kusukuntla prabhakar reddy
-
TG: అర్ధరాత్రి హైడ్రామా.. బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్
సాక్షి, చండూరు: నల్లగొండ జిల్లాలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. రాత్రి రెండు సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. శేఖర్‌ను తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందుతున్నారు. మరోవైపు.. శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడం గమనార్హం.వివరాల ప్రకారం.. జిల్లాలోని చండూరులో బీఆర్ఎస్ నాయకుడు అన్నెపర్తి శేఖర్‌ను గురువారం అర్ధరాత్రి దాటిన కొందరు వ్యక్తులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కుటుంబీకులను భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో, ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్టు చేశారనే విషయాలు చెప్పకుండానే లాకెళ్లారు. ఈ క్రమంలో అన్నెపర్తి శేఖర్ సతీమణి.. ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదు. తన భర్తను కారులోకి ఎక్కించిన తర్వాత చివరకు పోలీసులమని చెప్పారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.అయితే, శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అన్నెపర్తి శేఖర్ అరెస్టుపై ఎట్టకేలకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేయడం, బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చండూరు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.మరోవైపు.. శేఖర్ అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం, మునుగోడు ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..‘అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికం. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు నమోదు చేశారు. బెదిరించడంలో భాగంగా ఓ కేసును అడ్డం పెట్టుకుని కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. శేఖర్‌ను వెంటనే విడుదల చేయాలి. ఇంతవరకు శేఖర్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా సమాచారం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు అమల య్యేలా చూడాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యా హ్నం సుమారు మూడు గంటల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశ మయ్యారు. మునుగోడు అభివృద్ధికి సంబంధించిన పలు అంశా లపై దిశానిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల సమయంలో నేతలు కేవలం హామీలు ఇస్తారనే అపోహను తొలగించాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులపై ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భ ంగా నియోజకవర్గంలో రీజనల్ హాస్పిటల్, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి అనేక అంశాలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయి. త్వరలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక తేదీని నిర్ణయించుకుని పంచాయతీరాజ్, రోడ్లు– భవనాలు, నీటి పారుదల, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు చెందిన మంత్రులు మునుగోడుకు వెళ్లండి. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వ హించి, అవసరమైన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయండి. చర్ల గూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ల పనుల పురోగతిని సమీ క్షించండి..’’ అని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఇప్ప టికే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నట్టు సమాచారం. కూసుకుంట్లకు అభినందన మునుగోడు ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఆయనతోపాటు మునుగోడులో విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలను అభినందించారు. సీఎంను కలిసినవారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్యయాదవ్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎంసీ కోటిరెడ్డి, పార్టీ నేత సోమభరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు? -
ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్ఎస్కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్‌కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్ఎస్ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్లో 817, 6వ రౌండ్లో 638, 7వ రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్లో 852, 10వ రౌండ్ 488 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ సాధించింది. అప్పటిదాకా ప్రతిరౌండ్‌లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్ఎస్కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్లో 1,361, 12 రౌండ్లో 2వేల ఓట్లు, 13వ రౌండ్లో 1,345 ఓట్లు, 14వ రౌండ్లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్/సర్వీస్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా.. ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. 12వ రౌండ్ సమయానికి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. డిపాజిట్ దక్కించుకోని కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్ దక్కినట్టు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్‌నగర్ కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు, హిమాయత్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు. చదవండి: పక్కా వ్యూహంతో విజయం -
అంత అహంకారమెందుకు.. టీఆర్ఎస్ గెలుపుపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పార్టీ ఓటమిని చవిచూసింది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేసినప్పటికీ మునుగోడు ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఇక, బీజేపీ ఓటమి నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఓడిపోతే కుంగిపోమని స్పష్టం చేశారు. కాగా, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా తీర్పును గౌరవిస్తాము. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో యుద్ధం చేశారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా బీజేపీ కార్యకర్తలు తలొగ్గకుండా పనిచేశారు. గెలిచిన ఆనందంలో టీఆర్ఎస్ నేతలు హామీలు నెరవేర్చుతామని చెప్పకుండా అహంకారంగా మాట్లాడుతున్నారు. మునుగోడు గెలుపు.. తండ్రి గెలుపా? కొడుకు గెలుపా?. అల్లుడి గెలుపా?. బీజేపీకి భయపడి.. మా పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులు (టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, పరోక్షంగా కాంగ్రెస్) కలిసి పనిచేశాయి. దమ్ముంటే టీఆర్ఎస్లో చేరిన 12 మందితో రాజీనామా చేయించండి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రచారం చేస్తే 10వేల మెజార్టీ వచ్చింది. ఈ గెలుపు.. గెలుపే కాదు. మునుగోడు గెలుపు ఎన్నికల కమిషనర్ గెలుపు. టీఆర్ఎస్ వాళ్లు డబ్బులు పంచారు.. కానీ ఎక్కడా దొరకలేదు. టీఆర్ఎస్ను అడ్డుకునే దమ్మున్న పార్టీ బీజేపీనే. తెలంగాణ అంతటా బీజేపీ ఉంది. ముందు ముందు మరింత కమిట్మెంట్తో పనిచేస్తాము. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాము’ అని వెల్లడించారు. -
మునుగోడులో టీఆర్ఎస్ భారీ విజయం..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు 10వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో వికర్టీని సాధించారు. ఇక, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిల్ కోల్పోవడం గమనార్హం. కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి తమ మార్క్ చూపించారు. ముఖ్యంగా కారు గుర్తును పోలి ఉన్న చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులకు భారీగా ఓట్లు పడ్డాయి. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపుతో గులాబీ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. -
Munugode Election Results: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్!
సాక్షి, నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. నవంబర్ 3న ఎన్నిక జరగగా.. నవంబర్ 6న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందునుంచీ అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు ఆయా పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. రౌండ్ రౌండ్‌కు మారుతూ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ముందుగా చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కించారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల ఆధిక్యం రాగా.. రెండో రౌండ్లో బీజేపీ 789 ఓట్ల మెజారిటీ సాధించింది. ఆ తర్వాత మూడు రౌండ్లోనూ బీజేపీ 416 ఓట్లతో ఆధిక్యత కనబర్చింది. ఇక నాలుగో రౌండ్లో 299 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ 26,443, బీజేపీ 25,729, కాంగ్రెస్ 7,380 ఓట్లు సాధించాయి. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సొంతూరి ప్రజలే షాకిచ్చారు. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యంలోకి రావడం గమనార్హం. ఇదిలాఉండగా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సొంత మండలం చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ పుంజుకోవడం గమనించదగ్గ విషయం. (చదవండి: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు) -
భారీ మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుంది : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
Munugode By Election Results: టెన్షన్.. టెన్షన్
సాక్షి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఉప ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారోనన్న ఉత్కంఠ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎవరికి అనుకూలంగా, మరెవరికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందోనన్న టెన్షన్ ప్రధాన పార్టీలకు తప్పడం లేదు. బరిలో ఉన్న 47 మంది అభ్యర్థులు, ఆయా పార్టీలు తీర్పు కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఆదివారం మధ్యాçహ్నం వరకు ఈ టెన్షన్ తప్పదు. ఏ పార్టీకి పట్టం కడతారో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మునుగుతుందో, ఏ పార్టీ తేలుతుందో ఆదివా రం వెల్లడికానుంది. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానం కావడంతో జోరుగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ ప్రచారం కొనసాగింది. మొదట్లో జోరుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కొంత నెమ్మదించింది. పోలింగ్ తేదీ దగ్గర పడిన సమయంలో మాత్రం మళ్లీ ప్రచార జోరును పెంచింది. అయితే టీఆర్ఎస్, బీజేపీ చేసినంత భారీ ఎత్తున ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) మార్పు చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో దిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే టీఆర్ఎస్ పేరుతో ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఈ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు తమ పాత స్థానాన్ని కచ్చితంగా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఉప ఎన్నికల్లో ఇన్చార్జులుగా నియమించింది. వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గంలో జరిగిన రెండు సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్‌రావులు పెద్ద ఎత్తున రోడ్‌షోలు నిర్వహించారు. మంత్రులు ఆయా మండలాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారం పని చేసింది. దక్షిణ తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ దక్షిణ తెలంగాణలో పాగా వేసే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డినే బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆయన గెలుపు ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డింది. ఈ రెండు పార్టీల మధ్యే హోరా హోరీగా పోరు జరిగింది. సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మొదట్లో సీరియస్‌గా తీసుకుంది. మొదట దశలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. తర్వాత మధ్యలో నెమ్మదించింది. భారత్ జోడో యాత్రకు రాష్ట్ర నాయకత్వం అంతా వెళ్లడంతో కొంత వెనుకబడింది. చివరలో మళ్లీ ప్రచార జోరును పెంచింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కౌటింగ్ ఇలా ► ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రాంరంభం ► 298 పోలింగ్ స్టేషన్లు ► 21 టేబుళ్లు, 15 రౌండ్లలో లెక్కింపు ► 294 పోలింగ్ స్టేషన్ల ఓట్లు 14 రౌండ్లలో లెక్కింపు ► 15వ రౌండ్లో 4 టేబుళ్లపై మిగిలిన ► 4 పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ► 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం ► చివరి ఫలితం ఒంటిగంట వరకు వచ్చే అవకాశం ► విధుల్లో పాల్గొనే మొత్తం సిబ్బంది 250 మంది ► అందులో కౌంటింగ్ కోసం 100 మంది, ఇతర కార్యకలాపాలకు 150 మంది ► ఒక్కో టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, ఒక పోలింగ్ సూపర్వైజర్, ఒక పోలింగ్ అసిస్టెంట్ ఉంటారు. ► అభ్యర్థుల ఏజెంట్లు ఉండేలా ఏర్పాట్లు పోలైన ఓట్లు ఇలా.. ► నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855. ఇందులో 50 సర్వీసు ఓటర్లు. ► ఈవీఎంలలో పోలైనవి 225192 ఓట్లు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు 739 మంది పోస్టల్ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 686 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలలో మొత్తంగా 2,25,878 ఓట్లు పోలయ్యాయి. 93.41 శాతం పోలింగ్ నమోదైంది. ► నవంబరు 4వ తేదీ నాటికి నాటికి సాయుధ బలగాలకు (సర్వీస్ ఓటర్స్) సంబంధించిన ఓట్లు 50 అందాయి. 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అవసరమైన సిబ్బందిని నియమించాం. మొదటి రౌండ్లో చౌటుప్పల్, చివరి రౌండ్లో నాంపల్లి మండలాల కౌంటింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తి కావచ్చు. ఈవీఎంల లెక్కింపు తరువాత డ్రా పద్ధతిన 5 పోలింగ్ స్టేషన్ల వీవీ ప్యాట్లను లెక్కిస్తాం. – జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణారెడ్డి పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం ఆర్జాలబావిలోని గోదాముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. 470 మంది పోలీసులు, 3 కంపెనీల కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా చర్యలు చేపట్టాం. – ఎస్పీ రెమా రాజేశ్వరి -
మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్‌ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ ఆధిక్యత సాధిస్తారని పార్టీ అంచనా వేసింది. ఈ మేరకు మండలాలు, యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్‌చార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు సమర్పించారు. పోలింగ్ బూత్‌ల వారీగా నమోదైన ఓట్లు, వాటిలో టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతో సహా పొందు పరిచారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఈ నివేదికలను క్రోడీకరించి శుక్రవారం పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. పోలైన ఓట్లలో 50శాతం మేర ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి సాధిస్తాడని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ ఇన్చార్జీల నుంచి అందిన నివేదికలతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి పార్టీ తరపున ఏజెంట్ల జాబితాపై కసరత్తు జరుగుతోంది. పార్టీ తరపున ఓట్ల లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లకు శనివారం అవగాహన కల్పిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే సుమారు పక్షం రోజులపాటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తలమునకలైన నేతలు గురువారం రాత్రి పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ కేడర్‌ను సమన్వయం చేశారు. చదవండి: Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే -
గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి
సాక్షి, యాదాద్రి: ‘‘ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి. అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించండి’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. గతంలో మునుగోడు ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపించారని.. రాజగోపాల్‌రెడ్డి గెలిచిన నాటి నుంచీ బీజేపీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రజా సమస్యలను ఏనాడూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడు అనవసరంగా ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డబ్బు అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. శుక్రవారం రాత్రి చౌటుప్పల్ పట్టణంలో జరిగిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆ డబ్బంతా రాజగోపాల్‌రెడ్డి ఖాతాలోకే.. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనది చిన్న కంపెనీగా చెప్పుకొని రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారు? ఇచ్చిన పెద్దలు ఎవరు, గుజరాత్ గద్దలు ఎవరు? పేద ప్రజల జన్‌ధన్ ఖాతాల్లో 15 లక్షల చొప్పున పడాల్సిన డబ్బులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో పడ్డాయి. ఇందుకోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. రాజగోపాల్‌రెడ్డి ఇచ్చే పైసలన్నీ గుజరాత్ దొంగల పైసలు. దబాయించి తీసుకోండి. కానీ కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి. శివలింగం వస్తే మాది, శవం వస్తే మీది అంటూ బేకార్ మాటలు మాట్లాడే చిల్లర నాయళ్లకు బుద్ధిచెప్పాలి. మోదీవన్నీ పకోడీ మాటలు 2016లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడకు వచ్చి 300 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. ఇన్నేళ్లయినా తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదో, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఇడ్లీ బండి, పకోడీ బండి పెట్టుకోవాలని యువతకు సూచిస్తున్నారు. మోదీవన్నీ పకోడీ మాటలే. నల్లధనం తెస్తానని చెప్పి తెల్లమొఖం వేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ వేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేశారు. నాడు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1,200కు చేరింది. ఓటు వేసేటప్పుడు మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైతు బాంధవుడు కేసీఆర్.. గత 75 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు ఆకుపచ్చ తలపాగాలు ధరించి రైతులను మోసం చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం రైతు బంధు, రైతుబీమా వంటి ఉత్తమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రైతు పథకాలను అటుఇటు మార్చి అమలు చేస్తున్నాయి. నేను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నా. ఫలానాది కావాలని అడగకుండానే చేసి చూపిస్తా. మునుగోడు నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 48 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, రైతు బీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇక్కడి దండుమల్కాపురంలో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను నిర్మించాం. 200 కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తులు ప్రారంభించనున్నాయి. మిషన్ భగీరథ పథకం కోసం రూ. 19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచిస్తే.. 19 పైసలు కూడా ఇవ్వలేదు. చర్లగూడెం, శివన్నగూడెం ప్రాజెక్టులను సగం పూర్తి చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే పూర్తి చేయిస్తాం. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. దేశంలో అత్యధికంగా వరి పండించే జిల్లాగా నల్లగొండ జిల్లా మారింది. గత 65 ఏళ్లలో పరిష్కారం కాని ఫ్లోరోసిస్ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం రూపుమాపింది..’’ అని కేటీఆర్ చెప్పారు. చౌటుప్పల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్‌షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
Munugode Bypoll: సర్కార్ ఎవల్తోని నడుస్తున్నది?
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటర్ ఎన్క సీట్ల గూసుండు. ‘‘ఎత్తుగడ్డలు, గుంతలు సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. బల్రు అడ్డం రావొచ్చు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతే తిక్కలేవొచ్చు. బేచైన్ గాకుంట ఉండెతంద్కు రొండు ముచ్చట్లు జెప్త ఇను’’ అని అన్నడు. ‘‘నువ్వు జెప్తె ఇనకుంట ఉన్ననా?’’ అని విక్రమార్కుడన్నడు. ‘‘మునుగోడు అంటె ఏందో ఎర్కేనా? మును అంటె ముందుగాల, గోడు అంటె గోస. బై ఎలచ్చన్లు వొచ్చె బట్కె సంటర్ మంత్రులు, ముక్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు గదిస్తం గిదిస్త మనుకుంట బొంబై తమాస సూబెడ్తున్నా ఇక ముందుగాల గుడ్క జెనం గోస బదలాయించదు.’’ ‘‘బాగనే ఉన్నది గని ఇంతకు జెనమేమంటున్నరు?’’ ‘‘గిదొక జాత్ర. అందరితాన పైసల్ దీస్కుంటం. మేం జేసేది జేస్తం. తింటం. తాగుతం. ఇంట్ల పంటం. ఏ పార్టి లీడరొస్తె గా పార్టి కండ్వలు గప్పుకుంటం. ఇదువర దాంక ఏ లీడరేం బీకలేదు. ఇంక నాల్గు నెలలల్ల ఏం బీక్తరు. ఫ్లోరైడ్ నీల్లట్లనే ఉంటయి. తొవ్వలల్ల గుంతలట్లనే ఉంటయి’’ అని మునుగోడు జెనమంటున్నరు. ‘‘మునుగోడుల ఎవ్వలెట్ల ప్రచారం జేస్తున్నరు?’’ ‘‘రూపాయలు ఏర్ల లెక్క బారుతున్నయి. మా పార్టి చోటామోటా లీడర్లు, సర్పంచ్‌లు మమ్ములనే డిమాండ్ జేస్తున్నరు... అవుతల లచ్చల రూపాయిల ఆఫర్ ఉన్నదంటున్నరు. గిట్లయితె ఏం జెయ్యాలెరో అని ఒక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుండు.’’ ‘‘రాహుల్ గాంది బారత్ జోడో అసరు మునుగోడు మీద ఏమన్న ఉంటదా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాయిన జోడో అంటె గీల్లు తోడో అన్కుంట కొట్లాడ్తున్నరు. కాంగ్రెస్‌ల ఏ లీడర్ కా లీడర్ తీస్మార్ఖాన్ ననుకుంటడు. మునుగోడుల ప్రచారం జేసెతందుకు నా అసువంటి హోంగార్డుల అవుసరం లేదు. ఎస్పీలే పోతరు. గాయిన మీద నూరు కేసులు పెట్టినా వొచ్చే అసెంబ్లీ ఎలచ్చన్ల గెలిపిచ్చి కాంగ్రెస్‌ను హుకూమత్లకు దెస్తనని ఒక పెద్దమన్సి అన్నడు. గాయిననే మునుగోడుల కాంగ్రెస్‌ను గెలిపిస్తడని గా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బనాయించిండు.’’ ‘‘బీజేపీ, టీఆర్ఎస్ల సంగతేంది?’’ ‘‘బీజేపీ దిక్కుకెల్లి నిలబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రొండెక్రాలల్ల క్యాంప్ ఆపీస్ బెట్టిండు. దినాం మటన్, చికెన్ తోని వెయ్యిమంద్కి దావత్ ఇయ్యబట్టిండు. ప్రచారం జేస్కుంట అవ్వా నీ ఓటు నాకే ఎయ్యాలె అని గాయిన అన్నడు. తప్పకుంట చెయ్యి గుర్తుకే ఓటేస్త అని గామె అన్నది. చెయ్యి గాదు పువ్వు అన్కుంట రాజగోపాల్ రెడ్డి మొత్తుకుండు.’’ ‘‘బండి సంజయ్, కేటీఆర్‌ల సంగతేంది?’’ ‘‘ప్రగతి బవన్ల ఒక మంత్రగానితోని కేసీఆర్ పూజలు జేపిస్తున్నడు అని బండి సంజయ్ అన్నడు. పిచ్చి ముదురుతున్నది, కరుస్తడేమో అని కేటీఆర్ అన్నడు. కావలి కుక్క లెక్క ఉండుమని కుర్సిమీద గూసుండబెడ్తె కచరా కుక్కల్లెక్క, పిచ్చికుక్కల్లెక్క కర్సెతంద్కు ఊరిమీద బడ్డరు అని బండి సంజయ్ అన్నడు. పూజూల్గ గీ లీడర్లు మమ్ములను బద్నాం జేస్తున్నరనుకుంట పట్నంల కుక్కలన్ని రాస్తారోకో జేసినయి.’’ ‘‘చండూరు ర్యాలీ ఎట్లయింది?’’ ‘‘టీఆర్ఎస్ దిక్కుకెల్లి నిలబడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేసన్ ఏసినంక చండూరుల మీటింగ్ బెట్టిండ్రు. కేటీఆర్ పక్కపంటే మైకు బట్కోని, నామినేషన్ కొచ్చిన నందమూరి తారక రామారావు గారికి, తమ్మినేని సీతారాం గారికి అనుకుంట కూసుకుంట్ల మాట్లాడబట్టిండు. యాల పొద్దుగాలే మందుగొట్టినట్లున్నడు అని కేటీఆర్ గాయినను ఎన్కకు బొమ్మన్నడు. ఒక మంత్రి అయితె మన బీఎస్పి పార్టీ అనబట్టిండు. ఇంతకు టీఆర్ఎస్ లీడర్లు పగటీలనే మందు ఎందుగ్గొడ్తున్నరు. గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటె నీ మోటర్‌కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బీఆర్ఎస్ అంటే ఏంది?) ‘‘గీ సర్కార్ ముక్యమంత్రితోని నడుస్త లేదు. మంత్రుల తోని నడుస్త లేదు. ఎమ్మెల్యేలతోని నడుస్త లేదు. పోలీసోల్లతోని నడుస్త లేదు. మందుతోని నడుస్తున్నదని గాల్లు పగటీలనే మందుగొట్ట బట్టిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మునుగోడులో బెట్టింగ్‌ల జోరు.. ఆయనపైనే అత్యధికంగా..!
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థుల జయాపజయాలపై అప్పుడే బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ తరహాలో పందేలు కాస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నారు. రంగంలోకి దిగిన బెట్టింగ్ మాఫియా రూ.కోట్లలో లావాదేవీలు సాగిస్తున్నట్టు సమాచారం. నగదు వసూలు కోసం చౌటుప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించినట్లు తెలిసింది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతరత్రా ఆన్లైన్ మార్గాల్లో దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డిపై రూ.50 వేలు, కూసుకుంట్లపై రూ.30 వేలు, స్రవంతి గెలుపుపై రూ.20 వేల చొప్పున కాస్తున్నట్లు తెలిసింది. గెలుపు కోసం ఎన్ని వేలు బెట్టింగ్‌లో కట్టినా అంతకు రెట్టింపు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ మేరకు అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ మాఫియాను గుర్తించే పనిలో పడింది. రూ.16 కోట్లు పట్టివేత? మునుగోడు ఉప ఎన్నికల ఖర్చు కోసం తరలిస్తున్న రూ.16 కోట్ల నగదును పోలీసు అధికారులు పట్టుకున్నారని తెలిసింది. హైదరాబాద్ నుంచి ఓ ప్రధాన పార్టీకి చెందిన డబ్బు వాహనంలో మునుగోడు ప్రాంతానికి రవాణా అవుతుండగా మార్గంమధ్యలో పట్టుబడినట్లు తెలుస్తోంది. -
కేసీఆర్ టార్గెట్‌పై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. కంటి మీద కునుకులేదు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్న సీఎం కేసీఆర్ ఎలాగైనా గెలిచి తీరాలనే ఆలోచనలో ఉన్నారు. మునుగోడులో 51శాతం ఓట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు మునుగోడు సెగ్మెంట్‌ను 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఇన్చార్జ్ని నియమించారు. ఇందులో సీఎం కేసీఆర్‌తో సహా 16మంది మంత్రులు, 70మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఉన్నారు. వీరిని ఇన్చార్జ్గా నియమించిన వార్డు లేదా ఎంపీటీసీ పరిధిలోని ఓట్లలో 51శాతం సాధించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. ఓట్ల సాధనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుకు గీటురాయిగా నిర్దేశించారు. ఓటేయాలంటే అసలు మీకేం కావాలి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్‌చార్జ్‌లు తమకు కేటాయించిన స్థానాల్లో గ్రౌండ్ వర్క్‌ను మొదలు పెట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లాంటి వ్యక్తులు రానిచోట వారి మనుషులు వారం క్రితమే రంగంలోకి దిగారు. యూనిట్ పరిధిని, పరిధిలోని గ్రామాలను వార్డులుగా విభజించి ఇన్‌చార్జ్‌ల సొంత సైన్యం, స్థానిక టీఆర్ఎస్ లీడర్లతో సంయుక్తంగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఓటర్ల వివరాలను కులాల వారీగా, పార్టీల వారీగా వేరుచేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వానికి సానుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలను కూడా గుర్తించారు. ఎందుకు సానుకూలంగా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారన్న దానిపై కూడా ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకనా, ఇంకేదైనా కారణమా అన్నదానిపై కూడా లోతుగా వెళ్లారు. చివరకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే మీకేం కావాలి. ఆసరా పింఛనా, రేషన్ కార్డా, దళిత బంధా, డబుల్ బెడ్రూం ఇల్లా, జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సాయమా, ఏంటి.. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా అని నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైతే ఉప ఎన్నికలు ముగిశాక ఇప్పిస్తామని భరోసానిస్తున్నారు. ఇన్‌చార్‌్జలు స్థానిక లీడర్లతో గ్రామ సమస్యలను కూడా గుర్తించి ఏమేం అభివృద్ధి పనులు చేయాలి అనేది కూడా గుర్తించి ఎన్నికలయ్యాక నిధులొస్తాయని చెబుతున్నారు. సొంతంగా ఖర్చులు పోలింగ్ దగ్గరికి వచ్చే దాకా ఆయా గ్రామాల్లో ఇన్‌చార్జ్‌లే సొంతంగా ఖర్చులు భరించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఉన్నాయి. కేసీఆర్ చెప్పినట్టు ఓట్లను రాబట్టేందుకు అప్పుడే ఖర్చులు మొదలయ్యాయి. ఊరికో ఫంక్షన్ హాల్, అది లేనిచోట ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు, భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కో యూనిట్ పరిధిలో రోజుకు రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు ఖర్చవుతున్నాయి. మరోవైపు ఇతర పార్టీల్లోని వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇన్‌చార్జ్‌ల్లో టెన్షన్.. టెన్షన్ కేసీఆర్, కేటీఆర్ మినహా మిగతా ఇన్‌చార్జ్‌లంతా తమకు కేటాయించిన గ్రామాలకు వచ్చిపోతున్నారు. కొన్ని గ్రామాలు ఇంకా గాడిన పడలేదు. స్థానికంగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రూపులు, వ్యతిరేకతను చూసి మంత్రులే జంకుతున్నారు. కొంత మంది ఇన్‌చార్జ్‌లు పార్టీ గిట్లుంటే 51 శాతం ఎట్ల వస్తాయని మదనపడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ చెపిన ఓట్లే రాకపోతే ఎటొచ్చి ఏమైతదో, భవిష్యత్‌లో ఏం ఇబ్బందులు ఎదుర్కోవాలో, అత్యధిక ఓట్లను ఏట్లా సాధించాలోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో పట్టున్న లీడర్ల వద్ద ‘ఎక్కువ ఓట్లు రాకపోతే మాకు ఎమ్మెల్యే టికెట్లు రావు’ ఏం చేయాలో చెప్పండని వేడుకుంటున్నారు. -
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీదే విజయం : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
రాజగోపాల్ అహంకారానికి, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య పోటీ: కేటీఆర్
సాక్షి, నల్లగొండ: ‘మునుగోడును నేనే దత్తత తీసుకుంటా.. అభివృద్ధి చేస్తా.. ఎన్నికల ముందో మాట, తర్వాతో మాట కాదు. నేను చెప్పే ప్రతి మాటకు కట్టుబడి ఉంటా.. మూడు నెలలకోసారి వస్తా.. స్వయంగా అభివృద్ధి పనులను పరిశీలిస్తా. నా మీద నమ్మకం ఉంచండి...’అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, తాను కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించారు. కారు గుర్తుకు ఓటు వేయండి ‘మునుగోడు అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటా. నాపై విశ్వాసం ఉంచి కారు గుర్తుకు ఓటువేసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి. కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డి డబ్బు మదానికి, అహంకారానికి.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోటీ ఇది. మోదీ ఇచ్చిన డబ్బుతో మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొనేయాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ సమస్యను పోగొట్టింది కేసీఆరే. మునుగోడులో 1.13 లక్షల మందికి రైతుబంధు అందిస్తున్నాం. యాదవులకు 5,765 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి. వారి అకౌంట్లలో డబ్బులు కూడా జమయ్యాయి. అయితే ఉప ఎన్నిక వచ్చినందున డబ్బులు ఫ్రీజింగ్ (స్తంభన)లో ఉన్నాయి. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. ఎన్నికల తర్వాత అధికారులే యూనిట్లను అందిస్తారు..’అని కేటీఆర్ చెప్పారు. నామినేషన్ దాఖలు చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిన మోదీ ‘చేనేత వస్త్రాలపై మోదీ 5 శాతం జీఎస్టీ వేశారు. ఆయనకు ఓటు వేస్తారో లేక చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు, నేతన్న బీమా, చేనేత మిత్ర అమలు చేస్తున్న, 40 శాతం సబ్సిడీ అందిస్తున్న కేసీఆర్‌కు ఓటేస్తారో ఆలోచించాలి. మోదీ హిందువునని చెప్పుకుంటున్నారు. తిరుపతికి దీటుగా యాదాద్రి దేవాలయాన్ని కట్టిన కేసీఆర్ కంటే పెద్ద హిందువా? యాదాద్రి దేవాలయానికి రూ.100 కోట్లు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో గిరిజనులను పట్టించుకున్నదీ కేసీఆరే. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. దాంతో రాష్ట్రంలో 21 వేల మంది గిరిజనులు ప్రజా ప్రతినిధులు కాగలిగారు. మునుగోడు నియోజకవర్గం దండుమల్కాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం. దాంతో 16 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి..’అని మంత్రి తెలిపారు. రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు కొన్నారు: మంత్రి జగదీశ్‌రెడ్డి తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను చూసి మోదీ ప్రభుత్వం ఈర్ష్య పడుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు కొన్నారో, ఉప ఎన్నికలు ఎందుకు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రభాకర్‌రెడ్డి గెలిచేలా కమ్యూనిస్టులుగా తామంతా అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అంశలస్వామికి అండగా ఉంటా: కేటీఆర్ మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని శివన్నగూడకు చెందిన ఫ్లోరైడ్ బాధితుడు అంశలస్వామికి అండగా ఉంటానని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం చండూరు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అంశలస్వామి ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. స్వామితో కలిసి భోజనం చేశారు. -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్
సాక్షి, నల్గొండ: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. చదవండి: మునుగోడు వార్: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్ రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్లకు అమ్ముడుపోవడం వల్లే ఉప ఎన్నిక అని, అమ్ముడుపోయిన వారికి బుద్ధి చెప్పాలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. అమ్ముడుపోయే వాళ్లను డెకాయిట్స్, 420 గాళ్లు అంటారు. కరోనా కంటే విషమైంది బీజేపీ, మతోన్మాద శక్తులను ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ శ్రేయస్సుకోసం మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. -
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
‘కారు’లోకి కీలక నేత.. మునుగోడులో టీఆర్ఎస్కు కలిసొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వర్రావు మంగళవారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు సమక్షంలో వేనేపల్లికి కేటీఆర్ పార్టీ కండువా కప్పారు. మునుగోడులో కీలక నేత వెంకటేశ్వర్రావు తొలుత టీడీపీలో, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి క్రియాశీలకంగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. 2018లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా బహిరంగ సభ పెట్టడంతో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన వేనేపల్లి ఆగస్టులో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాజాగా అధికారికంగా తిరిగి టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ బలవంతంతోనే.. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బలవంతంగా బీజేపీలోకి తీసుకు వెళ్లారని, అక్కడికి వెళ్లాక మనోవేదనకు గురై తిరిగి సొంతగూటికి చేరుకున్నట్లు చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తాను ఏ పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. -
టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి : కూసుకుంట్ల
-
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఆయనకు పార్టీ బీ ఫామ్‌ను అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల విలువైన చెక్కును కూడా ఇచ్చారు. కాగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూసుకుంట్ల కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, మునుగోడులో టీఆర్ఎస్దే విజయమని చెప్పారు. నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే.. కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనను ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్లో సీఎం నుంచి బీ ఫామ్ అందుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే అని జోస్యం చెప్పారు. 'కేసీఆర్ నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. నాలుగు సార్లు నాకు బీ ఫామ్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉన్నా. తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి వమ్ము చేశాడు. బీజేపీ ప్రతిపక్ష పార్టీ కదా.. ఎలా అభివృద్ధి చేస్తుందో రాజగోపాల్ చెప్పాలి. ఇప్పటివరకు అభివృద్ధి కోసం ఆ పార్టీ ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు. తన కాంట్రాక్టుల కోసం రూ.22వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మిస్తున్నాడు. కర్రుకాల్చి వాత పెట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ మునుగోడులో మూడో స్థానానికే పరిమితం అవుతుంది. జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ఆ పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఒక్క ఓటుకు బీజేపీ రూ.30 వేలు పంచుతామని చెప్తోంది. నాయకుడు కాదు గెలిచేది, మునుగోడు ప్రజలే' అని పేర్కొన్నారు. -
కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ను ప్రగతి భవన్లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారమే నోటిఫికేషన్ విడుదలైంది. పోలింగ్ నవంబర్ 3న ఉండనుంది. ఫలితాలు 6న ప్రకటిస్తారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. చదవండి: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల -
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
-
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలిచారు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. చదవండి: మునుగోడు బరిలో గద్దర్.. ఆ పార్టీ నుంచే పోటీ! -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూల్ వెలువడేలోగా పార్టీపరంగా మునుగోడు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాలన్నింటిలోనూ కూసుకుంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయనే పార్టీ అభ్యర్థి అనే సంకేతాలను కేడర్‌కు కేసీఆర్ పంపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సైతం పాల్గొనడం గమనార్హం. మునుగోడు నియోజకవర్గంలో గ్రామాలవారీగా జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల నివేదికలను విశ్లేషిస్తూ రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతోపాటు ఇటీవల ప్రకటించిన గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆత్మీయ వన భోజనాల ద్వారా మండలాలవారీగా నియమితులైన పార్టీ ఇన్చార్జీలు కేడర్‌కు దగ్గర కావాలని సూచించారు. చేరికల ద్వారా పార్టీ బలోపేతం కావాలని, పాత, కొత్త కేడర్‌ను సమన్వయం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
Munugode Politics: టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే!.. అన్ని పార్టీల కంటే ముందే
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ దూకుడు పెంచింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. రేపు (శనివారం) జరగనున్న మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం.. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు కలుపుకొని 200 మందికి పైగా నాయకులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌తో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (ఫైల్ ఫొటో) మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఎలా ఇబ్బంది పెట్టారు.. ఆర్థికంగా ఎలా దెబ్బకొట్టారు.. అనే విషయాలను ఒక్కొక్కరుగా మాట్లాడారు. మంచి బట్టలు తొడిగినా ఓర్వలేదని, గ్రామాల్లో గ్రూపులు కట్టి విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అందరూ కలసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని, ఇస్తే పనిచేయొద్దని, ఆయనకు తప్ప ఎవరికిచ్చినా సరే అని తీర్మానం చేసి సంతకాలు చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని పార్టీ అధిష్టానానికి అందజేయనున్నట్టు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అయితే టీఆర్ఎస్ పెద్దలు అసమ్మతి నాయకులను పిలిపించుకుని మాట్లాడి వారిని శాంతింపజేసినట్టు తెలిసింది. అందరినీ ఏకతాటిపైకి వచ్చేలా చేసిన తర్వాతే ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ఫైనల్ చేసినట్టుగా సమాచారం. చదవండి: (మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?) -
Munugode- TRS Party: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు.. ఆయనకు టికెట్టా!
సాక్షి, నల్గొండ: మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతి చల్లారడం లేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి బుజ్జగించినా అసమ్మతి సద్దుమణగడం లేదు. మంత్రికి చెప్పుకున్నా ఫలితం లేదని అసంతృప్తితో ఉన్న నేతలు మరోసారి దైవకార్యం పేరిట చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం సమావేశమయ్యారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు కలుపుకొని 200 మందికి పైగా నాయకులు సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఎలా ఇబ్బంది పెట్టారు.. ఆర్థికంగా ఎలా దెబ్బకొట్టారు.. అనే విషయాలను ఒక్కొక్కరుగా మాట్లాడారు. మంచి బట్టలు తొడిగినా ఓర్వలేదని, గ్రామాల్లో గ్రూపులు కట్టి విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అందరూ కలసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని, ఇస్తే పనిచేయొద్దని, ఆయనకు తప్ప ఎవరికిచ్చినా సరే అని తీర్మానం చేసి సంతకాలు చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని పార్టీ అధిష్టానానికి అందజేయనున్నట్టు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. చదవండి: (మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్) -
కేసీఆర్‌కే షాకిచ్చారు.. మునుగోడులో టీఆర్ఎస్కు ఓటమి తప్పదా..?
Munugode Assembly constituency.. సాక్షి, మునుగోడు: గత కొద్దికాలంగా ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసి రావడంలేదు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలే ఇందకు నిదర్శనం. ఇక, తాజాగా మునుగోడులో కూడా అధికార పార్టీకి మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చేలా ఉంది. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతల్లో వ్యతిరేక తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసమ్మతి నేతలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, రెండు రోజుల క్రితం.. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను మంత్రి జగదీష్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడిన విషయం తెలిసిందే. వీరంతా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా సీఎంకు కూడా హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామని ప్రగతిభవన్ వేదికగా నేతలు ప్రకటించారు. కానీ, ఆ ప్రకటనను తుంగలో తొక్కుతూ కేసీఆర్‌కే షాకిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, శుక్రవారం అనూహ్యంగా అసమ్మతి నేతలంతా చౌటుప్పల్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, అసమ్మతి నేతలంతా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్లకు టికెట్ ఇస్తే.. పార్టీ ఓడిపోతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే ప్రస్తకే లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో, అధికార పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇక, అంతకు ముందే.. టీఆర్ఎస్ అసమ్మతి నేతలు.. కూసుకుంట్లకు టిక్కెట్ ఇవ్వొదని 12 మంది కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్‌కు లేఖలు రాశారు. ఇది కూడా చదవండి: మునుగోడు ఉప ఎన్నికపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
ఆయనకు ధన బలం.. నాకు జన బలం :కూసుకుంట్ల
సాక్షి, చండూరు : మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థికి ధన బలం .. తనకు జన బలం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం చండూరులో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ధన బలమా..జన బలం గెలుపొందుతుందా అని సవాల్ విసిరారు. ధనం చూసి విర్రవీగడం జనం గమనిస్తూనే ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యంగా తయారవుతుందన్నారు. తనను ఇదొక్కసారి గెలిపించండి పెండింగ్ ప్రాజెక్టులు, పనులను పూర్తి చేయిస్తానన్నారు. 60 ఏళ్లుగా అభివృద్ధి చేయని కాంగ్రెస్ నాయకులు ఎన్నికలలో మేం అభివృద్ధి చేస్తామని రావడం సిగ్గుచేటన్నారు. సాగు నీరు అందించే వరకు తాను నిద్రపోనన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో చేసిన అబివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అన్నారు. ఎమ్మెల్యేగా తాను రోజు 12 గంటలు నియోజకవర్గంలోనే ఉన్నానన్నారు. ఇంటికి వెళ్లకుండా పండుగలు సైతం మీ దగ్గరే చేసుకున్న విషయం మరువ కూడదన్నారు. నియోజక వర్గం నా సొంత ఇళ్లుగా భావించిన మాట వాస్తవం కాదా అన్నారు. ఆపదలో ఉన్న వారికి తనను కలిసేందుకు అరగంట చాలని..ఇదే కాంగ్రెస్ అభ్యర్థిని కలిసేందుకు ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసన్నారు. కార్యక్రమంలో జెల్ల మార్కండేయులు, మునగాల నారాయణ రావు, నల్లగంటి మల్లేశం, పెద్దగాని వెంకన్న, కోడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
సాగు జలాలిచ్చి సస్యశ్యామలం చేస్తా : కూసుకుంట్ల
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : లక్ష్మ ణాపురం, చర్లగూడెం ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి మంగళవారం గుడిమల్కాపురం, అల్లందేవిచెర్వు, కోతులాపురం, సర్వేల్, చిమిర్యాల, మహ్మదాబాద్, సంస్థాన్ నారాయణపురం, లచ్చమాగూడెం, చిల్లాపురం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచకొండ ఎత్తిపోతల పథకంతో మండలంలోని ప్రతి చెరువు నింపి సాగు జలాలు అందిస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాన్నారు. కారు గుర్తుకు ఓటు వేయమని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, కూసుకుంట్ల సత్తిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, చండూర్ మార్కెట్ చైర్మన్ జగ్రీరాంనాయక్, పాశం ఉపేందర్‌రెడ్డి, శాగ జైపాల్‌రెడ్డి, ఆంధోజు శంకరాచారి, శాగ పద్మ, సుర్వి యాదయ్య, గడ్డం నరేష్, స్వామి, పెంటయ్య, బాలు, శంకర్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తాలు... -
కేసీఆర్ సభతో పార్టీ శ్రేణుల్లో జోష్
సాక్షి, చండూరు/మునుగోడు: నియోజకవర్గంలోని చం డూరులో కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఎన్నికలో మరో పది రోజుల్లో ఉండడంతో సభ నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండడం పార్టీ నేతల్లో మరింత ధైర్యం నెలకొంది. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సాగిన ఆయన ప్రసంగంతో మహిళలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భారీగా తరలి వచ్చిన జనం: నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్ర జా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలి వ చ్చారు. సభా ప్రాంగణం జనంతో నిం?పోయింది. గ ట్టుప్పల మండలం ప్రకటిస్తామని హామీ ఇవ్వడం, లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ తమ జాతకం మారబోతుందని పేర్కొంటున్నారు. మరిన్ని వార్తాలు... -
హామీల వర్షం!
సాక్షి, చండూరు, మునుగోడు: దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం చండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నలో డిండి ఎత్తిపొతల పథకాన్ని పూర్తి చేయించి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికీ కృష్ణాజలాలు అందిస్తున్నామన్నారు. త్వరలోనే మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతాం : మునుగోడును అభివృద్ధి చేస్తాం ఏడాదిన్నరలో డిండి ఎత్తిపోతలను పూర్తిచేసి సాగునీరందిస్తాం కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించండి చండూరు ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గట్టుప్పలను మండలంగా ఏర్పాటు చేస్తా: కొంతకాలంగా ప్రజలు కోరుకుంటున్న గట్టుప్పల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే మండలాన్ని ఏర్పాటు చేసి తానే వచ్చి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చౌటుప్పల్‌లో పేదలకు మెరుగైయిన విద్యను అందించేందుకు డిగ్రీ కళాశాలని మంజూరు చేయిస్తామన్నారు. కూసుకుంట్ల గెలుపు ఖాయం: అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమన్నారు. సభకు హాజరైన ప్రజలను చూస్తే తాను మాట్లాడకపోయినా ఓట్లు వేస్తారనే నమ్మకం కలుగుతోందన్నారు. ప్రభాకర్‌రెడ్డి ఎంతో మంచి వ్యక్తి అని ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి కోసం పట్టుబట్టే వ్యక్తి ప్రభాకర్‌రెడ్డి అని ఆయన కోరిక మేరకే చౌటుప్పల్‌ను డివిజన్ కేంద్రం చేశామన్నారు. ఆయనని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయన కోరిన అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగినా ఈ సభలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, గొల్ల, కుర్మల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకులు జెల్లా మార్కొండయ్య, మునుగోడు పరిశీలకుడు కిషన్‌రావు, మునగాల నారయణరావు, బొల్ల శివశంకర్, ఐతగొని లాల్‌బహదూర్‌గౌడ్, డోకూరి శ్రీనివాస్‌రెడ్డి, మేడి నాగలక్ష్మి, పెద్దగాని వెంకన్న, తిరందాసు అనిత తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి : కూసుకుంట్ల మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వద్ద డబ్బులు తీసుకుని కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం చండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రూ. కోట్లు ఖర్చు చేసి ఓట్లు కొనేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూడేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఎమ్మెల్యే పదవికి రావడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఆయా నియోజకవర్గాలకు చేసిన అభివృద్ధి శున్యమన్నారు. ఇదే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అరగంటలో కలిసేందుకు అవకాశం ఉంటుంది..కాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసేందుకు ఆరు నెలలు పడుతుందన్నారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది మీరే నిర్ణయించుకోవాలని కోరారు. గతంలో తనకు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే రోజు 24గంటల్లో 16 గంటలు మీమధ్యనే ఉన్నానన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పల్లెలన్నీ సస్యశ్యామలంగా మారాయన్నారు. నియోజకవర్గంలో చౌటుప్పల్ నుంచి నల్లగొండ, మాల్ నుంచి కనగల్, మర్రిగూడ మండలాల్లో డబుల్ రోడ్లు వేయించామన్నారు. మరో సారి కేసీఆర్‌ను సీఎంగా చేస్తే మునుగోడు ప్రాంతం కోనసీమగా మారుతుందన్నారు. ఒక్కసారి అవకాశమిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయిస్తాన్నారు. గొల్ల,కురుమల సంఘం రాష్ట అధ్యక్షుడు క్యామ మల్లేశం మాట్లాడుతూ ఓట్లను కొనేందుకు మహా కూటమీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుగుతున్నాడన్నారు. సభలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జెల్ల మార్కండేయులు, మునుగోడు పరిశీలకులు కిషన్‌రావు, మునగాల నారాయణరావు, బోళ్ల శివశంకర్, మేడి నాగలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కేసీఆర్ సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం లక్ష మెజార్టీతో గెలిపిస్తే సునీతకు పదోన్నతి ఆలేరు : ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అపద్ధర్మ ముఖ్య మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గానికి గంధమళ్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేసి సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు నీటిని అందించి వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు.అలాగే పార్టీ అభ్యర్థి గొంగిడి సునీత మేరకు కొండపోచమ్మ ద్వారా బొమ్మలరామారం, శామీర్‌పేటలకు నీటిని అందిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. జనగాం జిల్లాలో కలపడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన మూడు నెలల్లో గుండాలను యాదాద్రి జిల్లాలో కలుపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకే పని చేస్తామని మాకు ఢిల్లీలో, విజయవాడలో హైకమాండ్లు ఉండవన్నారు. ఆలేరు ప్రజలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత అధ్యక్షతన జరిగిన ఈ సభలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మైనింగ్కార్పొరేషన్ చైర్మన్ సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్టాచైర్మన్ మోతేపిచ్చిరెడ్డి, మార్కెట్ చైర్మన్ పడాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు బొట్ల పరమేశ్వర్, కాసగళ్ల అనసూయ, స్వప్న, అండెం సంజీవరెడ్డి, తుం గ బాలు, సుమలత, ఆకవరం మోహన్‌రావు, మొరిగాడి వెంకటేశ్, బెంజారం రవి, కొరకొప్పుల కిష్టయ్య, కోటగిరి అంజనేయులు, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, చింతకింది మురళి, బింగి రవి, ఆడెపు బాలస్వామి, కర్రె అశోక్, పిక్క శ్రీను, కాంబోజు భాగ్యశ్రీ, రవీందర్, బీజని మధు, జల్లి నర్సింహులు, పాశికంటి శ్రీను, ఏసీరెడ్డి మహేందర్‌రెడ్డి, సరాబ్ సంతోష్, మధార్, రియాజ్, దూడం మధు, మొగులుగాని మల్లేశం, బక్క రాంప్రసాద్, రచ్చ కాద్యశ్రీ, రచ్చ రాంనర్సయ్య, పేరపు సిద్దులు, వెంకటేశ్, గంగుల శ్రీను, దొంతిరి సోమిరెడ్డి, సోమిరెడ్డి, పాల్గొన్నారు. సునీతమ్మ నా బిడ్డ.. గెలిపిస్తే హోదా పెంచుతా... యాదగిరిగుట్ట(ఆలేరు) : సునీతమ్మ నా బిడ్డ...ఎమ్మెల్యే.. గిమ్మెల్యే తర్వాత... 2001లో ఒంటరిగా నేను ఉద్యమం మొదలు పెట్టిననాడు చిన్న పిల్లలా ఎంబట ఉద్యమంలో పాల్గొన్నది.. మీరు దయ తలిస్తే ఎంపీపీగా పనిచేసింది.. అనేక హోదాల్లో పని చేసి .. ఏ ఒక్క రోజు కూడా గెలిచిన.. ఓడిన.. ఉద్యమ బాట వీడలేదు.. చివరి వరకు కేసీఆర్ వెంట ఉండి పోరాటం చేసింది కాబట్టే.. కేసీఆర్ విజయం సాధించగలిగాడు.. ఆ విషయం మీకు తెలుసని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆలేరు పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడారు.ఈ సారి గెలిపిసే ఆర్డీనరి ఎమ్మెల్యేగా ఉండదు.. కచ్చితంగా హోదా పెరుగుతుంది.. నా బిడ్డ అని చెబుతున్నా.. నా బిడ్డ సునీతమ్మను లక్ష మెజా ర్టీతో గెలిపించాలన్నారు. సునీత నా బిడ్డ కాబట్టి అడిగింది చేయకపోతే ఊరుకోదు.. నాతో పం చాయితీ పెట్టుకుంటుంది..అలుగుతది.. తప్పకుం డా సాధించుకునే శక్తి సునీతకు ఉందన్నారు. నా బిడ్డ కాబట్టి అడిగినవ్వన్ని చేసి పెడతా అన్నారు. గత పాలకులు ఆలేరును పట్టించుకోలేదు :∙గొంగిడి ఆలేరు : గత పాలకులు ఆలేరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, టీఆర్ఎస్ హయాంలోనే అన్నిరంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మా జీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఆలేరులో మంగళవారం జరిగిన సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజాఆశీర్వాదసభలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం ఏండ్ల తరబడి సాగునీటికి నోచుకోక ఎడారిగా మారిందన్నారు. గందమళ్ల, బస్వాపూ ర్ ప్రాజెక్టుల ద్వారా రాజపేట, గుండాల, ఆలేరు, గుట్ట ప్రాంతాలకు నీటిని అం దించాలన్నారు. అలాగే కొండపోచమ్మ ద్వారా బొమ్మలరామారం, తుర్కపల్లికి కూ డా నీటిని అందించే అవకాశం ఉందని ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కేసీ ఆర్కు విజ్ఞప్తి చేశారు. అలాగే గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని కోరారు. దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందిన కొలనుపాకలో ని జైనదేవాలయం, సోమేశ్వరాలయంలు ఉన్నాయని, వీటిని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గంలో మరో 3 ఐటీ కళాశాలలు, యాదగిరిగుట్టలో డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని కేసీఆర్‌కు విన్నవించారు. మరిన్ని వార్తాలు... -
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో లీడర్
-
చేనేతకు అండగా ప్రభుత్వం
సంస్థాన్ నారాయణపురం(మునుగోడు) : చేనేత రంగానికి ప్రభుత్వం అండగా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పుట్టపాకలో శ్రీభావనాబుుషి మిశ్రమ చేనేత సహకార సంఘంలో సబ్సిడీపై నూలును, పాస్ పుస్తకాలను గురవారం కార్మికలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేనేతపై ప్రత్యేక దృష్టి పెట్టిందిన్నారు. స్టాండ్ మగ్గములు ఇప్పించాలని ఎమ్మెల్యేకు కార్మికులు విన్నవించారు. కార్యక్రమంలో పద్మశ్రీ ఆవార్డు గ్రహీత గజం గోవర్ధన్, జెడ్పీటీసీ సభ్యుడు బోల్ల శివశంకర్, వీవర్ సర్వీస్ సెంటర్ ఏడీ హిమేజ్‌కుమార్, సర్పంచ్ నల్లగొండ కళమ్మ, వర్కాల చంద్రశేఖర్, సంఘం ఆధ్యక్షురాలు సామల విజయలక్ష్మీభాస్కర్, గజం సత్యనారాయణ, కత్తుల లక్ష్మయ్య, మిర్యాల శ్రీను, గురునాధం, పరదేశి, రమేష్, ఉమాశంకర్, సాంబయ్య, తదితరలున్నారు. -
చెర్లగూడెం ఎడమ కాల్వ కోసం పరిశీలన
సంస్థాన్ నారాయణపురం :చెర్లగూడెం ఎడమ కాల్వ కోసం మండల పరిధిలోని జనగాం, చిల్లాపురం, నారాయణపురం, రాచకొండ గ్రామాల్లో చెరువులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రిటైర్డ్ ఇంజనీరింగ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇతర సభ్యులు, అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. మర్రిగూడ మండలం చెర్లగూడెం రిజర్వాయర్ నుంచి సంస్థాన్ నారాయణపురానికి వచ్చే ఎడమ కాల్వ ఏయే గ్రామాల నుంచి వెళ్తుంది, ఏయే చెరువులను ఏ విధంగా నింపవచ్చో వంటి అంశాలను మ్యాపుల ద్వారా పరిశీలించారు. చెర్లగూడెం సముద్రమట్టానికి 385 మీటర్ల ఎత్తులో ఉండడంతో, మండలంలోని చిల్లాపురంలోని పెద్దచెరువు 415మీటర్లు, మొల్కచెరువు 420మీటర్లు, మేళ్ల చెరువు 430మీటర్ల ఎత్తు ఉండడంతో చెరువులకు నీళ్లు ఏ విధంగా నింపాలని, ఎక్కడి నుంచి నింపాలని పరిశీలించారు. చెర్లగూడెం ఎడమకాల్వ11కి.మీ.ల వద్ద వాచ్యతండా వద్ద 70మీటర్ల ఎత్తుతో లిఫ్టింగ్ చేసి, జనగాం పరిధిలోని మొలక చెరువును నింపి, అక్కడి నుంచి చిల్లాపురం పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు సంస్థాన్ నారాయణపురం పరిధిలో ఉన్న మేళ్ల చెరువుకు నీళ్లందించవచ్చని గుర్తించారు. మొలక చెరువు నుంచి మేళ్ల చెరువుకు నీళ్లు అందించడానికి ఏదైనా ఆటంకం ఏర్పడితే నైజా కాలం నాటి రాచకాలువను కూడా పరిశీలించారు. మొలక చెరువు, పెద్ద చెరువు, మేళ్ల చెరువు, నీళ్లకొండ చెరువులను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఒక ప్రతిపాదన తయారు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కోరారు. మొలక చెరువులో ఒక టీఎంసీ నీళ్ల కెపాసిటీతో పాటు మేళ్లచెరువు, ఇతర చెరువులు కూడా నింపాలని గుర్తించారు. రైతులతో కూడా మాట్లాడి, వారి అభిప్రాయాలను సేకరించారు. అఖిలపక్ష నాయకులతో కూడా చర్చిం చారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా చెరువులు నింపే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. వారి వెంట రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులు ఇంద్రసేనారెడ్డి, రమణానాయక్, మెంగ లక్ష్మణ్, ఐబీ డీఈ సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ప్రజాప్రతినిధులు పాశం హాలియా, కరంటోతు విజయలక్ష్మి, మేఘావత్ పద్మ, ఆత్కూరి రాములు, దుబ్బాక భాస్కర్, బచ్చనగోని దేవేందర్, ఏర్పుల అంజమ్మ, కత్తుల లక్ష్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీధర్‌రెడ్డి, పాశం ఉపేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నలపరాజు రమేష్, జక్కిలి అయిలయ్య, వీరారెడ్డి, కె.లింగయ్య, జి.శ్రీనివాసాచారి, గాలయ్య, యాదయ్య తదితరులున్నారు. -
మునుగోడు ఎమ్మెల్యేకు అస్వస్థత
చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించారు. -
కమలమ్మకు శ్రద్ధాంజలి
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. దశదినకర్మ సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో ఆదివారం జరిగిం ది. కమలమ్మ ఈ నెల 5వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్.. మంత్రులు ఈటెల రాజేందర్, గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలతో కలిసి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన లింగవారిగూడానికి వచ్చారు. కమలమ్మ సమాధి వద్ద చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకుముందు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కలెక్టర్ టి.చిరంజీవులు, ఐజీలు శశిధర్‌రెడ్డి, గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా,ఆర్డీఓ వెంకటాచారి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, మన్నె గోవర్దన్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు హాజరై నివాళులర్పించారు. 35నిమిషాల పాటు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన 1.40గంటలకు లింగవారిగూడానికి వచ్చారు. దాదాపు 35నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు. మధ్యాహ్నం 2.15గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. గుడిమల్కాపురం గ్రామంలో స్థానికులను చూసి ఆగారు. దాదాపు 20నిమిషాల పాటు గ్రామస్తులతో మాట్లాడి వెళ్లారు.