
ర్యాలీలో పాల్గొన్న ప్రజలు
సాక్షి, చండూరు : మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థికి ధన బలం .. తనకు జన బలం ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం చండూరులో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ధన బలమా..జన బలం గెలుపొందుతుందా అని సవాల్ విసిరారు. ధనం చూసి విర్రవీగడం జనం గమనిస్తూనే ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యంగా తయారవుతుందన్నారు. తనను ఇదొక్కసారి గెలిపించండి పెండింగ్ ప్రాజెక్టులు, పనులను పూర్తి చేయిస్తానన్నారు. 60 ఏళ్లుగా అభివృద్ధి చేయని కాంగ్రెస్ నాయకులు ఎన్నికలలో మేం అభివృద్ధి చేస్తామని రావడం సిగ్గుచేటన్నారు. సాగు నీరు అందించే వరకు తాను నిద్రపోనన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో చేసిన అబివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అన్నారు. ఎమ్మెల్యేగా తాను రోజు 12 గంటలు నియోజకవర్గంలోనే ఉన్నానన్నారు. ఇంటికి వెళ్లకుండా పండుగలు సైతం మీ దగ్గరే చేసుకున్న విషయం మరువ కూడదన్నారు. నియోజక వర్గం నా సొంత ఇళ్లుగా భావించిన మాట వాస్తవం కాదా అన్నారు. ఆపదలో ఉన్న వారికి తనను కలిసేందుకు అరగంట చాలని..ఇదే కాంగ్రెస్ అభ్యర్థిని కలిసేందుకు ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసన్నారు. కార్యక్రమంలో జెల్ల మార్కండేయులు, మునగాల నారాయణ రావు, నల్లగంటి మల్లేశం, పెద్దగాని వెంకన్న, కోడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment