జిల్లా జట్ల ఎంపిక
సంస్థాన్ నారాయణపురం: అండర్ – 19 హ్యాండ్‌బాల్, యోగా బాలుర, బాలికల జిల్లా జట్లను సోమవారం సర్వేల్ గురుకుల కళాశాలలో అధికారులు ఎంపిక చేశారు. విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడలను ప్రిన్సిపాల్ వి. రాఘవరావు ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ సీతారాములు, పీడీలు సాంబశివరావు, రహమత్, శారదలు పాల్గొన్నారు.
ఎంపికైన క్రీడాకారులు
– హ్యాండ్‌బాల్ బాలుర విభాగంలో డి.నిఖిల్, గణేష్, వెంకట్, అరుణ్, గోపాల్, ఈశ్వర్, ఉదయ్, నిఖిల్, కృష్ణ, జాషువా, రాము, ప్రవీణ్, సూర్య, శ్రీనాథ్, శివ, రామాంజనేయులను ఎంపిక చేయగా, స్టాండ్‌బైగా సందీప్‌ను ఎంపికచేశారు. అదే విధంగా బాలికల విభాగంలో విజయభాను, కళ్యాణి, మహేశ్వరి, వందన, నాగజ్యోతి, సంధ్య, శ్రీవాణీలను ఎంపిక చేశారు.
– యోగా బాలుర విభాగంలో వై.అజయ్, నవీన్, మోజస్, మహేష్, నిఖిల్, మణికంఠ, గణేష్‌లను ఎంపిక చేయగా, బాలికల విభాగంలో అనిత, సంధ్యలను ఎంపిక చేశారు.