
సంస్థాన్ నారాయణపురం: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంపాదించిన సొమ్ముతోనే మనకు దావతులు ఇస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దావతులు, డబ్బు, చీరలు పంచడం తప్ప టీఆర్‌ఎస్‌కు అభివృద్ధి చేతకాదని విమర్శించారు.
చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు
Comments
Please login to add a commentAdd a comment