నాతో పాటు ఆకాశం కూడా కన్నీరుపెట్టింది
వినాయక చవితితో చాలామందికి సెంటిమెంటు పరంగా అనుబంధం ఉంటుంది. అందులోనూ ఇంట్లో పిల్లలు స్వయంగా వినాయకుడి బొమ్మలు చేయడం మొదలైన తర్వాత ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు కష్టపడి, ఎంతో ఇష్టపడి సరదాగా బొమ్మ చేసుకుని, దానికి మనసారా పూజలు అర్పించిన తర్వాత.. ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా కొంత బాధపడతారు. సరిగ్గా తనకు అలాంటి బాధే ఉంటుందని చెబుతోంది నటి, దర్శకురాలు రేణు దేశాయ్.
ప్రతిసారీ వినాయక నిమజ్జనం సమయంలో తనకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుందని.. ఈసారి మాత్రం ఆకాశం కూడా తనతో పాటు ఏడ్చేసిందని ఆమె ట్వీట్ చేశారు. తన కారు అద్దాల మీద పడుతున్న వానను ఫొటో తీసి పోస్ట్ చేశారు. ఈసారి తన కొడుకు అకీరా, కూతురు ఆద్య కలిసి ఎలాంటి ప్లాస్టిక్, థర్మోకోల్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని తయారుచేశారంటూ అంతకుముందు మురిసిపోతూ రేణు దేశాయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Every year,every single year my eyes tear up&this year d sky cried with me too! #Ganpati #visarjan #GanpatiBappaMorya pic.twitter.com/OZKy9Qzw74
— renu (@renuudesai) September 18, 2015