గణేష్‌ నిమజ్జనం: వేడుకగా ఆడిపాడిన అంబానీ కుటుంబం | Ambani family joins Antillia Cha Raja immersion procession | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనం: వేడుకగా ఆడిపాడిన అంబానీ కుటుంబం

Published Tue, Sep 10 2024 4:34 PM | Last Updated on Tue, Sep 10 2024 4:58 PM

Ambani family joins Antillia Cha Raja immersion procession

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు నిమజ్జనం కోసం తరలి వెళ్లాడు. గణపతి బప్పా మోరియా అంటూ అంబానీ అధికారిక నివాసం ఆంటిలియాలో పూజలందుకున్న గణపతిని అంబానీ కుటుంబం సాదరంగా సాగ నంపింది.  పోయిరావయ్య బొజ్జ గణపతి,  మళ్లొచ్చే  ఏడాది మళ్లీ రావయ్యా అంటూ ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో లంబోదరుడికి మోకరిల్లి,  హారతిచ్చి, జై బోలో గణేష్‌ మహారాజ్‌కీ అంటూ జేజేలు పలుకుతూ మేళ తాళాలతో ఊరేగింపుగా యాంటిలియా చా రాజాను నిమజ్జనానికి తోడ్కొని పోయారు.

నిమజ్జనానికి ముందు నిర్వహించిన పూజాకార్యక్రమంలో ముఖేష్‌ అంబానీ తల్లి కోకిలా బెన్‌, భార్య నీతా అంబానీ హారతి నివ్వగా, కొత్త దంపతులు అనంత్‌, రాధికతోపాటు, ఆకాశ్‌ అంబానీ,శ్లోకా అంబానీ,ఇషా, పిరామిల్‌ ఆనంద్‌ దంపతులు, అంబానీ మనవలు ,మనవరాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కాగా గణేష్‌ చతుర్ధి  అంటే  అంబానీ  ఇంట  పెద్ద సందడే ఉంటుంది. అందులోనూ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్‌  అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం తరువాత వచ్చిన తొలి వినాయక  చవితి కావడంతో  మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే 15కోట్ల రూపాయల విలువైన స్వర్ణకిరీటాన్ని ముంబైలోని లాల్‌బాగ్యా గణపతికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అంబానీ ఇంట  వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రేఖ, సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, బోనీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ , సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement