![BRS Anneparthy Shekhar Arrest At Nalgonda](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Anneparthi_0.jpg.webp?itok=ul2AVSTK)
సాక్షి, చండూరు: నల్లగొండ జిల్లాలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. రాత్రి రెండు సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. శేఖర్‌ను తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందుతున్నారు. మరోవైపు.. శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడం గమనార్హం.
వివరాల ప్రకారం.. జిల్లాలోని చండూరులో బీఆర్‌ఎస్ నాయకుడు అన్నెపర్తి శేఖర్‌ను గురువారం అర్ధరాత్రి దాటిన కొందరు వ్యక్తులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కుటుంబీకులను భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో, ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్టు చేశారనే విషయాలు చెప్పకుండానే లాకెళ్లారు. ఈ క్రమంలో అన్నెపర్తి శేఖర్ సతీమణి.. ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదు. తన భర్తను కారులోకి ఎక్కించిన తర్వాత చివరకు పోలీసులమని చెప్పారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే, శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అన్నెపర్తి శేఖర్ అరెస్టుపై ఎట్టకేలకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేయడం, బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చండూరు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.
మరోవైపు.. శేఖర్ అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం, మునుగోడు ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..‘అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికం. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు నమోదు చేశారు. బెదిరించడంలో భాగంగా ఓ కేసును అడ్డం పెట్టుకుని కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. శేఖర్‌ను వెంటనే విడుదల చేయాలి. ఇంతవరకు శేఖర్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా సమాచారం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment