
గుడిమల్కాపురంలో మాట్లాడుతున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : లక్ష్మ ణాపురం, చర్లగూడెం ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి మంగళవారం గుడిమల్కాపురం, అల్లందేవిచెర్వు, కోతులాపురం, సర్వేల్, చిమిర్యాల, మహ్మదాబాద్, సంస్థాన్ నారాయణపురం, లచ్చమాగూడెం, చిల్లాపురం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచకొండ ఎత్తిపోతల పథకంతో మండలంలోని ప్రతి చెరువు నింపి సాగు జలాలు అందిస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాన్నారు. కారు గుర్తుకు ఓటు వేయమని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, కూసుకుంట్ల సత్తిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, చండూర్ మార్కెట్ చైర్మన్ జగ్రీరాంనాయక్, పాశం ఉపేందర్‌రెడ్డి, శాగ జైపాల్‌రెడ్డి, ఆంధోజు శంకరాచారి, శాగ పద్మ, సుర్వి యాదయ్య, గడ్డం నరేష్, స్వామి, పెంటయ్య, బాలు, శంకర్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment