gattuppal
-
కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం కుమార్తె అగచాట్లు
నల్లగొండ జిల్లా గట్టుపల్ మండలానికి చెందిన రాజ్యమ్మ శ్వాసలో ఇబ్బందితో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో గురువారం హైదరాబాద్‌కు తరలించడానికి ఆమె కుమార్తె అంబులెన్స్, ఆక్సిజన్ సిద్ధం చేసింది. అయితే రాజ్యమ్మలో చలనం లేకపోవడంతో.. వైద్యులతో మాట్లాడి స్ట్రెచర్‌పై ఉన్న తల్లిని తిరిగి అదే ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకెళ్లింది. కొద్దిసేపటికే తల్లి కన్నుమూసింది. కొన ఊపిరితో తల్లి.. ఎలాగైనా ఆమెను దక్కించుకోడానికి కుమార్తె పడిన ఆరాటం.. చివరకు తల్లి కన్నుమూయడంతో ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. - సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
గట్టుప్పల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
గట్టుప్పల(చండూరు) గట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. గట్టుప్పల గ్రామస్తులతో పాటు మర్రిగూడ మండలం నామాపురం, మేటిచందాపురం, చండూరు మండలం తేరట్పల్లి గ్రామస్తులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. శుక్రవారం పోలీసులు గట్టుప్పలలో దీక్షలకు భగ్నం కలిగించి శనివారం నాయకులను గృహనిర్భంధం చేశారు. యధావిధిగా నిర్బంధంలోనే కొనసాగుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. మూడు రోజుల క్రితం మండలం కోసం ఏర్పుల యాదయ్య ఆత్మహత్య చేసుకోగా, శుక్రవారం బొడిగే సోని మృతి చెందడంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా పోలీసులు భారీగా మొహరించారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ముందస్తుగా 15 మంది యువకులను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన నాయకులు మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం, వైస్ ఎంపీపీ అవ్వారు శ్రీనివాస్ , ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కంచుకుంట్ల సుభాష్ , సర్పంచ్ నామని జగన్నాథంలను గృహనిర్బంధం చేశారు. మరికొంత మంది గ్రామస్తులను పోలీసులు అదే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ రోడ్లపై ఎవ్వరిని ఉండనీయడం లేదు. ఎస్పీ ప్రకాష్ రెడ్డి రెండు రోజులుగా గ్రామాన్ని సందర్శిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్ఐల తో పాటుగా 400 మంది పై చిలుకు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాన్ని మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరో రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించడం సబబుకాదు : గంగిడి గట్టుప్పల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న సోనిది ఆత్మహత్య కాదని, హత్యేనని పోలీసులు నిర్ధారించడం ఎంత వరకు సబబని బీజేపీ రాష్ట కోశాధికారి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం గట్టుప్పల గ్రామాన్ని సందర్శించారు. ఈసందర్భంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. అనంతరం స్థానిక చౌరస్తా లో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. -
గట్టుప్పల్‌లో 144 సెక్షన్
నల్లగొండ: నల్లగొండ జిల్లా గట్టుప్పల్‌లో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలంటూ నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు ఉధృత రూపం దాల్చటంతో పోలసులు ఈ చర్యను తీసుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గ్రామానికి వెళ్లే అన్ని దారులను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
ప్రజల ఆకాంక్షకు భిన్నంగా కేసీఆర్ పాలన
గట్టుప్పల్, (చండూరు) : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఐఎఫ్టీయూ(భారత కార్మిక సంఘాల) జాతీయ అధ్యక్షుడు ఎస్కే.ముక్తార్ పాషా అన్నారు. ప్రగతి శీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర రాజకీయ తరగతులు శనివారం గట్టుప్పల గ్రామంలో కామ్రేడ్ వెంకన్న హాల్లో ప్రాంభమయ్యాయి. తరగతులను పాషా ప్రాంభించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. దళితులు, గిరిజనులపై రోజురోజుకు దాడులు జరుగుతున్నాయన్నారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రజాఫ్రంట్ నాయకులు సుధాకర్‌రెడ్డి , ఏఐకేఎంఎస్ రాష్ట అధ్యక్షుడు అచ్యుతరామారావు, జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, అశోక్, మోతీలాల్, రమేష్ తదితరులు ఉన్నారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండలో గట్టుప్పుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006–2007 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.