గణేశ్ నిమజ్జనంలో ఘర్షణ: ఒకరి హత్య | 1 murdered in ganesh visarjan at nalgonda | Sakshi
Sakshi News home page

గణేశ్ నిమజ్జనంలో ఘర్షణ: ఒకరి హత్య

Published Sat, Sep 19 2015 11:47 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

1 murdered in ganesh visarjan at nalgonda

దామరచర్ల: నల్గొండ జిల్లాలో జరిగిన గణేష్ ఉత్పవాల్లో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా డప్పు కళాకారుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో శనివారం జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఘర్షణ చోటు చేసుకుంది.

ప్రత్యర్థుల దాడిలో మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాళెం గ్రామానికి చెందిన నర్సయ్య(65) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరు వర్గాలు మద్యం సేవించి ఉన్నందున మాటామాట పెరిగి నర్సయ్యను కొట్టి చంపారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్తత  నెలకొంది. స్థానికలు సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement