న్యూఢిల్లీ: ఈ నెలాఖరుకు 50 లక్షల కోవిషీల్డ్ డోసులు వృథాగా పోయే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. టీకాల లభ్యతపై వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభం నుంచి రాష్ట్రాలతో సమీక్ష జరుపుతూనే ఉన్నామని, ఎక్కడా టీకా వృథాగా పోయే అవకాశమే లేదని తెలిపింది.
టీకాలు నిరుపయోగంగా ఉన్న చోట నుంచి మరోచోటికి బదిలీ చేసే అవకాశం కూడా కల్పించామని పేర్కొంది. ఆయా సంస్థల వద్ద ఉన్న టీకాలను ఎక్స్‌పైరీ తేదీకి ముందే వినియోగించాలని ఆదేశించామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment