రిలయన్స్ ఫౌండేషన్ స్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్‌కు తెరతీశారు. అనాదిగా వస్తున్న గురు శిష్య సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో 'పరంపర' అనే పేరుతో వారం రోజుల వేడుకను ప్రారంభించారు.
భారతీయ శాస్త్రీయ సంగీతంలో సజీవ దిగ్గజాలు పద్మ విభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ కార్తీక్ కుమార్, వారి శిష్యులు రాకేష్ చౌరాసియా, నీలాద్రి కుమార్‌లతో కలిసి నీతా అంబానీ జ్యోతి ప్రజ్వలన చేశారు.
ధీరూభాయ్ అంబానీకి ఘన నివాళి
కార్యక్రమంలో భాగంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ అయిన నీతా అంబానీ తన గురువు, మామ దివంగత ధీరూభాయ్ అంబానీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువుల ఔన్నత్యాన్ని వివరించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, మనకు మొదటి గురువులైన తల్లిదండ్రులను గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. తనకు అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువులలో ఒకరైన ధీరూభాయ్ అంబానీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Mrs. Nita Ambani inaugurated, ‘Parampara’ a two day special celebration of the timeless guru-shishya legacy with a traditional lamp lighting ceremony accompanied by Pandit Hariprasad Chaurasia, Pandit Kartick Kumar & their illustrious disciples Rakesh Chaurasia and Niladri Kumar. pic.twitter.com/pTmWQk4f47
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 1, 2023
ఇదీ చదవండి: వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు..
Comments
Please login to add a commentAdd a comment