సంస్థాన్‌నారాయణపురం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 300 ఎకరాల భూమి ఉంది, పేదలకు మాత్రం ఎకరం భూమి లేదు, సరైన ఇళ్లు లేవు’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో గురువారం బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాజగో పాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి భూమి దున్నగలరా, విత్తనాలు వేయగలరా, కలుపు తీయగలరా? వారికి వందల ఎకరాల భూమి ఎందుకు’అని ప్రశ్నించారు. గిరిజనులు చదును చేసి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటున్నారని, పట్టాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బహుజన రాజ్యం వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమితో పాటు పట్టాలు ఇస్తామని ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగాలు ఇవ్వడం లేదని, నాయకులు మాత్రం విదేశాల్లో కూడా వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల సమయంలో పేదలకు డబ్బు, మద్యం పంచి ఎన్నికల అనంతరం అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు.
చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
Comments
Please login to add a commentAdd a comment