Balapur Laddu auction
-
బాలాపూర్ గణనాథుడి లడ్డూ అ‘ధర’హో
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టించారు. ఎత్తైన గణేష్ విగ్రహం (70 అడుగులు) కూడా ఇదే. కాగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మొదటిసారి 1994లో లడ్డూ వేలంపాట ప్రారంభించింది. తొలి వేలంపాటలో అదే ప్రాంతానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి రూ.450 లడ్డూ కైవసం చేసుకున్నారు. ఆయన వరుసగా మూడు సార్లు వేలంపాటలో పాల్గొన్నారు. ఈ లడ్డూను దక్కించుకున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో కాల క్రమంలో ప్రసాదానికి డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌కు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలంపాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది.విగ్రహ సంస్కృతి ఇలా.. ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతా విస్తరించింది. ప్రస్తుతం గ్రేటర్లో చిన్న, పెద్ద కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. ఇదిలా ఉంటే రెండు మూడేళ్ల క్రితం వరకూ బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. 2023లో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి చేతిలో ఉన్న లడ్డూ ప్రసాదం బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. నిత్యం రికార్డుల్లో నిలిచే బాలాపూర్ లడ్డూ మాత్రం గతేడాది రూ.27 లక్షలు పలికింది. ఈ యేడాదికి సంబంధించి మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించే వేలం పాటలో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాల్సిందే. -
రూ.1.25 కోట్లు పలికిన గణేశ్ లడ్డు
బండ్లగూడ(హైదరాబాద్): వేలం పాటలో గణేశ్ లడ్డుకు అత్యధికంగా రూ.1.25 కోట్లు పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరు కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డుకు గురువారం వేలంపాట నిర్వహించగా, ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ. 1.25 కోట్లకు దక్కించుకున్నారు. ఆర్వీ దియా ట్రస్ట్ ఆధ్వర్యంలో 150కిపైగా వ్యక్తిగతదాతలు కలిసి ఈ లడ్డును కొనుగోలు చేశారు. గతేడాది ఇక్కడి లడ్డు కు వేలంపాటలో పలికిన ధర రూ.6.28 లక్షలే. బాలాపూర్ లడ్డు రూ. 27 లక్షలు బాలాపూర్ గణనాథుని లడ్డును ఈసారి తుర్క యాంజాల్ పరిధిలోని పాటిగూడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రైతు దాసరి దయానంద్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. వేలంపాటలో రూ.27 లక్షలకు ఆయన సొంతమైంది. ► రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చ బండ వినాయక లడ్డును వేలం పాటలో రూ.22. 11 లక్షలకు కేటీఆర్ గ్రూప్ సభ్యులు దక్కించుకున్నారు. గతేడాది రూ.20.20 లక్షలు పలికింది. ► బడంగ్‌పేట వీరాంజనేయ భక్త సమాజం లడ్డును మాజీ ఉప సర్పంచ్ పెద్దబావి వెంకట్‌రెడ్డి రూ.17 లక్షలకు సొంతం చేసుకున్నారు. ► షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మధురపురం రెడ్డిసేవా సమితి వినాయక లడ్డును అదే గ్రామానికి చెందిన శేరి పర్వతరెడ్డి రూ. 11,11,116లకు దక్కించుకున్నాడు బాలాపూర్ గణేశుడి లడ్డును దక్కించుకున్న దాసరి దయానంద్ లడ్లు దక్కించుకున్న ముస్లింలు ► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్జనతా గణేశ్‌మండలి వద్ద లడ్డుకు వేలం పాట నిర్వహించగా, స్థానిక ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.1.02లక్షలకు దక్కించుకున్నాడు. ► రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని సాయినగర్ కాలనీలో లడ్డు వేలం పాట నిర్వహించగా, మండలంలోని మహాలింగపురం గ్రామానికి చెందిన మహారాజ్‌పేట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తాహేర్ అలీ రూ. 23,100కు దక్కించుకున్నాడు. -
రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, రంగారెడ్డి: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్‌ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం. ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డూ. ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట ముగియడంతో కాసేపట్లో నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు. బాలాపూర్ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే.. ► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000 ►2000లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,10,000 ►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,35,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు... ►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి... రూ. 18,90,000 ► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి ► 2023లో 27 లక్షలు దాసరి దయానంద్‌రెడ్డి -
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం (ఫొటోలు)
-
రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ వేలం
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూ శుక్రవారం జరిగిన వేలం పాటలో రికార్డు బ్రేక్ చేసింది. వేలంలో రూ. 24.60 లక్షలు పలికింది. లడ్డూను బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ. 18.90 లక్షలు పలకగా.. అప్పటి కంటే ఈసారి లడ్డూ ధర 5.70 లక్షలు అధికంగా పలికింది. కాగా ఈ సంవత్సరం బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటల 13 మంది పాత సభ్యులు, 8 మంది కొత్తవారు పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులు లడ్డూ వేలంలో పాటకు హాజరయ్యారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం హాజరయ్యారు. వేలం పాట అనంతరం బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మదీనా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా శోభాయాత్ర సాగనుంది. -
రూ. 17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
-
12న గణేష్ శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు కొలిచే గణనాథులకు ఘన వీడ్కోలు పలికేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ వినాయకుని లడ్డూ వేలంతో శోభాయాత్ర కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఈ సంవత్సరం శోభాయాత్రకు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ (చీఫ్) మోహన్ భాగవత్ హాజరుకానున్నారని, స్వామి ప్రజ్ఞానంద యాత్రలో పాల్గొంటారన్నారు. శుక్రవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు మీడియాతో మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. చాంద్రాయణగుట్ట, షాలిబండ, చార్మినార్ మీదుగా సాగుతుందని తెలిపారు. యాత్రలో డీజేలు, సినిమా పాటలు, వికృత డాన్సులు చేయరాదని సూచించారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడరాదని, స్వచ్ఛత, శుభ్రత పాటించాలని, మండపాల వద్ద గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. సమితి ఆ«ధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఒక థీమ్ పెట్టుకుంటామని, ఈ యేడు జలియన్ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. ఊరేగింపులో గుర్తుతెలియని వ్యక్తులు ఏదైనా వదంతులు పుట్టిస్తే దాన్ని నమ్మరాదని సూచించారు. పోలీసులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. వినాయక్‌సాగర్‌లో మహా హారతి.. కాశీ తరహాలో వినాయక్ సాగర్ (ట్యాంక్‌బండ్)లో కూడా మహా హారతి ఇవ్వాలని తాము ప్రతిపాదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాఘవరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిగా సహకరిస్తున్నాయని, యాత్ర పొడువునా నీరు ఏర్పాటు చేసేందుకు వాటర్‌వర్క్స్, లైట్ల ఏర్పాటుకు విద్యుత్ సంస్థ సిద్ధమైనట్లు తెలిపారు. -
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, బడంగ్పేట్: బాలాపూర్ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. వేలం పాటలో రూ. 16లక్షల 60వేలకు శ్రీనివాస్ గుప్తా (ఆర్యవైశ్య సంఘం) లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాదితో పొలిస్తే బాలాపూర్ లడ్డూ లక్ష రూపాయలు అధికంగా పలికింది. భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో లడ్డూ వేలం పాట కన్నుల పండుగగా జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ గణపయ్యది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇక్కడి వినాయకుని లడ్డూకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పెద్ద ఎత్తున ఉంటుందనే సంగతి తెలిసిందే. దీనిని దక్కించుకోవడానికి పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఈ వేలం పాటలో పాల్గొంటారు. బాలాపూర్ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైనప్పటికీ అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ... 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లడ్డూ ఫ్రమ్ తాపేశ్వరం... బాలాపూర్ లడ్డూను తొలుత చార్మినార్‌లోని గుల్‌జల్ ఆగ్రా స్వీట్ హౌస్ వారు తయారు చేసేవారు. బరువు 21 కిలోలు ఉండేది. అయితే గత నాలుగేళ్లుగా అంతే బరువుతో తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్ లడ్డూను తయారు చేస్తోంది. వేలంపాట విజేతకు లడ్డూను ఉంచే రెండు కిలోల వెండి గిన్నెను ఇస్తున్నట్లు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వర్ తెలిపారు. 15లక్షల రూపాయలు పలికిన ఫిలింనగర్ గణపతి లడ్డూ ఫిలింనగర్లో గణపతి లడ్డూ వేలం పాటు పోటాపోటీగా జరిగింది. యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన లడ్డూ వేలానికి భారీ స్పందన వచ్చింది. ఈ వేలంలో మేఘనా కన్స్ట్రక్షన్స్ 15 లక్షల రూపాయలకు వినాయకుడి లడ్డూ సొంతం చేసుకుంది. -
9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
-
రూ. 9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ : ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ.9.50 లక్షలు పలికింది. ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ లంబోదరుడి లడ్డూను సింగిరెడ్డి జయేందర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రూ.116 నుంచి ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేష్ లడ్డూ సింగిరెడ్డి జయేందర్ రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.9.26 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి మరో 24వేల అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరటం విశేషం. -
అందరి దృష్టి బాలాపూర్ వైపే
*బాలాపూర్ లడ్డూ కోసం ఏటా పెరుగుతోన్న ఆదరణ * నేటి వేలంపై ఆసక్తి బడంగ్‌పేట లడ్డూ కూడా.. హైదరాబాద్ : సామూహిక గణేశ్ నిమజ్జనం వేళ అందరి దృష్టి బాలాపూర్ వైపు మళ్లింది. ఇక్కడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడుతుంటారు. లడ్డూను దక్కించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. లక్షలు వెచ్చించి లడ్డూను సొంతం చేసుకునేందుకు ఆసక్తిచూపుతారు. సోమవారం నిమజ్జన ఊరేగింపు ప్రారంభానికి ముందు ఇక్కడ లడ్డూను వేలం వేస్తారు. ఈసారి అది ఎవరి సొంతం అవుతుందోనని నగరవాసులంతా ఎదురుచూస్తున్నారు. లడ్డూ ప్రస్థానం ఇలా.. ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరింది. బాలాపూర్‌లో పదేళ్ల కాలంలో లడ్డూను సొంతం చేసుకున్న వారు.. సం. దక్కించుకున్న వారు మొత్తం రూ. లక్షల్లో 2004 కొలను మోహన్‌రెడ్డి రూ.2.01 2005 ఇబ్రాం శేఖర్ రూ.2.08 2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ.3.00 2007 జి.రఘునందనాచారి రూ.4.15 2008 కొలను మోహన్‌రెడ్డి రూ.5.07 2009 సరిత రూ.5.10 2010 శ్రీధర్‌బాబు రూ.5.30 2011 కొలను ఫ్యామిలీ రూ.5.45 2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7.50 2013 టీకేఆర్ విద్యాసంస్థలు మీర్‌పేట రూ.9.26 బడంగ్‌పేట లడ్డూకూ ఆదరణ.. బాలాపూర్ తరువాత బడంగ్‌పేట గణనాథుడి లడ్డూకు అంతటి డిమాండ్ ఉంది. ఇక్కడి లడ్డూను వేలంలో లక్షల రూపాయలకు సొంతం చేసుకుంటున్నారు భక్తులు. ఇక్కడ 1966 నుంచి మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకున్ని ప్రతిష్ఠిస్తున్నారు. 1995 నుంచి లడ్డూను వేలం వేస్తున్నారు. మొదటిసారి వేలం పాటలో అప్పటి గ్రామ సర్పంచ్ ఆశంగారి నిర్మలానర్సింహారెడ్డి రూ.7,200లకు అడ్డూను సొంతం చేసుకున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ యేడు వేలం పాట నిర్వహించలేదు. రూ.7,200తో మొదలైన లడ్డూ వేలం ఏటా పెరుగుతూ లక్షల్లోకి చేరింది. ఈసారి ఆ లడ్డూ ఎవరి సొంతం అవుతుందనే ఆసక్తి నెలకొంది. మీరాలం మండిలో 108 ఏళ్లుగా.. నిజాం కాలంలో కూరగాయల విక్రయానికి ప్రధాన కేంద్రంగా కొనసాగిన మీరాలం మండిలో 108 ఏళ్ల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజుల్లో ఇక్కడ గాజుల వెంకయ్య, బోగం మల్లయ్య, ఆవులు దుర్గయ్య, కాట నర్సయ్య తదితరులు వినాయక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు పూజించి గులాబ్‌చంద్ బాడలోని బావిలో నిమజ్జనం చేసేవారు. 1986 నుంచి గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.