ సహకారంతో మాదక ద్రవ్యాలు , పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్‌లను అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలు అమలుకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ చెప్పారు. అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తాము సంఘాలతో కలిసి పని చేయడం కూడా కొనసాగిస్తామని బిల్ గేట్స్ ప్రకటించారు. -
ఎన్మ్యాక్లో ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్.. తరలివచ్చిన ప్రఖ్యాత ఆర్టిస్టులు
-
ఎన్మ్యాక్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్.. సందడి చేసిన ఇషా అంబానీ, రణ్వీర్ సింగ్
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ‘రన్ యాస్ స్లో యు క్యాన్’ (Run as slow as you can) పేరిట టాయిలెట్ పేపర్ అనే మ్యాగజైన్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. జులై 22న ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అక్టోబర్ 22 వరకు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఏడేళ్ల లోపు చిన్నారులు, సీనియర్ సిటిజెన్లు, ఆర్ట్ విద్యార్థులకు ఈ ప్రదర్శన పూర్తిగా ఉచితమని కల్చరల్ సెంటర్ పేర్కొంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన కళ్లు చెదిరే కళాకృతులు చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంటాయని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చైర్పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ పేర్కొన్నారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రఖ్యాత కళాకారులు, ఔత్సాహికులు తరలివచ్చారు. వీరితో కలిసి ఇషా అంబానీ సందడి చేశారు. ఇదీ చదవండి ➤ IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు! రంగురంగుల కార్నివాల్, 10,000 అరటిపండు బుడగలతో నిండిన స్విమ్మింగ్ పూల్, వింటేజ్ కారు, విలాసవంతమైన మొసలి ఆసనం, కళాకృతంగా తీర్చిదిద్దిన గోడలు వంటివి మంత్రముగ్ధులను చేస్తాయని, సందర్శకులు నచ్చినన్ని ఫొటోలు తీసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి బనానా పూల్‌లో ఆటలాడుతూ సందడి చేశారు. -
న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ
న్యూయార్క్‌లోని మెట్ మ్యూజియంలో జూలై 17న బౌద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ప్రివ్యూకు నీతా అంబానీ హాజరయ్యారు. మెట్ మ్యూజియంలో ప్రారంభ బౌద్ధ కళా ప్రదర్శన 'ట్రీ & సర్పెంట్: ఎర్లీ బౌద్ధ కళ ఇన్ ఇండియా, 200 BCE–400 CE' ప్రత్యేక ప్రివ్యూలో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ జూలై 21- నవంబర్ 13, 2023 వరకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , ది మెట్ ఫిఫ్త్ అవెన్యూలో జరగనుంది. భారతదేశానికి కళను తీసుకురావడానికి ప్రపంచంలోని వివిధ మ్యూజియంలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఎన్ఎంఏసీసీ లాంచ్ తరువాత గత 3 నెలల్లో, ప్రతిరోజూ 5000-6000 మందిని వస్తున్నారు. కేవలం రెండు ప్రదర్శనలను ఒకటిన్నర లక్షల మంది దర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరమైన భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు నీతా అంబానీ.ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, యుఎస్‌లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ,న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, నీతా భారతదేశాన్ని 'బుద్ధుని భూమి' అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ 'బుద్ధం శరణం గచ్ఛామి' అనే పవిత్ర మంత్రాన్ని పఠించడంలో తనతో కలిసి రావాలని ఆమె అభ్యర్థించారు.200 BCE- 400 CE వరకు భారతదేశంలోని బౌద్ధ పూర్వపు మూలాలను హైలైట్ చేసే 140 వస్తువులను ఇక్కడ ప్రదర్శించనున్నారు., నాలుగు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్లాన్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్.ఎన్.హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్, ఫ్రెడ్ ఐచానర్ ఫండ్ కలిసి పనిచేశాయి. నీతా 2016 నుండి మెట్ మ్యూజియంలో కీలకమైన భాగంగా ఉన్నారు. నవంబర్ 2019లో ఆమె గౌరవ ధర్మకర్తగా ,మెట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో మ్యూజియం ట్రస్టీల బోర్డులో చేరిన తొలి భారతీయురాలు నీతా కావడం విశేషం. #WATCH | We are looking at collaborating with various museums of the world to bring art to India. In last 3 months, after we opened NMACC, we saw footfall of 5000-6000 every day just for two exhibits we had over one and a half lakh people coming. India is at the right place and… pic.twitter.com/yga2AOeiUa — ANI (@ANI) July 19, 2023 -
నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్.. సంగీత దిగ్గజాలతో ‘పరంపర’
రిలయన్స్ ఫౌండేషన్ స్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్‌కు తెరతీశారు. అనాదిగా వస్తున్న గురు శిష్య సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో 'పరంపర' అనే పేరుతో వారం రోజుల వేడుకను ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో సజీవ దిగ్గజాలు పద్మ విభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ కార్తీక్ కుమార్, వారి శిష్యులు రాకేష్ చౌరాసియా, నీలాద్రి కుమార్‌లతో కలిసి నీతా అంబానీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ధీరూభాయ్ అంబానీకి ఘన నివాళి కార్యక్రమంలో భాగంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ తన గురువు, మామ దివంగత ధీరూభాయ్ అంబానీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువుల ఔన్నత్యాన్ని వివరించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, మనకు మొదటి గురువులైన తల్లిదండ్రులను గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. తనకు అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువులలో ఒకరైన ధీరూభాయ్ అంబానీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Mrs. Nita Ambani inaugurated, ‘Parampara’ a two day special celebration of the timeless guru-shishya legacy with a traditional lamp lighting ceremony accompanied by Pandit Hariprasad Chaurasia, Pandit Kartick Kumar & their illustrious disciples Rakesh Chaurasia and Niladri Kumar. pic.twitter.com/pTmWQk4f47 — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 1, 2023 ఇదీ చదవండి: వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు.. -
వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ఫౌండర నీతా అంబానీ భర్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కలిసి వైట్‌హౌస్‌లో గ్రేస్‌ఫుల్ లుక్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఇచ్చిన వైట్ హౌస్‌లో స్టేట్ డిన్నర్‌కు హాజరైన సందర్బంగా సాంప్రదాయబద్ధంగా అందమై న ఐవరీ కలర్ పట్టు చీరలో అందర్నీ ఆకట్టుకున్నారు. పూర్తిగా స్వదేశీ కళాకారులు రూపొందించిన బనారస్ పట్టు చీరను ధరించారు. దానికి సరిపోయే లేత గోధుమరంగు రంగు బ్లౌజ్, మ్యాచింగ్ మూడ వరుసల ముత్యాల హారం, పెర్ల్ నెక్లెస్, డైమండ్ పొదిగిన బ్యాంగిల్స్ , స్టడ్ చెవిపోగులతో తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటి చెప్పారు. బంగారు దారాలతో అందంగా చేతితో తయారు చేసిన సహజమైన పట్టు చీరను ఎంచుకోవడం విశేషం. (గిఫ్టెడ్ ఆర్టిస్ట్ నీతా అంబానీ అద్భుతమైన ఫోటోలు) ఎన్ఎంఏసీసీ అందించిన సమాచారం ప్రకారం రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ ఆర్టిసన్-ఓన్లీ స్టోర్ ఫార్మాట్, స్వదేశ్, ముంబైలోని జియో మార్ట్‌లోని వారి ఇటీవల ప్రారంభించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఈ చీరను తయారు చేశారు. అంతేకాదు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సహ-హోస్ట్ చేసిన స్టేట్ లంచ్‌లో గుజరాత్‌లోని పటాన్‌కు చెందిన ఎత్నిక్ పటోలా చీరను ధరించడం విశేషంగా నిలిచింది. ఈ గులాబీ రంగు పటోలా చీర పూర్తి చేయడానికి 6 నెలల పట్టిందట. భారతదేశ సంస్కృతి , సంప్రదాయం పట్ల ప్రేమ, ఫ్యాషన్ సెన్స్‌ను ఎపుడూ నిరూపించు కుంటూఉంటారు. స్పెషల్ కలెక్షన్స్‌కి ఆమె వార్డ్రోబ్ చాలా పాపులర్. దీనికి తోడు ఇటీ నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ వేదికను కల్పించారు. నీతా అంబానీ వివిధ రంగాలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2023లో ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ప్రతిష్టాత్మక అవార్డు గెల్చుకున్నారు. (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?) Mrs. Nita Ambani’s sartorial choice – reflecting her vision of promoting Indian artisans – also found a place of pride at the State lunch co-hosted by U.S. Vice President Kamala Harris where she wore an ethnic Patola saree from Patan, Gujarat. pic.twitter.com/HXZWc19pfg — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) June 24, 2023 -
నీతా అంబానీ ఎగ్జిబిషన్‌కు అనూహ్య స్పందన.. మరికొన్ని రోజులు పొడిగింపు
ముంబై: స్వదేశ్ పేరిట నిర్వహిస్తున్న సాంప్రదాయ ఆర్ట్స్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) నిర్ణయించింది. ఎగ్జిబిషన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. తమ నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేలా కళాకారులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తలపెట్టినట్లు ఆమె వివరించారు. వాస్తవానికి ఈ ఎగ్జిబిషన్‌ను తొలుత మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించారు. ఇందులో తంజావూరు పెయింటింగ్‌లు, తోలుబొమ్మలు మొదలైన వాటిని ప్రదర్శిస్తున్నారు. ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు -
NMACCలో ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే గుడ్లు తేలేస్తారు!
ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇటీవల 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ప్రారంభోత్సవ వేడుకలు ప్రారభించారు. ఇందులో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ తనకి కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి కనిపించారు. ఈ వేడుకల్లో రాధిక మర్చంట్ ఖరీదైన హ్యాండ్ బ్యాగు మాత్రమే కాకుండా.. వారు ధరించిన ఖరీదైన దుస్తులు, ఇతర వస్తువులు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వీటితో పాటు అనంత్ అంబానీ ధరించిన వాచ్ (Watch) చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీని ధర సుమారు రూ. 18 కోట్లు వరకు ఉండటం గమనార్హం. ఇది అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. పాటెక్ ఫిలిప్ కంపెనీ తయారు చేసిన ఈ వాచ్‌కి ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయని, ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన చేతి గడియారాల్లో ఇది చాలా ప్రత్యేకమైందని 'ద ఇండియన్ టెక్నాలజీ' ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించారు. ఈ వాచ్‌కి రివర్సిబుల్ మెకానిజం, రెండు ఇండిపెండెంట్ డయల్స్, ఎంచుకున్న సమయానికి ప్రత్యేక శబ్దంతో అలర్ట్ చేసే అలారం, డేట్ రిపీటర్, మాన్యువల్ ఆపరేటర్ వంటి దాదాపు ఇరవై కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని సమాచారం. వైట్ గోల్డ్ కలర్లో ఫ్రంట్, బ్యాక్ డయల్స్ కలిగిన ఈ ఖరీదైన వాచ్ ఎలిగేటర్ లెదర్, చేతితో కుట్టిన క్లాస్ప్‌తో గోల్డ్ డయల్ ప్లేట్లతో అలంకరించబడి చూడచక్కగా ఉంటుంది. ఈ ప్రారంభ కార్యక్రంలో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్‌ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్‌పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. అయితే గతేడాది డిన్నర్ డేట్లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Amit Aggarwal (@amitaggarwalofficial) -
మోడల్ నడుముపై చేతులేసిన బోని కపూర్.. నెటిజన్స్ ట్రోల్
సినీ ప్రముఖులకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏం చేసినా..అది వార్తే అవుతుంది. వారు చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తారు. మంచి పని చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. తప్పు చేస్తే అంతే దారుణంగా ట్రోల్ చేస్తారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా జరిగిన తప్పుకు, అసలు వాళ్ల దృష్టిలో అది తప్పే కాకపోయినా.. నెటిజన్స్ సదరు సినీ ప్రముఖులను ట్రోల్ చేస్తుంటారు. అలాంటి ట్రోలింగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత బోని కపూర్‌కు ఎదురైంది. ఓ బాలీవుడ్ మోడల్ నడుముపై చేతులు వేశాడంటూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే... రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC)’ ప్రారంభోత్సవం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్‌తో పాటు ప్రముఖ నిర్మాత బోని కపూర్ కూడా హాజరయ్యాడు. అలాగే హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మోడల్ జిగి హడిద్ కూడా ఈ లాంచింగ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసింది. అక్కడ బోని కపూర్ కనిపించడంతో దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిం. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అదే ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణమైంది. ఫోటో దిగే క్రమంలో బోని కపూర్ జిగి హడిద్ నడుముపై చేతులు వేశారు. అయితే ఆయన మాత్రం క్యాజువల్‌గానే చేతులు వేసి ఫోటో దిగారు. జిగి సైతం అలానే భావించి లైట్ తీసుకుంది. కానీ నెటిజన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఫోటోని షేర్ చేసూ బోనీ కపూర్‌ని దూషిస్తున్నారు. Patli kamariya tori haaye haaye haaye pic.twitter.com/u0DBdwZfE8 — SwatKat💃 (@swatic12) April 3, 2023 The way #BoneyKapoor Holds Gigi Hadid's Thin Waist in this pic, Is it real or just my Hallucination 😂 pic.twitter.com/ucQn46vEGv — 💫 Arthur (@irrk_k) April 3, 2023 Arey boney ji 😭 pic.twitter.com/WJnbWJ9eJL — celina ❦ (@bollyvfx1) April 3, 2023 Gigi ji, aapko tairna aata hai? pic.twitter.com/MlVV2KKUoG — Robin (@Bisleri_maymer) April 3, 2023 Close enough#BoneyKapoor #GigiHadid #NMACC pic.twitter.com/B9W0VSl8It — Himalaya Kankariya (@himalayahere) April 4, 2023 -
NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ‘నీతా ముఖేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ ప్రారంభం వేడుకల్లో మరో విషయం ఆసక్తికరంగా మారింది. టిష్యూ పేపర్లలా రూ. 500నోట్లను ఉంచారన్న వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. (NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే ) బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు సందడి చేసిన అంబానీల గ్రాండ్ పార్టీపై ఒక ట్విటర్ యూజర్ ఒక పోస్ట్ పెట్టారు. అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కీ జగహ్ 500 కే నోట్స్ హోతే హై (sic)’’ అని ట్వీట్ చేశాడు. దీంతో రుచి కరమైన వంటకాలతో పాటు కరెన్సీ నోట్లు వడ్డించారా అంటూ నెటిజన్ల కామెంట్లు వైరలయ్యాయి. (అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి ) నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా వడ్డించిన తీపి పదార్థంపైనే ఈ చర్చ అన్నమాట. అతిథులకు వడ్డింయిన ఖరీదైన వంటకాలకు తోడు, ఈ స్వీటు, కరెన్సీ నోట్లతోపాటు ఉండటంతో ఈ ప్రత్యేక స్వీట్ ఫొటో హాట్ టాపిక్‌గా నిలిచింది. మీమ్స్‌తో నెటిజన్లు సందడి చేశారు. Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain 😭 pic.twitter.com/3Zw7sKYOvC — R A T N I S H (@LoyalSachinFan) April 2, 2023 అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ స్వీట్ పేరు ‘దౌలత్ కి చాట్’ (daulat ki chaat) ఉత్తర భారతదేశంలో చాలా ఇష్టపడే వంటకం. ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సేవిస్తారట. బాగా మరిగించిన పాలను చల్లబరిచిన తర్వాత తయారు చేస్తారు. పిస్తా, కోవా,బాదం,చక్కెర తదితర రిచ్ ఇంగ్రీడియెంట్స్‌తో గార్నిష్ చేస్తారంటూ ఫుడ్ ఎక్స్పర్ట్స్, కొంతమంది నెటిజన్లు స్పందించారు. ఈ స్వీట్ ఢిల్లీలో కూడా చాలా పాపులర్ అని ఒకరు. ఇది చాలా రెస్టారెంట్లలో ఇది దొరుకుతుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. దీంతో అంబానీ పార్టీలో కరెన్సీ నోట్ల వడ్డన అనే ఊహాగానాలకు చెక్ పడింది. కాగా శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ గ్రాండ్ ఈవెంట్ ఉత్సవాలు మూడురోజుల పాటుసాగాయి. నీతా అంబానీ స్వయంగా ప్రదర్శించిన నృత్యప్రదర్శనతోపాటు, బాలీవుడ్, హాలీవుడ్ తారల డ్యాన్స్‌లు, షారూక్, గౌరీ డాన్స్, ప్రియాంక చోప్రా, రణవీర్ స్టెప్పులు, టాలీవుడ్ ఆస్కార్ విన్నర్ సాంగ్ నాటునాటు పాటకు రష్మిక, అలియా నృత్యం, అలాగే శనివారం జరిగిన ఈవెంట్లో ఆస్కార్ విజేత ముంబైకి వచ్చి పింక్ కార్పెట్‌పై అలరించిన సంగతి తెలిసిందే. @Ruhaani77 pic.twitter.com/At1f4ZXr5Z — garima (@badanpesitaree) April 2, 2023 -
NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు, సినీరంగ సెలబ్రిటీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ ఖాన్ త్రయంతోపాటు, దీపికా, రణవీర్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ ,ఫ్యాషన్‌స్టార్ సోనమ్ కపూర్, వరుణ్‌ధావన్, రణ్వీర్ సింగ్, సీనియర్ నటులు రేఖ , వహీద తదితర స్టార్‌డస్ట్ అంతా గ్లామరస్‌గా కనిపించారు. ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ ఇరగ దీశారు. షారుఖ్ ఖాన్ హిట్ ట్రాక్ ఝూమ్ జో పఠాన్‌కి స్టెప్పులేశారు. ఇండో కెనడియన్ సింగర్ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ (ఏపీ సింగ్) పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. గౌరీ బెస్ట్ ఫఫ్రెండ్ మహీప్ కపూర్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. View this post on Instagram A post shared by JODI (@thejodilife) అంతముందు వరుణ్ ధావన్, సూపర్ మోడల్ జిగి హడిద్ స్టేజ్‌పై సందడి చేశారు. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా స్టేజ్‌పై షారూఖ్ ఖాన్ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. తనతోపాటు స్టెప్ప్లేయాల్సిందిగా వరుణ్‌ధావన్, రణ్వీర్ సింగ్‌ను కోరడంతో మరింత జోష్ నెలకొంది View this post on Instagram A post shared by @varindertchawla మరోవైపు బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ప్రియాంక చోప్రా, హీరో రణవీర్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది.దీనికి షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది. GAURI KHAN ??? DANCING AND VIBING TO PRIYANKA’S PERFORMANCE??? NOW THIS IS MY MULTIVERSE OF MADNESS 😭😭😭😭 *screamingggg*#PriyankaChopra pic.twitter.com/0y3Ku7Vvt9 — k. (@karishmaokay) April 2, 2023 -
NMACC Day 2: నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో అందాల హొయలు (ఫొటోలు)
-
అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ఎంఏసీసీ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంబానీ ఇంటికి కాబోయే కోడలు, అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ అందరి దృష్టినీ ఆకర్షించారు. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేసిన ఈ వేడుకల్లో రాధికా మర్చంట్ నల్ల చీరలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఉన్న వెండి రంగు హెర్మేస్ కెల్లీమార్ఫోస్ మినీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. bollywoodshaadis.com కథనం ప్రకారం.. ఫ్యాషన్స్టాలో ఈ చిన్న బ్యాగ్ ధర అక్షరాలా రూ.52,30,000. ఇంత ఖరీదైన బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రా, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) ఈ వేడుకలో రాధికా మర్చంట్ నలుపు రంగులో ఉన్న ఇండో వెస్ట్రన్ స్టైల్ లేస్ చీరలో అద్భుతంగా కనిపించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి చిన్న కొడుకుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ గత జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
NMACC: ప్రశంసలు: నీతా ‘షో’ కు కదిలిపోయిన ఆనంద్ మహీంద్ర
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రారంభించిన డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఎం అండ్ ఎం అధినేత బిలియనీర్ ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' షోపై తన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. మ్యూజికల్ షో కథనం తన హృదయాన్ని కదిలించిందనీ, ముఖ్యంగా నీతా అంబానీ రఘుపతి రాఘవ రాజా రామ్‌కి పాటతో పూజ్య బాపూజీని గుర్తు చేశారంటూ అభినందించారు. (NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్, మీరూ ఫిదా అవ్వాల్సిందే!) వరుస ట్వీట్లలో ఈ సందర్భంగా తన సంతోషాన్నిపంచుకున్న ఆనంద్ మహీంద్ర అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించినందుకు ముఖేశ్, నీతా అంబానీలకు ధన్యవాదాలు తెలిపారు. థియేటర్ డైరెక్టర్ ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. లైట్ అండ్ సౌండ్ అద్భుతం. హృదయాన్ని కదిలించే ఈ షోను తనఇద్దరు మనవళ్లు ఈ ప్రదర్శన చూసి, దీని గొప్పతనాన్ని గ్రహించాలని కోరుకోంటున్నా అంటూ ట్వీట్ చేశారు. (నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) కాగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నడిబొడ్డునున్న జియో వరల్డ్ సెంటర్లో అట్టహాసంగా నిర్వహించిన ఎన్ఎంఏసీసీ గ్రాండ్ ఓపెనింగ్‌కు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా భార్య అనురాధతో సహా హాజరయ్యారు. బ్లాక్ జోధ్‌పురి సూట్లో ఆనంద్మహీంద్రా, పూల జరీ వర్క్ సాల్మన్ పింక్ చీరలో భార్య అనూరాధ క్లాసీగా స్పెషల్‌గా కనిపించారు. But more than the spectacle, it is the narrative that stirs the heart. My dominant sentiment was of wanting my two grandsons to see the show & grasp the richness of their Indian heritage. Thank you #NitaAmbani & #MukeshAmbani for this show & for a performance platform second to… pic.twitter.com/PzpKwvUgKz — anand mahindra (@anandmahindra) April 1, 2023 Last night, the #NMACC was launched in Mumbai with the staging of “The Great Indian Musical: Civilization to Nation.” A tour de force conceived by Feroz Abbas Khan. It’s a spectacular panorama of India’s cultural & political history. The light, sound, colour & movement are… pic.twitter.com/ZDknbbwbxY — anand mahindra (@anandmahindra) April 1, 2023 our desi celebs showed up at nmacc event & rocked like no one else 🫶🏼 pic.twitter.com/H45tvMkmvo — anushka. (@softiealiaa) April 1, 2023