'నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం' | I love dancing in Visarjan processions, says Ranveer Singh | Sakshi
Sakshi News home page

'నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం'

Published Wed, Sep 16 2015 4:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం' - Sakshi

'నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం'

పుణె : వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించే నిమజ్జనం ఊరేగింపు వేడుకలలో డ్యాన్స్ చేయడం తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చెప్పాడు. ఆ సమయంలో నన్ను నేను నియంత్రించుకోలేక పలు గణేష్ విగ్రహాల వద్ద డ్యాన్స్ చేస్తుంటానని తెలిపాడు. 'బాజీరావ్ మస్తానీ' మూవీలో బాజీరావ్ క్యారెక్టర్లో ప్రస్తుతం రణవీర్ నటిస్తున్న విషయం విదితమే. పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. బాజీరావ్ చాలా గొప్ప వ్యక్తి అని, ఆ పాత్రకు నన్ను ఎంపిక చేయడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పాడు. బాజీరావ్ పాత్రకు న్యాయం చేసేందుకు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తానన్నాడు. దశాబ్దకాలంలో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుందని, అందుకోసం ఇతర మూవీలను కొన్ని వదులుకున్నట్లు తెలిపాడు.  

'బాజీరావ్ మస్తానీ' పేరుతో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మస్తానీగా కనిపించనుంది దీపిక. దీవానీ మస్తానీ అనే పాట కోసం దర్శకుడు  ఏకంగా ఓ గ్లాస్ పాలెస్ సెట్ ఏర్పాటు చేయించాడని తెలిపాడు. ప్రేయసి దీపికా అందాలను మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు ఈ మహల్ తోడ్పడుతుందన్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక కాశీబాయ్గా కనిపిస్తోంది. బాజీరావ్ మరాఠా ప్రాంతానికి చెందిన రాజు మాత్రమే కాదు.. గొప్ప వ్యక్తి కూడా అంటూ ఆ పాత్ర పోషిస్తున్న రణవీర్ ముచ్చటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement