Nita Ambani Saree Handcrafted By Swadesh Artisans For US State Dinner At White House - Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ స్టేట్ డిన్నర్‌: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?

Published Sat, Jun 24 2023 3:44 PM | Last Updated on Sat, Jun 24 2023 4:45 PM

Nita Ambani Saree Handcrafted By Swadesh Artisans For US State Dinner - Sakshi

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, ఫౌండర నీతా అంబానీ  భర్త, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీతో కలిసి వైట్‌హౌస్‌లో  గ్రేస్‌ఫుల్ లుక్‌తో  మెరిసిన సంగతి తెలిసిందే. భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జోబిడెన్‌ ఇచ్చిన వైట్ హౌస్‌లో స్టేట్ డిన్నర్‌కు హాజరైన సందర్బంగా సాంప్రదాయబద్ధంగా అందమై న ఐవరీ కలర్‌ పట్టు చీరలో అందర్నీ  ఆకట్టుకున్నారు. 

పూర్తిగా స్వదేశీ కళాకారులు రూపొందించిన  బనారస్‌  పట్టు చీరను ధరించారు. దానికి సరిపోయే లేత గోధుమరంగు రంగు బ్లౌజ్‌, మ్యాచింగ్‌  మూడ వరుసల ముత్యాల హారం, పెర్ల్ నెక్లెస్, డైమండ్ పొదిగిన బ్యాంగిల్స్ , స్టడ్ చెవిపోగులతో తన ఫ్యాషన్‌ స్టయిల్‌ను చాటి చెప్పారు.  బంగారు దారాలతో అందంగా చేతితో తయారు చేసిన సహజమైన పట్టు చీరను ఎంచుకోవడం విశేషం.   (గిఫ్టెడ్‌ ఆర్టిస్ట్‌ నీతా అంబానీ అద్భుతమైన ఫోటోలు)

ఎన్‌ఎంఏసీసీ అందించిన సమాచారం  ప్రకారం రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్  ఆర్టిసన్-ఓన్లీ స్టోర్ ఫార్మాట్, స్వదేశ్, ముంబైలోని జియో మార్ట్‌లోని వారి ఇటీవల ప్రారంభించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఈ చీరను తయారు చేశారు. అంతేకాదు యూఎస్‌ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సహ-హోస్ట్ చేసిన స్టేట్ లంచ్‌లో  గుజరాత్‌లోని పటాన్‌కు చెందిన  ఎత్నిక్‌  పటోలా చీరను ధరించడం  విశేషంగా నిలిచింది. ఈ గులాబీ రంగు పటోలా చీర పూర్తి చేయడానికి 6 నెలల పట్టిందట.

భారతదేశ సంస్కృతి , సంప్రదాయం పట్ల  ప్రేమ,  ఫ్యాషన్ సెన్స్‌ను  ఎపుడూ నిరూపించు కుంటూఉంటారు.  స్పెషల్‌ కలెక్షన్స్‌కి ఆమె  వార్డ్‌రోబ్‌ చాలా పాపులర్‌. దీనికి తోడు ఇటీ నీతా ముఖేష్‌ అంబానీ కల్చర్‌ సెంటర్‌ ద్వారా  భారతీయ కళాకారులకు ప్రపంచ వేదికను కల్పించారు. నీతా అంబానీ వివిధ రంగాలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2023లో ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌ ప్రతిష్టాత్మక అవార్డు గెల్చుకున్నారు. (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement