పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్‌ సీల్‌ చేసిన కలెక్టర్‌ | Crowd blocks Road In Puducherry Full Details | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్‌ సీల్‌ చేసిన కలెక్టర్‌

Published Sat, Feb 15 2025 10:40 AM | Last Updated on Sat, Feb 15 2025 11:06 AM

Crowd blocks Road In Puducherry Full Details

కడలూరు: పుదుచ్చేరిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలకు దిగారు. పుదుచ్చేరి-కడలూరు రోడ్డుపైకి నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

వివరాల ప్రకారం.. తలవకుప్పంలో ఓ బాలికను ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధితురాలు స్కూల్‌కు వెళ్లేందుకు భయంతో వణికిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో స్కూల్‌ వద్దకు చేరుకున్నారు. టీచర్‌ను చితకబాదారు. పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.

అంతటితో ఆగకుండా.. పుదుచ్చేరి-కడలూరు రోడ్డును నిరసనకారులు బ్లాక్‌ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో, పోలీసుల తీరుపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసనలను మరింత ఉధృతం చేశారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నిరసనలు తెలిపారు. 

ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం, కలెక్టర్ కులోత్తుంగన్, సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా పాఠశాలను సీల్‌ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో పాఠశాలలో శనివారం జరగాల్సిన పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement