samstan narayanapuram
-
కేసీఆర్‌కు 300 ఎకరాలు ఎందుకు?
సంస్థాన్‌నారాయణపురం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 300 ఎకరాల భూమి ఉంది, పేదలకు మాత్రం ఎకరం భూమి లేదు, సరైన ఇళ్లు లేవు’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో గురువారం బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాజగో పాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి భూమి దున్నగలరా, విత్తనాలు వేయగలరా, కలుపు తీయగలరా? వారికి వందల ఎకరాల భూమి ఎందుకు’అని ప్రశ్నించారు. గిరిజనులు చదును చేసి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటున్నారని, పట్టాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బహుజన రాజ్యం వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమితో పాటు పట్టాలు ఇస్తామని ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగాలు ఇవ్వడం లేదని, నాయకులు మాత్రం విదేశాల్లో కూడా వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల సమయంలో పేదలకు డబ్బు, మద్యం పంచి ఎన్నికల అనంతరం అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
ప్రజలసొమ్ముతో టీఆర్ఎస్ నేతల దావత్‌లు
సంస్థాన్ నారాయణపురం: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంపాదించిన సొమ్ముతోనే మనకు దావతులు ఇస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దావతులు, డబ్బు, చీరలు పంచడం తప్ప టీఆర్ఎస్కు అభివృద్ధి చేతకాదని విమర్శించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
సాగు జలాలిచ్చి సస్యశ్యామలం చేస్తా : కూసుకుంట్ల
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : లక్ష్మ ణాపురం, చర్లగూడెం ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి మంగళవారం గుడిమల్కాపురం, అల్లందేవిచెర్వు, కోతులాపురం, సర్వేల్, చిమిర్యాల, మహ్మదాబాద్, సంస్థాన్ నారాయణపురం, లచ్చమాగూడెం, చిల్లాపురం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచకొండ ఎత్తిపోతల పథకంతో మండలంలోని ప్రతి చెరువు నింపి సాగు జలాలు అందిస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాన్నారు. కారు గుర్తుకు ఓటు వేయమని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, కూసుకుంట్ల సత్తిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, చండూర్ మార్కెట్ చైర్మన్ జగ్రీరాంనాయక్, పాశం ఉపేందర్‌రెడ్డి, శాగ జైపాల్‌రెడ్డి, ఆంధోజు శంకరాచారి, శాగ పద్మ, సుర్వి యాదయ్య, గడ్డం నరేష్, స్వామి, పెంటయ్య, బాలు, శంకర్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తాలు... -
జిల్లా జట్ల ఎంపిక
సంస్థాన్ నారాయణపురం: అండర్ – 19 హ్యాండ్‌బాల్, యోగా బాలుర, బాలికల జిల్లా జట్లను సోమవారం సర్వేల్ గురుకుల కళాశాలలో అధికారులు ఎంపిక చేశారు. విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడలను ప్రిన్సిపాల్ వి. రాఘవరావు ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ సీతారాములు, పీడీలు సాంబశివరావు, రహమత్, శారదలు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు – హ్యాండ్‌బాల్ బాలుర విభాగంలో డి.నిఖిల్, గణేష్, వెంకట్, అరుణ్, గోపాల్, ఈశ్వర్, ఉదయ్, నిఖిల్, కృష్ణ, జాషువా, రాము, ప్రవీణ్, సూర్య, శ్రీనాథ్, శివ, రామాంజనేయులను ఎంపిక చేయగా, స్టాండ్‌బైగా సందీప్‌ను ఎంపికచేశారు. అదే విధంగా బాలికల విభాగంలో విజయభాను, కళ్యాణి, మహేశ్వరి, వందన, నాగజ్యోతి, సంధ్య, శ్రీవాణీలను ఎంపిక చేశారు. – యోగా బాలుర విభాగంలో వై.అజయ్, నవీన్, మోజస్, మహేష్, నిఖిల్, మణికంఠ, గణేష్‌లను ఎంపిక చేయగా, బాలికల విభాగంలో అనిత, సంధ్యలను ఎంపిక చేశారు. -
రాచకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలి
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు, దేవరకొండ, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కలుపుతూ రాచకొండ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ ఆ«ధ్వర్యంలో బుధవారం సంస్థాన్ నారాయణపురంలో రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో ఉన్న నారాయణపురం మండలాన్ని రాజకీయ పార్టీల స్వార్థం కోసం యాదాద్రిలో కలపాలని చూడడం సరైంది కాదన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో కూడా తీర్మానం చేశామన్నారు. ఎంతో చారిత్రక ప్రాంతమైన రాచకొండను జిల్లాగా చేయాలని, లేకపోతే ప్రజల అభీష్టం మేరకే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏర్పుల సుదర్శన్, బద్దుల కృష్ణయ్య, రాసమళ్ల యాదయ్య, ఎండీ.రహీంషరీఫ్, మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, జక్కిడి మేఘారెడ్డి, సూరపల్లి శివాజీ, వలిగొండ యాదయ్య, కుందారపు యాదయ్య, బైకని నరేందర్, ఉప్పల శ్రీను, చంద్రారెడ్డి, యాదయ్య, భిక్షం, యాదగిరి తదితరులున్నారు.