
గన్నవరం: రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిమిత్తం బుధవారం మరో రెండు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్స్‌లను ఉదయం విమానంలో ఇక్కడికి తరలించారు.
అనంతరం వ్యాక్సిన్ డోసులను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి నిల్వ చేశారు. గత 2 రోజుల్లో ఇక్కడికి మొత్తం 4 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటిని ప్రత్యేక కంటైనర్లలో 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు.