Published
Sat, Aug 6 2016 7:08 PM
| Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
ప్రజల ఆకాంక్షకు భిన్నంగా కేసీఆర్ పాలన
గట్టుప్పల్, (చండూరు) : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఐఎఫ్‌టీయూ(భారత కార్మిక సంఘాల) జాతీయ అధ్యక్షుడు ఎస్‌కే.ముక్తార్ పాషా అన్నారు. ప్రగతి శీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర రాజకీయ తరగతులు శనివారం గట్టుప్పల గ్రామంలో కామ్రేడ్ వెంకన్న హాల్‌లో ప్రాంభమయ్యాయి. తరగతులను పాషా ప్రాంభించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. దళితులు, గిరిజనులపై రోజురోజుకు దాడులు జరుగుతున్నాయన్నారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రజాఫ్రంట్ నాయకులు సుధాకర్‌రెడ్డి , ఏఐకేఎంఎస్ రాష్ట అధ్యక్షుడు అచ్యుతరామారావు, జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, అశోక్, మోతీలాల్, రమేష్ తదితరులు ఉన్నారు.