ప్రజాసేవకే అంకితం: రాజగోపాల్‌రెడ్డి | Congress Candidate Komatireddy Rajagopal Reddy Campaign In Munugodu | Sakshi
Sakshi News home page

ప్రజాసేవకే అంకితం: రాజగోపాల్‌రెడ్డి

Published Thu, Dec 6 2018 12:07 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Candidate Komatireddy Rajagopal Reddy Campaign In Munugodu - Sakshi

చండూరులో మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

సాక్షి, చండూరు : తనకు సంపాదన అసలే  వద్దు.. నియోజక వర్గం అంటే ఎంతో అభిమానమని, ప్రజాసేవకు అంకితం కావాలనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో  ఉన్నానని మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం చండూరు, గట్టుప్పలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిన తనకు మునుగోడు ప్రజలకు సేవలు అందించాలనే కోరిక ఉందన్నారు. డబ్బు ఎంత ఉన్నా తృప్తి ఉండదని పేదలకు సేవలు అందించినప్పుడే సంతృప్తిగా ఉండవచ్చన్నారు. మునుగోడు అభివృద్ధిలో ఎంతో వెనుకబడి పోయిందన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో కనీస అభివృద్ధి జరుగలేదన్నారు. మునుగోడును మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమన్నారు. తెలంగాణలోనే మునుగోడుకు ప్రాధాన్యత తేవాలని ఉందన్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆగడాలకు అంతులేకుండా పోయిందన్నారు.

కనీసం గ్రామాలలో మురికి కాలువలు, సీసీ రోడ్లు లేక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గట్టుప్పలను మండలంగా చేయడం తన బాధ్యతన్నారు. అబద్దాలు చెప్పే అలవాటు తనకు లేదన్నారు. గ్రామ ప్రజలు తనకు సహకరించాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవి కుమార్‌ మాట్లాడుతూ మునుగోడుకు సమర్థుడు రాజగోపాల్‌ రెడ్డినేనని ఆయన అన్నారు. చెయ్యి గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌ నేత, బోయపల్లి అనంత రాజు గౌడ్, రాపోలు జయప్రకాష్, కర్నాటి వెంకటేశం, ఎంపీపీ తోకల వెంకన్న, జెడ్పీటీసీ అన్నెపర్తి సంతోషశేఖర్, జాజుల అంజయ్య గౌడ్, పున్న రాజు, భీమనపల్లి శేఖర్, కలిమికొండ జనార్దన్, ధర్మేందర్‌  పాల్గొన్నారు.
మునుగోడును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
మునుగోడు : అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్‌ నుంచి నారాయణపురం మీదుగా మునుగోడు మండలానికి చేరుకున్న బైక్‌ ర్యాలీ చండూరుకి వెళ్లింది. ఈ సందర్భంగా మునుగోడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ తనను మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా కోరుకున్నందుకే బరిలో నిలిచానన్నారు. ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలుపొంది, అభివృద్ధి చేస్తానన్నారు. ప్రధానంగా ఎలాంటి సాగు నీటి వనరులు లేని ఈ ప్రాంతంలో నక్కలగండి ప్రాజెక్టుతో పాటు బివెల్లంల ఉదయసముద్రం, పిలాయిపల్లి కాల్వను పూర్తి చేయించి 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత, పల్లె రవికుమార్, వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జాజుల అంజయ్యగౌడ్, మేకల రామస్వామి, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, జాల వెంకన్న యాదవ్, పోలగోని సత్యం, నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, బూడిద లింగయ్య యాదవ్, బొజ్జ శ్రీనివాస్, మేకల ప్రమోద్‌రెడ్డి, పాల్వాయి జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement