గట్టుప్పల్‌లో 144 సెక్షన్
Published Fri, Oct 14 2016 10:59 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
నల్లగొండ: నల్లగొండ జిల్లా గట్టుప్పల్‌లో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలంటూ నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు ఉధృత రూపం దాల్చటంతో పోలసులు ఈ చర్యను తీసుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గ్రామానికి వెళ్లే అన్ని దారులను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Advertisement
Advertisement