Ganesh Visarjan
-
నిమజ్జనం.. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల్లో జనం
దాదర్: నిమజ్జనోత్సవాలు ముగియడంతో స్వగ్రామాలకు తరలిపోయిన వేలాది మంది భక్తులు ముంబై దిశగా తిరగు పయన మయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు బయటపడటంతో ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే అనేక మంది గౌరీ గణపతులను గురువారం నిమజ్జనం చేసి శుక్రవారం నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధవారం మళ్లీ ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బయటపడటం ఒక కారణమైతే, రోడ్లపై ఏర్పడిన గుంతలు మరో కారణమని తెలుస్తోంది. సాధారణంగా ముంబై–గోవా జాతీయ రహదారి నిత్యం తేలికపాటి, ట్రక్కులు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రాలీలు తదితర సరుకులు చేరేవేసే భారీ వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. గణేశోత్సవాల సమయంలో ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే భక్తుల వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరంతా ముంబై–గోవా జాతీయ రహదారినే ఆశ్రయిస్తారు. దీంతో గణేశోత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై (నిత్యావసర సరుకులు చేరేవేసే వాహనాలు మినహా) భారీ వాహనాలకు నిషేధం ఉండింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజుల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి. దీన్ని బట్టి ముంబై–గోవా జాతీయ రహ దారి ఏ స్థాయిలో బిజీగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా నిమజ్జనోత్సవాలు సాయంత్రం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి దాటగానే అనేక మంది తిరుగుపయనమవుతా రు. కానీ ఈ సారి మంగళవారం సాయంత్రం ని మజ్జనోత్సవాలు ముగిసినప్పటికీ అనేక మంది బుధవారం మధ్యాహ్నం తరువాత బయలుదేరారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయమే విధుల్లో చేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారి్మకులు, కూలీలు, వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో ముంబై దిశగా తిరుగు పయనమయ్యారు. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయా యి. ఎక్కడ చూసిన గుంతలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడింది. (వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య! 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర )15–17 గంటల ప్రయాణం భక్తుల వాహనాలకు (అప్, డౌన్లో) ప్రభుత్వం టోల్ నుంచి మినహాయింపు నిచ్చినప్పటికీ గుంతల కారణంగా వేగానికి కళ్లెం పడింది. దీంతో పది గంటల్లో పూర్తికావల్సిన ప్రయాణం 15–17 గంటలు పడుతుంది. ముంబై–గోవా జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పికప్ వాహనాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలే దర్శనమిచ్చాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి సీట్లో కూర్చుండలేక అనేక మంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కనున్న డాబాలను ఆశ్రయించారు. దీంతో డాబా వాలాల బేరాలు జోరందుకున్నాయి. శీతలపానీయాలు, వాటర్ బాటిళ్లు, చీప్స్, తదితర చిరుతిళ్ల ప్యాకెట్లు దొరక్కుండా పోయాయి. కొన్ని చోట్ల మందకొడిగా, మరికొన్ని చోట్ల నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబదీ్ధకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకపక్క గుంతలు, పాడైపోయిన రోడ్లతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో వాహనాలు ఇటు ముందుకు వెళ్లలేక అటు తిరిగి వెనక్కి వెళ్లి మరో మార్గం మీదుగా వెళ్లలేక నరకయాతన అనభవించారు. -
గణేష్ నిమజ్జనం: వేడుకగా ఆడిపాడిన అంబానీ కుటుంబం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు నిమజ్జనం కోసం తరలి వెళ్లాడు. గణపతి బప్పా మోరియా అంటూ అంబానీ అధికారిక నివాసం ఆంటిలియాలో పూజలందుకున్న గణపతిని అంబానీ కుటుంబం సాదరంగా సాగ నంపింది. పోయిరావయ్య బొజ్జ గణపతి, మళ్లొచ్చే ఏడాది మళ్లీ రావయ్యా అంటూ ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో లంబోదరుడికి మోకరిల్లి, హారతిచ్చి, జై బోలో గణేష్ మహారాజ్‌కీ అంటూ జేజేలు పలుకుతూ మేళ తాళాలతో ఊరేగింపుగా యాంటిలియా చా రాజాను నిమజ్జనానికి తోడ్కొని పోయారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)నిమజ్జనానికి ముందు నిర్వహించిన పూజాకార్యక్రమంలో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ హారతి నివ్వగా, కొత్త దంపతులు అనంత్, రాధికతోపాటు, ఆకాశ్ అంబానీ,శ్లోకా అంబానీ,ఇషా, పిరామిల్ ఆనంద్ దంపతులు, అంబానీ మనవలు ,మనవరాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.కాగా గణేష్ చతుర్ధి అంటే అంబానీ ఇంట పెద్ద సందడే ఉంటుంది. అందులోనూ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే 15కోట్ల రూపాయల విలువైన స్వర్ణకిరీటాన్ని ముంబైలోని లాల్బాగ్యా గణపతికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అంబానీ ఇంట వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రేఖ, సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, బోనీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ , సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
మాడిసన్: విదేశాల్లో గణనాథుడి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్టం విస్కాన్సిన్ స్టేట్‌లోని సన్ ప్రైరీలో తెలుగు వాళ్లంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించి.. సోమవారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అభిషేక్ సింధుజ, సంతోష్ ప్రణయ, ప్రసాద్ రమ్య, క్రాంతి కవిత, సంతోష్ ఉష తదితరులు పాల్గొన్నారు. -
గణపతిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తాం?అసలు కారణమిదే!
అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడ్ని నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుంది. సాధారణంగా హిందూ పండగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా గణనాథుడికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు. మండపాలు వేసి అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజలు చేసి తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు. హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ ప్రతిమలను ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఒక్క వినాయకుడిని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తాం?దీని వెనకున్న కారణం ఏంటన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్షరుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండుగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. మట్టితోనే ఎందుకు? గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా విశేషముంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి అంటితే మంచిది. ఒండ్రుమట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పంచుతుంది. ఎంతో మేలు చేస్తుంది. వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతుంటాయి. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. కానీ ఈమధ్యకాలంలో గణపతికి రసాయనిక రంగులు వేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో నివసించే జీవులకు హానికారకమవుతుంది.అందుకే మట్టి గణపతులనే పూజించాలని చెబుతారు. నిమజ్జనమెందుకు? అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల(భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవాల్సిందే.అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే!ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తారు. శాస్త్రీయ కారణాలు.. వినాయక నిమజ్జనం వేనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వినాయక చవితి నాటికి.. జోరుగా వానలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను నీళ్లల్లో నిమజ్జనం చేయడం వల్ల.. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అలానే వానాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా.. ఆయన పూజకు వాడిన ఆకులను కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. మట్టి గణపతి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యం. -
రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, రంగారెడ్డి: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్‌ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం. ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డూ. ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట ముగియడంతో కాసేపట్లో నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు. బాలాపూర్ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే.. ► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000 ►2000లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,10,000 ►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,35,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు... ►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి... రూ. 18,90,000 ► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి ► 2023లో 27 లక్షలు దాసరి దయానంద్‌రెడ్డి -
చేయి చేసుకున్న సీనియర్ నటులు
-
వనస్థలిపురంలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న విద్యార్థి చందూని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు అక్కడ చందూ పై దాడి చేసి చితక బాదారు. చందూ కిడ్నాప్ కు గురైనట్టు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు సకాలంలో చందూ ఆచూకీ కనిపెట్టారు. కిడ్నాపర్ల దాడిలో తీవ్రగాయాలపాలైన చందూను హాస్పటిల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో చందూ ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
నాతో పాటు ఆకాశం కూడా కన్నీరుపెట్టింది
వినాయక చవితితో చాలామందికి సెంటిమెంటు పరంగా అనుబంధం ఉంటుంది. అందులోనూ ఇంట్లో పిల్లలు స్వయంగా వినాయకుడి బొమ్మలు చేయడం మొదలైన తర్వాత ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు కష్టపడి, ఎంతో ఇష్టపడి సరదాగా బొమ్మ చేసుకుని, దానికి మనసారా పూజలు అర్పించిన తర్వాత.. ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా కొంత బాధపడతారు. సరిగ్గా తనకు అలాంటి బాధే ఉంటుందని చెబుతోంది నటి, దర్శకురాలు రేణు దేశాయ్. ప్రతిసారీ వినాయక నిమజ్జనం సమయంలో తనకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుందని.. ఈసారి మాత్రం ఆకాశం కూడా తనతో పాటు ఏడ్చేసిందని ఆమె ట్వీట్ చేశారు. తన కారు అద్దాల మీద పడుతున్న వానను ఫొటో తీసి పోస్ట్ చేశారు. ఈసారి తన కొడుకు అకీరా, కూతురు ఆద్య కలిసి ఎలాంటి ప్లాస్టిక్, థర్మోకోల్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని తయారుచేశారంటూ అంతకుముందు మురిసిపోతూ రేణు దేశాయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Every year,every single year my eyes tear up&this year d sky cried with me too! #Ganpati #visarjan #GanpatiBappaMorya pic.twitter.com/OZKy9Qzw74 — renu (@renuudesai) September 18, 2015 -
గణేశ్ నిమజ్జనంలో ఘర్షణ: ఒకరి హత్య
దామరచర్ల: నల్గొండ జిల్లాలో జరిగిన గణేష్ ఉత్పవాల్లో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా డప్పు కళాకారుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో శనివారం జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ప్రత్యర్థుల దాడిలో మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాళెం గ్రామానికి చెందిన నర్సయ్య(65) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరు వర్గాలు మద్యం సేవించి ఉన్నందున మాటామాట పెరిగి నర్సయ్యను కొట్టి చంపారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానికలు సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
'నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం'
పుణె : వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించే నిమజ్జనం ఊరేగింపు వేడుకలలో డ్యాన్స్ చేయడం తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చెప్పాడు. ఆ సమయంలో నన్ను నేను నియంత్రించుకోలేక పలు గణేష్ విగ్రహాల వద్ద డ్యాన్స్ చేస్తుంటానని తెలిపాడు. 'బాజీరావ్ మస్తానీ' మూవీలో బాజీరావ్ క్యారెక్టర్లో ప్రస్తుతం రణవీర్ నటిస్తున్న విషయం విదితమే. పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. బాజీరావ్ చాలా గొప్ప వ్యక్తి అని, ఆ పాత్రకు నన్ను ఎంపిక చేయడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పాడు. బాజీరావ్ పాత్రకు న్యాయం చేసేందుకు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తానన్నాడు. దశాబ్దకాలంలో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుందని, అందుకోసం ఇతర మూవీలను కొన్ని వదులుకున్నట్లు తెలిపాడు. 'బాజీరావ్ మస్తానీ' పేరుతో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మస్తానీగా కనిపించనుంది దీపిక. దీవానీ మస్తానీ అనే పాట కోసం దర్శకుడు ఏకంగా ఓ గ్లాస్ పాలెస్ సెట్ ఏర్పాటు చేయించాడని తెలిపాడు. ప్రేయసి దీపికా అందాలను మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు ఈ మహల్ తోడ్పడుతుందన్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక కాశీబాయ్గా కనిపిస్తోంది. బాజీరావ్ మరాఠా ప్రాంతానికి చెందిన రాజు మాత్రమే కాదు.. గొప్ప వ్యక్తి కూడా అంటూ ఆ పాత్ర పోషిస్తున్న రణవీర్ ముచ్చటించాడు.