సాక్షి, రంగారెడ్డి: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్‌ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం. ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా.
నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డూ.
ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట ముగియడంతో కాసేపట్లో నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు.
బాలాపూర్ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే..
► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450
► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500
►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000
►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000
►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000
►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000
►2000లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ.66,000
►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000
►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000
►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000
►2004లో కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000
►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000
►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000
►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000
►2008లో కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000
►2009లో సరిత రూ.5,10,000
►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,35,000
►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000
►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి... రూ.7,50,000
►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000
►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000
►2015లో కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000
►2016లో స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000
►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000
►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000
►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000
►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు...
►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి... రూ. 18,90,000
► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి
► 2023లో 27 లక్షలు దాసరి దయానంద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment