
నల్లగొండ ఆస్పత్రిలోకి తల్లిని తీసుకెళ్తున్న కుమార్తె
నల్లగొండ జిల్లా గట్టుపల్ మండలానికి చెందిన రాజ్యమ్మ శ్వాసలో ఇబ్బందితో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో గురువారం హైదరాబాద్‌కు తరలించడానికి ఆమె కుమార్తె అంబులెన్స్, ఆక్సిజన్ సిద్ధం చేసింది.
అయితే రాజ్యమ్మలో చలనం లేకపోవడంతో.. వైద్యులతో మాట్లాడి స్ట్రెచర్‌పై ఉన్న తల్లిని తిరిగి అదే ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకెళ్లింది. కొద్దిసేపటికే తల్లి కన్నుమూసింది. కొన ఊపిరితో తల్లి.. ఎలాగైనా ఆమెను దక్కించుకోడానికి కుమార్తె పడిన ఆరాటం.. చివరకు తల్లి కన్నుమూయడంతో ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
- సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment