రిలయన్స్ పౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ ఏ చీర కట్టినా, ఏనగ పెట్టినా అద్భుతమే. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్, డిజైనర్ దుస్తులు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. చేనేత, ,పట్టుచీరలు, డైమండ్ నగలు, ముత్యాల హారాలతో తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ఐకాన్‌లా నిలుస్తుంటారామె. ఇటీవల అంబానీ కుటుంబం గణేష్ చతుర్థిని ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్బంగా నీతా అంబానీ 'బంధేజ్' చీరలో ప్రత్యేకంగా కనిపించారు.
డిజైనర్ జిగ్యా పటేల్ డిజైన్ చేసిన వంకాయ రంగు, గులాబీ రంగుల మల్టీకలర్ బంధేజ్ చీరలో నీతా అంబానీ అందంగా కనిపించారు. ఇక ఆమె వేసుకున్న గుజరాతీ ఎంబ్రాయిడరీతో ఎరుపు రంగు బ్లౌజ్ ప్రత్యేకత ఏంటంటే స్లీవ్‌లపై గణపతి బప్పా డిజైన్ ఉండటం. ఇంకా ఎనిమిది వరుసల ముత్యాల హారం, డైమండ్ చెవిపోగులు, ముత్యాలు పొదిగిన గాజులు, చేతి రింగ్, ఇంకా సింపుల్‌గా పువ్వులతో ముడితో ఎత్నిక్ లుక్‌తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఇటీవల ఎన్‌ఎంఈసీసీలో జరిగిన ఈవెంట్‌లో నీతా అంబానీ పట్టు 'పటోలా' చీరలో మెరిసారు. స్టైలిష్ రెడ్-హ్యూడ్ సిల్క్ పటోలాకు మ్యాచింగ్‌గా రాధా-కృష్ణ-ప్రేరేపిత గ్రాఫిక్ డిజైన్ వర్క్ బ్లౌజ్ ధరించిన సంగతి తెలిసిందే.
కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ , రాధిక పెళ్లి తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో అంబానీ కుటుంబం ఈ గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ తారలు, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై గణపతి బప్పా ఆశీస్సులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment