సాక్షి, హైదరాబాద్: నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వల్లభ్‌రెడ్డి భార్య లహరిని హత్య చేసిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, లహరి మృతి కేసు దర్యాప్తు సంచలనంగా మారింది. లహరి మృతిని వల్లభ్‌రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్టు గుర్తించారు.
వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన లహరి మృతి వివాదాస్పదంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లహరిని హత్య చేసిన వల్లభ్‌రెడ్డి ఆమె మృతిని గుండెపోటుగా చిత్రీకరించినట్టు తెలిసింది. అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు పూర్తి చేశాడు. దినకర్మకు 10వేల మందికి భోజనాలు కూడా పెట్టాడు వల్లభ్ రెడ్డి. కాగా, తాజాగా ఆమె పోస్టుమార్టం నివేదికలో హత్యా కోణం బయటపడింది. ఈ సందర్భంగా లహరికి ఇంటర్నల్ గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. పొట్టలో రెండు లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగినట్టు వైద్యులు స్పష్టం చేశారు.
కాగా, కొద్ది రోజులుగా లహరి, వల్లభ్‌రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో లహరితో వాగ్వాదం సందర్భంగా వల్లభ్.. ఆమె తలను గోడకు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇక, వల్లభ్‌రెడ్డిని రిమాండ్‌లోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, హత్య కేసు స్థానికంగా, రాజకీయాంగా కలకలం సృష్టిస్తోంది. ఇక, లహరి పేరెంట్స్‌పై కూడా వల్లభ్‌రెడ్డి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: సత్తెనపల్లి: తీవ్ర విషాదం నింపిన గోవా ట్రిప్
Comments
Please login to add a commentAdd a comment