Chandur
-
నల్లగొండ: శివ మృతిపై అట్టుడికిన పల్లె
సాక్షి, నల్లగొండ: చండూర్ మండల పరిధిలోని తాస్కాని గూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. పోలీసుల వేధింపుల వల్లే చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో.. శుక్రవారం సాయంత్రం పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామానికి చెందిన ఓ యువతిని అబ్బనబోయిన శివ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. యువతి తల్లి షీ టీమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. అతన్ని పిలిపించుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అనంతరం ఇంటికి చేరుకుని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు శివ. దీంతో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే.. పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ పేరుతో శివను కొట్టారని, ఆ మనస్తాపంతోనే శివ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆగ్రహంతో రగిలిపోయారు బంధువులు, గ్రామస్తులు. ఈ క్రమంలో.. శివ మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించగా.. ఆ మృతదేహాంతో ఆ అమ్మాయి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు శివ కుటుంబ సభ్యులు యత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై కారం పొడి చల్లి దాడికి దిగారు మృతుడి బంధువులు. షీటీమ్ సీఐ రాజశేఖర్‌పై శివ సోదరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. -
ఢిల్లీ పీఠం కదులుతుంది.. చూసింది కొంతే చూడనిది చాలా ఉంది: కేసీఆర్
మోదీ ప్రమేయం లేకుండానే వచ్చారా? ప్రధాని నరేంద్ర మోదీని అడుగుతున్నా. నీకు ఇంకా ఏం కావాలి. దేశంలో ప్రధాని పదవిని మించి ఇంకా ఏముంది? ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఇంకా ఎందుకీ కిరాతకం. మోదీ ప్రమేయం లేకుండానే ఆర్ఎస్ఎస్లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చారా? వాళ్లు ఆఫర్ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరున్నారో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హులు కాదు. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు వచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. ఒక్కొక్కరికి రూ.వంద కోట్లు ఇస్తాం. పార్టీ విడిచిపెట్టి రమ్మంటే మన వాళ్లు వారిని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా.. మేం అంగట్లో సరుకులం కాదు అంటూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది కొంతే. కానీ దొరికిన దొంగతనం ఎంతో ఉంది. ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప నివృత్తి లేదు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వంద కోట్లు ఇస్తామంటే గడ్డిపరకతో సమానమని వదిలేసి, నిఖార్సయిన తెలంగాణ బిడ్డలుగా ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల ఎత్తున ఎగరేశారని, అలాంటి బిడ్డలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులోని బంగారిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. మోదీ ఎందుకీ అరాచకం? ‘‘వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొల్లగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? ఎందుకీ అరాచకం. దేశానికి, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికారు. వారు ఇప్పుడు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఎవరో ఒక తలమాసినోడు తడిబట్టలతో ప్రమాణం చేస్తవా అంటడు. ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తవా అంటడు. ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు కనిపించడం లేదా? నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా. కేసు న్యాయస్థానాల్లో ఉంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేశా అంటారు. అందుకే ఆ విషయం నేను ఎక్కువగా చెప్తలేను. కానీ విద్యావంతులు, మేధావులు మౌనంగా ఉంటే మనకు శాపమైతది. మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఊరికి వెళ్లాక దీనిపై చర్చ చేయాలి. ఎవడో చెప్పిండని మాయమాటలకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరగదు. జీఎస్టీతో చేనేతకారులకు శిక్ష వేస్తున్న మోదీ దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం మోదీ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. మీ ఓటు వేయించుకొని మిమ్మల్నే పోటు పొడుస్తానని చెప్పే బీజేపీకి ఓటేస్తారా.. ఆలోచించుకోండి. పోస్టు కార్డు ఉద్యమంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు. వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి. బీజేపీ గెలిస్తే ప్రైవేటీకరణే.. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆశపడితే గోసపడతాం. 60 ఏళ్ల కింద చిన్న పొరపాటు జరిగితే ఎంత ఏడ్చింది తెలంగాణ. 58 ఏళ్లు కొట్లాడినం. ఎంతోమంది మన బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు ఓటు జాగ్రత్తగా వేయకపోతే పెట్టుబడిదారులకు మనమే సద్దికట్టినట్టు అయితది. మనమే ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్టు అవుతుంది. మీటర్లు పెట్టే వారికి డిపాజిట్ వచ్చినా నన్ను పక్కకు నెడతారు. కేసీఆర్ గట్టిగ మాట్లాడుతున్నారని, 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టి, తెలంగాణను కబ్జా పెట్టి ఇష్టారాజ్యంగా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ గద్దలకు వ్యవసాయాన్ని అప్పగించాలన్న కుట్ర జరుగుతోంది. వారికి బుద్ది చెప్పకపోతే కష్టపడేది మనమే. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా.. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండదండగా ఉంటాను. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలె. ఎవరు చేయాలి? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అయినా మోదీ నీటి వాటా ఎందుకు తేల్చడం లేదు. నేను మహా మొండిని. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా. ఇంతకు ముందు గోదలాంటి ప్రభాకర్‌రెడ్డిని ఓడించి గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారు. ఆ గొడ్డలి పుణ్యమాని రోడ్లు సరిగా లేవు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే ఆ రోడ్లను బాగుచేయించే బాధ్యత నాది. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి దేశంలో సక్కదనం ఏముంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఎంత? 82 రూపాయలా? నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వానంగా ఉంటదా? ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? ప్రకృతి వనరులు, సంపదలున్న దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్ రూ.1,200 చేసింది ఎవరు? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎవరు? పైగా వారికి ఓటు వేయాలా? అంత పౌరుషం లేకుండా ఉన్నామా? వడ్లు కొనుమంటే కొనరట కానీ రూ.100 కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారట. ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది. జగదీశ్‌రెడ్డి ఏం తప్పు చేశారు? మంత్రి జగదీశ్‌రెడ్డి లేకుండా గత 20 ఏళ్లలో ఏ సభలో కూడా మాట్లాడలేదు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందు బాధతో వచ్చాను. జగదీశ్‌రెడ్డి ఏం తప్పు చేశారు. ఎందుకు నిషేధించారు. గుండాగిరి చేశారా? ఎవరినైనా కొట్టారా? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. చాలా బాధగా ఉంది. వీటన్నింటికి 3వ తేదీన ఓటుతో జవాబు చెప్పాలి.’’ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీని ఏకిపారేసిన సీఎం కేసీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ చండూరు సభ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కార్పొరేట్ గద్దలకు బీజేపీ 14 లక్షల కోట్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి నిధులు ఇవ్వడం చేత కాదా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే మనల్ని నూకలు తినమన్నారని, నూకలు తినమన్న వారికి ఎన్నికల్లో తోకలు కత్తిరించాలన్నారు. బలవంతంగా రుద్దబడిన మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి చెంపపెట్టు కావాలని ఆకాంక్షించారు. చండూరు సభ వేదికపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని వేదికపైకి తీసుకొచ్చారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. ఈ నలుగురు అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా తెలంగాణ, జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. చదవండి: వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న వడ్లు కొనడం చేతకాని వారు వంద కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారని.. ఢిల్లీ బ్రోకర్లు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు. ‘నేను రాజ్యాంగబద్దమైన ముఖ్యమంత్రి పదదవిలో ఉన్నాను. కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయి. తలకుమాసినోడు ఒకడొచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. మతోన్మాద శక్తులను తరిమేస్తే తప్ప దేశం బాగుపడదు. టీవీల్లో చూసింది చాలా చిన్నది. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న
LIVE UPDATES: ‘మునుగోడులో యుద్ధం చేయాలి. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం చేనేతలకు చేశారు. నేతన్నలపై జీఎస్టీ విధించి మళ్లీ వాళ్లనే ఓట్లు అడుగుతున్నారు. చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీకి ఓటు వేయకుండా చేనేతలు బుద్ధి చెప్పాలి. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?. పెట్టుబడి దారులు, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది. విద్యుత్ సంస్కరణల ముసుగులో మీటర్లు పెడుతున్నారు. మీటర్ పెడతామన్న వారికే మీటర్ పెట్టాలి. ఎన్నికల్లో చేసే దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే గోస పడతాం. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదు. పాలను, నీళ్లను వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉండాలి. మోదీ విశ్వ గురువు కాదు. విష గురువు. బలవంతంగా రుద్దబడిన ఉప ఎన్నిక వారికి చెంపపెట్టు కావాలి’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ►కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. ►మోదీ గారు మీకు ఇంకా ఏం కావాలని.. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దీనిపై విచారణ జరగాలన్నారు. వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చినవారు చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు. కరిసే పామును మెడలో వేసుకుంటామా? ►చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఫలితం కూడా మీరు(ప్రజలు) ఎప్పుడో తేల్చేశారని పేర్కొన్నారు. ఎలక్షన్ వస్తే చాలు కొందరు హడావిడీ చేస్తరని.. గాయ్.. గాయ్ గత్తర్ గత్తర్ లొల్లి నడుస్తుందని అన్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతుందని సీఎం సెటైర్లు వేశారు. బావ చెప్పిండనో, బావమర్ధి చెప్పిండనో, డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని కోరారు. దోపిడి దారులు మాయ మాటలు చెబుతూనే ఉంటారు. కరిసే పామును మెడలో వేసుకుంటామా అని ప్రశ్నించారు. సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికకు మరో నాలుగు రోజులు సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని మరింత జోరు పెంచాయి. బహిరంగ సభలు, సహావేశాలతో హోరెత్తనున్నాయి. సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావిస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కాసేపట్లో చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరైనట్లు సమాచారం ఇప్పటికే కేసీఆర్ చండూరు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కాగా ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహరంపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. దీంతో చండూరు సభ వేదికగా సీఎం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
చండూరులో కేసీఆర్ సభ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో, ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా పారీ్టకి ఊపు తెచ్చేందుకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ఆగస్టు 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. మరో సభను చండూరులో ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. జన సమీకరణకు సంబంధించి ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో మండల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. యూనిట్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన సమీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. చండూరు సభకు ప్రాధాన్యత ఒకవైపు మునుగోడులో అన్ని రాజకీయ పక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా, రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో చండూరు సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఆయనతో పాటు పార్టీ యంత్రాంగం అంతా ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. దీంతో చండూరు సభలో సీఎం ఏమైనా మాట్లాడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 20న జరిగిన సభలో కేవలం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి.. ఆదివారం జరిగే సభలో రాజకీయ అంశాలపై స్పందించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంబంధం కలిగిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చండూరు సభకు సీఎం కేసీఆర్‌తో పాటు హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయినందునే ఉప ఎన్నిక వచి్చందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదనే విషయాన్ని సభ ద్వారా చెప్పే అవకాశాలున్నట్లు తెలిసింది. భద్రతా కారణాల వల్లే అజ్ఞాతంలో.. ఎమ్మెల్యేలకు ఎర అంశంపై దర్యాప్తు దశలో స్పందించకూడదని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ ఘటనతో సంబంధం కలిగిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ నెల 26న పోలీసు భద్రత నడుమ ప్రగతిభవన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా వీరు ప్రగతిభవన్లోనే బస చేసినట్లు ప్రచారం జరుగుతుండగా, భద్రతా కారణాల దృష్ట్యా వారు ఎక్కడ ఉన్నారనే అంశంపై గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది. అయితే వారు తమ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
చండూరు ఘటన.. రేవంత్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, నల్లగొండ: చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు తగలబడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చండూరులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థ/లు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అన్నారాయన. పార్టీ ఆఫీస్‌పై దాడి చేసి దిమ్మెలు కూల్చినా.. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రేవంత్ స్పష్టం చేశారు. మా కేడర్‌ను బెదిరించాలని టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వాళ్లపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే.. ఎస్పీ ఆఫీస్ ముందు తానేస్వయంగా ధర్నాలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు అల్టిమేటం జారీ చేశారు. ఇక ఈ ప్రమాదంపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎవరో కావాలనే ఈ పని చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఘటనపై అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఘటనకు కారణం ఎవరో బయటపెట్టాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారామె. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలతో కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు. ప్రజా మద్దతుతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించాలి కానీ ఇలాంటి చిల్లర పనులు చేయడం బాధాకరం అని పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. ఇదీ చదవండి: మునుగోడు కోసం బహుముఖ వ్యూహాలతో బీజేపీ -
చండూరు ఘటన.. రేవంత్‌రెడ్డి ఆగ్రహం
-
మునుగోడు బైపోల్: రాజగోపాల్‌రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. చండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రే వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరులో నామినేషన్ దాఖలు చేసిన నాడే.. ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం గమనార్హం. ఫోన్ పే తరహాలో.. కాంట్రాక్ట్ పే అంటూ వేల పోస్టర్లను రాత్రికి రాత్రే అంటించారు ప్రత్యర్థులు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన ఆస్తులు, అప్పులు, పోలీసు కేసులు.. ఇతరత్ర వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సోమవారం అందజేసి.. నామినేషన్ వేశారు. అయితే.. రాజగోపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా పోస్టర్లు ప్రచురించి.. గోడలకు అంటించారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఏర్పాట్లు చేసిన పోస్టర్లు దుమారం రేపుతోన్నాయి. ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ దర్శనమిస్తున్న పోస్టర్లు స్థానికుల్ని చర్చించుకునేలా చేస్తున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి గోడలకు వేలాది పోస్టర్లను కొంతమంది అతికించారు. రూ.18 వేల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు. పైగా 500 కోట్ల బోనస్ సంపాదించారంటూ పోస్టర్లో పొందుపర్చారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతోన్నాయి. ఈ పోస్టర్ల వ్యహారంపై బీజేపీ మండిపడుతోంది. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, ఇలా పోస్టర్లతో ఆయనను ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఆయన రాజీనామా చేసిన దగ్గర నుంచి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతూనే ఉన్నాయి. -
రాజగోపాల్‌రెడ్డి నయవంచకుడు.. రేవంత్‌రెడ్డి ఫైర్
సాక్షి, నల్లగొండ: పార్టీకి ద్రోహం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలని.. మునుగోడు గడ్డ కాంగ్రెస్ పక్కన నిలబడాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. జిల్లాలోని చండూరులో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తాజా మాజీ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సింది. కానీ, ఆ టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ త్యాగం గుర్తులేదా? అని రాజగోపాల్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మునుగోడులో చరిత్ర హీనుడైన రాజగోపాల్ రెడ్డి.. నమ్మిన కార్యకర్తలను మోసం చేసి అమిత్ షా పంచన చేరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి. అలాంటి సోనియాను హింసిస్తే ఊరుకుంటామా? అని రేవంత్ ఆగ్రహం వెల్లగక్కారు. కలిసి పోరాడేందుకు కాంగ్రెస్‌తో రాలేదని, కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్ షాను కలిశాడు. ఉపఎన్నికల్లో ఓడినంత మాత్రాన.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా ఊడిందా?. 2018 తర్వాత నాలుగు ఉప ఎన్నికల్లో రెండు టీఆర్ఎస్, రెండు బీజేపీలు గెలిచాయ్. ఒక ఎమ్మెల్యే పదవి పోయినా కాంగ్రెస్‌కు పోయేది ఏమీ లేదు. అందులో నొప్పేంటి? కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేక మోదీ.. ఈడీని ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించారు రేవంత్. నేను కాంగ్రెస్ తరపున పోరాడుతున్నా కాబట్టే నాపై కేసులు పెడుతున్నారు. జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి కింద ఏం పని చేయాలని రాజగోపాల్‌రెడ్డి అంటున్నాడు. నేను 30 రోజులు జైల్లో ఉంటే.. అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. అమిత్‌షా పక్కన ఉన్నప్పుడు.. నా పక్కన నిలబడటానికి నీకేం నొప్పి వచ్చింది. అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయా?. ఉప ఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే ..కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్. ఎన్నో పదవులు ఇచ్చిన కాంగ్రెస్‌నే రాజగోపాల్‌రెడ్డి మోసం చేశాడు. ఇవాళ కాంగ్రెస్‌ను మోసం చేసినవాడు.. రేపు మళ్లీ మోసం చేయడా?. తెలంగాణ సంస్కృతి అమ్ముడుపోయే సంస్కృతి కాదు.. సాయం చేసే సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల పైనే ఉంది. ప్రజలంతా కాంగ్రెస్ పక్కన నిలబడండి. నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెడతాం అంటూ ఆగ్రహం వెల్లగక్కారు రేవంత్‌రెడ్డి. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, జానా రెడ్డి, దామోదర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, సీతక్క తదితరులు మనుగోడులో కాంగ్రెస్‌ను గెలిపించాలని, పార్టీ ద్రోహులకు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. చదవండి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మా కుటుంబసభ్యుడు-రేవంత్‌రెడ్డి ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డి ముఖం కూడా చూడను-కోమటిరెడ్డి వెంకటరెడ్డి -
పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి: రేవంత్‌రెడ్డి
-
రెండు కిడ్నీలు ఫెయిల్.. ఆదుకుంటే చదువుకుంటా
చండూరు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. పెద్ద చదువులు చదివి ఉన్నత ఉ ద్యోగం చేయాలన్న ఆ విద్యార్థిని కోరికకు అనారోగ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. వివరాలు.. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామానికి చెందిన దోనాల భూపాల్‌రెడ్డి, ప్రేమలత దంపతులు 15 ఏళ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం చండూరు పట్టణానికి వలస వచ్చారు. బ్యాంక్ రుణం సహాయంతో ఇక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకున్నారు. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇటీవల పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, కుమారుడు చదువుకుంటున్నాడు. కాగా రెండో కుమార్తె గాయత్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంపాలైంది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.18 లక్షలకు పైగా ఖర్చు చేసిన తర్వాత గాయత్రి రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ దీంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు మందులకు ఖర్చవుతుందని, పాల వ్యాపారంలో వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికే సరిపోతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మందులు తెచ్చేందుకు అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక రెండు నెలలుగా మందులు వాడడం లేదని, దీంతో గాయత్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కిడ్నీల మార్పిడికి లక్షలు ఖర్చువుతుందని వైద్యులు చెబుతుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. అనారోగ్యంతోనే డిగ్రీ పూర్తి నడవలేని స్థితిలో ఉండి కూడా గాయత్రి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ మైక్రో బయాలజీ పూర్తి చేసింది. వారంలో రెండు, మూడు రోజులు బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చేది. తీవ్ర జ్వరం ఉన్నా సరే పరీక్షలు రాసి మొదటి ర్యాంకులో పాస్ అయ్యింది. ఉన్నత చదువులు చదువుతా నాకు ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉంది. కానీ ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నా. డబ్బులు లేక ఇటీవల మందులు కూడా వాడడం మానేశా. అక్క పెళ్లికి చేసిన అప్పు అలానే ఉండటంతో అమ్మానాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తమ్ముడు చదువు మానేసి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికసాయం చేస్తే మా కుటుంబ కష్టాల నుంచి బయటపడుతుంది. - గాయత్రి -
మలుగు పాపెర.. ఈ చేప ధర కిలో 2 వేలు!
వర్ని: నిజామాబాద్ జిల్లా చందూర్ శివారులోని నిజాంసాగర్ కాలువలో నాలుగున్నర కిలోల మలుగు పాపెర చేప మంగళవారం లభ్యమైంది. కాలువపై నుంచి శ్రీనివాస్, నాందేవ్ కలిసి వెళ్తుండగా ఈ చేప కనిపించడంతో వెంటనే కాలువలోకి దిగి పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి చేపలు ఉండవన్నారు. కిలో రూ.2 వేల వరకు ధర పలుకుతుందన్నారు. తల్లి చేప ఉత్పత్తికి మోక్షమెన్నడో.. సాక్షి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద తల్లి చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది. అవసరమైన నిధులున్నా సకాలంలో పనులు చేపట్టడం లేదు. దీనికి తోడు అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో తల్లి చేపల ఉత్పత్తి కేంద్రం ఎప్పటికి పూర్తి చేస్తారో అంటూ మత్స్యకారులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సారెస్పీ వద్ద గల జాతీయ చేప పిల్లల కేంద్రం సమీపంలో తల్లి చేపల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ. 2.5 కోట్లు కేంద్రం, మరో రూ. 2.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నిర్ణయించారు. 2017లో ప్రారంభించిన పనులు ఇంకా మందకొడిగానే సాగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఒక్కటే.. దేశంలో ప్రస్తుతం ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా తల్లి చేపల ఉత్పత్తి కేంద్రం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తల్లి చేపల ఉత్పత్తికి ఎస్సారెస్పీ అనువుగా ఉంటుందని భావించి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నిర్మాణ పనుల కోసం స్థానిక మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే పలు మార్లు భువనేశ్వర్ వెళ్లి పరిశీలించారు. పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయి నాలుగేళ్లు పూర్తవుతున్నా పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. తల్లి చేపల ఉత్పత్తి కేంద్ర నిర్మాణం ఇలా.. తల్లి చేపల ఉత్పత్తి కేంద్రంలో బ్రీడింగ్ పాండ్లు, రేరింగ్ పాండ్లు, హేచరి పాండ్లు, నర్సరీ పాండ్లను నిర్మిస్తారు. సాధరణంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మట్టి కుండీలే ఎక్కువగా ఉంటాయి. కాని ఆ కుండీలకు రివిట్ మెంట్ ఉండదు. తల్లి చేపల ఉత్పత్తి కేంద్రంలో మట్టి కుండీలకు లోపలి వైపు రివిట్ మెంట్‌తో నిర్మించారు. అయితే భువనేశ్వర్‌లోని నిర్మాణ నమూనాల మేరకే ఎస్సారెస్పీ వద్ద పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మేలు రకం చేపల ఉత్పత్తి తల్లి చేపల కేంద్రంలో మేలు రకం చేపలను ఉత్పత్తి చేస్తారు. అందుకు ప్రస్తుతం ఒరిస్సాలో పెంచుతున్న చేపలను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు దిగుమతి చేయాలి. బోత్స, రోహూ, బంగారు తీగ జాతుల్లోనే మేలు రకం చేపలను దిగుమతి చేస్తారు. ఈ రకానికి చెందిన చేపలు ఏడాదికి 3 కిలోల బరువు పెరిగే అవకాశం ఉంటుందని మత్స్య శాఖ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన చేపలను రెండేళ్ల పాటు పెంచి తయారు చేసిన తల్లి చేపల నుంచి చేప పిల్లలను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్రంలోనే కాకుండా అవసరమైన మేరకు ఇతర రాష్ట్రాలకు కూడ చేప పిల్లలను సరఫరా చేస్తారు. సాధారణంగా ప్రస్తుతం ఉన్న రకం చేపలు ఏడాదికి కేవలం ఒక కేజీ బరువు మాత్రమే పెరుగుతాయి. కాని మేలు రకం చేప పిల్లలు మూడు కేజీలు పెరిగే అవకాశం ఉందని భావించి ఎస్సారెస్పీ వద్ద తల్లి చేపల కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది. పనులు పూర్తవగానే.. తల్లి చేపల కేంద్రంలో పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ తల్లిచేపల కేంద్రాన్ని అప్పగించలేదు. ఇదే విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పనులు పూర్తయిన వెంటనే తల్లి చేపలను ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం. –మోయినుద్దీన్, మత్స్యశాఖ అధికారి, ఎస్సారెస్పీ చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు -
ఏటీఎం చోరీకి యత్నం..
-
ఏటీఎం చోరీకి యత్నం.. యువకుడికి దేహశుద్ధి
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని చండూర్ మండలం ఘట్టుప్పల్‌లో ఏటీఎంలోని నగదు చోరికి పాల్పడి పోలీసులకు చిక్కాడు ఓ యువకుడు. గడ్డపారతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేస్తుండగా గ్రామస్తులు చూసి పోలీసులకు పట్టించారు. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వాయులపల్లి గ్రామానికి చెందిన జలందర్ ఘట్టుప్పల్లోని ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులు దొంగతనం చేయాలని పథకం పన్నాడు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గడ్డపార, సుత్తె, కొడవలితో ఏటీఎం మిషన్ వద్దకు వచ్చాడు. ఆయుధాలతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేయడానికి యత్నించాడు. శబ్దం రావడంతో పక్కనే ఉన్న కొంతమంది యువకులు ఏటీఎం వద్దకు వెళ్లి చూశారు. దొంగతనానికి పాల్పడుతున్న జలందర్‌ను చూసిన యువకులు గ్రామస్తులకు ఫోన్ చేసిన విషయం చెప్పారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి జలందర్‌ను బంధించారు. గ్రామస్తులను చూసి బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన జలందర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జలందర్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
సుమన్ బామ్మర్ది వివాహం, హాజరైన కేటీఆర్
సాక్షి, నల్గొండ: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కుటుంబంలో జరిగిన వివాహా కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సుమన్ బామ్మర్ది వెంకటేశ్ గౌడ్ వివాహం బుధవారం ఉదయం పావనితో జరిగింది. నల్గొండ జిల్లా చండురులో జరిగిన ఈ విహహా వేడుకకు హాజరైన కేటీఆర్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్‌తోపాటు రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి నరసింహారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌లు కూడా వివాహా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇటీవల కేటీఆర్‌ను స్వయంగా కలిసిన సుమన్ ఈ వివాహ వేడుకకు సంబంధించిన శుభలేఖను ఆయనకు అందజేశారు. -
ప్రజాసేవకే అంకితం: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, చండూరు : తనకు సంపాదన అసలే వద్దు.. నియోజక వర్గం అంటే ఎంతో అభిమానమని, ప్రజాసేవకు అంకితం కావాలనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నానని మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం చండూరు, గట్టుప్పలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిన తనకు మునుగోడు ప్రజలకు సేవలు అందించాలనే కోరిక ఉందన్నారు. డబ్బు ఎంత ఉన్నా తృప్తి ఉండదని పేదలకు సేవలు అందించినప్పుడే సంతృప్తిగా ఉండవచ్చన్నారు. మునుగోడు అభివృద్ధిలో ఎంతో వెనుకబడి పోయిందన్నారు. టీఆర్ఎస్ హయాంలో కనీస అభివృద్ధి జరుగలేదన్నారు. మునుగోడును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమన్నారు. తెలంగాణలోనే మునుగోడుకు ప్రాధాన్యత తేవాలని ఉందన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆగడాలకు అంతులేకుండా పోయిందన్నారు. కనీసం గ్రామాలలో మురికి కాలువలు, సీసీ రోడ్లు లేక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గట్టుప్పలను మండలంగా చేయడం తన బాధ్యతన్నారు. అబద్దాలు చెప్పే అలవాటు తనకు లేదన్నారు. గ్రామ ప్రజలు తనకు సహకరించాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవి కుమార్ మాట్లాడుతూ మునుగోడుకు సమర్థుడు రాజగోపాల్ రెడ్డినేనని ఆయన అన్నారు. చెయ్యి గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, బోయపల్లి అనంత రాజు గౌడ్, రాపోలు జయప్రకాష్, కర్నాటి వెంకటేశం, ఎంపీపీ తోకల వెంకన్న, జెడ్పీటీసీ అన్నెపర్తి సంతోషశేఖర్, జాజుల అంజయ్య గౌడ్, పున్న రాజు, భీమనపల్లి శేఖర్, కలిమికొండ జనార్దన్, ధర్మేందర్ పాల్గొన్నారు. మునుగోడును ఆదర్శంగా తీర్చిదిద్దుతా మునుగోడు : అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్ నుంచి నారాయణపురం మీదుగా మునుగోడు మండలానికి చేరుకున్న బైక్ ర్యాలీ చండూరుకి వెళ్లింది. ఈ సందర్భంగా మునుగోడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ తనను మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా కోరుకున్నందుకే బరిలో నిలిచానన్నారు. ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలుపొంది, అభివృద్ధి చేస్తానన్నారు. ప్రధానంగా ఎలాంటి సాగు నీటి వనరులు లేని ఈ ప్రాంతంలో నక్కలగండి ప్రాజెక్టుతో పాటు బివెల్లంల ఉదయసముద్రం, పిలాయిపల్లి కాల్వను పూర్తి చేయించి 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత, పల్లె రవికుమార్, వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జాజుల అంజయ్యగౌడ్, మేకల రామస్వామి, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, జాల వెంకన్న యాదవ్, పోలగోని సత్యం, నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, బూడిద లింగయ్య యాదవ్, బొజ్జ శ్రీనివాస్, మేకల ప్రమోద్‌రెడ్డి, పాల్వాయి జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయనకు ధన బలం.. నాకు జన బలం :కూసుకుంట్ల
సాక్షి, చండూరు : మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థికి ధన బలం .. తనకు జన బలం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం చండూరులో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ధన బలమా..జన బలం గెలుపొందుతుందా అని సవాల్ విసిరారు. ధనం చూసి విర్రవీగడం జనం గమనిస్తూనే ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యంగా తయారవుతుందన్నారు. తనను ఇదొక్కసారి గెలిపించండి పెండింగ్ ప్రాజెక్టులు, పనులను పూర్తి చేయిస్తానన్నారు. 60 ఏళ్లుగా అభివృద్ధి చేయని కాంగ్రెస్ నాయకులు ఎన్నికలలో మేం అభివృద్ధి చేస్తామని రావడం సిగ్గుచేటన్నారు. సాగు నీరు అందించే వరకు తాను నిద్రపోనన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో చేసిన అబివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అన్నారు. ఎమ్మెల్యేగా తాను రోజు 12 గంటలు నియోజకవర్గంలోనే ఉన్నానన్నారు. ఇంటికి వెళ్లకుండా పండుగలు సైతం మీ దగ్గరే చేసుకున్న విషయం మరువ కూడదన్నారు. నియోజక వర్గం నా సొంత ఇళ్లుగా భావించిన మాట వాస్తవం కాదా అన్నారు. ఆపదలో ఉన్న వారికి తనను కలిసేందుకు అరగంట చాలని..ఇదే కాంగ్రెస్ అభ్యర్థిని కలిసేందుకు ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసన్నారు. కార్యక్రమంలో జెల్ల మార్కండేయులు, మునగాల నారాయణ రావు, నల్లగంటి మల్లేశం, పెద్దగాని వెంకన్న, కోడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క కొబ్బరికాయతోనే అభివృద్ధి
సాక్షి, చండూరు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాదిరిగా ఊర్లో జరిగే ప్రతి పనికి ఓ కొబ్బరి కాయకొట్టడం మా నైజం కానే కాదని ఏ ఊరిలోనైనా ఒక్క కొబ్బరికాయతో ఆ ఊరి అభివృద్ధి జరిగిపోవాల్సిందేనని మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బోడంగిపర్తి, తాస్కానిగూడెం, ఇడికూడ, బంగారిగడ్డ, తుమ్మపల్లి, అంగడిపేట, తిమ్మారెడ్డిగూడెం, కొండాపురం, కమ్మగూడెం, శేరిగూడెం, శిర్ధేపల్లి తదితర గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాజా, మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలలో అనేక కొబ్బరికాయలు కొడుతూ కాలయాపన చేసేవారని, ఇక అలాంటి పనులు నేను చేయనన్నారు. మునుగోడు ప్రజలు తమ నియోజకవర్గానికి మీ సేవలు అవసరమని కోరడంతోనే తాను ఇక్కడి నుంచి పోటీలో ఉన్నానన్నారు. తనపై కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసినా గెలిచే సత్తాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మాట్లాడే దమ్ము తేదని దీంతో అభివృద్ధి ఏం చేయగలరని, అదే నేను అధిష్టానంతో ధైర్యంగా మాట్లాడి పల్లెను అభివృద్ధి చేయగలనని ఆయన భరోసా కల్పించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను సామాన్యులకు అందుబాటులో ఉంటానన్నారు, శేశిలేటి వాగు పనులు, వెల్మకన్నె ఫీడర్ చానల్ పనులు, బెండలమ్మ చెర్వు పనులను వెంటనే పూర్తి చేయించగలనన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, కార్యదర్శి కర్నాటి వెంకటేశం, ఎంపీపీ తోకల వెంకన్న, జెడ్పీటీసీ అన్నెపర్తి సంతోషశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు బొబ్బలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాదగాని విజయలక్ష్మి, భీమనపల్లి శేఖర్, పున్న ధర్మేందర్, కోడి గిరి బాబు, దోటి వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన కురుమ సంఘం నాయకులు మునుగోడు : మండలంలోని పలివెల గ్రామానికి చెందిన కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంఘంలోని దాదాపు 40 మంది సభ్యులు చేరారు. చేరిన వారిలో గుర్జ నర్సింహ, గుత్తి పెద్దగాలయ్య, చెరుపల్లి గోపాల్, గుత్తి శ్రీశైలం, నర్సింహ,, రమేష్, చెరుపల్లి అంజయ్య, లింగస్వామిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు గోసుకొండ శంకర్, మాజీ సర్పంచ్ చెర్కు జనార్దన్, చెరుపల్లి వెం కన్న, గోసుకొండ చంద్రయ్య, భాస్కర్, మత్స్యగిరి, మా ర్త నర్సిరెడ్డి, కూన్‌రెడ్డి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 14 గ్రామాల్లో కోమటిరెడ్డి ప్రచారం చండూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మండలంలోని 14 గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలో పలువురు కార్యకర్తలకు టీని అందించారు. అదే విధంగా కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోడి శ్రీనివాసులు తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
దళారుల్లో దడ..
► చండూరు కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు బిగుస్తున్న ఉచ్చు ► ఇటు రెవెన్యూ.. అటు విజిలెన్స్ శాఖలు సమన్వయంతో ముందుకు.. ► 20 క్వింటాళ్ల పైబడి అమ్మిన వారి వివరాలు సేకరించే పనిలో అధికార యంత్రాంగం ► ఇప్పటికే జిల్లాలోని తహసీల్దార్లకు వెళ్లిన మెయిల్ చండూరు: చండూరు వ్యవసాయ మార్కెట్లో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు ఉచ్చు బిగుస్తోంది. మరో వారంలో దళారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అటు రెవెన్యూ.. ఇటూ విజిలెన్స్.. రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జేసీ నారాయణరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు దళారుల లిస్టు తయారు చేసి తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గత శుక్రవారం విజిలెన్స్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో ఓ బృందం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోలు కేంద్రంలో 20 క్వింటాళ్లకు పైగా విక్రయించిన వారి వివరాలను స్థానిక తహసీల్దార్‌కు అందించాలని ఆయన మార్కెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో జరిగిన తతంగంపై రైతుల çనుంచి సమాచారం తీసుకున్నారు. కేంద్రంలో ఏ మండలం నుంచి ఎంత మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించారో వివరాలతో కూడిన సమాచారాన్ని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు చండూరు తహసీల్దార్ వెంకట్‌రెడ్డి మెయిల్ పంపిం చారు. కందులు విక్రయిం చిన రైతులకు భూమి ఉందా.. ఉంటే కందులు పండించారా.. ఎంత పంట పండింది.. అనే కోణంలో విచారించి కలెక్టర్‌కు నివేదిక అందించనున్నారు. 147 మంది సమాచారం కోసం.. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 37,559 క్వింటాళ్ల కందులను 4505 మంది రైతుల ద్వారా కొనుగోలు జరిపారు. ఇందులో 158 మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించినవారున్నారు. ఇందులో చండూరు మండలానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. 11 మందిలో కస్తాల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి, భార్యతో కలిసి భూమి లేకుండానే కందులను అమ్మినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. మిగిలిన 147 మంది దళారుల సమాచారం కోసం రెవెన్యూ సిబ్బంది వేట సాగిస్తోంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని చండూరు మార్కెట్లో జనవరి 23 తేదీన హాకా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు 1994 మంది రైతులకు రూ.8 కోట్ల పైచిలుకు బకాయిలు చెల్లించారు. ఇంకా రూ.5.2 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. -
గట్టుప్పల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
గట్టుప్పల(చండూరు) గట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. గట్టుప్పల గ్రామస్తులతో పాటు మర్రిగూడ మండలం నామాపురం, మేటిచందాపురం, చండూరు మండలం తేరట్పల్లి గ్రామస్తులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. శుక్రవారం పోలీసులు గట్టుప్పలలో దీక్షలకు భగ్నం కలిగించి శనివారం నాయకులను గృహనిర్భంధం చేశారు. యధావిధిగా నిర్బంధంలోనే కొనసాగుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. మూడు రోజుల క్రితం మండలం కోసం ఏర్పుల యాదయ్య ఆత్మహత్య చేసుకోగా, శుక్రవారం బొడిగే సోని మృతి చెందడంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా పోలీసులు భారీగా మొహరించారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ముందస్తుగా 15 మంది యువకులను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన నాయకులు మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం, వైస్ ఎంపీపీ అవ్వారు శ్రీనివాస్ , ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కంచుకుంట్ల సుభాష్ , సర్పంచ్ నామని జగన్నాథంలను గృహనిర్బంధం చేశారు. మరికొంత మంది గ్రామస్తులను పోలీసులు అదే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ రోడ్లపై ఎవ్వరిని ఉండనీయడం లేదు. ఎస్పీ ప్రకాష్ రెడ్డి రెండు రోజులుగా గ్రామాన్ని సందర్శిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్ఐల తో పాటుగా 400 మంది పై చిలుకు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాన్ని మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరో రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించడం సబబుకాదు : గంగిడి గట్టుప్పల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న సోనిది ఆత్మహత్య కాదని, హత్యేనని పోలీసులు నిర్ధారించడం ఎంత వరకు సబబని బీజేపీ రాష్ట కోశాధికారి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం గట్టుప్పల గ్రామాన్ని సందర్శించారు. ఈసందర్భంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. అనంతరం స్థానిక చౌరస్తా లో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. -
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి
చండూరు : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్సీ రామచందర్ రావు పిలుపు నిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గట్టుప్పలలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభనుద్దేశించి మాట్లాడారు. వివేకానందుడు ఓ గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రతి యువకుడికి దేశ భక్తిపై గౌరవం ఉండాలన్నారు. దేశంలో అత్యధికంగా యువత ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. రానున్న కాలంలో బీజేపీకి తిరుగు లేని విజయం ఖాయమన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతం నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి, పార్టి రాష్ట కోశా«ధికారి డాక్టర్ మనోహార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నామని జగన్నాథం, రావిరాల శ్రీను, చిల్కూరి అశోక్, శివకుమార్, నన్నూరి రాంరెడ్డి, యాస అమరేందర్ రెడ్డి, గంజి క్రిష్ణయ్య, సోమ నర్సింహ, కోమటి వీరేశం, కర్నాటి శ్రీను, అమరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. -
మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
చండూరు : అనారోగ్యంతో మృతి చెందిన అన్నెపర్తి మోహన్(28) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం చండూరులో అనారోగ్యంతో మృతి చెందిన మోహన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. లక్ష ఆర్థికS సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు యువకుడు మోహన్ మృతి తీరని లోటన్నారు. ప్రతీక్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు చిన్నారులను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కలిమికొండ పారిజాత, జనార్దన్, కోడి గిరిబాబు, నాయకులు దోటి వెంకటేశ్ యాదవ్, రావిరాల నగేష్, జకలి శ్రీను తదిరులు ఉన్నారు. -
చండూరులో షూటింగ్ సందడి
చండూరు: విక్టరీ యాక్టింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ తిరందాసు జానకీరాం డైరెక్షన్లో నిర్మిస్తున్న సినిమాల షూటింగ్ ఆదివారం మండల కేంద్రంలో కొనసాగింది. ఇందులో భాగంగా హృదయం..నా ప్రాణం అనే సినిమాకు ఎంపీపీ తోకల వెంకన్న, నీ... ఎంకమ్మ అనే సినిమాకు బీజేపీ నేత కోమటి వీరేశంలు క్లాప్‌లు కొట్టారు. కార్యక్రమంలో నటులు తండు వెంకట్‌గౌడ్, గండూరి నర్సింహ, సర్పంచ్ కలిమికొండ పారిజాత, జెడ్పీటీసీ అన్నెపర్తి సంతోష శేఖర్, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ రావిరాల చందన, అనిత, కో ఆప్షన్ సభ్యుడు రషీద్ పాల్గొన్నారు. -
చండూరు ఎంపీడీఓ కార్యాలయం తనిఖీ
చండూరు : జిల్లాలో ఏ శాఖకూ నిధుల కొరత లేదని జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం చండూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. 2013–2014, 2014–2015 సంవత్సరాల చెందిన వార్షిక నిధులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖలకే మల్లిస్తున్నట్లు తెలిపారు. బీఆర్జీఎఫ్ నిధులు క్లోజ్ అయ్యాయని, 14 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎస్‌ఎప్‌సీ నిధులు రాకపోవడంతో కొంత ఇబ్బందిగా ఉందన్నారు. గ్రామాల్లో వీధిలైట్ల బిల్లులను పంచాయతీలే చెల్లించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 200 గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు కాగా మిగతా పంచాయతీల్లో 65 శాతం మాత్రమే వసూలైనట్లు చెప్పారు. దసరా తర్వాత పన్నులు వసూలు చేయనున్నట్లు వివరించారు. జిల్లా పరిధిలో 350 అంగన్వాడీ కేంద్రాలు, 151 గ్రామ పంచాయతీల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యాదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ శైలజ తదితరులు ఉన్నారు. -
దళితులను విభజించడం న్యాయం కాదు
చండూరు : దళితులను విభజించడం బీజేపీకి న్యాయం కాదని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరి రమేశ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా భేరి రమేశ్ మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ పోరాటానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ హాజరు కావడం ఎంత వరకు సబబన్నారు. దళితులను విభజించే కుట్రను బీజేపీ మానుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గోటి సైదులు, అనిల్, వంశీ, నాగరాజు ఉన్నారు.